cycles Ride
-
పెట్రో ధరల పెంపుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినూత్న నిరసన
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోం దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆయన వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. హైదరా బాద్‌లోని మాదాపూర్ నుంచి నాంపల్లిలోని గాంధీభవన్ వరకు 14 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపునకు వ్యతి రేకంగా రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. -
ఫిట్నెస్... శ్రీమంతుడు!
మనకెంతో ఇచ్చిన సొంత ఊరికి తిరిగి ఏమీ ఇవ్వకపోతే లావైపోతాం అని హీరోయిన్ చెప్పిన మాటలు హీరోపై ప్రభావం చూపుతాయ్. అంతే సొంతూరికి మేలు చేయడం కోసం ఆ శ్రీమంతుడు సైకిలేసుకుని వెళతాడు. ‘పోరా శ్రీమంతుడా..’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో పాట. మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ లో సీన్ గుర్తొస్తోంది కదూ. ఈ రీల్ శ్రీమంతుడు గురించి పక్కన పెట్టి, రియల్ శ్రీమంతుల గురించి చెప్పుకుంటే.. కొంతమంది నిజంగానే అప్పుడప్పుడూ సైకిల్ సవారీ చేస్తుంటారు. అయితే ఈ సవారీ ఫిట్నెస్ కోసం. సల్మాన్ ఖాన్ ఈ టైప్ సైకిల్ ప్రయాణాలు అప్పుడప్పుడూ చేస్తుంటారు. ముంబయ్ రహదారుల్లో ఈ కండల వీరుడు సైకిల్ మీద వెళుతుంటే అదేదో చూడకూడని వింతను చూసినట్లు చూస్తారు. మరి.. శ్రీమంతుడు సైకిల్ తొక్కడమంటే చిన్న విషయమా? తాజాగా ముంబయ్‌లోని బాంద్రా-వొర్లి రహదారిలో సల్మాన్ సైకిల్ రైడ్ చేశారు. ఈయనగార్ని గుర్తు పట్టి జనాలు గుమిగూడే ప్రమాదం ఉంది కాబట్టి, చుట్టూ బైకులు, కారుల్లో బాడీగార్డ్స్ ఫాలో అయ్యారు. సల్మాన్ తన రైడ్‌ని ఎంజాయ్ చేయాలి కదా మరి. కొంతమందైతే ఈయనగారు సైకిల్లో రావడం చూసి, తమంతట తాముగా తప్పుకుని ‘పోరా శ్రీమంతుడా’ అన్నట్లుగా దారిచ్చే శారు. మరి.. శ్రీమంతుడా? మజాకా? ఇదిలా ఉంటే.. రొమేనియన్ భామ లూలియా వంటూర్తో సల్మాన్ ప్రేమలో ఉన్నారనే వార్త వినిపిస్తోంది. ఈ ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయిందన్నది తాజా వార్త.