కోల్‌కతా: ఆర్‌జీ కర్ ఆస్పత్రి అభయ ఘటన కేసుతో పశ్చిమ బెంగాల్ ఆందోళనతో అట్టుడికిపోతుంది. ఈ తరుణంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ సీఎం మమతా బెనర్జీకి ఆదేశాలు జారీచేశారు. వెంటనే అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, సమస్యపై చర్చించాలని ఆదేశించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఇదే కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. వినీత్ గోయల్‌పై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గవర్నర్ సీవీ ఆనంద బోస్.. దీదీకి సూచించినట్లు సమాచారం.
ఇదీ చదవండి : 25 దేశాలు.. 135 నగరాల్లో ఆందోళనలు
రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. మౌనంగా ఉండకూడదు. రాష్ట్రం.. రాజ్యాంగం,చట్టబద్ధమైన పాలనలో పనిచేయాలి. వైద్యురాలి ఘటన కేసులో సమస్యను గుర్తించకుండా, అలసత్వం ప్రదర్శించకూడదు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను తొలగించాలనే ప్రజల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి’ అని సీవీ ఆనంద బోస్ ప్రభుత్వానికి ఆదేశించినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
#KolkataHorror | #ShaktiFightback
The Governor's directives to W.B CM Mamata Banerjee, as per sources:
- Hold emergency state cabinet meeting.
- Have state cabinet discuss the RG Kar case.
- Address demand to replace Kolkata top cop.
On the other hand, TMC's… pic.twitter.com/hp84HL0LxR— TIMES NOW (@TimesNow) September 9, 2024
Comments
Please login to add a commentAdd a comment