warangal By election
-
వరంగల్ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదు
-
వరంగల్ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదు : సర్వే
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలను మానిప్లేట్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.... ఎన్నికల ప్రచారం సందర్బంగా టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత కనిపించిందని ఆయన గుర్తు చేశారు. అందులోభాగంగా ఆ పార్టీ మంత్రులు, నేతలను ప్రజలు నిలదీశారని అన్నారు. ఈవీఎంల మానిప్లేట్పై ప్రత్యేక కమిషన్‌తో బహిరంగ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వే సత్యనారయణ డిమాండ్ చేశారు. ఈవీఎంలు కరెక్ట్ అని తేలితే కేసీఆర్‌కి సలాం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంలు మానిప్లేట్ అయ్యాయని తేలితే కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నుంచే... టీఆర్ఎస్ ఈవీఎంల మానిప్లేట్ చేయడం ప్రారంభించిందన్నారు. ప్రచారంలో కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. ఉద్యమ కాలంలోనూ టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రాలేదని తెలిపారు. వరంగల్‌లో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రావడం.. కాంగ్రెస్‌కి డిపాజిట్ రాకపోవడానికి కారణం ఈవీఎంలు మానిప్లేట్ చేయడమే అని సర్వే స్పష్టం చేశారు. -
'జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి టీఆర్ఎస్ పతనం'
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. వరంగల్ ఉప ఎన్నికలో ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకో లేకపోయామని ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు నిరాశ కలిగించాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. మజ్లిస్ అభ్యర్థిని మేయర్ చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ నాలుగున్నర లక్షల ఓట్లపైగా భారీ ఆధిక్యంతో గెలుపోందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం'
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ అధిక్యంతో విజయం సాధించడంపై తెలంగాణ ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. వరంగల్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గొప్ప విజయాన్ని కట్టబెడుతున్నారని అన్నారు. ఈ విజయాన్ని అందించిన వరంగల్ ప్రజలను కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రెఫరెండం అని చెప్పి మరీ ఈ ఎన్నికల్లో తలపడ్డామన్నారు. మా పనితీరుకు మీ తీర్పు నిదర్శనమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఓడిపోతుంటే... తాము మాత్రం గెలుస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే మా పనితీరుకు నిదర్శనమని తెలిపారు. భవిష్యత్‌లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కళ్లు తెరిచి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిదని కేసీఆర్.. ప్రతిపక్షాలకు సూచించారు. -
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం'
-
అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా
-
అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా
నల్గొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నల్గొండలో స్పందించారు. అవినీతి, అధికార దుర్వినియోగంతోనే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని ఆయన ఆరోపించారు.టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గుత్తా ఈ సందర్భంగా అన్నారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామన్నారు. అలాగే అవసరమైతే టీడీపీతో కూడా తమ పార్టీ పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ దాదాపు మూడు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోవ స్థానంలో ఉండగా.... , బీజేపీ - టీడీపీ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డిపై విధంగా స్పందించారు. -
'టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభపెట్టింది'
-
'టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభపెట్టింది'
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రులను, ప్రజాప్రతినిధులను మోహరించి టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభ పెట్టిందని.. అయినా కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే ఈ ఎన్నికలో ప్రభావం చూపించిందన్నారు. వరంగల్ ఉప ఎన్నిక తమ పాలనపై రెఫరెండం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇరిగేషన్ చెల్లింపులు జరపాలన్న ప్రభుత్వ ఆలోచన సరి కాదని, ఆర్థికశాఖ రెక్కలు విరిచే ప్రయత్నం చేస్తున్నారని.. బీసీ వర్గానికి చెందిన ఈటల ఆర్థికశాఖను నిర్వీర్యం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లతోనే ప్రభుత్వాన్ని నడపాలని టీఆర్ఎస్ భావిస్తోందా అంటూ పొంగులేటి ప్రశ్నించారు. -
ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్
-
ఆత్మకూర్‌లో స్వల్ప ఉద్రిక్తత
ఆత్మకూర్: వరంగల్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా జిల్లాలోని ఆత్మకూర్‌లో ఓ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోలింగ్ కేంద్రంలో వెళ్లటంతో స్థానిక కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని, లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవటంతో కాంగ్రెస్ వర్గీయులు కూడా పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. -
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మందికిపైగా భద్రత సిబ్బందిని అందుకోసం వినియోగించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను మోహరించారు. తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సమస్యాత్మక మైన పోలింగ్ కేంద్రాల్లో 626 వెబ్ లైవ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక విధుల్లో 9428 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో దాదాపు 15 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిసారిగా ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలో మొదటిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరును అధికారులు పుష్పగుచ్ఛం అందజేస్తారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అయితే ఆయన కేసీఆర్ మంత్రి వర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడనున్నాయి. -
వరంగల్ ఎన్నికలో బీజేపీ-టీడిపి కరెన్సీ ప్రవాహం
-
'తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదు'
వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సాగరహారంలో పాల్గొన్నారా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం వరంగల్‌లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అలాగే సకల జనుల సమ్మెకు వెన్నుపోటు పొడిచిందెవరు అని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. కేసీఆర్ ఊహాలోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని విమర్శించారు. -
ఆశా వర్కర్ల ధర్నాకు వైఎస్ జగన్ మద్దతు
వరంగల్ : ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లకు వైఎస్ జగన్ తన మద్దతు ప్రకటించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ గురువారం ధర్మసాగర్ మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తర్వాత స్టేషన్ ఘన్పూర్, రఘునాథ్‌పల్లి మండలాల్లో వైఎస్ జగన్ ప్రచారం చేయనున్నారు. సాయంత్రం స్టేషన్ ఘన్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. వైఎస్ జగన్ నవంబర్ 16 నుంచి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నేటి సాయంత్రంతో వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఈ నెల 21వ తేదీన జరగనుంది. ఈ నెల 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
'టీఆర్ఎస్ పతనం స్పష్టంగా కనబడుతోంది'
వరంగల్ : ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాళ్లతో కొట్టమని ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం వరంగల్‌లో ఉప ఎన్నిక ప్రచారంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... టీఆర్ఎస్ పతనం స్పష్టంగా కనడబడుతోందన్నారు. కేసీఆర్.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో ఫామ్‌హౌజ్‌లో కూర్చుని జరిపిన చర్చల్లో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో ప్రజలకు వివరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. -
నేటి నుంచి వరంగల్‌లో జగన్ ప్రచారం
- 19 వరకు లోక్‌సభ సెగ్మెంట్లో పర్యటన - తొలిరోజు తొర్రూరులో సభ: పొంగులేటి సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక లో పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా ప్రచారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు. వరుసగా నాలుగు రోజులపాటు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ప్రధాన కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం బహిరంగ సభ నిర్వహించేలా వైఎస్సార్సీపీ కార్యాచరణ రూపొందించింది. వైఎస్ జగన్ సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 10 గంటలకు పాలకుర్తి చేరుకుంటారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం తెలిపారు. తొలిరోజు తొర్రూరులో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా పరకాల, వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్సార్ అభిమానులు భారీగా పాల్గొని జగన్ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని కోరారు. పర్యటన సాగేదిలా..: తొలిరోజు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జగన్ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. జఫర్‌గఢ్ మండల కేంద్రం మీదుగా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి రాయపర్తి మీదుగా తొర్రూరు చేరుకుంటారు. సాయంత్రం అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఇల్లందు, మామునూరు మీదుగా హన్మకొండకు చేరుకుంటారు. 17న పరకాల నియోజకవర్గం ఆత్మకూరులో ప్రచారం మొదలవుతుంది. శాయంపేట, రేగొండ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. అక్కడ ప్రచారం ముగించి సాయంత్రం పరకాల వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. 18న పరకాల నియోజకవర్గం సంగెం, గీసుగొండ మండలాల్లో ప్రచారం చేస్తారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 19న హన్మకొండ, కాజీపేట మీదుగా ధర్మసాగర్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగే ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ఇదే నియోజకవర్గంలోని రఘునాథపల్లి మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. నల్లా సూర్యప్రకాశ్‌కు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని చెప్పారు. -
కేసీఆర్ ఓటమే ప్రజా గెలుపు
- వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, దిగ్విజయ్ - తెలంగాణ బిల్లు ఆమోదం ఓ చరిత్రాత్మక ఘట్టం - ఉద్విగ్న క్షణాల మధ్య బిల్లు ప్రవేశపెట్టా: లోక్‌సభ మాజీ స్పీకర్ - ఆ సమయంలో బలిదానాలు నన్ను కదిలించాయి - ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్తో బిల్లు పాస్ కాలేదు - కాంగ్రెస్, సోనియా కృషి వల్ల ప్రత్యేక రాష్ట్రం వచ్చింది - కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయం: దిగ్విజయ్ - మాల, మాదిగలకు కేబినెట్లో చోటేది: పీసీసీ చీఫ్ ఉత్తమ్ - సీఎంకు ఝలక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: పొన్నాల - భూపాలపల్లి, పరకాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు సాక్షి, హన్మకొండ: ‘‘వరంగల్ ఉప ఎన్నికలో కేసీఆర్ ఓటమే ప్రజల గెలుపు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి’’ అని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం భూపాలపల్లి, పరకాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఈ సందర్భంగా మీరాకుమార్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌పై విమర్శలు కురిపించారు. మాయమాటలు చెప్పే కేసీఆర్, ప్రధాని మోదీలకు ఈ ఉప ఎన్నికలో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ‘‘పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఓ చరిత్రాత్మక ఘట్టం. పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత ఉద్విగ్న క్షణాల మధ్య తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాను. బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్స్ప్రేలతో, సభ్యుల నినాదాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లు ప్రవేశపెట్టొద్దంటూ కొందరు నన్ను కోరారు. ఆ క్షణాన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న అలుపెరుగని పోరాటం, బలిదానాలు నా మనసును కదిలించాయి. అందుకే బెదరకుండా బిల్లు ప్రవేశపెట్టేందుకు మొగ్గుచూపాను’’ అంటూ నాటి ఘటనలను మీరా కుమార్ గుర్తుచేసుకున్నారు. సోనియా కృషి వల్లే తెలంగాణ ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్తో బిల్లు పాస్ కాలేదని, సోనియాగాంధీ, కాంగ్రెస్ కృషి వల్లే పార్లమెంటులో బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూరిందని మీరా కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఎన్నడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని, ఎప్పుడూ ప్రజలను రెచ్చగొట్టడమే ఆ పార్టీ పనంటూ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించకపోవడం వారిని అవమానించడమేనని అన్నారు. ‘‘నా జీవిత చరిత్రలో అబద్ధాలు చెప్పే ప్రధానిని ఇప్పటి వరకు చూడలేదు. అందుకే మొన్నటి ఎన్నికల్లో మా బిహారీలు బీజేపీకి బుద్ధి చెప్పారు’’ అంటూ మోదీపై మండిపడ్డారు. మాయమాటలు చెప్పే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లకు వరంగల్ ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలన్నారు. సర్వే సత్యనారాయణ సమర్థుడని, 24 క్యారెట్ల బంగారమని వ్యాఖ్యానించారు. చికెన్ కంటే పప్పు ధర ఎక్కువా? చికెన్ ధర కంటే పప్పు ధర ఎక్కువగా ఉండటం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దిగ్విజయ్ సింగ్ దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పి గద్దె నెక్కిన మోదీ, కేసీఆర్‌లకు బుద్ధి చెప్పేందుకు ఇది సరైన సమయమన్నారు. విదేశాలకు వెళ్లి భారత్ ఎంతగానో అభివృద్ధి చెందిందనడం, మన దేశంలో మాత్రం కాంగ్రెస్ పాలన వల్ల దేశం వెనుకబడి ఉందనడం ప్రధాని మోదీకే చెల్లిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని సెలవు దినంగా ప్రకటించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఎన్నికల కమిషన్ ఈ విషయంపై చూస్తూ ఊరుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. మాల, మాదిగలకు రాష్ట్ర కేబినేట్లో చోటులేకపోవడం బాధాకరమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నక్సలైట్ల అజెండానే తమ అజెండా అని చెప్పి.. శృతిని ఎన్కౌంటర్ చేశారని విమర్శించారు. హమీలను విస్మరించిన కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆకాశంలో నడుస్తున్న కేసీఆర్‌ను నేలపైకి దించాలంటే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. హిట్లర్ కంటే హీనంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని సర్వే సత్యనారాయణ అన్నారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బలరాంనాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్, జనక్ ప్రసాద్, సంపత్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీ-న్యూస్, నమస్తే తెలంగాణలపై ఫిర్యాదు
వరంగల్: వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించిన టీ న్యూస్ చానల్, నమస్తే తెలంగాణ పత్రికలపై కేసు నమోదు చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కరుణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం ఫిర్యాదును టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మార్క విజయకుమార్‌గౌడ్‌లు రేవంత్‌రెడ్డి తరఫున అందించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా సదరు చానల్లో ప్రసారాలు, పత్రికల్లో ప్రత్యేక కథనాలు రూపొందించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రసారాలు, ఆర్టికల్స్‌ను పెరుుడ్ న్యూస్‌గా పరిగణించాలని కోరారు. వరంగల్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కాళోజి హెల్త్ యూనివర్సిటీకి వీసీని నియమించడం, క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, అధికారంగా పండుగ నిర్వహించాలని ఆదేశాలు, పోలీస్ ఉద్యోగాలకు మూడేళ్ల వయసు సడలింపు నిర్ణయాలు, టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ వంటివన్నీ కోడ్‌కు విరద్ధమని రేవంత్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వరంగల్‌లో రోజ విస్తృత ప్రచారం
-
వరంగల్ లో వైఎస్ జగన్ ప్రచారం
సోమవారం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించడంతో పాటు.. తొర్రూరు, పరకాల బహిరంగ సభల్లో పాల్గోనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పాటు సాగే ప్రచార కార్యక్రమంలో తొలి రోజు 101 కిలోమీటర్లు, రెండో రోజు 140 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా 16వ తేదీ సోమవారం ఉదయం 8గంటలకు హైదరాబాద్ లోని లోట్ పాండ్ నుంచి బయల్దేరనున్న వైఎస్స్ జగన్... జనగామ మీదుగా పాలకుర్తి చేరుకుంటారు. పాలకుర్తి, జఫర్ గఢ్, వర్ధన్న పేట, రాయపర్తి, తొర్రూరు, హన్మకొండ ల మీదుగా.. 101 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించ నున్నారు. సోమవారం సాయంత్రం తొర్రూరు లో బహిరంగ సభలో పాల్గొంటారు. రెండో రోజు పర్యటనలో భాగంగా హన్మకొండ, ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, భూపాలపల్లి, పరకాల, హన్మకొండ ల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈనెల 17న సాయంత్రం పరకాల లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వరంగల్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ విభాగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
'16 నుంచి వరంగల్ లో వైఎస్ జగన్ ప్రచారం'
వరంగల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని తెలంగాణలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైఎస్ జగన్ ఈ ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ...లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ, స్టేషన్ ఘన్పూర్, తొర్రూర్, పరకాల బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తో పాటు పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, శివకుమార్, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
'కేసీఆర్‌కి ఎవరూ సాటిరారు'
వరంగల్ : పాలన, పథకాల అమలులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎవరూర సాటిరారని ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం వరంగల్‌లో హరీశ్‌రావు లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు దిక్సూచి వంటిందని ఆయన అభివర్ణించారు. మూడేళ్లలో రహదారులు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉందని... అయినా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ స్థాయిలో వరంగల్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హరీశ్‌రావు స్పష్టం చేశారు. -
16 నుంచి వరంగల్ లో వైఎస్ జగన్ ప్రచారం
-
'కేసీఆర్‌కి పరాభవం తప్పదు'
వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ జైపాల్‌రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం వరంగల్‌లో జైపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌ది అహంకార పాలన అని ఆయన అభివర్ణించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించి.. దళితులను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. 16 నెలల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం అయినట్లే... తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కూడా వరంగల్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమతమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి వరంగల్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. -
'వరంగల్' ప్రచారానికి హైకమాండ్ నేతలు
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని అటు అధికార... ఇటు ప్రతిపక్ష పార్టీలు ఉధృతం చేశాయి. ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఓరుగల్లును తమ ఖాతాలో వేసుకుని అధికార టీఆర్ఎస్కు చెక్ చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యూహా రచన చేస్తుంది. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. దీంతో కేంద్ర మాజీ మంత్రులు దిగ్విజయ్ సింగ్, సుశీల్‌కుమార్ షిండే, మల్లికార్జున ఖర్గే, సచిన్ పైలట్‌తోపాటు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. నియోజకవర్గాల వారీగా ఈ నేతలంతా 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక నవంబర్ 21న జరగనుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
రాష్ట్రంలో నాలుగు స్తంభాలాటగా పాలన
పరకాల : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోపాటు కుమారుడు, కూతురు, అల్లుడు కలిసి నాలుగు స్తంభాలాటగా పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి దేవయ్య తరఫున ప్రచారంలో భాగంగా మంగళవారం పరకాలలో రోడ్‌షో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు అడిగే అర్హత లేదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టబెట్టేందుకే నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. దేవయ్యను గెలిపిస్తే వరంగల్ మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, గుజ్జు ల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణరావు, రత్న శైలేందర్, మేకల రాజవీరు, ఆర్పీ జయంత్‌లాల్, మేఘనాథ్, నాగెల్లి రంజి త్, ముస్కే సంతోష్, సమ్మయ్య, వెనిశెట్టి రాజేష్, నరేష్, రాజేందర్ పాల్గొన్నారు. -
మోదీకి తెలంగాణకొచ్చే తీరిక లేదట!
నయీంనగర్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తీరిక లేదని ఐటీశాఖ మంత్రి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి కేటీఆర్ అన్నారు. విదేశాలకు వెళ్లి వచ్చేందుకు మాత్రం ఆయనకు పుష్కల మైన సమయం దొరుకుతోందన్నారు. మంగళవారం హన్మకొండ నయీంనగర్‌లోని కందకట్ల గేట్ వే కాంప్లెక్స్‌లో ఆచార్య జయశంకర్ స్మారక సేవా సమితి, విద్యారణ్యపురి కాలనీ జేఏసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉప ఎన్నిక సన్నాహక సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాట్లాడారు. సేవా సమితి నాయకులు డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. శ్రీనగర్ కాలనీ, సరస్వతీ నగర్ కాలనీ, ప్రేమ్‌నగర్ కాలనీ కమిటీలు పార్టీ అభ్యర్థి పసునూరి దయూకర్ గెలుపునకు కృషిచేస్తామని కేటీఆర్‌కు హామీ ఇచ్చారుు. మాజీ డిప్యూటీ మేయర్ టి.అశోకరావు, టీఎన్జీవోస్ నాయకుడు కావటి సమ్మయ్య, టీజీఏ నాయకులు మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాజన్, పమ్మి రమేష్, రుద్రోజు సంపత్, పర్యావరణవేత్త రతన్‌సింగ్, డాక్టర్ వెంకటి, యాదగిరి పాల్గొన్నారు. -
సైకో అన్నందుకు కడియం క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై రైతు చెప్పు విసరడం.. టీఆర్ఎస్పై రైతుల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. రైతును సైకో అన్నందుకు క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరిని ఈ సందర్భంగా పొంగులేటి శనివారం హైదరాబాద్ లో డిమాండ్ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచార సభలో మాట్లాడుతున్న తెలంగాణ డిప్యూటి ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసిరి... మీ పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. దీంతో అతడిని టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో రైతును సైకో అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడియం వ్యాఖ్యలపై పొంగులేటి మండిపడ్డారు. -
ఇక మెజారిటీ కోసమే!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో ఘన విజయం తమదేనని, కేవలం భారీ మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నామంటూ అధికార టీఆర్ఎస్ ప్రకటనలు చేస్తోంది. విపక్షాల అభ్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేలా ‘మైండ్ గేమ్’ మొదలుపెట్టింది. ఈ ఎన్నికలపై ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న గులాబీ నాయకత్వం... తొలుత అభ్యర్థుల ఖరారు సమయంలో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకడం లేదంటూ విమర్శించింది. ఇప్పుడు గెలుపు తమదేనని, తమ అభ్యర్థికి మెజారిటీ పెంచడం కోసమే ప్రచారం చేస్తున్నామని చెబుతోంది. ‘టీఆర్ఎస్ మైండ్ గేమ్ అడుతోంది. ప్రత్యర్థి పార్టీలతో ఒక విధంగా మానసిక యుద్ధం చేస్తోంది. విపక్షాలు ముందే చేతులెత్తేశాయన్న అభిప్రాయాన్ని ఓటర్లలో కలిగించేలా పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది..’’ అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యూహం మేరకు టీఆర్ఎస్ నేతలంతా మెజారిటీ కోసమే తమ పోరాటమని చెబుతున్నారు. టీఆర్ఎస్ నాయకత్వం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పజెప్పింది. అయినా ప్రస్తుతానికి వరంగల్ జిల్లా నాయకులే ఎక్కువగా ప్రచారంలో ఉన్నారు. ఎన్నికల బాధ్యతలున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్ తదితరులు ఇతర కార్యక్రమాల్లో ఉండి, గురువారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. దీపావళి తర్వాతే మంత్రులు వరంగల్‌లో ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మారిన రాజకీయ వాతావరణం తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వరంగల్ ఉప ఎన్నికల రాజకీయ వాతావరణాన్ని మార్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్ బరిలోకి దింపిన సర్వే సత్యనారాయణ స్థానికుడు కాదు. ఇది తమకు లాభించే అంశమన్న భరోసా టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. వాస్తవానికి బుధవారం తమ అభ్యర్థి చేత మరోసారి నామినేషన్ వేయించేందుకు, దీనికి కోసం భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించి హడావుడి చేసేందుకు టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఘటనతో భారీ సమీకరణ లేకుండానే కార్యక్రమాన్ని ముగించింది. ‘స్థానికత’పై ధీమా! పార్టీ ఆవిర్భావం నుంచి తమతో కలసి నడిచిన సామాన్య కార్యకర్త, స్థానికుడికి టికెట్ కేటాయించామని అధికార పార్టీ చె ప్పుకుంటోంది. పేద కార్యకర్త అయినందున ఎన్నికల ఖర్చులను పార్టీయే భరిస్తోందంటూ రూ.70 లక్షల చెక్కునూ అందజేసి... ఈ అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో అత్యధిక ఓట్లున్న మాదిగ వర్గానికి చెందిన స్థానిక నేతకు అవకాశమిచ్చామని పదేపదే చెబుతోంది. దీనికితోడు కాంగ్రెస్‌లో అభ్యర్థి మారిపోయి స్థానికేతరుడైన సర్వే సత్యనారాయణ పోటీకి దిగడంతో ప్రచారానికి మరింత పదును పెడుతోంది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి ఎన్నారై దేవయ్య కూడా జిల్లా ప్రజలకు అంతగా పరిచయం లేని వ్యక్తి అంటూ కొత్త పాట అందుకుంది. ప్రతిపక్షాలకు సంబంధించి వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ ఒక్కరే స్థానికుడు కావడం గమనార్హం. -
'కేసీఆర్ ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారు'
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మంగళవారం కరీంనగర్ లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ అసమర్ధత వల్లే రాష్ట్రం అప్పులపాలైందని ఎల్ రమణ ఆరోపించారు. కరీంనగర్లో ఎల్ రమణ విలేకర్లతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే... కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవయ్యను గెలిపించుకుంటామని ఎల్ రమణ స్పష్టం చేశారు. -
టీఆర్ఎస్ మాట తప్పింది
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకుందని వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి.రాజయ్య స్పష్టం చేశారు. కానీ ఎన్నికల హామీలు అమలు చేయకుండా టీఆర్ఎస్ మాట తప్పిందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బీఫాం అందుకున్న తర్వాత రాజయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో ఒకే దఫాలో రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వాయిదాల పర్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. లోక్ సభ అభ్యర్థిగా రాజయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
'లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది'
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాజయ్యకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బీఫాం అందజేశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. దీంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నియంతృత్వ పాలనలో పాలనలో ప్రజల హక్కులను కూడా హరించి వేస్తోందని ఉత్తమ్ ఆందోళన చెందారు. సోమవారం సి. రాజయ్య నామినేషన్ వేయనున్నారు. -
మాజీ ఎంపీ రాజయ్యకే అధిష్టానం ఆశీస్సులు
-
వరంగల్ ఉప ఎన్నికకు మద్దతివ్వండి
హైదరాబాద్ : వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... వామపక్షాలు, వైఎస్ఆర్ సీపీతోపాటు పలు జేఏసీలకు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాడాలని ఆ పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు ఆ క్రమంలో పోరాడేందుకు తమ వెంట కలసి రావాలని సదరు పార్టీలను ఆయన సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై సీబీఐ విచారణ సీరియస్‌గా జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. -
వరంగల్‌లో విభిన్న తీర్పు: పొంగులేటి
♦ త్వరలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రకటన ♦ ప్రజలు దీవిస్తారనే నమ్మకముంది ♦ తెలంగాణలోనే అధికంగా వైఎస్ సంక్షేమ కార్యక్రమాలు ♦ వరంగల్‌లో ఆయనకున్న ఆదరణే మాకు శ్రీరామరక్ష ♦ టీఆర్ఎస్ ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చలేదంటూ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం నె రవేర్చలేదు.కాబట్టి వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ప్రజలు భిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, దళితులకు మూడు ఎకరాలు, మైనారిటీలు,గిరిజనులకు 12 శా తం రిజర్వేషన్లు, మహిళలకు డ్వాక్రా రుణాల మాఫీ ... ఇలా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏ హామీ నిలుపుకోలేదని విమర్శించారు. మంగళవారం లోట స్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేం ద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడా రు. వరంగల్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పేదల హృదయాల్లో దేవుడిగా నిలిచిపోయిన మహా నేత వైఎస్సార్ ఆశయాల సాధనకు వైఎస్ జగన్మోహన్రె డ్డి స్థాపించిన పార్టీకి ప్రజల దీవెనలు తప్పకుండా లభిస్తాయన్నారు. టీ ఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీతో తలపడి వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందనే విశ్వాసం తమకుందన్నారు. ఉప ఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు వస్తారన్నారు. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కట్టిన మొత్తం ఇళ్ల కంటే ఒక్క ఏపీలోనే ఎక్కువగా కట్టించిన ఘనత వైఎస్‌ది. 2004-09 మధ్య ఆయన తెలంగాణ ప్రాంతానికే అత్యధిక నిధులు ఖర్చు చేశారు. వెనకబడ్డ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఆయ న ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో వరంగల్ జిల్లాలో, అందునా ఉప ఎన్నిక జరగనున్న లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే బడుగు, బలహీనవర్గాలకు వైఎస్ ఎంతగానో ప్రయోజనం చే కూర్చారు. రాబోయే రోజుల్లో ప్రజలంతా వైఎస్సార్సీపీని దీవిస్తారు. వరంగల్ జిల్లాలో షర్మిలమ్మ చేపట్టిన పరామర్శ యాత్రకు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం’’ అన్నారు. ప్రజా సమస్యలపై తెలంగాణలో మొట్టమొదట రైతుదీక్షను చేపట్టిందే వైఎస్సార్సీపీ అని చెప్పారు. సమస్యల పరి ష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. తాము ఏ పార్టీ కోసమో అభ్యర్థిని నిలపడం లేదని చెప్పారు. 1న వరంగల్‌లో జిల్లా పార్టీ విస్తృత భేటీ నవంబర్ 1న వరంగల్‌లో పొంగులేటి అధ్యక్షతన వరంగల్ జిల్లా పార్టీ విస్తృత సమావేశం జరగనుంది. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు తదితర నేతలు ఇందులో పాల్గొంటారని శివకుమార్ తెలిపారు. -
త్వరలో మా అభ్యర్థిని ప్రకటిస్తాం
-
చంద్రబాబు మిత్రధర్మం పాటించమన్నారు
- వరంగల్ ఉప ఎన్నిక బరిలో ఎన్డీఏ అబ్యర్థే - స్పష్టం చేసిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ విజయవాడ: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నకలో టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలపడం లేదని, ఎన్డీఏ అబ్యర్థి మాత్రమే పోటీ చేస్తారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో టీటీడీపీ నేతల కీలక భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'వరంగల్ లో టీడీపీ అభ్యర్థినే నిలపాలని కార్యకర్తలు కోరారు. వారి అభ్యర్థనను అధినేత ముందుంచాం. అయితే మిత్రధర్మం పాటించాలని చంద్రబాబు చెప్పారు. అందుకే పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే ఆలోచనను ఇంతటితో వదిలేస్తున్నాం. ఎడ్జీఏ అభ్యర్థే పోటీచేస్తారు' అని రమణ పేర్కొన్నారు. అయితే అభ్యర్థి ఎవరనే విషయం టీటీడీపీ అధ్యక్షుడ, టీ బీజేపీ అధ్యక్షుడు సంయుక్తంగా నిర్ణయిస్తారని, ఈ మేరకు చర్చలు జరపాల్సిందిగా చంద్రబాబు సూచించారని రమణ చెప్పారు. పొత్తులో బాగంగా 2014 ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగటం, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామాచేసి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ దఫా టీడీపీ అభ్యర్థినే పోటీకి దింపాలని స్థానిక నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఇప్పటికే అభ్యర్థి ఎంపిక ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిసింది. ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను ఢిల్లీకి పంపింది. -
త్వరలో మా అభ్యర్థిని ప్రకటిస్తాం
హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ ఉప ఎన్నికపై చర్చించారు. భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం తప్పదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన అన్నారు. తమ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని, విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
టీవైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల భేటీ
హైదరాబాద్ : లోటస్‌పాండ్‌లో తెలంగాణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఈ సమావేశానికి టీవైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించారు. త్వరలో జరగనున్న వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీసీ అభ్యర్థిని ఎంపిక చేసే అంశంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. భేటీ ప్రారంభించక ముందు కొమరం భీమ్, వాల్మీకి చిత్ర పటాలకు వైఎస్ఆర్ సీపీ నేతలు నివాళులర్పించారు. -
ఈ ముగ్గురిలో ఒకరిని డిసైడ్ చెయ్యండి!
- మూడు పేర్లతో ఢిల్లీకి జాబితా పంపిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర శఖ - ఓరుగల్లు ఉప పోరుకు సిద్దమౌతున్న కాషాయదళం - లోక్‌సభ ఇన్‌చార్జీగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: టీడీపీ సహకారంతో వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బరిలోకి దిగనున్న బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తిచేసింది. ఈ మేరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని పార్టీ కార్యకర్తలతో, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపింది. పార్టీ టికెట్‌కోసం దరఖాస్తు చేసుకున్న 14 మంది అభ్యర్థులను పరిశీలించిన ఎన్నికల సమన్వయ కమిటీ.. చివరికి మూడు పేర్లను ఫైనలైజ్ చేసి అధిష్ఠానానికి పంపింది. సమన్వయ కమిటీలో కీలక నేతగాఉన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. లోక్‌సభ ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌చార్జీగానూ వ్యవహరిస్తున్నారు. మూడు పేర్లు ఇవే.. పార్టీనేతలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినవారు, తటస్తులు తదితరులను కలుపుకుంటే మొత్తం 14 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో నుంచి డాక్టక్ పంగిడి దేవయ్య, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్ పేర్లను తుది జాబితాలో చేర్చి ఢిల్లీకి పంపింది పార్టీ తెలంగాణ శాఖ. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు జనగాం పట్టణానికి చెందిన పంగిడి దేవయ్య వృత్తి రీత్యా డాక్టర్. అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన దేవయ్య పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలు పంచుకున్నారు. డాక్టర్ రాజమౌళి కూడా వృత్తిరీత్యా డాక్టరే అయినా 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీకూడా చేశారు. ఈయనది జనగాం సమీపంలోని వెల్లంల గ్రామం. రంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ ఎ.చంద్రశేఖర్ మాజీమంత్రి. ప్రస్తుతం కాంగ్రెస్పార్టీలోనే ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీచేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రొఫెసర్ గాదె దయాకర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్, పార్టీ ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు కూడా అభ్యర్థిత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారు. బూత్‌స్థాయికో సమన్వయ కమిటీ టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయానికి బూత్‌స్థాయికి ఒక కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రతీరోజూ బూత్ స్థాయిలో ప్రచారం, ఎన్నికల వ్యూహం వంటివాటిపై చర్చించడానికి వీలుగా ఈ కమిటీని ఏర్పాటుచేశారు. ఇలాంటి కమిటీలనే గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలోనూ ఏర్పాటుచేయనున్నారు. ఈ నెల 28 నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ నిర్ణయించింది. -
ఉప ఎన్నికల్లో పోటీకి అప్పుకావాలట!
ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడని వరంగల్ ఉప ఎన్నికలో అప్పుడే చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నిక బరిలో దిగుతానని, అందుకుగానూ తనకు రుణం మంజూరు చేయాలని ఓ వ్యక్తి బ్యాంక్‌ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. 'జన సంక్షేమ సంఘం' అనే సంస్థకు అధ్యక్షుడైన వెంకటనారాయణ పాతికేళ్ల యువకుడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. తన సంస్థ తరఫునే వరంగల్ ఉప ఎన్నికలో పోటీచేయాలనుకున్నాడు. అయితే డిపాజిట్ చెల్లింపులు, ప్రచార ఖర్చులు తదితర అవసరాలకు సరిపడా డబ్బులు లేవట! దీంతో శుక్రవారం నల్లకుంటలోని కెనరా బ్యాంక్ కు వెళ్లి రుణం మంజూరు చేయండంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి సమాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, రాజకీయ చైతన్యం మెండుగా ఉందని పేర్కొన్న వెంకటనారాయణ.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. మరి బ్యాంక్ అధికారులు రుణం ఇస్తానన్నారా? అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు! అటు బ్యాంక్ అధికారులు కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు ముందుకురాలేదు! -
కేసీఆర్ నుంచి స్పందన రాలేదు
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కసరత్త చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ మంగళవారం హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా ఖరారు అవుతుందని ఆయన తెలిపారు. అయితే నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ లేఖ రాసిన సంగతి ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ అంశంపై కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గతేడాది జరిగిన వరంగల్ లోక్‌సభ స్థానానికి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అయితే ఆయన్ని కేసీఆర్ తన కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వివేక్, ఎం రాజయ్య, బలరాం నాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరు కూడా వినపడింది. కానీ ఎవరిని ఖరారు చేసేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలనుంది. అలాగే మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి ఆగస్టు 25వ తేదీన గుండెపోటుతో ఆకస్మాత్తుగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. -
సీఎంది మొండి వైఖరి:లెఫ్ట్
సాక్షి, హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ మొండివైఖరితో వ్యవహరిస్తున్నారని వామపక్షాలు ధ్వజమెత్తాయి. గురువారం నుంచి సీఎం కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై మాట్లాడేందుకు ప్రయత్నించాలని నిర్ణయించాయి. బుధవారం మఖ్దూం భవన్లో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్ఎస్పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ) సమావేశమై మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తీరును ఖండించాయి. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల జేఏసీ నిర్వహించనున్న నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతున్నట్లు, 11న కలెక్టరేట్ల ముట్టడిలో పాల్గొంటున్నట్లు తెలిపారు. వరంగల్ బరిలో గద్దర్ లేదా లక్ష్మయ్య! వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్షాల తరఫున ప్రజాగాయకుడు గద్దర్ లేదా టీజేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యలలో ఒకరిని పోటీకి నిలపాలని సీపీఐ,సీపీఎం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బుధవారం వామపక్షాల సమావేశంలో దీనిపై చర్చించారు. అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరింత కసరత్తు చేయాలని నిర్ణయించారు. -
'రాజకీయాల్లో ఇంకా రాటుదేలలేదు'
హైదరాబాద్: హైకమాండ్ ఆదేశించినా వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేయబోనని కాంగ్రెస్ మాజీ ఎంపీ జి. వివేక్ స్పష్టం చేశారు. సోనియా చెప్పడం వల్లే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తమ కుటుంబం అంతా కాంగ్రెస్ కోసమే పనిచేసిందన్నారు. తన విధేయతను హైకమాండ్ గుర్తించిందన్నారు. రాజకీయాల్లో తానింకా రాటుదేలలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై సీమాంధ్ర నాయకుల ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణివేయాలని కిరణ్ కుమార్ రెడ్డి చాలా ప్రయత్నించారని ఆరోపించారు. తనపై ఆయన వ్యక్తిగతంగా కక్ష గట్టారని అన్నారు. దళితుడు సీఎం అయితే సంపూర్ణ తెలంగాణ సాకారమవుతుందని వివేక్ అన్నారు. వరంగల్ సీటు ఇస్తామన్నా పార్టీ మారబోనని తెలిపారు. -
ఓరుగల్లుకు వీరుడెవరు?
►వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌లో తర్జనభర్జన ► రాజయ్యతో పాటు వివేక్, సర్వే, దామోదర, అద్దంకి పేర్లపై చర్చ ► ముందుగానే క్షేత్రస్థాయిలో దూసుకువెళ్లాలని వ్యూహం ► టీఆర్ఎస్తో ముఖాముఖి పోటీ ఉంటుందని అంచనా సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ ప్రాథమిక చర్చలు జరుపుతోంది. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి రాష్ట్రమంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా చేరడం, ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీనితో వరంగల్ లోక్‌సభ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు నాలుగు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిపై దృష్టిని కేంద్రీకరించింది. బలమైన అభ్యర్థిని ముందుగానే ప్రకటించి, క్షేత్రస్థాయి నుంచి వెంటనే పని ప్రారంభించాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిత్వంపై టీపీసీసీ ఎక్కువ సానుకూలంగా ఉంది. అలాగే మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకులంతా అధికారంలో ఉన్న టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల్లో విశ్వాసం కల్పించేవిధంగా కార్యక్రమాలు, పర్యటనలను చేపట్టాలని స్థూలంగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఏడాదికాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు రంగాల్లో వైఫల్యం చెందిందని, ప్రజల్లో సెంటిమెంటు కూడా తగ్గిందనే అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది. పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరినా ప్రజల్లో విస్తృత ప్రచారంతో ఉప ఎన్నికల్లో గెలుస్తామని అంచనా వేస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థి ఎంపిక పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోం ది. కాగా, ఆర్థికంగా బలమైన మూలాలున్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ జి.వివేక్ పేరును కొందరు కాంగ్రెస్ ముఖ్యులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా ఎంపిక చేస్తే సానుభూతి పనిచేస్తుందని మరికొందరు నేతలు వాదిస్తున్నారు. ఎన్నికల కోణంలో రాహుల్ టూర్ వరంగల్ జిల్లాలో పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నా గ్రామ, మండల స్థాయి నాయకత్వం టీఆర్ఎస్లోకి భారీగా వలసపోయింది. ఈ నేపథ్యంలో తగిన వ్యూహం రచించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనను కూడా ఎన్నికల కోణంలో నిర్వహించాలని టీపీపీసీ భావిస్తోంది. వరంగల్ లోక్‌సభ సీటు పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ బలం నామమాత్రమై పోయిన ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్తో ముఖాముఖి పోటీ మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. -
పార్టీలోనే ఉంటాను కానీ పోటీ చేయను!
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఉప ఎన్నికను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. అందులోభాగంగా పార్టీ సీనియర్లు పలువురు నేతలను సంప్రదిస్తున్నారు. అ క్రమంలో ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ జి. వివేక్‌ను సంప్రదించారు. అయితే పార్టీలోనే ఉంటాను కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ కేంద్ర మంత్రి ఎస్ రాజయ్యను ఈ ఉప ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్ నేతలు యోచనలో ఉన్నట్లు తెలిసింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... కడియం శ్రీహరిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించారు. దాంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలనే కాదు వరంగల్ లోక్‌సభను కూడా కైవసం చేసుకుంటామనే ధీమాతో కేసీఆర్ సర్కార్ ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన జి.వివేక్... టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.