కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ కేసులో తాము.. దోషికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశాము. కోర్టు తీర్పు విషయంలో సంతృప్తి చెందలేదని వెల్లడించారు.
ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోర్టులపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. మేమంతా దోషి సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశాం. కానీ, కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పు విషయంలో మేము అసంతృప్తిగానే ఉన్నాం. ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బలవంతంగా బదిలీ చేశారు. సీబీఐ కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ వారి చేతుల్లోనే ఉంటే మరణశిక్ష పడేలా పోలీసులు శాయశక్తులా ప్రయత్నించేవారు. బాధితురాలికా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. జీవిత ఖైతు చిన్న శిక్ష వంటిది. ఇలాంటి నేరస్థులను తప్పకుండా ఉరితీయాలి’ అని డిమాండ్ చేశారు.
VIDEO | RG Kar rape and murder case: Here's what West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) said on Sealdah Court sentencing convict Sanjoy Roy to life term till death.
"We have been demanding death sentence to the convict since Day 1 and we are still demanding the… pic.twitter.com/DdJBpJoZ4H— Press Trust of India (@PTI_News) January 20, 2025
ఇదిలా ఉండగా.. ఆర్జీకర్ వైద్యుర్యాలి కేసులో తీర్పును వెల్లడిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా.. ఇది అరుదైన కేసు అని.. అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఇక, శనివారం న్యాయస్థానం సంజయ్‌ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అలాగే, దోషికి జీవిత ఖైదు విధించడమే కాకుండగా.. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు.. సంజయ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: కోల్‌కత్తా కేసు వివరాలు ఇలా..
Comments
Please login to add a commentAdd a comment