సాక్షి, న్యూఢిల్లీ: ఆహారం, ఇంధనం, ఎరువులపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు సుమారు రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 బడ్జెట్ అంచనాల్లో రూ.2,27,793.89 కోట్లుగా ఉన్న సబ్సిడీ.. సవరించిన అంచనాల ప్రకారం రూ.5,95,620.23 కోట్లకు పెరిగింది. గతేడాది ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం.. కోవిడ్, లాక్‌డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితులతో అంచనాలు తలకిందులయ్యాయి. 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల సబ్సిడీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. అయితే, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గానూ సబ్సిడీ బిల్లును రూ.3,36,439.03 కోట్లుగా అంచనా వేశారు.
ఇక ఆహార ధాన్యాలపై సబ్సిడీ రూ.1,15,569.68 కోట్ల నుంచి రూ.4,22,618.14 కోట్లకు పెరిగింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.2,42,836 కోట్లుగా అంచనా వేశారు. ఎరువులపై సబ్సిడీ రూ.71,309 కోట్ల నుంచి రూ.1,33,947.3 కోట్లకు చేరగా.. 2021–22లో రూ.79,529.68 కోట్లుగా అంచనా వేశారు. పెట్రోలియం ఉత్పత్తులు(ఎల్పీజీ, కిరోసిన్) మీద సబ్సిడీని రూ.40,915.21 కోట్లుగా అంచనా వేయగా.. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.39,054.79 కోట్లయ్యింది. 2021–22లో పెట్రోలియం సబ్సిడీ కింద రూ.14,073.35 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment