న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిలిపివేశాయి. విశాఖపట్టణం, కొచ్చిన్, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా... ఈ ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా విమానాలకు ఇంధన సరఫరాలను గురువారం సాయంత్రం గం. 4 ల నుంచి ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్ ఇండియా సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఇంధన సరఫరాల నిలిపివేత కారణంగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని వివరించారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా తమ పనితీరు చాలా బాగుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆరోగ్యకరమైన నిర్వహణ లాభం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామని పేర్కొన్నారు. వాటా విక్రయం ద్వారా నిధుల లభించని పక్షంలో భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోలేమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment