సాక్షి, పెద్దపల్లి : అబద్దాలు చెప్పడం, ఇచ్చిన హామీలను విస్మరించడం సీఎం కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారిందని మాజీ ఎంపీ గడ్డం వివేక్ విమర్శించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంలో ప్రతిపక్షాలను కేసీఆర్ నిందించడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 12 కిలోల బియ్యంలో 10 కిలోలు కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతుల ధాన్యం కొనుగోలు కూడా కేంద్రమే బరిస్తోందని గుర్తుచేశారు. రైతు బంధును నిలిపివేసే కుట్రలో భాగంగానే పంటలపై సీఎం కేసీఆర్ ఆంక్షలను విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతల పట్ల వారి సమస్యల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే రూ. లక్ష వరకు రుణమాఫీని ఒకే దఫాలో అమలు పరచాలని డిమాండ్ చేశారు.
చదవండి:
కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది!
కరోనాకు ప్రైవేట్ వైద్యం
Comments
Please login to add a commentAdd a comment