mla jagga reddy
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, సంగారెడ్డి: తాను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతానని, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు. ‘‘మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ని చేసిండ్రు. మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు. మీ ఆశీర్వాదం తోటి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఈ పదేళ్లకు నేను ముఖ్యమంత్రి అయ్యేవరకు కాపాడుకోండి. విజయదశమీ రోజు నా మనసులో మాట మీకు చెప్తున్నా ఆశీర్వదించండి’’ అని కోరారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని.. లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వచ్చి వాలిపోతానని జగ్గారెడ్డి చెప్పారు. చదవండి: ఒవైసీ ఫ్యామిలీ ది గ్రేట్@61 నాటౌట్ -
ఆజాది కా గౌరవ్ యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరు ??
-
కేసీఆర్ మాటన్నీ హాస్యాస్పదమే: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
-
తెలంగాణలో టీఆర్ఎస్ కు 16 సీట్లు గెలిచే సత్తా ఉందా: ఎమ్మెల్యే జగ్గా రెడ్డి
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తనను టీఆర్ఎస్ కోవర్ట్‌గా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకరు కోసమో, ఒకరు చెప్తేనో తాను పని చేయనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు బాలేదన్నారు. అంతర్గతంగా అభిప్రాయం చెప్పే పరిస్థితి కాంగ్రెస్‌లో లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: బానిసను కాను... నన్నెవరూ కొనలేరు -
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి
-
సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన:జగ్గారెడ్డి
-
మాట - మంటలు
-
ఇంద్రవెల్లి సభకు రాలేను: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత వారం రోజులుగా తనకు జ్వరంగా ఉందని, అందుకే ఇంద్రవెల్లి దళిత, గిరి జన దండోరా సభకు తాను రాలేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సభ విజయవంతం కోసం అన్ని ప్రయత్నాలు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. నాయకులందరినీ సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించిన తాను సభకు రానంత మాత్రాన చిలువలు పలువలు చేయొద్దని, కాంగ్రెస్ కేడర్ కూడా గందరగోళానికి గురికావద్దని వెల్లడించారు. తనకు జ్వరం వచ్చినందున కోర్టుకు కూడా వెళ్లలేకపోయానని, అందుకే వారంట్ కూడా జారీ అయిందని తెలిపారు. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి కోరారు. కాగా, ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇంద్రవెల్లి సభ విజయవంతంపై ఆయనతో చర్చించిన రేవంత్, సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
పెట్రో ధరల పెంపుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినూత్న నిరసన
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోం దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆయన వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. హైదరా బాద్‌లోని మాదాపూర్ నుంచి నాంపల్లిలోని గాంధీభవన్ వరకు 14 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపునకు వ్యతి రేకంగా రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. -
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తూ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయడంతో ఈ నేపథ్యంలో రేపటి దీక్షను కూడా రద్దు చేశామని జగ్గారెడ్డి వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. (చదవండి: ఎల్ఆర్ఎస్ ఎత్తివేత: కేసీఆర్ కీలక నిర్ణయం) కరోనా కారణంగా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం తాము తీవ్రంగా వ్యతిరేకించామని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు (బుధవారం) గాంధీభవన్‌లో దీక్ష చేస్తామని ప్రకటించామని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ డిమాండ్‌కు దిగొచ్చిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. (చదవండి: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో సీన్ మారింది!) -
కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన రగడ..
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్‌లో రగడ రచ్చకెక్కింది. సీనియర్ల అసంతృప్తితో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. దూకుడుగా ఉండే వ్యక్తికే టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ సోనియా గాంధీ, రాహుల్, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతో రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బీజేపీ వాడుకుంటుందని లేఖలో జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: షబ్బీర్ అలీకి కీలక పదవి!?) ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చిలో రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు జాగ్రత్త పడాల్సిన అవసరముందని పేర్కొంటూ.. జానారెడ్డి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని లేఖలో ఆయన సూచించారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నారు. సీనియర్ నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చే వరకు పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ ఆపాలని కోరారు. సాగర్ ఉప ఎన్నిక వరకు పీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డినే కొనసాగించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. (చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్) -
‘ఆ మంత్రిని జిల్లాల్లో తిరగనివ్వం’
సాక్షి, మెదక్: సింగూర్ నీటిని తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగూర్ నీటి తరలింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టిన కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మంత్రి హరీష్‌రావు అనాలోచితంగా నీటిని తరలించడం వలనే సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్-ఘనపూర్ ఆయకట్టు రైతులకు, మెదక్ మున్సిపాలిటీకి నీరు అందడం లేదన్నారు. దీనికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నీటి సమస్య తీర్చే విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు హరీష్ రావు ను మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తిరగనిచ్చేది లేదని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను గాలికొదిలేసి.. హరీష్ రావు ఇంటి వద్ద భజన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. -
తప్పు చేశానని ఒప్పుకుంటేనే వివాదానికి పుల్‌స్టాప్
రావులపాలెం (కొత్తపేట): జెడ్పీ సమావేశంలో తలెత్తిన వివాదంలో ఇప్పటికే తాను తప్పు ఒప్పుకున్నానని, అదేవిధంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా తప్పు చేశానని ప్రతికా ముఖంగా ప్రకటన చేస్తేనే ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెడతానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం రావులపాలెం కాపు కల్యాణ మండపంలో ఆయన జిల్లాస్థాయిలో బీసీ సంఘాల నేతలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బండారు సత్యానందరావు మాట్లాడుతూ సమావేశంలో పరుషంగా మాట్లాడడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరంరెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజకీయాల్లో అనుకోని సంఘటనలు ఒక్కోసారి జరుగుతుంటాయన్నారు. జెడ్పీ ఘటన కూడా అటువంటిదేనన్నారు. ఎమ్మెల్యేతోపాటు తాను కూడా సహనం కోల్పోయి ప్రవర్తించిన మాట వాస్తవమేన్నారు. జగ్గిరెడ్డి తన మాదిరిగా పత్రికా సమావేశం పెట్టి ముందుగా తాను పేపర్లు విసరడం తప్పేనని ఒప్పుకుంటేనే వివాదం ముగుస్తుందన్నారు. ఈ సమావేశంలో టీవీ ఏర్పాటు చేసి జెడ్పీ సమావేశాల వీడియోలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. -
జనగోదావరి ప్రవాహంలా జగన్ పాదయాత్ర
కొత్తపేట: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర జనప్రభంజనంతో సాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. మంగళవారం కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొందూరు గ్రామంలో జగన్ పాదయాత్రలో జగ్గిరెడ్డి ఆయన వెన్నంటే నడిచారు. జిల్లా, నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను జగ్గిరెడ్డి జననేత జగన్‌కు వివరించారు. అనంతరం ఆయన అక్కడి విశేషాలను ఫోన్లో ఇక్కడి విలేకర్లకు వివరించారు. పాదయాత్ర జనగోదావరి ప్రవాహంలా సాగుతోందన్నారు. భారీ సంఖ్యలో జనం తరలివచ్చి, మద్దతు ఇచ్చి జగన్ వెంట నడుస్తున్నారని తెలిపారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్ సీపీ సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాజోలు నియోజకవర్గ పార్టీ మాజీ కో ఆర్డినేటర్ చింతలపాటి వెంకటరామరాజు తదితరులు ఉన్నారు. -
కలిసే.. కానరాని లోకాలకు!
గుమ్మిలేరులో విషాదఛాయలు స్వగ్రామానికి మృతదేహాలు అంత్యక్రియలు పూర్తి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ గుమ్మిలేరు (ఆలమూరు) :తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బిచ్పల్లి మండలం చాంద్రాయన పల్లిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గుమ్మిలేరుకు చెందిన దంపతులు మృతి చెందారు. ఫలితంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన రెడ్డి గంగరాజు కుమారుడు ప్రవీణ్‌కుమార్ (28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఉదయనాగిని (26) కూడా ఫిజియోథెరపిస్టుగా పనిచేసున్నారు. వీరు అక్కడే తార్నాకలో నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం వీరిద్దరికీ వివాహమైంది. ఈ దంపతులకు ఏడాది వయస్సున్న కుమార్తె ఉంది. పేరు శ్రీత. ఆమె నిజామాబాద్జిల్లా ఎడవల్లి మండలం జైతాపురంలోని ప్రవీణ్ అత్తవారింటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో శని వారం వారాంతపు సెలవు కావడంతో ప్రవీణ్, నాగిని కుమార్తెను చూసేందుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో చాంద్రాయనపల్లి వద్ద టైర్ పేలి పోవడంతో వీరు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఫలితంగా దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆది వారం వీరి మృతదేహాలను గుమ్మిలేరుకు తీసుకొచ్చారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రవీణ్ పదోన్నతిపై పూణే వెళ్లాల్సి ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీరైన ప్రవీణ్‌కుమార్ పదోన్నతిపై పూణే వెళ్లి మరొక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదివారం చేరాల్సి ఉంది. అదే సమయానికి స్వగ్రామానికి ప్రవీణ్ విగతజీవిగా రావడాన్ని కుటుంబీకులు తట్టుకోలేకపోతున్నారు. ప్రవీణ్, ఉదయ నాగిని మృతదేహాలకు ఆదివారం రాజమండ్రిలోని కోటిలింగాల రేవు శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ ప్రమాద విషయం తెలిసిన వెంటనే కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహూటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి గుమ్మిలేరు చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాలను త్వరగా స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక దృష్టిసారించి పర్యవేక్షించారు.