fuel
-
కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం బంద్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చిచెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకొనేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణ(Pollution control)పై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.కాలం చెల్లిన వాహనాల(old vehicles)కు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు. గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు.ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజారవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఆటోమొబైల్‌కు ఇంధనం కావాలి
అమ్మకాల వృద్ధి బలహీనతను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగంలో జోష్ నింపేందుకు బడ్జెట్లో పలు రకాల ప్రోత్సాహక చర్యలకు చోటు కల్పించాలని పరిశ్రమ గట్టిగా డిమాండ్ చేస్తోంది. 2025 బడ్జెట్‌పై ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో అంచనాలతో ఉంది. వినియోగదారుల చేతుల్లో ఆదాయం మిగులు దిశగా చర్యలు చేపట్టాలని, ఇది వాహన విక్రయాల వృద్ధికి ఊతం ఇస్తుందని భావిస్తున్నాయి.ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుండడంతో చార్జింగ్ వసతులు సహా, ఈవీ ఎకోసిస్టమ్ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అదే సమయంలో పర్యావరణ అనుకూల గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు విధానపరమైన మద్దతు అవసరమని పేర్కొన్నాయి. ⇒ పాత వాహనాల తుక్కు విధానానికి బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల కొత్త తరం వాహనాల డిమాండ్ పెరుగుతుంది. ⇒ ఈవీల తయారీకి ప్రోత్సాహకాల పరంగా బలమైన మద్దతు అవసరం. కేవలం వినియోగదారులకే కాకుండా, పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరించే వ్యాపార సంస్థలకూ ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ⇒ ఆవిష్కరణలకు, టెక్నాలజీకి ఊతమిచ్చేలా పీఎల్ఐ పథకాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. ⇒ఈవీ కొనుగోలు, ఈవీ సదుపాయాలకు సంబంధించి రుణాలపై అధిక వడ్డీ రేట్లు సవాలుగా మారాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావాలి. రుణ వితరణ పరిస్థితులను సులభతరంగా మార్చాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, సురక్షిత రహదారుల కోసం బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్పూర్తిస్థాయి గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఫలితాన్నిచ్చే విధానాలను ప్రభుత్వం తీసుకురావాలి. దీనివల్ల ఒకటికి మించిన మొబిలిటీ పరిష్కారాలను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావచ్చు. – విక్రమ్ గులాటీ, టయోటా కిర్లోస్కర్ మోటార్ కంట్రీ హెడ్భిన్నమైన ఆటోమోటివ్ టెక్నాలజీలకు సానుకూలమైన పన్నుల విధానంపై దీర్ఘకాలిక దృష్టి అవసరం. వివిధ రకాల వాహనాలకు, విడి భాగాలకు సులభతర జీఎస్టీ రేట్లను ప్రకటించాలి. ఉత్పత్తుల అభివృద్ధికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇందుకు గణనీయమైన పెట్టుబడులు అవసరం అవుతాయి. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – పియూష్ ఆరోరా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సీఈవోవినియోగదారుల వ్యయాలను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే, ఈవీల వినియోగాన్ని పెంచేందుకు తగిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమ అవసరాలను తీర్చే దిశగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు పెట్టాలి. – జ్యోతి మల్హోత్రా, వోల్వో కార్ ఇండియా ఎండీ -
ఏఎమ్ గ్రీన్‌తో డీపీ వరల్డ్ భాగస్వామ్యం
గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేస్తున్న ఏఎమ్ గ్రీన్(AM Green) సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. గ్రీన్ ఇంధనాలు, రసాయనాల కోసం స్థిరమైన సరఫరా అందించేందుకు డీపీ వరల్డ్(DP World)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంతో డీకార్బనైజేషన్‌కు ప్రయత్నాలు జరుగుతాయని కంపెనీ తెలిపింది.ఇటీవల కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలు తాజాగా భాగస్వామ్య పత్రాలపై సంతకాలు చేశాయి. ఏఎమ్ గ్రీన్, డీపీ వరల్డ్ సంయుక్తంగా ఈ పరిశ్రమలో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నాయి. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల(MTPA) గ్రీన్ అమ్మోనియా, 1 ఎంటీపీఏ గ్రీన్ మిథనాల్‌ను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. జీరో-కార్బన్ ఉద్గారాల కోసం యూరోపియన్ యూనియన్, యూఏఈలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?గ్రీన్ కో గ్రూప్ & ఏఎమ్ గ్రీన్ వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదగాలనే భారతదేశ ఆశయానికి కంపెనీ కట్టుబడి ఉంది. గ్రీన్ మాలిక్యూల్స్‌తో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు. ఈ పరిశ్రమలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి డీపీ వరల్డ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషకరం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, ఇతర సుస్థిర ఇంధనాలను సమర్థవంతంగా ఎగుమతి చేయడానికి తోడ్పడుతుంది’ అన్నారు. డీపీ వరల్డ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ యువరాజ్ నారాయణ్ మాట్లాడుతూ..‘స్వచ్ఛమైన ఇంధనాలు, రసాయన ఉత్పత్తుల ఎగుమతిని సులభతరం చేయడానికి ఏఎమ్ గ్రీన్‌తో భాగస్వామ్యం కీలకం కానుంది’ అన్నారు. -
ప్రపంచాన్ని నడిపించే సరికొత్త ఇంధనం
ఈవీలు కలకాలం నిలుస్తాయా? వీటికంటే మెరుగైన, పర్యావరణ హితమైన వాహనాలు వస్తాయా? చాలామందిని వేధించే ప్రశ్నలివి. ఆ ఇంధనం పెట్రోలు, డీజిళ్ల మాదిరి కాలుష్యాన్ని మిగల్చదు. ఈవీ బ్యాటరీల్లో మాదిరిగా లిథియం వంటి ఖరీదైన, అరుదైన ఖనిజాలు అస్సలు వాడదు. ఏమిటా అద్భుత ఇంధనం? అదే హైడ్రోజన్!మీకు తెలుసా? పెట్రోలు, డీజిల్ ఇంజిన్ల ద్వారా సుమారు 80 శాతం శక్తి వృథా అవుతోందని? లీటర్ పెట్రోలు లేదా డీజిల్ పోసి కారు నడిపితే 20–25 శాతం వరకు మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మిగి లిన 75–80 శాతం ఇంజన్లో ఆహుతి కాని ఇంధనం, వేడి పొగ రూపంలో పొగగొట్టం నుంచి బయటకు వెళ్లిపోతుంది.ఇంజిన్‌లో ఇంధనం మండటం వల్ల పుట్టే వేడి, దానిని చల్లార్చే కూలింగ్ వ్యవస్థ రూపంలో వృ«థా అవుతూంటుంది! విద్యుత్తు బ్యాటరీలు కాలుష్య కారక పొగలు కక్కవు కానీ... వీటి బ్యాటరీల తయారీకి మూడంటే మూడు దేశాల్లో ఉన్న లిథియంపై ఆధారపడాలి. పైగా ఇదే లిథియం మన స్మార్ట్ ఫోన్లతోపాటు ఈ కాలపు ఎలక్ట్రానిక్స్ అన్నింటి బ్యాటరీలకూ కావాలి. విద్యుత్తుతో నడిచే వాహనాలు పర్యావరణానికి మేలు చేసేవే అయినప్పటికీ ఛార్జ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతూండటం, పూర్తిస్థాయిలో రీఛార్జింగ్ నెట్ వర్క్ లేకపోవడం వంటివి వీటి విస్తృత వినియోగానికి అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్, విద్యుత్తుల కంటే మెరుగైన, చౌకైన, సమర్థమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రో జన్ లభ్యత భూమండలం మీద అనంతం. ఒక లీటర్ (మంచి) నీటి నుంచి ఎలక్ట్రోసిస్ చర్య ద్వారా 1.2 లీటర్ల హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చు. గాలి నుంచి కూడా తీసు కోవచ్చు.ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ కారు(పెట్రోలు + విద్యుత్తు) ‘ప్రియస్’ను తయారు చేసిన రికార్డు టయోటాదే. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్ ఫ్యుయెల్ సెల్ (అక్కడికక్కడ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీ లాంటిది) వాహనం ‘మిరాయి’ కూడా టయోటా సృష్టే. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్తు వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాలకే ప్రాధాన్యమిస్తామని టయోటా ఛైర్మన్ అకిడో టయోడా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టినీ హైడ్రోజన్ పైకి మళ్లించింది. విద్యుత్తు వాహనాల వల్ల ఉపాధి కోల్పో తారని ఆందోళన చెందుతున్న కోట్లాదిమంది టెక్నీషిషన్లకు హైడ్రోజన్ ఇంధనం ఆ దుఃస్థితి రానివ్వదు.హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోలు, డీజిళ్ల మాదిరిగా హైడ్రోజన్‌ను నిమిషాల వ్యవధిలో నింపుకోవచ్చు. చల్లటి వాతావరణ మైనా, విపరీతమైన వేడి ఉన్నా వాహనం నడపడంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. భారీ బ్యాటరీల అవసరం ఉండదు. బ్యాటరీ వాహనాల కంటే చాలా ఎక్కువ మైలేజీ వస్తుంది. ఫలితంగా భారీ ట్రక్కుల్లాంటివి దూర ప్రాంతా లకు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. సౌర, పవన వంటి పునరుత్పత్తి ఇంధనాల సాయంతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తే పర్యావరణ కాలుష్యమూ గణనీయంగా తగ్గుతుంది. పెరిగిపోతున్న భూతాపాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశా లన్నీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు హైడ్రోజన్ పని కొస్తుంది. హైడ్రోజన్ ఇంధనంతో ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, దక్షిణ కొరియా చైనా దేశాలు రైళ్లను నడుపుతున్నాయి. కొన్ని దేశాలు ప్రోటో టైపులను రూపొందించి త్వరలో పట్టాలెక్కేంచేందుకు సిద్ధమవుతున్నాయి. రైళ్లకు హైడ్రోజన్ ఇంధనం వాడటం వల్ల ఎలక్ట్రిక్ లైన్లు ఏర్పాటు, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి.ఈ టెక్నాలజీని ఇప్పటికే నాసా అంతరిక్ష ప్రయో గాల్లోనూ విజయవంతంగా పరీక్షించారు. అంటే రోడ్లు, నీటిపై తిరిగే వాహనాలకు మాత్రమే కాకుండా... అంతరిక్ష ప్రయోగాల్లోనూ దీన్ని వాడే అవకాశాలు ఉన్నాయన్న మాట. భవిష్యత్తులో విమానాలు హైడ్రోజన్ ఇంధనంపైనే నడుస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో హైడ్రోజన్ సరుకు రవాణాకు, బ్యాటరీలు వ్యక్తిగత రవాణాకు పరిమిత మవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే... ప్రస్తుతా నికి హైడ్రోజన్ వాహనం ఉత్పత్తి ఖర్చు కొంచెం ఎక్కువే. కానీ... సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా 2030 నాటికి ఈ ఖర్చు సగమవుతుందనీ, ఆ వెంటనే విస్తృత వినియోగమూ పెరుగుతుందనీ హైడ్రోజన్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. హైడ్రోజన్ బాటన ప్రపంచం గత ఏడాది ప్రపంచ హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అమ్మకాలు 30 శాతం వరకూ పెరిగాయి. ఈ రంగం విలువ 2022 నాటికే రూ. 1.08 లక్షల కోట్లకు చేరుకోగా 2030 నాటికి రూ. 3.32 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే కొరియా, జపాన్‌లతో పాటు యూరోపియన్ యూని యన్ కూడా హైడ్రోజన్ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలు బంకుల మాదిరిగానే హైడ్రో జన్ బంకుల్లాంటివి వందల సంఖ్యలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొరియాలో 2040 నాటికి 1,200 బంకుల ఏర్పాటుకు ప్రయత్నిస్తూండగా జపాన్ 2030 నాటికే ఎనిమిది లక్షల వాహనాలు, 900 రీఫ్యుయలింగ్ స్టేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. యూరోపియన్ యూని యన్ 2050 నాటికల్లా ఐదు లక్షల హైడ్రోజన్ ట్రక్కులు ఉత్పత్తి చేసే దిశగా అడుగులేస్తోంది. ఆ యా దేశాల ప్రభు త్వాలే కాకుండా... ప్రైవేట్ రంగం కూడా చురుకుగా హైడ్రోజన్ మార్కెట్లోకి ప్రవేశిస్తూండటం గమనార్హం. టయో టాతో పాటు హ్యుండయ్, హోండా, బీఎండబ్ల్యూ, మెర్సి డిస్, ఫోర్డ్ వంటి దిగ్గజ వాహన కంపెనీలు కూడా హైడ్రోజన్ టెక్నాలజీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న కారణంగా ఇంకొన్నేళ్లలోనే ఈ ఇంధనం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందని అంచనా. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గ్రీన్‌ఫ్యూయల్ కొనుగోలు పూర్తి: లుమాక్స్
ముంబై: గ్రీన్‌ఫ్యూయల్ ఎనర్జీ సొల్యూషన్స్‌కు చెందిన ప్రత్యామ్నాయ ఇంధన బిజినెస్‌లో 60 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేసినట్లు లుమాక్స్ రిసోర్స్ వెల్లడించింది. ఇందుకు రూ. 153 కోట్లకుపైగా వెచ్చించింది. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమీకరించినట్లు కంపెనీ వెల్లడించింది.ఆటోమోటివ్ సిస్టమ్స్, విడిభాగాల తయారీ దిగ్గజం లుమాక్స్ ఆటో టెక్నాలజీస్‌కు సొంత అనుబంధ కంపెనీ లుమాక్స్ రిసోర్స్. తాజా ఈ కొనుగోలు ద్వారా లుమాక్స్ ఆటో టెక్నాలజీస్ సీఎన్జీ, హైడ్రోజన్ తదితర గ్రీన్, ఆల్టర్నేట్ ఇంధన విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటికి పటిష్ట డిమాండ్ కారణంగా రానున్న కాలంలో అత్యుత్తమ వృద్ధిని అందుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. -
గ్రీన్ హైడ్రోజన్.. కొత్త విజన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల (డెరివెటివ్స్) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించబోతోంది. ఈ మేరకు త్వరలో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ను రూపొందించింది. స్వచ్ఛమైన ఇంధనంగా ప్రాచుర్యంలోకి వచ్చిన గ్రీన్ హైడ్రోజన్‌ను రవాణా (హైడ్రోజన్ సెల్ ఆధారిత వాహనాలు)తోపాటు ఎరువులు, రసాయనాల తయారీ, ఇతర కర్మాగారాల్లో ఇంధనంగా ప్రోత్సహించడం ద్వారా ‘నెట్ జీరో’ఉద్గారాల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంలో భాగంగా..భూతాపాన్ని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న చర్చ చాలాకాలం నుంచి సాగుతోంది. ఈ క్రమంలో శిలాజ ఇంధనాలకు బదులుగా కాలుష్య రహిత ‘గ్రీన్ హైడ్రోజన్’ను ఇంధనంగా వినియోగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో ప్రకటించిన నేషనల్ హైడ్రోజన్ మిషన్‌లో 2030 నాటికి దేశంలో ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ, డెరివేటివ్స్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఉత్పత్తి చేసే గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ ఇంధనాలనే డెరివేటివ్స్‌గా పరిగణిస్తారు.పరికరాలపై 25% పెట్టుబడి రాయితీ!ఎలక్ట్రోలైజర్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు.. ప్రతి మెగావాట్ /1,400 టీపీఏకు గరిష్టంగా రూ.కోటి చొప్పున ఎలక్ట్రోలైజర్ పరికరాలు, ప్లాంట్ వ్యయంలో 25శాతం వరకు రాయితీని అందిస్తారు. కనీసం150 కేటీపీఏ సామర్థ్యముండే హైడ్రోజన్ ప్లాంట్లకే సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లలో వినియోగించే ఎలక్ట్రోలైజర్ పరికరాల తయారీ ప్రాజెక్టులకూ పెట్టుబడి వ్యయంలో 25శాతం వరకు రాయితీ అందిస్తారు. కనీసం 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి 5 ప్లాంట్లకే ఇది వర్తిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా పెట్టుబడి వ్యయంలో 25శాతం రాయితీ అందిస్తారు. తొలి 10 యూనిట్లకు మాత్రమే వర్తిస్తుంది. వీటికి అవసరమైన పరికరాల కొనుగోళ్లపై పూర్తి ఎస్జీఎస్టీని రీయింబర్స్ చేస్తారు.‘ఇంటిగ్రేటెడ్’ ప్రాజెక్టులకూ సబ్సిడీలుఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ (బయోజనిక్ కార్బన్ సహా) పరిశ్రమల ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్ సహా) వ్యయంలో 25శాతం వరకు సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తుంది. గ్రీన్ అమోనియా ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.1.85 కోట్లు, గ్రీన్ మిథనాల్ ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.2.25 కోట్లను పెట్టుబడి రాయితీగా ఇస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్ నుంచి విమాన ఇంధనం (ఎస్ఏఎఫ్) తయారు చేసే ప్లాంట్లకూ ఈ రాయితీలు వర్తిస్తాయి.డీసాలినేషన్ ప్లాంట్లకు 20% పెట్టుబడి రాయితీగ్రీన్ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్ తయారీ అవసరమైన డీసాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు 20శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. ప్రతి ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్ల) సామర్థ్యానికిగాను రూ.కోటికి మించకుండా ఈ రాయితీ వర్తిస్తుంది. ఇక గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ఏర్పాటుకు కేంద్రం అందించే ఆర్థిక సాయానికి అదనంగా 25శాతం వరకు (రూ.10 కోట్లకు మించకుండా) రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.ఇతర రాయితీ, ప్రోత్సాహకాలివీ..⇒ గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల ప్రాజెక్టుల స్థలాలకు వ్యవసాయేతర స్థలాలుగా తక్షణమే గుర్తింపు కల్పిస్తారు.⇒ వీటి ఉత్పత్తుల అమ్మకాలపై వసూలు చేసే రాష్ట్ర జీఎస్టీ మొత్తాన్ని ఐదేళ్లపాటు రీయింబర్స్ చేస్తారు.⇒ ప్రాజెక్టులకు ప్రభుత్వమే నీటిసరఫరా సదుపాయాన్ని కల్పిస్తుంది. నీటి చార్జీలపై ఐదేళ్లపాటు 25శాతం రాయితీ ఇస్తారు.⇒ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కొనుగోలు చేసే పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల్లో 50శాతం మేర ఐదేళ్ల పాటు రాయితీ ఇస్తారు. గరిష్టంగా మెగావాట్‌కు రూ.15లక్షల రాయితీ వర్తిస్తుంది.గ్రీన్ హైడ్రోజన్ అంటే..?సౌర, పవన విద్యుత్ వంటి కాలుష్య రహిత, పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టడం ద్వారా.. ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను ‘గ్రీన్ హైడ్రోజన్’ అంటారు. వాహనాలతోపాటు ఎరువులు, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల్లో వాడే కాలుష్య కారక సాంప్రదాయ ఇంధనాలకు బదులుగా.. గ్రీన్ హైడ్రోజన్‌ను వినియోగించాలన్నది లక్ష్యం. తద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, భూతాపం పెరగకుండా చూడటం వంటివి సాధ్యమవుతాయి. -
36.6 శాతం గృహాలు... స్వచ్ఛ ఇంధనానికి దూరం
సాక్షి, అమరావతి: దేశంలో ఇంకా 36.6 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనానికి (గ్యాస్) దూరంగా ఉన్నాయి. పట్టణాల్లో 92.9 శాతం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సగానికిపైగా కుటుంబాలు స్వచ్ఛ ఇంధనానికి నోచుకోలేదని సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే 2022–23 వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 49.3 శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి.మిగతా 50.7 శాతం కుటుంబాలు కట్టెలు, బొగ్గులనే వాడుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కలిపి దేశంలో 63.4శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. మిగతా 36.6 శాతం కట్టెలు, బొగ్గు వంటి వాటిపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏపీలో జాతీయ స్థాయికి మించి గ్రామీణ, పట్టణాల్లో కలిపి 88.0 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయని సర్వే వెల్లడించింది.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 84.1 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, పట్టణాల్లో 96.7 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు కూడా వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే తెలిపింది. స్వచ్ఛ ఇంధనం అంటే.. వంట కోసం ఎల్పీజీ, ఇతర సహజ వాయువులు, గోబర్ గ్యాస్, ఇతర బయోగ్యాస్ విద్యుత్, సోలార్ కుక్కర్ వంటివి వినియోగించడం -
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్!.. కేంద్రమంత్రి
చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సీఎన్జీ వాహనాల ఆవశ్యకతను గురించి వెల్లడించడం వంటివి చేస్తోంది. వాహన తయారీ సంస్థలకు కూడా ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాలను తయారు చేయాలనీ సూచిస్తోంది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. హైడ్రోజన్ ఉత్పత్తిలో కూడా భారత్ అగ్రగామిగా మారుతుందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' అన్నారు.6వ సౌత్ ఏషియన్ జియోసైన్స్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' మాట్లాడుతూ.. నేచురల్ గ్యాస్ పైప్లైన్లలో హైడ్రోజన్ కలపడం, ఎలక్ట్రోలైజర్ బేస్డ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయో-పాత్‌వేలను ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులలో భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. భవిష్యత్‌కు ఇంధనంగా భావించే గ్రీన్ హైడ్రోజన్‌కు మనదేశం కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.భారతదేశంలో రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్స్ ఇంధన వినియోగం జరుగుతోంది. ఇది 2030నాటికి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి రోజూ 67 మిలియన్ల మంది ప్రజలు పెట్రోల్ పంపులను సందర్శిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ సంఖ్య యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల జనాభాకు సమానమని ఆయన అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్‌లో 25 శాతం భారత్ నుంచి వస్తుందని అంచనా. -
రోజుకు 12వేల కొత్త కార్లు
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో భారత్‌లో విద్యుత్, ఇంధనాల వినియోగానికి, కార్లకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. రోజుకు కొత్తగా 12,000 కార్లు రోడ్డెక్కనున్నాయి. 2035 నాటికి ఎయిర్ కండీషనర్ల (ఏసీ) విద్యుత్ వినియోగం మొత్తం మెక్సికోలో విద్యుత్ వినియోగాన్ని మించిపోనుంది. వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో చమురు, గ్యాస్, బొగ్గు, విద్యు త్, పునరుత్పాదక విద్యుత్ మొదలైన అన్ని రూపాల్లోనూ శక్తికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం చమురు వినియోగం, దిగుమతికి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్‌లో చమురుకు డిమాండ్ రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు డిమా ండ్ పెరిగేందుకు భారత్ ప్రధాన కారణంగా ఉంటుందని తెలిపింది. 2023లో అయిదో భారీ ఎకానమీగా ఉన్న భారత్ 2028 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వివరించింది.నివేదికలో మరిన్ని వివరాలు.. → భారత్‌లో జనాభా పరిమాణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దకాలంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇంధనాలకు డిమాండ్ మరింత పెరగనుంది. → 2035 నాటికి ఐరన్, స్టీల్ ఉత్పత్తి 70 శాతం, సిమెంటు ఉత్పత్తి సుమారు 55 శాతం పెరుగుతుంది. ఎయిర్ కండీషనర్ల నిల్వలు 4.5 రెట్లు పెరుగుతాయి. దీంతో ఏసీల కోసం విద్యుత్ డిమాండ్ అనేది వార్షికంగా యావత్ మెక్సికో వినియోగించే విద్యుత్ పరిమాణాన్ని మించిపోతుంది. → ఆయిల్ డిమాండ్ రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) నుండి 7.1 మిలియన్ బీపీడీకి చేరుతుంది. రిఫైనరీల సామర్థ్యం 58 లక్షల బీపీడీ నుండి 71 లక్షల బీపీడీకి పెరుగుతుంది. సహజవాయువుకు డిమాండ్ 64 బిలియన్ ఘనపు మీటర్ల (బీసీఎం) నుంచి 2050 నాటికి 172 బీసీఎంకి చేరుతుంది. బొగ్గు ఉత్పత్తి సైతం అప్పటికి 645 మిలియన్ టన్నుల నుంచి 721 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. → భారత్‌లో మొత్తం శక్తి వినియోగం 2035 నాటికి సుమారు 35 శాతం మేర పెరగనుండగా, విద్యుదుత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 1,400 గిగావాట్లకు చేరనుంది. → సౌర విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి దానికన్నా 30 శాతం అధికంగా ఉండనుంది. సోలార్ ఇన్స్టాలేషన్ల సామర్థ్యం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తోంది. 40 శాతం అవసరాలను తీరుస్తోంది. → రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి, ఇంధనాలకు సంబంధించి భారత్ పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. వంటకోసం పర్యావరణహితమైన ఇంధనాన్ని సమకూర్చాలి. విద్యుత్ రంగం విశ్వసనీయతను పెంచాలి. వాయు కాలుష్య స్థాయిని నియంత్రించాలి. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వడగాలులు, వరదల్లాంటి ప్రభావాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలి. → భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2030 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుతుంది. (ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టొచ్చు). పరిశ్రమల్లో విద్యుత్, హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గుకు కూడా డిమాండ్ 2030 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. → 2, 3 వీలర్లకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి కాగా, ప్యాసింజర్ కార్ల మార్కెట్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. → వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లో కొత్తగా 3.7 కోట్ల పైచిలుకు కార్లు, 7.5 కోట్ల పైగా 2,3 వీలర్లు రోడ్లపైకి రానున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా పెరుగుతున్నప్పటికీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలూ వృద్ధి చెందుతాయి కనుక రహదారి రవాణా విభాగం విషయంలో చమురుకు డిమాండ్ 40 శాతం పెరుగుతుంది. దేశీయంగా ప్రతి రోజూ 12,000 కార్లు రోడ్లపైకి రానుండటంతో రహదార్లపరంగా మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వాహనాల వల్ల వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. 2035 నాటికి రోడ్ మార్గంలో ప్రయాణికుల రవాణా రద్దీ వల్ల కర్బన ఉద్గారాలు 30 శాతం పెరుగుతాయి. -
భారత ఆర్థిక వ్యవస్థకు ఇదే కీలకం: నితిన్ గడ్కరీ
పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని, ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాల వినియోగానికి సంబంధించి కూడా మాట్లాడారు.ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని (12 శాతానికి), దీని గురించి రాష్ట్ర ఆర్థికమంత్రులు యోచించాలని గడ్కరీ అన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, జీవ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మద్దతు అవసరమని అన్నారు.ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనంతో లేదా మిశ్రమంతో నడుస్తుంది. అంటే పెట్రోల్ & ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం అన్నమాట. ఇది పెట్రోల్ దిగుమతులను తగ్గిస్తుంది. తద్వారా దేశ ఆర్తిగా పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.ప్రతి సంవత్సరం భారతదేశం సుమారు రూ. 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుంటోంది. శిలాజ ఇంధనాల వల్ల వాయుకాలుష్యం పెరగడమే కాకుండా.. ఆర్ధిక పరిస్థిని కూడా కొంత దిగజార్చుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీనివైపే అడుగులు వేయాలని గడ్కరీ సూచించారు. దేశంలో జీవ ఇంధనం పుష్కలంగా ఉంది. దీనిని ప్రోత్సహిస్తే.. ఇది వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ రంగం కీలకంభారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ పరిశ్రమ ఒక ముఖ్యమైన విభాగం. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ జీఎస్టీ లభిస్తుంది. అంతే కాకుండా ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో 4.5 కోట్ల కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ నెంబర్ ప్లేట్స్ కావాలా.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?హీరో, బజాజ్ వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారత్‌లో తయారు చేసే బైక్‌లలో 50 శాతం ఎగుమతి చేస్తున్నాయని గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కోసం మనం మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. ఎగుమతులు 10 నుండి 20 శాతం వరకు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కాలుష్యం కారకాలను విడనాడటానికి సిద్ధంగా ఉన్నయని ఆయన అన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరుదైన విమానం
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం(ఆగస్టు29) అర్ధరాత్రి అరుదైన విమానం ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానం సైజు భారీగా ఉండటంతో దీనిని వేల్ ఆఫ్ ది స్కైగా పిలుస్తారు. ఇది ఎయిర్‌బస్‌కు చెందిన A300-608ST బెలుగా రకం విమానం.ఇంధనం నింపుకోవడంతో పాటు సిబ్బంది విశ్రాంతి కోసం బెలుగా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తుండగా మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ లోహవిహంగం వాలింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు చెప్పారు. -
ఆవిరి శక్తితో..ఆకాశ యాత్ర
పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్: జేమ్స్‌వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం చరిత్ర గతిని మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవానికి దారి తీసింది. అదే ఆవిరి శక్తిని ఇంధనంగా వినియోగించుకుంటూ ఎయిర్ ట్యాక్సీలు సిద్ధమవుతున్నాయి. ఉబర్.. ఓలా.. రాపిడో తరహాలో ఎయిర్ ట్యాక్సీలు ఆకాశయానంతో సందడి చేసే రోజు దగ్గర్లోనే ఉందని ఏవియేషన్ సంస్థలు నమ్మకంగా చెబుతున్నాయి. తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో తయారైన ఎయిర్ ట్యాక్సీ కాలిఫోరి్నయా మీదుగా రికార్డు స్థాయిలో 561 మైళ్లు (902 కి.మీ.) విజయవంతంగా ప్రయాణించింది.ఆరిజోనాలోని ఎర్రరాతి శిలలతో కూడుకున్న విశాలమైన లోయ ప్రాంతం గ్రాండ్ కాన్యాన్‌తో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. జోబి ఏవియేషన్ కంపెనీలో పురుడు పోసుకున్న ఈ ఫ్లైయింగ్ కార్ పూర్తిగా హైడ్రోజన్‌తో నడుస్తుంది. నీటి ఆవిరి మినహా ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయకపోవడం దీని ప్రత్యేకత. ‘‘శాన్ ఫ్రాన్సిస్కో నుంచి శాండియాగో, బోస్టన్, బాలి్టమోర్ లేదా నాష్విల్లే నుంచి న్యూఓర్లాన్స్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణం చేయటాన్ని ఊహించుకోండి.నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లని ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించే రోజు చాలా దగ్గర్లోనే ఉంది’’అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జో బెన్ బెవిర్ట్ వెల్లడించారు. అమెరికా సైనిక విభాగం ఈ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగానికి పాక్షికంగా నిధులు సమకూర్చడం విశేషం. ఎంత మంది? జోబి ఏవియేషన్ తయారు చేసిన ఎయిర్ ట్యాక్సీకి ఆరు ప్రొఫెల్లర్లు ఉంటాయి. హెలికాఫ్టర్ తరహాలో గాల్లోకి ఎగిరేందుకు, కిందకు దిగేందుకు ఇవి తోడ్పడతాయి. టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన తరువాత ప్రొఫెల్లర్లు నిట్ట నిలువు నుంచి బల్లపరుపుగా మారతాయి. రెక్కలున్న సంప్రదాయ ఎయిర్ క్రాఫ్ట్ తరహాలో ఎయిర్ ట్యాక్సీ ఆకాశంలో ఎగిరేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు.ఏమిటి దీని ప్రత్యేకత? ఎయిర్ ట్యాక్సీ అనేది కొత్త ఆవిష్కరణ కాకపోయినా జోబీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రొఫెల్లర్లకు సమకూర్చిన ఇంధనం మాత్రం కొత్త ప్రయోగమే. 40,000 కి.మీ. తిరిగిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి దీన్ని తయారు చేశారు. పాత ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాటరీల స్థానంలో 40 కిలోల ద్రవ హైడ్రోజన్ సామర్థ్యం కలిగిన ఇంధన సెల్స్‌ను అమర్చారు. ట్యాక్సీకి అవసరమైన విద్యుత్తు, ఉష్ణోగ్రత, నీటి ఆవిరిని ఇవి అందిస్తాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో అదనపు శక్తి అందించేందుకు కొన్ని బ్యాటరీలు ఉంటాయి.బ్యాటరీ ట్యాక్సీల కంటే మెరుగైన సామర్థ్యం గతంలో రూపొందించిన బ్యాటరీలతో పనిచేసే ఎయిర్ ట్యాక్సీలు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 – 150 మైళ్లు (160 – 240 కి.మీ.) ప్రయాణించాయి. హైడ్రోజన్‌తో నడిచే ఎయిర్ ట్యాక్సీలో మాత్రం ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లవచ్చని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా 561 మైళ్లు నడిపి చూశారు. లండన్ నుంచి ప్యారిస్, జ్యూరిచ్, ఎడిన్బర్గ్ ఆగాల్సిన అవసరం లేకుండా వెళ్లవచ్చు. ఎయిర్ ట్యాక్సీల నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా వివిధ నగరాలకు వెళ్లవచ్చని చెబుతున్నారు. హైడ్రోజన్ మోడల్ ఎయిర్ ట్యాక్సీలు కచి్చతంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఆయన వెల్లడించలేదు.పోటాపోటీ..ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ వినియోగంలో వచి్చన ఆధునిక మార్పులు ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి. ఎలక్ట్రిక్ క్యాబ్‌లపై విస్తృత పరిశోధనలు నిర్వహించిన ఏవియేషన్ స్టార్టప్‌లు జీ ఏరో, కిట్టీ హాక్‌లపై గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో లారీ పేజ్ లక్షల డాలర్ల నిధులను వెచి్చంచారు. ఎయిర్ స్పేస్ ఎక్స్ లాంటి పలు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.తమ ప్రయాణికులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కలి్పస్తామంటూ ఊరిస్తోంది. వైద్య అవసరాల కోసం అత్యవసరంగా తరలించేందుకు కూడా సేవలందిస్తామంటోంది. ఇక క్యాబ్ సేవల సంస్థ ఉబర్ కూడా దీనిపై దృష్టి సారించింది. 2018 జనవరిలో నిర్వహించిన ఓ సాంకేతిక సదస్సులో ఉబర్ సీఈవో డారా ఖొస్రోవ్‌షాహి ఈమేరకు ఓ ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో ఇవి సాకారం కానున్నట్లు అప్పట్లోనే చెప్పారు. దుబాయ్‌లో బీచ్ విహారం.. తమ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ నుంచి 3 – 5 దశల ధ్రువీకరణ పూర్తి చేసుకున్నట్లు జోబీ చెప్పారు. దుబాయ్ నుంచి వీటి సేవలు ప్రారంభం కానున్నట్లు గతంలోనే జోబీ ఏవియేషన్ కంపెనీ ప్రకటించింది. ఈమేరకు దుబాయ్ రోడ్డు రవాణా సంస్థతో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వీటి ద్వారా దుబాయ్ విమానాశ్రయం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం, కృత్రిమ దీవుల సముదాయం పామ్ జుమేరా బీచ్‌కు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు.బ్యాటరీతో నడిచే ఎయిర్ ట్యాక్సీ పరీక్షలు విజయవంతం కావడంతో హైడ్రోజన్ మోడల్ కూడా సత్ఫలితాలనిస్తుందని కంపెనీ గట్టి నమ్మకంతో ఉంది. అయితే ఈ రెండు మోడళ్ల ధరలు ఎంత ఉంటాయనే విషయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. వాణిజ్యపరంగానూ వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఎయిర్ ట్యాక్సీల వాడకం 2028 నాటికి సాధారణంగా మారుతుందని, పైలెట్ల అవసరం లేకుండా ఎగిరే ట్యాక్సీలు 2030 నాటికి అందుబాటులోకి వస్తాయని బ్రిటన్ భావిస్తోంది. -
ఇంధనం సంరక్షణకు ‘పాట్’ పడుతున్న ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, సమర్ధవంతంగా ఇంధన వ్యయాన్ని తగ్గించడం, కర్భన ఉద్గారాలను కట్టడి చేయడం వంటి లక్ష్యాలను సాదించడంలో భాగంగా, పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం ద్వారా భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది. పాట్ సైకిల్–3 వరకు 1.16 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనాన్ని రాష్ట్రం ఆదా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ పాలసీని కూడా రూపొందించింది. ఈ పాలసీ వల్ల ఏటా 16,875 మిలియన్ యూనిట్లు (మొత్తం డిమాండ్‌లో 25.6 శాతం) ఆదా అవుతుందని, వాటి విలువ రూ.11,779 కోట్లుకు పైగానే ఉంటుందని అంచనా. తద్వారా దాదాపు 14.34 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది. ప్రయోజనాలు ఎన్నో.. ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పాట్’ పథకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. నూతన ఇంధన సామర్ధ్య సాంకేతికత సహాయంతో తక్కువ విద్యుత్‌తో ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తి సాధించడంపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కలి్పస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను సమకూరుస్తోంది. రాష్ట్రంలో 65 ఎంఎస్ఎంఈల్లో వీటిని అమర్చింది.ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందించడం ద్వారా ఇంధన ఆదాకు దోహదపడుతున్నాయి. దీంతో సరిపెట్టకుండా పాట్ పథకం కింద లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సరి్టఫికెట్లను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 4 లక్షలకు పైగా సర్టిఫికెట్లను అందించింది. వీటిని మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆయా పరిశ్రమలు ఆరి్థక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. మరోవైపు పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది.ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ 2030 నాటికి దేశ వ్యాప్తంగా 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలని, 2070 నాటికి వాటిని అసలు లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనలో ఏపీ చురుకైన పాత్ర పోషిస్తోంది. 65 సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఐఓటీ ఆధారిత ఎనర్జీ ఎఫిషియన్సీ డెమోన్‌్రస్టేషన్ ప్రాజెక్టుల అమలు, న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఇంధన సామర్థ్య చర్యలు, పెర్ఫార్మ్, అచీవ్ – ట్రేడ్ (పాట్)లో పథకంలో 1.160 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధన పొదుపు, స్థానిక సంస్థల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు వంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఏపీకి గుర్తింపుతెచ్చాయి. -
సీఎన్జీ బైక్‌పై బజాజ్ ఆటో కసరత్తు
పుణే: పర్యావరణ అనుకూల సీఎన్జీ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్ల తయారీపై ద్విచక్ర వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. జూన్ కల్లా ఈ బైకు మార్కెట్లోకి రాగలదని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. మైలేజీని కోరుకునే కస్టమర్ల కోసం రూపొందిస్తున్న ఈ వాహనాన్ని వేరే బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలపై (సీఎస్ఆర్) రూ. 5,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. పెట్రోల్‌తో నడిచే మోటర్‌సైకిళ్లతో పోలిస్తే దీని ధర కొంత అధికంగా ఉండవచ్చని అంచనా. కస్టమర్ల సౌకర్యార్ధం పెట్రోల్, సీఎన్జీ ఇంధనాల ఆప్షన్లు ఉండేలా ట్యాంకును ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండటం వల్ల తయారీ కోసం మరింత ఎక్కువగా వెచి్చంచాల్సి రానుండటమే ఇందుకు కారణం. గ్రూప్‌నకు చెందిన అన్ని సీఎస్ఆర్, సేవా కార్యక్రమాలను ’బజాజ్ బియాండ్’ పేరిట సంస్థ నిర్వహించనుంది. దీని కింద ప్రధానంగా నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడంపై దృష్టి పెట్టనుంది. -
రేసింగ్‌కు ప్రత్యేక ఇంధనం.. అంతర్జాతీయ ఈవెంట్లలో ఇండియన్ ఫ్యుయల్
దేశంలో రేసింగ్ కోసం ప్రత్యేక ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ తయారు చేసింది. ఎఫ్ఐఎం ఆసియా రోడ్ రేసింగ్ ఛాంపియన్షిప్ (ARRC) 2024 సీజన్ కోసం స్టోర్మ్ (STORM) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక రేసింగ్ ఇంధనాన్ని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారు. రేసింగ్ సర్క్యూట్‌లోని ప్రీమియం సూపర్‌బైక్‌ల కోసం ఈ హై-ఆక్టేన్ అల్టిమేట్ రేసింగ్ ఫ్యూయల్‌ను ఇండియన్ఆయిల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేసింగ్ ఈవెంట్లలో ఛాంపియన్లకు ఇది ఇంధనంగా నిలుస్తుంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్, ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య, డైరెక్టర్ (మార్కెటింగ్) సతీష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ మొదటిసారిగా గుజరాత్ రిఫైనరీ నుంచి స్టోర్మ్ పేరుతో కేటగిరీ 2 రేస్ ఇంధనం ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు. ఈ రేస్ ఇంధనం, ఏవీ గ్యాస్ 100 LL, రిఫరెన్స్ ఫ్యూయెల్స్ మొదలైనవాటితో పాటు కఠినమైన అంతర్జాతీయ స్పెసిఫికేషన్లకు కట్టుబడి స్వీయ-సమృద్ధి దిశగా భారత్ ప్రయత్నానికి అనుగుణంగా ఉంటుందన్నారు. పూర్తిగా భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్న ‘స్టోర్మ్’ ఇంధన ఆవిష్కరణ.. స్వావలంబన స్ఫూర్తికి, 'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌కు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇండియన్ ఆయిల్ ఇప్పటికే XP100, XP95 వంటి అధిక-ఆక్టేన్ ఇంధనాలను, అలాగే రిఫరెన్స్ గ్యాసోలిన్, డీజిల్ వంటి అధిక ఖచ్చితత్వ సముచిత ఇంధనాలను, ఏవియేషన్ ఇంధనం ఏవీ గ్యాస్ 100 LLలను విక్రయిస్తోంది. -
పెట్రోల్ బంకులకు పోటెత్తిన వాహనదారులు
-
వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే..
విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 4 శాతం తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. వరుసగా మూడో నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా కుదించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్ ధరను రూ.1.50 కట్ చేశారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు ప్రస్తుతం దేశ రాజధానిలో రూ.1,755.50, ముంబైలో రూ.1,708.50 ఉంది. అయితే, గృహాల్లో వినియోగించే ఎల్పీజీ ధర మాత్రం మారలేదు. 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.903 ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 3.9 శాతం తగ్గింపుతో రూ.4,162.5కు చేరింది. జెట్ ఇంధన ధరల్లో నెలవారీ తగ్గింపు ఇది వరుసగా మూడోది. ఏటీఎఫ్ ధర నవంబర్‌లో దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ.6,854.25) డిసెంబర్లో రూ.5,189.25 లేదా 4.6 శాతం తగ్గింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతం ఇంధనానికే ఖర్చవుతోంది. ఫ్యూయెల్ ధర తగ్గింపుతో ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై కొంత భారం తగ్గనుంది. -
విషవాయువుతో ఇంధనం పొడి!
ప్రపంచవ్యాప్తంగా గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించాలని దాదాపు అన్నిదేశాలు చాలా సదస్సుల్లో ఏకవాక్కు చేస్తున్నాయి. కానీ ఆ విషవాయువును తగ్గించడంలో చర్చలపై చూపుతున్న శ్రద్ధ.. ఆశించిన మేర చర్యలపై చూపడంలేదనేది అన్ని దేశాలకు మింగుడుపడని సత్యం. ఈ నేపథ్యంలో కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించడానికి జరుగుతున్న చర్యలతోపాటు వాతావరణం నుంచి దాన్ని వెలికి తీయడానికి ఇంజినీర్లు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ విషవాయువును సైతం వినియోగించుకునే విధంగా వివిధ పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చే సమర్థ విధానాన్ని కనుగొన్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్ను ద్రవ లేదా ఘన పదార్థం రూపంలోకి మారుస్తుంది. దీన్ని హైడ్రోజన్ లేదా మెథనాల్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. ఫ్యూయెల్ కణాలకు శక్తిని అందించటానికి, విద్యుత్తు ఉత్పత్తికి వాడుకోవచ్చు. ప్రయోగశాల స్థాయిలోనే దీన్ని సాధించినప్పటికీ పెద్దఎత్తున అమలు చేయొచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇళ్లకు ఉద్గార రహిత విద్యుత్తు, వేడిని అందించొచ్చని ఆశిస్తున్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్ను 90% వరకు ఇంధనంగా మారుస్తుండటం గమనార్హం. ఇదీ చదవండి: ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండిలా..! ఈ ప్రక్రియలో ముందుగా కార్బన్ డయాక్సైడ్ను మాధ్యమిక రూపంలోకి.. అంటే ద్రవ లోహ బైకార్బోనేట్‌గా మారుస్తారు. అనంతరం అణు, వాయు, సౌర విద్యుత్తు వంటి స్వల్ప కర్బన విద్యుత్తుతో పనిచేసే ఎలక్ట్రోలైజర్లో విద్యుత్‌రసాయన పద్ధతిలో ద్రవ పొటాషియం లేదా సోడియం ఫార్మేట్గా మారుస్తారు. దీన్ని ఎండబెట్టి ఘన పొడిగా చేస్తారు. దాంతో ఇది స్థిరంగా ఉంటుంది. చాలాకాలం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని ఇళ్ల నుంచి పరిశ్రమల అవసరాల వరకూ ఇంధనంగా వాడుకోవచ్చని ఇంజినీర్లు వివరించారు. -
గాజాలో ఆగని వేట
గాజా స్ట్రిప్/జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది. ఖాన్ యూనిస్, రఫా, డెయిర్ అల్–బలా నగరాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని గాజీ సిటీలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టినట్లు తెలిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. గాజాలో హమాస్‌ను అధికారం నుంచి కూలదోయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై దృష్టి పెట్టింది. గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. మరో ఐదుగురు బందీల విడుదల ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే. గాజా రక్షణ బాధ్యత మాదే: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్ రక్షణ బాధ్యతను నిరవధికంగా ఇజ్రాయెల్ తీసుకుంటుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. తద్వారా గాజా స్ట్రిప్ మొత్తం ఇజ్రాయెల్ నియంత్రణ కిందికి వస్తుందని సంకేతాలిచ్చారు. గాజాను తమఅదీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడారు. గాజాలోకి మానవతా సాయాన్ని చేరవేయడానికి లేదా హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడిపించడానికి వీలుగా మిలిటెంట్లపై యుద్ధానికి స్వల్పంగా విరామం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ! గాజాలోకి పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి. సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. రఫా పట్టణంలో ఇజ్రాయెల్ దాడి తర్వాత స్థానికుల ఆక్రందన -
ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు.. ఇకపై దిగుమతి అక్కర్లేదు!
ఇంధన ఉత్పత్తిలో భారత్ ముందడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని (రెఫరెన్స్ ఫ్యూయల్) ఆవిష్కరించింది. ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. రెఫరెన్స్ ఫ్యూయల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధాపడాల్సిన అవసరం ఉండదు. మనం సాధారణంగా 1,000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోలీటర్లు మాత్రమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి, మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ రెఫరెన్స్ ఫ్యూయల్? రెఫరెన్స్ ఫ్యూయల్ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం. వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమాంకనం చేయడానికి, పరీక్షించడానికి 'రిఫరెన్స్' ఇంధనాలను ఉపయోగిస్తాయి. చాలా డబ్బు ఆదా రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ పారాదీప్ , పానిపట్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న రిఫరెన్స్ ఫ్యూయల్ లీటరు ధర రూ. 800 నుంచి రూ.850 ఉంటోంది. అదే మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల లీటరు దాదాపు రూ. 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. -
సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారిపోతోంది. తాజాగా ఇంధనం లేని కారణంగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) 48 జాతీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇంధనం పరిమితంగా ఉండటం వల్ల విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని విమాన సర్వీసులను రీషెడ్యూల్ కూడా చేశామని పీఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 13 దేశీ, 11 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే 12 విమానాలను షెడ్యూల్ మార్చామని అన్నారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని కోరారు. బుధవారం మరో 16 విమానాలను రద్దు చేశామని, మరోకొన్ని ఆలస్యం కానున్నాయని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ చమురు సంస్థ (PSO) పీఐఏకు ఇంధన సరఫరా నిలిపివేయడంతో ఈ సంక్షోభం తలెత్తినట్లు సమాచారం. దీంతో పీఐఏకు ఇంధన కొరత ఏర్పడింది. మరోవైపు రుణభారం పెరిగిపోతున్న నేపథ్యంలో పీఐఏను ప్రైవేట్ పరం చేసేందుకూ ఆలోచనలు నడుస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు రోజూ వారి ఖర్చుల కోసం రూ. 23 బిలియన్ల పాయం అందించాలని పీఐఏ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇటీవలే కోరింది. కానీ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. PSO నుంచి ఇంధన సరఫరా కోసం రోజుకు రూ.100 మిలియన్లు అవసరమవుతాయి. అడ్వాన్స్ పేమెంట్లు మాత్రమే అని పీఎస్ఓ కొత్తగా డిమాండ్ చేయటంతో పీఐఏ చేతులెత్తేసింది. భవిష్యత్తులో మరిన్ని విమానాల రాకపోకలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో దాయాది పాకిస్థాన్ గత కొంతకాలంగా సతమతమవుతోంది. ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోగా.. ప్రజలు, ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇదీ చదవండి: దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్ -
సిమెంట్‌కు ఇన్ఫ్రా దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్‌కు డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. మౌలిక వసతుల కోసం ప్రభుత్వం చేస్తున్న భారీ వ్యయాలు ఈ వృద్ధికి దోహదం చేస్తాయని వెల్లడించింది. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం.. రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు, నగరాభివృద్ధి, టెలికం, పోర్టులు, విమానాశ్రయాలు, నీరు వంటి మౌలిక వసతులకు 2022–23తో పోలిస్తే రూ.1.6 లక్షల కోట్ల అదనపు బడ్జెట్ కేటాయింపులతో ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.5.9 లక్షల కోట్లకు చేరింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో పటిష్ట ప్రయాణాన్ని కొనసాగిస్తూ సిమెంట్ డిమాండ్ 2023–24లో 10–12 శాతం అధికమై 440 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. సిమెంట్ డిమాండ్ 2022–23లో 12 శాతం, 2021–22లో 8 శాతం ఎగసింది. నిర్వహణ లాభం జూమ్.. స్థిరంగా ఉన్న సిమెంట్ ధరలకుతోడు విద్యుత్, ఇంధన ఖర్చులు కాస్త తగ్గడంతో సిమెంట్ తయారీదారుల నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24లో టన్నుకు రూ.200 పుంజుకునే చాన్స్ ఉంది. మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం చేస్తున్న వ్యయం సిమెంట్ డిమాండ్‌ను నడిపిస్తోంది. సిమెంట్ వార్షిక అమ్మకాల్లో మౌలిక సదుపాయాల వాటా 30 శాతం ఉంది. ప్రధాన మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో 38 శాతం పెరిగాయి. బడ్జెట్ మొత్తంలో చేసిన ఖర్చు 2023 జూలై వరకు 40 శాతంగా ఉంది. సిమెంట్ డిమాండ్‌లో 55 శాతం వాటాను కలిగి ఉన్న గృహ విభాగం స్థిర వృద్ధిని సాధిస్తుందని అంచనా. సరసమైన గృహాలకు ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్దతు డిమాండ్‌ను పెంచుతుంది. రెండంకెల వృద్ధికి.. 2023 ఏప్రిల్–సెప్టెంబర్‌లో సిమెంట్ డిమాండ్ 13–15 శాతంగా ఉంది. అధిక బేస్, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్రం చేయబోయే మూలధన వ్యయం కొంత మందగించవచ్చు. దీంతో ద్వితీయార్థంలో డిమాండ్ 7–9 శాతానికి మధ్యస్థంగా ఉండవచ్చు. అయితే ఆలస్యమైన, అసమాన రుతుపవనాల కారణంగా గ్రామీణ గృహాల డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లే మూడవ త్రైమాసికంలో కార్మికుల పరిమిత లభ్యత కూడా పాత్ర పోషిస్తుంది. బలమైన ప్రథమార్ధం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి దోహదం చేస్తుంది. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు 2023 ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 2.5 శాతం పడిపోయాయి. సిమెంట్ ధరలు ఇటీవల స్వల్పంగా పెరగడంతో అధికం అవుతున్న డిమాండ్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధికి సహాయపడుతుంది. -
దేశానికే ఆదర్శంగా జగనన్న కాలనీల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను దేశానికే రోల్ మోడల్‌గా అమలు చేయనున్నట్లు ఏపీ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ తరఫున సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అనిమేష్ మిశ్రా, నితిన్భట్, సావిత్రిసింగ్, పవన్‌లు అజయ్ జైన్‌ను కలిసినట్లు ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం... హౌసింగ్ ఎండీ లక్ష్మీశా, జేడీ శివప్రసాద్, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ గురించి ఈఈఎస్ఎల్ అధికారులకు వివరించారు. అజయ్ జైన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్దదైన ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుందని తెలి పారు. సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్–జగ నన్న కాలనీల్లోని ఇళ్లకు అత్యంత నాణ్యమైన స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పరికరాలను గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలోనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించనుందని తెలిపారు. ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు, 2 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్డీసీ ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కువకు ఈఈఎస్ఎల్ సహకారంతో సమకూర్చనున్నట్లు చెప్పారు. అయితే ఇది స్వచ్చందమేనని, లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ పరికరాలు తీసుకోవాలని లేదన్నారు. ఈ పరికరాలను వినియో గించడం వల్ల ప్రతి ఇంట్లో ఏటా 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని ఈఈఎస్ ఎల్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారం ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధనం ఆదా అవుతుందని అజయ్ జైన్ వివరించారు. -
మరో వివాదం.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు
ఢిల్లీ: జీ-20 డిన్నర్ మీటింగ్ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాని మోదీని కూడా 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. ఏసియన్-ఇండియా సమ్మిట్, 'ఈస్ట్ ఏసియా సమ్మిట్' లకు ప్రధాని మోదీ బుధవారం, గురువారం వరుసగా హాజరుకావాల్సి ఉండగా.. ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భారత ప్రధానిని 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని పేర్కొనడంతో పేరు మార్పు వివాదం మరింత ముదిరింది. 20వ 'ఏసియన్-ఇండియా సమ్మిట్', 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా' రెండు పదాలను ఒకే ప్రకటనలో విడుదల చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉందో ఈ విషయంతో స్పష్టమవుతోందని వెల్లడించింది. ఇండియా పేరుతో ప్రతిపక్షాలు ఏకమవ్వడంతోనే బీజేపీ నాయకులు ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘The Prime Minister Of Bharat’ pic.twitter.com/lHozUHSoC4 — Sambit Patra (@sambitswaraj) September 5, 2023 అయితే.. జీ-20 డిన్నర్ మీటింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి అధికారిక ఆహ్వానాన్ని పంపారు అధికారులు. ఇందులో సాంప్రదాయంగా ఉపయోగించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులు ప్రిసెడెంట్ ఆఫ్ భారత్ అని సంభోదించారు. దీంతో ఇండియా పేరును రానున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వచ్చాయి. బీజేపీని ఓడించడానికి దేశంలో ప్రధానంగా 28 ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. విపక్ష కూటమి పేరు ఇండియా ఉండటం బీజేపీకి నచ్చనందునే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అటు.. తమ కూటమి పేరును త్వరలో భారత్‌గా నామకరణం చేస్తామని కూడా పలువురు నాయకులు చెప్పారు. Look at how confused the Modi government is! The Prime Minister of Bharat at the 20th ASEAN-India summit. All this drama just because the Opposition got together and called itself INDIA 🤦🏾♂️ pic.twitter.com/AbT1Ax8wrO — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును భారత్‌గా పిలవడం స్వాగతిస్తున్నామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇది దేశానికి గర్వకారణం అని అన్నారు. అటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు -
అంతరిక్ష యుద్ధంలో చల్లగా చావు దెబ్బ
అంతరిక్ష యుద్ధంలో చైనా నానాటికీ దూసుకుపోతోంది. ఇంధన ఆయుధ పరిజ్ఞానంలో అతి గొప్ప పురోగతి సాధించినట్లు చైనా సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. కనీ వినీ ఎరుగని అత్యాధునిక కూలింగ్ సిస్టం ఒకదాన్ని కనిపెట్టినట్టు చంగ్ షాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత హెచ్చు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్లను పెద్దగా వేడెక్కనేయకుండా, నిరంతరం శక్తివంతంగా, ఎంతటి పెను దాడికైనా నిత్యం సిద్ధంగా ఉంచేందుకు ఈ విధానం దోహదపడుతుందని వర్సిటీ వర్గాలను ఉటంకిస్తూ సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. ఈ విధానం సఫలమైందన్న వార్త నిజమైతే చైనా అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలు అతి శక్తివంతమైన లేజర్ కిరణాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విచ్చలవిడిగా ప్రయోగించగలవు. అప్పుడిక యుద్ధం తీరు తెన్నులే సమూలంగా మారిపోతాయని సంబంధిత వర్గాలు విశ్లేíÙంచాయి. పరిశోధన వివరాలను చైనీస్ జర్నల్ ఆక్టా ఆప్టికా సైనికాలో ప్రచురితమయ్యాయి. వేడే అసలు శత్రువు ఇలాంటి అతి శక్తివంతమైన లేజర్ ఆయుధాలను ప్రయోగించే క్రమంలో భరించలేనంత వేడి ఉద్భవిస్తుంది. ఇది సదరు ఆయుధాలకే తీవ్రంగా నష్టం చేస్తుంది. దీంతో ఆయుధం పాడవకుండా ఉండేందుకు ఆ వేడిని సంపూర్ణంగా తట్టుకునే కూలింగ్ వ్యవస్థను కనిపెట్టినట్టు చైనా చెబుతోంది. లేజర్ ఆయుధాల అభివృద్ధిలో ఇలా వాటిని చల్లబరచడమే అతి పెద్ద సాంకేతిక సవాలు. అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... ఇలాంటి అత్యాధునిక లేజర్ ఆయుధ వ్యవస్థల తయారీలో అమెరికా చాలాకాలంగా ఎంతో ముందుంది. నేవీ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫ్రా రెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రయోగించినప్పుడు అద్భుతాలు చేశాయి. శబ్ద వేగాన్ని మించి దూసుకుపోగల సూపర్ సానిక్ క్షిపణులను సైతం ధ్వంసం చేసి చూపించాయి. అయితే భారీ పరిమాణం, బరువు కారణంగా వాటిని అటకెక్కించారు. పైగా వాటి పరిధి మహా అయితే కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ లేజర్ కాంతి పుంజం విధ్వంసక శక్తిని ఎన్నో రెట్లు పెంచినట్లు లేజర్ కాంతిపుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ బృందం చెబుతోంది. స్పేస్ ఎక్స్ పైకీ ప్రయోగం? కూలింగ్ సిస్టమ్ సాయంతో పనిచేసే ఈ అధునాతన లేజర్ క్షిపణి వ్యవస్థ సంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే చాలా చవకైనది. ఎంతో ప్రభావవంతమైనది కూడా. పైగా దీన్ని రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే స్పేస్ ఎక్స్ తాలూకు స్టార్ లింక్ వంటి ఉపగ్రహ వ్యవస్థల పైకి ఈ లేజర్ ఆయుధాలను ప్రయోగించే యోచనలో చైనా ఉన్నట్టు చెబుతున్నారు. హెచ్ యు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్ ఆయుధాల ప్రయోగం విషయంలో ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు –లేజర్ కాంతి పుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ షెంగ్ ఫు –సాక్షి, నేషనల్ డెస్క్ -
బెలుగా భలేగా.. సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం
శంషాబాద్: సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్దదైన బెలుగా విమానం మరోసారి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వియత్నాం నుంచి ఈజిప్ట్ వెళ్తున్న ఈ విమానంలో ఇంధనం నింపడంతో పాటు పైలట్ల విశ్రాంతి కోసం సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తిరిగి బుధవారం రాత్రి ఇక్కడి నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరింది. గతేడాది డిసెంబర్ 4 రాత్రి దుబాయ్ నుంచి భారీ సరుకుతో థాయ్‌లాండ్‌లోని పటాయా వెళుతూ ఇంధనం, విశ్రాంతి కోసం బెలుగా శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సరుకు రవాణా విమానాల్లో ఈ ఎయిర్‌బస్ బెలుగా విమానం(ఏ300–600 సూపర్ ట్రాన్స్పోర్టర్) ఒకటి. విమాన ఆకారం ఉబ్బెత్తు తలతో ఉండే బెలుగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో.. బెలుగా విమానం పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు, బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కాగా, అతి పెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవ్ ఏఎస్–225 మ్రియా కూడా ఇంధనం, విశ్రాంతి కోసం 2016, మే 13న శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. ప్రస్తుతం మ్రియా లేకపోవడంతో కార్గోలో బెలుగానే అతిపెద్ద విమానంగా గుర్తిస్తున్నారు. -
ఆయిల్ కంపెనీలకు ఇక మీదట లాభాలే.. మరి డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జిస్తాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. గతేడాది ఇవి భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చము రు ధరలు బ్యారెల్‌కు 78.8 డాలర్లకు క్షీణించడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నష్టాలను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోగలవని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ ధరలను ఒకే స్థాయిలో కొసాగిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరించకపోవడంతో అవి నష్టాల పాలయ్యాయి. చమురు ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత నుంచి తిరిగి అవి లాభాలను చూస్తున్నాయి. 5 శాతం పెరగొచ్చు గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం డిమాండ్ 10 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం మేర పెరగొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు మధ్య కాలానికి సైతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 5–6 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. భారత్ జీడీపీ వచ్చే కొన్నేళ్లపాటు 6–7 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచుతూ ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం పెట్రోల్ వినియోగానికి సానుకూలంగా పేర్కొంది. ‘‘స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 2023–24లో మోస్తరు స్థాయికి దిగొస్తాయి. అయినప్పటికీ స్థూల మార్జిన్లు సగటు స్థాయిలకు ఎగువనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. మోస్తరు స్థాయిలో ధరలు చమురు ధరలు 2022–23 గరిష్టాల నుంచి చూసుకుంటే మోస్తరు స్థాయిలో, ఎగువవైపే కొనసాగొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు మంచి నగదు ప్రవాహాలు సమకూరతాయని పేర్కొంది. భారత నూతన గ్యాస్ ధరల విధానం వల్ల ఈ సంస్థలకు నగదు ప్రవాహాల్లో ఉన్న అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థలకు అధిక మూలధన నిధులు అవసరం కొనసాగుతుందని అంచనా వేసింది. దేశ చమురు ఉత్పత్తి 2022–23లో 1.7 శాతం తగ్గినట్టు వివరించింది. ఓఎన్జీసీ ఉత్పత్తి 1 శాతం తగ్గగా, ఆయిల్ ఇండియా ఉత్పత్తి 5 శాతం పెరిగినట్టు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో 2023–24లోనూ చమురు దిగుమతులు అధికంగానే ఉంటాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
2,000 నోట్లను ఇలా వాడేస్తున్నారట!
న్యూఢిల్లీ: కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన తర్వాత ప్రజలకు తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకోడానికి- ఇంధనం, ఆభరణాలు, రోజువారీ కిరాణా వస్తువుల కొనుగోళ్లు మొదటి మూడు ప్రాధాన్యతలుగా ఉన్నట్లు లొకేషన్ బేస్డ్ సోషల్ నెట్వర్క్ పబ్లిక్ యాప్ నిర్వహించిన ఒక దేశవ్యాప్త సర్వే వెల్లడించింది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) 55 శాతం మంది ప్రజలు తమ కరెన్సీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, 23 శాతం మంది వాటిని ఖర్చు చేయడానికి, 22 శాతం మంది మార్చుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సర్వే వెల్లడించింది. మే 19వ తేదీన వ్యవస్థలో ఉన్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ దాదాపు సగం పెద్ద నోట్లు వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ గత వారం పాలసీ సమీక్ష నిర్ణయాల సందర్భంగా తెలిపారు. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఆయన తెలిపిన సమాచారం ప్రకారం 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్లు వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయి. వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయన్నారు. రూ.500 నోట్లు వెనక్కు తీసుకోవాలన్న యోచన లేదని, అలాగే కొత్తగా రూ.1,000 నోట్లు తీసుకుని రాబోమని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయా అంశాలపై 22 రాష్ట్రాల్లో లక్షకుపైగా ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రాతిపదికన తాజాగా వెలువడిన సర్వేలో ముఖ్యాంశాలు ఇవీ... ► తమ నోట్లను మార్చుకునేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారా? అని అడిగినప్పుడు 61 శాతం మంది ఈ ప్రక్రియలో తమకు ఎటు వంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. మా ర్పిడి పక్రియ చాలా తేలిగ్గా ఉందని కేరళలో 75% మంది పేర్కొంటే, ఆంధ్రప్రదేశ్‌లో 53 శాతం, తమిళనాడులో 50% మంది తెలిపారు. ► ప్రజల్లో రూ.2000 నోటు మార్చుకోడానికి మాత్రం ఇబ్బందులు ఎదరవుతున్నట్లు 42 శాతం మంది తెలిపారు. ► సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తమ రూ.2000 నోటును మార్చుకునేందుకు ప్రభుత్వం తమకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ► 2,000 నోట్ల మార్పిడి రూ.20,000 కంటే ఎక్కువగా ఉండాలని 44 శాతం మంది పేర్కొన్నారు. ప్రజలు రూ. 2,000 కరెన్సీ నోటును డిపాజిట్ చేయవచ్చు. లేదా తక్కువ విలువ కలిగిన కరెన్సీతో బ్యాంకులో మార్చుకోవచ్చు, అయితే ఒకేసారి రూ. 20,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చు. ► ఇక రూ. 2,000 నోట్లను ఉపసంహరణ ప్రకటన తర్వాత దేశీయంగా పసిడి, వెండిపై ఆసక్తి పెరిగింది. రూ. 2,000 నోట్లతో కొనుగోళ్లు జరి పే ఉద్దేశంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ రూ. 2,000 నోట్లకు బదులుగా పసిడిని విక్రయించేందుకు కొందరు జ్యుయలర్లు మాత్రం 5–10 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నాయనీ వార్తలు వెలువడ్డాయి. ► రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. అంతకుముందు వీటివాటా కేవలం 10 శాతంగా ఉండేది. ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ► ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. ► 2016 నవంబర్‌లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్బీఐ, ఈ నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ మరిన్ని బిజినెస్ అపడేట్స్, ఇంట్రస్టింగ్ వార్తల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఏప్రిల్‌లో ఇంధన అమ్మకాలు పెరగటానికి కారణం ఇదే!
న్యూఢిల్లీ: రబీ పంటల కోత పనులు ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి అంశాల దన్నుతో ఏప్రిల్‌లో ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 6.7% పెరిగి 7.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే మార్చితో పోల్చినప్పుడు 4.8% వృద్ధి నమోదైంది. సోమవారం వెలువడిన గణాంకాల ప్రకారం.. పెట్రోల్ అమ్మకాలు ఏప్రిల్‌లో వార్షికంగా 2.5% పెరిగి 2.64 మిలియన్ టన్నులకు చేరగా, నెలవారీగా మాత్రం స్వల్పంగా 0.5% మేర తగ్గాయి. రబీ పంటల కోతకు ట్రాక్టర్లను ఉపయోగిస్తుండటం వల్ల డీజిల్ వినియోగం పెరుగుతుంది. -
ఈ20 ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తగు స్థాయిలో ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తిని మరింతగా పెంచడంపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 100 బంకుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఈ20 ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. అంతా సక్రమంగా సాగితే ఈ ఇంధన వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ అదనపు కార్యదర్శి సుబోధ్ కుమార్ తెలిపారు. దీంతో చక్కెర తరహాలోనే 2023–24 ఇథనాల్ సంవత్సరానికి గాను (డిసెంబర్–నవంబర్) ఇథనాల్ నిల్వలను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇథనాల్ ఉత్పత్తి కోసం మరింతగా చక్కెరను మళ్లించే అవకాశం ఉందని వివరించారు. ఫిబ్రవరి ఆఖరు నాటి వరకూ 120 కోట్ల లీటర్ల పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపినట్లు కుమార్ చెప్పారు. ఇథనాల్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యాలు ఈ ఏడాది లక్ష్యాల సాధనకు సరిపడేంత స్థాయిలో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమకు ప్రోత్సాహం.. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం ద్వారా క్రూడాయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతంగా ఉంటే దాన్ని ఈ20 ఇంధనంగా వ్యవహరిస్తారు. 2001ల నుంచి దీనికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. గతేడాది 10.02 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వినియోగంలోకి తెచ్చారు. 2022–23 ఇథనాల్ సంవత్సరంలో (డిసెంబర్–నవంబర్) దీన్ని 12 శాతానికి, వచ్చే ఏడాది 15 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికల్లా దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యం గడువును కుదించుకుని 2025 నాటికే సాధించాలని నిర్దేశించుకుంది. ప్రస్తుత ఏడాదికి గాను 50 లక్షల టన్నుల చక్కెరను ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించనున్నారు. వచ్చే ఏడాది నిర్దేశించుకున్న 15 శాతం మిశ్రమ లక్ష్య సాధన కోసం అదనంగా 150 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. దీనితో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ చక్కెర మిల్లులు, డిస్టిలరీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 243 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించగా, బ్యాంకులు రూ. 20,334 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వచ్చే 9–10 నెలల్లో అదనంగా 250–300 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రాగలదని అంచనా. -
మెటల్, ఇంధన షేర్లు డీలా
ముంబై: మెటల్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రూడాయిల్ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీలపై మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్సీఐ) వెయిటేజీ తగ్గింపు, ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంలో ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా పూర్తిగా వాటా విక్రయం అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ట్రేడింగ్‌లో 272 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 124 పాయింట్లు పతనమై 60,683 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 17,856 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 17,781 వద్ద కనిష్టాన్ని, 17,877 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. రియల్టీ, వినిమయ, మౌలిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,458 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.291 కోట్లను విక్రయించారు. ఎంఎస్సీఐ వెయిటేజ్ తగ్గింపుతో అదానీ గ్రూప్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలపడి 82.51 స్థాయి వద్ద స్థిరపడింది. -
వాహనదారులకు షాక్! లీటర్ పెట్రోల్‌లో ఏకంగా 90 శాతం నీరు?
శాయంపేట: పెట్రోల్‌లో నీరు చేరడంతో వాహనాలు మోరాయించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వాహనాలు పెట్రోల్ పోసుకున్న అరగంటకే మోరాయించడంతో వాహనదారులు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి యజమానిని ప్రశ్నించారు. దీంతో బంక్ యజమాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు బాటిల్లో పెట్రోల్ పట్టగా నీరే అధిక శాతం కనిపించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గంగిరేణిగూడెంలోని పెట్రోల్ బంక్‌లో బుధవారం ఉదయం పోతు సునీల్, దొంగరి శ్రావణ్, ముక్కెర సురేష్ తమ ద్విచక్రవాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కాసేపటికే వాహనాలు మోరాయించడంతో మెకానిక్ వద్దకు వెళ్లారు. కల్తీ పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోయాయని చెప్పడంతో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో అతడు బుకాయిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సమస్య విని ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ పోయించగా 90శాతం నీరు, 10శాతం మాత్రం పెట్రోల్ రావడంతో కంగుతిన్నారు. దీంతో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని బంక్ యజమానిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ సీజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ విషయమై బంక్ యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించగా మంగళవారం సాయంత్రం కొత్త లోడు వచ్చిందని, ఉదయం నుంచి పెట్రోల్ అమ్మకాలు చేపడుతున్నామని, నీరు ఎలా సింక్ అయిందో తెలియదని తెలిపారు. పెట్రోల్ పోసుకున్న వారి వాహనాలు పాడైతే మర్మమ్మతు చేయించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. -
ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఉంటున్నందున ఫ్లెక్స్ ఫ్యుయల్స్ (ఇంధన వినియోగ సౌలభ్యం ఉన్నవి), ఎలక్ట్రిక్ వాహనాలను (ఈ రవాణా/ఈవీ) ప్రోత్సహించాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సియామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. అధిక ఇంధన ధరలతో ఏవియేషన్ పరిశ్రమ కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ‘‘ఏటా చమురు ధరల్లో తీవ్ర అస్థిరతలు సమస్యలకు కారణమవుతున్నాయి. అందుకే నూరు శాతం ఫ్లెక్స్ ఫ్యూయల్స్‌కు మారాలి’’అని పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలు అన్నవి ఒకటికి మించిన ఇంధనాలు, ఇంధన మిశ్రమాలతో నడిచేవి. పెట్రోల్‌లో ఇతర ఇంధనాలను కలిపినప్పుడు ఈ వాహనాలు ఎటువంటి సమస్యల్లేకుండా సులభంగా నడుస్తుంటాయి. ఇందుకు ఇంజన్ టెక్నాలజీ, ఇతర వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దేశంలో వాయు కాలుష్యంలో 40 శాతం శిలాజ ఇంధనాల వినియోగం వల్లేనని మంత్రి గడ్కరీ చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించే టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్ తయారీని ప్రారంభించేందుకు ఎన్నో పరిశ్రమలను తాము ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఉపాధి కల్పనలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆటోమొబైల్ రంగాన్ని మంత్రి ఈ కార్యక్రమం వేదికగా అభినందించారు. ‘‘ఆటోమొబైల్ దేశంలో 4 కోట్ల మందికి ఉపాధినిస్తోంది. ప్రభుత్వానికి అధిక జీఎస్టీ రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తోంది’’అని చెప్పారు. ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! -
వచ్చేస్తోంది ‘పాతాళ విద్యుత్’.. ఎండుగడ్డితోనూ ఇంధనం
భూమికి 20 కిలోమీటర్ల అడుగున ఉద్భవించే ఉష్ణానికి రాళ్లు కూడా కరిగిపోతాయి. అక్కడ జనించే వేడిని శక్తివంతమైన తరంగాల ద్వారా బయటకు తెచ్చి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇప్పటికే ప్రయోగాలను పూర్తి చేసిన ఆ శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది నుంచి ‘పాతాళ విద్యుత్’ ఉత్పత్తి చేసేందుకు వేగంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు టర్కీలో రోడ్లపై వచ్చీపోయే వాహనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఇస్తాంబుల్ నగరంలో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మన దేశంలోని పంజాబ్‌లో గడ్డి, ఇతర పంట వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. భారత్, అమెరికా, టర్కీ దేశాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి కోసం కొత్త ప్రయోగాలపై ఓ లుక్కేద్దాం పదండి. సాక్షి, అమరావతి: జల విద్యుత్.. థర్మల్ విద్యుత్.. పవన విద్యుత్.. సౌర విద్యుత్.. హైడ్రోజన్ విద్యుత్.. అణు విద్యుత్.. ప్రపంచం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలివి. వీటికి తోడు కొత్త రకం విద్యుత్ ఉత్పత్తి విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే.. పరిమిత వనరులను వినియోగించుకుని.. అధిక ఫలితాలను సాధించే దిశగా చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. భూమి పొరల మధ్య వేడిని ఒడిసిపట్టి.. ఉపరితలం నుంచి భూమి లోపలికి 20 కిలోమీటర్ల మేర రంధ్రం చేసి.. అక్కడ ఉండే అపరిమిత వేడిని బయటకు తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడమే జియో థర్మల్ విద్యుత్ విధానం. భూమి పొరల్లోకి అంత లోతున రంధ్రం చేస్తే అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంత వేడికి రాళ్లు కూడా కరిగిపోతాయంటారు. అంత వేడిని తట్టుకుని పనిచేసే డ్రిల్స్ ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేవు. అందుకే డ్రిల్స్ స్థానంలో శక్తిమంతమైన తరంగాలను వాడాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఉష్ణాన్ని పైకి రప్పించి.. భూమి ఉపరితలంపై ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. చీకటైతే సోలార్ పవర్ ఉండదు. నదులు ఎండిపోతే జలవిద్యుత్ ఉండదు. బొగ్గు లేకపోతే థర్మల్ ఉత్పత్తి జరగదు. కానీ, ఇవేమీ లేకపోయినా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగదు. ఈ ప్రాజెక్టుకు ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. కాబట్టి అడవులు, ప్రకృతి వనరులను ధ్వంసం చేయాల్సిన అవసరం రాదు. భూమిపై ఎక్కడైనా.. సమయంలోనైనా కరెంటును ఉత్పత్తి చేయొచ్చు. ఈ టెక్నాలజీపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ప్రయోగశాలలో పరీక్షలు కూడా పూర్తి చేశారు. 2024 నాటికి జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నారు. ట్రాఫిక్ నుంచీ విద్యుత్ ఉత్పత్తి టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ట్రాఫిక్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రోడ్ల మధ్యలోని డివైడర్ దగ్గర ప్రత్యేక పరికరాన్ని ఉంచుతున్నారు. ఆ పరికరంపై సోలార్ పవర్ ప్లేట్ అమర్చుతున్నారు. వాహనాలు వెదజల్లే వేడి ద్వారా ఆ సోలార్ ప్లేట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదే పరికరానికి ఫ్యాన్ రెక్కల లాంటి వంపు తిరిగిన మూడు రెక్కలు అమర్చి, వాటికి టర్బైన్స్ పెడుతున్నారు. ఏదైనా వాహనం రోడ్డుపై వేగంగా వెళ్లినప్పుడు వచ్చే అధిక గాలి తగలగానే ఆ రెక్కలు గుండ్రంగా తిరుగుతున్నాయి. వాటికి సెట్ చేసిన టర్బైన్ కూడా తిరుగుతుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌తో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మిగిలిన కరెంటును ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాల్లో వాతావరణాన్ని పరిశీలించే సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి భూకంపాల్ని కూడా గుర్తిస్తాయట. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ఎంత ఉందో కూడా కనిపెడతాయట. వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇక్కడి రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేవారు. దీనివల్ల ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కాలుష్య సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ముందుగా పంట వ్యర్థాలను పొగ రాకుండా మండించి బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్‌తో పంజాబ్‌లో పరిశ్రమలను నడిపిస్తున్నారు. -
ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్!
జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్ 1886లో తన కారుకి పేటెంట్ పొందారు. ఆ కారులో వాడిన ఇంధనమేంటో తెలుసా.. గ్యాస్. ఔను.. ప్రపంచంలో మొట్టమొదటి కారు గ్యాస్‌తోనే నడిచింది. ఆ తరువాత అనేక పరిశోధనలు, ప్రయోగాల కారణంగా పెట్రోల్, డీజిల్‌ను కార్లలో విరివిగా వినియోగించడం మొదలైంది. దశాబ్దాలుగా ఆ రెండిటితో పాటు గ్యాస్ ఆధారిత కార్లనే మనం రోడ్లపై చూస్తున్నాం. కానీ.. ప్రపంచ పర్యావరణంపై మొదలైన ఆందోళన, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాల ఫలితంగా సరికొత్త ఇంధన ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. దాని ఫలితమే విద్యుత్ వాహనాల ప్రవేశం. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ సౌర విద్యుత్, హైడ్రోజన్ పవర్‌తో నడిచే కార్లను తయారు చేసే స్థాయికి చేరుకున్నాం. ఢిల్లీలో పరుగులు నేషనల్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా 6 నెలల క్రితమే హైడ్రోజన్ స్పైక్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌పై నడిచే వాహనాలను ప్రారంభించిన మొదటి భారతీయ నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ కూడా లేహ్, ఢిల్లీలో 10 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులు, ఇంధన సెల్ ఎలక్ట్రిక్ కార్లను నడపడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైడ్రోజన్ కార్లలో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను హైడ్రోజన్ గ్యాస్‌తో చార్జ్ చేసి కారును నడిచేలా చేస్తారు. దీనికి అవసరమయ్యే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఫరీదాబాద్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. భారత్‌లో గ్రీన్ హైడ్రోజన్ కారు ప్రపంచంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ (హరిత ఉదజని)తో నడిచే కారును మన దేశంలో ఇటీవల పరిచయం చేశారు. బ్రౌన్ హైడ్రోజన్ అంటే పెట్రోల్, బ్లాక్ హైడ్రోజన్ అంటే బొగ్గు. మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటనేగా మీ సందేహం. దీనిని నీరు, చెత్త నుంచి తీస్తారు. వీటినుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే ఈ కారుకు ‘మిరాయి’ అని నామకరణం కూడా చేశారు. ఇలాంటి కార్లను అతి తొందరలోనే దేశమంతటా నడపనున్నారు. అందుకు అవసరమైన ఈ గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్లను ముందుగా నిర్మించనున్నారు. ఆ తర్వాత ఈ కార్ల అమ్మకాలు ప్రారంభించనున్నారు. ఈ కారు కేవలం 5.69 కేజీల గ్రీన్ హైడ్రోజన్‌తో రెండు రోజుల్లో 1,359 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు వెళ్లిపోవచ్చని నిరూపించింది. దాదాపు రూ.17 లక్షల కోట్ల పెట్రోలియం ఉత్పత్తులను ఏటా దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్‌ను విస్తరిస్తే రైతులు సైతం దానిని ఉత్పత్తి చేయగలిగే పరిస్థితి వస్తుంది. దూసుకొస్తున్న సోలార్ కార్ ఎలక్ట్రిసిటీ అవసరం లేని కార్ కూడా వస్తోంది. ప్రపంచంలోనే తొలి సోలార్ కార్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. నెదర్లాండ్స్‌కు చెందిన స్టార్టప్ సోలార్ కారును డిజైన్ చేసింది. ‘లైట్ ఇయర్’ పేరుతో ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కారుకు ఎండ ఉంటే చాలు. సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఈ కారును ముందుకు నడిపిస్తుంది. ఈ కారు కూడా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది రోడ్లపైకి దూసుకురానుంది. దీనిలో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. సోలార్ పవర్ ద్వారా బ్యాటరీ చార్జ్ అవుతుంది. అవసరమైతే ఇంట్లో సాధారణ ప్లగ్‌కు కనెక్ట్ చేసి విద్యుత్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పద్ధతి ద్వారా గంట చార్జింగ్ చేస్తే 32 కిలోమీటర్లు, ఫుల్ చార్జ్ చేస్తే 625 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే సోలార్ పవర్ ద్వారా అయితే 70 కిలోమీటర్ల రేంజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. కారు పైకప్పు, హుడ్‌పై డబుల్ కర్వ్ సోలార్ గ్లాస్ ఉంటుంది. మరో విశేషం ఏమంటే.. ఈ కారు చక్రాల నుంచి కూడా కొంత మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా డిజైన్ చేయడం విశేషం. ఈ కారులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకన్లలో అందుకోవచ్చు. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, ‘వారానికి 4 రోజులే పని’ -
బ్రిటన్ సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది!
లండన్: బ్రిటన్ ఆర్థిక సంక్షోభం.. నానాటికీ దిగజారుగుతోంది. ప్రధాని లిజ్ ట్రస్ నిర్ణయంతో పతనం దిశగా దేశం పయనిస్తోందని సొంత పార్టీ సభ్యులే విమర్శిస్తున్నారు. తాజాగా హోం సెక్రెటరీ సుయెల్లా బ్రేవర్మన్ తప్పుకోగా.. రాజీనామా లేఖలో ఆమె ఆర్థిక సంక్షోభ విషయంలో యూకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా నిప్పులు చెరిగారు. బ్రిటన్‌లో లక్షలాది మంది ఈ జీవన వ్యయ సంక్షోభాన్ని(Cost Of Living Crisis) నుంచి గట్టెక్కేందుకు భోజనాన్ని దాటవేస్తున్నారట. ఇక ఇంధన పేదరికం ఇది వరకే అంచనా వేసినట్లుగా తీవ్ర రూపం దాలుస్తోంది. చాలావరకు ఇళ్లలో విద్యుత్, హీటర్ ఈ విషయాలను విచ్ (Which?) అనే వినియోగదారుల సంస్థ తన సర్వే ద్వారా వెల్లడించింది. మూడు వేల మందిని సర్వే చేసిన ఈ సంస్థ.. ఆ అంచనా ఆధారంగా సగం యూకే ఇళ్లలో ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఒక్కపూట భోజనానికి దూరం కావడం మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలోనూ ఆర్థిక కష్టాల ప్రభావం కనిపిస్తోంది. బ్రిటన్ వాసులు(80 శాతం దాకా) హెల్తీ మీల్స్‌కు దూరంగా ఉంటున్నారని విచ్ ప్రతినిధి సూ డేవీస్ చెప్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ దేశంలో ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 10.1 శాతానికి చేరుకుంది. ఇదిగాక.. ఇంధన ధరల ప్రభావంతో లక్షల ఇళ్లపై పడిందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెచ్చుమీరింది. లో ఇన్కమ్ కేటగిరీలో.. ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆహార కొరత సమస్యతో అతలాకుతలమవుతోంది. 2022వ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఆహార సంక్షోభం కనిపించింది. అయితే సెప్టెంబరులో 18 శాతం కుటుంబాలు తమ ఆహార వినియోగాన్ని తగ్గించుకోవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రధాని లిజ్ ట్రస్ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదీ చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు! -
Sri Lanka: శ్రీలంక ప్రజలకు మరో 12నెలల పాటు ఆ బాధ తప్పదటా..!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించటం లేదు. దేశంలో ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేశారు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి. మరో 12 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో విదేశీ మారక నిలువల కొరత ఉన్నందున వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులపై పరిమితులు కొనసాగుతాయని తెలిపారు. ‘దేశంలో విదేశీ మారక నిలువల కొరత కారణంగా.. వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులు పరిమితంగానే ఉంటాయి.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు మంత్రి కాంచన విజేసేకర. చమురు రేషన్ వ్యవస్థను తీసుకురావటం వెనుకున్న కారణాలను వివరించారు. అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు తొలి అడుగుగా ఇంధన రేషన్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలు ప్రారంభం.. దేశంలో తీవ్ర చమురు కొరత ఉన్నప్పటికీ పాఠశాలలను సోమవారం పునఃప్రారంభించింది శ్రీలంక. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు మరో నెలరోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని కోరింది. మరోవైపు.. వచ్చే ఆగస్టులో 30వేల టన్నుల చొప్పున రెండు సార్లు చమురు దిగుమతులు చేసుకోనున్నట్లు లంక ఐఓసీ ఎండీ మనోజ్ గుప్తా తెలిపారు. ‘సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. పరిశ్రమలకు ఇంధన సరఫరా మా తొలి ప్రాధాన్యం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! -
లంకలో ఉపశమన కార్యక్రమాలకు శ్రీకారం!... : విక్రమసింఘే
Sri Lanka Acting President To Implement Urgent Food: గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ అబేవర్ధనే ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆందోళకారుల ఆగ్రహావేశాలు చల్లరే దిశగా ప్రజలకు సత్వరమే సాయం అందించడం పై రణిల్ దృష్టి సారించారు. మొదటగా ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్షణ అత్యవసర సహాయ కార్యక్రమాలను అమలు చేయాలని రణిల్ నిర్ణయించారు. ఈ సహాయ కార్యక్రమాల ద్వారా ముందుగా ఇంధనం, గ్యాస్, కనీస ఆహర పదార్థాలను అందిచాలని సూచించారు. ఈ మేరకు రణిల్ జులై16న పార్లమెంట్ సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ఆగస్టులో సమర్పించే రిలీప్ బడ్జెట్లో అదనంగా వచ్చే డబ్బును కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. తొలుత ఆహార భద్రత కార్యక్రం అమలును వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఇంధనం, ఎరువులు సక్రమంగా అందించడం పై దృష్టి సారించారు. మరోవైపు వ్యాపారవేత్తలను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలను నిర్వహించేలా వాతావరణాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ చర్చల ద్వారా తీసుకున్న ప్రణాళిక శాంతియుత నిరసకారుల కారుల కారణంగా తీసుకున్న గొప్ప ప్రణాళికగా పేరుగాంచుతుందన్నారు. అవినీతిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను కార్యకర్తలకు తెలియజేస్తామని రణిల్ అన్నారు. ఐతే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేసినందున, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు వచ్చే వారం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ఇదిలావుండగా మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేలను కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదంటూ.. శ్రీలంక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: శ్రీలంకలో ఇంధన పాస్‌లకు శ్రీకారం.. రేషన్‌పై పెట్రోల్ పంపిణీ!) -
రెండు వారాలకోసారి విండ్‌ఫాల్ ట్యాక్స్‌పై సమీక్ష
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, ఇంధనాల ఎగుమతులపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రెండు వారాలకోసారి (15 రోజులకు) ప్రభుత్వం సమీక్షించనుంది. విదేశీ మారకం రేట్లు, అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఈ విషయాలు చెప్పారు. క్రూడాయిల్ బ్యారెల్ రేటు 40 డాలర్ల స్థాయికి పడిపోతే దీన్ని ఉపసంహరించవచ్చన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే ఆ రేటుకు రాకపోవచ్చని పేర్కొన్నారు. ముడిచమురు రేటు ఏ స్థాయిలో ఉంటే విండ్‌ఫాల్ ట్యాక్స్ ఉపసంహరించవచ్చనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రి చెప్పారు. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై రూ. 13 చొప్పున, అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్పైన టన్నుకు రూ. 23,250 మేర పన్నులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. -
కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్, ఓఎన్జీసీ ఢమాల్!
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్గతంగా ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్నులు, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లేదా విండ్‌ఫాల్ పన్ను విధించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన చమురు ఉత్పత్తిదారులపై ఇండియా విండ్‌ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది. అలాగే గ్యాసోయిల్, గ్యాసోలిన్ జెట్ ఇంధనం దిగుమతులపై సుంకాలను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ 8.7 శాతం వరకు పడిపోయింది. 2020, నవంబర్ 2 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. ఫలితంగా దేశంలోని ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో 19.35 బిలియన్ డాలర్ల మేర తగ్గిందని రాయిటర్స్ నివేదించింది. బీఎస్ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ 16.5 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ ఏకంగా 12.3 శాతం క్షీణించింది 2020 మార్చి 23 తరువాత ఇదే అతిపెద్ద పతనం. ఆయిల్ ఇండియా దాదాపు 11 శాతం క్షీణించగా, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ 10 శాతం క్షీణించాయి. కాగాపెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటర్‌కు రూ. 13 పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 అదనపు పన్ను విధించింది. మరోవైపు డాలర్‌తో రూపాయి శుక్రవారం మరో ఆల్‌టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో ఇక ఇంటి వద్దకే ఇంధనం!
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం అందు బాటులోకి రావడంతో వినియోగ దారులకు కావాల్సిన ఆహా రం, కూరగాయలు, గృహోపకరణాలు తదితర వస్తువులన్నీ ఇంటి ముంగిటే వాలిపోతున్నాయి. ఇదేవిధంగా హైదరాబాద్‌లో డీజిల్, పెట్రోల్ కూడా ఇంటి వద్దకే రానున్నాయి. మొబైల్ యాప్ సహా యంతో గోఫ్యూయెల్ ఇండియా అనే సంస్థ ఇంటి వద్దకే డీజిల్, పెట్రోల్‌ను సరఫరా చేయనున్నాయి. శుక్రవారం గోఫ్యూయెల్ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీ భాగస్వాములైన హెచ్‌పీసీఎల్ సీజీఎం హరిప్రసాద్ సింగు పల్లి, సుస్మిత ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి తమ కార్యకలాపాలను ఆవిష్కరించారు. సంస్థ కోఫౌండర్ ఆదిత్య మీసాల మాట్లా డుతూ.. ఇప్పటికే ఈ సేవలు చెన్నైలో అందుబాటులోకి వచ్చాయన్నారు. విని యోగదారులు యాప్‌లో ఆర్డర్ చేస్తే ఇంధనాన్ని వారు కోరుకున్న చోటుకు అందిస్తామని తెలి పారు. జూలై–సెప్టెంబర్‌లో గువాహటి, సేలంలో కార్యకలా పాలను ప్రారంభిస్తామని, 2024 నాటికి దేశమంతటా 1,000 వాహనాలతో విస్తరించడానికి ప్రణాళికలు రూపొం దించామని చెప్పారు. అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, ఆసు పత్రులు, మాల్స్, బ్యాంకులు, గిడ్డంగులు తదితర స్థలా లకూ సరఫరా చేస్తామన్నారు. -
ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు..
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ.. మరోవైపు కర్బన ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. జూన్ నెలలో మొదటి రెండు వారాల్లో పెట్రోల్ విక్రయాలు 54 శాతం పెరగ్గా, డీజిల్ విక్రయాలు 48 శాతం అధికంగా నమోదయ్యాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు జూన్ 1 నుంచి 14 వరకు 1.28 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయించాయి. 2021లో ఇదే కాలంలో నమోదైన విక్రయాలతో పోలిస్తే 54 శాతం ఎక్కువ. కానీ, కరోనాకు ముందు 2019లో జూన్ 1–14 నాటి విక్రయాలు 1.02 మిలియన్ టన్నులతో పోల్చి చూసినా 25 శాతం అధికంగా నమోదైనట్టు తెలుస్తోంది. ఎక్కువగా వినియోగమయ్యే డీజిల్ విక్రయాలు జూన్ 1–14 మధ్య 3.4 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలోని విక్రయాలతో పోలిస్తే 47.8 శాతం ఎక్కువ. ఇక 2020లో ఇదే కాలంతో పోలిస్తే 37.3 శాతం, 2019లో ఇదే కాలంతో పోలిస్తే 20.3 శాతం అధికం. పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్ మళ్లీ ఏర్పడినట్టు, సాగు సీజన్ కూడా ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గ్యాస్ విక్రయాలు.. వంటగ్యాస్ విక్రయాలు 4.21 శాతం పెరిగి 1.06 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2019లో ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం అధికం. విమాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రెట్టింపై 2,42,900 టన్నులుగా ఉన్నాయి. చదవండి: సంపద సృష్టిలో అదానీ అదరహో -
ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు
Sri Lanka Crisis: గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంకోభాలతో కొట్టుమిట్టాడుతూ.. తీవ్ర ఉద్రిక్తలతో మగ్గిపోయింది. ఇప్పడిప్పుడే కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం కొత్త ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. ఆ దేశా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రధాని రణిల్ విక్రమసింఘే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తమ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంధనానికి సంబంధించి రాబోయే మూడు వారాలు మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందువల్ల మనం ఇప్పటి నుంచే ఇంధనం, గ్యాస్‌లను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అనవసరమైన ప్రయాణాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. సంక్షోభాన్ని అధిగమించడానికి దేశం ఇంధనం కోసం నెలకు సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది" అని చెప్పారు. అదీగాక అంతర్జాతీయ పరంగా మనం అనుసరిస్తున్న నాసిరకం విధానాల వల్లే దేశం మరింతగా అణగారిపోతుందని విక్రమసింఘే అన్నారు. అందువల్ల ప్రస్తుతం దేశం తన విదేశీ సంబంధాలపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!) -
వచ్చే ఆర్నెల్లలో 90 శాతం... రష్యా చమురుపై నిషేధం
బ్రసెల్స్: రష్యాపై ఆంక్షలకు కొనసాగింపుగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆర్నెల్లలో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. మంగళవారం జరిగిన ఈయూ కీలక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇతర సరఫరా మార్గాలను వెదుక్కోవడం, వీలైనంత త్వరగా సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం తదితరాల ద్వారా కొరతను అధిగమించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన జరిగే యూరప్‌కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. హంగరీ వంటి మధ్య, తూర్పు యూరప్ దేశాలకు పైప్‌లైన్ ద్వారా జరుగుతున్న సరఫరాలు మాత్రం కొనసాగుతాయి. తాజా నిర్ణయానికి ఈయూ త్వరలో తుది రూపు ఇవ్వనుంది. దీంతోపాటు రష్యాలోని మరో అతి పెద్ద బ్యాంకుపైనా, ఆ దేశ మీడియాపైనా ఈయూ ఆంక్షలు విధించింది. యూరప్ తన చమురు అవసరాల్లో 25 శాతం, గ్యాస్ అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యాపైనే ఆధారపడ్డ విషయం తెలిసిందే. అందుకే ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచీ ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతుల్ని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా చాలా యూరప్ దేశాలు సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం విశేషమనే చెప్పాలి. అయితే తమ ఇంధన భద్రతకు హామీ ఇస్తేనే నిషేధానికి మద్దతిస్తామని రష్యా నుంచి 60 శాతానికి పైగా చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ ప్రకటించింది. ఈయూ నిర్ణయాన్ని రష్యా తేలిగ్గా తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు డిమాండ్‌కు కొదవ లేదని, ఇతర దిగుమతిదారులను చూసుకుంటామని చెప్పింది. బల్గేరియా, పోలండ్, ఫిన్లండ్లకు చమురు ఎగుమతులను రష్యా ఇప్పటికే నిలిపేసింది. డెన్మార్క్‌కు కూడా మంగళవారం నుంచి సరఫరాలు ఆపేస్తున్నట్టు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్ప్రోమ్ ప్రకటించింది. తమ పట్ల విద్వేషమే ఏకైక ప్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదెవ్ దుయ్యబట్టారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఆహార ఎగుమతులు ఆగిపోవడంపై ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వెలిబుచ్చింది. ఆఫ్రికా దేశాలు తీవ్ర కొరతతో అల్లాడుతున్నాయని యూనియన్ చీఫ్, సెనెగల్ అధ్యక్షుడు మెకీ సల్ చెప్పారు. పశ్చిమ దేశాల మొండి వైఖరే ఇందుకు కారణమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ఉక్రెయిన్ తన తీర జలాలను మందుపాతరలతో నింపేసిందన్నారు. -
మండే ఎండలకు బండి పైలం.. నిర్లక్ష్యం అస్సలు వద్దు! ఈ జాగ్రత్తలు మీకోసమే..
విశాఖపట్నం: భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం వేళయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎండలో కాలు పెడితే చాలు ఒంట్లోని సత్తువంతా ఆవిరైపోతోంది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం మనం ఎలా జాగ్రత్తలు పాటిస్తామో.. వాహనాలను కూడా అలానే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాహనాలు ఎండలో గంటల సమయం ఉంచడం వల్ల రంగు వెలిసిపోతాయని, పెట్రోల్ ఆవిరయ్యే అవకాశం ఉంటుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాలకు ట్యాంక్ నిండా పెట్రోల్ పట్టిస్తే ఒక్కో సారి పేలే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. చదవండి👉🏾బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన పెద్ద వాహనాలకు ఇలా.. ► కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ► రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంట్ ఆయిల్ వాడడం మంచిది. ► వేడికి ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ► పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్ ద్వారా వాహనాలు నడిపేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాహనదారులు వేసవిలో గ్యాస్ కిట్‌ను ఉపయోగించకుండా ఉంటే ఉత్తమం. ► ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్ మ్యాట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ► ఎండాకాలం పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు నూతన టైర్లు వాడితే మేలు. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది. చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’ ద్విచక్ర వాహనాలకు రక్షణ ఇలా.. ► వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే.. చెట్టు నీడన గానీ, షెడ్లలో గానీ లేదా కవర్లు కప్పి ఉంచాలి. ► అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గిపోతుంది. తరచూ గాలి తనిఖీ చేయించుకోవడం మంచిది. ► బైక్‌లు ఎక్కువ సమయం ఎండలో ఉంచితే పెట్రోల్ ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది. ► పెట్రోల్ ట్యాంకుపై మందపాటి కవర్ ఉండేటట్లు చూసుకోవడం వల్ల కొంత మేర పెట్రోల్ ఆవిరి కాకుండా చూడవచ్చు. ► ఎండల వేడికి ఇంజిన్ ఆయిల్ త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం మంచిది. ► వేసవి కాలంలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో బైక్‌ను పార్క్ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్ మూతను తెరచి మూయాలి. ► గాలి పట్టే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే టైర్ల మన్నిక తగ్గిపోతుంది. తద్వారా పెట్రోల్ ఎక్కువ ఖర్చయ్యే ప్రమాదం ఉంది. ► వేసవి కాలంలో ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణం చేయడం తగ్గించుకుంటే మేలు. ► దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాహనాల వేగానికి, ఉష్ణోగ్రతల వేడికి ఇంజిన్ రెండింతలు వేడెక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంజిన్ కాసేపు ఆపుకుంటే వాహనం మన్నిక కాలం పెరుగుతుంది. నిర్ణీత గడువులోపు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. ఫుల్ ట్యాంక్ చేయించకూడదు ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. బైక్‌లకు ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది. రెండు లీటర్లు పెట్రోల్ వరకు వేయించుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. ఒక వేళ బైక్ ఎండలో పెట్టాల్సిన అవసరం ఏర్పడితే ఏదైనా పొడవాటి క్లాత్‌ను ట్యాంక్‌పై కప్పి ఉంచితే సరిపోతుంది. లేదంటే ఎండలకు ఆయిల్ ట్యాంకర్ హీటెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది. –అక్బర్, బైక్ మెకానిక్ ఎక్కువ దూరం ప్రయాణించొద్దు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల బైక్ ఆయిల్ ట్యాంకులు పేలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెట్రోల్ వేయించేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడడం, బైక్‌ను ఎండలో ఉంచడం కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బైక్‌ను మధ్యాహ్నం సమయంలో నీడలో పార్కు చేయాలి. ఎండలో ఎక్కువ దూరం కూడా ప్రయాణించకపోవడం మంచిది. – త్రినాథరావు, మెకానిక్ -
ఇదేం పద్దతి, ప్రధాని మాట్లాడే మాటలేనా?.. కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా పరిస్థితిపై బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని సూచించడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ ప్లీనరీ ముగింపులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రాలు పన్నులు తగ్గించాలంటూ మోదీ మాట్లాడారు. ప్రధాని మాట్లాడాల్సిన మాటలేనా అవి? సిగ్గూ ఎగ్గూ ఉందా? ఏ నోటితో అలా మాట్లాడుతున్నావ్? పెంచేది మీరు..తగ్గించేది మేమా? తెలంగాణ ఏర్పడ్డ తరువాత పెట్రోల్, డీజిల్ మీద మేం పన్నులు పెంచలేదు. ఒకేసారి రౌండ్ ఫిగర్ చేయడానికి సర్దుబాటు చేశాం. కానీ ప్రధానమంత్రి కుటిల, దుష్ట రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పకుండా లోగుట్టుగా పన్నులు పెంచుతున్నారు. ‘‘బలమైన కేంద్రం– బక్క రాష్ట్రం’’అనే ధోరణిలో ఉన్నారు. పన్నులు ఎందుకు పెంచుతున్నామో ప్రజలకు చెప్పాలి. మేము రిజిస్ట్రేషన్ చార్జీలు ఎందుకు పెంచుతున్నామో చెప్పి పెంచినం. నువ్వు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల కునారిల్లుతున్న ఆర్టీసీని బతికించేందుకు మేం వేల కోట్లు వెచ్చిస్తున్నం. ఆర్టీసీని అమ్మితే వెయ్యి కోట్లు ఇస్తామన్న ఘనుడు ప్రధానమంత్రి..’అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. చదవండి👉 గంగానదిని ప్రక్షాళన చేస్తామన్నారు.. కరోనా టైంలో శవాలు తేల్చారు: కేటీఆర్ -
సంచలనం, వంట నూనెతో అద్భుతం..కుకింగ్ ఆయిల్‌తో కాస్ట్లీ విమానం నడిపారు!
సీట్లు నిండినా..గల్లా ఖాళీ అవుతుంది ఇదీ ప్రస్తుతం విమానయాన పరిస్థితి. అందుకే విమానాయన సంస్థలు ఆవ నూనె, వంట నూనెతో విమానాల్ని నడిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మంచి ఫలితాల్ని రాబడుతున్నాయి. తాజాగా 496 మంది ప్రయాణించే కాస్ట్లీ విమానం 'ఎయిర్ బస్ ఏ380'లో వంటింట్లో వాడే వంట నూనె ఫ్యూయల్‌గా ఉపయోగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండానే విమానం నిర్దేశించిన ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గాలి నుంచి కాదు ఆవ మొక్క నుంచి ఇంధనం ఐదేళ్ల క్రితం గాలి నుంచి విమానం ఇంధనం తయారవుతుందని అనడంతో విమానయానం కష్టాలు ఇక తీరిపోయినట్లేనని భావించారు. ఎందుకంటే అసలు విమానయానం కష్టాలన్నీ ఇంధనం వల్లనే జరుగుతున్నాయి. నానాటికి పెరిగిపోతున్న చమురు ధరలతో..వాటి ఖర్చు ఆకాశం నుంచి అంతరిక్షం దాటుతోంది. దాంతో ఆల్ట్రనేటీవ్ ఫ్యూయల్ వైపు అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ అదెందుకో కార్యచరణకు నోచుకోలేదు. కానీ గతేడాది భారత శాస్త్రవేత్త,జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పునీత్ ద్వివేదీ బృందం ఆవాల మొక్క ద్వారా విమానం ఇంధనం తయారవుతుందనగానే ఆశలు చిగురించాయి. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనెతో విమానం ఇంధనం తయారు చేయోచ్చని పునీత్ ద్వివేది తెలిపారు. ద్వివేదీ గత 4 సంవత్సరాలుగా దీనిపై పరిశోధనలు చేస్తుండగా..ఈ ప్రాజెక్టును15 మిలియన్ల డాలర్లతో అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చేపట్టింది. వంట నూనెతో అద్భుతాలు ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాన్ని ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్ బస్ ఏ380 ఫ్లైట్‌ను ఫ్రాన్స్‌లో ట్రయల్స్ నిర్వహించారు. సంచలనం ఏంటంటే ఈ విమానంలో వంటింట్లో వాడే వంటనూనె ( ఇది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(saf అని కూడా పిలుస్తారు)ను ఉపయోగించడం. ఈ విమానం రోల్స్ రాయిస్ ట్రెంట్ 900 ఇంజన్ సాయంతో మార్చి 25న టౌలౌస్‌లోని బ్లాగ్నాక్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. మార్చి 29న టౌలౌస్ నుండి నైస్‌కు వెళ్లేందుకు అదే నూనెను ఉపయోగించి ఏ380 ప్లైట్‌ను మరో ట్రైల్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇంధన పనితీరు బాగున్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ 'హైడ్రోప్రాసెస్డ్ ఎస్టర్స్, ఫ్యాటీ యాసిడ్స్' లేదా హెచ్ఈఎఫ్ఏ నుండి ఈ ప్రత్యేకమైన కుకింగ్ ఆయిల్‌ను తయారు చేసింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆయిల్‌ను విమానాల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. మార్చి2021లో వైడ్ బాడీ ఏ 350 ఫ్లైట్‌లో, గత అక్టోబర్‌లో ఏ319 నియో అనే విమానంలో ఈ ఆయిల్‌ను ఫ్యూయల్‌గా ఉపయోగించారు. తాజాగా కాస్ట్లీ విమానం ఏ380 లో ఉపయోగించి టెస్ట్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తించారు. కాగా ఎయిర్‌బస్ యాజమాన్యం తన విమానాలన్నింటిలో ఈ కుకింగ్ ఆయిల్‌ను ఉపయోగించేందుకు సర్టిఫికేట్ పొందాలని చూస్తుంది. అప్పటి వరకు ప్రయోగాలు కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి: ఈ విమానంలో జర్నీ బాగా కాస్ట్లీ గురూ! -
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఒమిక్రాన్ ప్రభావం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుత నెల మొదటి 15 రోజుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. కరోనా ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు విధించడం అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ఆంక్షల కారణంగా విమన సర్వీసులు, కార్యాలయాలకు రవాణా తగ్గడం తెలిసిందే. డీజిల్ విక్రయాలు 2.47 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2021 జనవరి 1–15 నాటి అమ్మకాలతో పోలిస్తే 5 శాతం తక్కువగాను, 2021 డిసెంబర్ నెల మొదటి 15 రోజుల విక్రయాలతో పోలిస్తే 14.1 శాతం తగ్గాయి. దేశ ఇంధన వినియోగంలో డీజిల్ వాటా 40 శాతంగా ఉంటుంది. డీజిల్ వినియోగం పారిశ్రామిక కార్యకలాపాలను కూడా ప్రతిఫలిస్తుంది. 2020 జనవరి నెల మొత్తంమీద డీజిల్ అమ్మకాలు 8 శాతం తగ్గడం గమనార్హం. ఇక పెట్రోల్ విక్రయాలు ఈ ఏడాది జనవరి 1–15 వరకు 9,64,380 టన్నులుగా ఉన్నాయి. 2021 డిసెంబర్ నెల మొదటి పక్షం రోజుల విక్రయాలతో పోలిస్తే 13.81 శాతం తక్కువగాను, 2021 జనవరి నెల మొదటి 15 రోజులతో పోలిస్తే 3 శాతం తగ్గాయి. 2020 జనవరి నెల మొదటి 15 రోజుల విక్రయాలతో పోల్చి చూస్తే మాత్రం 6 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ విక్రయాలు 13 శాతం తగ్గి 2,08,980 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ విక్రయాలు 5 శాతం పెరిగాయి. -
సీవో2ను రాకెట్ ఇంధనంగా మారుస్తా..!
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడు పోతున్న విద్యుత్ కార్లు (టెస్లా) మొదలు అంత ర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు, సరుకులను పంపే రాకెట్ల (స్పేస్–ఎక్స్) వరకూ తనదైన ముద్రవేయడం ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ సొంతం. అసాధ్యం అని ఎవరైనా చెబితే దాన్ని సుసాధ్యం చేసే వరకూ అతడికి నిద్ర పట్టదంటే అతిశయోక్తి కాదు. మనిషి కేవలం భూమికే పరిమితం కారాదని.. అంగారకుడితో మొదలుపెట్టి వీలైనన్ని గ్రహాలకు విస్తరించాలన్న ఆలోచనలూ అతడివే. అందుకేనేమో ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక ‘టైమ్’ 2021కిగాను మస్క్‌ను ఈ ఏటి మేటిగా ప్రకటించింది. ఈ సందర్భంగా మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భూతాపోన్నతి ద్వారా వస్తున్న వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్నే తాను రాకెట్ల ఇంధనంగా మార్చుకొని మనుషులను అంగారకుడిపైకి చేరుస్తానన్నది ఆ ట్వీట్ సారాంశం. ఆసక్తి ఉన్నవారు తనతో చేతులు కలపాలని, యుద్ధప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపడుతున్నామని తరువాతి ట్వీట్లలో మస్క్ పేర్కొన్నాడు. మరి చెప్పాడంటే.. చేస్తాడంతే టైపు మస్క్ ఈ సవాలనూ జయించగలడా? కొత్త పనా? నిజానికి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా కంపెనీలు రకరకాల పద్ధతులను ఉపయోగించి ఈ పని చేస్తున్నాయి. ఇంధనం మాత్రమే కాదు.. ఈ విషవాయువును వోడ్కా వంటి మద్యంలా మార్చేందుకు, శరీరానికి అవసరమైన ప్రొటీన్లను తయారు చేసేందుకూ కొన్ని కంపెనీలు పరిశోధించి విజయం సాధించాయి. ఇంకొందరు వాతా వరణంలోంచి కార్బన్‌డయాక్సైడ్‌ను వేరు చేసి అత్యధిక పీడనానికి గురి చేయడం ద్వారా సూక్ష్మస్థాయి కృత్రిమ వజ్రాలను తయారు చేయ గలిగారు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్వెల్వ్’... రెండు వినూత్న ఎలక్ట్రొలైజర్ల సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను సింథటిక్ గ్యాస్ లేదా కృత్రిమ గ్యాస్‌గా మార్చేందుకు ఒక టెక్నా లజీని తయారు చేసింది. ఇందులో సిన్గ్యాస్తో పాటు హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ రెండింటి సాయంతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ రకమైన కంపెనీలు ఎన్ని ఉన్నా అవి ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌లో ఓ 10 శాతం మాత్రం తగ్గించగలవు. అంగారక యాత్రకు అవసరమైనంత ఇంధనం మాట ఎలా ఉన్నా.. భారీ ఎత్తున సీవో2ను ఇంధనంగా మార్చగల టెక్నాలజీ అందు బాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. మస్క్ అనుకున్నది నిజమైతే మాత్రం అద్భుతం జరిగినట్లే! – సాక్షి, హైదరాబాద్ -
హైదరాబాద్ మెట్రోతో ఎన్ని కోట్ల లీటర్ల ఫ్యూయల్ ఆదా అయ్యిందో తెలుసా?
భాగ్యనగర వాసుల కలల ప్రాజెక్టు మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమై నాలుగేళ్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) సాధించిన ఘనతలను హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాలుగేళ్లలో తొలి దశలో నాగోల్ - అమీర్‌పేట - మియాపూర్ సెక్షన్లలో 30 కిలోమీటర్ల నిడివితో 2017 నవంబరు 29న మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. నాలుగు నెలల పాటు 15 నిమిషాలకు ఒక రైలు వంతున నడిపాం. ఆ తర్వాత క్రమంగా రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ 5 నిమిషాలకు ఒక రైలు పీక్ అవర్స్‌లో 3 నిమిషాలకే ఒక రైలు వరకు తెచ్చాం. కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత పీక్ అవర్ ఫ్రీక్వెన్సీని 4.30 నిమిషాలుగా ఉంది. మెట్రో రైళ్లు 99 శాతం సమయ పాలనతో నడుస్తున్నాయి. 20 కోట్ల మంది మెట్రో రైలు సర్వీసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 20.80 కోట్ల మంది రైడర్లు ఇందులో ప్రయాణం చేశారు. మెట్రో రైళ్లు సుమారుగా 1.9 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాయి. ఇదే ప్రయాణం పెట్రోలు, డీజిల్ ఇంజన్ల ద్వారా చేయాల్సి వస్తే 4.70 కోట్ల లీటర్ల ఫ్యూయల్ ఖర్చు అయ్యేది. పర్యావరణం ఈ నాలుగేళ్లలో 110 మిలియన్ కిలోల కార్బన్ డై యాక్సైడ్ వాతావరణంలో కలవకుండా మెట్రో అడ్డుకుంది. అంతేకాదు మెట్రో ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న సోలార్ సిస్టమ్ కారణంగా మరో 14 మిలియన్ కిలోల కార్బన్ డై యాక్సైడ్ అరికట్టగలిగారు. చదవండి: ఢిల్లీ తరహాలో ఎయిర్పోర్ట్ వరకు హైదరాబాద్ ‘మెట్రో’ -
Sailcargo: ఈ నౌకకు ఇంధనం అక్కరలేదట! కేవలం గాలితోనే...
చిన్న చిన్న పడవలైతే గాలివాలుకు అలా ముందుకు సాగిపోతాయి గాని, భారీ నౌకలు సముద్రంలో ముందుకు సాగాలంటే ఇంధనం కావాలి కదా! కేవలం గాలితో ఇంత పెద్ద నౌక సముద్రంలో ఎలా ప్రయాణం సాగించగలుగుతుందనేగా మీ అనుమానం? ఇందులో అణుమాత్రమైనా అనుమానానికి ఆస్కారం లేదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ నౌక పూర్తిగా గాలి ఆధారంగానే నడుస్తుంది. కెనడాకు చెందిన ‘కేఫ్ విలియమ్’ తన అంతర్జాతీయ కాఫీ రవాణా కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ నౌక పూర్తిగా పవనశక్తినే ఇంధనంగా మార్చుకుని, సముద్రంలో ప్రయాణిస్తుంది. ‘కేఫ్ విలియమ్’ కోసం ‘సెయిల్ కార్గో’ సంస్థ ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నౌక 2023లో తొలి సముద్రయానం చేయనుంది. చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. -
ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ?
సాక్షి, హైదరాబాద్: నేల, నీరును కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌ను వదిలించుకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. విమానాల విడిభాగాలు, రసాయనాలను తయారుచేసే అంతర్జాతీయ కంపెనీ ‘హనీవెల్’ తాజాగా ప్లాస్టిక్ భూతంపై ఓ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. అన్ని రకాల ప్లాస్టిక్ చెత్తను నాణ్యమైన ముడి చమురుగా మార్చేసే ప్రక్రియను ఆవిష్కరించింది. హనీవెల్ అక్కడితోనే ఆగిపోలేదు. స్పెయిన్ సంస్థ సాకైర్ ఎస్ఏతో కలసి ఏటా 30 వేల టన్నుల ప్లాస్టిక్ చెత్తను ముడి చమురుగా మార్చే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే 2023 కల్లా ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించవచ్చు. సుమారు 57 శాతం సీఓ2ను తగ్గించొచ్చు ఒక్కసారి తయారు చేశామంటే ప్లాస్టిక్‌ను నాశనం చేయడం అంత సులువైన పని కాదన్నది మనందరికీ తెలిసిన విషయమే. లెక్కలు చూస్తే ఏటా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో వాడకం తరువాత సగం చెత్తకుప్పల్లోకి చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇంకో 30 శాతం నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. రెండు శాతం ప్లాస్టిక్ మాత్రం మళ్లీ వాడుకొనే కొత్త ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతోంది. ప్లాస్టిక్‌తో పెట్రోల్, డీజిల్, కృత్రిమ నూలు తయారీలకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే హనీవెల్ అభివృద్ధి చేసిన పద్ధతి వల్ల ప్లాస్టిక్‌ను కూడా ఇతర పదార్థాల మాదిరిగా మళ్లీమళ్లీ వాడుకొనే అవకాశం లభిస్తుంది. ఆ కంపెనీ అంచనా ప్రకారం ఈ పద్ధతి వల్ల ప్లాస్టిక్ తయారీ ద్వారా వాతావరణంలోకి విడుదల అవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు దాదాపు 57 శాతం వరకూ తగ్గుతుంది. ఏమిటా పద్ధతి? నిజానికి హనీవెల్ ఉపయోగించిన ఆక్సిజన్ లేకుండా మండించే (పైరోలసిస్) పద్ధతి కొత్తదేమీ కాదు. కాకపోతే ముడి చమురులోని సూక్ష్మస్థాయి కాలుష్యాలను కూడా దశాబ్దాలుగా తొలగిస్తున్న హనీవెల్ తన అనుభవాన్నంత ఈ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగించింది. అప్‌సైకిల్ అని పిలుస్తున్న ఈ పద్ధతిలో అన్ని రకాల ప్లాస్టిక్‌ను కలిపి వాడగలగడం విశేషం. పైరాలసిస్కు తోడు కొన్ని రసాయన ప్రక్రియలను కూడా ఉపయోగించడం ద్వారా తాము ముడి చమురును తయారు చేయగలుగుతున్నామని కంపెనీ తెలిపింది. స్పెయిన్‌లో మాదిరిగా మరింత మంది భాగస్వాములను కలుపుకొని ఈ టెక్నాలజీని విస్తృత వినియోగంలోకి తెస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాల్లో 90 శాతాన్ని మళ్లీ వాడుకొనేలా ముడిచమురుగా మార్చగలమని కంపెనీ వివరిస్తోంది. చదవండి:బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ -
వరుసగా ఐదో రోజు పెరిగిన చమురు ధరలు
-
కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక
న్యూఢిల్లీ: మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం కుదిపేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం భారీగా దెబ్బతినడంతో ఆదాయం కూడా భారీగా పడిపోయింది. దీంతో ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిల్వలు పొదుపు చేసే క్రమంలో దిగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. వీటికోసం కూడా శ్రీలంక దిగుమతులపై ఆధారపడుతుంది. ఇది ఇలా ఉంటే మరోపక్క ఆ దేశంలో చమురు నిల్వలు రోజు రోజుకి ఆడగంటి పోతున్నాయి. దీంతో ముడి చమురు కొనుగోళు చేయడానికి శ్రీలంక మనదేశాన్ని 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వాలని సహాయాన్ని కోరింది. ఆ దేశంలో ప్రస్తుతం చమురు నిల్వలు వచ్చే జనవరి వరకు మాత్రమే దేశ అవసరాలకు సరిపోతాయని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్ పిలా హెచ్చరించిన కొన్ని రోజుల తర్వాత శ్రీలంక మన దేశాన్ని సహాయం చేయాలని కోరింది. ఆ దేశ ప్రభుత్వం నడుపుతున్న సీలోన్ పెట్రోలియం కార్పొరేషన్(సీపీసీ) రెండు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ సిలోన్, పీపుల్స్ బ్యాంకులకు దాదాపు 3.3 బిలియన్ డాలర్లు వరకు బకాయి పడింది. (చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...!) దీంతో ఆ అప్పులను తీర్చడానికి ‘భారత్’ను సహాయం అర్దిస్తుంది. భారతదేశం, శ్రీలంక దేశాల ఇంధన కార్యదర్శులు త్వరలో రుణం కోసం ఒప్పందంపై సంతకం చేయాలని భావిస్తున్నారని ఆర్థిక కార్యదర్శి ఎస్ ఆర్ అట్టిగాల్లె పేర్కొన్నారు. గత వారం వంట గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇంధన రిటైల్ ధరల పెంపును నిలిపివేసింది. ప్రపంచ చమురు ధరల పెరుగుదల వల్ల ఈ ఏడాది చమురు దిగుమతులపై ఎక్కువ ఖర్చు చేయవలసి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో దేశ చమురు బిల్లు 41.5 శాతం పెరిగి 2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
హరిత ఇంధనమే భవితకు బాట
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజవనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిళ్ళున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన వనరుల రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లుతోంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహ నాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్‌కు రక్ష! ఆధునిక మానవుడి నిత్యావసరమైన ఇంధన వనరు రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. కర్భన ఉద్గారాలతో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ (స్వచ్ఛ– హరిత) ఇంధనాల వైపు మళ్లుతోంది. ఇదొక... అవసర, అనివార్య స్థితి! ఈ మార్పుకనుగుణంగా భారత్‌లోనూ బలమైన అడుగులే పడు తున్నాయి. అక్టోబర్ నెలాఖరుకి 150 గిగావాట్లు, 2022 సంవత్సరాం తానికి 175 గిగావాట్ల పునర్వినియోగ విద్యుత్ ఇంధన (ఆర్ఈ) స్థాపక సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. (ఒక గిగా వాట్ అంటే వెయ్యి మెగావాట్లు) గాంధీ జయంతి రోజైన శనివారం 2.2 గిగావాట్లు, నెలాఖరున మరో 2.32 గిగావాట్ల స్థాపక సామర్థ్య ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ రంగం నుంచి ఇటీవల వచ్చిన భారీ ప్రకటనల ప్రకారం.... రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వచ్చే మూడేళ్లలో రూ 75 వేల కోట్లు (పది బిలియన్ డాలర్లు), అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వచ్చే పదేళ్లలో రూ 1.50 లక్షల కోట్లు (ఇరవై బిలియన్ డాలర్లు) çపునర్వినియోగ ఇంధన రంగంలో వ్యయం చేయనున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమ, పౌర సమాజం... అప్రమత్తంగా ఉండి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బాటను చక్కదిద్దుకోవడమే వారి ముందున్న కర్తవ్యం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజ వనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిడులున్నాయి. వాటి లభ్యత కష్టం–ఖరీదవుతుండగా, వినియోగం దుర్భరమౌతున్న పరిస్థి తుల్లో పర్యావరణ సానుకూల çపునర్వినియోగ ఇంధనాల వినియోగ వాటాను పెంచడం ఆరోగ్యకర పరిణామం! ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్దేశించనట్టు, 2015 పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడానికి ఈ దిశలో పయనం అత్య వసరం! అదే సమయంలో సుస్థిరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుంటే, ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సంక్షోభ దుస్థితి మనకూ తప్పదు! ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు వినియో గించే చైనా సదరు శిలాజ ఇంధన వాడకాన్ని రమారమి తగ్గించింది. గత దశాబ్దారంభంలో 68 శాతం ఉన్న బొగ్గు వినియోగం వాటాని, 2020లో 56 శాతానికి తగ్గించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేనందున ఇప్పుడు పారిశ్రామిక, నివాస, ట్రాఫిక్ నిర్వహణ వంటి నిత్యావసరాలకూ తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటూ దిగుమతుల కోసం దిక్కులు చూస్తోంది. సరైన దిశలోనే భారత్! అమెరికా, చైనా తర్వాత ఎక్కువ కర్బన ఉద్గారాలను (గ్రీన్ హౌజ్ గ్యాసెస్) విడుదల చేస్తున్న దేశంగా భారత్‌పై పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎంతో ఉంది. 2030 నాటికి, కార్బన్ ఫుట్‌ప్రింట్‌ని 33–35 శాతం (2005 నాటి స్థాయిపై లెక్కించి) మేర తగ్గిస్తామని పారిస్‌లో మాటిచ్చాం. పునర్వినియోగ ఇంధన వాటాని 40 శాతానికి పెంచుతా మన్నది కూడా ఒప్పందంలో భాగమే! ఇప్పటికే 38.4 శాతానికి చేరు కున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రభుత్వ–ప్రయివేటు రంగంలో తాజాగా వస్తున్న పెట్టుబడులు, ప్రణాళికల్ని బట్టి ఈ వాటాను 2030 నాటికి 66 శాతానికి పెంచే ఆస్కారముంది. పర్యా వరణ సానుకూల దిశలో గట్టి ముందడుగు పడ్డట్టే! కార్బన్ డైయాక్సైడ్ (సీవోటూ) వంటి కర్బన ఉద్గారాలను 28 శాతానికి తగ్గించినట్టు ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ రెండో అల సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గి, బొగ్గు ఉత్పత్తి పెరిగింది. కానీ, సాధారణ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం మనదేశంలో పెరుగుతోంది. గరిష్ట వినియోగ సమయంలో (పీక్) గత జూలై 7న, 200.57 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టు కేంద్ర ఇంధన మంత్రి రాజ్‌కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచ సగటు తలసరి కర్బన ఉద్గారాలతో పోలిస్తే మన తలసరి మూడో వంతేనని ఇటీవల ఒక అంతర్జాతీయ వేదిక నుంచి, సదరు మంత్రి సెలవిచ్చారు. కర్బన ఉద్గారాల సున్నాస్థితి (జీరో న్యూట్రాలిటీ) సాధించే విషయమై భారత్ నిర్దిష్ట ప్రకటన చేయాలన్న వాదనను తోసిపుచ్చుతూ ఆయనీ మాటలన్నారు. కానీ, అది సరైన వాదన కాదనేది పర్యావరణ కార్యకర్తల భావన! ప్రపం చంలో రెండో అతి పెద్ద ఉత్పత్తి దేశం, రెండో అత్యధిక జనాభా దేశం, కర్బన ఉద్గారాల్లో మూడో అతిపెద్ద దేశం. తలసరి ఉద్గారాల వెల్లడి తక్కువే అయినా, విస్తృత జనాభా రీత్యా, దీన్ని తీవ్ర సమస్యగానే పరిగణించాలి. నెల రోజుల్లో గ్లాస్గోవ్లో జరుగనున్న ‘కాప్–26’ యూఎన్ సదస్సులోగానీ, ముందేగానీ దీనిపై నిర్దిష్ట ప్రకటన చేయా లని భారత్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి వత్తిడి పెరుగుతోంది. భూమి ఒక వివాదాంశమే! భారత్ పురోగమిస్తున్న çపునర్వినియోగ ఇంధన రంగంలో, అందుక వసరమైన భూలభ్యత, సేకరణ, వినియోగం జఠిల సమస్యే కానుంది. హరిత మార్గాలైన సౌర విద్యుత్కైనా, పవన విద్యుత్తుకైనా నిర్దిష్టంగా స్థలం అవసరమౌతుంది. పునర్వినియోగ ఇంధనాల ద్వారా. 2050 నాటికి కర్భన ఉద్గారాల శూన్యస్థితి సాధించాలంటే ‘ఇంధన వ్యయ– ఆర్థిక విశ్లేషన సంస్థ’ (ఐఈఈఎప్ఎ) అధ్యయనం ప్రకారం, పెద్ద మొత్తం భూమి అవసరమౌతుంది. సౌర విద్యుత్ వ్యవస్థకు 50,000 నుంచి 70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పవనవిద్యుత్ వ్యవస్థ కోసం మరో 15,000 నుంచి 20,000 చ.కి.మీ భూమి అవసరమౌతుంది. అంటే ఒక్క విద్యుత్తుకే మొత్తం భూభాగంలో 1.7 నుంచి 2.5 విస్తీర్ణం, అటవీయేతర భూభాగంలో దీన్ని 2,2 నుంచి 3.3 శాతంగా లెక్కగట్టారు. ఇది మంచిది కాదని, భూమ్యావరణ వ్యవస్థకు చేటని పర్యావరణవేత్తలంటున్నారు. ఆహారోత్పత్తిపైనా ప్రతికూల ప్రభా వమే! బడా కార్పోరేట్ల స్పర్థలో భూసేకరణ, భూదురాక్రమణలు మళ్లీ వివాదాస్పదమనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో తగినంత కస రత్తు జరగాలని, భూవినియోగ విధానాలు సమగ్రంగా ఉండాలని ఆ సంస్థ సిఫారసు చేసింది. సౌరవిద్యుత్ పలకలు (ప్యానల్స్), పవన్ విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేసే భూములు, సామాజికంగా–వ్యావసా యికంగా–పర్యావరణ పరంగా తక్కువ ప్రభావితమయ్యే ప్రాంతాలు, ప్రభుత్వ ఖాళీ, పోరంబోకు, గైరాన్ వంటి భూముల్ని ఎంపిక చేయాలి. గరిష్ట ప్రయోజనం–కనీస వివాదం ప్రాతిపదకగా ఉండాలనీ సూచించింది. పంట కాల్వలపైన, ప్రయివేటు–కృత్రిమ జలాశయాల పైన సౌరపలకలు ఏర్పాటు చేయడం మంచిదంటున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు, నీటిపారుదల ప్రాజెక్టు కాలువ లపై సౌరపలకలు ఏర్పాటు చేసిన నమూనాకు ‘జాతీయ సోలార్ మిషన్’గా యూఎన్ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇపుడు దేశ వ్యాప్తంగా దాన్ని మరింత విస్తృతపరచవచ్చు. ఇళ్లు, ఇతర నివాస ప్రదేశాలు, కార్యాలయాలపైన (రూప్‌టాప్) కూడా ప్యానల్స్ ఏర్పాటు చేయడం సముచితమనే అభిప్రాయముంది. ఫ్రాన్స్‌లో ఒక దశలో, ప్రతి ఇంటి పైకప్పునూ అయితే హరితంతో లేదా సౌరపలకలతో గానీ కప్పి ఉంచేట్టు ఇచ్చిన ఆదేశాలు ఫలితమిచ్చాయి. పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా పెరుగు తున్నాయి. బ్యారెల్ క్రూడ్ 90 డాలర్లకు చేరనుందని వార్తలొస్తు న్నాయి. భారత్, 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా పెట్రో ఉత్పత్తి విస్తరణ అవకాశాలు తక్కువ. ఎలక్ట్రిక్ వాహనాలు రావాల్సినంత త్వరగా భారత్ మార్కెట్లోకి రావటం లేదు. ఏయే లాబీలు బలంగా పనిచేస్తున్నాయో గానీ, వాటికెన్నో ప్రతి బంధకాలు! పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) అధ్యయనం ప్రకారం, వచ్చే పాతికేళ్లలో, డీజిల్–గ్యాసోలైన్పై ఆధారపడి నడిచే మన వాహనాల వాటా 51 శాతం నుంచి 58 శాతానికి పెరుగనుంది. ఇది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహనాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్‌కు రక్ష! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఇంధన సంక్షోభం, 90 శాతం మేర పడిపోయిన కరెన్సీ.. తీవ్ర కష్టాలు
బీరూట్: మధ్యప్రాచ్య దేశం లెబనాన్‌లో ఇంధన సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ సరఫరాదారులు అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో సైన్యం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జౌక్ మెస్బేలోని వేర్‌హౌజ్‌లలో అక్రమంగా నిల్వ ఉంచిన 65 వేల లీటర్ల డీజిల్, 48 వేల లీటర్ల పెట్రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని స్థానిక ఆస్పత్రులు, బేకరీ నిర్వాహకులకు పంపిణీ చేశారు. కాగా పెట్రోల్, డీజిల్ దిగుమతిదారులకు ఇచ్చే సబ్సిడీని త్వరలో ఎత్తివేస్తామని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రియాద్ సలామే వారాంతంలో ప్రకటించిన నేపథ్యంలో దేశంలో ఇంధన సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అక్రమ నిల్వలు పెరిగాయి. ఫొటో కర్టెసీ: బీరూట్ టుడే దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో గంటల తరబడి వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో నిరసనలకు దిగుతున్నారు. ఇక అక్కర్లో రహస్యంగా దాచి ఉంచిన ఇంధన ట్యాంకర్‌ను కనుగొన్న ఆందోళనకారులు... 60 వేల లీటర్ల గ్యాసోలిన్, 40 వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆర్మీ రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. మరోవైపు.. ఇంధనాన్ని పంపిణీ చేసేందుకు ఆర్మీ తీసుకువచ్చిన గ్యాసోలిన్ ట్యాంకర్ చుట్టూ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడగా.. ఉద్రిక్త పరిస్థితి నెలకొని, ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో సుమారు 28 మంది మృత్యువాత పడ్డారు. ఓవైపు కరోనా.. మరోవైపు ఇంధన సంక్షోభం కరెంటు కోతలు పెరగడంతో ఆస్పత్రుల్లో పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బీరూట్ మెడికల్ సెంటర్లో ఇంధన కొరత, కరెంటు కోతల కారణంగా రెస్సిరేటర్లు, ఇతర పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో సుమారు 55 మంది రోగులు మరణించినట్లు సమాచారం. ఇందులో 15 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గత రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లెబనాన్.. ప్రస్తుతం కోవిడ్, ఇంధన సంక్షోభంతో పూర్తిగా డీలా పడిపోయింది. ఫొటో కర్టెసీ: బీరూట్ టుడే ఇప్పటికే దేశంలోని సగం మంది జనాభా పేదరికంలో మగ్గిపోతున్నారు. లెబనాన్ కరెన్సీ విలువ 90 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశ అధ్యక్షుడు మిచెల్ ఔన్ ఆదివారం మాట్లాడుతూ... రానున్న రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని సంకేతాలు జారీ చేశారు. కాగా గతేడాది ఆగష్టులో బీరూట్‌లో అతిపెద్ద పేలుడు సంభవించి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగినందున ప్రధాని హసన్ దియాబ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నజీబ్ మికాటి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ.. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో నూతన పాలకులకు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. చదవండి: Afghanistan: మహిళా యాంకర్‌కు తాలిబన్ ప్రతినిధి ఇంటర్వ్యూ! Afghanisthan: ఏమీ వద్దు.. ప్రాణాలు మిగిలితే చాలు.. -
Petrol Free: ఈ పేరుంటే చాలు మీకు పెట్రోల్ ఫ్రీ.. ఫ్రీ
అహ్మదాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి స్వదేశానికి చేరుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనకు భారీగా కానుకలు, ప్రోత్సహాకాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ పెట్రోల్ బంక్ యజమాని నీరజ్ చోప్రాకు గౌరవం ఇస్తూ ప్రజలకు ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నారు. అయితే ఒక షరతుపై పెట్రోల్ ఉచితంగా అందిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించడంతో గుజరాత్‌లోని బరూచ్‌లో ఉన్న పెట్రోల్ బంక్ యజమాని ఆయూబ్ పఠాన్ ఆనందంలో మునిగిపోయాడు. దీంతో నీరజ్ చోప్రా పేరు ఉన్నవారికి రూ.501 విలువైన పెట్రోల్ ఉచితంగా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. ఆ పేరు ఉన్న వ్యక్తులు వచ్చి తమ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి పెట్రోల్ వేసుకువెళ్లవచ్చని తెలిపాడు. దీంతో ఆ రాష్ట్రంలో నీరజ్ పేరు ఉన్నవారందరూ పెట్రోల్ వేసుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే ఇది రెండు రోజులు మాత్రమేనని ఆయూబ్ తెలిపారు. ఈ రెండు రోజుల కార్యక్రమం నీరజ్‌చోప్రాకు గౌరవంగా ఇస్తున్నాం. నిజమైన నీరజ్ పేరు ఉన్నవారికే పెట్రోల్ ఇస్తున్నట్లు ఆయూబ్ పఠాన్ స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలో సోమవారం నీరజ్ చోప్రాకు కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. నీరజ్ చోప్రాకు జ్ఞాపికలు అందించి అతడి ప్రతిభపై ప్రశంసలు కురిపించింది. అయితే ఈ ఉచిత పెట్రోల్ ఆఫర్ సోమవారంతో ముగిసింది. -
గ్రీన్‌పవర్ దిశగా అడుగులు వేస్తున్న ఐవోసీఎల్..!
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తన రిఫైనరీ కేంద్రాలలో గ్రీన్ పవర్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. పలు రిఫైనరీ కేంద్రాల్లో గ్రీన్ పవర్‌తో ఫ్యూయోల్ ఎక్స్పన్షన్ చేయనుంది. గ్రీన్ పవర్‌ను ఉపయోగించడం ద్వారా ఉద్గారాలను తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని ఐవోసీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 నాటికి సుమారు 500,000 బ్యారెల్ పర్ డేకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ పవర్‌ను ఉపయోగించడంతో కొన్ని భాగాల మానుఫ్యాక్చరింగ్లో డీకార్బోనైజ్ చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మధుర శుద్ధి కర్మాగారంలో 1.6 లక్షల బీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను నిర్మించాలని ఐవోసీఎల్ యోచిస్తోంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రాజస్థాన్‌లో పవన విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉంది. విద్యుద్విశ్లేషణ ద్వారా పూర్తిగా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి మథుర శుద్ధి కర్మాగారానికి ఉపయోగించనున్నట్లు పేర్కొంది. సౌర, పవనశక్తి వంటి పునరుత్పాదాకాలను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ వాడకంతో రిఫైనరీలో ఉపయోగించే కార్బన్-ఉద్గార ఇంధనాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రిఫైనింగ్,ఇంధన రిటైలింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయనుందని తెలిపింది. వచ్చే పదేళ్లలో ఐవోసిఎల్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి సారిస్తుందని కంపెనీ ప్రతినిధి వైద్య చెప్పారు. -
ఈ చిన్న చిన్న చిట్కాలతో పెట్రోల్,డీజిల్‌ను ఆదా చేయండి
గత కొద్దిరోజులుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు.అయితే వాటి ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిట్కాలు పాటించి పెట్రోల్- డీజిల్‌ను సేవ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పీడ్ డ్రైవింగ్ చేయకండి మీ మోటారు వాహనాల్ని స్పీడ్‌గా డ్రైవ్ చేయడం,బ్రేకులు వేయడంవల్ల పెట్రోల్ లేదంటే డీజిల్ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా నడపడం వల్ల ఇంధనాన్ని సేవ చేసుకోవడమే కాదు. రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో డ్రైవింగ్ చేయడం వల్ల 33శాతం ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. మీ వేగాన్ని అదుపులో ఉంచుకోండి మీకారు ఇంధన వినియోగం ఏరోడైనమిక్స్, రహదారులు, ఇంజిన్ సామర్ధ్యం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కారు వేగం పెరిగే కొద్దీ ఎదురుగా వీచే గాలిసామర్ధ్యం పెరిగిపోతుంది. దీంతో ఇంధనం అయిపోతుంది. ఇటీవల ఆటోమొబైల్ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వాహనాన్ని నడిపే పద్దతిని బట్టి అది పనిచేసే సామర్థ్యం గణనీయంగా పడిపోతుందని తేలింది. కాబట్టి మీరు 50- 60 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమం. ఇంధన సామర్ధ్యం ఎక్కువగా ఉండాలి అది కారైనా కావొచ్చు, ద్విచక్రవాహనమైనా కావొచ్చు. అందులో ఇంధనం పూర్తి స్థాయిలో ఉండాలి. మనలో ఎక్కువమంది వాహనంలో తగినంత ఇంధన లేకపోయినా డ్రైవింగ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. మీ వాహనం పనితీరు మందగిస్తుంది. రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం ఏదైనా వస్తువును వాడే కొద్ది దాని పనితీరు ఆగిపోతుంది. అలా కాకుండా దాని పనితీరు బాగుండాలంటే మరమ్మత్తులు అవసరం.వాహనాలు కూడా అంతే. సమయానికి వాహనాల్ని శుభ్రం చేయండి. ఇంజన్ , ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్ చెకింగ్ తో పాటు వాహనం కండీషన్ బాగుండేలా చూసుకోవాలి. మీ కారు అద్దాల్ని క్లోజ్ చేయండి కారు అద్దాల్ని ఓపెన్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ప్రయాణంలో కారు అద్దాల్ని ఓపెన్ చేయడం ద్వారా..కారు లోపలికి ప్రవేశించి మీ కారు మరింత వేగంగా వెళ్లేందుకు సాయం చేస్తుంది.దీంతో 10శాతం ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ఏసీ వాడకం తగ్గించండి డ్రైవింగ్ సమయాల్లో కారు ఏసీ వినియోగాన్ని తగ్గించండి.ప్రయాణంలో ఏసీ వినియోగించడం వల్ల ఇంజన్‌పై లోడ్ పెరిగి ఇంధన వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి ఏసీ వినియోగంపై పరిమితులు విధించండి. వాహనం టైర్లపై ఒత్తిడి పడకుండా చూడండి కొంతమంది వాహనదారులు తమ వాహనాల్ని ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. అవసరం లేకుండా బ్రేకులు వేస్తూ వాహనంపై ఒత్తిడిపడేలా చేస్తుంటారు. అలా కాకుండా వాహనాన్ని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ బ్రేక్ వినియోగాన్ని తగ్గిస్తే 20శాతం వరకు ఆదాచేసుకోవచ్చు. ఇంజన్ వినియోగాన్ని తగ్గించండి ప్రయాణంలో వాహనం ఇంజన్ వినియోగం ఎక్కువగా ఉంటే ఇంధన వినియోగం పెరిగిపోతుంది. అదే ప్రయాణంలో ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా ఇంజన్ ను ఆపేయండి. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంజన్ ను ఆపేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.ట్రాఫిక్‌లో 10శాతం కంటే ఎక్కువ సమయంలో ఇంజన్ ఆపేయడం ఉత్తమంది. దీని వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. -
ఈ కొత్త ఆవిష్కరణతో ఇంధనం మరింత ఆదా...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు కొండేక్కుతున్నాయి. పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిమీద మరింత భారంపడనుంది. సుమారు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటింది. కాగా వాహనాల్లో ఇంధన వాడకం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ ఎష్కోల్ సరికొత్త ఆవిష్కరణ రూపొందించారు. అందుకోసం ‘5M మైలేజ్ బూస్టర్’ను ఆవిష్కరించారు. ఈ వ్యవస్థతో ఇంజిన్ నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వెహికిల్ మైలేజీను కూడా పెంచుతుంది. 5M మైలేజ్ బూస్టర్‌లో ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలను కల్పించే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ బూస్టర్‌ను వాహనాలకు అమర్చడంతో.. అధిక మైలేజీను, అధిక పిక్ అప్ను, స్మూత్ డ్రైవింగ్, అధిక టార్క్‌ను, పొందవచ్చునని డేవిడ్ తెలిపారు. తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను వెలువడేలా చేస్తుంది. 5M మైలేజ్ బూస్టర్ ఇంజిన్‌కు అమర్చనున్నారు. బైక్ సీసీ పవర్ ఆధారంగా నిర్దిష్ట సమయంలో అల్ట్రా సోనిక్ తరంగాలను, గ్యాస్ రూపంలోని ప్లాస్మాను మైలేజ్ బూస్టర్‌తో ఇంజిన్‌కు పంపిస్తారు. కాగా ఇప్పటివరకు సుమారు 8 వేల వాహనాలకు 5M మైలేజ్ బూస్టర్‌ను అమర్చారు. 100సీసీ నుంచి 10,000 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ లకు మైలేజ్ బూస్టర్‌ను ఏర్పాటుచేయవచ్చునని డేవిడ్ పేర్కొన్నారు. కాగా ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ తో జతకడితే ఈ టెక్నాలజీను సామాన్యులకు అందుబాటులో వస్తోందని డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఐదు లోహాలు కలసి.. విషాన్ని ఇంధనం చేశాయి!
వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతోందని తరచూ వింటుంటాం. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతీ మనకు తెలుసు. తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఐదు లోహాలతో తయారైన మిశ్రధాతువును ఉ్రత్పేరకంగా వాడటం ద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ను కార్బన్ మోనాక్సైడ్గా మార్చొచ్చని నిరూపించారు. ఈ కార్బన్ మోనాక్సైడ్‌ను పెట్రోలు, డీజిల్ మాదిరిగా నేరుగా ఇంధనంగా వాడుకోవచ్చు. లేదంటే కొన్ని రసాయన చర్యల ద్వారా అన్నింటికంటే మెరుగైన ఇంధనంగా చెప్పే హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చు. ఐదు లోహాలను కలపడం ద్వారా తయారైన సరికొత్త మిశ్రధాతువును ట్రాన్సిషన్ డై చాలకనాడులు అని పిలుస్తారు. అత్యంత పలుచగా ఉండే ఈ రకమైన మిశ్రధాతువులను ఎల్రక్టానిక్స్‌లో, ఆప్టికల్ పరికరాల్లో వాడుకోవచ్చని ఇప్పటికే తెలుసు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మిశ్రధాతువును రసాయన చర్యలకు ఉత్ప్రేరకంగా వాడొచ్చా అన్న అనుమానంతో పరిశోధనలు ప్రారంభించారు. కంప్యూటర్ మోడళ్ల సాయంతో ఈ ధాతువు తయారీకి అవసరమైన లోహ మిశ్రమాన్ని గుర్తించారు. మాలిబ్డినం, టంగ్స్టన్, వనాడియం, నియోబియం, టాన్టలం అనే ఐదు లోహాలను నిర్దిష్ట మోతాదుల్లో కలపడం ద్వారా కొత్త మిశ్రధాతువును తయారు చేయొచ్చని గుర్తించారు. ఈ మిశ్రధాతువును ఉపయోగించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ చాలా వేగంగా కార్బన్ మోనాక్సైడ్గా మారడాన్ని గుర్తించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇతర పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ను కార్బన్ మోనాక్సైడ్గా మార్చుకుని ఇంధనంగా వాడుకోవచ్చు. -
భారీగా తగ్గిన ఇంధన వినియోగం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఎకానమీ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో దేశీయంగా ఇంధన వినియోగం గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతం క్షీణించింది. ఇంధన వినియోగం ఇంతగా తగ్గడం 1998–99 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే ప్రథ మం. 2019–20లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 214.12 మిలియన్ టన్నులుగా ఉండగా 2020–21లో ఇది 194.63 మిలియన్ టన్నులకు క్షీణించింది. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన డేటాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా డీజిల్ తగ్గుదల .. దేశీయంగా అత్యధికంగా ఉపయోగించే ఇంధనమైన డీజిల్ వినియోగం 12 శాతం తగ్గి 72.72 మిలియన్ టన్నులుగా నమోదైంది. పెట్రోల్ డిమాండ్ 6.7 శాతం క్షీణించి 27.95 మిలియన్ టన్నులకు పరిమితమైంది. వంట గ్యాస్ ఎల్పీజీ వినియోగం మాత్రమే 4.7 శాతం పెరిగి 26.33 మిలియన్ టన్నుల నుంచి 27.59 మిలియన్ టన్నులకు చేరింది. కరోనా వైరస్ మహమ్మారి ఉపశమన చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొంత మేర సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం ఇందుకు దోహదపడింది. మరోవైపు, విమానయాన సంస్థలు చాలా భాగం మూతబడే ఉండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) డిమాండ్ 53.6 శాతం క్షీణించి 3.7 మిలియన్ టన్నులకు పరిమింతమైంది. నాఫ్తా అమ్మకాలు దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలో 14.2 మిలియన్ టన్నులుగా ఉండగా, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్ వినియోగం 6 శాతం పెరిగి 7.11 మిలియన్ టన్నులకు చేరింది. ఎకానమీకి ఊతమిచ్చే దిశగా కేంద్రం నిర్మాణ కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవడం ఇందుకు దోహదపడింది. క్రమంగా కోవిడ్ పూర్వ స్థాయికి.. లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేయడంతో గతేడాది ఏప్రిల్‌లో ఇంధన వినియోగం సగానికి సగం పడిపోయింది. ఆంక్షలను సడలించే కొద్దీ క్రమంగా కోలుకోవడం మొదలైంది. గతేడాది సెప్టెంబర్‌లో పెట్రోల్ అమ్మకాలు తిరిగి కోవిడ్–19 పూర్వ స్థాయికి చేరుకోగా, ఆ తర్వాత నెలల్లో పండుగ సీజన్‌తో డీజిల్ విక్రయాలు కూడా పుంజుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఇంధనానికి డిమాండ్ ఏకంగా 18 శాతం ఎగిసి 18.77 మిలియన్ టన్నులకు చేరింది. డీజిల్ వినియోగం అత్యధికంగా 27 శాతం, పెట్రోల్‌కు డిమాండ్ 25.7 శాతం ఎగిసింది. గత మార్చిలో బేస్ స్థాయి తక్కువగా ఉండటం కూడా ఇందుకు కొంత కారణమైంది. లాక్‌డౌన్‌పరమైన ఆంక్షలు గతేడాది మార్చి ఆఖరు నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా? అయితే జాగ్రత్త!
చిక్కడపల్లిలోని భారత్ పెట్రోలియంకు చెందిన ఒక బంక్‌లోరెండు రోజుల క్రితం వాహనంలో పెట్రోల్ పోస్తుండగా మంటలు చెలరేగాయి. ఒక వ్యక్తి సుజికి యాక్సిస్ ద్విచక్రవాహనంపై దూరప్రాంతానికి వెళ్లి వస్తూ మధ్యలో బంకు వద్ద పెట్రోల్ పోయించుకుంటుండగా వేడిగా ఉన్న ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న కారు తార్నాకలోని మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోగానే ఇంజిన్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్, అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం అయింది. సాక్షి, సిటీబ్యూరో: భానుడి భగభగలకు ఇంధనం ఆవిరైపోతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాహనాల ఇంధనంపై ప్రభావం చూపుతున్నాయి. మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌తో ఒక వైపు తగ్గుతున్న మైలేజీకి తోడు ట్యాంక్‌లో పోస్తున్న ఇంధనం రోజువారీ అవసరాల కోసం ఏ మూలకు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఎండల్లో పార్కింగ్తో ట్యాంకుల్లోని ఇంధనం వేడెక్కి ఆవిరై గాలిలో కలుస్తోంది. ఫలితంగా వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతిరోజు ధరల సవరణలతో పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌లను పోయించుకోవడం సర్వసాధారణమైంది. వాహనాల ట్యాంకులు ఉష్ణతాపానికి వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది. ప్రతిరోజు సగటు వినియోగంలో 20 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్ వేడికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముప్పు పొంచి ఉంది.. సూర్యుడి ప్రతాపానికి కార్లు, ఆటోలు, బైక్‌ల నుంచి మంటలు చెలరేగుతాయి. సాధారణంగా వాహనాల్లో వాడుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ మండే స్వభావం కలిగి ఉంటాయి. ఇంధనాలు లీకైనా వేడికి వెంటనే మంటలు వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరచూ తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏసీ కారులో ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మెకానిక్‌లు సూచిస్తున్నారు. వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్ వేడెక్కడం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ లీకేజీలతో మంటలు అంటుకునే అవకాశాలు లేకపోలేదు. వాహనాల్లో నాణ్యత లేని వైర్లు వాడడంతో నిప్పు రవ్వలు వచ్చి మంటలు అంటుకునే ప్రమాదమున్నది. (చదవండి: సౌదీ చమురు పెత్తనానికి చెక్!) వాహనాలు.. ఇలా గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 65.14 లక్షల వాహనాలున్నాయి. అందులో ద్విచక్ర వాహ నాలు సుమారు 44.04 లక్షల వరకూ ఉంటాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 560 పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా ప్రతి రోజూ 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు సాగుతున్నట్లు చమురు కంపెనీల గణాంకాలు చెబుతున్నాయి. ప్రధాన ఆయిల్ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల నిల్వలపై వాహనదారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనాల ట్యాంక్‌లో సగం వరకే ఇంధనం నింపాలని స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌ను నిండుగా నింపితే ఉష్ణతాపానికి ఆవిరై పోవడంతో పాటు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. జాగ్రత్తలు ఇలా... వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయాలి. ఇంజన్‌కు సరిపడా ఆయిల్ ఉండేట్లు చూడాలి. ఎండల వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పల్చబడిపోతుంది. వేసవిలో ఇంజిన్ గార్డు లు తొలగించడం మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు మధ్యమధ్యలో బండి ఆపి కొద్దిసేపు ఇంజ¯Œన్కు విశ్రాంతినివ్వాలి. వాహనాల పెట్రోల్ ట్యాంకుపై దళసరి కవర్ ఉండేటట్లు చూడాలి. కవర్లు వేడెక్కకుండా ఉండేందుకు వెల్వెట్, పోస్టు క్లాత్ సీట్ కవర్లు వాడాలి. వేసవి కాలంలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాత్రి సమయంలో బైక్‌ను పార్క్ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్ మూతను తెరచి మూసివేయాలి. (చదవండి: ఏప్రిలియా బుకింగ్స్ షురూ...!) -
రూ.6 లక్షల కోట్లకు చేరిన ఆహారం, ఎరువుల సబ్సిడీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహారం, ఇంధనం, ఎరువులపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు సుమారు రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 బడ్జెట్ అంచనాల్లో రూ.2,27,793.89 కోట్లుగా ఉన్న సబ్సిడీ.. సవరించిన అంచనాల ప్రకారం రూ.5,95,620.23 కోట్లకు పెరిగింది. గతేడాది ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం.. కోవిడ్, లాక్డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితులతో అంచనాలు తలకిందులయ్యాయి. 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల సబ్సిడీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. అయితే, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గానూ సబ్సిడీ బిల్లును రూ.3,36,439.03 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఆహార ధాన్యాలపై సబ్సిడీ రూ.1,15,569.68 కోట్ల నుంచి రూ.4,22,618.14 కోట్లకు పెరిగింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.2,42,836 కోట్లుగా అంచనా వేశారు. ఎరువులపై సబ్సిడీ రూ.71,309 కోట్ల నుంచి రూ.1,33,947.3 కోట్లకు చేరగా.. 2021–22లో రూ.79,529.68 కోట్లుగా అంచనా వేశారు. పెట్రోలియం ఉత్పత్తులు(ఎల్పీజీ, కిరోసిన్) మీద సబ్సిడీని రూ.40,915.21 కోట్లుగా అంచనా వేయగా.. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.39,054.79 కోట్లయ్యింది. 2021–22లో పెట్రోలియం సబ్సిడీ కింద రూ.14,073.35 కోట్లు కేటాయించారు. -
ఇంధనం ఆదా చేద్దాం–కాలుష్యం తగ్గిద్దాం
సహజ వనరులు ప్రకృతి వర ప్రసాదాలు. సకల జీవుల మనుగడకు సహజ వనరులే పట్టుగొమ్మలు. ప్రకృతి ప్రసా దించే నీరు, గాలి, నేల, చమురు, శిలాజ ఇంధనాలు, వృక్ష సంపద, జీవ వైవిధ్యం లాంటివి ప్రపంచ మానవాళికి మౌలిక ప్రాణాధారాలుగా నిలు స్తున్నాయి. భూగర్భంలోంచి తోడుకునే చమురు, సహజ వాయువులు ముఖ్యమైన ఇంధనాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగపడుతున్నాయి. ఈ ఇంధనా లను తోడుకొని, విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల అవి దినదినం తరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో వాటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని గమనించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సంప్రదాయ, తరిగే శిలాజ ఇంధనాలను పరిరక్షించు కోవాలనే సదుద్దేశంతో ప్రతియేటా జనవరి 4 నుంచి 10వ తేదీ వరకు ‘చమురు –సహజ వాయు పరిరక్షణ వారోత్సవాలు’ జరుపుకో వడం ఆనవాయితీగా వస్తున్నది. పెట్రోలియం ఉత్పత్తులకు ఆధారమైన చమురు నుండి బ్యూటేన్, డీజిల్, గ్యాసోలీన్, కిరోసిన్, ఎల్పీజీ, ద్రవ సహజ ఇంధనాలు, ప్రోపేన్, పెట్రోల్ లాంటి అనేక ఇంధనాలు వస్తాయి. సహజ వాయువులో మీథేన్ 95 శాతం, ఈథేన్ 4 శాతం, ప్రోపేన్ 0.2 శాతం, ఐసోబ్యూటేన్ 0.02 శాతం ఉంటాయి. ఇలాంటి సహజ వాయువును సులభ, సురక్షిత, పర్యావరణహిత ఇంధనంగా వినియోగిస్తారు. పెట్రో లియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ నాయకత్వంలో చమురు సంస్థలు, పెట్రోలియం పరిరక్షణ పరిశోధనా సంఘం వారు 1991 నుంచి శిలాజ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. సహజ ఇంధనాల గిరాకీ క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఆదా చేస్తే, ఉత్పత్తి చేసినట్లుగానే భావించాలని సామాన్య జనాలకు అవగాహన కల్పించడం జరుగుతున్నది. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడే పవర్ ప్లాంట్లు, బాయిలర్లు, ఫర్నేసులు, ఎరువుల కార్మాగా రాలు, గృహాలు, పరిశ్రమలు, రవాణా వాహనాలతో తీవ్రమైన గాలి కాలుష్యం (హైడ్రోకార్బన్, కార్బన్ మోనాక్సయిడ్, సీసం, సల్ఫర్ లాంటివి) ఏర్పడుతు న్నది. ఈ వారోత్సవాల్లో భాగంగా సామాన్య ప్రజ లకు, విద్యార్థినీవిద్యార్థులకు చమురు, సహజ వాయు వుల పరిరక్షణ అవసరం మీద అవగాహన కల్పించడం, నిపుణులతో ఉపన్యాసాలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్మికులకు శిక్షణ ఇవ్వడం, ఆడియో, వీడియో ప్రచారాలు చేయడం, కరపత్ర వితర ణలు, ఇంధన ఆదాపై పోటీలు లాంటి అనేక కార్య క్రమాలు నిర్వహించడం జరుగుతోంది. శిలాజ ఇంధనాలు దేశ ప్రగతికి వినియోగపడు తున్నప్పటికీ దినదినం వాటి డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరుగుతూ, ధరల నియంత్రణ కొరవడి విలువైన విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా వినియో గించాల్సి వస్తున్నది. రవాణా వాహనాల కార్యదక్షత పెంచడం, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టపరచడం, ఘన ద్రవ ఇంధనాలను బదులుగా వాయు ఇంధనా లను వినియోగించడం లాంటి చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మహానగరాల్లో ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు లాంటి రవాణా వాహనాల్లో సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాడటం పెరగడం ముదా వహం. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో తాజ్‌మహల్ లాంటి ప్రపంచ వారసత్వ స్మారక, చారిత్రక, పర్యాటక కట్టడాలు కళావిహీనమవటం జరుగుతున్నది. కిరోసిన్ వాడకాన్ని తగ్గించడం, సీసం లేని ఇంధనాలను విని యోగించడం, పెట్రోలియం వాహనాలను సీఎన్జీ వాహనాలుగా మార్చడం లాంటి చర్యలు తీసుకోవడం మరింత వేగంగా, ప్రాధాన్యతా క్రమంలో జరగాలి. పెట్రోలు, డీజిల్ ధరలు నూరు రూపాయలవుతున్న సంధికాలంలో ప్రజలు పెట్రో లియం ఉత్పత్తులను ఆదా చేయకపోతే, సమీప భవిష్యత్తులో మన ఆదాయంలో సగం ఇంధనాలకే వెచ్చించాల్సి వస్తుందని గమనించాలి. దీపం ఉండ గానే ఇల్లు చక్కదిద్దుకుందాం. ఇంధనాలు ఆదా చేసి ఖర్చు, కాలుష్యాలను తగ్గించుకుందాం. -డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి (జనవరి 4–10 వరకు చమురు–సహజ వనరుల పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా) వ్యాసకర్త విశ్రాంత ప్రధానాచార్యులు, కరీంనగర్ ‘ మొబైల్: 99497 00037 -
మేం మారం.. మార్చం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తోంది. దీంతో రాష్ట్రాల్లోని ఆర్టీసీల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచేందుకు ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)’పథకం కింద బ్యాటరీ బస్సులను కేంద్రం రాయితీకి అందిస్తోంది. రాష్ట్రంలో కూడా ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ఆరీ్టసీలో సాధారణ ప్రయాణికుల కోసం ఇప్పటివరకు ఒక్క బ్యాటరీ బస్సు కూడా వినియోగంలో లేదు. విమానాశ్రయానికి వినియోగిస్తున్న 40 బస్సులు మినహా ఆరీ్టసీలో ఒక్క ఎలక్ట్రిక్ బస్సు కూడా లేదు. దీంతో సాధారణ బస్సుల నుంచి విపరీతమైన కాలుష్యం వెలువడుతుండటమే కాకుండా, ఇంధన రూపంలో భారీగా ఖర్చు అవుతోంది. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ఆరీ్టసీకి.. ఇంధన ఖర్చు చాలా భారంగా మారింది. ఆర్టీసీ చేస్తున్న మొత్తం వ్యయంలో దాదాపు 30 శాతం ఇంధనానికే ఖర్చవుతోందంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల వాడకంవైపు ఆర్టీసీ దృష్టి సారించట్లేదు. మారుస్తామని ముందుకొచ్చినా.. కొత్తగా ఓ బ్యాటరీ బస్సు కొనాలంటే రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్లు అవుతుంది. అంత ఖర్చు భరించే స్థాయిలో ఆర్టీసీ లేదు. కానీ ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశముంది. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఇటీవల బస్సులను మారుస్తామని ముందుకొచి్చనా ఆర్టీసీ దాన్ని పట్టించుకోలేదు. కాగా, ఆరీ్టసీలో ప్రస్తుతం దాదాపు 7 వేల బస్సులున్నాయి. అన్నింటినీ కాకున్నా.. హైదరాబాద్ సిటీలో తిరిగే బస్సులనే కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.. ఇంధన పొదుపుతో భారీ లాభం.. డీజిల్ వినియోగం ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతోంది. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో పర్యావరణం కూడా దెబ్బతింటోంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. మన దేశంలో సమీప భవిష్యత్తులో ఇవి పెద్ద సమస్యలు కానున్నాయి. వాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచటమే విరుగుడు. దేశంలో హైబ్రిడ్ నమూనా పక్కాగా జరుగుతోంది. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సు కొనటం భారీ వ్యయంతో కూడుకున్న పని. అందులో 10 శాతంలోపు ఖర్చుతో సాధారణ బస్సును ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేయవచ్చు. ఇది విజయవంతంగా అమలవుతున్న కొత్త పరిజ్ఞానం. ఎక్కువ బస్సులు వినియోగించే ఆర్టీసీ దీనిపై దృష్టి సారిస్తే సంస్థకు, ప్రజలకు ఎంతో ఉపయోగం. బస్సును పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంగా మారిస్తే అయ్యే ఖర్చు కంటే హైబ్రిడ్ నమూనాలోకి మార్చటం చాలా తక్కువ.’ – శుభం గుప్తా, ఎలక్ట్రిక్ వాహనరంగ నిపుణులు ఏడాది పొదుపుతో కన్వర్షన్.. ప్రస్తుతం మన దేశంలో సాధారణ బస్సులను ఎలక్ట్రిక్ వెర్షన్‌లోకి కన్వర్ట్ చేసే పరిజ్ఞానం ఉంది. ఒక బస్సును కన్వర్ట్ చేయటానికి అయ్యే వ్యయం రూ.8 లక్షలు. సిటీలో 3 వేల బస్సులుంటే.. అన్నింటిని మారిస్తే అయ్యే వ్యయం రూ.240 కోట్లు. కన్వర్షన్ వల్ల సాలీనా పోగయ్యే ఇంధన పొదుపు (రూ.300 కోట్లు) కంటే ఇది తక్కువ. ఒకసారి పెట్టుబడి పెడితే ఏడాదిలోనే అంతకుమించి తిరిగి వస్తుందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్లోకి కాకుండా హైబ్రిడ్ పద్ధతిలో కన్వర్ట్ చేసే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అంటే.. ఇటు డీజిల్, అటు కరెంటుతో నడిపే వెసులుబాటన్నమాట. ఎలక్ట్రిక్ నమూనాలోకి కన్వర్ట్ అయ్యాక ఏదైనా సమస్య ఉత్పన్నమైతే, దాన్ని పరిష్కరించేవరకు డీజిల్‌తో నడుపుకోవచ్చు. పర్యావరణానికి ఎంత మేలో.. ఒక సిటీ బస్సు సంవత్సరానికి దాదాపు 200 కిలోల కార్బన్‌ను విడుదల చేస్తోంది. ప్రస్తుతం నగరంలో 3 వేల వరకు సిటీ బస్సులున్నాయి. అటూఇటుగా చూస్తే దాదాపు 6 లక్షల కిలోల కార్బన్‌ను విడుదల చేస్తున్నాయి. అంటే నగర జనం ఆరోగ్యం అంతగా పదిలం కాదని ఇట్టే అర్థమవుతోంది. ఈ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారిస్తే.. జీరో పొల్యూషన్. వాతావరణంలో కలిసే వాహన కాలుష్యాన్ని తగ్గించినట్లూ అవుతుంది. వార్షిక ఇంధన ఆదా.. రూ.300 కోట్లు.. ప్రస్తుతం నగరంలో ఉన్న సిటీ బస్సులు కాల్చే ఇంధన వ్యయం వార్షికంగా రూ.494 కోట్లు. ఇది ప్రస్తుతం ఉన్న డీజిల్ ధరల ప్రకారం. కొంతకాలంగా డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ ధర పెరిగే కొద్దీ ఆర్టీసీ వార్షిక డీజిల్ భారం అంతగా పెరుగుతుంది. అదే సిటీ బస్సులన్నింటిని ఎలక్ట్రిక్‌లోకి కన్వర్ట్ చేస్తే.. వాటి వార్షిక ఇంధన వ్యయం రూ.200 కోట్లు. అంటే దాదాపు రూ.300 కోట్లు వార్షిక ఇంధన పొదుపన్నమాట. -
ఇక మీదట ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’
కోల్‌కతా: బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి.. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొండి అంటూ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కొందరు మాత్రం అస్సలు పట్టించుకోరు. ఫైన్ విధించినా మారరు కొందరు. అలాంటి వారి కోసం ఇక మీదట హెల్మెట్ ధరించకపోతే.. బంకుల్లో వారికి పెట్రోల్ పొయకూడదంటూ కోల్‌కతా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 8 నుంచి కోల్‌కతా పరిధిలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మ మాట్లాడుతూ.. ‘ఇక మీదట హెల్మెట్ ధరించకుండా బంకుల్లోకి వచ్చే టూ వీలర్ వాహనాలకు పెట్రోల్ పోయకూడదని ఉత్తర్వులు జారీ చేశాం. బైక్ నడిపేవారితో పాటు.. వెనక ఉన్నవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి. కోల్‌కతా పోలీసు స్టేషన్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది’ అన్నారు. డిసెంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకు ఈ ఉత్తుర్వులు అమల్లో ఉంటాయి అని తెలిపారు. (చదవండి: ఈ హీరోయిన్‌కు ఫైన్ వేసిన పోలీసులు) ఇక ఓ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. హెల్మెట్ కొనలేని వారికి రాష్ట్ర ప్రభుత్వమే వాటిని అందజేస్తుందని తెలిపారు. ‘హెల్మెట్ ధరించి బైక్‌లు నడపండి. మాస్క్ ధరించకపోతే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తానని హెచ్చరించే ప్రభుత్వం మాది కాదు. మాస్క్ ధరించాల్సిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇక హెల్మెట్ కొనలేని వారు మీ సమీప పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. మీ వివరాలు వారికి ఇవ్వండి. వారు మీకు హెల్మెట్ ఇస్తారు’అని తెలిపారు. -
భారీగా తగ్గిన విమాన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్/ఏటీఎఫ్) ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ ధరలను 23 శాతం తగ్గించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలకన్నా చౌక ధరకు ఏటీఎఫ్ అందుబాటులోకి రావడం ఆసక్తికరం. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ (వెయ్యి లీటర్లు)కు రూ.6,813 తగ్గడంతో రూ.22,545కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.22.54గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59గా ఉండడంతో ఏటీఎఫ్ ధర మూడో వంతుకే అందుబాటులోకి వచ్చినట్టయింది. ఢిల్లీలో డీజిల్ ధర రూ.62.29గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏటీఎఫ్ ధరలు రెండు వంతుల మేర తగ్గడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు చారిత్రక కనిష్టాలకు పడిపోవడం కలిసొచ్చింది. -
పెట్రోల్ లేకుండా నడిచే బైక్..
సాక్షి,సిటీబ్యూరో: కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు ‘ఇంధన రహిత బైక్ ’ను ఆవిష్కరించారు. కాగజ్ నగర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సలీం, జె.ఆకాష్, అఖిల్ కుమార్, ఎస్.డి.ఆలం, మాలికార్జున్, ఎం.డి.ఇసానుల్లాఖాన్‌లు బృందంగా ఏర్పడి బైక్ తయారీలో సఫలీకృతులయ్యారు. ఈ బైక్‌కు పెట్రోల్, డీజిల్, చార్జింగ్ లాంటి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. 50–60 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి బి.షఫీవుల్లా ఇటీవల కాగజ్ నగర్‌లోని గురుకులాలను పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు ‘ఇంధన రహిత బైక్’ తయారీ ప్రాజెక్టు కోరికను వ్యక్తం చేశారు. స్పందించిన కార్యదర్శి విద్యార్థులను ప్రోత్సహించడానికి హైదరాబాద్ బహదూర్‌పురా బాయ్స్–1లో వారికి తగిన సౌకర్యాలు కల్పించారు. తక్కువ వ్యవధిలో గేర్‌లెస్ బైక్ సిద్ధమైంది. శాశ్వత మాగ్నెట్ బ్రష్‌లెస్ డీసీ (బీఎల్డీసీ) మోటార్, పవర్ కంట్రోలర్, డైనమో, బ్యాటరీస్, ఎంసీబీ బాక్స్‌లు ఏర్పాటు చేసి తద్వారా శక్తిని పొందేలా ఏర్పాటు చేశారు. పెట్రోల్, ఇంజన్ బైక్ లానే ఉంటుంది. సమ్మర్ వెకేషన్లో ఎక్స్పోజర్ వర్క్‌షాప్ మైనారిటీ గురుకుల ప్రత్యేక ఆవిష్కరణ ఇంధన రహిత బైక్ అని రుకుల కార్యదర్శి బి. షఫీవుల్లా వెల్లడించారు. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ దొరకడం చాలా కష్టం, కాబట్టి ఈ బైక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ తరహా వినూత్న ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సమ్మర్ వెకేషన్లో హైదరాబాద్‌లో ఎక్స్పోజర్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిలిపివేశాయి. విశాఖపట్టణం, కొచ్చిన్, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా... ఈ ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా విమానాలకు ఇంధన సరఫరాలను గురువారం సాయంత్రం గం. 4 ల నుంచి ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్ ఇండియా సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఇంధన సరఫరాల నిలిపివేత కారణంగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని వివరించారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా తమ పనితీరు చాలా బాగుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆరోగ్యకరమైన నిర్వహణ లాభం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామని పేర్కొన్నారు. వాటా విక్రయం ద్వారా నిధుల లభించని పక్షంలో భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోలేమని తెలిపారు. -
ఎకో ఫ్రెండ్లీ గ్రాఫెన్‌ను ఆవిష్కరించిన విద్యార్థులు
సాక్షి, కాజీపేట : నిట్ వరంగల్, ఆస్ట్రేలియా విద్యార్థులు సంయుక్తంగా ఎకో ఫ్రెండ్లీ గ్రాఫెన్‌ను ఆవిష్కరించారు. నీలగిరి చెట్టు(బంకచెట్టు) బెరడుకు వివిధ రకాల రసాయన చర్యలు నిర్వహించి గ్రాఫెన్ ఇంధనం సృష్టించి నూతన పరిశోధనకు నాంది పలికారు. సాధారణంగా భారతదేశం, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధికంగా లభించే నీలగిరి చెట్లను విద్యుత్ ప్రవాహానికి ఉపయోగించే కాపర్‌కు దీటుగా రూపకల్పన చేయాలనే లక్ష్యంతో నిట్ వరంగల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్లు సాయికుమార్ మంచాల, వీఎస్ఆర్కే.తాండవ, ఆస్ట్రేలియా ఆర్ఎంఐటీ యూనివర్సిటీకి చెందిన జంపయ్య దేశెట్టి సంయుక్తంగా ప్రొఫెసర్లు డాక్టర్ విష్ణుశంకర్, సురేష్ పర్యవేక్షణలో పరిశోధనలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు ప్రకృతిలో లభించే నీలగిరి చెట్లను ఇంధన తయారీకి ఉపయోగించవచ్చని అంతర్జాతీయ పరిశోధన పత్రాలు, స్థిరమైన రసాయన శాస్త్రం, ఇంజినీరింగ్‌లో పొందుపరిచినట్లు గైడ్ విష్ణుశంకర్ గురువారం నిట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. ఈ పరిశోధనలు రాబోవు రోజుల్లో పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్ అందించేందుకు తోడ్పడతాయని వివరించారు. -
ఇంధనాల రిటైలింగ్‌లో పోటీకి ఊతం
న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల ఏర్పాటు లైసెన్సుకు సంబంధించిన నిబంధనలను సడలించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు చేస్తే ఇంధనాల రిటైలింగ్ రంగంలో పోటీకి తోడ్పాటు లభిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (ఓఎంసీ) గుత్తాధిపత్యానికి గండిపడుతుందని, అవి కూడా పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడగలదని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ మొదలైన ఇంధనాల రిటైల్ బంకులు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు హైడ్రోకార్బన్ ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్స్, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్‌పై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సిందేనని నిబంధనలు ఉన్నాయి. అయితే, చమురు, గ్యాస్ రంగంలో అంత భారీగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ఇలాంటి రవాణా ఇంధనాల విక్రయ లైసెన్సులు పెద్ద ప్రోత్సాహకాలుగా అనిపించవని కేంద్ర ప్రభుత్వం అయిదుగురు సభ్యులతో నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి రూ. 2,000 కోట్ల పెట్టుబడుల నిబంధనను ఎత్తివేస్తే వైవిధ్యంగా ఇంధన విక్రయ సేవలు అందించగలిగే సంస్థలకు అవకాశం లభించగలదని ఒక నివేదికలో సూచించింది. చాలా సున్నితమైన, నిత్యావసర ఉత్పత్తులైన ఇంధనాలను సురక్షితంగా విక్రయించేందుకు అనేక జాగ్రత్తలు అవసరమవుతాయి కాబట్టి దీని రిటైలింగ్ లైసెన్సులకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంది. దరఖాస్తుదారు సామర్ధ్యం, పూర్వ చరిత్ర ప్రాతిపదికగా లైసెన్సుల జారీ ఉండాలని సూచించింది. సిఫార్సుల ప్రకారం కొత్త సంస్థలు.. ఏడేళ్ల కాలంలో కనీసం 100 రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేయాలి. వీటిలో 5 శాతం బంకులు నిర్దేశిత మారుమూల ప్రాంతాల్లో ఉండాలి. ఇప్పటిదాకా 9 ప్రైవేట్ సంస్థలకే లైసెన్సులు.. 2002లో ఇంధనాల రిటైలింగ్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలను కూడా అనుమతించిన తర్వాత నుంచి ఇప్పటిదాకా కేవలం తొమ్మిది సంస్థలకు మాత్రమే అనుమతులు లభించినట్లు ఇక్రా పేర్కొంది. పీఎస్యూయేతర ఓఎంసీల మార్కెట్ వాటా 2013 మార్చి ఆఖరు నాటికి 6 శాతంగా ఉండగా.. 2019 మార్చి 31 నాటికి 10 శాతానికి చేరింది. ప్రైవేట్ రంగంలో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్), రాయల్ డచ్ షెల్ సంస్థలు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రిలయన్స్‌కి సుమారు 1,400 అవుట్‌లెట్స్ ఉన్నాయి. నయారాకు 5,128 బంకులు, షెల్‌కు 145 బంకులు ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన బీపీ కొన్నాళ్ల క్రితమే 3,500 అవుట్‌లెట్స్ ఏర్పాటుకు లైసెన్సు దక్కించుకున్నా, ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు. అదానీ గ్రూప్‌తో కలిసి 1,500 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ వెల్లడించింది. -
మరింతగా అప్పుల ‘చమురు’!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) రుణాలపై ఆధారపడడం రానురాను మరింత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్నే (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఉమ్మడి రుణాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడింటి రుణాలూ ఈ ఏడాది మార్చి నాటికి ఐదేళ్ల గరిష్ట స్థాయి 1.62 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఏడాది క్రితం ఉన్న రూ.1.25 లక్షల కోట్ల రుణాలతో పోలిస్తే ఇవి ఏకంగా 30 శాతం పెరిగిపోయాయి. ముఖ్యంగా వీటిల్లో ఒక్క ఐవోసీ రుణాలే 2019 మార్చి నాటికి రూ.92,712 కోట్లు కావడం గమనార్హం. ఆ తర్వాత బీపీసీఎల్ రుణాలు రూ.42,915 కోట్లు, హెచ్‌పీసీఎల్ రుణ భారం రూ.26,036 కోట్లు చొప్పున ఉన్నాయి. ఈ మూడు కంపెనీలూ కలసి కొత్తగా రూ.36,402 కోట్ల మేర రుణాలను సమీకరించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మూలధన విస్తరణ కార్యక్రమాలకు తోడు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో రాకపోవడమే రుణ భారం పెరిగేందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.33,900 కోట్ల మేర సబ్సిడీ ఓఎంసీలకు రావాల్సి ఉంది. ద్రవ్యలోటు సర్దుబాటు కోసమని ఓఎంసీల సబ్సిడీల చెల్లింపులను ప్రభుత్వం వాయిదా వేయడంగమనార్హం. భారీ విస్తరణ కార్యక్రమాలు అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి ఓఎంసీల ఉమ్మడి రుణ భారం రూ.1.62 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ... 2014 ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే ఉందని చెప్పాలి. అప్పట్లో చమురు ధరలు చారిత్రక గరిష్టాలకు చేరిన సమయం కావడంతో ఓఎంసీల ఉమ్మడి రుణ భారం రూ.1.76 లక్షల కోట్ల స్థాయికి పెరిగిపోయింది. ‘‘బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలతో పోలిస్తే ఐవోసీ భారీగా మూలధన వ్యయ ప్రణాళికలను అమలు చేస్తోంది. హెచ్‌పీసీఎల్‌కు ఎక్కువ శాతం మార్కెటింగ్ కార్యకలాపాలు కావడంతో నగదు ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, మోస్తరు విస్తరణ ప్రణాళికలను అమల్లో పెట్టింది. బీపీసీఎల్‌కు మాత్రం చమురు వెలికితీత, ఉత్పత్తితో పాటు పట్టణ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి’’ అని ఆయిల్ అండ్ గ్యాస్ రంగ విశ్లేషకుడు ఒకరు పేర్కొన్నారు. రావాల్సిన బకాయిలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లింపుల్లో జాప్యం చేయడం కారణంగానే ఓఎంసీలకు ఒక్కోదానికి మార్చి నెలలో రూ.5,000– 10,000 కోట్ల వరకు రుణం పెరిగినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. ‘‘మా రుణభారం ఇప్పటి వరకైతే రూ.81,000 కోట్లకు పెరిగింది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి రూ.19,000 కోట్ల మేర బకాయిలు రాకపోవడం వల్లే. ఇందులో ఎల్పీజీకి సంబంధించి ప్రత్యక్ష నగదు బదిలీ రూ.13,883 కోట్లుగా ఉంటే, కిరోసిన్ సబ్సిడీ రూ.3,395 కోట్ల మేర ఉంది. మిగిలిన రూ.2,000 కోట్లు పీఎంయూవై డిపాజిట్’’ అని ఈ నెల 17న ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ ఏకే శర్మ పేర్కొనడం గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వానికి అధిక డివిడెండ్ చెల్లించాల్సి రావడం, మధుర రిఫైనరీకి సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ సైతం ఇండియన్ ఆయిల్ రుణ భారం పెరిగిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. -
జెట్ ఎయిర్వేస్కు ఐవోసీ షాక్
సాక్షి,ముంబై : సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అద్దె బకాయిలు చెల్లించలేక పలు విమాన సర్వీసులను రద్దు చేసింది మరోవైపు జీతాలు చెల్లించడంలో విఫలం కావడంతో జీతాలివ్వకపోతే విధులకు రాలేమని పైలట్లు తేల్చిపారేశారు. ఈ పరిస్థితి కొనసాగుతుండగానే తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎయిర్‌లైన్ మీద మరో బాంబు వేసింది. బకాయిలు చెల్లించని కారణంగా ఇకపై ఇంధన సరఫరా చేయబోమని శుక్రవారం ప్రకటించింది. దీంతో మూలిగే నక్కమీద మీద తాటిపండులా అయిపోయింది జెట్ ఎయిర్వేస్ పరిస్థితి. కాగా రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నజెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. దీంత మొత్తం 69 విమానాలను నిలిపివేసి నట్టయింది. దాదాపు 16 వేల మంది సిబ్బందికి మార్చి నెల వేతనాలు బకాయి పడిన సంగతి తెలిసిందే. -
విద్యుత్ వాహనాలకు ఇంధనం
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 పథకం అమలును పర్యవేక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా అంతర్–మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈవో, పారిశ్రామిక ప్రోత్సాహం.. అంతర్గత వాణిజ్య వ్యవహారాల విభాగం కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శితో పాటు విద్యుత్.. పునరుత్పాదక ఇంధనాల శాఖ కార్యదర్శి తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏ వాహనానికి గరిష్టంగా ఎంత మేర ప్రోత్సాహకం ఇవ్వాలి, వివిధ విభాగాలకు నిధుల కేటాయింపులు ఎలా ఉండాలి తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సుమారు రూ. 10,000 కోట్లతో ప్రకటించిన ఫేమ్ ఇండియా రెండో విడత కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి మూడేళ్ల పాటు అమలవుతుంది. ఈ స్కీము కింద 2019–20లో రూ. 1,500 కోట్లు, 2020–21లో రూ. 5,000 కోట్లు, 2021–22లో 3,500 కోట్లు వ్యయం చేయనున్నారు. విద్యుత్ బస్సులు, ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్లు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, విద్యుత్ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు దీనికింద ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ స్కీము ప్రకారం 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు దాదాపు రూ. 20,000 దాకా సబ్సిడీ లభిస్తుంది. అలాగే రూ. 5 లక్షల దాకా ధర ఉండే (ఎక్స్–ఫ్యాక్టరీ రేటు) 5 లక్షల ఎలక్ట్రిక్ రిక్షాలకు దాదాపు రూ. 50,000 దాకా ప్రోత్సాహకం ఉంటుంది. రూ. 15 లక్షల దాకా ఖరీదు చేసే 35,000 పైచిలుకు విద్యుత్ కార్లకు రూ. 1.5 లక్షల దాకా ప్రోత్సాహకం ఉంటుంది. రూ. 2 కోట్ల దాకా ఖరీదు చేసే 7,090 ఎలక్ట్రిక్ బస్సులకు రూ. 50 లక్షల దాకా ప్రోత్సాహకం లభిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 2,700 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ఈ పథకం కింద తోడ్పాటు లభించనుంది. -
పెట్రోల్, డీజిల్ కంటే విమాన ఇంధనమే చౌక!
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను కిలోలీటర్‌కు రూ.9,990 (14.7 శాతం) తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.58,060కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.58.06. ఢిల్లీ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర రూ.68.65తో పోలిస్తే తక్కువకు అందుబాటులోకి వచ్చింది. లీటర్ డీజిల్ ధర రూ.62.66 కంటే కూడా చౌకగా మారింది. ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఇది పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం. డిసెంబర్‌లోనూ ఓ సారి పెద్ద మొత్తంలో రేట్లకు కోత విధించిన విషయం తెలిసిందే. దీంతో ఏటీఎఫ్ ధరలు ఏడాది కాలంలోనే కనిష్ట స్థాయికి చేరాయి. -
పెట్రోల్ నింపేందుకు మహిళ తిప్పలు
కొన్ని సార్లు కొందరు వ్యక్తులు చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అలాంటిదే అమెరికాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఎలక్ట్రిక్ కారులో పెట్రోల్ నింపడానికి చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను గమనిస్తే.. యూఎస్‌లోని ఓ ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు ఎలక్ట్రిక్ కారులో వచ్చిన మహిళ అందులో పెట్రోల్ నింపేందుకు చాలా విధాలుగా ప్రయత్నించారు. అది ఎలక్ట్రిక్ కారు అనే విషయం మార్చిపోయారో/తెలియకనో గాని అందులో పెట్రోల్ కొట్టడానికి శత విధాల ట్రై చేశారు. పెట్రోల్ ట్యాంక్ ద్వారం కోసం కారు చుట్టూరా వెతికారు. చివరకు కారు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూశారు. దీనిని చూస్తున్న అక్కడివారు తెగ నవ్వుకున్నారు. దాదాపు రెండు నిమిషాలకు పైగా ఆమె కారులో పెట్రోల్ నింపేందుకు ప్రయత్నించారు. చివరకు ఓ వ్యక్తి ఆమె వద్దకి వచ్చి అది పెట్రోల్ కారు కాదని.. ఎలక్ట్రిక్ కారు అని చెప్పారు. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన ఆమె నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా ఆమె వెనుకల కారులో కూర్చుని ఉన్నవారు వీడియో తీశారు. తర్వాత దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. -
అది పెట్రోల్ కారు కాదు.. ఎలక్ట్రిక్ కారు
-
మారుతీ నుంచి కొత్త ఎర్టిగా...
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) మల్టీపర్పస్ వెహికల్ ఎర్టిగాలో కొత్త వెర్షన్‌ను బుధవారం ఆవిష్కరించింది. దీని ధర రూ. 7.44 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇది ప్రస్తుతమున్న ఎర్టిగా కంటే మరింత పెద్దదిగాను, 10 శాతం అధికంగా ఇంధనం ఆదా చేసేదిగాను ఉంటుందని సంస్థ తెలిపింది. పెట్రోల్ వేరియంట్లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, లిథియం అయాన్ బ్యాటరీ తదితర ఫీచర్లుంటాయి. ఇప్పుడున్న వెర్షన్‌తో పోలిస్తే పెట్రోల్ వేరియంట్ ధర రూ.71,000, డీజిల్ వేరియంట్ రేటు రూ.20,000 అధికంగా ఉంటుందని కంపెనీ తెలియజేసింది. డీజిల్ వేరియంట్స్ రేటు రూ.8.84 లక్షల నుంచి రూ.10.9 లక్షల దాకా ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.44 లక్షల నుంచి రూ.9.95 లక్షల దాకా ఉంటుంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్స్‌తో కొత్త ఎర్టిగాను తీర్చిదిద్దినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. కొత్త ఎర్టిగా అభివృద్ధిపై రూ. 900 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు.. గత వెర్షన్ కంటే తాజా వెర్షన్ 40 మి.మీ. ఎక్కువ వెడల్పు, 5 మి.మీ. ఎత్తు, 99 మి.మీ. పొడవుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్లో మైలేజీ.. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 19.34 కి.మీ.గాను, ఆటోమేటిక్ విధానంలో లీటరుకు రూ. 18.69 కి.మీ.గా ఉంటుంది. డీజిల్ ఆప్షన్లో లీటరుకు 25.47 కి.మీ. దాకా మైలేజీ వస్తుంది. -
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై కొరడా ఝులిపించింది. ఇరాన్ బ్యాంకింగ్, ఇంధన రంగాలు లక్ష్యంగా చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను సోమవారం విధించింది. ఇరాన్‌కు చెందిన 600 కంపెనీలు, వ్యక్తులతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ప్రపంచదేశాలకు స్పష్టం చేసింది. వీరితో వ్యాపార లావాదేవీలు నడిపే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, భారీ జరిమానాలు విధిస్తామని తేల్చిచెప్పింది. అయితే ఇరాన్ నుంచి భారీగా ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనా, భారత్, టర్కీ, జపాన్, ఇటలీ సహా 8 దేశాలకు ఈ సందర్భంగా స్వల్ప మినహాయింపు ఇచ్చింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను 6 నెలల్లోగా పూర్తిస్థాయిలో నిలిపివేయాలని సూచించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. ‘సైబర్ దాడులు, క్షిపణి పరీక్షలు, మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న ఇరాన్ ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చేందుకే ఈ ఆంక్షలను విధించాం. ఈ జాబితాలో ఇరాన్‌కు సంబంధించి 600 కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో మార్కెట్లో ముడిచమురు సరఫరాను నియంత్రించగలిగాం. అయినా అమెరికన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’ అని తెలిపారు. అయితే అమెరికా నుంచి మినహాయింపు పొందిన దేశాల్లో భారత్, చైనాలు ఉన్నాయా? అని ప్రశ్నకు పాంపియో సమాధానం దాటవేశారు. మరోవైపు అమెరికా ఆంక్షలను అవలీలగా అధిగమిస్తామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వ్యాఖ్యానించారు. 2015లో ఇరాన్‌తో రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల సమక్షంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసుకున్న అణు ఒప్పందాన్ని మే నెలలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దుచేశారు. కొత్త ఒప్పందం కోసం చర్చలకు రావాలంటూ గతంలో ఉన్న ఆంక్షలను పునరుద్ధరించారు. -
ఇరాన్ చమురును భారత్ కొనుక్కోవచ్చు
వాషింగ్టన్: ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 8 దేశాలకు తాత్కాలికంగా అనుమతిచ్చినట్లు అమెరికా తెలిపింది. ఇరాన్ నుంచి ఇప్పటికే చమురు దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంకా కోత విధిస్తే మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే ముప్పు ఉన్నందునే అమెరికా తన వైఖరిని సడలించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో లావాదేవీల వ్యవహారంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన 8 దేశాల జాబితాలో భారత్, జపాన్, దక్షిణ కొరియా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారిని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌పై తాజా ఆంక్షలు అమల్లోకి వచ్చే నవంబర్ 4 నాటికి ఆ దేశం నుంచి చమురు కొనుగోలును పూర్తిగా నిలిపేయాలని అమెరికా ఇది వరకే భారత్ సహా పలు దేశాల్ని కోరిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తరవాత భారత్ రెండో స్థానంలో ఉంది. -
11 రోజుల్లో రూ.2.78 తగ్గిన పెట్రోల్
న్యూఢిల్లీ: వాహన వినియోగదారులకు మరోసారి ఊరట. ఆదివారం లీటరు పెట్రోలుపై 40 పైసలు, లీటరు డీజిల్‌పై 33 పైసలు తగ్గిస్తూ ఇంధన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రో ధరలు తగ్గింపుతో ఢిల్లీలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ.80.05 కాగా, లీటర్ డీజిల్ రూ.74.05గా ఉంది. వరుసగా 11వరోజు ఇంధన ధరలు తగ్గడంతో ఇప్పటివరకూ లీటర్ పెట్రోల్‌పై రూ.2.78, లీటర్ డీజిల్‌పై రూ.1.64 పైసలు ఇంధన సంస్థలు తగ్గించినట్లైంది. ఈ నెల 18 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో దేశంలో ఇంధన సంస్థలు కూడా ఆమేరకు ధరలు తగ్గించాయి. -
బంగారం తింటుంది.. ఇంధనం ఇస్తుంది!
సష్టి చాలా విచిత్రమైంది. మూరెల్లా థెర్మోఅసిటికా అనే బ్యాక్టీరియా విషయమే తీసుకోండి. కాసింత బంగారం పడేస్తే... సౌరశక్తిని వాడుకుని బోలెడంత ఇంధనం ఇస్తుంది. యూసీ బెర్క్లీ శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియంపై కొన్ని పరిశోధనలు చేశారు. కాడ్మియం సల్ఫైడ్ నానో కణాలను బ్యాక్టీరియాపై పొరలకు అతికించి చూసినప్పుడు ఒకొక్కటి మినీ రియాక్టర్లు అయిపోయాయి.ఆ తరువాత ఇవి సౌరశక్తిని వాడుకుని కార్బన్‌డైయాక్సైడ్‌ను కాస్తా ఉపయోగకరమైన రసాయనాలు ఇంధనాలుగా మారుస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు శక్తిని తయారు చేసుకున్నట్లు అన్నమాట. కాడ్మియం సల్ఫైడ్ స్థానంలో బంగారు నానోకణాలను వాడినప్పుడు ఇంధనాల ఉత్పత్తి మరింత మెరుగైనట్లు యూసీ బెర్క్లీ శాస్త్రవేత్త యాంగ్ చేసిన తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కాడ్మియం సల్ఫైడ్ కేవలం దశ్యకాంతిని మాత్రం శోషించుకోగలిగేది. అదే సమయంలో బ్యాక్టీరియాకు ఈ రసాయనం విషం. బంగారు నానోకణాలను వాడినప్పుడు మాత్రం ఈ లోపాలు తొలగిపోయి.. కార్బన్ డైయాక్సైడ్ నుంచి 33 శాతం ఎక్కువ అసిటేట్ ఇంధనం లభించిందని యాంగ్ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఖర్చు తగ్గించడంతోపాటు, ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఆ తరువాత ఈ పద్ధతి ద్వారా చౌకైన, మళ్లీమళ్లీ ఉత్పత్తి చేసుకోగల ఇంధనాల తయారీ సాధ్యమవుతుందని వివరించారు. -
గాల్లోనే ఇంధనం నింపుకున్న తేజస్
బెంగళూరు: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మరో ఘనత సాధించింది. గాల్లో ప్రయాణిస్తూనే ఐఏఎఫ్ ఐఎల్78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. దీంతో యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో తేజస్(ఎస్ఎస్పీ8) యుద్ధవిమానం రష్యన్ తయారీ ఐఎల్–78 ఎంకేఐ ఆయిల్ ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. గంటకు 500 కి.మీ వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఫీట్‌ను సాధించింది. ఇటీవల ట్యాంకర్ విమానంతో డాకింగ్(గాల్లో అనుసంధానం కావడం) ప్రక్రియను పూర్తిచేసిన తేజస్ తాజాగా ఇంధనాన్ని నింపుకుని చరిత్ర సృష్టించింది. దీంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్‌కు ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్(ఎఫ్ఓసీ) జారీచేసేందుకు మార్గం సుగమమైంది. 123 తేజస్ మార్క్–1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) గతేడాది డిసెంబర్లో హాల్‌కు రూ.50,000 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఆ విమానంలో జిమ్, పబ్..
న్యూయార్క్ : ప్రపంచంలో ఓ మూల నుంచి ఇంకో మూలకు 20 గంటల్లో చేరుకునేలా నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టేందుకు కాంటాస్ ఎయిర్వేస్ లిమిటెడ్ ఎయిర్‌బస్, బోయింగ్‌లను ఒప్పించింది. సిడ్నీ నుంచి నేరుగా లండన్ లేదా న్యూయార్క్‌లకు పెద్దసంఖ్యలో ప్రయాణీకులను చేరవేసేలా నాన్ స్టాప్ ఫ్లైట్‌ను రూపొందించాలని ఏడాది కిందట బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీలకు తాము విసిరిన సవాల్‌ను అవి స్వీకరించాయని కాంటాస్ సీఈఓ అలన్ జోస్ స్పష్టం చేశారు. తాము కోరుకున్న విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చే స్థితిలో బోయింగ్, ఎయిర్‌బస్‌లు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టు సన్‌రైజ్ పేరుతో ఈ భారీ విమానాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో కాంటాస్ నిమగ్నమైంది. మూడు వందల మంది ప్రయాణీకులను వారి లగేజ్‌లతో సహా సుదీర్ఘ గమ్యస్ధానాలకు చేరవేసేందుకు అనువుగా ఉండే ఈ విమానంలో ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు అవసరమైన ఇంధనం ఉంటుందని, ఈ విమానంలో చైల్డ్ కేర్ సదుపాయాలు, జిమ్,బార్, స్లీపింగ్ ఏరియాలను అందుబాటులో ఉంచుతారని కాంటాస్ తెలిపింది. ఈ భారీ విమానంపై ప్రజెంటేషన్స్ ఇచ్చేందుకు ఎయిర్‌బస్, బోయింగ్‌లు సిడ్నీ సందర్శించాయి. కాగా ఈ భవిష్యత్ విమానాలకు సంబంధించి వచ్చే ఏడాది ఆర్డర్ ఇచ్చేందుకు జోస్ సన్నాహాలు చేస్తున్నారు. కాంట్రాక్టు కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌లు పోటీపడుతుండటంతో కోరుకున్న ధర, డిజైన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కాంటాస్కు లభించింది. తాము 2022 నాటికి ఈ తరహా తొలి విమానాన్ని అందుబాటులోకి తెస్తామని జోస్ చెబుతున్నారు. -
ఇంధనానికి తగ్గ రంగు స్టిక్కర్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో నడిచే వాహనాలకు అధికారులు ఇకపై ఇంధనాన్ని బట్టి స్టిక్కర్లు ఏర్పాటు చేయనున్నారు. హోలోగ్రామ్ స్టిక్కర్ రంగును బట్టి ఆ వాహనం పెట్రోల్, సీఎన్జీ, డీజిల్, విద్యుత్‌లలో దేంతో నడుస్తోందో కనిపెట్టేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎన్సీఆర్లో శీతాకాలంలో కాలుష్యం బెడదను తగ్గించేందుకు తీసుకునే చర్యలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తాజా ప్రతిపాదనల ప్రకారం పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు లేత నీలిరంగు, డీజిల్‌తో నడిచే వాహనాలకు ఆరెంజ్ కలర్ హోలోగ్రామ్ స్టిక్కర్లుంటాయి. దీంతోపాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లను లేదా గ్రీన్ హోలోగ్రామ్ స్టిక్కర్లను వాడేలా చూడాలని సూచించింది. -
ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ సాధ్యమేనా ?
ఆగస్టు 10వ తేదీ ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకున్నాం. జీవ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా పెట్రోలు వినియోగాన్ని తగ్గించవచ్చని, తద్వారా కోట్ల రూపాయలు ఆదా చేసుకోవచ్చన్న భావనతో ప్రపంచ దేశాలు జీవ ఇంధనమైన ఇధనాల్‌ను పెట్రోల్‌లో కలపాలని నిర్ణయించాయి. మన దేశంలో కూడా ఇథనాల్ వినియోగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని నూతన,పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ 2009లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని రూపొందించింది.2013 జనవరి నుంచి ఇథనాల్ కలిపిన పెట్రోలును అమ్మే విధానాన్ని(ఇబీపీ) ప్రారంభించింది. పెట్రోలియం కంపెనీలు 5శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలునే అమ్మాలని ఆదేశించింది.2017 నాటికి 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది.అయితే, ప్రభుత్వాల అలసత్వం, ఇథనాల్ తగినంత ఉత్పత్తి కాకపోవడం తదితర కారణాల వల్ల గడువుదాటినా లక్ష్యం నెరవేరలేదు. ఇథనాల్‌కు కొరత చక్కెర పరిశ్రమల్లో ఉప ఉత్పత్తిగా ఇథనాల్ తయారవుతోంది. వివిధ కారణాల వల్ల చెరకు దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇథనాల్ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇథనాల్‌ను లిక్కర్ తయారీలో ఉపయోగించడం, లిక్కర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండటంతో ఆ ప్రభుత్వాలు ఇథనాల్‌పై అధిక పన్నులు వసూలు చేస్తున్నాయి. చక్కెర కంపెనీలు కూడా ఇథనాల్‌ను డిస్టిలరీలకు (ఎక్కువ ధర లభిస్తుండటం వల్ల) అమ్మడానికే మొగ్గు చూపుతున్నాయి.దాంతో చమురు కంపెనీలకు కావలసినంత ఇథనాల్ దొరకడం లేదు.ఈ సమస్యను అధిగమించడం కోసం ప్రభుత్వం 2018 నాటి జాతీయ జీవ ఇంధన విధానంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. చక్కెర కర్మాగారాలు చక్కెరను తయారు చేయకుండానే ఇథనాల్‌ను తయారు చేయడానికి అనుమతి ఇచ్చింది.అలాగే,సంప్రదాయంగా వస్తున్న మొలాసిస్ నుంచే కాకుండా ఇతర జీవ వ్యర్థాలు, కుళ్లిన బంగాళాదుంపలు, పాడైపోయిన ధాన్యం, గోధుమ, జొన్న, తవుడు మొదలైన వాటి నుంచి కూడా ఇథనాల్ తయారీకి అవకాశాలు కల్పించింది. రెండో తరం ఇథనాల్ గోధుమ పొట్టు, తవుడు, పంట వ్యర్థాల నుంచి తయారు చేసే ఇథనాల్‌ను రెండోతరం ఇథనాల్‌గా పిలుస్తారు. ఈ రకం ఇథనాల్ తయారీకి చమురు సంస్థలు 12 రెండో తరం ఇథనాల్ రిఫైనరీలను దేశంలో ఆంధ్ర ప్రదేశ్ సహా11 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నాయి.వీటి ఏర్పాటుకు 10,000 కోట్లు వెచ్చిస్తున్నాయి. పెట్రోల్‌లో ఇథనాల్‌ని కలుపుతూ వాడుతున్న రాష్ట్రాలు 21 కేంద్ర పాలిత ప్రాంతాలు 4 ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న ఇథెనాల్ 300 కోట్ల లీటర్లు ఇందులో 130 కోట్ల లీటర్లను లిక్కర్ తయారీకి వినియోగిస్తున్నారు మిగిలిన 170 లీటర్లలో 60 నుంచి 80 శాతం రసాయనాల తయారీకి వాడుతున్నారు. 100 నుంచి 120 కోట్ల లీటర్లు మాత్రమే పెట్రోలులో కలపడానికి అందుబాటులో ఉంది ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని పెంచడం కోసం ఇథనాల్‌పై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది -
మారుతి కూడా బాంబు పేల్చింది
సాక్షి, ముంబై: వరుసగా ఆటో కంపెనీలు తమ వాహనాల రేట్లను పెంచేస్తున్నాయి. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ బాటలో మరో ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా కూడా వినియోగదారులపై ధరల బాంబును పేల్చింది. వివిధ మోడళ్ల వాహనాల ధరలను పెంచుతున్నట్టు మారుతి బుధవారం ప్రకటించింది. ఈ నెల నుంచే తమ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. వస్తువుల ధరలు, విదేశీ మారకం అనిశ్చితి, ఇంధన ధరల పెరుగుదల తదితర ప్రతికూల ప్రభావాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇంధన ధరలు, లాజిస్టిక్స్ వ్యయంతో పాటుగా విదేశీ మారకం రేటు కూడా సంస్థపై ప్రభావం చూపిందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎస్.ఎస్.కాల్సీ తెలిపారు. ఆయా మోడల్స్ ఆధారంగా ధర పెంపు ఉంటుందని చెప్పారు. కాగా ప్రస్తుతం మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో 800 మొదలుకొని సెడాన్ సియాజ్ మోడల్ వరకూ రకరకాల కార్లను అమ్ముతోంది. వీటి ధరలు రూ.2.51 లక్షలు - రూ.11.51 లక్షల వరకూ ఉన్నాయి. సెడాన్ సియాజ్ (మధ్య సైజ్) ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం రూ.11.51లక్షలుగా ఉంది. -
ఆర్టీసీకి చమురుదెబ్బ!
సాక్షి, రాజంపేట : పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ సంస్థ కుదేలవుతోంది. చమురుదెబ్బతో విలవిలాడుతోంది. దీంతో మరింత నష్టాల్లో కూరుకుపోతోంది. ఇంధన ధరల పెరుగుదలే నష్టాలకు కారణమని ఆర్టీసీ కార్మికవర్గాలు వాపోతున్నాయి. జిల్లాలో కడప, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు డిపోలు ఉన్నాయి. రెండు నెలల్లో డిజిల్ లీటరుకు రూ.5 పెరిగింది. దీంతో రోజుకు రూ.10 లక్షల అదనపు భారం ఆర్టీసీపై పడింది. తరచూ ఇంధన ధరల పెరుగుదల ఆర్టీసీకి గుదిబండలా మారింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రోజుకు 3.75 లక్షల కిలోమీటర్లు మేర బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. గతంలో డీజిల్ ధరలు పెరిగితే చార్జీలను పెంచేవారు. ప్రస్తుతం చార్జీలు పెంచితే ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతోందనే భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. డీజిల్ ధరల ప్రభావం ఇలా.. జిల్లాలోని డిపోల పరిధిలో 564 ఆర్టీసీ బస్సులను సొంతంగా నడుపుతోంది. 294 అద్దె బస్సులను వినియోగిస్తోంది. మొత్తం మీద 858 బస్సులకు రోజుకు 65వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం రోజుకు రూ.4 లక్షలకుపైగా వెచ్చించాల్సి ఉంది. నెలకు రూ.8 కోట్లు డీజిల్‌కే ఖర్చు చేయాల్సి వస్తోం ది. నెల రోజులపాటు బస్సులను రోడ్డెక్కిస్తే రూ.27 కోట్లు ఆదాయం వస్తోంది. జిల్లాలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూ రు, జమ్మలమడుగు, రాయచోటì, రాజం పేట డిపోలకు చిత్తూరు నుంచి డీజిల్ సరఫరా చేస్తోంది. బద్వేలుకు ఒంగోలు, పులివెందులకు గుంతకల్లు నుంచి అందుతోంది. నెలకు రూ.3కోట్లు అదనపుభారం పడుతోంది. ఇంధన పొదుపు తప్పనసరి.. ఆర్టీసీకి వస్తున్న ఆదాయంలో మూడో వంతు డీజిల్, జీతభత్యాలు, విడిభాగాల కొనుగోలుకు ఖర్చు అవుతోంది. నష్టాల ఊబిలో కూరుకున్న సంస్థను గట్టెక్కించేందుకు అధికారులు యత్నాలు చేస్తున్నారు. మరోవైపు డీజిల్‌తోపాటు ఇతర ధరలు పెరుగుదల శాపంగా మారుతోంది. ఇంధనపొదుపుపై డ్రైవర్లకు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. నష్టాలను తగ్గించేందుకు అంతర్గతంగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళుతున్నారు. ట్యాక్స్ ఎత్తివేయాలి ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌పై ట్యాక్స్ ఎత్తివేయాల్సిన ఆవశ్యకత ఉంది. కెఎంపీఎల్ సాధించే విషయంలో డ్రైవర్లపై విపరీతంగా మానసిక ఒత్తిడి కలుగుతోంది. మానసిక ప్రశాంతతో విధులు నిర్వర్తించాలంటే ప్రభుత్వం డీజిల్ సరఫరా విషయంలో సముచిత నిర్ణయం తీసుకోవాలి. –శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్ఎంయూ, కడప -
14 నెలల గరిష్టానికి డబ్ల్యుపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: డబ్ల్యుపీఐ మరోసారి పెరిగింది. మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం 4.45 శాతానికి పెరిగింది. దాదాపు14 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కొన్ని ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరడంతో డబ్ల్యూపీఐ కూడా గరిష్టానికి చేరింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో డబ్ల్యుపిఐ 3.18 శాతం పెరగ్గా , గత ఏడాది మే నెలలో 2.26 శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్ నెలలో 0.89 శాతంతో పోలిస్తే మే నెలలో కూరగాయల ధరలు 2.51 శాతం పెరిగాయి. మొత్తం టోకు ధరల సూచీలో ఐదో స్థానంలో ఉన్న ప్రాథమిక వస్తువులు మే నెలలో 3.16 శాతం పెరిగింది. మే నెలలో పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం కూడా పెరిగి 13.15 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 7.85 శాతంగా ఉండగా, గత ఏడాది 11.81 శాతం పెరిగింది. ఏప్రిల్ నెల9.45 శాతందనుంచి పెట్రోల్ ధరలు మేనెలలో 13.90 శాతం మేర పెరిగాయి. గత ఏప్రిల్‌లో 13.01 శాతంతో పోలిస్తే డీజిల్ ధరలు 17. 34 శాతం పెరిగాయి. -
రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ డిమాండ్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధర అంతకంతకు పైకి ఎగిసినప్పటికీ, దేశీయంగా వీటి డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ధరలు పెరిగితే, డిమాండ్ పడిపోతుంది. కానీ ఇక్కడ ట్రెండ్ రివర్స్‌గా ఉంది. మే నెలలో దేశీయంగా డీజిల్, పెట్రోల్ విక్రయాలు గరిష్ట రికార్డు స్థాయిలను తాకాయి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. గత నెలలో ఇంధన వినియోగం 18.72 మిలియన్ టన్నులుగా నమోదైనట్టు తెలిసింది. దీనిలో డీజిల్ విక్రయాలు 7.55 మిలియన్ టన్నులకు పెరిగినట్టు పీపీఏసీ డేటా వెల్లడించింది. గ్యాసోలిన్ లేదా పెట్రోల్ వినియోగం కూడా 2.46 మిలియన్ టన్నులకు చేరుకున్నట్టు తెలిపింది. 1998 ఏప్రిల్ నుంచి పోలిస్తే ఈ నెలలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. ఇంధన వినియోగంలో భారత్, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆయిల్ కన్జ్యూమర్‌గా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంధన వినియోగం 35.2 మిలియన్ టన్నులకు పెరిగిందని, ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం అధికమని పీపీఏసీ డేటా పేర్కొంది. 2018లో దేశీయంగా నెలవారీ సగటు డీజిల్ విక్రయాలు 7.05 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇవి 6.6 మిలియన్ టన్నులుగా ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా పెట్రోల్ విక్రయాలు ఏప్రిల్ నుంచి మే నెలకు 7.6 శాతానికి పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2 శాతం అధికం. నెలవారీ పెట్రోల్ విక్రయాలు కూడా ఈ ఏడాది సగటున 2.27 మిలియన్ టన్నులకు పెరిగినట్టు పీపీఏసీ డేటా వెల్లడించింది. 2017 నుంచి 7 శాతం ఎక్కువ. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డీజిల్ వినియోగం రెండింతలు పైగా నమోదైందని విశ్లేషకులు, ట్రేడర్లు చెప్పారు. సాధారణ రుతుపవనాలు నమోదైతే, డీజిల్ డిమాండ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. సగానికి పైగా దేశీయ జనాభా వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆధారపడుతుందని, ఈ రంగంలో నీటి పారుదల పంపులు ఎక్కువగా డీజిల్‌పై ఆధారపడి ఉంటాయని చెప్పారు. -
‘అణు ఇంధన అవసరాలు తీర్చేందుకు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : దేశ అణు విద్యుత్తు ఇంధన అవసరాలను తీర్చే దిశగా న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) విస్తరణ కార్యకలాపాలు చేపట్టిందని సంస్థ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ దినేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ఇంధన బండిల్ తయారై ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్ఎఫ్సీలో శుక్రవారం నిర్వహించిన వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2030 నాటికల్లా దేశంలోని అన్ని అణువిద్యుత్తు రియాక్టర్లకు యేటా మూడు వేల టన్నుల ఇంధనం అవసరమవుతుందన్నారు. హైదరాబాద్ కేంద్రంలో గత ఏడాది రికార్డు స్థాయిలో 1,200 టన్నులకు పైగా ఇంధన బండిళ్లను తయారు చేశామని.. రాజస్తాన్‌లోని కోటాలో ఏర్పాటవుతున్న కొత్త కేంద్రం ద్వారా వెయ్యి నుంచి రెండు వేల టన్నుల ఇంధనం ఉత్పత్తి కావచ్చునని వివరించారు. ఎన్ఎఫ్సీ 2017–18 నుండి పూర్తి స్వదేశీ సాంకేతికతతో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి ఇంధన కడ్డీలను తయారు చేస్తోందన్నారు. -
ఒక్క క్షణం ఆగండి..
సాక్షి, హైదరాబాద్ : ఒక్క క్షణం ఆగండి. మీ బండి ఇంజన్ ఆపేయండి. మరో 2 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయండి. ఇం‘ధనం’ ఆదా చేసుకోండి. నిజమే నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా పెట్రోల్, డీజిల్ భారీగా దుర్వినియోగమవుతున్నాయి. సిగ్నల్ పడిన వెంటనే ఇంజన్ ఆఫ్ చేయకపోవడం వల్ల ప్రతి రోజు వేలాది లీటర్ల ఇంధనం అనవసరంగా ఖర్చవుతోంది. అంతేకాదు. ప్రమాదకరమైన కాలుష్య ఉద్గారాలు నగర పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే సిగ్నల్ పడిన వెంటనే ఇంజన్ ఆఫ్ చేస్తే చాలు. కనీసం 50 మిల్లీలీటర్ల నుంచి 150 మిల్లీలీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. ఏసీ వాహనాల్లో అయితే 200 ఎం.ఎల్ వరకు కూడా ఇంధనాన్ని మిగుల్చుకోవచ్చు. అంతేకాదు, ఒక లీటర్ పెట్రోల్ పైన 60 కిలోమీటర్లు వెళ్లే బైక్ మరో 2 కిలోమీటర్లు అదనంగా ముందుకు వెళ్తుంది. ఒక లీటర్ డీజిల్‌పైన కనీసం 10 నుంచి 15 కిలోమీటర్లు నడిచే కారు మరో కిలోమీటర్ అదనంగా ముందుకు నడుస్తుంది.ఒక్క సిగ్నల్ వద్ద ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల 1 నుంచి 2 కిలోమీటర్ల అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఒక్కసారి బండి బయటకు తీస్తే కనీసం 4 నుంచి 6 సార్లయినా సిగ్నల్ వద్ద బ్రేకులు పడుతాయి. ఆ సమయంలో ఇంజన్ ఆఫ్ చేస్తే అదనంగా 10 కిలోమీటర్ల ప్రయాణం కలిసి వస్తుంది. కార్లు, ఇతర వాహనాలు సైతం సిగ్నల్స్ వద్ద ఇంజన్‌ను ఆపేయడం వల్ల రోజుకు 250 ఎంఎల్ నుంచి 300ఎంఎల్ వరకు ఆదా చేసేందుకు అవకాశంఉంటుంది. ఇంధనం పొదుపు చేయడం వల్ల దుర్వినియోగాన్ని అరికట్టడమే కాకుండా వాహనాల సామర్ధ్యం కూడా పెరుగుతుంది. -
ప్రజల నిరసనలతో దిగొచ్చిన కింగ్
అమ్మాన్: దేశంలో ఇంధన, విద్యుత్ ధరలు పెంచుదాం అనుకున్న జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II కి ఊహించని షాక్ తగిలింది. ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇంధన ధరల పెరుగుల నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని, అసమర్థ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని దేశ ప్రజలు గతరెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రోడ్లను స్తంభింపజేశారు. టైర్లు కాలపెడుతు రోడ్లను దిగ్బందం చేయడంతో ప్రభుత్వం ధరల పెరుగుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కింగ్ అబ్దుల్లా తెలిపారు. కోటి జనాభా గత జోర్డాన్‌లో వనరుల కొరత, పేదరికం, నిరుద్యోగంతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ జనాభాలో 19 శాతం నిరుద్యోగులు, 20శాతం పేదరికంలో మగ్గుతున్నట్లు ఆ దేశ గణాంకాలు చెప్తున్నాయి. 2016లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి తీసుకున్న 723 మిలియన్లు రుణాన్ని చెల్లించి భవిషత్తుల్లో మరిన్ని రుణాలు పొందే విధంగా ఆర్థిక సంస్కరణ చేపట్టింది. దానిలో రాయితీలు తగ్గించి ట్యాక్స్‌లు పెంచాలని ప్రభుత్వం భావించింది. ఒక్కసారిగా ఇంధనంపై 5.5 శాతం, విద్యుత్‌పై 19 శాతం ధరలు పెంచడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైయాయి. -
స్వల్పంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
సాక్షి, న్యూడిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయనీ, పెరిగిన ధరలు మంగళవారం ఉదయం 6గంటలనుంచి అమల్లో ఉంటుందని ప్రకటించింది. డీజిల్‌పై 7పైసలు, పెట్రోల్‌పై ఒక పైస పెరిగిందని చెప్పింది. పెరిగిన ధరల ప్రకారం మెట్రో నగరాల్లో లీటరు పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ( రూ. 72.94), కోల్‌కతా( రూ. 74.94), ముంబై( 80.07), చెన్నై( రూ.74.87). మొత్తంగా ఈ సంవత్సరం మొత్తంలో పెట్రోల్‌పై రూ.2.20 -2.34, డిజీల్‌పై రూ. 3.16-3.61 పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధర సోమవారం స్వల్పంగా క్షీణించింది. ఫ్యూచర్స్‌లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 24 సెంట్లు నష్టపోయి 65.97 డాలర్లుగా నమోదైంది. -
ఇంటి వద్దకే ఇంధనం?
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న నేటి పోటీ ప్రపంచంలో ఏదైనా కొత్తగా ఆలోచించగలిగితేనే మనుగడ సాధ్యమౌతుంది. సరికొత్త ఆలోచనతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ పెట్రోల్ , డీజిల్ డోర్ డెలివరీ అంటూ మరో నూతన ఆవిష్కరణకు తెరలేపింది. ఇంటి వద్దకే ఇంధనాన్ని అందించే కార్యక్రమం మొదలుపెట్టినట్లు తన అధికారక ట్విటర్లో పేర్కొంది. పుణెలోని వినియోగదారులకు మొదటగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మరి సాధారణ ధరే ఉంటుందా? సర్వీస్ చార్జ్ ఏమైనా తీసుకుంటారా? దీని విధివిదానాలు ఎలా ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉంది. దూరప్రాంత ప్రజలకు, పెట్రోల్, డీజిల్ బంక్‌లు అందుబాటులోని గ్రామాలకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. పెట్రోల్‌కు మండే స్వభావం ఎక్కువ ఉంటుంది. పెట్రోల్‌ను డోర్ డెలివరీ చేయడం కన్నా డీజిల్‌ను చేయడం సులభం. అందుకే డీజిల్ డోర్ డెలివరీ అంటూ ప్రారంభించారా అనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. కొత్త పోకడలు, నూతన ఆలోచనలు..ఇవే వ్యాపారానికి పెట్టుబడులు. ఇలా పుట్టినవే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. ఈ కామర్స్, ఆన్లైన్ రంగాలను ఇవి రెండు ఏలుతున్నాయి. బిగ్‌బాస్కెట్, స్విగ్గీ, ఫుడ్‌పాండా వంటి సంస్థలు డోర్ డెలివరీ అంటూ మరో ట్రెండ్‌ను సృష్టించాయి. ఇలా వినియోగదారుల సౌలభ్యాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి ఆధరణను పొందుతున్నాయి. ఇప్పుడు వీటిస్థానంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా చేరింది. అయితే ఒకప్రభుత్వ రంగ సంస్థ ఇలాంటి సేవల్లోకి అడుగుపెట్టడం విశేషం. మరి వినియోగదారులకు ఆకట్టుకోవడంలో ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందని అనేది కాలమే చెప్పాలి. Another milestone in customer convenience #FuelAtDoorstep. IndianOil launches FIRST OF ITS KIND PESO APPROVED Mobile dispenser for Door Delivery of Diesel to its esteemed customers at Pune. pic.twitter.com/7xB23at2Dj — Indian Oil Corp Ltd (@IndianOilcl) March 16, 2018 -
పరి పరిశోధన
ఇడియట్ బాక్స్‌తో క్యాన్సర్ చిక్కు! రోజూ గంటల కొద్దీ టీవీ చూస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే గంటకు లోపు టీవీ చూసే వారితో పోలిస్తే మీలాంటి వారికి పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. తగిన శారీరక వ్యాయామం లేనివారికి, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కునేందుకు చేసిన పరిశోధనల్లో ఇదే అతిపెద్దదని వారు చెబుతున్నారు. దాదాపు యాభై లక్షల మంది పురుషులపై ఆరేళ్లపాటు ఈ పరిశోధనలు జరిగాయి. టీవీ ఎక్కువ సేపు చూడటమన్నది చిరుతిళ్లు, పొగతాగడం వంటి అలవాట్లకు కారణం కావచ్చునని గతంలో కొన్ని పరిశోధనలు నిర్ధారణ చేసిన నేపథ్యంలో వీటి తాలూకూ దుష్ప్రభావాలు పేగు క్యాన్సర్‌గా పరిణమించవచ్చునని తాజా పరిశోధన చెబుతోంది. ఈ కారణాల వల్లనే కంప్యూటర్ ముందు పనిచేసే వారికంటే టీవీ చూసే వారిలోనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సూత్రం మహిళలకు వర్తించకపోవడం గమనార్హం. ఏతావాతా.. కడుపులో చల్ల కదలకుండా కూర్చునే వారితో పోలిస్తే కొద్దోగొప్పో వ్యాయామం చేసే పురుషులకు ఈ ప్రమాదకరమైన వ్యాధి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ లిండా బాల్డ్ తెలిపారు. అర డిగ్రీ పెరిగినా 50 లక్షల మంది మునక... భూమి సగటు ఉష్ణోగ్రతలు కేవలం అర డిగ్రీ సెల్సియస్ పెరిగినా దాదాపు 50 లక్షల మంది ముంపు ప్రమాదానికి గురవుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం... అడవుల నరికివేత, కాలుష్యం తదితర అనేక కారణాల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ భూతాపోన్నతిని ఈ శతాబ్దపు చివరికి 2.0 డిగ్రీ సెల్సియస్‌కు చాలా తక్కువగా ఉండేలా చర్యలు చేపట్టాలని మూడేళ్ల క్రితం నాటి ప్యారిస్ ఒప్పందం ద్వారా ప్రపంచదేశాలూ అంగీకరించాయి కూడా. అయితే ప్రిన్స్టన్, రట్గర్స్, టఫ్టస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం భూతాపోన్నతి 0.5 డిగ్రీలు పెరిగినా ప్రమాదమేనని హెచ్చరిస్తోంది. సముద్ర మట్టాలు పెరిగిపోవడం వల్ల తీర ప్రాంతాల్లో ఉండే దాదాపు 50 లక్షల మంది వరద ముంపునకు గురవుతారనీ, వీరిలో కనీసం 60 వేల మంది చిన్న చిన్న దీవుల్లో ఉండేవారు ఉంటారని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రతను లెక్కకట్టేందుకు కొన్ని పరికరాలను ఏర్పాటు చేసి జరిపిన అధ్యయనం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు వారు అంటున్నారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే వందేళ్లకు ఒకసారి వచ్చేంత తీవ్రస్థాయి తుఫానులు ఏటా వస్తాయని భూతాపోన్నతి రెండు డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఇలాంటి తుఫానులు ఏడాదికి రెండు వరకూ తాకుతాయని వివరిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే 2100 నాటికి 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే సగటు సముద్ర మట్టం 48 సెంటీమీటర్ల వరకూ పెరుగుతుందని రెండు డిగ్రీ సెల్సియస్ పెరుగుదల ఉంటే 56 సెంటీమీటర్ల పెరుగుదల ఉండవచ్చునని వారు చెబుతున్నారు. కార్బన్ నానోట్యూబులతో చౌకైన ఇంధనం... అమెరికాలోని స్టార్టప్ కంపెనీ మ్యాటర్‌షిఫ్ట్ ఓ వినూత్నమైన ఇంధన తయారీకి మార్గం సుగమం చేసింది. కార్బన్ నానోట్యూబులో పెద్దస్థాయిలో ఫిల్టర్లను తొలిసారి తయారు చేయగలగడంతో గాల్లోంచి తీసేసిన కార్బన్ డయాక్సైడ్‌తోనే మళ్లీ పెట్రోలు, డీజిళ్లను తయారు చేసేందుకు వీలేర్పడింది. కార్బన్ నానోట్యూబులతో తయారైన ఫిల్టర్లు ఎథనాల్ తయారీతోపాటు ఉప్పునీటిలోని లవణాలను చౌకగా తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయని రెండు దశాబ్దాలుగా తెలిసినప్పటికీ పెద్దస్థాయిలో తయారు చేయలేకపోవడం ప్రతిబంధకంగా మారింది. మ్యాటర్‌షిఫ్ట్ తొలిసారి వాణిజ్యస్థాయిలో భారీ ఎత్తున కార్బన్ నానోట్యూబుల ఫిల్టర్‌ను తయారు చేయగలగడంతో పరిస్థితి మారిపోనుందని అంచనా. ఈ అతిసూక్ష్మమైన ఫిల్టర్ల ద్వారా గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఉపయోగించుకుని పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను తయారు చేయవచ్చునని.. ఈ ఇంధనాల తయారీకి ప్రస్తుతం అవుతున్నదానికంటే చాలా తక్కువ వ్యయంతోనే వాటిని తయారు చేయగలగడం ఇంకో విశేషమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
పునరుత్పాదక ఇంధనాలదే భవిష్యత్
తెయూ(డిచ్పల్లి): కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ రంగాలలో పరిశోధనలకు దక్షిణాఫ్రికా దేశంలో అపార అవకాశాలున్నాయని దక్షిణాఫ్రికాలోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ సుబూసింగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాలకు కాలం చెల్లుతుందని, రాబోయే రోజులన్నీ పునరుత్పాదక ఇంధనాలదేనన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘భవిష్యత్ ఇంధనాలు’ అనే అంశంపై సుబూసింగ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నిల్వలు తరిగిపోతున్నాయని, వాటి వాడకం వల్ల పర్యావరణం కలుషితమై భూతాపం పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా, సుస్థిర అభివృద్ధి, ఇంధన స్వయం సమృద్ధి సాధించాలన్నా పునరుత్పాదక ఇంధనాల వినియోగం, ఉత్పత్తి పెరగాలని ఆయన సూచించారు. శిలాజ ఇంధనాలు రాజకీయ, భౌగోళిక, ఆర్థిక కారణాలతో సరఫరా ఆగిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. హైడ్రోజన్ ఆధారిత ఇంధనాల అభివృద్ధి దిశగా తాము ప్రయోగాలు చేస్తున్నామని, ఇది భవిష్యత్ అవసరాలకు అనువుగా ఉంటుందన్నారు. దక్షిణాఫ్రికాలో పరిశోధనలకు విస్తృత అవకాశాలున్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఎంఎస్, పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లో చేరవచ్చన్నారు. అనంతరం సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ముఖాముఖిలో ఆయన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సుబూసింగ్ డర్బన్‌లోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీలో మూడు దశాబ్దాలుగా కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. టూటా అధ్యక్షుడు రాజారాం, కార్యదర్శి పున్నయ్య, పరీక్షల నియంత్రణాధికారి యాదగిరి, ఫార్మా విభాగం హెడ్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ శిరీష, సత్యనారాయణ, నాగరాజు, సాయిలు తదితరులు సుబూసింగ్‌ను సత్కరించారు. -
ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం
శంషాబాద్ : శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. విమానంలో ఇంధనం నింపే క్రమంలో ఏర్పడిన లీకేజీని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. జెడ్డా నుంచి ఇండోనేసియా వెళ్తున్న సిటీలింక్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఇంధనం కోసం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ఇంధనం నింపుతున్న సమయంలో లీకేజీ ఏర్పడి రన్‌వేపై పడింది. దీన్ని వెంటనే గమనించిన సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో రన్‌వేను శుభ్రం చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అయ్యింది. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్ ; తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : అత్యవసరంగా ల్యాండై, ఇంధనాన్ని నింపుకొని తిరిగి బయలుదేరిన ఆ విమానం ఈ పాటికి పెను ప్రమాదంలో చిక్కుకొనిఉండేది. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తతతో ఆ ముప్పుతప్పినట్లైంది. అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చౌకవిమానయాన సంస్థ సిటీలింక్కు చెందిన విమానం ఒకటి ఆదివారం ఉదయం జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి జకార్తా(ఇండోనేషియా)కు బయలుదేరింది. అయితే, మార్గం మధ్యలోనే ఇంధనం నిండుకోవడంతో పైలట్ దాన్ని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటింకే సిద్ధంగా ఉన్న ఎయిర్‌పోర్టు సిబ్బంది.. సిటీలింక్ విమానంలో ఇంధనాన్ని నింపారు. ఇక అది టేకాఫ్ కోసం రన్‌వేపైకి కూడా వెళ్లింది. అంతలోనే ఇంధనం లీకవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. అంతే, క్షణం ఆలస్యం కాకుండా విమానాన్ని నిలిపేయాలని పైలట్‌కు ఆదేశాలు వెళ్లాయి. కలకలం : ఎండకు సైతం భగభగమండే గుణమున్న విమాన ఇంధనం.. రన్‌వేపై ధారలా కారిపోవడంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కలకలం చెలరేగింది. తక్షణమే ఫైరింజన్లను రప్పించి, రన్‌వే మొత్తాన్ని శుభ్రంగా కడిగేశారు. సాకేతిక నిపుణులు విమానంలో లీకేజీ లోపాన్ని సరిచేశారు. ఒకవేళ ఆ విమానం టేకాఫై ఉంటేగనుక పెనుప్రమాదమే జరిగి ఉండేదని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. -
జెట్ ఇంధన ట్యాంకులను వదిలిన పైలట్లు
జైపూర్ : ఆకాశం నుంచి జెట్ విమాన ఇంధన ట్యాంకులు పడటంతో జైపూర్ నగరానికి సమీపంలోని ఓ గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇంధన ట్యాంకులను భారతీయ వాయుసేనకు అందజేశారు. దీనిపై మాట్లాడిన పోలీసులు.. జెట్‌ను పరీక్షిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ముందుజాగ్రత్తగా పైలట్లు ఇంధన ట్యాంకులను జార విడిచారని చెప్పారు. అనంతరం జెట్‌ను సన్గనేర్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు వివరించారు. గ్రామ సరిహద్దులోని కొండ ప్రాంతంలో ఇంధన ట్యాంకులు పడ్డాయని వివరించారు. కాగా, ఇంధన ట్యాంకులు కింద పడిన సమయంలో పేలుడు సంభవించడంతో.. ఏదో జరిగిపోతోందని భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు తీసినట్లు వెల్లడించారు. కాగా, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన మిగ్ -21కు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. -
‘ఈ’ వాహనాలు సాధ్యమేనా!
సాక్షి, అమరావతి: దేశంలో 2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లు అమ్మడానికి వీలు లేదు.. వీటి స్థానంలో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకు వస్తామంటూ ప్రకటించడమే కాకుండా దానికి అనుగుణంగా ఈ–వాహన్ పాలసీని రూపొందించే పనిలో కేంద్రం ఉంది. సాంప్రదాయ ఇంధన వనరుల విని యోగం తగ్గించి, వాటి స్థానే సహజ వన రులను వినియోగించడం ద్వారా కాలుష్య ఉద్గారాలను తగ్గించాలన్నది ప్రధాన లక్ష్యం. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇప్పటికే కార్ల వినియోగంలో సరిబేసి విధానాన్ని అమలు చేస్తున్నాయి. కేవలం మన దేశమే కాదు ప్రప చంలో ఇతర దేశాలు కూడా ఈ వాహనాల బాట పట్టాయి. ఇప్పటికే ఈ దేశాల్లో ఈ వాహనాల వినియోగం బాగానే ఉంది. నెద ర్లాండ్స్, నార్వేలు 2025 నాటికి పూర్తిస్థాయి ఈ–వాహన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకోగా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు 2040ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. అంతేకాదు బ్రిటన్ మరో అడుగు ముందుకేసి 2,050 నుంచి రోడ్లపై పెట్రోల్ వాహనాలను తిర గనివ్వమని ప్రకటించింది కూడా. చైనా, అమెరికాలు కూడా ఎలక్ట్రిక్ వాహన వినియో గాన్ని ప్రోత్సహిస్తున్నా ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. దీంతో ఇప్పుడు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ వాహనాల తయారీపై దృష్టిపెట్టడమే కాకుండా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. 2018 నుంచి ఈ–వాహనాలను విడుదల చే యడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మనదేశంలో వీలయ్యేనా... మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రోత్సహించడానికి 2013లో ఒకటి, 2015లో మరో పథకాన్ని ప్రవేశపెట్టినా వాటి ఫలి తాలు అంతంత మాత్రంగా>నే ఉన్నాయి. 2013లో నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ (ఎన్ఈఎంఎంపీ)ను ప్రారంభించి 2020 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను 60–70 లక్షలకు చేర్చాలని లక్ష్యం గా నిర్దేశించుకున్నారు. కాని ఈ లక్ష్యానికి దూరంగా ప్రస్తుతం దేశంలో కేవలం 4 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలే తిరుగుతున్నాయి. ఆ తర్వాత 2015లో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పేరుతో ఈ–వా హన తయారీని ప్రోత్సహిచే పథకాన్ని తీసు కొచ్చారు. ఈ పథకంలో హైబ్రీడ్ బైక్ తయా రీకి రూ.29,000, కార్లకు రూ.1.39 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించింది. ఇందుకోసం చెల్లించే సబ్సిడీ కింద రూ.795 కోట్లు కేటా యిస్తే రూ.190 కోట్లు మాత్రమే క్లెయిమ్ జరి గింది. ఈ ఫెమా పథకం కింద ఇప్పటి వరకు 1,45,618 వాహనాలు అమ్మకాలు జరగ్గా.. దీనివల్ల రోజుకు 35,441 లీటర్ల ఇంధన వినియోగం తగ్గినట్లు నీతి ఆయోగ్ అంచనా. పాలసీ మరింత ఆలస్యం... 2030 నాటికి అన్నీ ఈ–వాహనాల అమ్మకాలే జరిపితే కలిగే ప్రయోజనం ఇందుకు తీసు కోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ అమెరికాకు చెందిన రాకీ మౌంటెన్ ఇనిసి ్టట్యూట్తో కలసి ఒక సర్వే నిర్వహించింది. 2016–17లో ఇండియా వినియోగించిన ఇంధనం 194 మిలియన్ మెట్రిక్ టన్నులు అయితే ఇందులో సగానికి పైగా వాటా రవాణా రంగానిదే. గత పదేళ్ల నుంచి సగటు ఇంధన వినియోగ వృద్ధి 4.9 శాతంగా ఉంటే గత మూడేళ్ల నుంచి ఈ రేటు 7 శాతంగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. పదేళ్ల నుంచి డీజీల్ వినియోగం 5.9 శాతం, పెట్రోల్‌లో 9.9 శాతం చొప్పున వృద్ధిరేటు నమోదవుతోంది. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసు కువస్తే సాంప్రదాయ ఇంధన వినియోగం 64 శాతం, కార్బన్ ఉద్గారాలు 37 శాతం తగ్గు తాయని అంచనా వేసింది. దీంతో 156 మెట్రి క్ టన్నుల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి రూ. 3.9 లక్షల కోట్ల ఇంధన వ్యయం ఆదా అవుతుందని అంచనా వేసింది. దీనికి అను గుణంగా కొత్త ఈ–వాహన పాలసీని ఈ డిసెంబర్‌లోగా విడుదల చేయాలని ప్రభు త్వం భావించినా.. నీతి ఆయోగ్ ముసాయి దా ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో దీన్ని తిరిగి పునః సమీక్షిం చాలని ఆదేశించింది. దీంతో పాలసీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ముసాయిదాలో నీతి ఆయోగ్ ప్రస్తావిం చిన బ్యాటరీ స్వాపింగ్ విధానాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యతిరేకిస్తున్నారు. చార్జింగ్ పాయింట్ల స్థానంలో బ్యాటరీలు మార్చుకునే స్వాపింగ్ విధానం మంచిదని నీతి ఆయోగ్ సూచించగా అది ఇండియాలో సాధ్యం కాదన్నది మంత్రిగారి వాదన. ప్రధాన అడ్డంకులు ఇవే... దేశంలో ఈ–వాహనాలు ప్రవే శపెట్టాలని ఉన్నా దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు లేవు. ఇప్పటికీ దేశంలో 4,141 గ్రామాలకు విద్యుత్ సౌకర్యమే లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనా లకు అవసరమైన చార్జింగ్ పాయింట్లు లేకపోవడం అడ్డంకిగా మారింది. చైనాలో 2,15,000 చార్జింగ్ పాయింట్లు ఉంటే మన దేశంలో 350 చార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి 50 దేశీయ, అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపు తోంది. ఇవి వచ్చే ఏడాదిలోగా పనులు మొదలు పెట్టే అవకాశాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ–వాహనాలను విడుదల చేస్తున్నా దేశంలో తగిన మౌలిక వసుతులు లేకపోవ డం స్థానికంగా విడుదల చేయడానికి మరింత ఆలస్యమవుతుందని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు. అంతగా చార్జింగ్ పాయింట్లు లేకపోవడంతో ప్రస్తుతం తక్కువ దూరం లేదా నిర్దేశిత దూరం వెళ్లి వచ్చే ఈ–వాహనాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ హెడ్ గిరీష్ వాఘ్ తె లిపారు. ఇవే కాకుండా బ్యాంటరీల సామర్థ్యం, వాటి ధరలు, చార్జింగ్ సమయం, బ్యాటరీల రీ–సైక్లింగ్ వీట న్నింటికీ మించి విని యోగదారుని ఆలోచనా విధానం వంటి వాటిపైనే దేశంలో ఈ–వాహనాల విని యోగం విజయ వంతమవుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే బ్యాటరీల ధరలు తగ్గించి.. తక్కువ సమ యంలో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా బ్యాటరీలను కంపెనీలు అందు బాటులోకి తీసు కొచ్చాయి. ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పు డున్న ఈ టెక్నాలజీ మారిపోయి హైడ్రోజన్ వంటి ప్రత్యా మ్నాయ ఇంధనాలు అందు బాటులోకి వస్తే పరిస్థితి ఏంటి? అన్న మరో ప్రశ్న తలె త్తుతోంది. వీటన్నింటికీ సరైన సమాధానం దొరికితేనే ఈ–వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు వస్తారని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
10% పెరిగిన ఇంధన డిమాండ్
న్యూఢిల్లీ: భారత ఇంధన డిమాండ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 10 శాతం పెరిగింది. ఇంధన డిమాండ్ ఈ స్థాయిలో పెరగడం గత ఏడాది కాలంలో ఇదే మొదటిసారి. చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా.. భారత్.. గత నెలలో 16.25 మిలియన్ టన్నుల పెట్రోలియమ్ ఉత్పత్తులను వినియోగించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వినియోగం 14.78 మిలియన్ టన్నులుగా నమోదైంది. చమురు శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం... ♦ గత ఏడాది ఆగస్టు తర్వాత చమురు ఉత్పత్తుల వృద్ధి గత నెలలోనే భారీగా నమోదైంది. ఆగస్టు, 2016లో డిమాండ్ 18.2 శాతానికి పెరిగింది. ♦ ఈ ఏడాది ఆగస్టులో చమురు ఉత్పత్తులకు డిమాండ్ 6.1% తగ్గింది. 2003 ఏప్రిల్ నుంచి చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా ఈ ఆగస్టులో డీజిల్, పెట్రోల్ ఉత్పత్తులకు డిమాండ్ బాగా తగ్గింది. ♦ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) అంచనాల ప్రకారం, 2040 వరకూ చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుంది. అయితే ♦ ఏడాది ఎనిమిది నెలలకు గాను నాలుగు నెలల్లో ఆయిల్ డిమాండ్ పడిపోయింది. ♦ చమురు అవసరాల్లో దాదాపు 81 శాతం వరకూ మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ♦ ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజిల్ అమ్మకాలు 16.5 శాతం వృద్ధితో 6.08 మిలియన్ టన్నులు, పెట్రోల్ వినియోగం 18 శాతం వృద్ధితో 2.14 మిలియన్ టన్నులకు పెరిగాయి. -
కార్బన్ డయాక్సైడ్తో ఇంధనం!
సూర్యకాంతిని ఉపయోగించి వాతావరణంలోని కార్బన్ డైయాక్సైడ్‌ను ఇంధనంగా మార్చేందుకు లారెన్స్ బెర్క్లీ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. ఇది మొక్కల కంటే మెరుగ్గా ఉండటం విశేషం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకుంటాయన్నది తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చేందుకు ఇప్పటికే ఎన్నో ఇతర పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే. లారెన్స్ బెర్క్లీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించారు. కార్బన్ డయాక్సైడ్ను వాయుస్థితి నుంచి ద్రవ స్థితికి మార్చేందుకు, ఆ తర్వాత దాన్ని ఇథనాల్, ఇథిలీన్ వంటి ఇంధనాలుగా మార్చేందుకు ప్రత్యేక పదార్థాలు, పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే అతితక్కువ ఇంధనాన్ని ఖర్చుపెట్టి కార్బన్ డయాక్సైడ్ను వేర్వేరు కర్బన పరమాణువులుగా మార్చేందుకు ఓ ప్రత్యేకమైన ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు. రాగి–వెండితో కూడా నానోకోరల్ క్యాథోడ్, ఇరీడియం ఆక్సైడ్ నానోట్యూబ్ ఆనోడ్తో మొక్కల కంటే సమర్థంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలిగారు. సౌరశక్తితోనే వాతావరణంలోని విషవాయువును తగ్గించేందుకు తమ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని బెర్క్లీ శాస్త్రవేత్త గురుదయాళ్ తెలిపారు. -
భారీగా పడిపోయిన ఇంధన డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన డిమాండ్ భారీగా పడిపోయింది. 14 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయిలకు ఈ డిమాండ్ క్షీణించి, ఆగస్టు నెలలో 6.1 శాతాన్ని నమోదుచేసింది. పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించడంతతో, డీజిల్, గ్యాసోలిన్ డిమాండ్ భారీగా క్షీణించింది. దేశంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆయిల్ కన్జ్యూమర్‌గా పేరున్న భారత్ ఈ ఆగస్టు నెలలో 15.75 మిలియన్ టన్నులను మాత్రమే వినియోగించుకుంది. గతేడాది ఇదే నెలలో 16.78 మిలియన్ టన్నులుగా ఉందని ఆయిల్ మంత్రిత్వశాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ పేర్కొంది. 2003 ఏప్రిల్ నుంచి ఇదే అత్యంత కనిష్ట స్థాయిలు. ఈ ఏడాదిలో ఇంధన డిమాండ్ పడిపోవడం ఇది రెండో సారి. జనవరిలో కూడా వినియోగం 5.9 శాతానికి క్షీణించింది. డీజిల్ డిమాండ్ కూడా 3.7 శాతం పడిపోయి, 5.9 మిలియన్ టన్నులుగా ఉంది. అదేవిధంగా పెట్రోల్ విక్రయం కూడా 0.8 శాతం తక్కువగా 2.19 మిలియన్ టన్నులుగా నమోదైంది. అయితే ఎల్పీజీ అమ్మకాలు మాత్రం 11.8 శాతం పెరిగి 2.06 మిలియన్ టన్నులుగా రికార్డయ్యాయి. కిరోసిన్ వాడకం 41 శాతం పైగా తగ్గింది. -
ఇక భారత్‌లో ‘టోటల్’ పెట్రోల్ బంకులు!
► స్థానిక భాగస్వామ్యంపై ఆసక్తి ► కంపెనీ సీఈవో పాట్రిక్ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో ఇంధన రిటైల్ వ్యాపారంలో ఉన్న అపార అవకాశాలపై ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎస్‌ఏ కన్నేసింది. స్థానికంగో ఓ భాగస్వామితో కలసి పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు టోటల్ వెల్లడించింది. టోటల్‌ఎస్‌ఏ ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో లూబ్రికెంట్లు, ఎల్పీజీని విక్రయిస్తోంది. ‘‘ఇది చాలా పెద్ద మార్కెట్. ఇండియన్ ఆయిల్ తదితర పెద్ద సంస్థలు వేలాది రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నాయి. ఈ మధ్యే ఈ మార్కెట్‌ను నియంత్రణల నుంచి తప్పించారు. దీంతో ఈ మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాం’’ అని టోటల్ సీఈవో పాట్రిక్ పోయెన్నే తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నామని, సరైన భాగస్వామిని గుర్తించాల్సి ఉందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఈ రంగంలో మాది అతిపెద్ద కంపెనీ. మా దగ్గర నిధులు, ఆర్థిక సామర్థ్యం ఉంది. ఈ వ్యాపారంలో నైపుణ్యం కూడా ఉంది’’ అని వివరించారు. పాట్రిక్ అంతకుముందు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ సమావేశమయ్యారు. ఎల్పీజీ నిల్వ, దిగుమతి టెర్మినళ్లు, పంపిణీపై పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం తరఫున టోటల్‌కు సాధ్యమైనంత సహకారాన్ని అందిస్తామని ప్రధాన్ హామీ ఇచ్చారు. -
అసలు ధర రూ.29 చెల్లిస్తున్నది రూ.77
ఇంధన శుద్ధి కేంద్రాలు లీటర్ పెట్రోలును రూ. 29.54 చొప్పున(మార్కెటింగ్ చార్జీలు కలుపుకుని) మార్కెటింగ్ కంపెనీలకు విడుదల చేస్తుంటే ముంబై ప్రజలు మాత్రం రూ.77.50 చెల్లిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో అధికంగా వెచ్చిస్తున్న రూ.47.96కు కారణం రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులే. వీటిలో కేంద్ర ఎౖక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర వ్యాట్, ఆక్ట్రాయ్, సెస్, పెట్రోల్ పంపు యాజమాన్యాలకు ఇస్తున్న కమీషన్ తదితరాలున్నాయి. మంగళవారం నాటి ముడి చమురు, డాలర్ – రూపాయి మారకపు విలువను దృష్టిలో పెట్టుకుని లెక్కకడితే... పన్ను రూపేణా ముంబై వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తం వాస్తవిక ధర కంటే 153 శాతం ఎక్కువ. ఈ విషయంపై ప్రభుత్వ సీనియర్ ఆర్థికవేత్త ఒకరు స్పందిస్తూ... ఆదాయం పెంచుకోవడానికే ప్రభుత్వం పెట్రోల్‌పై సెస్‌లను విధిస్తోందన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర రుణాలు రూ.4.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని, సంక్షేమ పథకాల కోసం మరిన్ని రుణాలను తీసుకునే స్థితిలో లేదని వివరించారు. తమ పరిధిలోని వస్తువులపై అదనపు డ్యూటీలు, సెస్‌లు విధించటమే ఏకైక మార్గమని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డ్యూటీలు, వ్యాట్, సెస్‌ల రూపేణా 153% అధికంగా వెచ్చిస్తున్న ప్రజలు పొరుగు దేశాల్లో ధరలు రూ. (లీటర్‌కు) పాకిస్తాన్ 43.68 శ్రీలంక 50.95 నేపాల్ 64.94 బంగ్లాదేశ్ 70.82 -
ఆదివారాలు పెట్రోల్ బంద్
-
ఆదివారాలు పెట్రోల్ బంద్
మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో అమలు చెన్నై: మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు మూతపడనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్ర, హరియాణాల్లోని సుమారు 20 వేల పెట్రోల్ పంపుల్లో ఆ ఒక్కరోజు ఇంధన అమ్మకాలు నిలిచిపోతాయని ఇండియన్ పెట్రోలియం కన్సార్షియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ‘ఆదివారం పెట్రోల్ పంపులను మూసివేయాలని చాలా ఏళ్ల నుంచే అనుకుంటున్నాం. అయితే మా నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కోరడంతో ఆగిపోయాం. ఇప్పుడిక దానినే అమలుచేయాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకుని పర్యావరణాన్ని కాపాడాలని ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ చేసిన సూచన మేరకే అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ‘తమిళనాడులో ఆదివారం ఒక్కరోజు పెట్రోల్ పంపులు మూసివేస్తే సుమారు రూ.150 కోట్ల నష్టం కలుగుతుందని అంచనావేస్తున్నాం’ అని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తెలియజేయలేదన్నారు. 15 మంది సిబ్బంది పనిచేస్తున్న బంకుల్లో మాత్రం సెలవు రోజులోనూ ఒకరిని విధుల్లో ఉంచుతామన్నారు. బీజేపీలోకి అర్వీందర్ లవ్లీ న్యూఢిల్లీ: ఢిల్లీ శాఖ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ మంగళవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో అర్వీందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భారత రాజకీయాలకు ప్రధాని మోదీ, అమిత్‌షాలు కొత్త అర్థంచెప్పారని అర్వీందర్ అన్నారు. ఈయన గతంలో ఢిల్లీలో షీలాదీక్షిత్ సర్కారులో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ముడుపులు ముట్టజెప్పిన వారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తోందన్నారు. -
గడ్డితో విమాన ఇంధనం..!
లండన్: భవిష్యత్ తరాల కోసం మరింత సుస్థిర ఇంధన వనరులను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో పరిశోధకులు ‘గ్రాసోలైన్’ అనే ఇంధనాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లో ఇది వాస్తవ రూపం దాల్చనుంది. గడ్డితో తయారు చేసే ఈ ఇంధనాన్ని విమానాల్లో ఉపయోగిస్తారు. ‘ఇప్పటి వరకు మీరు గడ్డిని కేవలం పశువులకు దాణగా ఉపయోగించడమే చుశారు. కానీ ఇప్పటి నుంచి గడ్డి ఒక జీవ ఇంధనంగా మారనుంది. సమృద్ధిగా లభించే గడ్డి ఇకపై మంచి శక్తి వనరుగా మారనుంది’ అని బెల్జియంలోని గేంట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వేసెర్న్కోర్ తెలిపారు. గడ్డి నుంచి ఇంధనం తయారుచేయడానికి అందులోని చక్కెరలను లాటిక్ యాసిడ్‌గా మార్చడానికి కొన్ని రకాల బ్యాక్టిరియాలను జోడించారు. ‘బయోడిగ్రేడేబుల్ ప్లాస్టిక్టస్ (పీఎల్ఏ)’ అనే రసాయన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేయడంలో లాటిక్ యాసిడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ముందుగా కార్పిక్ యాసిడ్‌గా మారి తర్వాత డెకెన్ అనే రసాయనంగా రూపొందుతుంది. డెకెన్ను విమాన ఇంధనాల్లో ఉపయోగిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు ప్రయత్నిస్తే జీవన ఇంధన ధర తగ్గడంతోపాటు కొన్నేళ్లలోనే ‘గడ్డి ఇంధనం’తో ఆకాశంలో ప్రయాణిస్తామని ప్రొఫెసర్ కోర్ ధీమా వ్యక్తం చేశారు. -
భవిష్యత్తు ఇంధనం.. హైడ్రోజన్ !
హైడ్రోజన్.. భవిష్యత్తులో మానవాళిని నడిపే ఇంధనం. ప్రస్తుతానికి నీటి అణువులో దాగి ఉన్న ఈ మరేదాని నుంచైనా ఉత్పత్తి చేయగలిగితే.. మన ఇంధన అవసరాలు తీరినట్టే. దీనిపై దృష్టిసారించిన జర్మనీ శాస్త్రవేత్తలు సూర్యకాంతి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంపై దృష్టిసారించారు. ఒకవేళ ఇది సాధ్యమైతే సూర్యుడి నుంచి వెలువడే అపార కాంతిని హైడ్రోజన్‌గా మార్చి, పర్యావరణ అనుకూల ఇంధనంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఏకంగా ఓ కృత్రిమ సూర్యుడినే తయారు చేశారు. వివరాల్లోకెళ్తే... సిన్‌లైట్ టెస్ట్..: పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీ శాస్త్రజ్ఞులు గురువారం చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్లైట్లను అమర్చి వాటిని గురువారం స్విచాన్ చేసి పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్‌లైట్’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. జర్మనీలోని జ్యూలిచ్‌లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు. అసాధారణ ఉష్ణోగ్రత..: 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరించేలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేష న్‌తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. కర్బన ఉద్గారాలు లేని ఇంధనం..: హైడ్రోజన్ మండినప్పుడు కర్బన ఉద్గారాలు వెలువడవు. తద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు హైడ్రోజన్ కారణమవ్వదు. అందువల్ల దానిని భవిష్యత్తు ఇంధనంగా చాలా మంది భావిస్తున్నారు. కానీ హైడ్రోజన్ సహజంగా ప్రకృతిలో దొరకదు. నీటి నుంచి విడదీయాలి. దీనికి పెద్దమొత్తంలో విద్యుత్తు అవసరం. అంత విద్యుత్తు వాడకుండా సూర్యకాంతితో హైడ్రజోజన్ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు. -
మూడేళ్ల గరిష్టంలో టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టానికి ఎగిసింది. అంచనావేసిన దానికంటే పెరిగి ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం ఏడాది ఏడాదికి 6.55 శాతంగా నమోదైంది. జనవరి నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.25 శాతంగా ఉంది. మినరల్స్, ప్యూయల్ ధరలు పెరగడంతో పాటు ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో ఈ టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగినట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. మంగళవారం ప్రభుత్వం ఈ డేటాను విడుదల చేసింది. రాయిటర్స్ పోల్స్ అంచనాల ప్రకారం ఈ డేటా 5.90 శాతంగా నమోదవుతుందని అంచనావేసింది. ఈ రెండున్నర ఏళ్లలో టోకు ధరలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గత నెల టోకు విక్రయాల ఆహార ధరలు యేటికేటికి 2.69 శాతం పెరిగాయి. జనవరిలో ఇవి 0.56 శాతం పడిపోయాయి. మినరల్ ధరలు కూడా 31 శాతం పెరిగాయి. అంతేకాక సమీక్షించిన పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగియడంతో ప్యూయల్ 21 శాతం కాస్ట్ లీగా మారిందని ప్రభుత్వ డేటా వెల్లడించింది. -
రిలీవ్డ్ విద్యుత్ ఉద్యోగులకు మొండిచెయ్యి
ఏపీ సంస్థల్లోకి తీసుకునేందుకు సర్కార్ విముఖత సాక్షి, అమరావతి: ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు తొలగించిన 1,252 మంది విద్యుత్ ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది. వారిని ఏపీ విద్యుత్ సంస్థల్లోకి తీసుకునేందుకు ఆస్కారం లేదని విద్యుత్ అధికారులకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న సంకేతాలు పంపారు. తమను ఏపీ సంస్థల్లోకి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రిలీవ్ చేసిన ఉద్యోగులు 12 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థల పాలన వ్యవహారాలపై బుధవారం విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల అంశాన్ని అధికారులు అజయ్‌జైన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమవ్వాలని గవర్నర్ చేసిన సూచనపైనా అధికారులు చర్చించారు.అజయ్ జైన్ మాట్లాడుతూ.. ఇది రెండు ప్రభుత్వాలు రాజకీయంగా తేల్చుకోవాల్సిన అంశమని, వారిని తీసుకునేందుకు సీఎం సానుకూలంగా లేరని స్పష్టం చేసినట్టు తెలిసింది. అనంతరం ఇతర అంశాలపై చర్చించారు. -
ఇందన పొదుపు అందరి బాధ్యత
కర్నూలు (రాజ్‌విహార్): ఇందనం పొదుపు చేస్తే భవిష్యత్తరాలకు ఆసరాగా ఉంటుందని ఫ్యాక్టరీస్ డిప్యూటీ డైరెక్టరు శివశంకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కర్నూలు–1డిపో గ్యారేజీలో ఇందన పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఎన్వీరాల్మెంట్ ఇంజినీర్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంస్థ సూచించిన మార్గాలను అనుసరిస్తేనే పొదుపు సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంధన పొదుపుతోనే ఆర్టీసీకి భవిష్యత్తు
- ధరలు పెరుగుతుండడం సంస్థకు భారమే - కేఎంపీఎల్ పెంచేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలి - ఆర్టీసీ కన్సల్టెంట్, ట్రైనర్ హనీఫ్ కర్నూలు(రాజ్‌విహార్): ఇంధనం పొదుపు చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్సార్టీసీ కన్సల్టెంట్, ట్రైనర్ ఎండీ హనీఫ్ అన్నారు. స్థానిక బళ్లారీ చౌరాస్తా సమీపంలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో మంగళవారం ఇంధన పొదుపుపై ఈనెల 31వ తేదీ వరకు జరిగే శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డీజిల్, ఆయిల్ పొదుపుపై శిక్షణలో వివరించారు. సంస్థ ఆదాయంలో 30శాతం కేవలం డీజిల్‌కే ఖర్చవుతోందని, దీనిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చమురు ధరలు పెరుగుదలకు హద్దు లేకుండా పోయిందని, దీంతో సంస్థపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఈ క్రమంలో మైలేజీని పెంచుకుంటే కేఎంపీఎల్ (కిలో మీటర్ పర్ లీటర్)ను అధికంగా చూపవచ్చని సూచించారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందని, మెకానిక్‌లు, డీఎంలు, శ్రామిక్, డ్రైవర్లు ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని జాగ్రత్తలు పాటించాలని డెమో ద్వారా వివరించారు. శిక్షణా కార్యక్రమంలో ఆర్ఎం జి. వెంకటేశ్వర రావు, ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రజియా సుల్తానా, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రమేష్‌కుమార్, 12 డిపోల మేనేజర్లు, మెకానికల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మేనేజర్లు పాల్గొన్నారు. -
భారీగా ఎగిసిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు!
న్యూఢిల్లీ : పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న నిర్ణయం ప్రకటించిన అనంతరం ప్రజలు ఒక్కసారిగి బెంబేలెత్తిపోయిన సంగతి తెలిసిందే. అయితే పాత నోట్ల చెల్లుబాటు కోసం పెట్రోల్, డీజిల్ బంకుల్లో,ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఈ నోట్లను తీసుకుంటారని, బ్యాంకుల్లో వీటిని మార్చుకోవచ్చని ఉపశమన వార్తలను ప్రకటించారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్, డీజిల్ బంకులు దగ్గర ఎక్కడ చూసినా చాతాడంత క్యూలైన్లే దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్క నవంబర్ నెలలోనే ఇంధన అమ్మకాలు ఏకంగా 10 శాతానికి పైగా ఎగిసినట్టు తెలిసింది. ముందస్తు అంచనాలను తిరగరాసేస్తూ ఈ అమ్మకాలు నమోదుకావడం గమనార్హం. చాలామంది ప్రజలు రద్దైన పాత నోట్లతో తమ ట్యాంకులను నింపేసుకున్నట్టు వెల్లడైంది. మూడు ప్రభుత్వ రంగ సంస్థలు-ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలే నోట్ బ్యాన్ తర్వాత నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 మధ్యకాలంలో రోజుకు సగటున 89,000 కిలో లీటర్ల పెట్రోల్‌ను విక్రయించినట్టు వెల్లడైంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఆ అమ్మకాలు సగటున 11 శాతం కంటే ఎక్కువగా పెరిగాయని ఈ సంస్థల డేటాలో తెలిసింది. ఈ నెల అక్టోబర్‌లో పెట్రోల్ అమ్మకాలు గతేడాది కంటే 1 శాతం తక్కువగానే నమోదయ్యాయి. అదేవిధంగా పెట్రోల్ అమ్మకాలకు ఏమాత్రం తీసిపోకుండా డీజిల్ అమ్మకాలు కూడా నమోదైనట్టు వెల్లడైంది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 7 వరకున్న కాలంలో రోజుకు సగటున 2,25,000 కిలో లీటర్లు అమ్ముడుపోయి, 11.4 శాతానికి పైగా పెరుగుదలను రికార్డు చేసినట్టు తెలిసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే మొత్తం ఇంధన అమ్మకాల్లో 90 శాతం ఆక్రమిస్తాయి. -
పెట్రోల్ బంక్‌ల్లో ఫిక్స్డ్ పెట్టేశారు...
-
పెట్రోల్ బంక్‌ల్లో ఫిక్స్డ్ పెట్టేశారు...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ.500, 1000 నోట్ల ఆకస్మిక రద్దుతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్‌లు, హాస్పటల్స్, రైల్వేస్టేషన్లు, పాలకేంద్రాలు, ఎయిర్‌పోర్టుల్లో ఐదు వందలు, వెయ్యి రూపాయిల నోట్లు చెలామణి అవుతాయని కేంద్రం చెప్పినప్పటికీ చాలా ప్రాంతాల్లో అవి అమలు కావడం లేదు. పలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో అయిదు వందల నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పలు పెట్రోల్ బంక్ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిల్లర సమస్య తలెత్తడంతో కొన్ని పెట్రోల్ బంక్‌ల్లో మినిమమ్ రూ.500 అయితేనే పెట్రోల్ పోస్తామని తెగేసి చెప్పడంతో వాహనదారులు గత్యంతరం లేక ఒప్పుకోవాల్సి వస్తోంది. కాగా పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ స్టేషన్లలో రూ.500,1000 నోట్లను అనుమతించాలని తాము ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. నోట్ల మార్పిడి విషయంలో నవంబర్ 11 వరకూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ రైల్వేస్టేషన్లో అయిటే 500, 1000 నోట్లను అసలు అనుమతించడం లేదు. టికెట్ కౌంటర్ దగ్గర పెద్దనోట్లు తీసుకురావద్దని నోటీసు పెట్టేశారు. కనీసం టీ తాగాలన్నా పైసా లేక ప్రయాణికులు స్టేషన్లో దిక్కులు చూస్తూ నిలబడ్డారు. కౌంటర్ దగ్గరే 500నోట్లు మార్చుకునేందుకు పడిగాపులు పడుతున్నారు. -
ఏపీకి 'ప్రపంచ బ్యాంక్' 1వ ర్యాంక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన తాజా ర్యాంకుల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంధన పొదుపు అమలులో బాబు సర్కార్ అవలంభిస్తున్న చర్యలకుగానూ ఈ ర్యాంకు లభించింది. ఈ మేరకు ఏపీ ఇంధనపొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి సంబంధిత వివరాలను శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇంధనపొదుపు అమలులో ప్రపంచబ్యాంక్ ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం లభించిదని, తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచబ్యాంక్ ఎగ్జికూటివ్ డెరైక్టర్ సుభాష్‌చంద్ర గార్గ్ ఇంధన పొదుపుపై వరల్డ్‌బ్యాంక్ రూపొందించినర్యాంకుల నివేదికను ప్రకటించారని, 650 మెగావాట్ల ఇంధన పొదుపు వల్ల రాష్ట్రంలో గడిచిన రెండేళ్ళలో 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయినట్టు గుర్తించారని, అందుకే ఏపీకి ఫస్ట్ ర్యాంక్ దక్కిందని ప్రకటనలో పేర్కొన్నారు. -
పన్నులో ఏటా లక్ష దాకా ఆదా!!
• భత్యాల రూపంలో ఉద్యోగులకు ప్రయోజనాలు • కంపెనీలతో కలిసి జీటా వినూత్న సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మీల్ వోచర్స్, ఫ్యూయెల్ అలవెన్స్, గ్యాడ్జెట్ కొనుగోలు, బుక్స్, కమ్యూనికేషన్ అలవెన్స్.. ఇలా స్థాయినిబట్టి 51 రకాల పన్నులేని అలవెన్సులు, ప్రయోజనాలను భారత్‌లో పనిచేస్తున్న వివిధ కంపెనీల ఉద్యోగులు పొందొచ్చునని. వీటి ద్వారా ఏడాదికి రూ.లక్ష దాకా పన్ను ఆదా చేసుకోవచ్చని ‘జీటా’ సహ వ్యవస్థాపకుడు రామ్‌కి గడ్డిపాటి తెలియజేశారు. డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఉన్న తమ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా టెలినార్, స్పార్, టాటా ఏఐజీ వంటి 350 కంపెనీలకు చెందిన 40,000 పైచిలుకు ఉద్యోగులకు సేవలందిస్తున్నట్టు తెలియజేశారాయన. జీటా పనిచేసేదిలా: కంపెనీల ఉద్యోగులకు జీటా సూపర్కార్డ్ అందజేస్తుంది. ప్రతి అలవెన్సుకు నిర్దేశిత మొత్తం జీటా యాప్‌లో వేర్వేరుగా కనిపిస్తుంది. జీటా సూపర్ కార్డు ద్వారా పెట్రోలు పోయించుకుంటే ఫ్యూయెల్ అలవెన్సు నుంచి ఈ మొత్తం తగ్గుతుంది. చేసిన ఖర్చులకు బిల్లు కావాలని కంపెనీ కోరితే.. బిల్లు కాపీని ఫోటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే చాలు. దేశవ్యాప్తంగా 80 వేల పైచిలుకు వర్తకులతో జీటా చేతులు కలిపింది. జీటాతో భాగస్వామ్యం లేని వర్తకుల వద్ద ఏవైనా వస్తు, సేవలు పొందినట్టయితే బిల్లు కాపీని అప్లోడ్ చేయాలి. 4జీతో ఐఫోన్ విక్రయాలు జూమ్: టిమ్ కుక్ న్యూయార్క్: భారత్‌లో ఏర్పాటవుతోన్న హైస్పీడ్ (4జీ) నెట్వర్క్ వల్ల రానున్న కాలంలో అక్కడ ఐఫోన్ విక్రయాలు పెరగొచ్చని యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. ఇండియాలో హైస్పీడ్ నెట్వర్క్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం అక్కడ యాపిల్ మొబైల్ హ్యాండ్సెట్స్ అంత మంచి పనితీరును కనబరచడం లేదని అంగీకరించారు. ‘జియో దేశవ్యాప్తంగా ఆల్-ఐపీ నెట్వర్క్ 4జీ కవరేజ్ ను ఏర్పాటు చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తోంది’ అని వివరించారు. -
ప్యూయెల్-ఏ-డ్రీమ్ తో క్రౌడ్ ఫండింగ్..
♦ విజయవంతంగా 40 ప్రాజెక్టులు ♦ మొత్తం రూ.1.6 కోట్లు సమీకరణ ♦ కంపెనీ ఫౌండర్ రంగనాథ్ తోట హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మంచి వ్యాపార ప్రణాళిక, దాతృత్వ కార్యక్రమం, సామాజిక చైతన్యం.. కార్యక్రమం ఏదైనా క్రౌడ్ ఫండింగ్ చేసిపెడతామని అంటోంది ఫ్యూయెల్‌ఏడ్రీమ్.కామ్. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ ఇప్పటి వరకు 40 ప్రాజెక్టులకు క్రౌడ్ ఫండింగ్ అందించింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 5 ప్రాజెక్టులు ఉన్నాయని ఫ్యూయెల్‌ఏడ్రీమ్.కామ్ ఫౌండర్ రంగనాథ్ తోట సాక్షి బిజినెస్ బ్యూరోకు మంగళవారం తెలిపారు. అన్ని ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.6 కోట్లు సమీకరించామని చెప్పారు. ఏ కార్యక్రమమైనా తక్కువ వ్యయంతో విజయవంతంగా పూర్తి అయ్యేందుకు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. డిసెంబరుకల్లా మొత్తం రూ.4 కోట్లు సమీకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రౌడ్ ఫండింగ్ అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, కస్టమర్లు, ఇతరుల నుంచి ఉచితంగా నిధులను సమీకరించడం. డెలివరీకి ఈ-బైక్ సిద్ధం.. ఫ్యూయెల్‌ఏడ్రీమ్.కామ్ క్రౌడ్ ఫండింగ్ అందించిన స్పెరో ఈ-బైక్ డెలివరీకి సిద్ధమైంది. ఈ నెలాఖరు నుంచి కస్టమర్లకు అందిస్తామని స్పెరో ఈ-బైక్ ఫౌండర్ ఎస్.మణికందన్ వెల్లడించారు. ఇప్పటి వరకు 160 బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. నెలకు 300 ఈ-బైక్స్‌ను తయారు చేసే సామర్థ్యం తమ కంపెనీకి ఉందని పేర్కొన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.55 లక్షలు సమీకరించామన్నారు. ఒకసారి చార్జ్ చేస్తే 30, 60, 100 కిలోమీటర్లు నడిచే మూడు రకాల స్పెరో ఈ-బైక్ మోడళ్లున్నాయి. ధరల శ్రేణి రూ.29,900-50,900 ఉంది. మార్కెట్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ అని కంపెనీ తెలిపింది. శాంసంగ్ తయారీ బ్యాటరీని వీటిలో వాడారు. మోటారు, టైర్లను కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. -
కూలిన మిగ్ విమానం ఇంధన ట్యాంక్
- పేలుడు కారణంగా భారీ మంటలు - విశాఖ విమానాశ్రయంలో కలకలం గోపాలపట్నం, మల్కాపురం(విశాఖ): విశాఖ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాం తంలో ఐఎన్ఎస్ డేగా నుంచి రోజూ మాదిరిగానే నాలుగైదు యుద్ధ విమానాలు విన్యాసాల కోసం బయల్దేరాయి. వాటిలో మిగ్-57 విమానం రన్‌వే నుంచి గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలోని ఇంధన ట్యాంకు రన్‌వేపైకి జారిపడింది. పెలైట్ అప్రమత్తమై విమానాన్ని ఆపకుండా గాల్లోకి దూసుకుపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంధన ట్యాంకు పడిన చోట గడ్డి కూడా తగలబడడంతో మంటలు చెలరేగాయి. వెంటనే ఐఎన్ఎస్ డేగాతోపాటు, విమానాశ్రయం నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు ఆర్పాయి. కాగా ఇంధన ట్యాంకుకు చెందిన ఒక శకలం మల్కాపురం హెచ్‌పీసీఎల్ సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌లో పడటంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ సంఘటనతో విమానాల రాకపోకలు గంటకుపైగా నిలిచిపోయాయి. ఫలితంగా పలు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. అయితే విమానం నుంచి ఇంధన ట్యాంకు నగరంలో పడి ఉంటే పరిస్థితేంటని జనం భయంతో చర్చించుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం విశాఖలో ఇది రెండోసారి. -
కిందపడ్డ మిగ్ విమానం శకలాలు
-
‘ఇంధన’ పరిజ్ఞానంపై పరిశోధనలు
♦ సాంకేతికతను సభ్య దేశాలు పంచుకోవాలి ♦ ‘బ్రిక్స్’ సదస్సులో తీర్మానాలు సాక్షి, విశాఖపట్నం: ఇంధన పొదుపు, సమర్థతలపై మరింత పరిశోధనలు సాగించాలని, ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సభ్య దేశాలు పరస్పరం పంచుకోవాలని ‘బ్రిక్స్’ సదస్సు తీర్మానించింది. విద్యుత్ ఆదా, ఇంధన సమర్థతపై విశాఖలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల ప్రతినిధులు సోమ, మంగళవారాల్లో ఈ సదస్సుల్లో పాల్గొన్నారు. వాటి వివరాలను కేంద్ర విద్యుత్‌శాఖ అదనపు కార్యదర్శి బీపీ పాండే మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంధన సామర్థ్యం పెంపుతో అభివృద్ధి సాధ్యమవుతుందని సదస్సు అభిప్రాయపడిందని చెప్పారు. రోజురోజుకు వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూనే పరిశోధనలపైనా దృష్టి సారించాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం సదస్సులు, చర్చలు, సెమినార్ల ద్వారా అభిప్రాయాలను పంచుకుంటే ఫలితం ఉంటుందన్నారు. ఇందుకోసం ఒక డ్రాఫ్ట్ యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్టు తెలిపారు. అవసరమైన నిధులను బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి సమకూర్చుకుంటాయన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిలైట్లతో విద్యుత్ ఆదా అయిన నేపథ్యంలో సభ్య దేశాల్లోనూ వీటిని అమర్చాలన్న అభిప్రాయానికొచ్చారన్నారు. సదస్సులో తీర్మానించిన అంశాలను సభ్య దేశాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తారన్నారు. 2020 నాటికి బ్రిక్స్ దేశాలు ఇంధన పొదుపులో ఉత్తమ ఫలితాలు సాధించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అతి తక్కువ ధరకే సోలార్ ఫ్యాన్లు అతి తక్కువ ధరలకే వినియోగదార్లకు సోలార్ సీలింగ్ ఫ్యాన్లు అందజేయనున్నట్టు ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఎండీ శౌరభ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఒక్కో ఫ్యాను ఖరీదు రూ.1150 ఉంటుందని, వీటిని సాధ్యమైనంత అతి తక్కువ ధరకే అందించాలని యోచిస్తున్నామని చెప్పారు. తొలిదశలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల ఎల్ఈడీ బల్బులు వినియోగదార్లకు అందజేశామన్నారు. ఎల్ఈడీ వీధిలైట్లు రీప్లేస్మెంట్ ప్రక్రియ మొదలెట్టామని, మొత్తం 5.5 లక్షల బల్బులు మార్చాలన్నది లక్ష్యం కాగా 4.5 లక్షలు పూర్తిచేశామని, మిగిలినవి సెప్టెంబర్ ఆఖరుకు పూర్తి చేస్తామని వివరించారు. రెండు లక్షల మంది రైతులకు 3 నుంచి 20 హార్స్పవర్ సామర్థ్యం గల సోలార్ పంప్సెట్లు అందజేస్తామని, ఏటా సర్వీసింగ్‌తోపాటు ఐదేళ్లు వారెంటీ ఉంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పౌలా రస్సీ (బ్రెజిల్), ఓల్గా ఉడినా (రష్యా), షాన్‌చెంగ్ వాంగ్ (చైనా), జోలీ మబుసేలా (దక్షిణాఫ్రికా) తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతుకు ఇంధనభారం
♦ సాగుకు పెరిగిన యంత్రాల వినియోగం ♦ డీజిల్ ధర పెంపుతో కష్టమవుతున్న సేద్యం ♦ చిన్న, సన్నకారు రైతులను భయపెడుతున్న ట్రాక్టర్ బాడుగలు ♦ రవాణా చార్జీలు, ఎరువులపైనా ప్రభావం ♦ కరువు నేపథ్యంలో కష్టాల సేద్యం వ్యవసాయంలో ప్రస్తుతం యంత్రాల వినియోగం పెరిగిపోయింది. సాగుకు కూలీలు దొరకకపోవడం, దొరికినా కూలి రేట్లు అధికమవడం... ఇతరత్రా కారణాలతో అన్నదాతలు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దుక్కి మొదలు పంట చేతికొచ్చే వరకు యాంత్రీకరణ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులపై ప్రభుత్వం నిత్యం పెంచుతున్న డీజిల్ ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. ప్రత్యక్షంగా జిల్లా రైతులపై రూ.2 కోట్లపైనే అదనపు భారం పడుతోంది. కడప అగ్రికల్చర్: ప్రస్తుతం ఎద్దులు, నాగళ్ల వాడకం తగ్గిపోయి యంత్రాల వినియోగం తప్పనిసరైంది. ఒకప్పుడు ఏ గ్రామంలో చూసిన రైతుల ఇంటి ముందు పాడి పశువులు, కాడెద్దులు, ఎద్దులబండ్లు, వ్యవసాయ సామగ్రి కనిపిస్తూ ఉండేవి. గ్రామాల్లో ఎద్దులతో వ్యవసాయం చేసే రైతులను వేళ్లమీద లెక్కించవచ్చు. ప్రస్తుతం వాటి స్థానంలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు దర్శనమిస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు కూడా యాంత్రీకరణ వైపే మొగ్గుచూపాల్సిన అవసరం ఏర్పడింది. ఎరువులు తరలించడానికి రవాణా పరంగానూ వాహనాల బాడుగ భారీగానే ఉంటోంది. రైతన్నలపై రూ.2కోట్ల భారం ఇప్పటికే రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. ఇలాంటి కరువు పరిస్థితుల్లోనే జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 1.34 లక్షల హెక్టార్లలో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇది కాక ఉద్యాన పంటల సాగు అంతకంటే రెట్టింపుగానే ఉంది. ఈ పంటల సాగుకు 70శాతం మంది రైతులు ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎకరా భూమి దున్నడానికి గంటకు రూ.600 నుంచి రూ.700వరకు తీసుకుంటున్న ట్రాక్టర్ యజమానులు, తాజాగా డీజిల్ ధరలు పెరగడంతో ఆ ధరను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఎకరాకు రూ.150 నుంచి రూ.200 వరకు అదనంగా వసూలు చేయనున్నారు. ఇది చూడటానికి చిన్న మొత్తంగా ఉన్నా జిల్లావ్యాప్తంగా తీసుకుంటే ఈ భారం రైతుకు తడిసిమోపెడు కానుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న భూములకు సంబంధించి వ్యవసాయ పనులు చేయడానికి రైతులపై రూ.2 కోట్ల వరకు డీజిల్ భారం పడుతోంది. వ్యవసాయం భారంగా మారింది: రాను రాను వ్యవసాయం భారంగా మారింది. ఒక పక్క పెరిగిన ఎరువుల ధరలు, మరోపక్క విత్తనాల ధరలు, ఇంకో పక్క కూలి రేట్లు వేధిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ డీజిల్ ధరలు పెంచితే ఎట్లా వ్యవసాయం చేయాలి. వరిసాగు చేయాలంటే ట్రాక్టరుతో మెత్తగాను, మళ్లీ దమ్ము చేయడం వంటి పనులకు ఎకరాకు రూ.1,500-2,000 అవుతుంది. ఇది ఇప్పుడు పెరిగిన డీజిల్‌కు అనుగుణంగా ఉంటుంది. - చెన్నయ్య, రైతు, పాలెంపల్లె, కడప మడలం. నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు పెరిగిన పెట్టుబడులతో సతమతమవుతున్న రైతులపై కేంద్రం ధరలు పెంచుతూ మరింత భారం వేస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే డీజిల్ ధరలను మూడుసార్లు పెంచింది. తాజాగా మరోసారి గత బుధవారం రాత్రి లీటరు డీజిల్‌పై రూ.1.26 పెంచింది. నెలా పదిహేను రోజుల్లో నాలుగుసార్లు కలిపి రూ.7.72పైసల మేర ధర పెరిగింది. దీంతో జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 60.88 పైసలకు చేరింది. భారీఎత్తున పెరిగిన డీజిల్ ధరతో జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సాగుపై ప్రభావం పడనుంది. ట్రాక్టర్ల వినియోగం, ఆయిల్ ఇంజన్లు, ఇతర యంత్రాలకు డీజిల్ వినియోగం తప్పనిసరి. డీజిల్ ఖర్చులకు ప్రభుత్వం సాయమందించాలి: విత్తన ధరలు, ఎరువుల ధరలు ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకునే విధంగా కంపెనీలకు, ఏజెన్సీలకు అవకాశం కల్పించారు. అదే రైతులు పండించే పంటలకు ఏ మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించరు. కేంద్రం ఇష్టమొచ్చినట్లు డీజిల్ ధరలు పెంచుతూ పోతే రైతులు ఎలా పంటలు సాగు చేసుకుంటారు. ప్రతిదానికి ఇప్పుడు ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నాం. ట్రాక్లర్ల వారు బాడుగులు పెంచుతున్నారు. డీజిల్ ధరలకు అనుగుణంగా ఖర్చులు చెల్లించేలా ప్రభుత్వం సాయమందించాలి. - మునిరెడ్డి, ముండ్లపల్లె, చెన్నూరు మండలం. రైతులకు డీజిల్ ధరలు మినహాయింపు ఇవ్వాలి: వ్యవసాయానికి వినియోగించే డీజిల్‌కు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది. దీంతో రైతులకు ఈ డీజిల్ ధరలు మోయలేని భారంగా ఉన్నాయి. ట్రాక్టర్ల యజమానులు గంటకు బాడుగలను లెక్కకట్టి రాబడతారు. ఇది చిన్న, సన్న కారు రైతులకు మోయలేని భారమే. - నాగసుబ్బయ్య, యువరైతు, కత్తులూరు, వేంపల్లె మండలం. వ్యవసాయానికి సబ్సిడీపై డీజిల్‌ను అందించాలి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇస్తున్నాయి. అయితే డీజిల్ మాత్రం పెంచుకోవడానికి కంపెనీలకు అనుమతులు ఇచ్చేటప్పుడే వ్యవసాయదారులకు ఇన్ని లీటర్ల వరకు వినియోగిస్తే సబ్సిడీ ఉంటుందని ఎందుకు ప్రకటించకూడదు. వ్యవసాయానికి డీజిల్‌ను సబ్సిడీపై ఇచ్చేలా అనుమతులు ఇవ్వాలి. - జయరాముడు, రైతు, కేశలింగాయపల్లె, మైదుకూరు మండలం -
ఇక హెల్మెట్ లేదో పెట్రోల్ బందే
కటక్: రోడ్డు రవాణ భద్రతా చర్యల్లో భాగంగా ఒడిశాలోని కటక్ పోలీసులు ఒక కొత్తకార్యక్రమానికి తెరతీశారు. ఇక హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయవద్దని పెట్రోల్ బంక్ యజమానులకు స్ట్రిట్ ఆదేశాలు జారీ చేయనున్నారు. జూలై 1 నుంచి ఈ నిబంధన అమలుకానుంది. దీంతో ఇక హెల్మెట్ లేకుండా బైక్ నడపాలన్నా సాధ్యం కాదన్నమాట. అయితే, ఇందుకోసం ముందుగానే ఈ నెల 20 నుంచి ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించనున్నారు. 'అన్ని పెట్రోల్ బంక్‌లకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, పూజా కమిటీలకు వారి సహాయాన్ని అందించాలని లేఖలు రాస్తున్నాం. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం విజయవంతం చేయాలని లేఖలో కోరుతున్నాం' అని కటక్ డీసీపీ సంజీవ్ అరోరా చెప్పారు. అయితే, పెట్రోల్ బంక్ యజమానులు ఇప్పటికే తమకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. తమ ప్రత్యేక బృందాలు కూడా బంక్ ల పనితీరుపై ఓ కన్నేసి ఉంచుతాయని చెప్పారు. ప్రజల ప్రాణాల రక్షణే తమ ప్రథమ కర్తవ్యంగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
పెరగనున్న పెట్రోల్, కరెంటు, కార్ల ధరలు!
న్యూఢిల్లీ: దేశంలో కరెంటు చార్జీలతో పాటు, పెట్రోల్, కార్ల ధరలు పెరగనున్నాయా? ప్రస్తుత పరిస్థితులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీ వల్ల వాతావరణంలో కాలుష్యకారకాలు పెరిగిపోతుండటంతో ఎన్విరాన్ మెంటల్, ఎమిషన్ రూల్స్ ను ప్రభుత్వం కఠినతరం చేసింది. దీంతో ఒక యూనిట్ విద్యత్తు ధర 40 నుంచి 50 పైసలు, ఒక లీటర్ పెట్రోల్ ధర 70 పైసలు, కారు ధర రూ. లక్ష నుంచి లక్షన్నరకు వరకు సంస్థలు పెంచే అవకాశం కనిపిస్తోంది. రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలను బట్టి రేట్లు మారే అవకాశం ఉంది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన నిబంధనలను గత ఏడాది డిసెంబర్ లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కేంద్రాలు ఉత్పత్తి చేసే ఒక మెగావాట్ విద్యుత్తుకు కోటి రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ భారాన్ని వినియోగదారులపై విద్యుత్తు కేంద్రాలు మోపనున్నాయి. అంతేకాకుండా కేంద్రాల నుంచి విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పాదరసం తదితర వ్యర్ధాలపై ఆంక్షలు కూడా ఉన్నాయి. కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో సరికొత్త టెక్నాలజీని వినియోగించాలని కూడా నిబంధనల్లో ఉంది. ఆటో ఫ్యూయల్ విజన్ అండ్ పాలసీ 2025 ప్రకారం ఇంధనాల వినియోగంపై రూ.75పైసలను సెస్ రూపంలో వసూలు చేయాలని నిర్ణయించారు. -
దిగ్గజ కంపెనీ భారీ కుంభకోణం!
టోక్యో: కంపెనీకి చెందిన కార్ల కుంభకోణంలో తలెత్తిన ఆరోపణలతో జపాన్ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ మిత్సుబిషి మోటార్స్ ప్రెసిడెంట్ టెస్టురో ఐకావా రాజీనామా చేయనున్నాడు. ఫ్యూయల్ ఎకానమీ డాటా స్కామ్ వల్ల కంపెనీకి చెందిన 4 రకాల మినీ కార్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయన్ విషయం తెలిసిందే. ఐకావా రాజీనామా చేయనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కంపెనీ సీఈవో ఒసాము మసుకో తాత్కాలికంగా ప్రెసిడెంట్ బాధ్యతలను నిర్వహించనున్నాడు. గత వారమే డైరెక్టర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫ్యూయల్ వివరాలు వెల్లడిలో కంపెనీ భారీ మోసాలకు పాల్పడడంతో గత కొన్ని రోజుల నుంచి ఈ కంపెనీపై కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయి. దర్యాప్తు ప్రాథమిక నివేదికలో కుంభకోణం జరిగినట్లు రుజువైంది. జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ మోటార్స్ 34 శాతం వాటాను 200 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసి మిత్సుబిషిలో అతిపెద్ద వాటాదారుగా మారనుంది. 660 క్యూబిక్ సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండే ఇంజిన్లున్న 6.25 లక్షల మినీ వెహికల్స్ ఇంధన వినియోగం వివరాలలో లెక్కలు తారుమారయ్యాయి. ఈ కార్లను జపాన్ మార్కెట్లోనే విక్రయించారు. ఇంధనం విషయంపై పలు ఆరోపణలు రావడంతో ఇన్వెస్టిగేషన్ చేయగా, మరికొన్ని రకాల మోడల్ కార్లకు ఇలాంటి రకమైన ఇంజిన్లనే అమర్చినట్లు తేలింది. ప్రొడక్టల్ మేనేజ్ మెంట్ విభాగంలో కెరీర్ మొదలుపెట్టిన ఐకావా, ఆ తర్వాత డాటా మనిపులేషన్ యూనిట్ కు చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. నేడు ఆ కంపెనీ జపాన్ రవాణాశాఖకు తమ నూతన నివేదిక అందించనుంది. పూర్తిస్థాయి నివేదిక అందితే ఐకావా ఆ సంస్థ నుంచి ఎలాంటి సంబంధాలు లేకుండా మిస్టుబిషి మోటార్స్ నుంచి తప్పుకుంటాడు. -
డిష్యుం... డిష్యుం...
గెస్ట్ కాలమ్ గనిలో పనిలో కార్ఖానాలో/యంత్రభూతముల కోరలు తోమే/కార్మిక ధీరుల విషాదాశ్రులకు/ఖరీదు కట్టే షరాబు లేడోయ్! ఎనభైఏళ్ల కిందట మహాకవి రాసిన వాక్యాలు ఇప్పటికీ ప్రసంగాలలో వినిపిస్తుంటాయి. నేడే మేడే అంటూ ఒకప్పుడు మాదాల రంగారావు ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో పాడితే పరవశించిన పరిస్థితి ఇప్పుడు వుందా? వాలెంటైన్స్ డేల కాలంలో కార్మికుల దినోత్సవాలకు ప్రాముఖ్యం కనిపిస్తుందా? విత్ ఎ క్లిక్ ఆఫ్ సెకండ్లో కావలసినవి వచ్చేస్తుంటే, వర్చ్యువాలిటీ విశ్వరూపం దాలుస్తుంటే, ఈ కాలం చెల్లిన మాటలు వినేవారెవ్వరు..? మేడే మొదలైందే పనిగంటల తగ్గింపు కోసం. ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు మా ఇష్టం అన్నది వారి నినాదం. కాని ఇప్పుడు మనం చెప్పుకునే కంప్యూటర్ నిపుణులకు పనిగంటల నియమం ఖచ్చితంగా అమలవుతోందా? ఇంటికి కూడా లాప్‌ట్యాప్ తీసుకొచ్చి పడక గదిలోనూ పని చేయడం, వర్కింగ్ హాలీడేలు చూడ్డం లేదా? నేరుగా ఉద్యోగాలిస్తే నిబంధనలు, పనిగంటలు పాటించాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగు అంటూ డొంక తిరుగుడుగా దోచుకోవడం రోజూ చూస్తున్నాం. ఇదెంత దూరం పోయిందంటే సాంకేతిక నైపుణ్యానికి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లోనే కరోషి అనే పనివొత్తిడి జబ్బుతో 2015లో దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక అంచనా. ప్రపంచీకరణ ఫలితంగా పెట్టుబడులు ప్రవహించి ఉద్యోగావకాశాలు పెరిగిపోతాయన్న అంచనాలు ఇప్పుడు లేవు. అమెరికా నుంచి మనదేశం వరకూ నిరుద్యోగుల లెక్కలు వినిపిస్తున్నాయి. లక్నోలో కొద్ది మాసాల కిందట అతి సాధారణమైన అటెండర్ ఉద్యోగాల కోసం 23 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 25 మంది డాక్టరే ట్లు కూడా వున్నారు! ఛత్తీస్‌ఘడ్‌లో ఇలాగే లెక్కకు మిక్కుటంగా 75 వేల దరఖాస్తులు వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూలనే రద్దు చేసి పారేశారు. భారత్ వెలిగిపోతుంది, మేకిన్ ఇండియా... ఈ నినాదాల వెలుతురు వెనుక చీకటి గాఢంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయే టైటానిక్‌లా వుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చెట్లు లేని చోట ఆముదపు చెట్టులా తప్ప మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా సాధించిందనుకోవద్దని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం సంపద ఏ కొద్దిమంది దగ్గరో పోగుపడటం. మన దేశ సంపదలోని సగం కేవలం ఒక శాతం మంది సంపన్నుల దగ్గరే ఉంది. అమెరికాలో కూడా కేవలం 158 కుటుంబాలే దేశ సంపద మీద పెత్తనం చేస్తున్నాయి. ఈ సంపద అంతా ఎక్కడిది? కోటానుకోట్ల మంది కార్మికులతో విచక్షణారహితంగా చాకిరీ చేయించుకోవడం, వారికి అందాల్సిన వేతనాలని ఇవ్వకపోవడం, ఆదాయం పంచకపోవడం వల్లనే. ఇది చాలదన్నట్టు సాంకేతికాభివృద్ధిని పెంచడం వల్ల, రోబోల రంగప్రవేశం వల్ల నోరున్న మనుషుల ప్రాధాన్యం ఇంకా తగ్గిపోతుంది. మెషీన్లలో వారూ మెషీన్లుగా మారిపోక తప్పదు. తమ చైతన్యాన్ని, హక్కులను, డిమాండ్లను మర్చిపోయి మరమనుషులుగా మారక తప్పదు. కాని ఇది ఎంతోకాలం సాగకపోవచ్చు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండు పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అన్న మార్క్స్ మాటకు మర మనుషులు కూడా గొంతు కలిపే రోజు వస్తుంది. అయితే అప్పుడెప్పుడో ఆయన చెప్పినట్టే కార్మికులు జీవిస్తున్నారా? యంత్రాలు అన్ని పనులూ సులభం చేయలేదా? కంప్యూటర్ల వినియోగంతో శ్రమ తగ్గి నైపుణ్యం, నాణ్యత మెరుగుపడలేదా? మరి కఠోరశ్రమ అవసరముందా? మనిషికి మరమనిషి ప్రత్యామ్నాయం కావడం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం మనకు యంత్రాలనిస్తుంది కాని నడిపేది మనిషే. అవి తమకు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం చెప్పింది చెప్పినట్టు చేసుకుపోతాయి తప్ప తేడాపాడాలు వాటికి తెలియవు. కనుక మ్యాన్ అండ్ మెషీన్ ఒక కాంబినేషన్. ఒకటి వుంటేనే మరొకటి. మేధా శారీరక శ్రమతో సాంకేతిక పరికరాలను సృష్టించాల్సింది మనుషులే. సృజనాత్మకంగా ఉత్పాదకత పెంచడం ఎలాగో కూడా మనుషులే ఆలోచించాలి తప్ప వాటికవే లక్ష్యాలు నిర్దేశించుకోలేవు. వాటికి కావలసిన సరఫరాలు సమన్వయం మనుషులతోనే జరుగుతుంది. మరలు కూడా ఒక దశ వరకే పనిచేస్తాయి. తర్వాత వేడిక్కిపోతాయి. చెడిపోతాయి. ఆగిపోతాయి. ఏదో ఒక ఇంధనం లేకుంటే నడవలేవు. కనుకనే మానవ రహిత మరప్రపంచాన్ని వూహించడానికి లేదు. - తెలకపల్లి రవి,సీనియర్ పాత్రికేయులు -
ఫ్యూయెల్ సెల్ తో మూత్రాన్ని విద్యుత్తుగా...
లండన్ : వ్యర్థాల నుంచి విద్యుత్ అంటూ ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పటికే మనిషి మూత్రాన్ని విద్యుత్తుగా మార్చేందుకు సైతం అనేక పరిశోధనలు జరిపారు. విద్యుత్ ఉత్పాదకత పెంచేందుకు ప్రపంచమంతా పలు రకాల అధ్యయనాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా చవకైన, శక్తివంతమైన అతి చిన్న ఫ్యూయెల్ సెల్ పరికరంతో మూత్రాన్ని విద్యుత్తుగా మార్చవచ్చని కొత్త తరహా పరిశోధనలద్వారా కనుగొన్నారు. మూత్రం ఉండే పునరుత్పాదక జీవశక్తిని వినియోగించి ఫ్యూయెల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. లండన్ బాత్ విశ్వవిద్యాలయం, మెరీ యూనివర్శిటీ లు బ్రిస్టల్ రోబోటిక్ ల్యాబరెటరీ ద్వారా సరికొత్త టెక్నాలజీతో పరిశోధనలు నిర్వహించారు. ఈ కొత్త రకం ఫ్యూయెల్ సెల్స్ గురించి ఎలక్ట్రో కిమికా ఆక్టా జర్నల్ లో ప్రచురించారు. దీనిద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఎటువంటి ఖరీదైన వస్తువులు అవసరం లేదని, కార్బన్, కాటన్, టిటానియమ్ వైర్లతో తయారయ్యే అతి చవుకైన కాథోడ్ ఉపయోగించి శక్తివంతమైన విద్యుత్తును వెలికి తీయవచ్చని వివరించారు. ఆహార వ్యర్థాల్లో... ముఖ్యంగా గుడ్డు తెల్లసొనలోని వొవాల్బుమిన్ ప్రొటీన్, గ్లూకోజ్ లు విద్యుత్తును వెలికి తీసేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. వీటితో ఫ్యూయెల్ సెల్స్ మరింత వేగంగా స్పందించి, మరింత శక్తిని సృష్టించేందుకు వీలవుతుంది. అయితే ఈ పరిశోధనల్లో ఎలక్ట్రోడ్ల పొడవు పెంచి మెలిపెట్టడంద్వారా విద్యుత్ ఉత్పత్తి పదిరెట్లు పెరిగినట్లు కనుగొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా నిరుపేద, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫ్యూయెల్ సెల్స్ ద్వారా వ్యర్థాలను వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాన రచయిత జోన్ ఖౌలర్ వెల్లడించారు. తాము రూపొందించిన డిజైన్ సంప్రదాయ నమూనాలకంటే తక్కువ ధర కలిగి, మరింత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ వెలికి తీసే మిగిలిన అన్ని పరికరాలకన్నా, మూత్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ఈ ఫ్యూయెల్ సెల్ పరికరంతో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తికావడం గమనించవచ్చని ఖౌలర్ తెలిపారు. -
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వాయిదా తీర్మానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశంపై ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. గురువారం కూడా రాష్ట్ర బడ్జెట్ 2016-17పై చర్చ కొనసాగుతుంది. సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరు అవకతవకలపై కాల్ అటెన్షన్ మోషన్ నోటీసులను అధికారపక్షం ఇచ్చింది. మరోవైపు వైఎస్ఆర్ సీసీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ పిటిషన్ పై హైకోర్టులు వాదనలు ముగిశాయి. నేడు రోజా సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. -
ఇంధన పొదుపులో టీఎస్ ఆర్టీసీ టాప్
♦ రెండు జాతీయ స్థాయి అవార్డులు కైవసం ♦ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీకి తొలిసారి సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో దేశవ్యాప్తంగా రవాణా సంస్థల్లో టీఎస్ఆర్టీసీ ఉత్తమంగా నిలిచింది. బస్సులు సగటున లీటరు డీజిల్‌కు 5.46 కిలోమీటర్ల మైలేజీతో తెలంగాణ ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. దీంతో ప్రతిష్టాత్మక ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ)’ ప్రతి సంవత్సరం అందించే అవార్డుకు ఎంపికైంది. 2014-15 సంవత్సరానికి గాను టీఎస్ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. ఉమ్మడి ఆర్టీసీ దాదాపు 14 సార్లు ఈ అవార్డు పొందింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాదే ఈ అవార్డు తెలంగాణ ఆర్టీసీ పరమైంది. ఉత్తమ కేఎంపీఎల్‌ను మెరుగుపరుచుకునే కేటగిరీలో టీఎస్ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. కేఎంపీఎల్‌ను అంతకు ముందు సంవత్సరం 5.41 నుంచి 5.46కు పెంచుకుంది. ఈ రెండు అవార్డులను ఈ నెల 21న బెంగళూరులో జరిగే ఏఎస్ఆర్టీయూ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సంస్థ జేఎండీ రమణారావు అవార్డును స్వీకరించనున్నారు. ‘ఇంధనాన్ని పొదుపు చేసే సదుద్దేశంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా టీఎస్ఆర్టీసీని ఉత్తమంగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం’ అని జేఎండీ రమణారావు పేర్కొన్నారు. -
ఇంధనం ఆదా...దేశానికే సేవ
♦ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ♦ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ♦ ఇంధన పొదుపు పక్షోత్సవాల్లో ♦ ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు సాక్షి, హైదరాబాద్: ముడి చమురులైన పెట్రో ల్, డీజిల్ పొదుపు చేసిన వారు యావత్ దేశానికి సేవ చేసిన వారవుతారని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఇంధన పొదుపు పక్షోత్సవాల సందర్భంగా శుక్రవారమిక్కడ ఉత్తమ డ్రైవర్లకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ఉత్తమ కె.ఎం.పి.ఎల్ సాధించిన 11 మంది డ్రైవర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సునీల్‌శర్మ మాట్లాడుతూ.. దేశ అవసరాల కోసం దాదాపు 70శాతానికి పైగా విదేశాల నుంచే ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, తద్వారా దేశ సంపద అధికశాతం వీటికే వెచ్చించాల్సి వస్తోందన్నారు. చమురు ఆదా చేయడం ద్వారా డబ్బులు మిగల్చుకోవడంతో పాటు కాలుష్యం తగ్గించవచ్చన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు 0.1 కేఎంపీఎల్ పెంచితే ఏడాదికి సంస్థకు రూ.20 కోట్లు ఆదా చేసినవారవుతారన్నారు. సంస్థలో ఇప్పటికే 80శాతం డ్రైవర్లు 5.0 కేఎంపీఎల్‌ను అధిగమించారని, మిగతా 20శాతం సిబ్బంది కూడా ఇదే దారిలో నడిచి ఆర్టీసీ ఉన్నతికి పాటుపడాలన్నారు. అలాగే ఆర్టీసీలో కొత్తగా వస్తున్న సాంకేతికతను వినియోగించుకొని మరింత ముందడుగు వేయాలన్నారు. ఆర్టీసీ జేఎండీ జి.వి.రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.రవీందర్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ప్రతినిధి సువేందుగుప్త తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ డ్రైవర్లు వీరే... ఎం.వెంకన్న (వరంగల్-1), ఎస్.హనుమయ్య (ఖమ్మం), కె.బుచ్చయ్య (పరిగి), ఎం.డి.గౌస్ (మహబూబ్‌నగర్), పి.ఎమ్.ఎమ్.రావ్ (సంగారెడ్డి), ఎం.డి. హబీబ్(యాదగిరిగుట్ట), వి.ఎస్.కుమార్ (నిజామాబాద్-1), పి.విరేశం (కరీంనగర్-1), కె.గోపాల్‌రెడ్డి (హయత్‌నగర్-2), జి.కిష్టారెడ్డి (రాణిగంజ్-2), ఎస్.ఆర్.రావు (మంచిర్యాల) -
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం
రామ్కీతో చేతులు కలిపిన వెంటానా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెత్త నుంచి ఇంధనాన్ని తయారు చేస్తున్న వెంటానా క్లీన్టెక్.. వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న రామ్కీ ఎన్విరాన్‌మెంట్‌తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పారిశ్రామిక అవసరాలకు వాడే ఇంధనాన్ని తయారు చేసే ప్లాంట్లను నెలకొల్పుతాయి. తొలి దశలో హైదరాబాద్‌లో రామ్కీ ఎన్విరోకు చెందిన ఇంటెగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రంలో రోజుకు 15 టన్నుల సామర్థ్యం గల ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. రెండో దశలో ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లను స్థాపిస్తామని వెంటానా సీఈవో అమిత్ టాండన్ తెలిపారు. హైదరాబాద్‌లో రామ్కీ రోజుకు 400లకుపైగా టన్నుల తక్కువ నాణ్యతగల ప్లాస్టిక్ చెత్త సేకరిస్తోంది. ఇరు సంస్థలకు మేలు చేకూర్చే ఒప్పందమిదని రామ్కీ ఎన్విరాన్మెంట్ ఎండీ గౌతమ్‌రెడ్డి అన్నారు. -
త్వరలో చీప్‌గా పెట్రోల్, రైలు టిక్కెట్లు, ఫోన్ బిల్లులు!
న్యూఢిల్లీ: మున్ముందు ఇంధన (పెట్రోల్, డీజిల్)ధరలు, రైలు టెక్కెట్లు, టెలిఫోన్ బిల్లులు మరింత చౌకగా ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేయనున్నారు. అది కూడా క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించేవారికే ఈ సౌకర్యం లభించనున్నట్లు తెలిసింది. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతదారులను నియంత్రించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామని అందులో భాగంగా ఎలక్ట్రానిక్ కార్డుల వినియోగం పెంచాలని నిర్ణయించినట్లు గతంలో అరుణ్ జైట్లీ చెప్పిన విషయం తెలిసిందే. ఆదాయపన్నును క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించేవారికి కొన్ని ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు, ఇలా చేయడం ద్వారా బదిలీ చెల్లింపులనుంచి కూడా మినహాయింపు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు కీలక వర్గాల సమాచారం. లక్ష రూపాలయకంటే పెద్ద మొత్తాన్ని కూడా ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని, అయితే, రెండు లక్షలకు పైగా చెల్లింపులు చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా పాన్ కార్డు అవసరం ఉంటుందని మంగళవారం జైట్లీ చెప్పారు కూడా. దీనిపై పూర్తి స్థాయిలో లోక్ సభలో అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది. -
నాచు పట్టిన ఇల్లు కరెంట్ ఇస్తుంది!
ఫొటో చూశారుగా... జర్మనీలోని హాంబర్గ్‌లో ఉందీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఏంటి దీని ప్రత్యేకత? ముందువైపు అద్దాల్లో పచ్చగా కనిపిస్తోందే... అదే! ఏముంది అందులో? పాచి! ఎందుకు? ఆ పాచి ఇంటికి కావాల్సిన కరెంట్ మొత్తాన్ని తయారు చేస్తుంది! అదెలా? అంటున్నారా? పాచి చిన్నసైజు మొక్కలన్న సంగతి మీకు తెలుసుకదా... కాబట్టి ఇవి సూర్యరశ్మిని తీసుకుని ఎదుగుతాయి. ఫలితంగా ఏర్పడే బయోమాస్‌ను రియాక్టర్‌లోకి చేరిస్తే.. అక్కడ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఫ్యుయెల్ సెల్‌లోకి పంపి కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో విడుదలయ్యే కార్బన్‌డై యాక్సైడ్‌ను పాచి మరింత వేగంగా పెరిగేందుకు ఎరువుగా వాడతారు. మొత్తమ్మీద ఈ అపార్ట్మెంట్స్లోని అన్ని ఇళ్లకు కావాల్సిన విద్యుత్తు అక్కడికక్కడే ఉత్పత్తి కావడమే కాకుండా... 24 గంటలూ వేడినీళ్లు పొందేందుకూ ఈ పాచినే వాడుతున్నారు. అంతేకాదు... అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరిగితే.. దాన్ని ఎంచక్కా గ్రిడ్‌కు కనెక్ట్ చేసి అమ్మేసుకుంటున్నారు. భలే ఐడియా కదూ...! -
లాభాల బాటలోనే స్పైస్‌జెట్..
భారీగా తగ్గిన ఇంధన, ఇతర వ్యయాలు న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో రూ.24 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంధనం ధరలతో పాటు ఇతర వ్యయాలు కూడా భారీగా తగ్గడంతో ఈ క్వార్టర్లో లాభం వచ్చిందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. కంపెనీకి లాభాలు రావడం ఇది వరుసగా మూడో క్వార్టర్ అని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీకి రూ.310 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపారు. అయితే గత క్యూ2లో రూ.1,450 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 28 శాతం క్షీణించి రూ.1,040 కోట్లకు పడిపోయిందన్నారు. ఇంధనం బిల్లు రూ.788 కోట్ల నుంచి 57% క్షీణించి రూ.338 కోట్లకు, ఇతర వ్యయాలు రూ.1,749 కోట్ల నుంచి రూ.1,068 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఈ క్యూ2లో 92.8% లోడ్ ఫ్యాక్టర్ సాధించామని, దేశీ విమానయాన రంగంలో ఇదే అత్యధికమని చెప్పారు. -
‘మూషిక్’వాహనం
భలే బుర్ర మూషిక వాహనాన్ని అధిరోహించి వినాయకుడు ముల్లోకాలూ తిరిగినట్లు పురాణాల్లో చదువుకున్నాం. వినాయకుడు అధిరోహించిన మూషికం సజీవ వాహనం. దానికి కడుపు నిండా ఆహారం తప్ప ఇంధనం అక్కర్లేదు. కానీ మన వాహనాలు అలా కాదు కదా! ఇంధనానికి కొరత తీవ్రమవుతున్న ఈ రోజుల్లో తక్కువ ఇంధనంతో అత్యధిక దూరం ప్రయాణించే వాహనాలను చాలా కంపెనీలు రూపొందిస్తున్నాయి. వాటి రూప కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే, పెద్దగా ఖర్చు లేకుండానే ఈ ‘మూషిక్’ వాహనాన్ని సృష్టించాడు మైసూరుకు చెందిన సంతోష్. ఫొటోలోని ‘మూషిక్’ వాహనంపై కనిపిస్తున్న యువకుడు ఇతగాడే. తొలుత సంతోష్ ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేసేవాడు. ఇతగాడు సృష్టించిన ‘మూషిక్’... ఒక అధునాతన బైక్. దీని తయారీకి సంతోష్ పెద్దగా కష్టపడిందేమీ లేదు. పాతబడ్డ మోటార్ సైకిళ్ల విడి భాగాలను తనకు కావలసిన రీతిలో అమర్చాడు. పెట్రోల్ ట్యాంకు లాంటివేమీ లేకుండా, బ్యాటరీతో నడిచేలా తీర్చిదిద్దాడు. అయితే, దీనిని నడపడానికి మాత్రం ఎవరైనా సరే, ఈ ఫొటోలో ఉన్న భంగిమలో మార్చుకోవాల్సిందే! ఎందుకంటే, దీని హ్యాండిల్ ముందుచక్రం ఇరుసును అతుక్కుని ఉంటుంది మరి. ఈ అధునాతన ‘మూషిక్’ వాహనాన్ని రూపొందించిన సంతోష్‌కు ఇంజినీరింగ్‌లో ఎలాంటి డిగ్రీ లేదు. అయినా, ఈ వాహనం ఇతగాడి పేరును లిమ్కాబుక్‌లోకి ఎక్కించింది. సంతోష్ ఇలాంటివే మరికొన్ని విలక్షణమైన బైక్‌లను రూపొందించాడు. తన తండ్రికి మోటార్ సైకిళ్లంటే తగని ఇష్ట మని, తనకు కూడా చిన్న వయసు నుంచే బైక్‌లపై ఇష్టం పెరిగిందని, తన తండ్రి స్ఫూర్తితోనే కొత్త కొత్త బైక్‌లను రూపొం దిస్తున్నానని చెబుతున్నాడు సంతోష్. -
నీరు - కారు
జపనీస్ కంపనీ టయోటా టోక్యో ఆటోషోలో ప్రదర్శించిన సూపర్ కార్ ఇది. అత్యంత సమర్థమైన, కాలుష్యరహితమైన ఇంధనం ఉదజని (హైడ్రోజెన్) తో నడపగలగడం ఒక్కటే దీని ప్రత్యేకత అనుకునేరు. ఇంకా చాలా ఉన్నాయి. అత్యాధునిక ఫ్యుయెల్ సెల్ టెక్నాలజీతో తయారయ్యే ఉదజనితో విద్యుదుత్పత్తి చేసుకుని అవసరమైనప్పుడు కారును నడిపించుకోవచ్చు. లేదంటే గ్రిడ్‌కు కనెక్ట్ చేసుకుని అమ్ముకోవచ్చు కూడా. అంతేకాకుండా... మీ కారులోని విద్యుత్తును పక్క కారులోకి వైర్లెస్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేయవచ్చు కూడా. టయోటా ఫ్యుయెల్‌సెల్ కారు ‘మిరాయి’ని ఏడాది క్రితమే మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది మాత్రం ప్రస్తుతానికి ఓ కాన్సెప్ట్ కారేగానీ... కొన్నేళ్లలో ఇలాంటివే మనరోడ్ల మీద పరుగులు పెడుతూంటే మాత్రం ఆశ్చర్యపోనక్కరలేదు. -
ఆయిల్ స్మగ్లర్లపై దాడి: 20 మంది భారతీయుల మృతి!
యెమెన్: చమురు స్మగ్లర్లపై సౌదీ వాయుసేనలు జరిపిన దాడుల్లో 20 మంది భారతీయులు మృతిచెందినట్లు తెలుస్తోంది. సౌదీ దేశాల వాయుసేనలు సంయుక్తంగా యెమెన్ లోని హెదాయ్ పోర్టు సమీపంలో మంగళవారం ఆయిల్ స్మగ్లర్లపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో కనీసం 20 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. యెమెన్ లోని హెదాయ్ పోర్టుకు సమీపంలో వాయుసేనలు ఆకస్మికంగా చేసిన దాడిలో రెండు బోట్లు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు, మత్యకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనలో భారత దేశానికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో మృతి చెంది ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాయుసేనలు చేసిన దాడుల్లో 12 మంది షిటీ తిరుగుబాటు దారులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. గతవారం తిరుగుబాటు దారులు చేసిన దాడిలో 45 మంది ఎమిరేట్స్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. -
ఓఎన్జీసీ సబ్సిడీ భారం తగ్గింది...
14% పెరిగిన నికర లాభం; రూ. 5,460 కోట్లు న్యూఢిల్లీ : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.5,460 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.4,782 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి నమోదైందని ఓఎన్జీసీ తెలిపింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తాము చెల్లించే ఇంధన సబ్సిడీ భారం తగ్గడం, ఉత్పత్తి పెరగడం వంటి కారణాల వల్ల నికర లాభం పెరిగిందని ఓఎన్జీసీ సీఎండీ డి.కె. సరాఫ్ చెప్పారు. గత క్యూ1లో రూ.13,200 కోట్లుగా ఉన్న సబ్సిడీ భారం ఈ క్యూ1లో రూ.1,133 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఈ సబ్సిడీ చెల్లింపు వల్ల నికర లాభం గత క్యూ1లో రూ.7,396 కోట్లు, ఈ క్యూ1లో రూ.628 కోట్లు చొప్పున తగ్గిందని వివరించారు. జనవరి-మార్చి క్వార్టర్‌కు చమురు ఉత్పత్తి తగ్గిందని, అయితే ఈ క్యూ1లో 2.2% వృద్ధితో 5.227 మిలియన్ టన్నులకు చేరిందని, గ్యాస్ ఉత్పత్తి మాత్రం 3% క్షీణించి 5.482 బిలియన్ క్యూబిక్ మీటర్లకు తగ్గిందని వివరించారు. ఆదాయం 4% వృద్ధితో రూ.22,868 కోట్లకు పెరిగిందని సరాఫ్ పేర్కొన్నారు. -
పెట్రోల్ బంకులకు పన్నుపోటు!
-
ఇంధన పొదుపునకు విదేశీ సహకారం
పారిస్ సదస్సు వివరాలు వెల్లడించిన చంద్రశేఖర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్ : ఇంధన పొదుపు చర్యలను ముందుకు తీసుకెళ్ళేందుకు తమ అనుభవాన్ని అందించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు సుముఖత వ్యక్తం చేశాయని రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ ముఖ్య అధికారి ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇంధన పొదుపుపై విశాఖపట్టణంలో మరో ఆరు నెలల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. పారిస్‌లో ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంతర్జాతీయ ఇంధన సదస్సు జరిగింది. అమెరికాసహా 29 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రం తరపున చంద్రశేఖర్ రెడ్డి సదస్సుకు హాజరయ్యారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌కు వివరించారు. ఇంధన పొదుపు దిశగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై పలు దేశాలు ఆసక్తి కనబరచాయని, ఇదే రీతిలో ముందుకెళ్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. స్టార్ రేటింగ్ విద్యుత్ ఉపకరణాల వాడకం అనుసరణీయమని పలు దేశాల ప్రతినిధులు సూచించినట్టు తెలిపారు. -
గాలితోనే.. కారులో షికారు!
ఏ ఇంధనమూ అక్కర్లేదు. జస్ట్ గాలి ఉంటే చాలు! రయ్యిన దూసుకుపోతుందీ కారు. ఒకసారి గాలితో ట్యాంక్ ఫుల్ చేస్తే 482 కి.మీ. ఆగకుండా ప్రయాణించొచ్చు! కాకపోతే ఇందులో నింపాల్సింది గాలితో పాటు హైడ్రోజన్ వాయువును కూడా! అమ్మో ఖర్చెంతో అంటారా? ఒకసారి హైడ్రోజన్ ట్యాంక్‌ను ఫుల్ చేసేందుకు 6,395 రూపాయలే! పొగకు బదులుగా స్వచ్ఛమైన తాగునీటిని వదలడం ఈ కారుకున్న మరో విశేషం! హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడటం వల్ల కాలుష్యాలు విడుదల కావు. అందుకే.. హైడ్రోజన్ కార్ల తయారీపై దృష్టిపెట్టాయి కంపెనీలు. ‘టొయోటా మిరాయి’ హైడ్రోజన్ కారు ఈ ఏడాది చివర్లోగానే మార్కెట్లోకి రానుండగా.. హోండా, నిస్సాన్, ఫోర్డ్ కంపెనీలూ ఈ కార్ల ఉత్పత్తిపై కసరత్తు మొదలుపెట్టాయి. టొయోటా మిరాయి కారు.. వేగం గరిష్టంగా గంటకు 178 కిలోమీటర్లు. బ్రిటన్‌లో దీని ధర రూ. 62 లక్షలు. -
ప్రణాళికతోనే విద్యుత్ ఆదా!
సాక్షి, హైదరాబాద్: అవసరమున్నా లేకపోయినా కరెంటుని ఇష్టానుసారం వినియోగించేవారిని మనం చూస్తూనే ఉంటాం. కేవలం ఉద్యోగులే కాదు.. కొన్ని కొన్ని సంస్థల్లో యాజమాన్యాలు కూడా మిరుమిట్లు గొలిపే లైట్ సెట్టింగ్స్, కేఫ్టేరియాలు, పెద్ద వాటర్‌ట్యాంకులు, ఎంటర్టైన్మెంట్ విభాగాల కోసం విద్యుత్‌ను దుర్వినియోగం చేస్తుంటాయి. అనవసరంగా కరెంటుని ఖర్చు చేయడం వల్ల పర్యావరణానికి కూడా హాని కల్గుతుంది. ఎందుకంటే ఏసీలు, ఫ్రిజ్‌ల నుంచి పర్యావరణానికి హాని చేసే వాయువులు వెలువడుతాయి. రాబోయే కాలంలో ప్రపంచం ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇంధనమే ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రీన్ కాన్సెప్ట్‌తో ఆఫీస్ భవనాల నిర్మాణం చేస్తే అటు విద్యుత్ ఆదా అవుతుంది. ఇటు ఇంధన కొరతను అధిగమించవచ్చు మరి. ఇవి పాటిస్తే సరి.. సహజ వెలుతురు ఉండేలా భవననిర్మాణం ఉంటే మంచిది. పాత బిల్డింగ్‌లను సైతం విద్యుత్ ఆదా అయ్యే పద్ధతుల్లో నవీకరించాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ బాటలో ఇప్పటికే అడుగులు వేస్తున్నాయి. కాన్ఫరెన్స్ హాల్స్‌ల్లో, మీటింగ్స్ జరిగే చోట పనిలేనప్పుడు లైట్లను ఆపివేయాలి. తలుపులను, కిటికీలను బార్లా తెరిచి ఉంచితే గాలి, వెలుతురు బాగా రావడంతోపాటు, ఏసీ అవసరం కూడా తగ్గుతుంది. పనిపూర్తయిన వెంటనే కంప్యూటర్స్ అన్ని షట్‌డౌన్ అయ్యేలా చూడాలి. అదే విధంగా కంప్యూటర్, ప్రింటర్, జిరాక్స్ దేనికదే ప్రత్యేక స్విచ్‌బోర్డ్‌ను కల్గి ఉంటే కరెంటు బిల్లు తక్కువకే పరిమితం అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆఫీసులని నిర్మించేటప్పుడే ఆర్కిటెక్ట్‌లకు కరెంటు వినియోగం తక్కువగా ఉండేలా డిజైన్ చేయమని సూచించడం మేలు. గడ్డిని, కొన్ని రకాల మొక్కలను ఆఫీసు పైకప్పుపై పెంచడం ద్వారా చల్లదనంతోపాటు ఏసీ బిల్లుని తగ్గించుకోవచ్చు. అలాగే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం మరింత మేలు. వృథాను గుర్తించండి.. ఆఫీసులో ఏయే విభాగాల్లో ఎక్కడెక్కడ కరెంటు వృథా అవుతుందో తెలుసుకోండి. ఇందుకోసం ఒక అధికారిని లేదా బృందాన్ని నియమించండి. కరెంటు వినియోగాన్ని తగ్గించే క్రమంలో భాగంగా చేపట్టే ఎలాంటి చర్య ఎవ్వరినీ బాధపెట్టేలా ఉండకుండా జాగ్రత్త పడండి. ఏసీ నీకు అవసరమా? లాంటి ప్రశ్నలతో ఉద్యోగుల మనోభావాలను గాయపర్చకండి. అనవసరంగా లైట్లను వేయడం, చల్లదనం కోసం ఏసీ ఆన్ చేయడం.. ఆఫీసుల్లో ప్రధానంగా విద్యుత్ దుర్వినియోగం ఇలానే జరుగుతుంది. వీకెండ్స్‌లో ఉద్యోగుల హాజరు తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఏసీలకు స్వస్తి చెప్పటం ద్వారా కరెంటు ఆదా చేయొచ్చు. లీకేజీలు ఉంటే పరిశీలించడం ద్వారా చల్లదనాన్ని బయటకు పోకుండా చూడడంతో పాటు అధిక కరెంటు ఖర్చు కాకుండా చూసుకోవచ్చు. మామూలు బల్బులతో పోలిస్తే ప్లోరోసెంట్ బల్బులు 5 శాతం అధిక వెలుతురుని, ఎనిమిది శాతం ఎక్కువ జీవితకాలాన్ని కల్గి ఉంటాయి. -
కాదేదీ విద్యుదుత్పత్తికి అనర్హం..!
ఈ కాలంలో విద్యుత్ ప్రాధాన్యం తెలియందెవరికి? దురదృష్టమేమిటంటే... ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఈ సౌకర్యానికి దూరంగానే ఉన్నారు. ఇటువంటి వారికి కూడా చౌకగా విద్యుత్తు వెలుగులు పంచేందుకు ఎన్నో ప్రయత్నాలూ జరుగుతున్నాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ సమస్య పరిష్కారానికి ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. మానవ మూత్రంతోనే చిన్న మోతాదులో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఓ ఫ్యుయెల్ సెల్‌ను అభివృద్ధి చేసింది. ఫ్యుయెల్ సెల్‌లోని సూక్ష్మజీవులు మూత్రాన్ని విడగొట్టి విద్యుత్తును నేరుగా ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో ఫ్యుయెల్‌సెల్‌ను తయారు చేసేందుకు డాలరు (రూ.63) కంటే ఎక్కువ ఖర్చు కాదని ఈ ఆవిష్కరణలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త లెరోపౌలస్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, అశాంతి చెలరేగుతున్న ప్రాంతాల్లో ఉన్న శరణార్థి శిబిరాల్లో విద్యుత్తు వెలుగులు పండించే లక్ష్యంతో తాము దీన్ని అభివృద్ధి చేశామని, ఒక్కో ఫ్యుయెల్ సెల్‌తో ఎల్ఈడీ బల్బులనూ వెలిగించవచ్చునని ఆయన వివరించారు. -
చుక్క ఇంధనం లేకుండా.. ప్రపంచయాత్ర!
ఇదివరకే పలుసార్లు విజయవంతంగా గగనవిహారం చేసిన ప్రపంచ తొలి సౌర విమానం 'సోలార్ ఇంపల్స్' మొదటిసారిగా ప్రపంచయాత్రకూ శ్రీకారం చుట్టింది. సోమవారం అబుదాబీ నుంచి సోలార్ ఇంపల్స్-2(ఎస్ఐ-2) సౌర విమానం చరిత్రాత్మక ప్రయాణం మొదలెట్టింది. చుక్క ఇంధనం లేకుండా.. 35 వేల కి.మీ. సాగే ఈ సుదీర్ఘయాత్రకు తొలి పైలట్‌గా సోలార్ ఇంపల్స్ సీఈవో బోర్ష్‌బర్గ్.. రెండో పైలట్‌గా సంస్థ సహ వ్యవస్థాపకుడు పికార్డ్ వ్యవహరిస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ విమానం ఐదు నెలల్లో 25 రోజుల పాటు ఎగరనుంది. జూలై చివరలో ఈ విమానం తిరిగి అబుదాబీకి చేరుకోనుంది. ఇవీ విశేషాలు... విమానంలో సీటు ఒకటే. బరువు 2,300 కిలోలే. ఖాళీ బోయింగ్(1.80 లక్షల కిలోలు)తో పోల్చితే ఇది నామమాత్రమే. ఒక్కో రెక్క పొడవు 72 మీటర్లు. బోయింగ్ 747 విమానం కన్నా దీని రెక్కలే పెద్దవి. సౌరశక్తితోనే నడుస్తుంది. రెండు రెక్కలపై కలిపి 17, 248 సోలార్ సెల్స్ ఉంటాయి. సౌరశక్తితో నడిచే 4 ఎలక్ట్రికల్ మోటార్లు ప్రొపెల్లర్స్‌ను తిప్పుతాయి. సౌరశక్తిని నిల్వ చేసేందుకు నాలుగు లిథియం పాలిమర్ బ్యాటరీలు ఉంటాయి. కార్బన్ ఫైబర్‌తో తయారైన ఇంపల్స్ గరిష్ట వేగం ప్రస్తుతం గంటకు 45 కి.మీనే! సముద్రంపై పగలు 8,500 మీటర్లు, రాత్రి 1,500 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా సాగే ప్రయాణం ఎక్కడా ఆగకుండా ఐదు రాత్రులు, ఐదు పగళ్లూ సాగనుంది. ఈ ఐదు రోజులూ పైలట్ ఒక్కరే! పైలట్ వెనక్కి వాలడం తప్ప సీట్లోంచి లేచేందుకు వీలు కాదు. కాలకృత్యాలకు వీలుగా పైలట్ సీటును రూపొందించారు. కాక్‌పిట్‌లో ఏసీ ఉండదు కాబట్టి.. పైలట్‌కు ఉక్కపోత, చలి తప్పదు. పైలట్ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఇతర సమాచారం నిరంతరం కంట్రోల్ రూంకు చేరుతుంది. ఎస్ఐ-2 నేడు(మంగళవారం) అహ్మదాబాద్‌కు చేరుకుం టుంది. వారణాసిలో కూడా ఆగుతుంది. అబుదాబీ నుంచి మస్కట్, ఒమన్, భారత్, చైనా, మయన్మార్, హవాయి, ఫీనిక్స్, అరిజోనా, న్యూయార్క్, మొరాకోల మీదుగా ప్రయాణించి తిరిగి అబుదాబీకి చేరుకుని ప్రపంచయాత్రను ముగించనుంది. -
ప్రాంతీయ అసమానతలకు మళ్లీ ఆజ్యం
హైదరాబాద్: 'ఏ ప్రాంతీయ వాదమైతే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందో మళ్లీ అదే ప్రాంతీయ అసమానతలకు దారితీసేలా చంద్రబాబు అభివృద్ధి నమూనా ఉంది. చంద్రబాబు రాజకీయంగా దూరదృష్టితో ఆలోచించడం లేదు. కొత్త రాష్ట్రం మళ్లీ ముక్కలు కాకూడదు' అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించేది కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు. తామేమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, వాళ్లు తమను అర్థం చేసుకుంటారన్నారు. ఆదివారం నుంచి సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరుగనున్న తరుణంలో రాఘవులు శుక్రవారం ఇక్కడి ప్రకృతి చికిత్సాలయంలో 'సాక్షి ప్రతినిధి'తో మాట్లాడారు. 1997 డిసెంబర్ నుంచి 2014 మార్చి వరకు ఉమ్మడి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన రాఘవులు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. హైదరాబాద్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి తెలుగుదేశం అభివృద్ధి నమూనా సామాన్యులకు ఉపయోగపడేలా లేదు. రాజధానికి భూసమీకరణే దీనికి ఉదాహరణ. వేలాది ఎకరాల భూమిని సేకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ అధికారులు 1,015 ఎకరాలు చాలంటుంటే 30 వేల ఎకరాలు కావాలని మంత్రులంటున్నారు. ఇదంతా ఎవరికోసం? కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఎంత నష్టం జరిగిందో హైదరాబాద్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాల్సింది. విజయవాడ రాజధానిలోనూ కోటి మంది జనాభా ఉండేలా నగరం ఎం దుకు? ఇంత జనాభా ఒకేచోట ఉండాలం టే బాబే చెప్పినట్టు ఒక్కొక్కరు పది మందిని కనడమో లేక పెద్దఎత్తున వలసల్ని ప్రోత్సహించడమో చేయాలి. ఎక్కడికక్కడ అభివృద్ధి చేయడానికి బదులు మళ్లీ కేంద్రీకృతం చేస్తే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. రాష్ట్రం మళ్లీ ముక్కలవకుండా చూడాలి. బాబు దూరదృష్టితో ఆలోచించట్లేదు.. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించట్లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనుకబడిన ప్రాంతాలు. ముందు వాటిని అభివృద్ధి చేయాలి. దీనికి బదులు అభివృద్ధి అంతా విజయవాడ చుట్టే తిప్పితే మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు బయలుదేరతాయి. బాబు నమునాతో సామాజిక న్యాయం లేకుండా పోయింది. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు చెల్లాచెదురుగా ఉన్న గిరిజనుల అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు. సికిల్ అనీమియా(సాక్షిలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ), రక్తహీనత, మలేరియా వంటి వ్యాధులు ప్రబలినా పట్టించుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీకి బదులు కేంద్రం ముష్టి రూ.350 కోట్లు ఇస్తే అదేమని అడగడానికి నోరురాని చంద్రబాబు ఐదు కోట్ల మందికి ఏదో చేస్తాడని భావించలేం. బూర్జువా పార్టీలతో కలసి పోటీచేయం.. మున్ముందు బూర్జువా పార్టీలతో, అదే భావజాలమున్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేయం. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, కలయికకే ప్రాధాన్యం. ప్రజాసమ స్యలపై ఎవరితోనైనా కలిసి పోరాటం చేస్తాం. కమ్యూనిస్టులు కలిస్తే పెద్ద శక్తే. దానిని గౌరవిస్తాం. ముందు రాజకీయ ఏకీభావం ఉండా లి. ఐక్యమై మళ్లీ విచ్ఛిన్నం కాకూడదు కదా.. ప్రజలకు ఆ విషయం తెలుసు... ఓట్లు, సీట్లు లేని పార్టీలు నిజమైన ప్రతిపక్ష పాత్ర ఏం పోషిస్తాయంటున్నారు కొందరు. సీట్లు లేనిమాట నిజమేగానీ చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించేది మాత్రం కమ్యూనిస్టులే.. ప్రజలకు ఆ విషయం తెలుసు. పోరాటాలపై మహాసభల్లో కార్యాచరణ చంద్రబాబు మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచుతామంటున్నారు. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ విధించారు. రుణమాఫీ పెద్ద గోల్మాల్ అయింది. కౌల్దార్లకు, డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు వాటిని విస్మరించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వీటిపై ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోరా టాల పై కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొం దిస్తాం. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర తొలి మహాసభలు జరుగుతున్నాయి. సమర్థ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కృషి చేస్తాం. -
టోకు ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి
న్యూఢిల్లీ: టోకు ధరలు 2014 అక్టోబర్‌లో ఐదేళ్ల కనిష్ట స్థాయిని నమోదుచేసుకున్నాయి. ఈ నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు కేవలం 1.77 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 అక్టోబర్‌తో పోల్చితే 2014 అక్టోబర్ నెలలో టోకు ధరలు కేవలం 1.77 శాతం మాత్రమే పెరిగాయన్నమాట. వార్షికంగా నిర్దిష్ట నెలను పరిగణనలోకి తీసుకుంటే... ఈ స్థాయిలో మాత్రమే టోకు ధరల పెరుగుదల రేటు నమోదుకావడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. గత ఏడాది ఇదే నెలలో(అక్టోబర్) టోకు ధరల స్పీడ్ 7.24 శాతంగా ఉంది. 2014 సెప్టెంబర్‌లో రేటు 2.38 శాతం. ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల స్పీడ్ నమోదుకు ఒకపక్క ఇంధన ధరలు, మరోపక్క ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదల కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక బేస్ రేటు ప్రభావం కూడా ఉందని పేర్కొన్నాయి. ఈ సూచీ వరుసగా ఐదు నెలల నుంచీ తగ్గుతూ వస్తోంది. శుక్రవారం ఈ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కార్పొరేట్ల ఆశలు... ధరలు ఈ స్థాయికి తగ్గడంతో ఇక వడ్డీరేట్ల కోత ద్వారా ఆర్బీఐ వృద్ధికి ఊతం ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీ న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షపై ఆయా వర్గాలు ఆశలు పెట్టుకుంటున్నాయి. అయితే, క్రూడ్ ధరకు సంబంధించి భవిష్యత్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం తగ్గుదల అంతిమంగా వినియోగదారుకు అందుబాటులోకి తీసుకురావడం వంటి కారణాల ప్రాతిపదికన రానున్న రెండు పాలసీ సమీక్షా కాలాల్లో సైతం ఆర్బీఐ వడ్డీరేటు తగ్గించక పోవచ్చునని ఐసీఆర్ఏ సీనియర్ ఎకనమిస్ట్ ఆదితి నాయర్ విశ్లేషించారు. ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే... ఆహార ఉత్పత్తుల ధరలు టోకున వార్షికంగా అక్టోబర్ నెలలో 2.7 శాతం మాత్రమే పెరిగాయి. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ రేటు 0.82 శాతం (3.52 శాతం నుంచి ) తగ్గింది. వార్షికంగా చూస్తే (నిర్దిష్టంగా అక్టోబర్ నెలలో) ఉల్లిపాయలు (-59.77 శాతం), కూరగాయలు (-19.61 శాతం), ప్రొటీన్ ఆధారిత నాన్ వెజ్- గుడ్లు, మాంసం, చేపలు (-2.58 శాతం), గోధుమలు (-1.92 శాతం) ధరలు అసలు పెరక్కపోగా తగ్గాయి. ఇక పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో బంగాళా దుంపలు (82.11 శాతం), పళ్లు (19.35 శాతం), పాలు (11.39 శాతం), బియ్యం (6.47 శాతం), పప్పు దినుసులు (4.02%), తృణధాన్యాలు (3.29%) ఉన్నాయి. మరింత తగ్గుతుంది: జైట్లీ అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినందున, ధరల పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. అయితే క్రూడ్ ధరల భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంలో కొంత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై అధిక ఆశావహంతో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
చౌక విమానయానం మరికొన్నాళ్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొంతకాలంగా నష్టాలను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు దిగొస్తున్న ఇంధన ధరలు కలిసొస్తున్నాయి. గత రెండు నెలల్లో ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు 11 శాతం మేర తగ్గాయి. ఇంధన ధరలు తగ్గుతుండటంతో విమానయాన సంస్థలు చౌక టికెట్ల పోటీని మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. సాధారణంగా శీతాకాలంలో ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసంలో విమానయానానికి డిమాండ్ అధికంగా ఉంటుందని, దీంతో ఈ సమయంలో టికెట్ల ధరలు పెంచేవాళ్లమని, కానీ ఈసారి ఇంధన ధరలు తగ్గడంతో ధరలను పెంచకుండా ప్రస్తుత తగ్గింపు ధరలనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు, తగ్గింపు ధరలను మరికొంత కాలం కొనసాగిస్తామని ఎయిర్ కోస్టా మేనేజింగ్ డెరైక్టర్ ఎల్.వి.ఎస్.రాజశేఖర్ చెప్పారు. ఇంధన ధరలు తగ్గినప్పటికీ ఇంతకంటే విమానయాన ధరలు తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు. ప్రపంచంలోని విమాన టికెట్ల సగటు ధరలతో పోలిస్తే ఇక్కడే తక్కువున్నాయని, దీంతో ప్రస్తుత ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదలాయించలేమని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే బాటలో ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియా కూడా తక్షణం టికెట్ల ధరలను మరింత తగ్గించలేమని స్పష్టం చేసింది. ఇండిగో, జెట్ ఎయిర్వేస్, గో ఎయిర్ వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కంపెనీలకు ఊరట... విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 నుంచి 50 శాతం వాటా కేవలం ఇంధనానిదే. ఇప్పుడు ఆ ఇంధన ధరలు దిగొస్తుండటంతో విమానయాన సంస్థలకు నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం విమానయాన సంస్థలు ఏటా రూ. 25,000 కోట్లు ఇంధనం కోసం ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు ధరలు 11 శాతం తగ్గడంతో పరిశ్రమకు రూ. 2,750 కోట్లు ప్రయోజనం లభించిందంటున్నారు. ఈ ధరల తగ్గింపు వల్ల రూ. 320 కోట్లు తక్షణ ప్రయోజనం కలిగినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. గతేడాది స్పైస్ జెట్ ఆదాయం రూ. 5,200 కోట్లు కాగా, నిర్వహణా వ్యయం రూ. 6,200 కోట్లు అవ్వడంతో రూ.1,000 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు ఇంధన ధరలు తగ్గడంతో నష్టాలు తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఇంధన ధరలు తగ్గడం వల్ల నిర్వహణా వ్యయం 6 శాతం వరకు తగ్గినట్లు రాజశేఖర్ తెలిపారు. గత కొన్ని త్రైమాసికాలుగా నష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ ఈ త్రైమాసికం లాభాల్లోకి ప్రవేశించింది. ఒక పక్క ఇంధన ధరలు తగ్గుతున్నా రూపాయి విలువ క్షీణించి డాలరు విలువ పెరుగుతుండటంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విమానాల లీజింగ్ దగ్గర నుంచి చాలా సేవల ఒప్పందాలన్నీ డాలర్లలోనే ఉంటాయని, డాలరు విలువ పెరగడంతో ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. విస్తరణపై దృష్టి..: గత కొంతకాలంగా విస్తరణకు దూరంగా ఉన్న విమానయాన సంస్థలు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంధన ధరలు దిగిరావడం దేశీయ విమానయాన రంగ వృద్ధికి ఊతమిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలపై కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త విమానాలను సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రూ. 47,200 కోట్లతో 58 విమానాలను కొనుగోలు చేయనున్నాయి. వచ్చే ఫిబ్రవరికి మరో రెండు కొత్త విమానాలు వస్తాయని, దీంతో మరిన్ని పట్టణాలకు విస్తరించడమే కాకుండా, సర్వీసుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఎయిర్కోస్టా తెలిపింది. స్పైస్ జెట్ మరో మూడు విమానాలను కొనుగోలు చేసే పనిలో ఉంది. దేశీయ ప్రయాణికులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లతో రైలు టికెట్ల కంటే తక్కువ రేటుకే విమానయానాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వంటి పట్టణాలకు పరిమిత సంఖ్యలో రూ.300కే టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి.