ముంబై : ట్రోల్, డీజిల్ ధరల పెంపుపై 2012లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అప్పట్లో 8 రూపాయలు పెరిగిన పెట్రోల్ ధరలపై రగులుతున్న జనాలు తమ కార్లను ఎలా తగలపెట్టాలనుకుంటున్నారో చెబుతూ.. బిగ్‌బీ చేసిన విమర్శలు ఇప్పటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. అమితాబ్ ట్వీట్ ప్రకారం.. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లిన ఓ ముంబై వాసిని ‘ఎంత పొయ్యమంటారు సార్’ అని అడుగుతాడు.. దానికి అతడు బదులిస్తూ ‘2 లేదా 3 రూపాయల పెట్రోల్ కార్ మీద పోయ్యి బ్రదర్.. తగలబెట్టేస్తాను’ అని అంటాడు. (1993 నుంచే యోగా ప్రాక్టిస్:)
T 753 -Petrol up Rs 7.5 : Pump attendent - 'Kitne ka daloon ?' ! Mumbaikar - '2-4 rupye ka car ke upar spray kar de bhai, jalana hai !!'
— Amitabh Bachchan (@SrBachchan) May 24, 2012
ఈ ట్వీట్ చేసిన 8 సంవత్సరాల తర్వాత తాజాగా నెటిజన్లు ఈ పోస్టుపై సరదా కామెంట్ చేస్తున్నారు. ‘బాగుంది సార్ జోక్ మళ్లీ ఒకసారి వేయండి ప్లీజ్, వాస్తవాల గురించి ధైర్యంగా మాట్లాడేందుకు ఇది సరైన సమయం’ అంటూ పేర్కొంటున్నారు. కాగా గత 19 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం డీజిల్ లీటర్ ధర 0.14 పైసలు పెరిగి 80.02కు చేరింది. ఇప్పటి వరకు నమోదైన డీజిల్ ధరలలో ఇదే అత్యాధికం. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 0.16 పైసలుపెరిగి 79.92 గా ఉంది. అంటే పెట్రోల్ ధర డీజిల్ కంటే ఇంకా పది పైసలు తక్కువగానే ఉంది. అయితే 2012 సంవత్సరంలో ఢిల్లీలో పెట్రోల్ ధరలో మూడింట రెండు వంతులు లేదా అంతకంటే తక్కువగా డీజిల్ ధర ఉండేది. 2002 నుంచి 2012 మధ్య పెట్రోల్ రిటైల్ ధరలు డీజిల్ రిటైల్ ధర కంటే ఎప్పుడూ పెరగలేదు. (మాస్క్‌ను హిందీలో ఏమంటారో తెలుసా)
Comments
Please login to add a commentAdd a comment