
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం'
హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ అధిక్యంతో విజయం సాధించడంపై తెలంగాణ ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్లో స్పందించారు. వరంగల్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గొప్ప విజయాన్ని కట్టబెడుతున్నారని అన్నారు. ఈ విజయాన్ని అందించిన వరంగల్ ప్రజలను కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రెఫరెండం అని చెప్పి మరీ ఈ ఎన్నికల్లో తలపడ్డామన్నారు. మా పనితీరుకు మీ తీర్పు నిదర్శనమన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఓడిపోతుంటే... తాము మాత్రం గెలుస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే మా పనితీరుకు నిదర్శనమని తెలిపారు. భవిష్యత్లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కళ్లు తెరిచి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిదని కేసీఆర్.. ప్రతిపక్షాలకు సూచించారు.