హైదరాబాద్ : వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి... వామపక్షాలు, వైఎస్ఆర్ సీపీతోపాటు పలు జేఏసీలకు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్లో ఉత్తమ్కుమార్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాడాలని ఆ పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు ఆ క్రమంలో పోరాడేందుకు తమ వెంట కలసి రావాలని సదరు పార్టీలను ఆయన సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై సీబీఐ విచారణ సీరియస్గా జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు.