ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశంపై ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. గురువారం కూడా రాష్ట్ర బడ్జెట్ 2016-17పై చర్చ కొనసాగుతుంది. సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరు అవకతవకలపై కాల్ అటెన్షన్ మోషన్ నోటీసులను అధికారపక్షం ఇచ్చింది. మరోవైపు వైఎస్ఆర్ సీసీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ పిటిషన్ పై హైకోర్టులు వాదనలు ముగిశాయి. నేడు రోజా సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.