
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో మాజీ ఎంపీ జి.వివేక్ శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. కాగా టీఆర్‌ఎస్‌ను వీడిన అనంతరం వివేక్... బీజేపీలో చేరతారా? కాంగ్రెస్‌లో చేరతారా? అన్న గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ గందరగోళానికి ఆయన ఎట్టకేలకు తెరదించారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక సాంకేతిక కారణాలతో ఆగిపోయిందని, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా తమ పార్టీలోకి రావాల్సిన వారేనని, దారి తప్పి అటు వెళ్లారని బీజేపీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment