'రాజకీయాల్లో ఇంకా రాటుదేలలేదు'
హైదరాబాద్: హైకమాండ్ ఆదేశించినా వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేయబోనని కాంగ్రెస్ మాజీ ఎంపీ జి. వివేక్ స్పష్టం చేశారు. సోనియా చెప్పడం వల్లే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తమ కుటుంబం అంతా కాంగ్రెస్ కోసమే పనిచేసిందన్నారు. తన విధేయతను హైకమాండ్ గుర్తించిందన్నారు. రాజకీయాల్లో తానింకా రాటుదేలలేదన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై సీమాంధ్ర నాయకుల ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణివేయాలని కిరణ్ కుమార్ రెడ్డి చాలా ప్రయత్నించారని ఆరోపించారు. తనపై ఆయన వ్యక్తిగతంగా కక్ష గట్టారని అన్నారు. దళితుడు సీఎం అయితే సంపూర్ణ తెలంగాణ సాకారమవుతుందని వివేక్ అన్నారు. వరంగల్ సీటు ఇస్తామన్నా పార్టీ మారబోనని తెలిపారు.