సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోం దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆయన వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. హైదరా బాద్‌లోని మాదాపూర్ నుంచి నాంపల్లిలోని గాంధీభవన్ వరకు 14 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపునకు వ్యతి రేకంగా రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment