ఆశ్చర్యంలో బిగ్‌ బీ..! | Amitabh Bachchan Shares His First Family Car After Receiving Surprise Gift | Sakshi
Sakshi News home page

ఆశ్చర్యంలో బిగ్‌ బీ.. మాటలు రావడం లేదు!

Published Tue, Mar 10 2020 5:14 PM | Last Updated on Tue, Mar 10 2020 6:28 PM

Amitabh Bachchan Shares His First Family Car After Receiving Surprise Gift - Sakshi

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో ఏప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయనను సంతోష పెట్టే.. బాధ కలిగించే, ఆశ్యర్యపరిచే విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆయనను భావోద్వేగానికి గురిచేసిన విషయాన్ని పంచుకున్నారు. ఎల్లో వింటేజ్‌ ఫోర్డ్‌ కారు ముందు నిలుచుని ఉన్న ఫోటోను సోమవారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఫొటోకు బిగ్‌ బీ.. ‘ఎంతో చెప్పాలని ఉన్నా.. మాటలు రాని సందర్భాలు ఉంటాయి. నేను.. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను. మీతో ఓ విషయాన్ని పంచుకోవాలని ఉంది.. కానీ మాటలు రావడం లేదు. గడిచిన మధుర జ్జాపకం.. ఎదురుగా వచ్చిన క్షణం ఇది’ అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేశారు. 
నాకు ఆ విషయమే తెలియదు: బిగ్‌ బీ


ఆ హీరోను మరోసారి పొగిడిన అమితాబ్‌

ఇక బిగ్‌ బీ ఆయన జీవితంలో ఈ కారు ప్రాముఖ్యతను చెబుతూ.. ‘ఇంతకు ముందే మీకు ఆలహాబాద్‌లోని మా మొదటి కుటుంబ కారు గురించి చెప్పాను కదా. అదే ఈ ఫోర్డ్‌ కారు’ అని చెప్పారు. కాగా ఈ కారును ఆయన స్నేహితుడు అనంత్‌ బహుమతిగా ఇచ్చాడని కూడా చెప్పారు. ‘‘అనంత్‌ నా ఫ్యామిలీ ఫస్ట్‌ వింటేజ్‌ ఫోర్డ్‌ను ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నాడు. ఈ కారును బహుమతిగా ఇవ్వడం కోసం అనంత్‌ చాలా శ్రమించాడు. పెయింటింగ్‌ వేయించి.. సేమ్‌ నెంబర్‌ ప్లేటుతో ఇచ్చాడు. నా ఫస్ట్‌ ఫ్యామిల్‌ ఫోర్డ్‌ కారు నెంబరు కూడా 2882నే... అంతేగాక ఇది నన్ను చాలా ఆశ్యర్యానికి గురిచేసిన విషయం. ఇప్పటికీ నమ్మలేక పోతున్న. ఇంతకు ముందెన్నడూ ఇంతలా నన్ను ఎవరూ సర్ప్‌రైజ్‌ చేయలేదు’ అంటూ బిగ్‌ బీ ట్విటర్‌లో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం బిగ్‌ బీ రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌లు జంటగా నటిస్తున్న ‘బహ్మస్త్ర’ సినిమా ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement