Petrol price hike
-
బీజేపీ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టండి : స్టాలిన్
చెన్నై: ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల సందర్బంగా బీజేపీ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చెయ్యాలని డీఎంకే పార్టీ శ్రేణులను కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర బీజీపీ ప్రభుత్వం సుమారు రూ.7.50 లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని అవినీతితో పాటు మణిపూర్‌లో జరిగిన మారణకాండ గురించి కూడా ప్రస్తావించాలని డీఎంకే నేతలను కోరారు. తొమ్మిదేళ్లలో చాలా పెంచేశారు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరోసారి కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి గెలుపు కోసం పార్టీ శ్రేణులు మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి 2023 వ్యవధిలో పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారాన్ని పెంచేసిందన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భారతదేశ రుణభారం రూ.55 లక్షల కోట్లు ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ రుణభారం రూ.155 లక్షల కోట్లకు చేరిందన్నారు. ముసుగు తొలగించండి.. కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ పధకాల అమల్లో రూ.7.5 కోట్ల అవినీతికి పాల్పడిందని, ఆధారాలతో సహా వారి అవినీతిని బయట పెట్టాలని పార్టీ సభ్యులను కోరారు స్టాలిన్. బీజేపీ అవినీతికి ముసుగు వేసిందని ఆ ముసుగును ఎలాగైనా తొలగించాలని అన్నారు. బీజేపీ అమలు చేస్తోన్న ఒకే జీఎస్టీ విధానం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. జాతీయ విద్యా విధానం తమిళనాడులో విద్యా వ్యవస్థ పురోగతిపై ప్రభావం చూపిందన్నారు. అవినీతి అంతా ఇక్కడే.. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నారాయణ తిరుపతి మాట్లాడుతూ బీజేపీ హయాంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల సంఖ్య 14 కోట్లు నుంచి 34 కోట్లకి పెరిగిందని అందుకు తగ్గట్టుగానే ధర కూడా పెరుగుతూ వచ్చిందని ఇక కాగ్ నివేదికలో ఏదైనా అవినీతి ఉందంటే అది రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగినదేనని అన్నారు. ఇది కూడా చదవండి: ఇండియా కూటమిపై సీఎం ఏక్నాథ్ షిండే సెటైర్లు -
అల్లాడుతున్న ప్రజలు.. ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోల్ ధర
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం మరింత భారాన్ని మోపింది. ఇప్పటికే రూ.272 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ. 10 పెంచింది. తాజా పెంపు తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.282కి పెరిగింది. ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అర్ధరాత్ర ఈ పెంపును ప్రకటించారు. ప్రస్తుతం ఆ దేశంలో డీజిల్ ధర రూ.293, తేలికపాటి డీజిల్ ఆయిల్ ధర రూ. 174.68 గా ఉంది. కిరోసిన్ ధర కూడా రూ.5.78 పెరిగి రూ.186.07కి చేరింది. కొత్త ధరలు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన కారణంగా పెట్రోలు, కిరోసిన్ ధరలు పెంచినట్లు చెప్పారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ దివాళా తీయకుండా బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 1.1 బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజీకి ప్రయత్నించింది. అయితే దీనికి సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందం విఫలమైంది. ఈ నిధులు 2019లో ఐఎంఎఫ్ ఆమోదించిన 6.5 బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజీలో భాగం. విదేశీ రుణాల్లో పాకిస్తాన్ డిఫాల్ట్ కాకుండా ఉండాలంటే ఇది చాలా కీలకం. ఇదీ చదవండి: ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే.. -
‘పెట్రోల్‌తో పాలు పోటీపడుతున్నాయి.. ఇక్కడితో ఆగదు’
గాంధీనగర్: పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు అమూల్ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో పాల ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదల విషయంలో పెట్రోల్‌తో పాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా. ధరలపై ఉదాసీనత ప్రదర్శించే ప్రభుత్వ తప్పులతో దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాయని విమర్శించారు. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ధరలు అమలవుతాయని వెల్లడించింది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవచద్దా ట్వీట్ చేశారు. ‘మీకు చెప్పాను కదా..! ధరల విషయంలో పాలు, పెట్రోల్ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఈ రోజు అమూల్ పాల ధరలు లీటర్‌కు రూ.2 చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. పాల ధరలు మళ్లీ పెరుగనున్నాయి? కారణాలు.. పశుగ్రాసం ధరల విపరీతంగా పెరగటం, లంపీ వైరస్ వ్యాప్తి’ అని భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశుగ్రాసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, దాంతో రైతులు ఇతర పంటలను పశువులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు రాఘవ్ చద్ధా. పశుగ్రాసం ధరలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఒక్క గుజరాత్‌లోనే గత రెండేళ్లలో 1.36 లక్షల హెక్టార్ల పశుగ్రాసం సాగు తగ్గిపోయిందన్నారు. పశుగ్రాసానికి కొరత ఏర్పడిన క్రమంలో 2020లో 100 ఎఫ్పీఓలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకు ఒక్కటి సైతం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. కాంగ్రెస్ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై -
బంగ్లాదేశ్‌లో 53 శాతం పెరిగిన పెట్రోధరలు
-
బైక్‌పై శివ-పార్వతుల వేష ధారణలో నిరసన.. అరెస్ట్!
డిస్పూర్: దేశంలో పెట్రోల్, డీజిల్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ధరల పెరుగుదలపై తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు. అలా.. పెట్రోల్ ధరలపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడు, పార్వతి వేషధారణలో ధరలపై చిన్న నాటకం ప్రదర్శించి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన బిరించి బోరా అనే వ్యక్తి తనకు వచ్చిన విద్యతో పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. బోరా.. శివుడిగా చిన్న నాటకం ప్రదర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బిరించి బోరాను అరెస్ట్ చేసి నగావ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శివపార్వతుల నాటకంలో ఏముంది? ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన బిరించి బోరా.. వీధి నాటకం వేశారు. బోరా శివుడిగా.. కోయాక్టర్ పరిశిమిత పార్వతిగా బైక్‌పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయి.. బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుంది. దీంతో పెట్రోల్ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తారు. ఇదీ చదవండి: జైలు నుంచే అక్రమాలు.. 81 మంది అధికారులకు లక్షల్లో ముడుపులు -
తప్పడం లేదు.. మాజీ ప్రధాని వల్లే ఇలా జరిగింది
దాయాది దేశం పాకిస్తాన్లో పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో ధరల విషయంలో ప్రభుత్వం తీరుపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కౌంటర్ ఇచ్చారు. తమ దేశం(పాకిస్తాన్) దివాళా తీయకుండా ఉండేందుకే ఇంధన ధరలను పెంచడం తప్పనిసరి అని ప్రధానియ షరీఫ్ అన్నారు. పెట్రోలియం ధరల పెంపు నిర్ణయం కఠినమైనది కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఇమ్రాన్‌పై మండిపడ్డారు. గత సర్కార్.. పెట్రోల్ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ ఇచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్ తేల్చిచెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు పాకిస్తాన్‌కు ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్ తెగెసి చెప్పింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.179.85, డీజిల్ లీటరు రూ.174.15, కిరోసిన్ రూ.155.95, లైట్ డీజిల్ రూ.148.41కు ఎగబాకాయి. ఆర్థిక సాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాక్ బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ధరలు పెంచామని పాక్ ఆర్థిక మంత్రి మిఫాత్ ఇస్మైల్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరకొరియాకు భారీ ఊరట.. -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
పెరుగుతున్న పెట్రోల్ రేట్లు.. ప్రతీ ఉద్యోగికి రూ.74 వేలు ఇచ్చిన యజమాని
కరోనా కాటుకు ప్రపంచంలోని అనేక దేశాలు నెమ్మదిగా ద్రవ్యోల్బణం అంచుల్లోకి చేరుకుంటున్నాయి. వరుసగా పెట్రోలు, ఎలక్ట్రిసిటి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా జీతాలు పెరగక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అయితే వీళ్ల కష్టాలు చూడలేని ఓ కంపెనీ యజమాని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌కి చెందిన ఎమెరీస్ టింబర్ అండ్ బిల్డర్ మర్చంట్స్ కంపెనీ యజమాని అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశంలో ఎలక్ట్రిసిటీ, గ్యాస్, పెట్రోలు పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో, ఆ ఖర్చులకు తట్టుకునేలా ప్రతీ ఉద్యోగికి జీతంతో పాటు అదనంగా 750 యూరోలు (సుమారు రూ. 74,251) అందించాడు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ హిప్కిన్స్. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. Due to rising costs of fuel/petrol and electricity/gas, we have decided to pay £750 to EVERY Emerys employee ✅ We hope this goes a long way to help our team during an unsettled financial time Much like a family, Emerys takes care of each other during difficult times! 🙌🏼 pic.twitter.com/WK3qeooH55 — Emerys Timber and Builders Merchants (@emerysltd) March 28, 2022 వ్యక్తిగతంగానే పెరుగుతున్న ధరల కారణంగా ఎమెరీస్ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దనే లక్ష్యంతోనే ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. తమ కంపెనీ ఉద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు అందించే సాయం మొత్తాన్ని కంపెనీ ఖాతా నుంచి కాకుండా ఎండీ జేమ్స్ హిప్కిన్స్ తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు. దీని కోసం ఆయన 45 వేల యూరోలు (సుమారు రూ. 44 లక్షలు) కేటాయించారు. ఎమెరీస్ కంపెనీలో 60 మంది ఉద్యోగులు ఉన్నారు. అండగా ఉంటా వరుసగా కొన్ని రోజులుగా పెట్రోలు రేట్లు పెరుగుతున్నాయి. గతంలో ఫ్యూయల్ కోసం 40 యూరోలు ఖర్చయ్యే చోట ఇప్పుడది 60 యూరోలుగా మారింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరగవచ్చంటూ అనేక నివేదికలు చెబుతున్నాయి. ఒక్క ఫ్యూయల్ మాత్రమే కాదు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో కంపెనీ ఉద్యోగులకు అండగా నిలవాలని అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని జేమ్స్ హిప్కిన్స్ తెలిపారు. సరికొత్త చర్చ ఎమెరీస్ కంపెనీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒపెక్ దేశాల ఒంటెద్దు పోకడలకు తోడు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎమెరీస్ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తూ సరికొత్త చర్చకు తెర తీసింది. అంతటా ఇదే పరిస్థితి ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కన్సుమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 6.2 శాతంగా నమోదు అయ్యింది. దీంతో అక్కడ పెట్రోలు, గ్యాస్, ఎలక్ట్రిసిటీతో సహా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఇక్క ఇంగ్లండ్‌లోనే కాదు అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్నాయి. మన దేశంలో గడిచిన రెండేళ్లలో లీటరు పెట్రోలు/డీజిల్ ధర రూ.40 వరకు పెరిగింది. చదవండి: పెట్రోల్ 118 నాటౌట్.. డీజిల్ 104 నాటౌట్.. గ్యాప్ లేకుండా బాదుతున్న చమురు సంస్థలు -
పెట్రోల్ 118 నాటౌట్.. డీజిల్ 104 నాటౌట్
సామాన్యులపై కనీస కనికరం చూపకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను పెంచాయి. వీటికి డీలర్ కమిషన్, వ్యాట్ తదితర అంతా కలిపితే లీటరు పెట్రోలు ధర 91 పైసలు, డీజిల్ ధర 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 118.59కి పెరగగా లీటరు డీజిల్ ధర రూ.104.62కి చేరుకుంది. రూ.10కి పైగా ఉదయం ఆరు గంటలు అయ్యిందంటే చాలు పెట్రోలు రేట్లు ఎప్పుడు పెంచుదామా అన్నట్టుగా చూస్తున్నాయి చమురు కంపెనీలు. గడిచిన పదిహేను రోజుల వ్యవధిలో కేవలం రెండంటే రెండే రోజులు గ్యాప్ ఇచ్చి పదమూడు సార్లు ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సవరణల కారణంగా లీటరు పెట్రోలు ధర గత రెండు వారాల్లోనే రూ.10.39 పెరగగా డీజిల్ ధర రూ. 10.57లు పెరిగింది. ఉపశమనం లేదు అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ రేట్లను సవరిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికలు పెట్రోలు రేట్లకు సంబంధం లేదని కేంద్ర మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. 2022 మార్చి 21న అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 111.83 డాలర్లుగా ఉండగా ఏప్రిల్ 5న 109.41 డాలర్ల వద్ద ఉంది. ఐనప్పటికీ ధరల పెంపు నుంచి సామాన్యులకు ఉపశమనం లభించడం లేదు. ఎన్నికలుంటేనే 2021 మేలో బెంగాల్ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి పెట్రోలు వాతలు మొదలయ్యాయి. ఈ పరంపర 2021 నవంబరు 4 వరకు కొనసాగింది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు, డీజిల్ ధర వంద దాటేసింది. దీంతో ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్రం లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను రూ.5 వంతున తగ్గించింది. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. నాటౌట్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం 2021 నవంబరు 4 నుంచి 2022 మార్చి 22 వరకు దాదాపు 137 రోజుల పాటు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచలేదు. ఇక మార్చి 22న మొదలైన చమురు సంస్థల బాదుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ దెబ్బకు లీటరు పెట్రోలు 118 నాటౌట్, డీజిల్ 104 నాటౌట్ బ్యాటింగ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. -
సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 10 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు 6.40 రూపాయలకు పెరిగాయి. దీంతో, సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి వస్తువు ధర పెరగడంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు ఉంది సామాన్యుడి పరిస్థితి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరగడం వల్ల కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ప్రారంభించింది. గత ఏడాది నవంబర్ 4 చివరి సారిగా ఇంధన ధరలు పెరిగాయి. అప్పటి నుంచి మార్చి 22 వరకు ఇంధన ధరలలో పెద్ద మార్పు లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరలు పెంచడానికి కేంద్రం సాహసించలేదు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు పెంపు మొదలు పెట్టింది. అయితే, ఈ అంశంపై స్పందించిన కేంద్రం, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్దం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచాల్సి వచ్చినట్లు తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.81 ఉండగా.. డీజిల్ లీటర్ రూ.93.07 వద్దకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.94కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంటే.. డీజిల్ ధర రూ.97.52కు చేరుకుంది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు ₹.111.35(83 పైసలు పెరిగింది), లీటర్ డీజిల్ ధర ₹96.22 (80 పైసలు పెరిగింది)గా ఉంది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం, అకౌంటెన్సీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ!) -
మళ్ళీ భగ్గుమన్న పెట్రోల్ ధర
-
జనం జేబుకు పెట్రో మంట..హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర
దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగాయి. దీంతో పెరుగుతున్న ధరలతో బండి బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చమరు కంపెనీలు సామాన్యులపై పెట్రో బాదుడును కొనసాగిస్తున్నాయి. గత మంగళవారం అంటే మార్చి 22 నుంచి ఒక్కరోజు మార్చి 24 మినహా ఇస్తే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ధర రూ.114.51 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.70పైసలుగా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.01 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.21గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.88 పైసలు ఉండగా డీజిల్‌ధర రూ.100.10గా ఉంది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.69 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.96.76 గా ఉంది. -
తగ్గేదేలే అంటున్న పెట్రోల్, డీజిల్..
-
ఎనిమిది రోజుల్లో ఏడోసారి.. పెరుగుతూనే ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ ధరల పేరు చెప్పి చమురు కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. 2022 మార్చి 29న లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసల వంతున ధరను పెంచాయి. తాజాగా సవరణలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్ ధర రూ.99.83ని టచ్ చేసింది. రేపోమాపో డీజిల్ ధర హైదరాబాద్‌లో వంద రూపాయలను క్రాస్ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు రెండో వారం నుంచి 2022 మార్చి మూడో వారం వరకు పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఓ దశలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 139 డాలర్లకు చేరుకున్నా.. ప్రభుత్వం మిన్నకుండిపోయింది. పెరిగిన ముడి చమురు ధర భారాన్ని బల్క్ డీజిల్‌పైకి మోపి సర్థుబాటు చేసింది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి పెట్రో బాదుడు మొదలైంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఏకంగా ఏడు సార్లు పెట్రోలు , డీజిల్ ధరలను పెంచింది. పెట్రోలుపై ప్రతీ రోజు సగటున 90 పైసల వంతున ఏడు సార్లు పెంచడంతో కేవలం వారం రోజుల వ్యవధిలో లీటరు పెట్రోలు ధర రూ.6.30 వంతున పెరిగింది. చైనాలో లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతోంది. వారం క్రితం బ్యారెల్ ధర 120 డాలర్లు ఉండగా చైనా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం 108 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఐనప్పటికీ గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు చమురు సంస్థలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి. -
ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి.. ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వల్ల ఆంక్షల నేపథ్యంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బైక్‌ను వినియోగించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ ఫార్మసీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ప్రతిరోజూ గుర్రం మీద తన కార్యాలయానికి వెళ్తున్నాడు. ఔరంగాబాద్‌లో డీజిల్ ధర రూ.100కు కొన్ని పైసలు తక్కువగా ఉండగా, పెట్రోల్ ధర లీటర్‌కు రూ.115 దాటింది. ఆదివారం లీటర్ పెట్రోల్ ధర 50 పైసలు, లీటర్ డీజిల్ ధర 55 పైసలు పెరిగింది. ఈ నేపథ్యంలో షేక్ యూసుఫ్ తన బైక్‌ను పక్కనపెట్టి తన ఇంటి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న తన కార్యాలయానికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. అంతకుముందు లాక్డౌన్ సమయంలో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. ‘లాక్డౌన్ తర్వాత గ్యారేజీలు చాలాకాలం పాటు మూసివేసి ఉన్నాయి. దీంతో బైక్‌ను మెయింటెన్ చేయడం సమస్యగా మారింది. కాబట్టి నేను నా వాహనాన్ని పక్కనపెట్టి కతియావాడి గుర్రాన్ని కొనాలని నిర్ణయించుకున్నాను. రోజూ 30 కి.మీ. ప్రయాణం చేస్తా. పలు కుటుంబ ఫంక్షన్లకు కూడా గుర్రం మీదే వెళ్తా. అంతేకాదు గుర్రం మీద ప్రయాణ చేయడం బైక్ మీద వెళ్లడం కంటే చాలా చవక’ అని యూసుఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు! -
వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. నవంబర్ 2 తరువాత పెట్రోల్, డీజీల్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. కాగా పెరిగిన ధరలు నేటి(మార్చి 22) నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ► ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.21 ►లీటర్ డీజిల్ రూ. 87.47 ►ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 110.78 ►లీటర్ డీజిల్ రూ. 94.94 ►హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.10 ►డీజిల్ లీటర్ రూ. 95.49 ►విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.8 ►డీజిల్ రూ. 96.83గా ఉంది. చదవండి: (LPG Gas: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర) -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
చెప్పింది ఒకటి... చేసేదొకటి!
ఎన్నికలు రాగానే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాడి బ్యాంకు అకౌంట్లో లక్షలు సొమ్ము వేస్తామని చెబితే పేదప్రజలందరూ నమ్మి ఓట్లు వేసి గద్దె నెక్కించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క రూపాయి కూడా ఏ ఖాతాకు జమ కాలేదు. నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని పైకి తీసుకొని వస్తానన్నారు. ఏమయింది? చివరకు నల్ల ధనం, నకిలీధనం కూడా ఆర్బీఐలోకి వెళ్లాయి. ఎంత ధనం ఆర్బీఐకి వచ్చిందో లెక్క తేల్చలేని పరిస్థితి. బ్యాంకులలో ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)లు ఎక్కువ య్యాయని చిన్నాచితకా బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మొత్తం బ్యాంకులను అమ్మివేసే పరిస్థితి! ఫలితంగా ఎన్పీఏలు తగ్గకపోగా సుమారు 15 శాతానికి పెరగటం గమనార్హం. రిజర్వు బ్యాంకులో ఉన్న అధిక ధనాన్ని డివిడెండుగా ప్రభుత్వం వాడుకొని స్వతంత్ర ప్రతిపత్తిగల రిజర్వు బ్యాంకుని నిర్వీరం చేస్తోంది. బ్యాంకులను జాతీయీ కరణ చేసిన ఘనత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకే దక్కుతుంది. లేకపోతే సామాన్యుడు బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా పోయేది. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తానని చెప్పి ఆ పని చేయలేక పోయారు. పీఎం ఫసల్ బీమాని ప్రయివేట్ సంస్థల కిచ్చి రైతులకు పంట నష్టం జరిగినపుడు న్యాయ బద్ధంగా ఇవ్వవలసిన క్లయిమ్‌ను ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించినా... పంటలను కొనకుండా రైతులను నిండా ముంచుతున్నది కేంద్రం. నిత్యం పాలిచ్చే ఆవులాగ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని కార్పొరేట్లకు అమ్మాలన్న ఆలోచన చూస్తుంటే దేశాన్ని ఈ పాలకులు ఏ దారికి తీసుకెలుతున్నారనే అనుమానం కలుగుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్లకు తెగనమ్మాలనుకోవడం దేనికి నిదర్శనం? సుమారు 20 వేల మంది ఉద్యోగుల భవితవ్యాన్ని గాలిలో కలిపేస్తారా? కాంగ్రెసు పార్టీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే... దానికి పార్లమెంటులో వత్తాసు పలికి, తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? విభజన చట్టంలో పోలవరానికి పూర్తిగా నిధులు ఇస్తామని చెప్పిన మాట మార్చి రకరకాల మాటలు చెప్పడం దేనికి సంకేతం? విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించకుండా నష్టాలు వస్తున్నాయనే సాకుతో కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది. విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగొలు చేస్తాననడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గుతున్నా... మనదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకుంటూ పోయి సామాన్యుని నడ్డి విరుస్తున్న కేంద్ర పాలన ఎవరికి లాభం చేకూర్చుతున్నదో అర్థం కాని ప్రశ్న. ఒక దేశం ఒకే పన్ను విధానాన్ని (జీఎస్టీ) తీసుకొచ్చి చిన్న వ్యాపారస్థుల నడ్డి విరిచారు. ప్రతి నెలా రిటర్ను దాఖలు చేయడంతోనే సమయం డబ్బు వృథా అవుతుండడం వలన చిన్న వ్యాపార స్తుల కష్టాలు వర్ణనాతీతం. ప్రతి మనిషికి అవసరమైన బట్టలను, చెప్పులను కూడా వదలకుండా పన్ను విధించటం గమనార్హం. బట్టలపై 5% పన్ను విధించి, అంతటితో ఆగకుండా మరలా 7% పన్నుని విధించటం వలన వ్యాపార వర్గంలోను, ప్రజలలోనూ వ్యతిరేకత పెరిగింది.. దీంతో సదరు పన్నును కేంద్రం ఉపసంహరించుకొంది. కొత్త వ్యవసాయ చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించడంతో రైతులు ఉద్యమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో దిక్కుతోచని పరిస్థితిలో కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. - కొవ్వూరి త్రినాథరెడ్డి కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం -
ఆ డబ్బు రాష్ట్రాలకు సమానంగా పంచాలి
కోల్‌కతా: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పెంచిన చమురు ధరలతో కేంద్రానికి వచ్చిన రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బెంగాల్ శాసనసభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ... ‘పెరిగిన ధరలకు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ విక్రయించడం ద్వారా విధించిన పన్నులతో కేంద్ర సర్కారు ఖాజానాకు దాదాపు రూ.4 లక్షల కోట్లు వచ్చాయి. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని బీజేపీ ఇపుడు డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం సమానంగా పంచాల’ని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చిందని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. (చదవండి: బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారు) ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ధరలు పెంచి, తర్వాత మళ్లీ పెంచడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. చమురుపై వ్యాట్ తగ్గించకపోతే ఆందోళనలకు దిగుతామని చెబుతున్న బీజేపీ నాయకులు... కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను గురించి ప్రశ్నించాలని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీలోనూ తమ రాష్ట్రంపై మోదీ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. (‘టచ్ చేయమంటున్నారు కదా.. సంజయ్ టచ్‌చేయ్’) -
పెట్రోల్ రూ.120 దాటేసింది
న్యూఢిల్లీ/భోపాల్: లీటర్‌కు రూ.120.. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లో కొత్త రికార్డు ఇది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్ ధర రూ.120 మార్కును దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు.. ఆదివారం సైతం 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండింటి ధరల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.34కు, డీజిల్ రేటు రూ.98.07కు చేరింది. మధ్యప్రదేశ్‌లో స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్ ధర మోత మోగుతోంది. పన్నా, సాత్నా, రేవా, షాడోల్, చింద్వారా, బాలాఘాట్ తదితర ప్రాంతాల్లో లీటర్ రూ.120కి పైగానే పలుకుతోంది. రాజస్తాన్‌లోని గంగానగర్, హనుమాన్‌గఢ్‌లోనూ లీటర్ రేటు రూ.120 దాటింది. దేశంలోనే అత్యధిక ధర గంగానగర్‌లో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.121.52కు, డీజిల్ రేటు రూ.112.44కు ఎగబాకింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ ధర 25 సార్లు (లీటర్‌కు రూ.8.15) పెరిగింది. సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ రేటు 28 సార్లు(లీటర్‌కు రూ.9.45) పెరిగింది. రండి.. మా దగ్గర ధర తక్కువ మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ఆదివారం వార్తాపత్రికలు తెరిచిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గోండియాలో పెట్రోల్, డీజిల్ రేటు లీటర్‌కు రూ.4 తక్కువ, అక్కడే పోయించుకోండంటూ ముద్రించిన కరపత్రాలు అందులో ఉండడమే ఇందుకు కారణం. బాలాఘాట్ నుంచి గోండియాకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా పెట్రో ధరల్లో వ్యత్యాసం రూ.4 కు పైగా ఉంది. -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
Petrol, Diesel Prices: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.120!
Petrol, diesel prices today:పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు హయ్యెస్ట్ మార్క్‌ను అందుకున్నాయి. వరుసగా నాలుగవ రోజూ శనివారం(అక్టోబర్ 23, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24పై., లీటర్ డీజిల్ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.12పై., డీజిల్ రూ.104కు చేరింది. దేశంలోనే ఫ్యూయల్ ధరలు కాస్ట్లీ కొనసాగుతోంది రాజస్థాన్ టౌన్ గంగానగర్‌లో. ఇక్కడ పెట్రోల్ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరింది. డీజిల్ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్ ట్యాక్స్‌ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్ పెట్రోల్ రూ.104.22పై., డీజిల్ రూ.100.25పై. తమిళనాడులో డీజిల్ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!. ఇక సెప్టెంబర్ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు(సెప్టెంబర్ 24 నుంచి 22 సార్లు పెంపు) పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్ పెట్రోల్ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. -
పెరిగిన పెట్రో ధరలు.. అక్కడ మాత్రం మంటలు
Petrol And Diesel Prices Today: పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. దీంతో గురవారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే స్పీడ్ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ(గురువారం, అక్టోబర్ 21) మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54పై. గా, డీజిల్ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44కి, డీజిల్ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉందక్కడ(దేశంలో ఇదే అధికం!). ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71 డీజిల్ 99.59కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.25కి చేరగా, డీజిల్ ధర 101.12ను తాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, డీజిల్ రూ.98.38గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది. పెట్రోల్ ఎంత ప్రియంగా మారిందంటే.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కంటే 35 శాతం ధర ఎక్కువ!. ఏటీఎఫ్ కిలో లీటర్‌కు ఢిల్లీలో 79వేలకు అమ్ముడుపోతోంది. అంటే లీటర్‌కు కేవలం 79 రూ. అన్నమాట. తగ్గించే ప్రయత్నాలు.. పెట్రో మంట తగ్గాలంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతోంది కేంద్రం. ఇందుకోసం సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు.. చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది. -
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ఇవాళ(అక్టోబర్ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్ ధర ఢిల్లీలో డీజీల్ లీటర్ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర102.70పైసలుగా, డీజీల్ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం -
వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుతుండటంతో నేరుగా ఆ భారం వినియోగదారుడిపై మోపుతున్నాయి దేశీ చమురు సంస్థలు. లీటరు డీజిల్‌పై 30 పైసలు, లీటరు పెట్రోలు 37 పైసల వంతున ఛార్జీలు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఏడు రోజులు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 108.60 లీటరు డీజిల్ ధర రూ.101.62లకు చేరుకుంది. చేతులెత్తేసిన చమురు సంస్థలు చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి దేశ ప్రజలపై పెట్రోలు భారం పడకుండా చర్యలు తీసుకోవడంలో చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. మరోవైపు కేంద్రం సైతం చమురు సంస్థలు ఎడాపెడా ఛార్జీలు పెంచుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి తప్పితే, ధరాఘాతం నుంచి సామాన్యలను రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నవంబర్ వరకు నవంబర్ వరకు ముడి చమురు ధరలు పెరుగాయని ఒపెక్ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇటు కేంద్రం, అటు చమురు సంస్థలు ఈలోగా ఏమైనా ఉపశమనం చర్యలు తీసుకోకుంటే చమురు ధరలు భరించలేని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది.