oil marketing companies
-
‘ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం’
పశ్చిమాసియాలో పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా అధికమవుతున్న చమురు ధరలను భారత్ గమనిస్తోందని చమురు వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు ధరలకు సంబంధించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామన్నారు. ‘ఎగ్జిన్మొబిల్ గ్లోబల్ ఔట్లుక్ 2024’ సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. మంత్రి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయితే, ఆ ప్రభావం దేశంలో ఇంధన లభ్యతపై ఉంటుంది.దేశానికి చమురు సరఫరాల్లో ఎటువంటి అవాంతరాలూ ఉండబోవని భావిస్తున్నాం.ప్రపంచంలోని మూడో అతిపెద్ద చమురు వినియోగ, దిగుమతి దేశమైన భారత్ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలదనే విశ్వాసంతో ఉన్నాం.దేశంలో చమురు కొరత లేదు. భారతదేశ అవసరాలకు తగిన నిల్వలు, వనరులు ఉన్నాయి. ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?మార్చిలో సగటున భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ బ్యారల్‌కు 83 నుంచి 84 డాలర్లు ఉంటే, సెప్టెంబర్‌లో 73.69 డాలర్లకు తగ్గింది. అయితే తాజా పరిస్థితులు మళ్లీ ధరల పెరుగుదలపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. దేశంలో పెట్రోల్–డీజిల్ ధరలు లీటర్‌కు 2 నుంచి 3 వరకూ తగ్గే వీలుందని గత వారం రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొన్న నేపథ్యంలోనే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం. -
పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 లాభం..!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడంలేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినమేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు దాదాపు రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాయని ఇటీవల ఇక్రా నివేదికలో తెలిపింది. ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి 15, 2024లో పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అందుకు అనుగుణంగా చమురు ధరలు మాత్రం తగ్గించడంలేదు. దేశంలో ఇప్పటికీ పెట్రోలు లీటరుకు రూ.100, డీజిల్ రూ.90 పైనే ఉంది. ఈ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా నుంచి విమానయానం వరకు, పరిశ్రమలు నుంచి సరుకుల వరకు రోజువారీ అవసరాలను ప్రభావితం చేస్తున్నాయి.ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎంసీల లాభాలు రూ.86,000 కోట్ల మేర నమోదైనట్లు ఇటీవల పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. గత సంవత్సరం కంటే ఇది 25 రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్‌పీసీఎల్‌కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,980 కోట్ల నష్టం వాటిల్లింది. అందుకు పూర్తి భిన్నంగా 2023-24లో సంస్థ రూ.16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పన్ను చెల్లింపు తర్వాత బీపీసీఎల్ లాభం రూ.26,673 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ, భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల్లో వెసులుబాటు కల్పించడంలేదు. మహారాష్ట్ర, హరియాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేలా ఓఎంసీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా చమురు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా: కేంద్రమంత్రి
ప్రపంచవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం ఇండియా అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ), డీలర్ల మధ్య మార్జిన్లకు సంబంధించి ప్రభుత్వం చర్చలను ప్రోత్సహిస్తోందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు. అందుకు భిన్నంగా ప్రధాని తీసుకున్న సాహసోపేత, దూరదృష్టి నిర్ణయాల వల్ల భారత్‌లో వీటి ధరలు తగ్గుతున్నాయి. నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2024 మధ్యకాలంలో దేశంలో పెట్రోల్ ధరలు 13.65 శాతం, డీజిల్ ధరలు 10.97 శాతం తగ్గాయి. ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్‌లో 22.19 శాతం, జర్మనీలో 15.28 శాతం, ఇటలీలో 14.82 శాతం, స్పెయిన్‌లో 16.58 శాతం పెట్రోల్ ధర పెరిగింది. యూపీఏ ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్ల విలువైన ఫ్లోటింగ్ ఆయిల్ బాండ్లను(పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల ఓఎంసీ నష్టాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన బాండ్లు) జారీ చేసింది. దానికోసం ప్రస్తుతం రూ.3.5 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సి వస్తోంది’ అని మంత్రి వివరించారు.డీలర్ల మార్జిన్ పెరుగుదలపై మంత్రి స్పందిస్తూ..‘ఇది ఓఎంసీలు, డీలర్లు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం. జులై 1, 2024 నాటికి దేశంలో 90,639 అయిల్ రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందినవి. చివరిసారిగా 2017లో డీలర్ల మార్జిన్లు పెరిగాయి. ఇటీవల నిర్దేశించిన మార్గదర్శకాల్లోని కొన్ని షరతులు కొంత కఠినంగా ఉన్నాయని డీలర్లు కోర్టుకు వెళ్లారు. డీలర్ల మార్జిన్లు పెంచితే వారి ఉద్యోగులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు పెంచాల్సి ఉంటుంది. దీన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నిబంధనలు సడలించి ఓఎంసీలు మార్జిన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి మధ్య చర్చలు సాగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గతంలో ఏర్పాటు చేసిన అపూర్వ చంద్ర కమిటీ నివేదికలోని వివరాల ప్రకారం.. డీలర్ల మార్జిన్ రివిజన్ సిఫార్సులను ఓఎంసీలు నిలుపుదల చేస్తున్నాయి. వీటిని ఏటా జనవరి, జులైలో రెండుసార్లు సవరించాలి. ఈమేరకు ఓఎంసీలు, డీలర్ల మధ్య నవంబర్ 4, 2016న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా, గత ఏడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా ఎలాంటి మార్జిన్లు పెంచలేదని డీలర్లు అంటున్నారు. -
ఈ20 ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తగు స్థాయిలో ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తిని మరింతగా పెంచడంపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 100 బంకుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఈ20 ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. అంతా సక్రమంగా సాగితే ఈ ఇంధన వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ అదనపు కార్యదర్శి సుబోధ్ కుమార్ తెలిపారు. దీంతో చక్కెర తరహాలోనే 2023–24 ఇథనాల్ సంవత్సరానికి గాను (డిసెంబర్–నవంబర్) ఇథనాల్ నిల్వలను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇథనాల్ ఉత్పత్తి కోసం మరింతగా చక్కెరను మళ్లించే అవకాశం ఉందని వివరించారు. ఫిబ్రవరి ఆఖరు నాటి వరకూ 120 కోట్ల లీటర్ల పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపినట్లు కుమార్ చెప్పారు. ఇథనాల్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యాలు ఈ ఏడాది లక్ష్యాల సాధనకు సరిపడేంత స్థాయిలో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమకు ప్రోత్సాహం.. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం ద్వారా క్రూడాయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతంగా ఉంటే దాన్ని ఈ20 ఇంధనంగా వ్యవహరిస్తారు. 2001ల నుంచి దీనికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. గతేడాది 10.02 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వినియోగంలోకి తెచ్చారు. 2022–23 ఇథనాల్ సంవత్సరంలో (డిసెంబర్–నవంబర్) దీన్ని 12 శాతానికి, వచ్చే ఏడాది 15 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికల్లా దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యం గడువును కుదించుకుని 2025 నాటికే సాధించాలని నిర్దేశించుకుంది. ప్రస్తుత ఏడాదికి గాను 50 లక్షల టన్నుల చక్కెరను ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించనున్నారు. వచ్చే ఏడాది నిర్దేశించుకున్న 15 శాతం మిశ్రమ లక్ష్య సాధన కోసం అదనంగా 150 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. దీనితో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ చక్కెర మిల్లులు, డిస్టిలరీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 243 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించగా, బ్యాంకులు రూ. 20,334 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వచ్చే 9–10 నెలల్లో అదనంగా 250–300 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రాగలదని అంచనా. -
చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి. చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్ తెలిపింది. లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది. రుణ పరిస్థితుల్లో మెరుగు.. ‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్‌లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలకు ఇది క్రెడిట్ నెగెటివ్. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్‌ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే.. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది. -
పెట్రోల్‌పై లాభం.. డీజిల్‌పై నష్టం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.10 చొప్పున లాభాన్ని చూస్తున్నాయి. మరోవైపు లీటర్ డీజిల్ విక్రయంతో అవి రూ.6.5 నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లాభం వస్తున్నా కానీ అవి విక్రయ రేట్లను తగ్గించడం లేదు. ఎందుకంటే అంతకుమందు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోయిన సమయంలో అవి రేట్లను ఒక దశ వరకు పెంచి, ఆ తర్వాత నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకున్నాయి. పైగా ఇప్పుడు డీజిల్‌పైనా నష్టపోతున్నాయి. దీంతో పెట్రోల్ రేటు దిగి రావడం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) గత 15 నెలల నుంచి రేట్లను సవరించడం లేదు. ‘‘2022 జూన్ 24తో ముగిసిన వారంలో లీటర్ పెట్రోల్‌పై 17.4 నష్టపోగా, లీటర్ డీజిల్‌పై రూ.27.70 చొప్పున నష్టాన్ని ఎదుర్కొన్నాయి. అక్టోబర్–డిసెంబర్ కాలానికి వచ్చే సరికి అవి లీటర్ పెట్రోల్‌పై రూ.10 లాభం, లీటర్ డీజిల్‌పై నష్టం రూ.6.5కు తగ్గింది’’అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో తెలిపింది. 2022 ఏప్రిల్ 6 నుంచి ఈ మూడు ప్రభుత్వరంగ ఆయిల్ విక్రయ సంస్థలు రేట్లను సవరించడం నిలిపివేశాయి. చమురు బ్యారెల్ ధర 103 డాలర్ల నుంచి 116 డాలర్లకు పెరిగినప్పటికీ అవి రేట్లను యథాతథంగా కొనసాగించాయి. ఫలితంగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు సంస్థలు కలసి ఉమ్మడిగా రూ.21,201 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. కానీ, ఈ నెల చమురు ధర 78 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో అవి ఇక మీదట డీజిల్‌పైనా లాభాలను ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేటింగ్ లాభాలు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 10.5–12.4 డాలర్లుగా ఉండడంతో మూడు కంపెనీలు తిరిగి ఆపరేటింగ్ లాభాల్లోకి ప్రవేశిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌కు ఐవోసీ రూ.2,400 కోట్ల ఎబిట్డా (వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు), బీపీసీఎల్‌కు రూ.1,800 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.800 కోట్ల ఎబిట్డా నమోదు చేస్తాయని పేర్కొంది. కాకపోతే నికరంగా నష్టాలను నమోదు చేస్తాయని అంచనా వేసింది. ఐవోసీ రూ.1,300 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.600 కోట్లు చొప్పున నష్టాలను నమోదు చేయవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు కరోనా ఆరంభంలో 2020లో మైనస్‌కు పడిపోవడం గమనార్హం. అక్కడి నుంచి రెండేళ్లలోనే 2022 మార్చి నాటికి బ్యారెల్ ధర 140 డాలర్లకు చేరి, 14 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం చమురు ధరలకు ఆజ్యం పోసిందని చెప్పుకోవాలి. అమెరికా, యూరప్‌లో మాంద్యం, చైనాలో వృద్ధి మందగమనం పరిస్థితులతో డిమాండ్ తగ్గి తిరిగి ధరలు దిగొస్తున్నాయి. ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలు కలిపి పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో 90 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఇవి ఇంతకాలం పాటు రేట్లను సవరించకుండా ఉండడం గత రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
గుడ్‌న్యూస్.. తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర
సాక్షి, ముంబై: ఎల్పీజీ సిలిండర్ల ధర వరుసగా దిగి వస్తోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరను 115 రూపాయలు తగ్గించింది. దీంతో కమర్షియల్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. తాజా సవరణతో హైదరాబాద్‌లో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర 1798.50 నుంచి 115 రూపాయలు తగ్గి 1683 రూపాయలుగా ఉంటుంది. ఇక దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో రూ. 1,744 గాను కోలకతాలో రూ. 1,846, ముంబైలో రూ. 1,696, చెన్నైలో రూ. 1,893 గానూ ఉండనుంది. కొత్త రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి. గత జూన్ మాసం నుంచి వరుసగా ఇది ఏడో తగ్గింపు కాగా, 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధర జూలై నుండి మారకపోవడం గమనార్హం. కాగా చమురు కంపెనీలు ప్రతీ నెల వంట గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. గత ఏడాది నవంబరులో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరన రూ. 266 పెంచింది. ఆ తరువాత 2022, జనవరి కొత్త ఏడాదిలో102.50 రూపాయల మేర సిలిండర్ ధర దిగి వచ్చింది. -
వినియోగదారులకు ఊరట: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
న్యూడిల్లీ: వంట గ్యాస్ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలో రూ.91.50 తగ్గింది. ఈ రోజు (సెప్టెంబర్ 1, 2022) నుంచి ఈ ధర అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. (Zomato: నోరూరించే వార్త చెప్పిన జొమాటో.. బంపర్ ఆఫర్) తాజా సవరణతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1976.07 నుంచి రూ. 1885కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో రూ. 1798.5గా ఉంటుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1885కు, ముంబైలో రూ.1844కు లభించనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర ఈ ఏడాది మేలో రూ.2,354 వద్ద ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం వరుసగా ఐదు నెలలో ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయం ఉంటుందనేది తెలిసిన సంగతే. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ) National Oil Marketing companies have reduced commercial 19-kg LPG cylinder cost by Rs 91.50 effective from today, 1st February. 19 kg commercial cylinder will cost Rs 1907 in Delhi from today: Sources — ANI (@ANI) February 1, 2022 -
విమానయాన సంస్థలకు భారీ ఊరట
సాక్షి,ముంబై: విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్న నేపథ్యంలో జెట్ ఇంధనం (ATF) ధరలు 2.2 శాతం దిగి వచ్చింది. ఈ మేరకు దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు శనివారం ఒక నోటిఫికేషన్ విడుదల చేశాయి. ధరలు కిలోలీటర్‌కు రూ. 3,084.94 లేదా 2.2 శాతం తగ్గి, కిలోలీటర్‌కు రూ. 138,147.93గా ఉన్నాయని తెలిపాయి. ఈ ఏడాదిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి మాత్రమే. గత నెలలో ధరలు కిలో లీటర్‌కు రూ. 141,232.87 (లీటర్‌కు రూ.141.23)కు ఉన్నాయి. స్థానిక పన్నులను బట్టి ధరలు కూడా రాష్ట్రానికి, రాష్ట్రానికి రేట్లో వ్యత్యాసం ఉంటుంది. బెంచ్‌మార్క్ అంతర్జాతీయ చమురు ధరల రేట్ల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరించబడతాయి. జూన్ 1 నాటి రివ్యూలో ధరలలో మార్పులేనప్పటికీ జూన్ 16 నాటి పెంపుతో విమాన ఇంధన ధరలు ఆల్ టైం హైకి చేరాయి. మొత్తంగా, సంవత్సరం ప్రారంభం నుండి 11 సార్లు రేట్లు సవరించగా, దీంతో ఆరు నెలల్లో ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం భయాల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరాయి. ఇదిలా ఉండగా, ఏటీఎఫ్ ధరల సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలతో సమావేశమయ్యేందుకు ఇండియన్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌లు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్పైస్‌జెట్, గోఫస్ట్ ఇండిగో, విస్తారా ఇతర విమానయాన సంస్థలు ఐవోసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ కమిటీలో ఉన్నాయి. -
గ్యాస్ వినియోగదారులకు మరో షాక్! వారికి గుది ‘బండ’
సాక్షి, ముంబై: వంట గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచిన కేంద్రం ఇపుడు వినియోగదారులకు మరో షాక్ ఇవ్వనుంది. గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. చమురు మార్కెటింగ్ కంపెనీల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అంటే డొమెస్టిక్ (14.2 కిలోలు) సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1450గా ఉంది. తాజా పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు ఇతర చార్జీల బాదుడు కూడా తప్పదు. ఫలితంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలనే కస్టమర్లకు అదనపు భారం పడుతుంది. అయితే ఉజ్వల స్కీమ్ వినియోగదారులకు సవరించిన రేట్లు వర్తించవు. అలాగే డబుల్ సిలిండర్ కనెక్షన్ పొందే వారికి మరింత భారం తప్పదు. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించుకోవాలి. పెంచిన ధరలు రేపటి నుంచి (జూన్ 16) నుంచి అమలులోకి వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త కనెక్షన్‌కు రూ.900 నుంచి రూ.1,150కి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.200 నుంచి రూ.1,450 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఉంది. బహుళ కనెక్షన్లు ఉన్నవారు అదనపు కనెక్షన్లను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కనెక్షన్లన్నింటినీ బ్లాక్ చేస్తున్నాయి. అంతేకాదు అదనపు కనెక్షన్ సరెండర్ అయ్యే వరకు రీఫిల్‌లను జారీ చేయడం లేదు.అలాగే కనెక్షన్లు బ్లాక్ చేయబడిన కస్టమర్లు మరొక చమురు కంపెనీ నుండి తాజా కనెక్షన్‌ను పొందకుండా నిరోధించేలా కొత్త కనెక్షన్లను నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వరుస చార్జీల బాదుడుతో విలవిల్లాడిన కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.135 తగ్గించినట్లు బుధవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గింపు ధరలు నేటి (జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చినట్టు ఒక నోటిఫికేషన్లో తెలిపాయి. గత రెండు నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరలను వరుసగా రెండుసార్లు పెంచిన తర్వాత తాజాగా ధర తగ్గించడం విశేషం. అయితే, గృహోపకరణాల గ్యాస్ సిలిండర్లలో ధరల సవరణను ప్రకటించలేదు. తాజా సవరణతో హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,220.50 అయింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2,355.50 నుండి రూ. 2219కి తగ్గింది. ముంబైలో 2,307 నుండి 2171.50 రూపాయలకు దిగి వచ్చింది. కోల్‌కతాలో రూ.2,455 ధరకు బదులుగా రూ.2,322 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.2,508 నుంచి రూ.2,373కి తగ్గింది. అయితే 14.2 కిలోల గృహోపకరణాల సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. మరి భవిష్యత్తులో వంట గ్యాస్ ధర కూడా తగ్గించనున్నారా? అనేది వేచి చూడాలి. -
వాహనదారులకు షాకింగ్ న్యూస్...!
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పన్నెండు రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వాహనదారులకు మరోసారి ఇక్కట్లు మొదలుకానున్నాయి. పెట్రోల్, డిజీల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల ఇంధన రిటైల్ విక్రయ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. చదవండి: మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ భారీగా పెరిగిన బారెల్ ధరలు...! అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత పెట్రోల్ , డీజిల్ ధరలు ఆగస్టు సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌కు సుమారు 4-6 డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. కాగా, రిటైల్ ధరల పెరుగుదలపై ఇప్పటివరకు చమురు కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు ఇదే స్థాయిలో ఉంటే..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చివరగా ఈ ఏడాది జూలై 15, 17 తేదిల్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్, డిజీల్ ధరలు వరుసగా రూ.101.19, రూ. 88.62 గా ఉన్నాయి. గత నెలతో పోలిస్తే సగటు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆగస్టులో బ్యారెల్‌కు మూడు డాలర్లకంటే తక్కువగా నమోదయ్యాయి. యుఎస్, చైనా మిశ్రమ ఆర్థిక డేటా, వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్ కారణంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. దీని ప్రకారం, జూలై 18 నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత మార్కెట్లో పెట్రోల్ , డీజిల్ రిటైల్ ధరలను వరుసగా లీటరుకు రూ. 0.65,రూ. 1.25 కు తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని తాజా పరిణామాలతో ముడి చమురు ధరలు ఆగస్టు చివరి వారం నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. చదవండి: సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి -
LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’
సాక్షి, ముంబై: ఒక పక్క పెట్రో ధరల మంట మరో పక్క వంట గ్యాస్ సిలిండర్ ధరల భారం సగటు జీవిని ఊపిరి పీల్చుకోనివ్వడంలేదు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి 100 రూపాయల దాటి పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ రేట్లు ధరలు వినియోగదారుడిని బెంబేలెత్తిస్తుండగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో బాంబు పేల్చాయి. దేశీయంగా సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 25 పెంచాయి. దీంతో 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో 834.50 రూపాయలుగా ఉంది. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను 84 రూపాయలు పెంచాయి. సవరించిన రేటు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గత ఏడాది నవంబర్ నుంచి పెరుగతూనే ఉన్నాయి. ముంబైలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 834.50 ఉండగా, కోల్‌కతాలో రూ. 861, చెన్నైలో రూ. 850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. ఈ ఏడాదిలో మొదట ఫిబ్రవరి 4న సిలిండర్‌కు రూ. 25 పెంచగా, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25, మార్చి 1న రూ .25 పెంచారు. ఏప్రిల్‌లో రూ .10 తగ్గినప్పటికీ, మే-జూన్ నెలల్లో ధరలో మార్పు లేదు. మొత్తంగా గత ఆరు నెలల్లో ఎల్పీజీ ధర 14.2 కిలోల సిలిండర్‌కు 140 రూపాయలు పెరగడం గమనార్హం. -
పెట్రో సెగ: మరోసారి సెంచరీ కొట్టిన పెట్రోలు
సాక్షి, ముంబై: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలు చొప్పున పెంచుతూ చముర కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో లీటరు పెట్రోలు ధర మరోసారి సెంచరీ కొట్టింది. దేశంలో పెట్రోలు ధర రూ.100 మార్కును దాటడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో మొదటిసారి 100 రూపాయలను దాటి వాహన దారులను బెంబేలెత్తించింది. రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ లీటరుకు రూ .102.15 ను తాకింది. ఇక్కడ డీజిల్ రేటు రూ .94.62 గా ఉంది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ .101.86 వద్ద ఉండగా, లీటరు డీజిల్ రేటు రూ. 92.90గా ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు 102 రూపాయలను తాకడం గమనార్హం. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ. 91.27, డీజిల్ రూ. 81.73 ముంబైలో పెట్రోల్ రూ .97.61, డీజిల్ రూ .88.82 కోల్‌కతాలో పెట్రోల్ రూ .91.41, డీజిల్ రూ .84.57 చెన్నైలో పెట్రోల్ రూ .93.15, డీజిల్ రూ .86.65 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ .94.86, డీజిల్ రూ .89.11 అమరావతిలో పెట్రోల్ రూ .97.42 డీజిల్ రూ .91.12 -
పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే!
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. వాహనదారులు భయపడినట్టే అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతి రోజు నుంచి పెట్రో బాదుడు తప్పదన్న అంచనాల కనుగునే వరుసగా మూడో రోజు గురువారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. లీటర్ పెట్రోలుపై .25పైసలు, డీజిల్ రూ.30 పైసలు చొప్పున పెంచేశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.99, డీజిల్ రూ.81.42కు చేరింది. ప్రధాన నగరాల్లో లీటరుకు పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్ రూ.88.49 చెన్నైలో పెట్రోల్ రూ.92.90, డీజిల్ రూ.86.35 కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.14, డీజిల్ రూ.84.26 బెంగళూరులో పెట్రోల్ రూ.94.01, డీజిల్ రూ.86.31 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.57, డీజిల్ రూ.88.77 అమరావతిలో పెట్రోల్ రూ.97.14, డీజిల్ రూ.90.79 విశాఖపట్టణం పెట్రోల్ రూ.95.90, డీజిల్ రూ.89.59 విజయవాడపెట్రోల్ రూ .96.72, డీజిల్ రూ. 90.41 చదవండి : కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
వాహనదారులకు ఊరట : దిగొచ్చిన పెట్రోలు ధర
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి కాలం దాకా వాహనదారులకు చుక్కలు చూపించిన ఇంధన ధరలు దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పడిపోవడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ఊరటనిస్తున్నాయి. వరుసగా 24 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోలు ధర నేడు (మార్చి 24 బుధవారం) లీటరుకు18 పైసలు,డీజిల్‌పై 17 పైసలు చొప్పున తగ్గాయి. ఫిబ్రవరి 27 న పెట్రోలు ధర దేశ రాజధానిలో 91.17 వద్ద ఆల్ టైమ్ హైని తాకిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర.91.17 నుండి. 90.99 కు , డీజిల్ 17 పైసలు తగ్గి లీటరుకు. 81.47 నుండి. 81.30కు చేరింది. వివిధ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి ముంబైలో పెట్రోలు ధర రూ. 97.40 డీజిల్ ధర 88.42 చెన్నైలో పెట్రోలు ధర 92.95 డీజిల్ ధర86.29 కోల్‌కతాలో పెట్రోలు ధర 91.18 డీజిల్ ధర 84.18 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.61 , డీజిల్ ధర రూ.88.67 అమరావతిలో పెట్రోల్ ధర రూ.97.14 , డీజిల్ ధర రూ.90.67 కాగా ముడి చమురు ధరలు దాదాపు రెండు వారాల నుంచి సుమారు 10 శాతం తగ్గాయి. అయితే బుధవారం మాత్రం పైకి చూస్తున్నాయి. బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ 27 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగి, బ్యారెల్ 61.06 డాలర్లకు చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి ఫ్యూచర్స్ 19 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.95 డాలర్లకు చేరుకుంది. -
పెట్రో ధరలపై ‘ధర్మ్ సంకట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విపరీతమైన సమస్య. దీనికి ధరలు తగ్గించడం తప్ప వేరే ప్రత్యామ్నాయ సమాధానం ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. ‘వాస్తవికతను వివరించేందుకు నేను ఏది చెప్పినా సమాధానాన్ని దాటవేయటం లేదా బ్లేమ్ చేయడం వంటిదే అవుతుంది. ఇంధన ధరలను తగ్గించడమే సరైన పరిష్కారం. పెట్రో ధరల పెరుగుదల ‘ధర్మ్ సంకట్’ పరిస్థితి. వినియోగదారులకు తుది ధర లేదా రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్గాన్ని గుర్తించాలి’ అని నిర్మల వ్యాఖ్యానించారు. ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నిర్ణయిస్తాయ ని, వీటిపై కేంద్రానికి నియంత్రణ ఉండదని ఆమె పేర్కొన్నారు. చమురు దిగుమతులు, శుద్ధి చేయడం, పంపిణీ, లాజిస్టిక్స్ వంటి ఖర్చులను బట్టి ఓఎంసీలు చమురు ధరలను నిర్ణయిస్తాయన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలకు 11వ సారి రెక్కలు
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల నిలకడ తదుపరి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు బలపడి రూ. 82.66కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్‌కు 19 పైసలు అధికమై రూ. 72.84ను తాకింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. తదుపరి తాజా పెంపుతో కలిపి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ 11సార్లు ధరలను పెంచడం గమనార్హం! దీంతో 11 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు సగటున సుమారు రూ. 1.20 వరకూ పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక డీజిల్ ధర అయితే మరింత అధికంగా లీటర్ రూ. 1.80 వరకూ ఎగసినట్లు తెలియజేశారు. చమురు జోరు ఫైజర్ వ్యాక్సిన్‌కు యూకే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విదేశీ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధరలు దాదాపు 2 శాతం ఎగసాయి. ఈ బాటలో తాజాగా మరోసారి నామమాత్రంగా బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 45.30 డాలర్లకు చేరగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48.30 డాలర్లను తాకింది. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల నిలకడ తదుపరి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు బలపడి రూ. 81.89కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్‌కు 24 పైసలు అధికమై రూ. 71.86ను తాకింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మంగళవారం(24) వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. ఈ బాటలో తాజాగా మరోసారి ధరలను పెంచాయి. దీంతో ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు 83 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర అయితే మరింత అధికంగా లీటర్ రూ. 1.40 ఎగసింది. చమురు జోరు న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 45 డాలర్లను అధిగమించగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48 డాలర్లకు చేరింది. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
పెట్రో ధరలు : మూడో రోజూ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలి కాలం దాకా ధరల మోతతో వాహనదారులకు బెంబేలెత్తించిన ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాహనదారులకు ఊరట లభించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం (సెప్టెంబర్ 17) పెట్రోల్, డీజిల్ ధరలను 13-20 పైసలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో, పెట్రోల్ ధర లీటరుకు. 81.55 నుండి 81.40 రూపాయలకు, డీజిల్ లీటరుకు 72.56 రూపాయల నుండి 72.37కు దిగి వచ్చింది. (రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్ ధర!) దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీ లోపెట్రోలు 81.40, డీజిల్ 72.37 రూపాయలు కోల్‌కతాలో పెట్రోలు రూ. 82.92, డీజిల్ 75.87రూపాయలు ముంబైలో పెట్రోలు రూ. 88.07, డీజిల్ 78.85 రూపాయలు చెన్నైలో పెట్రోలు రూ. 84.44, డీజిల్ 77.73 రూపాయలు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.60, డీజిల్ ధర 78.88 రూపాయలు అమరావతిలో పెట్రోల్ ధర రూ.86.18, డీజిల్ 80.07 రూపాయలు -
వరుస షాక్‌లు : మళ్లీ పెట్రో పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో షాక్‌లు కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్ లీటర్‌కు 21 పైసలు, డీజిల్ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 83 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 80.13కు, డీజిల్ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది. ఇక పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ధరల సవరణ పేరుతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను మోతెక్కిస్తున్నాయి. కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు పెట్రో ధరలను మించి డీజిల్ ధర పరుగులు తీయడంతో నిత్యావసరాల ధరలూ చుక్కలు చూస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి : ‘పెట్రో’ మంట; వైరలవుతున్న బిగ్‌బీ ట్వీట్ -
మళ్లీ పెట్రో ధరల షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. రోజురోజుకూ భారమవుతూ చుక్కలు చూపుతున్నాయి. ఇంధన ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం వరుసగా 17వ రోజూ పెంచాయి. పెట్రోల్ లీటర్‌కు 20 పైసలు, డీజిల్ లీటర్‌కు 63 పైసల మేర పెరిగాయి. తాజా ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ 79.76 రూపాయలు కాగా, డీజిల్ లీటర్ 79.40కి ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ఏకంగా 82.59కి చేరింది. కరోనా మహమ్మారితో ప్రజల ఆదాయాలు పడిపోయిన క్రమంలో ప్రభుత్వం పెట్రో భారాలు మోపుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. చదవండి : మనకు పెట్రో ఊరట లేనట్టే! -
మూడో రోజు తగ్గిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడు రోజుకూడా తగ్గుముఖం పట్టాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల తగ్గింపుతో శనివారం మరో 15 పైసలు దిగి వచ్చింది. దీంతో ఈ మూడు రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు 44 పైసలు, డీజిల్‌పై లీటరుకు 45 పైసల ఉపశమనం లభించింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలను లీటరుకు 15 పైసలు తగ్గా, ఢిల్లీ కోల్‌కతాలో డీజిల్ ధరను 16 పైసలు తగ్గింది. ముంబై, చెన్నైలలో లీటరుకు 17 పైసలు తగ్గించడం గమనార్హం. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం పలు నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ. 75.26,లీటరు డీజిల్ ధర 68.61 కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. రూ .77.85 లీటరు డీజిల్ ధర రూ .70.97 ముంబై: లీటరు పెట్రోలు రూ .80.85 లీటరు డీజిల్ ధర రూ .71.94 చెన్నై : లీటరు పెట్రోలు రూ .78.19 లీటరు డీజిల్ ధర రూ .72.50 హైదరాబాద్ : లీటరు పెట్రోలు రూ .80.03 లీటరు డీజిల్ ధర రూ .74.81 విజయవాడ లీటరు పెట్రోలు రూ .79.20 లీటరు డీజిల్ ధర రూ .73.66 -
పండగ వేళ తగ్గిన పెట్రో సెగలు..
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్వల్పంగా దిగివచ్చాయి. పెట్రోల్ లీటర్‌కు 15 పైసలు, డీజిల్ లీటర్‌కు 14 పైసల మేర చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించడంతో ఆయా నగరాల్లో పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ హైదరాబాద్‌లో 16 పైసలు తగ్గి రూ 80.33 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ 75.55కు దిగివచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ 81.14, కోల్‌కతాలో రూ 78.23, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ 72.83 పలికింది. అంతర్జాతీయ అనిశ్చితి, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో బ్యారెల్‌కు 70 డాలర్లకు ఎగబాకిన క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల 64 డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ సమీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. -
బీఎస్–6 ఇంధనం రెడీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్–6 (బీఎస్) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్‌లైన్ లోగానే బీఎస్–6 ఫ్యూయెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది ఈ కంపెనీల మాట. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్–6 ఫ్యూయెల్ అందుబాటులో ఉంది. ముందు వరుసలో బీపీసీఎల్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) చకచకా తన ప్రణాళిక అమలును ముమ్మరం చేసింది. 2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్ స్టేషన్లలో బీఎస్–4 స్థానంలో బీఎస్–6 ఇంధనం సిద్ధం చేయనుంది. జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్ రెడీ ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీఎస్–3 నుంచి బీఎస్–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్ కాస్త ముందుగా బీఎస్–6 ఫ్యూయెల్ విషయంలో పావులు కదుపుతోంది. మార్చికల్లా రెడీ.. మరో సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) సైతం పనులను వేగిరం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్ ఔట్లెట్లు సిద్ధమవుతాయని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. డెడ్‌లైన్ కంటే నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలలు పడుతుందని వివరించారు. ఇదే సమయంలో ఫ్యూయెల్ నాణ్యతనూ పరీక్షిస్తామన్నారు. 2020 జనవరి రెండో వారం తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు ఫ్యూయెల్ సరఫరా ప్రారంభిస్తామని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్ ముకేష్ సురానా ఇటీవల వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తెలిపారు. వ్యయం రూ.30,000 కోట్లు.. బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. అటు వాహన తయారీ సంస్థలు ఏకంగా రూ.70,000–80,000 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. బీఎస్–4 నుంచి బీఎస్–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వెహికిల్స్ విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే చేపడతారు. ఇప్పటికే కొత్త ప్రమాణాలకు తగ్గ వాహనాలను కంపెనీలు విడుదల చేయడం ప్రారంభించాయి. -
ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిలిపివేశాయి. విశాఖపట్టణం, కొచ్చిన్, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా... ఈ ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా విమానాలకు ఇంధన సరఫరాలను గురువారం సాయంత్రం గం. 4 ల నుంచి ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్ ఇండియా సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఇంధన సరఫరాల నిలిపివేత కారణంగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని వివరించారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా తమ పనితీరు చాలా బాగుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆరోగ్యకరమైన నిర్వహణ లాభం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామని పేర్కొన్నారు. వాటా విక్రయం ద్వారా నిధుల లభించని పక్షంలో భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోలేమని తెలిపారు. -
పెట్రో షాక్ షురూ..
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగియడంతో పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారమైనా ఎన్నికల సీజన్ కావడంతో రిటైల్ ధరలను సవరించని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రమంగా పెట్రో ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నాయి. గత నాలుగు రోజుల్లో పెట్రోల్ ధరలు 40 పైసలు పైగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రోల్ ధరలు రానున్న రోజుల్లో లీటర్‌కు ఏకంగా రూ 99కు పెరుగుతాయని ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఓ ఆర్థిక వేత్త బాంబుపేల్చారు. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ 69.30 వద్ద స్ధిరంగా ఉండటంతో పెట్రోల్ రిటైల్ ధరల పెంపు భారం వినియోగదారులపై పరిమితంగానే ఉంటుందని డెలాయిట్ ఇండియా ఎనర్జీ రిసోర్సెస్ లీడర్ దేవశీష్ మిశ్రా చెప్పడం కొంత ఊరట ఇస్తోంది. -
స్వల్పంగా తగ్గిన పెట్రోలు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా పెట్రోలు ధరలు దిగి వచ్చాయి. ఆయిల్ కంపెనీలు ధరలు తగ్గించడంతో వివిధ మెట్రో నగరాల్లో శనివారం పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. తాజా తగ్గింపుతో వివిధ నగరాల్లో లీటరు ఇంధన ధరలు హైదరాబాద్ : పెట్రోలు 75.33 డీజిల్ ధర 71.74 విజయవాడ : పెట్రోలు రూ. 74.75, డీజిల్ ధర రూ. 70.79 ఢిల్లీ : పెట్రోలు రూ. 71. డీజిల్ రూ. 65.96 చెన్నై: పెట్రోలు రూ. 73.72 డీజిల్ రూ.69.72 కోలకతా : పెట్రోలు రూ. 73.71 , డీజిల్ రూ. 67.71 ముంబై: పెట్రోలు రూ. 76.64 డీజిల్ రూ. 69.11 -
పండగ వేళ పెట్రో భారాలు
సాక్షి, న్యూఢిల్లీ : పండగ వేళ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రో భారాలు మోపాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు ఆదివారం మరింతగా భారమయ్యాయి. పలు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధరలను లీటర్‌కు 49 నుంచి 60 పైసల మధ్య పెంచగా, డీజిల్ ధరలు లీటర్‌కు 59 నుంచి 75 పైసల వరకూ భారమయ్యాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ 73.47కు ఎగబాకింది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ 69.24కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ 69.75కు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌కు రూ 63.69కు చేరింది. ముంబైల్లో పెట్రోల్ ధర లీటర్ రూ 75.39 పలికితే, డీజిల్ ధర 62 పైసలు పెరిగి రూ 66.66కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ముడిచమురు ఉత్పత్తులను రోజుకు ఎనిమిదిలక్షల బారెల్స్‌కు పరిమితం చేయాలన్న సౌదీ అరేబియా నిర్ణయంతో పెట్రో ఉత్పత్తుల ధరలు భారమయ్యాయి. -
రూపాయి క్షీణించడంతో పెట్రో ధరలకు రెక్కలు..
-
పెట్రో షాక్ : రికార్డు హైలో ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : రూపాయి బలహీనపడటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు సోమవారం అత్యంత గరిష్ట స్ధాయికి చేరాయి. డీజిల్ లీటర్‌కు 14 పైసలు పెరగ్గా, పెట్రోల్ లీటర్‌కు 13 పైసలు భారమైందని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. సవరించిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 82.60కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 85.33కు పెరగ్గా, డీజిల్ ధరలు రూ.77.91కు చేరాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో ఈనెల 16 నుంచి ఇంధన ధరలు భగ్గుముంటున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అత్యంత కనిష్టస్ధాయిలో రూ 70.32 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారమవడం, రూపాయి మారకపు విలువతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, లెవీలతో ఇంధన ధరలు మరింత భారమవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తుండటంతో ఇంధన ధరలు రికార్డు స్ధాయిలకు చేరుతున్నాయి. -
మూడు రోజుల నుంచి భగ్గుమంటున్న పెట్రోల్
న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్దుగా ఏ మాత్రం మారకుండా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఎన్నికల అనంతరం భగ్గుమంటున్నాయి. వరుసగా మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో స్కై రాకెట్లా దూసుకుపోతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.75 మార్కును క్రాస్ చేసింది. ఢిల్లీలో నేడు లీటరు పెట్రోల్ ధర రూ.75.10గా నమోదైంది. 2013 సెప్టెంబర్ నుంచి ఇదే గరిష్ట స్థాయి. ఇతర మెట్రోపాలిటన్ నగరాలు కోల్‌కతా, ముంబై, చెన్నైల్లో కూడా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.77.79గా, ముంబైలో రూ.82.94గా, చెన్నైలో రూ.77.93గా, హైదరాబాద్‌లో రూ.79.55గా నమోదైనట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ డేటాలో వెల్లడైంది. ఢిల్లీ, ముంబైలో ఈ ధరలు 14 పైసలు పెరగగా.. చెన్నై, కోల్‌కతాలో 16 పైసలు పెరిగాయి. మరోవైపు డీజిల్ ధరలు కూడా సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ.. వాహనదారుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.66.57గా, కోల్‌కతాలో రూ.69.11గా, ముంబైలో రూ.70.88గా, చెన్నైలో రూ.70.25గా, బెంగళూరులో రూ.67.71గా, హైదరాబాద్‌లో రూ.72.36గా నమోదవుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉంచాయి. దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రికార్డు స్థాయిలో ఈ ధరలను పెంచుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా ఎగుస్తున్నాయి. దాంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తోంది. ఈ ప్రభావం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్‌కు ప్రస్తుతం 78 డాలర్లు ఉంది. -
బంకుల్లో అక్రమాలకు ప్రభుత్వం చెక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, గ్యాస్ బంకుల్లో అక్రమాలు చోటుచేసుకుంటూ ప్రతిరోజు లక్షలాదిమంది వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంధనం, గ్యాస్ నింపడాన్ని తనిఖీ చేసేందుకు హై-సెక్యురిటీ డివైజ్‌లను ఇన్స్టాల్ చేస్తోంది. ఈ మేరకు డివైజ్‌లను ఏర్పాటుచేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఆమోదించాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త సెక్యురిటీ డివైజ్‌లను ఏర్పాటుచేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వచ్చే వరకు ప్రభుత్వం గడువు విధించింది. ప్రస్తుతం పెట్రోల్, గ్యాస్ స్టేషనలలో సెక్యురిటీ డివైజ్‌లను ఉన్నాయి. కానీ వాటిల్లో తారుమారుకు ఎక్కువగా అవకాశం ఉండటం, అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకుంటుండటంతో కొత్త వాటితో ఈ డివైజ్‌లను మార్చుతున్నారు. '' హైసెక్యురిటీ డివైజ్‌లను ఏర్పాటుచేయడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆమోదించాయి. వచ్చే వారం వరకు వారికి గడువు ఇచ్చాం'' అని వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చెప్పారు. మూడు డివైజ్‌లు ఎలక్ట్రానిక్ ఫ్లో మెటర్స్, టాంపర్-ప్రూఫ్ ఎలక్ట్రానిక్ సీల్స్, పల్సర్లను లీగల్ టెట్రోలజీ డిపార్ట్మెంట్ పరీక్షించిందని సీనియర్ అధికారులు చెప్పారు. -
పెట్రో షాక్‌లతో విలవిల...
న్యూఢిల్లీః పెట్రోల్ ధరలను రోజువారీ సవరణ పేరుతో కొద్దికొద్దిగా పెంచుతున్న చమురు సంస్థలు జులై నుంచి ఇప్పటివరకూ పెంచిన మొత్తం చూస్తే షాక్ తినాల్సిందే. జులై నుంచి పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 6 పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్‌కు రూ 3.67 పైసల మేర భారమయ్యాయి. పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టస్థాయిలో పెరగ్గా, డీజిల్ ధరలు నాలుగు నెలల గరిష్టస్ధాయిలో పెరిగాయి. ప్రతినెలా 1, 16 తేదీల్లో ధరలను సవరిస్తున్న విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు జూన్ నుంచి రోజూ ధరలను మార్చే విధానాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభమైన తొలి పక్షం రోజుల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు ఇక అప్పటినుంచి పెరుగుతూనే ఉన్నాయి.గతంలో పెట్రో ధరలు ఒకేసారిగా పెంచడంతో కస్టమర్లకు దీనిపై అవగాహన ఉండేదని, ఇప్పుడు రోజుకు పైసా, పదిహేను పైసల చొప్పున పెంచుతుంటే పెద్దగా గుర్తించడం లేదని ఓ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. -
ఐఓసీ లాభం రూ.3,995 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొ.(ఐఓసీ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.3,995 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం(రూ. 3,096 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది.రిఫైనరీ మార్జిన్లు, ఇన్వెంటరీ లాభాలు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ డైరెక్టర్(ఫైనాన్స్) ఏ.కె. శర్మ చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.13.5 (135 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. తమ కంపెనీలో ప్రభుత్వానికి 58.28 శాతం వాటా ఉండటంతో రూ.3,821 కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుందని తెలిపారు. 7.79 డాలర్లకు జీఆర్ఎమ్ ఒక్కో బ్యారెల్ ముడి చమరును ఇంధనంగా మార్చే విషయంలో 7.79 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) సాధించామని శర్మ వివరించారు. గత క్యూ3లో జీఆర్ఎమ్ 5.96 డాలర్లని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెంటరీ లాభాలు కూడా పెరిగాయని వివరించారు. గత క్యూ3లో రూ.4,485 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని, అయితే ఈ క్యూ3లో మాత్రం రూ.3,050 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. మొత్తం అమ్మకాలు రూ.96,783 కోట్ల నుంచి రూ.1,15,161 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్ 3 శాతం క్షీణించి రూ.366 వద్ద ముగిసింది. -
లీటరు పెట్రోల్ వాస్తవ ధర 31.94!
మిగతాదంతా పన్నులు గతంలో ఎన్నడూలేనంతగా పెరిగిన ధరలు అడ్డగోలు ధరలపై అడిగే నాథుడే లేడు అది 2013, దేశ రాజధానిలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. లీటరు రూ.69.06కు చేరింది. భారతీయ జనతా పార్టీ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేసింది. "ఇది దేశ ద్రోహం. దీనిపై వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు. ధరలను అదుపులోకి తేవాల్సిందే'' అని అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ నిందించారు. తిరిగి చూస్తే నేడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ71.14. , 2013లో డీజిల్ రూ 48.16 నుంచి రూ.59.02కు చేరింది. వంట చేసుకునే కిరోసిన్ రూ14.96 నుంచి రూ.18.54కు పెరిగింది. వంటగ్యాసు రూ.410.50నుంచి 585 కు గణనీయంగా పెరిగింది. 2013లో ఉన్న ముడి చమురు ధర కంటే ఇప్పుడు సగమే ఉంది. బ్యారల్ రేటు 114డాలర్లు ఉండగా ఇప్పుడు 54డాలర్లుగా ఉంది. ఇప్పుడు డాలర్ రేటుతో పోలిస్తే రూపాయి విలువ అంతగా లేదు. 2013లో డాలర్ విలువ రూ.54.30 నుంచి రూ68కు పెరిగింది. రూపాయి పరంగా చూస్తే బ్యారల్ ముడి చమురు అప్పుడు రూ. 6210కు వస్తే ఇప్పుడు రూ.3625లకే వస్తోంది. భారత్ కరెన్సీ తో పోలిస్తే బలహీనంగా ఉన్న పొరుగు దేశాల్లో ఇవన్నీ చాలా చవకగ్గా లభిస్తున్నాయి. చాలా ఎక్కువ రాయితీలు ఇస్తున్నాయి. భారత కరెన్సీలో పాకిస్తాన్ లో కేవలం రూ.43.70, శ్రీలంకలో రూ.54.18. బంగ్లాదేశ్ లో రూ.75.42లకే లీటర్ పెట్రోల్ లభిస్తోంది. రవాణా ఖర్చులతో సహా రూ. 64.38లకే వస్తుంది. డీజిల్ విషయానికొస్తే పాకిస్తాన్ లో రూ. 49.60, శ్రీలంకలో రూ.43.99, బంగ్లాదేశ్ లో రూ.57, నేపాల్ లో రూ49.16లకు వస్తోంది. భారత్ లో అధిక ధరల వెనుక కారణాలు రవాణా ధరలు, పన్నులు. ప్రభుత్వరంగ చమురు కంపెనీల అధికారిక సమాచారం ప్రకారం జనవరి 16న బ్యారల్ ముడి చమురు ధర 68.88 డాలర్లుగా ఉంది. రిఫైనరీ కంపెనీలు లీటరుకు రూ.28.19 వసూలు చేస్తున్నాయి. దీనిని చమురు కంపెనీలు రూ.31.94కు డీలర్లకు అమ్ముతున్నాయి. ఇది రోజువారీ మనం ఉపమోగించే పెట్రోల్ వాస్తవిక ధర. మిగిలినది మనం పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తున్నాం. నేడు దేశ రాజధానిలో వినియోగదారుడు రూ.21.48 ఎక్సైజ్ పన్ను కడుతున్నాడు. అంటే రిఫైనరీలు (ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్) అమ్మే ధరకు సుమారు 75శాతం పన్ను చెల్లిస్తున్నాడు. డీలర్ కమీషన్ రూ.2.60, రాష్ట్ర పన్నులు 27శాతం అంటే రూ.15.12 అన్ని కలుపుకొని వినియోగదారుడు లీటరు పెట్రోల్‌కు రూ.71.14 చెల్లిస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు కంపెనీల ధరకు 125 శాతం పన్నులు వేసి లీటరుకు అదనంగా రూ.36.60 పిండుతున్నాయి. చమురు కంపెనీల రేటు లీటరుకు రూ.28.59, డీలరు కమీషన్ రూ.1.65, కేంద్ర ఎక్సైజ్ పన్ను రూ.8.72 కలుపుకొన్నా మొత్తం రూ.59.02గా ఉండాలి. మిగిలిన రూ.26.05లు కేంద్ర రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను భారం. ఇది దాదాపు చమురు కంపెనీలు ఇచ్చే రేటుకు(రూ.28.59)కు సమానం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దేశ రాజధానిలో రవాణా చార్జీలు చాలా తక్కువ. పరిస్థితి ఇలా కొంతమంది నేతలు మాత్రమే రవాణా చార్జీల మీద మాట్లాడుతున్నారు. అధికారంలోకి రాగానే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను అన్యాయంగా దోచుకుంటోందని కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఉమెన్ చాందీ విమర్శించారు. -
ఓఎన్జీసీ సబ్సిడీ భారం తగ్గింది...
14% పెరిగిన నికర లాభం; రూ. 5,460 కోట్లు న్యూఢిల్లీ : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.5,460 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.4,782 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి నమోదైందని ఓఎన్జీసీ తెలిపింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తాము చెల్లించే ఇంధన సబ్సిడీ భారం తగ్గడం, ఉత్పత్తి పెరగడం వంటి కారణాల వల్ల నికర లాభం పెరిగిందని ఓఎన్జీసీ సీఎండీ డి.కె. సరాఫ్ చెప్పారు. గత క్యూ1లో రూ.13,200 కోట్లుగా ఉన్న సబ్సిడీ భారం ఈ క్యూ1లో రూ.1,133 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఈ సబ్సిడీ చెల్లింపు వల్ల నికర లాభం గత క్యూ1లో రూ.7,396 కోట్లు, ఈ క్యూ1లో రూ.628 కోట్లు చొప్పున తగ్గిందని వివరించారు. జనవరి-మార్చి క్వార్టర్‌కు చమురు ఉత్పత్తి తగ్గిందని, అయితే ఈ క్యూ1లో 2.2% వృద్ధితో 5.227 మిలియన్ టన్నులకు చేరిందని, గ్యాస్ ఉత్పత్తి మాత్రం 3% క్షీణించి 5.482 బిలియన్ క్యూబిక్ మీటర్లకు తగ్గిందని వివరించారు. ఆదాయం 4% వృద్ధితో రూ.22,868 కోట్లకు పెరిగిందని సరాఫ్ పేర్కొన్నారు. -
ఇరాన్ అణు ఒప్పందం.. మనకేంటి?
ఇరాన్ ఆరు ప్రపంచ దిగ్గజ దేశాలు- అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలతో మంగళవారం చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెహ్రాన్ అణు కార్యక్రమంసహా పలు అంశాలపై ఆంక్షలు సడలించే అవకాశాలకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఒప్పందం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. అసలు ఈ ఒప్పందం వల్ల భారత్‌కు వచ్చే లాభనష్టాలు ఏమిటన్న అంశంపై దృష్టి సారిస్తే... ఒప్పందం కుదిరిందన్న వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు ధరలు డాలర్‌కుపైగా పడిపోయాయి. క్రూడ్ భారీ దిగుమతుల దేశంగా భారత్‌కు ఈ వార్త ఎంత సానుకూలమో వేరే చెప్పనక్కర్లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ వంటి కంపెనీలకు లాభించే అంశం ఇది. అయితే ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా వంటి చమురు అన్వేషణ కంపెనీలకు ప్రతికూలమే.జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ ఒప్పందం ‘తటస్థ’ ఫలితాన్ని ఇస్తుంది. ►భారత్ అతిపెద్ద ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అబాన్ ఆఫ్‌షోర్ తన మొత్తం ఆదాయంలో 35% ఇరాన్ నుంచి పొందుతోంది. ఇది కంపెనీకి లాభించే అంశం. ఇరాన్లో ఆంక్షల సడలింపు కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ►ఇరాన్ ఫజార్డ్ బీ గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి ఇన్ఫ్రా ప్రాజెక్టులను భారత్ దక్కించుకోవాలని చూస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు ఈ ప్రాజెక్టును తన్నుకుపోతే పరిస్థితి ఏమిటని చమురు మంత్రిత్వశాఖ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ► ఆంక్షల సడలింపు జరిగి, ఇతర దేశాలతో ఇరాన్ సరళతరంగా వ్యాపారం చేయగలిగితే- తక్కువ ధరకు ఇరాన్ నుంచి భారత రిఫైనరీలుకు చమురు సరఫరా జరక్కపోవచ్చు. పైగా ఇప్పటివరకూ ఆంక్షల వల్ల చెల్లించే పరిస్థితి లేని దాదాపు 6.5 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.40.000 కోట్లు) హార్డ్ కరెన్సీలో తక్షణం చెల్లించాల్సిన పరిస్థితి భారత్ రిఫైనరీలకు ఉత్పన్నమవుతుంది. ► వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారుల కథనం ప్రకారం, ఆంక్షల సడలింపు భారత్ ఫార్మా, ఐటీ, కమోడిటీ రంగాలకు కలిసివచ్చే అంశం. ఇరాన్లో ప్రత్యక్ష కాంట్రాక్టులకు ఆయా రంగాల కంపెనీలకు వీలవుతుంది. ► బాస్మతి బియ్యం, సోయామీల్, చక్కెర, బార్లీ, మాంసం వంటి వాటిని ఇరాన్ దేశం మన నుంచి భారీగా కొనుగోలు చేస్తోంది. ఆంక్షల వల్ల ఈ కమోడిటీల కొనుగోలుకు ఇరాన్ 20% ప్రీమియం చెల్లిస్తోంది. ఆంక్షలు తొలగితే ఈ ప్రీమియంలను భారత కంపెనీలు కోల్పోతాయి. ► ఇరాన్‌కు ఎగుమతులకు సంబంధించి ఆ మార్కెట్లో ఇక భారత్ ఎగుమతిదారులు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. దుస్తుల నుంచి కార్ల వరకూ వివిధ వినియోగ ప్రొడక్టుల అమ్మకాలపై భారత్ కంపెనీలు పోటీని ఎదుర్కోవాలి. ఇరాన్ గ్యాస్ క్షేత్రాల అభివృద్ధిపై దృష్టి అమెరికా సహా ఆరు సంపన్న దేశాలతో ఇరాన్ చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో.. ఆ దేశంలో గ్యాస్ క్షేత్రాల అభివృద్ధికి భారత్ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) ఇక్కడ 2008లో కనుగొన్న భారీ గ్యాస్ క్షేత్రం ఫర్జాద్-బికి సంబంధించి అభివృద్ధి హక్కుల కోసం ఇరాన్‌కు విజ్ఞప్తి చేయనుంది. ఇరాన్‌పై ఆంక్షల కారణంగా ఓఎన్జీసీ విదేశ్ దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక అమలుకు నోచుకోలేదు. ఇక్కడ 12.8 లక్షల కోట్ల ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇరాన్‌పై ఆంక్షలు తొలగుతున్న నేపథ్యంలో ఈ గ్యాస్ క్షేత్రం అభివృద్ధి హక్కుల కోసం ఇరాన్‌తో సంప్రదింపులు జరపనున్నట్లు ఓవీఎల్ ఎండీ నరేంద్ర కె. వర్మ చెప్పారు. కాగా, ఇరాన్‌పై ఆంక్షలు తొలగనుండటంతో అక్కడి నుంచి భారత్ ముడి చమురును కూడా ఇక పెద్దమొత్తంలో దిగుమతి చేసుకునేందుకు వీలవుతుందని భారత చమురు రిఫైనరీలు ఆశిస్తున్నాయి. మరోపక్క, అణు ఒప్పందం నేపథ్యంలో ఇరాన్‌కు చెల్లించాల్సిన 6.5 బిలియన్ డాలర్ల ముడి చమురు(క్రూడ్) దిగుమతి బిల్లు బకాయిలను భారతీయ రిఫైనరీలు చెల్లించాల్సి ఉంటుందని చమురు శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
మూడేళ్లలో 35,600 కొత్త పెట్రోల్ బంకులు
న్యూఢిల్లీ: భారత్‌లో మూడేళ్లలో కొత్తగా 35,600 పెట్రోల్ అవుట్లెట్లు అందుబాటులోకి రానున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను పెంచడంలో భాగంగా పెట్రోలియం అవుట్లెట్లను ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. వీటిల్లో 27 శాతం అవుట్లెట్లను బలహీన వర్గాల వారికి, 22.5 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు 27 శాతం కేటాయించడం ఇదే మొదటిసారని పేర్కొన్నాయి. ఇప్పటికే 51,870 పెట్రోల్ పంపులున్నాయి. వీటిల్లో ఐఓసీ అవుట్లెట్లు 23,993, హెచ్‌పీసీఎల్ అవుట్లెట్లు 12,869, బీపీసీఎల్ అవుట్లెట్లు 12,123 ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్వి 1,400, ఎస్సార్ ఆయిల్వి 1,400, షెల్ అవుట్లెట్లు మూడు చొప్పున ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 13,896 ఎల్పీజీ అవుట్లెట్లను(ఐఓసీ-7,035, బీపీసీఎల్-3,355, హెచ్‌పీసీఎల్-3,506)ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతమున్న పెట్రోల్ రిటైల్ అవుట్లెట్లలో 2,140 అవుట్లెట్లలో లైటింగ్ కోసం సౌరశక్తిని వినియోగిస్తున్నారు. ఇలా సౌరశక్తి వినియోగిత రిటైల్ అవుట్లెట్లను 2017, మార్చి 31 నాటికి 7,200కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో రిటైల్ అవుట్‌లెట్‌ను సౌర విద్యుదీకరణ చేయడానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. -
ఎట్టకేలకు ప్రారంభమైన స్పైస్‌జెట్ సర్వీసులు
75 విమాన సర్వీసులు రద్దు న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి తన విమాన సర్వీసులను ప్రారంభించింది. అప్పటిదాకా చమురు కంపెనీలు విమానయాన ఇంధనాన్ని సరఫరా చేయకపోవడంతో స్పైస్‌జెట్ 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత 75 విమాన సర్వీసులను నడపటానికి చర్యలు తీసుకున్నామని స్పైస్‌జెట్ ప్రతినిధి పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ట్వీటర్ ద్వారా స్పైస్‌జెట్ సీఈఓ సంజీవ్ కపూర్ క్షమాపణలు చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు స్పైస్‌జెట్‌కు ఇంధనాన్ని సరఫరా చేయలేదు. ఈ బకాయిలు రూ.14 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. కాగా విమాన సర్వీసుల పునరుద్ధరణపై సంజీవ్ కపూర్ ఇచ్చిన హామీపై స్పైస్‌జెట్‌ను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వివరణ కోరింది. దేశీయ విమాన సర్వీసుల మార్కెట్లో 17 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ ఈ సంస్థ మొత్తం రుణాలు రూ.2,000 కోట్లుగా ఉన్నాయి. తక్షణం కార్యకలాపాలు సాగించడానికి కనీసం రూ.1,400 కోట్లు అవసరం. ఆర్నెళ్ల నుంచి స్పైస్‌జెట్ కంపెనీ క్యాష్ అండ్ క్యారీ విధానంలో విమానయాన ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. స్పైస్‌జెట్ మూతపడకుండా ఉండటానికి ఈ సంస్థకు రుణాల చెల్లింపులకు 15 రోజుల పాటు వెసులుబాటు ఇవ్వాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చమురు కంపెనీలను, విమానశ్రయ అధికారులను మంగళవారం కోరిన విషయం తెలిసిందే. ఈ సంస్థ కార్యకలాపాలు సాఫీగా జరగానికి రూ. 600 కోట్లు రుణాలుగా ఇవ్వాలని కూడా సదరు మంత్రిత్వ శాఖ బ్యాంకులను, ఆర్థిక సేవా సంస్థలను కోరింది. -
డీజిల్ ధరల్ని తగ్గించండి: సీపీఎం
న్యూఢిల్లీ: డీజిల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోవడంపై సీపీఎం మండిపడింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పతనమైనప్పటికి పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించకుండా కేంద్ర కాలయాపన చేస్తోందని సీఎం విమర్శించింది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 92 డాలర్ల దిగువకు వచ్చిందని, ప్రతి లీటరుకు 1.90 పైసల లాభాన్ని చమురు కంపెనీలు ఆర్జిస్తున్నాయని సీపీఎం వెల్లడించింది. ఇదిలా ఉండగా లీటర్ డీజిల్ ధర మరో యాభై పైసలు పెంచాలని చమురు కంపెనీలు ప్రభుత్వానికి లేఖరాయడంపై సీపీఎం తప్పుపట్టింది. 2013 జనవరి నుంచి డీజిల్ ధర తగ్గించలేదని సీపీఎం తెలిపింది. -
డీజిల్ ధరలపై త్వరలో నియంత్రణ ఎత్తివేత?
న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకంపై నష్టం రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. డీజిల్ ఉత్పత్తి వ్యయం, విక్రయ ధరల మధ్య వ్యత్యాసం ఈ నెల తొలి పక్షంలో లీటరుకు రూ.2.80 ఉండగా, ఇప్పుడది రూ.1.62కు తగ్గిపోయింది. రూపాయి మారకం విలువ బలపడుతూ, లీటరు రేటును నెలకు 50 పైసల చొప్పున పెంచుతుంటే వచ్చే సెప్టెంబరుకల్లా డీజిల్ ధరలపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించనుంది. ధరలను ప్రతినెలా స్వల్పంగా పెంచడం ద్వారా సబ్సిడీలను ఎత్తివేయాలన్న మునుపటి యుపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు కొనసాగిస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16 విడతల్లో లీటరు డీజిల్ ధరను రూ.10.12 పెంచారు. మే ద్వితీయార్థంతో పోలిస్తే ఈ నెల ప్రథమార్థంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గాయని అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినపుడు లీటరుపై రూ.4.41 చొప్పున నష్టం వచ్చింది. పెట్రోలు ధరలపై కంట్రోలును 2010 నుంచి ఎత్తివేశారు. దీంతో ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా పెట్రోలు ధరలు ఉంటున్నాయి. డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై విక్రయిస్తున్నందువల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రస్తుతం రోజుకు రూ.249 కోట్లు నష్టం వస్తోంది. గత పక్షంలో ఇది రూ.262 కోట్లుగా ఉంది. -
రాష్ట్ర ప్రజలపై రూ.682 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెట్రోబాంబ్ పేల్చాయి. శనివారం అర్ధరాత్రి నుంచి లీటరు పెట్రోలుపై రూ. 2.35, లీటరు డీజిల్‌పై 50పైసలు చొప్పున ధర పెంచాయి. దీనివల్ల రాష్ట్రంలోని వాహన యజమానులపై ఏడాదికి సగటున రూ.682.52 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో ఏడాదికి సగటున 150 కోట్ల లీటర్ల పెట్రోలును వాహనదారులు వినియోగిస్తున్నారు. లీటరు పెట్రోలు ధర రూ. 2.35 లెక్కన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచడంవల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ. 352.52 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న అల్పాదాయ వర్గాలు, వేతన జీవులకు ఇది పెనుభారమని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న 90 లక్షల మందితోపాటు పెట్రోలు వినియోగించే నాలుగు చక్రాల వాహనాల వారిపై కూడా ఈ భారం పడుతుంది. అలాగే రాష్ట్రంలో ఏడాదికి సగటున 660 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. లీటరుకు అర్ధరూపాయి పెరిగినందున వాహనదారులపై ఏటా రూ.330 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పెట్రోలుపై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వ్యాట్ రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 8,000 కోట్ల వరకూ రాబడి వస్తోంది. తాజా పెంపుతో ఏడాదికి సగటున పెట్రోలు ద్వారా రూ.109.27 కోట్లు, డీజిల్ ద్వారా రూ. 73.42 కోట్ల అదనపు రాబడి ప్రభుత్వానికి రానుంది. అన్ని వర్గాలపై భారం: డీజిల్ ధరల పెంపు ప్రభావం రైతులతోపాటు అన్ని వర్గాలపై పడుతుంది. ఇప్పటికే వరి దుక్కి దున్నేందుకు (దమ్ముకు) ట్రాక్టరు యజమానులు గంటకు రూ.800 చొప్పున బాడుగ తీసుకుంటున్నారు. ప్రతి 15 రోజులకూ డీజిల్ ధర పెరుగుతున్నందున గిట్టుబాటు కావడంలేదంటూ రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది అసలే వరి సాగు గిట్టుబాటుకాని రైతులకు మరింత భారమని చెప్పక తప్పదు. డీజిల్ ధర పెరగడంవల్ల సరుకుల రవాణా కూడా భారం కానుంది. దీనివల్ల నిత్యావసర సరుకులతోపాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. డీజిల్ ధర పెంపు ఆర్టీసీ, రైల్వేలకు కూడా భారమే. దీనివల్ల ఆర్టీసీ, రైలు ఛార్జీలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ‘రూపాయి విలువ పడిపోయి డాలర్ బలపడటంవల్ల అంతర్జాతీయ విపణిలో క్రూడ్‌కు మన దేశం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రజల ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తరచూ పెంచుతూ అల్పాదాయ వర్గాలపై మోయలేని భారం మోపడం ఏమాత్రం సమంజసం కాద’ని ఆర్థిక వేత్తలు అంటున్నారు. పెట్రో ధరల పెంపుపై వాహనచోదకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.