
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగియడంతో పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారమైనా ఎన్నికల సీజన్ కావడంతో రిటైల్ ధరలను సవరించని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రమంగా పెట్రో ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నాయి. గత నాలుగు రోజుల్లో పెట్రోల్ ధరలు 40 పైసలు పైగా పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రోల్ ధరలు రానున్న రోజుల్లో లీటర్‌కు ఏకంగా రూ 99కు పెరుగుతాయని ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఓ ఆర్థిక వేత్త బాంబుపేల్చారు. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ 69.30 వద్ద స్ధిరంగా ఉండటంతో పెట్రోల్ రిటైల్ ధరల పెంపు భారం వినియోగదారులపై పరిమితంగానే ఉంటుందని డెలాయిట్ ఇండియా ఎనర్జీ రిసోర్సెస్ లీడర్ దేవశీష్ మిశ్రా చెప్పడం కొంత ఊరట ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment