
కల్యాణి, రాజేష్ తడకల, వివేక్ వెంకటస్వామి, శ్రనిత్ రాజ్
శ్రనిత్ రాజ్, కల్యాణి పటేల్, అనిరుధ్, నేహా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గేమర్’. బి.జి.వెంచర్స్ పతాకంపై రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘గేమర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీశారు. ఇలాంటి చిన్న సినిమాల దర్శక, నిర్మాతలను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపైనా, సమాజంపైనా ఉంది.
వీళ్లందరికీ థియేటర్లు దొరకడం కష్టంగా ఉంది. కొత్త టాలెంట్ రావాలంటే చిన్న దర్శక–నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. అప్పుడే గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతాయి’’ అన్నారు. తడకల రాజేష్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఆరు చిత్రాలు చేసిన నాకు ‘గేమర్’ ఏడో సినిమా. బి.జి.యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవకాశం ఇస్తున్నాను. ఈ చిత్రంలోని ప్రతి సీన్ డిఫరెంట్‌గా ఉంటూ ఆసక్తి రేపుతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 1న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. హీరో శ్రనిత్, హీరోయిన్ కల్యాణి, అనిరు«ద్, నరేందర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment