ఎంతమంది పేర్లు మీకు తెలుసు? | Amitabh Bachchan Challenges Identify People In This Photo On Twitter | Sakshi
Sakshi News home page

ఎంతమంది పేర్లు మీకు తెలుసు?: బిగ్‌బీ

Published Sat, Apr 11 2020 1:23 PM | Last Updated on Sat, Apr 11 2020 2:02 PM

Amitabh Bachchan Challenges Identify People In This Photo On Twitter - Sakshi

ఫైల్‌ ఫోటో

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నియంత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డైన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలు, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజగా ఓ త్రోబాక్‌ ఫోటో(పాత ఫోటో)ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. (పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా)

‘ఈడెన్‌ గార్డెన్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ కోసం ఏర్పాటు చేసిన ముంబై ఫిల్మ్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బెంగాల్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా దిగిన ఫోటో ఇది. ఇందులో ఎంత మంది పేర్లు మీకు తెలసు?’ అంటూ కామెంట్‌ జతచేశారు. దీంతో ఈ త్రోబాక్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేవిధంగా ‘ఆవిష్కరణలో ‘చక్రం’ గొప్పదన్న విషయం అందరికి తెలుసు. కానీ నేటి కాలంలో నేను ‘స్మార్ట్‌ ఫోన్‌’ను గొప్ప ఆవిష్కరణగా చెబుతాను’ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక కరోనాపై పోరాటంలో భాగంగా బిగ్‌బీ లీడ్‌ రోల్‌లో అన్ని చిత్ర పరిశ్రమల్లోని ప్రముఖు నటీనటులతో రూపొందించిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement