
'లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది'
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు. అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాజయ్యకు ఉత్తమ్కుమార్ రెడ్డి బీఫాం అందజేశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. దీంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నియంతృత్వ పాలనలో పాలనలో ప్రజల హక్కులను కూడా హరించి వేస్తోందని ఉత్తమ్ ఆందోళన చెందారు. సోమవారం సి. రాజయ్య నామినేషన్ వేయనున్నారు.