
సాక్షి, సంగారెడ్డి: తాను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతానని, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు.
‘‘మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్‌ని చేసిండ్రు. మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు. మీ ఆశీర్వాదం తోటి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఈ పదేళ్లకు నేను ముఖ్యమంత్రి అయ్యేవరకు కాపాడుకోండి. విజయదశమీ రోజు నా మనసులో మాట మీకు చెప్తున్నా ఆశీర్వదించండి’’ అని కోరారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని.. లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వచ్చి వాలిపోతానని జగ్గారెడ్డి చెప్పారు.
చదవండి: ఒవైసీ ఫ్యామిలీ ది గ్రేట్@61 నాటౌట్
Comments
Please login to add a commentAdd a comment