Updates:
గంజి మైదాన్‌లో కాంగ్రెస్ సభ.. మల్లికార్జున ఖర్గే ప్రసంగం
►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది.
►కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
►తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు.
►తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా ఇంటికెళ్లాడు, ఆమె కాళ్లు మొక్కాడు.
►ఆ తర్వాత రోజే మాట మార్చాడు.
►ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించింది.
►ఇందిరా గాంధీ హయాంలోనే BHEL, BDL, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి.
►ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు సాధ్యామయ్యేవా?
►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు.
►ఈ ప్రభుత్వం సంస్థలను ఆమ్మేస్తుంది
►తెలంగాణలో ప్రతీ ఒక్కరిపై 5 లక్షల అప్పు ఉంది
►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది.
►బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్.
►రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చాం.
►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు.
►మేము ఆరు గ్యారంటీలను ఇస్తున్నాం.
►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తాం.
►రైతులకు రైతు భరోసా కింద 15 వేలు ఇస్తాం.
►ఓట్ల కోసం ఈ పథకాలు కాదు, అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నాం.
►మేం అన్నది చేసి చూపిస్తాం, మీరు హామిలిచ్చి వదిలేస్తారు.
►రేవంత్ రెడ్డి మీ దోస్తులకు చెప్పు, నేను బస్సు ఏర్పాటు చేస్తా.
►కర్ణాటకలో హామీలు అమలు అవుతున్నాయో లేదో బీఆర్‌ఎస్ నేతలను తీసుకెళ్లి చూపించండి.
►ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చారు.
►తొమ్మిదేళ్లలో 18 లక్షల ఉద్యోగాలు రావాలి. వచ్చాయా?
►ఏ ఒఒక్కరితోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అందరూ కలిసి పనిచేయాలి.
►సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ వెళ్లనున్నారు.
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది.. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు ర్యాలీ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment