Gamer
-
ధనిక యూట్యూబర్ 'మిస్టర్ బీస్ట్' ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
సూపర్ మహిళా గేమరే కాదు.. అంతకుమించిన అందగత్తె కూడా! (ఫొటోలు)
-
Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్
ఇటీవల ప్రధాని మోదీ దేశంలో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఏడుగురు గేమర్స్‌ను కలిశారు. వారిలో ఒక్కతే అమ్మాయి పాయల్ ధారే. గేమ్స్‌ను ఆడుతూ తన వ్యాఖ్యానం వినిపిస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ ద్వారా 35 లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకున్న పాయల్ పురుషుల ఆధిపత్య రంగమైన గేమింగ్‌లో తనదైన స్థానం పొందారు. పాయల్ పరిచయం. వీడియో గేమ్స్ అనగానే మూడు విధాలైన భాగస్వాములు ప్రస్తావనకు వస్తారు. 1. గేమ్స్ ఆడేవాళ్లు 2. చలామణిలో ఉన్న గేమ్స్‌ను ఆడుతూ తమ వ్యాఖ్యానం వినిపిస్తూ (లైవ్ స్ట్రీమింగ్) వీడియోలు చేసేవారు, 3. గేమ్స్ తయారు చేసేవారు. మన దేశంలో 2014 తర్వాత సెల్ఫోన్ల అందుబాటు పెరిగాక గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే వారితోపాటు గేమ్స్ చుట్టూ షోస్ చేసేవారి (గేమర్స్) పలుకుబడి కూడా పెరిగింది. వీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారారు. ఇక ఒరిజినల్‌గా మన దేశంలో గేమ్స్ తయారు చేసేవారు పై రెండు వర్గాలతో పోల్చితే తక్కువ. ఇటీవల ప్రధాని మోడి గేమ్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన 7 మంది గేమర్స్‌ను న్యూఢిల్లీలో కలిసి వారితో మాటామంతి జరిపారు. తీర్థ్ మిత్ర, అనిమేష్ అగర్వాల్, అన్షు బిస్త్, నమన్ మాధుర్, మిథిలేష్, గణేష్ గంగాధర్ అనే యువ గేమర్‌లతోపాటు వీరితో పాల్గొన్న ఒకే ఒక మహిళా గేమర్ పాయల్ ధారే. 15000 మంది గేమర్స్ మన దేశంలో 15 వేల మంది గేమర్స్ ఉన్నారు. అంటే వీడియో గేమ్స్‌ను ఆడుతూ వాటిని వివరిస్తూ వాటిపై వ్యాఖ్యానం చేస్తూ ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన వారు. ఇలాంటి వారిలో అత్యంత ఆదరణ పొందిన వారికి లక్షల మంది ఫాలోయెర్స్ ఉంటారు. ఇదంతా గేమింగ్ కమ్యూనిటీ. గేమ్స్ చుట్టూ వీడియోలు చేసేందుకే మన దేశంలో దాదాపు 1500 స్టుడియో లు కూడా ఉన్నాయి. గేమ్స్‌ను స్వయంగా తయారు చేసే సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా ఉన్న గేమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. పాయల్ ధారే కూడా అలా పేరు పొందింది. సంవత్సరానికి 5 కోట్లు 23 ఏళ్ల పాయల్ ధారేకు ‘పాయల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్లో ఆమె వీడియో గేమ్స్ ఆడుతూ తన సరదా వ్యాఖ్యానంతో వీడియోలు చేసి పెడుతుంటుంది. మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న గేమ్స్‌ను పరిచయం చేయడం లేదా ఆడటం వల్ల, సరదా వ్యాఖ్యానం చేయడం వల్ల గేమ్స్ అంటే ఇష్టం ఉన్న యువత అంతా ఈమె వీడియోలు ఫాలో అవుతుంటారు. దానివల్ల ఆమెకు సంవత్సరానికి రూ. 5 కోట్ల ఆదాయం అందుతోందని ఒక అంచనా. ఆశ్చర్యం ఏమంటే ఇంటర్ చదివే వరకూ కూడా పాయల్‌కు సెల్‌ఫోన్ లేదు. గేమ్స్ తెలియదు. పల్లెటూరి అమ్మాయి పాయల్ ధారేది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా అనే చిన్న పల్లె. ఫోన్ కూడా చూడని ఆ అమ్మాయి 2021లో లాక్డౌన్ సమయంలో గేమ్స్ గురించి తెలుసుకుంది. ఆ సంవత్సరమే తన వీడియోలు రిలీజ్ చేయసాగింది. 2023 నాటికి అంటే కేవలం రెండేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ పొందింది. ‘మా అమ్మ నేను గేమింగ్‌లోకి వెళతానంటే భయపడింది. మా నాన్న ప్రోత్సహించారు. వీడియో గేమింగ్‌లో ఆడపిల్లలకు అంత సులువుగా ప్రవేశం లభించదు’ అంటుంది పాయల్. ఇప్పుడు తనను చూసి కనీసం 200 మంది అమ్మాయిలు గేమింగ్‌లోకి వచ్చారని తెలిపింది. మంచి మార్గం కోసం ‘గేమ్స్‌ను తప్పించలేము. యువతకు మంచి లక్ష్యాలను ఏర్పరడానికి వీటిని మీరు ఉపయోగిస్తూ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి’ అని ప్రధాని గేమర్స్‌ను కోరారు. ‘మన పంచతంత్రం వంటి కథలను గేమ్స్‌కు వాడండి. పర్యావరణ సమస్యలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో గేమ్స్ తయారు చేస్తే ఇండియన్ సంస్కృతి ఉన్న గేమ్స్ తయారు చేస్తే ఆటకు ఆట, బోధనకు బోధన సమకూరుతాయి’ అని ప్రధాని అన్నారు. చదువుకు తగిన సమయం ఇస్తూ, ఒకవేళ ఏదైనా ఉపాధి ఉంటే ఆ ఉపాధి, ఉద్యోగాల్లో ఉంటూ జీవనానికి తగు గ్యారంటీ ఉన్నప్పుడు గేమింగ్‌లోకి వచ్చి ఆ రంగంలో నిలదొక్కుకోవాలని గేమర్స్‌కు సూచించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గేమింగ్ విభాగంలో భారత్‌కు అరుదైన ఘనత
గేమింగ్ విభాగంలో భారత్ అరుదైన ఘనంగా సాధించింది. నికో పార్ట్నర్స్ ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 39.6 కోట్ల కోట్ల (దాదాపు 40 కోట్లు) గేమర్స్ ఉన్నారని కంపెనీ వెల్లడించింది. ది ఆసియా 10 గేమ్స్ మార్కెట్ పేరుతో తయారు చేసిన రిపోర్ట్‌లో.. ఆసియాలోని పది దేశాలతో పోల్చి చూస్తే ఒక్క భారత్‌లో 50.2 శాతం గేమర్స్ ఉన్నారని, వారానికి సగటున 14 గంటలు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడతారని తెలిపింది. ఆన్లైన్ గేమింగ్‌తో డబ్బులు సంపాదించేందుకు గేమర్స్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. వెరసీ గత ఐదేళ్లలో భారత్‌లో వీడియోగేమ్స్‌తో పాటు కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కంప్యూటర్, మొబైల్ గేమ్ మార్కెట్‌కు 35.9 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, 2026 నాటికి ఆదాయం 41.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని నికో పార్ట్నర్స్ వెల్లడించింది. కాగా, చైనా తర్వాత భారత్, థాయ్‌లాండ్, ఫిలీప్పీన్స్ వంటి దేశాల్లో గేమర్స్ సంఖ్య పెరుగుతోందని ఈ నివేదిక చెప్పింది. ఆసియాలోని పది దేశాల్లో జపాన్, కొరియాలు 77 శాతం మార్కెట్ ఉందని నికో పార్ట్నర్స్ తెలిపింది. -
గేమింగ్‌లో గెలుపు జెండా.. ‘పాయల్ ధారే’ విజయపథం
‘ఉమన్ గేమర్! వినడానికి కొత్తగా ఉంది’ అని ఒకరు ఎగతాళిగా నవ్వారు. ‘ఆడడం బాగానే ఉంటుందిగానీ, కెరీర్‌కు బాగుండదు’ అని గంభీరస్వరంతో నిరాశ పరిచారు మరొకరు. అంతా అయోమయంగా ఉంది. అలా అని ఆగిపోలేదు. ఓనమాలు నేర్చుకుంటూనే, కొత్త విషయాలపై పట్టు సంపాదిస్తూనే మేల్–డామినేటెడ్ స్పేస్ అనుకునే గేమింగ్‌లో బిగ్గెస్ట్ యూట్యూబ్ ఉమన్ గేమర్(ఇండియా)గా గెలుపు జెండా ఎగరేసింది పాయల్ ధారే... కరోనా మహమ్మారి పదునుగా కోరలు చాస్తున్న సమయంలో, లాక్డౌన్ రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన పాయల్ ధారే గేమింగ్–ఫోకస్డ్ ఛానల్‌కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే యూట్యూబ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పై లైవ్‌స్ట్రీమింగ్ కంటెంట్ గురించి ఆమెకు అంతగా అవగాహన లేదు. కాలేజీలో స్నేహితులతో కలిసి ‘పబ్జీ’ గేమ్ ఇష్టంగా ఆడేది. ‘పబ్జీ’ని నిషేధిస్తారనిగానీ, గేమింగ్‌ను తాను కెరీర్‌గా ఎంచుకుంటాననిగానీ అనుకోలేదు పాయల్. గేమింగ్‌పై ఇష్టం పెరుగుతున్న క్రమంలో తన మనసులో మాటను ఇంట్లో చెప్పింది. ‘గేమింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటాను’ తల్దిదండ్రులు ససేమిరా అన్నారు. ‘చదువుపై దృష్టి పెట్టు’ అని మందలించారు. వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా తొలి విజయం సాధించింది పాయల్. తాము ఉండే చింద్వారా పట్టణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రమే. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో గేమింగ్ సెషన్స్ క్లిప్స్‌ను పోస్ట్ చేసేది. 100కె ఫాలోవర్స్‌తో తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఈ సమయంలోనే యూట్యూబ్‌లో ప్రయత్నించమని స్నేహితులు, ఫాలోవర్స్ నుంచి ఒక సూచన వచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం సులభం కాబట్టి మొదట దాన్నే ఎంచుకున్నాను. మీ గేమింగ్ స్కిల్స్‌కు యూట్యూట్ అనేది సరిౖయెన వేదిక అనే సలహాతో పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను’ అంటుంది పాయల్. ఛానల్ మొదలైన తరువాత రకరకాల విషయాలు స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రేక్షకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేది. లైవ్‌స్ట్రీమింగ్ గురించి ఎన్నో రోజులు రిసెర్చ్ చేసింది. ఎలాంటి కంటెంట్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారు? లైవ్‌స్ట్రీమింగ్ పనితీరు ఎలా ఉంటుంది? ఇప్పుడున్న గేమింగ్ ఛానల్స్‌కు భిన్నంగా ఎలా ప్రయత్నించవచ్చు....ఇలా రకకరాల విషయాలపై లోతైన పరిశోధన చేసింది. పాయల్ కాస్త సిగ్గరి. నలుగురి ముందు మాట్లాడాలంటే భయం. కెమెరా ఫేస్ చేయాలంటే కష్టం. ‘ఒకటి సాధించాలని బలంగా అనుకొని బరిలోకి దిగితే, వారిలోని రెండు లోపాలు మాయమవుతాయి’ అంటారు. పాయల్ విషయంలోనూ అదే జరిగింది. బరిలోకి దిగిన తరువాత కెమెరాను హాయిగా ఫేస్ చేయడం నేర్చుకుంది. బెటర్ ఇంటర్నెట్ కోసం సొంత పట్టణం వదిలి, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి మారాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వద్దని గట్టిగా చెప్పారు. వారిని ఒప్పించడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఇక్కడికి మారిన తరువాత సబ్స్కైబర్ల సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో తనకు పేరున్న గేమర్స్లాగా పర్సనల్ కంప్యూటర్ సెటప్ లేదు. లైవ్‌స్ట్రీమ్, అప్‌లోడ్‌కు తన దగ్గర ఉన్న ఫోన్ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మాత్రం తన దగ్గర డ్యూయల్ మానిటర్స్‌తో కూడిన మంచి పీసీ సెటప్ ఉంది. ‘పాయల్ గేమింగ్’ ఛానల్ 2.5 మిలియన్ సబ్స్రైబర్లతో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని పాయల్ ఊహించలేదు. అయితే ఇది అంత సులువుగా దక్కిన విజయం కాదు. ‘సబ్స్క్రైబర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. అయితే అదే ఛానల్ విజయవంతంగా దూసుకుపోతున్నప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రోత్సహించే వారి కంటే రాళ్లు రువ్వే వాళ్లే ఎక్కువగా ఉంటారు. నా లైవ్స్ట్రీమ్స్పై కొందరు హేట్ కామెంట్స్ చేశారు. కొందరు బాడీ షేమింగ్ చేశారు. మొదట్లో బాధపడేదాన్ని. వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే విషయం అర్థమైన తరువాత వాటిని తేలికగా తీసుకున్నాను’ అంటుంది పాయల్. విజయం కోసం పోరాటం ఎంత ముఖ్యమో, ఆ విజయాన్ని నిలుపు కోవడం కోసం గట్టిగా నిలబడడం కూడా అంతే ముఖ్యం. పాయల్ ధారే ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉంది. ఇదీ చదవండి: విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే! -
నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్!
ఒక్కప్పుడు డబ్బు సంపాదించాలంటే తక్కువ మార్గాలు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు అందిపుచ్చుకోవాలే గానే బోలెడన్ని అవకాశాలు మన ముందు ఉంటాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే లక్ష్మీ దేవి మన ఇంట్లోకి వస్తుంది. యూట్యూబ్ అంటే ఒకప్పుడు ఇది ఎవరికి తెలియని పేరు కానీ, స్మార్ట్ ఫోన్ పుణ్యమా దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యూట్యూబ్ ఇప్పుడు కేవలం వినోదాన్ని అందించే ఒక యాప్ మాత్రమే కాదు.. ఆదాయాన్ని అందించే ఒక బంగారు గని. మీకు క్రియేటివిటీ తెలిసి ఉండాలే గాని.. ఇందులో బోలెడంత సంపాదించుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. కేవలం మన దగ్గర మంచి పనితీరు గల గేమింగ్ కంప్యూటరు, ఇంటర్నెట్ ఉంటే చాలు ఇంట్లో నుంచే లక్షలు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నాడు మన దేశానికి చెందిన గేమర్. అతని పేరు ఆదిత్య సావంత్. కానాలెడ్జ్.కామ్ ప్రకారం.. సావంత్ తన యూట్యూబ్ గేమింగ్ చానెల్ డైనమో గేమింగ్ ద్వారా నెలకు రూ.25 లక్షలు పైగా సంపడిస్తున్నాడు. డైనమో గేమింగ్ నెట్ వర్త్ వచ్చేసి 3 మిలియన్ డాలర్లు (రూ.22 కోట్లు). (చదవండి: మరో రికార్డును బిట్‌కాయిన్ నెలకొల్పనుందా...!) ఆదిత్య సావంత్ 1996 ఏప్రిల్ 18న ముంబైలో దీపక్ సావంత్, వైశాలి సావంత్ లకు జన్మించాడు. డైనమో గేమింగ్ అనేది అతని పేరు, దీనిని అతను తరచుగా ఆటలలో లేదా యూట్యూబ్ స్ట్రీమింగ్ లో ఉపయోగిస్తాడు. అతను భారతదేశం, ప్రపంచంలోని అతిపెద్ద గేమర్లలో ఒకడు. అతను పబ్జీ మొబైల్(PUBG)లో స్నైపర్ గా ప్రసిద్ధి చెందాడు. డైనమో అనేకసార్లు అంతర్జాతీయ వేదికపై మనదేశం తరుపున ప్రాతినిధ్యం వహించాడు. ఆన్లైన్ గేమింగ్ ఆడే చాలా మందికి అతని పేరు తెలియకుండా ఉండదు. -
ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!
Thousands Of Gamers Targeted In A New Cyberattack: మన నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్స్, ఇంటర్నెట్ ఓక భాగమైపోయింది. చౌక ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ రాకతో తరుచూ ఆన్లైన్లో ఉంటూ..ఎప్పుడు ఎదో ఒక అంశంపై బ్రౌజ్ చేస్తు కాలక్షేపం చేస్తున్నాం. దీంతో ఇంటర్నెట్ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది. అదేస్థాయిలో సైబర్ నేరస్తులు యూజర్లపై దాడిచేస్తున్నారు. హ్యకర్లు కూడా కొత్త పుంతలను తొక్కుతూ...రకరకాలుగా దాడులకు పాల్పడుతున్నారు. సైబర్ నేరస్తులు రూట్ మార్చి గేమ్స్ ఆడే వారిపై విరుచుకుపడుతున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై పరిశోధకులు తన నివేదికలో వెల్లడించారు. చదవండి: Xiaomi: బెల్ట్‌తో పేమెంట్స్...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..! ఆన్లైన్ గేమ్స్ ఆడే వారేలక్ష్యంగా దాడులు..! సైబర్ నేరగాళ్లు బ్లడీస్టీలర్ అని పిలువబడే కొత్త మాల్వేర్తో ఎక్కువగా గేమర్స్‌ను, వారి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని కాస్పర్ స్కై పేర్కొంది. బ్లడీస్టీలర్ మాల్వేర్తో సెషన్ డేటా , పాస్వర్డ్స్, కుకీ ఎక్స్‌ఫిల్ట్రేషన్‌ను హ్యకర్లు పొందుతున్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. ఆన్లైన్ గేమ్స్ ఆడే యూజర్ల బ్యాంక్ కార్డ్ వివరాలను, బ్రౌజర్ ఆటోఫిల్‌డేటా, స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్ల నుంచి స్క్రీన్ షాట్లను హ్యాకర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. కాస్పర్ స్కై నివేదిక ప్రకారం... ఎపిక్ గేమ్స్, స్టీమ్, ఆరిజిన్, గాగ్. కామ్(GOG.com), బెథెస్డా, టెలిగ్రామ్, వైమ్ వరల్డ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్ యూజర్ల సెషన్ వివరాలను హ్యకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ స్టోర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన జీటీఏ ఫైవ్, ఫార్ట్‌నైట్, బ్యాటిల్ ఫీల్డ్,ఫిఫా 2022 గేమ్స్ ఉన్నాయి. రష్యన్ ఫోరమ్‌లో బ్లడీస్టీలర్ అనే మాల్వేర్ తొలిసారిగా మార్చి 2021లో కాస్పర్‌స్కై గుర్తించింది. ఈ మాల్వేర్ సహాయంతో గేమర్స్ నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా యూజర్ల నుంచి డబ్బులను వసూలు చేస్తోన్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! -
పబ్జీ మొనగాడు.. బూతులతో బుక్కయ్యాడు
చెన్నై: పబ్జీ.. మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్. బ్యాన్ విధించినప్పటికీ వీపీఎన్ సౌలత్‌తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అలాంటి గేమ్‌లో మదన్ ఘనాపాటి. తమిళనాడుకు చెందిన మదన్ ఓపీ.. గేమర్, వ్లోగర్ కూడా. యూత్‌లో ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల్లో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. అంతెందుకు కొందరు సెలబ్రిటీలు కూడా ఇతని అభిమానులే. అలాంటి కుర్రాడిపై లైంగిక ఆరోపణల కింద కేసు బుక్ అయ్యింది. అసలు మదన్‌కి ఇంతలా పేరు రావడానికి ముఖ్య కారణం.. పబ్జీ గేమింగ్‌లో అతను ఉపయోగించే భాష. కో-ప్లేయర్స్ గనుక బాగా ఆడకపోతే బండబూతులు తిడతాడు. లైవ్‌లో ఉన్నాననే సంగతి మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. ఆ ఆటిట్యూడ్ అతనికి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అంతేకాదు ఆటలో అతను ఇచ్చే టిప్స్.. ఇంటర్నేషనల్ వైడ్‌గా అతనికి గుర్తింపు ఇచ్చింది. అయితే రీసెంట్గా ఓ వీడియోలో అతను అమ్మాయిలను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలం వాడాడు. దీంతో ఇతగాడి వ్యవహారం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చేరింది. శృతి మించారు నిజానికి ఈ కుర్రాడు పబ్లిక్‌కి తెలిసేలా తప్పులన్నీ చేస్తుంటాడు. అతనికి ఉన్న అభిమానుల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగోలా వాళ్ల అమ్మాయిల నెంబర్లు సంపాదించి.. వాళ్లతో మాటలు కలుపుతాడు. అసభ్యంగా మాట్లాడుతూ.. తేడాగా వ్యవహరిస్తాడు. ఇన్స్టాగ్రామ్ పేజీలలో న్యూడ్‌గా వీడియో ఛాట్ చేయాలని ఒత్తిడి చేస్తాడు. ఆ ఛాటింగ్‌లను, స్క్రీన్ షాట్లను పబ్లిక్‌గానే పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ వ్యవహారంలో బాధిత యువతులనూ ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తాను బహిరంగంగానే చేస్తున్నానని, తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు తన మీద కుట్రపన్నారని మదన్ చెప్తున్నాడు. చర్యలు తప్పవా? ఇక తాజాగా విమర్శల నేపథ్యంలో మదన్ దూకుడు తగ్గించాడు. తన సోషల్ మీడియా అకౌంట్లకు కామెంట్ సెక్షన్‌కు ప్రైవసీ పెట్టాడు. అతని యూట్యూబ్ పేజీలో 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్లలో చాలామంది 18 ఏళ్లలోపు వాళ్లే. అందుకే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ గరం అయ్యింది. కొందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు సోషల్ మీడియాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు చెన్నై పోలీసులు కేసు రిజిస్ట్రర్ చేయడంతో.. త్వరలోనే మదన్‌పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారంతా. ఇది #arrestmadanop పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ కథ. -
అది అందరి బాధ్యత
శ్రనిత్ రాజ్, కల్యాణి పటేల్, అనిరుధ్, నేహా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గేమర్’. బి.జి.వెంచర్స్ పతాకంపై రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘గేమర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీశారు. ఇలాంటి చిన్న సినిమాల దర్శక, నిర్మాతలను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపైనా, సమాజంపైనా ఉంది. వీళ్లందరికీ థియేటర్లు దొరకడం కష్టంగా ఉంది. కొత్త టాలెంట్ రావాలంటే చిన్న దర్శక–నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. అప్పుడే గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతాయి’’ అన్నారు. తడకల రాజేష్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఆరు చిత్రాలు చేసిన నాకు ‘గేమర్’ ఏడో సినిమా. బి.జి.యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవకాశం ఇస్తున్నాను. ఈ చిత్రంలోని ప్రతి సీన్ డిఫరెంట్‌గా ఉంటూ ఆసక్తి రేపుతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 1న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. హీరో శ్రనిత్, హీరోయిన్ కల్యాణి, అనిరు«ద్, నరేందర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ నేపథ్యంలో...
శ్రనిత్ రాజ్, కల్యాణి, అనిరుథ్, నేహా, ‘చిత్రం’ శీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గేమర్’. బి.జి. వెంచర్స్ పతాకంపై రాజేశ్ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో చిత్రబృందం సినిమా విశేషాలు పంచుకున్నారు. దర్శక–నిర్మాత రాజేశ్ తడకల మాట్లాడుతూ– ‘‘బెట్టింగ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది. లవ్, హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తాయి. మా బ్యానర్లో రూపొందిస్తోన్న ఏడవ సినిమా ఇది. ప్రతిసారి కొత్తవారితోనే సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమాతో శ్రనిత్ రాజ్, కల్యాణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నా. బి.జి. యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులను ఎంపిక చే శాం’’ అన్నారు. ‘‘గేమర్’లో నాది ఛాలెంజింగ్ పాత్ర. ఈ సినిమా ట్రెండీగా, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రనిత్ రాజ్, కల్యాణి, అనిరుధ్, నేహా తదితరులు పాల్గొన్నారు.