బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్‌ | TPCC Chief Uttam Kumar Reddy Responds On Union Budget 2021 | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధించడం దారుణం

Published Mon, Feb 1 2021 2:55 PM | Last Updated on Mon, Feb 1 2021 2:58 PM

TPCC Chief Uttam Kumar Reddy Responds On Union Budget 2021 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆయుష్మాన్ భారత్  కింద ఇచ్చిన 10 వేల కోట్లు 29 రాష్ట్రాలకు ఏ మాత్రం సరిపోవన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధించడం దారుణమన్నారు.(చదవండి: బడ్జెట్‌ 2021: మరింత మండిపోనున్న ఇంధనం

రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న నినాదం పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విస్తరణలో హైదరాబాద్‌కు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లక్షల కోట్ల ప్రజల ఆస్తులను అమ్మేసే ప్రణాళిక రచించడం దారుణమన్నారు. హైదరాబాద్‌-విజయవాడ బుల్లెట్ ట్రైన్ కేటాయించాలన్నారు.కరోనా పేరుతో ఎంపీల నిధులు కట్ చేశారని, సెంట్రల్ విస్టాకు నిధులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.(చదవండి: ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement