G Vivek
-
ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నాడు
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్‌లు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుని కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నాడన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ చేయడం కాదు.. ప్రజలే కేసీఆర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తారని హెచ్చరించారు. హుజూర్నగర్ ఎన్నికల కోసమే కేకే చర్చల డ్రామా ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని రోజులు దసరా సెలవులు ఇచ్చిన ప్రభుత్వమే లేదన్నారు. టీఆర్ఎస్ మెడలు వంచే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కార్మికుల జీతాలు ఆపిన కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు ఆపాడా అని ప్రశ్నించారు. సమ్మెను బూచిగా చూపి.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని మంత్రులు సమ్మె గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు బీజేపీ వారికి అండగా ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
వివేక్‌కు చుక్కెదురు
హైదరాబాద్: మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది. మాజీ అధ్యక్షుడు వివేక్ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. శుక్రవారం వివేక్ నామినేషన్ వేసే క్రమంలో సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్న్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని భావించడంతోనే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు సమాచారం. వివేక్‌కు సంబంధించిన ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కేసు ఒకటి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దానిపై ఇంకా ఎలాంటి తుది తీర్పు రాకపోవడంతో వివేక్ హెచ్‌సీఏ ఎన్నికకు దూరం కావాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు లైన్‌క్లియర్ అయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్‌సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. -
‘కేసీఆర్‌కు ప్రచార పిచ్చి ఎక్కువైంది’
సాక్షి, యాదాద్రి: పవిత్ర యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మతో పాటు ఇతర రాజకీయ బొమ్మలు చెక్కడంపై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ మండి పడ్డారు. ఈ చర్యలు కేసీఆర్ నియంత పోకడలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు కొత్తగా నిర్మించే అన్ని నిర్మాణాలపై తన పేరు, బొమ్మ ఉండాలనే పిచ్చి బాగా ముదిరిందని విమర్శించారు. అందుకే సెక్రటేరియట్‌ను కూడా కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చివరకు దేవుడి గుడిని కూడా వదల్లేదన్నారు. స్థంభాలపై చెక్కిన వివాదాస్పద బొమ్మలను తొలగిస్తే సరిపోదు.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో బీజేపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వివేక్ హెచ్చరించారు. -
‘కొడుకును సీఎం చేసేందుకే సెక్రటేరియట్ కూల్చివేత’
సాక్షి, మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చి మోసం చేశారని.. సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత గడ్డం వివేకానంద విమర్శించారు. జిల్లాలోని వెన్నెల మండల కేంద్రంలో అక్రమ కేసులకు గురైన 12 మంది బీజేపీ కార్యకర్తలను ఎంపీటీసీ హరీశ్‌గౌడ్ ఇంటిలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ న్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తన కొడుకును ముఖ్యంత్రిని చేయటం కోసం సెక్రటేరియట్‌ను కూల్చి వేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ కేసీఆర్ ఓ తుగ్లక్ ముఖ్యమంత్రిగా వ్యవహిరిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రతిభావంతులైన ఇంజనీర్లతో కాకుండా.. తనకు తొత్తులుగా వ్యవహరించే రిటైర్డ్ ఇంజనీర్లతో పని చేయిస్తూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తుమ్మిడిహెట్టి నుంచి ప్రవహించే ప్రాణహిత నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో పోస్తూ, మూడు మీటర్ల ఎత్తులో నీటిని పంపిణీ చేసూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులందరినీ తన పార్టీ కార్యకర్తల్లా పనిచేయించుకుంటూ బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులను వేస్తున్నారని వివేకా విమర్శించారు. -
అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి వివేక్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో మాజీ ఎంపీ జి.వివేక్ శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. కాగా టీఆర్ఎస్ను వీడిన అనంతరం వివేక్... బీజేపీలో చేరతారా? కాంగ్రెస్‌లో చేరతారా? అన్న గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ గందరగోళానికి ఆయన ఎట్టకేలకు తెరదించారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక సాంకేతిక కారణాలతో ఆగిపోయిందని, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా తమ పార్టీలోకి రావాల్సిన వారేనని, దారి తప్పి అటు వెళ్లారని బీజేపీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
మాజీ ఎంపీ వివేక్ పార్టీ మార్పుపై కొత్త ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ వివేక్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి వివేక్ నివాసానికి వెళ్లిన ఆయన గంటపాటు ఆయనతో మంతనాలు జరిపారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వివేక్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ భవనాల కూల్చివేతలకు వ్యతిరేకంగా ఇటీవల అఖిలపక్షాలతో కలసి సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వివేక్ ఇటీవలే న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగానే ఆయన బీజేపీలో చేరడం ఖాయమని, అమిత్‌షా రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన చేరిక ఉంటుందని అంతా భావించారు. ఈ తరుణంలో ఆయనతో ఉత్తమ్ చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన్ను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. అయితే వివేక్ తిరిగి సొంత గూటికి చేరతారా? లేక బీజేపీలో చేరతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
అమిత్ షాతో మాజీ ఎంపీ వివేక్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కలిసి ఆయన అమిత్ షా వద్దకు వెళ్లారు. వివేక్ వెంట వెళ్లిన ఆయన కుమారుడు కూడా అమిత్ షాను కలిశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని కోరారు. కాగా, గత కొంత కాలంగా వివేక్ బీజేపీలో చేరనున్నారనే వార్తలు ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా బీజేపీలో చేరికపైనే వివేక్ అమిత్ షాతో చర్చించినట్టుగా తెలుస్తోంది. వివేక్ బీజేపీలో చేరాడం ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆషాఢ మాసం ముగిసిన తర్వాత వివేక్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని.. అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో వారు తమ చేరికను వాయిదా వేసుకుంటున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. -
బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్?
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖరారైంది. మంగళవారమే ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ కానున్నారు. అమిత్‌షా అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. అమిత్‌షాను వివేక్ కలువను న్నది వాస్తవమేనని, ఆయన మంగళవారమే పార్టీలో చేరుతారా? అమిత్‌షాతో చర్చించిన తర్వాత చేరతారా? అన్నది తేలియాలని పార్టీ ఉన్నతస్థాయి వర్గా లు పేర్కొన్నాయి. మెుత్తానికి వివేక్ బీజేపీలో చేరడం ఖరారయినట్లేనని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. టీడీపీ టార్గెట్‌గా ముందుకు తెలంగాణలోని టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకునే ‘టార్గెట్ టీడీపీ’ని బీజేపీ వేగవంతం చేసింది. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి తదితర నేతలు బీజేపీ లో చేరారు. ఇక టీడీపీలోని నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. గరికపాటి రామ్మోహన్రావు నేతృత్వం లో ఈ ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. తొలుత ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన కీలక టీడీపీ నేతలు బీజేపీలో చేరేలా ఏర్పాట్లు చేసింది. దీనిపై గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.. టీడీపీకి చెందిన నియోజకవర్గస్థాయి ముఖ్యనేతలతో గరికపాటి నివాసంలో చర్చ లు జరిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఐదుగురు నియోజకవర్గస్థాయి నేతలు మంగళవారం ఢిల్లీలో అమిత్‌షాను కలిసేందుకు వెళ్తున్నారు. అయితే ఆగస్టు 15లోగా అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన వచ్చినపుడు పార్టీలో చేరికలు ఉండేలా రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. మంగళవారం వారంతా బీజేపీలో చేరకపోతే అమిత్‌షా హైదరాబాద్ వచ్చాక నిర్వహించే సభలో టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు పార్టీలో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. -
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్!
సాక్షి, హైదరాబాద్ : కారు స్పీడ్‌తో ఇప్పటికే చతికిలపడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. బీజేపీలో చేరేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎంపీ వివేక్, కల్వకుంట్ల రమ్యరావు భేటీ అయ్యారు. బీజేపీలో చేరికపై చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశం లేకపోవడంతో పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. చదవండి:(బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ షురూ) కావాలనే నాపై దుష్ప్రచారం: కోమటిరెడ్డి అయితే ఈ వార్తలను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. బీజేపీ నేత రాంమాధవ్‌తో తాను చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమన్నారు. నిన్న మొత్తం నియోజకవర్గంలోనే పర్యటించినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివేక్‌ను కలిసిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నిన్న మాజీ ఎంపీ వివేక్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని వివేక్ నివాసంలో ఆయనను కలిసిన రేవంత్....రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరాలని వివేక్‌ను రేవంత్ ఆహ్వానించినట్లు సమాచారం. కాగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమలనాథుల ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆర్ఎస్ఎస్ మాజీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు అధిష్టానం అప్పగించింది. అందులో భాగంగా రాంమాధవ్ హైదరాబాద్ వచ్చి పార్క్ హయత్‌లో మకాం వేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. అయితే ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఒక్కరిద్దరు కాంగ్రెస్ ఎంపీలు కూడా రాంమాధవ్‌తో టచ్‌లోకి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ ఎంపీలు, టీపీసీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. రాంమాధవ్ నేతృత్వంలో ఎవరెవరు బీజేపీలో చేరతారనేది ఒకటెండ్రు రోజుల్లో తేలనుంది. రాంమాధవ్ వ్యూహం ఫలిస్తే.. 2020 చివరినాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
వివేక్‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టి షాక్‌నిచ్చారు. పెద్దపల్లి లోకసభ స్థానం(ఎస్సీ) నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు వివేక్ సన్నద్ధమవగా, ఆయనను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకొని మరీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి చాన్స్ ఇచ్చారు. ఇక ఆదిలాబాద్ స్థానం(ఎస్టీ) మాత్రం సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్నే వరించింది. సుధీర్ఘ కసరత్తు అనంతరం గురువారం రాత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్‌కే ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌కే మరోసారి టీఆర్ఎస్ అవకాశం కల్పించింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన గోడం నగేష్‌కే ఈసారి కూడా టికెట్ వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే నగేష్‌కు పార్టీ టికెట్టు ప్రకటించారు. లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఒకరిద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు విముఖత వ్యక్తం చేసినా, అధిష్టానం మాత్రం నగేష్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన నగేష్, 1994 నుంచి టీడీపీలో కొనసాగారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరి టికెట్టు తెచ్చుకొన్నారు. ఈ ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. జంప్ ఫలితం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బోర్లకుంట వెంకటేశ్‌కు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిత్వం దక్కడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో వెంకటేశ్ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్లో చేరిన కొన్ని గంటల్లోనే ఆయన టీఆర్ఎస్ బీ–ఫారం అందుకున్నారు. కాగా టికెట్ ఇస్తామనే గ్యారంటీతోనే ఆయన హడావుడిగా టీఆర్ఎస్లో చేరినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన బోర్లకుంట వెంకటేశ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం చివరి నిమిషంలో పార్టీ మారి టీఆర్ఎస్ ఎంపీ టికెట్టు అందుకున్నారు. చక్రం తిప్పిన బాల్క సుమన్ పెద్దపల్లి ఎంపీ టికెట్ వెంకటేశ్‌కు రావడంలో చెన్నూరు ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ ప్రధానంగా చక్రం తిప్పినట్లు సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో అనూహ్యంగా బాల్క సుమన్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్టు దక్కింది. వివేక్‌పై సుమన్ గెలిచిన తరువాత, వివేక్ తిరిగి టీఆర్ఎస్లో చేరినప్పటికీ ఇరువురి నడుమ విభేదాలు మాత్రం కొనసాగాయి. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు పలుమార్లు బయటపడింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి, చెన్నూరు అసెంబ్లీ బరిలో దిగారు. దీంతో వివేక్‌కు ఎంపీ టికెట్ ఖాయమని అంతా భావించారు. కాని అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారంటూ కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు ఇతర ఎమ్మెల్యేలను కూడగట్టడంలో సుమన్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా వివేక్‌కు ప్రత్యామ్నయంగా తన చేతిలో ఓడిపోయిన వెంకటేశ్‌ను కూడా సిద్ధం చేసి ఉంచారు. అయినప్పటికీ వివేక్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందని పార్టీ వర్గాలు భావించాయి. కాని బుధ, గురువారాల్లో మారిన నాటకీయ పరిణామాలతో వివేక్‌కు బదులు వెంకటేశ్ అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు. మొత్తానికి తన ఆధిపత్యానికి అడ్డుగా మారనున్న వివేక్‌ను అడ్డుకోవడంలో సుమన్ సఫలం చెందినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే టికెట్టు దక్కని వివేక్ భవిష్యత్ నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేక్ భవితవ్యం ఎటు? పెద్దపల్లి సీటు చేజారిన మాజీ ఎంపీ వివేకానంద రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడింది. 2013లో తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్‌తో కలిసి టీఆర్ఎస్లో చేరిన ఆయన ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో వివేక్‌కు ఎంపీ సీటు ఖరారైనప్పటికీ, తన సోదరుడు వినోద్‌కు చెన్నూరు టికెట్టు ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్టు హామీతో మరోసారి టీఆర్ఎస్లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తన సోదరుడికి టికెట్టు విషయంలో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేయగా, టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు కృషి చేశారని ప్రభుత్వ నిఘా వర్గాలు కేసీఆర్‌కు సమాచారం ఇచ్చాయి. అదే సమయంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని చేసిన ఫిర్యాదులతో ఆయన సీటుపై వేటు పరిపూర్ణమైంది. కాగా ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లే సాహసం చేస్తారా లేదా అనేది అర్థం కావడం లేదు. బీజేపీ నేతలు ఇప్పటికే వివేక్‌తో టచ్‌లో ఉండి, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు. వివేక్ బీజేపీలో చేరితే టికెట్టు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది. అయితే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మరోసారి సాహసం చేస్తారా లేదా అనేది చూడాల్సిందే. -
అది అందరి బాధ్యత
శ్రనిత్ రాజ్, కల్యాణి పటేల్, అనిరుధ్, నేహా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గేమర్’. బి.జి.వెంచర్స్ పతాకంపై రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘గేమర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీశారు. ఇలాంటి చిన్న సినిమాల దర్శక, నిర్మాతలను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపైనా, సమాజంపైనా ఉంది. వీళ్లందరికీ థియేటర్లు దొరకడం కష్టంగా ఉంది. కొత్త టాలెంట్ రావాలంటే చిన్న దర్శక–నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. అప్పుడే గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతాయి’’ అన్నారు. తడకల రాజేష్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఆరు చిత్రాలు చేసిన నాకు ‘గేమర్’ ఏడో సినిమా. బి.జి.యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవకాశం ఇస్తున్నాను. ఈ చిత్రంలోని ప్రతి సీన్ డిఫరెంట్‌గా ఉంటూ ఆసక్తి రేపుతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 1న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. హీరో శ్రనిత్, హీరోయిన్ కల్యాణి, అనిరు«ద్, నరేందర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీకి బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఊహాగానాలకు తెరదించుతూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారు చేసిన గులాబీ అధినేత.. పార్టీలోకి కొత్తగా చేరిన వారి కోసం కొన్ని మార్పులు చేశారు. ముందుగా ఊహించినట్లుగానే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను అసెంబ్లీకి పంపేందుకే నిర్ణయించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సుమన్‌ను ప్రకటించారు. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ నిరాకరించి.. ఆ స్థానాన్ని సుమన్‌కు కట్టబెట్టారు. మాజీ ఎంపీ గడ్డం వివేక్ తిరిగి టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో.. వివేక్ లోక్‌సభకు పంపించేందుకే బాల్క సుమన్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లోకి వచ్చిన వివేక్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆయన స్థానంలో గత ఎన్నికల్లో విద్యార్థి నాయకుడైన సుమన్‌కు కేసీఆర్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వివేక్‌పై సుమన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివేక్ మళ్లీ టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను ఖరారు చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ సర్దుబాటులో భాగంగానే సుమన్ అసెంబ్లీకి పంపినట్టు వినిపిస్తోంది. ఇక, పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మోహన్‌రెడ్డికి మరోసారి టికెట్ కన్ఫామ్ చేశారు. -
హెస్‌సీఏ-విశాఖ మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదు
-
హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు ఎదురుదెబ్బ
-
అట్టహాసంగా వెంకటస్వామి స్మారక టీ20 లీగ్
సాక్షి, హైదరాబాద్ : వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్) లీగ్ శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు సినీతారలు వెంకటేశ్, శ్రీకాంత్, నిర్మాత డి. సురేశ్‌బాబు, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి. వివేకానంద్, 10 జిల్లా జట్ల యజమానులు పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, మెదక్ మావేరిక్స్ తలపడ్డాయి. ఈ నెల 25న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. -
కాంగ్రెస్‌కు మరో షాక్!
కేసీఆర్‌తో గుత్తా, సురేశ్‌రెడ్డి, వివేక్, వినోద్ భేటీ టీఆర్ఎస్లో వారి చేరికకు సీఎం గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్ అధికార టీఆర్ఎస్ పెద్ద ప్లాన్‌లోనే ఉంది! ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు మరో షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో.. ఆ పార్టీకే చెందిన మరో ముగ్గురు సీనియర్ నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్ గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌తో మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. టీఆర్ఎస్లో వీరి చేరికకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీ గుత్తా ఈ నెల 11న టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీరంతా కలిసి ఒకేసారి గులాబీ తీర్థం పుచ్చుకుంటారా అన్న దానిపై స్పష్టత లేదు. అయినా ఈ వారంలోపే వీరంతా టీఆర్ఎస్లో చేరుతారని భావిస్తున్నారు. మాజీ ఎంపీ వివే క్ టీఆర్ఎస్లో చేరుతారని ఏడాది నుంచే ప్రచారంలో ఉంది. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఆయన టీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుండడంతో ఈ నాయకులంతా బయటకు రావాలని నిర్ణయించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
'నేతలు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు'
హైదరాబాద్ : తమ పార్టీలోని నేతలు మరో పార్టీలోకి వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. కొత్త నాయకత్వంతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతను టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలోల పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ... పీసీసీ రెండు కమిటీల్లో తనకు అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే తాను సమన్వయ కమిటీ సభ్యుడిగానే కొనసాగుతానని వివేక్ స్పష్టం చేశారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ వివేక్ ఈ సందర్భంగా ప్రకటించారు. -
'రాజకీయాల్లో ఇంకా రాటుదేలలేదు'
హైదరాబాద్: హైకమాండ్ ఆదేశించినా వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేయబోనని కాంగ్రెస్ మాజీ ఎంపీ జి. వివేక్ స్పష్టం చేశారు. సోనియా చెప్పడం వల్లే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తమ కుటుంబం అంతా కాంగ్రెస్ కోసమే పనిచేసిందన్నారు. తన విధేయతను హైకమాండ్ గుర్తించిందన్నారు. రాజకీయాల్లో తానింకా రాటుదేలలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై సీమాంధ్ర నాయకుల ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణివేయాలని కిరణ్ కుమార్ రెడ్డి చాలా ప్రయత్నించారని ఆరోపించారు. తనపై ఆయన వ్యక్తిగతంగా కక్ష గట్టారని అన్నారు. దళితుడు సీఎం అయితే సంపూర్ణ తెలంగాణ సాకారమవుతుందని వివేక్ అన్నారు. వరంగల్ సీటు ఇస్తామన్నా పార్టీ మారబోనని తెలిపారు. -
పార్టీలోనే ఉంటాను కానీ పోటీ చేయను!
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఉప ఎన్నికను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. అందులోభాగంగా పార్టీ సీనియర్లు పలువురు నేతలను సంప్రదిస్తున్నారు. అ క్రమంలో ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ జి. వివేక్‌ను సంప్రదించారు. అయితే పార్టీలోనే ఉంటాను కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ కేంద్ర మంత్రి ఎస్ రాజయ్యను ఈ ఉప ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్ నేతలు యోచనలో ఉన్నట్లు తెలిసింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... కడియం శ్రీహరిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించారు. దాంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలనే కాదు వరంగల్ లోక్‌సభను కూడా కైవసం చేసుకుంటామనే ధీమాతో కేసీఆర్ సర్కార్ ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన జి.వివేక్... టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
తెలంగాణను మోసం చేసింది 'ఆ ఇద్దరే'
తెలంగాణను మోసం చేసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్లే అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి జి.వివేక్‌లు ఆరోపించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యమద్రోహులకు కేసీఆర్ టిక్కెట్లిచ్చారని వారు విమర్శించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను పార్టీలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌లు కాంగ్రెస్ అధిష్టానానికి మాట ఇచ్చారని గుత్తా, వివేక్‌లు గుర్తు చేశారు. ఇచ్చిన మాటను టీఆర్ఎస్ విస్మరించిందని అన్నారు. కానీ తెలంగాణ ఇస్తామన్న మాటకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంస్థను సరిగ్గా నడపలేని కేసీఆర్.... తెలంగాణను ఎలా పునర్నిర్మిస్తాంటూ వివేక్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. గుజరాత్ లోని గోద్రా అల్లర్లకు ముఖ్య కారకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ అని గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారని వారు గుర్తు చేశారు. అలాంటి బాబు ప్రస్తుతం మతోన్మాద శక్తులకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
హోంశాఖ అధికారులతో వివేక్, వినోద్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్లో చేరిన పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ జి.వివేక్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బుధవారం ఉదయం హోంమంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్లారు. వారిద్దరూ హోంశాఖ ఉన్నతాధికారులు కొంతమందిని కలిసి చర్చలు జరిపారని తెలిసింది. విభజనపై జీవోఎంతో మంగళవారం జరిగిన భేటీలో టీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేకేతోపాటు వివేక్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ భేటీ చివర్లో టీఆర్ఎస్ నేతలతో హోంమంత్రి షిండే ప్రత్యేకంగా పది నిమిషాలు చర్చించారు. ఆ సమయంలోనే టీఆర్ఎస్ నేతలు కొన్ని అదనపు పత్రాలను, సమాచారాన్ని అందజేస్తామన్నారని, దానికి షిండే కూడా సమ్మతించి వెంటనే ఇవ్వాలని కోరారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే వివేక్, వినోద్ బుధవారం హోంశాఖ ఉన్నతాధికారుల్లో కొందరిని కలిసి మరికొన్ని పత్రాలను, అదనపు సమాచారాన్ని అధికారులకు అందజేశారని సమాచారం.