mamatha banerjee
-
కాంగ్రెస్‌కు మరో షాక్.. బాంబు పేల్చిన మమత!
ఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఘోర పరాజయాల నేపథ్యంలో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో చీలికలను సంకేతాలిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో కాంగ్రెస్ విజయం పక్కా అనుకున్నప్పటికీ హర్యానాలో ఓటమి.. మహారాష్ట్రలో కూడా దారుణ ఫలితాలు రావడంతో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకున్నాయి. మొదటి నుంచి ఇండియా కూటమిలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ కు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తృణమూల్ కాంగ్రెస్.పార్లమెంట్ సమావేశాల వేళ కూటమిలో చీలికకు సంకేతాలిస్తూ కాంగ్రెస్ తీరుపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు చేశారు. అలాగే, మిత్రపక్షం కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోదని టీఎంసీ పేర్కొంది. పార్లమెంట్ లో బెంగాల్ ప్రజల సమస్యలను లేవనెత్తే విధంగా సభను నిర్వహించాలని కోరింది. అవినీతిపై పార్లమెంట్లో చర్చ కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రజల కోసం తాము చర్చ కొనసాగించాలనుకుంటున్నట్టు టీఎంసీ వెల్లడించింది. బెంగాల్ కు నిధుల కొరత ఉంది. కేంద్రం నుంచి నిధుల రావాల్సి ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పార్లమెంట్ లో చర్చించాలనుకుంటున్నాం అని టీఎంసీ సభ్యులు తెలిపారు.ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లోనూ, పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఉపఎన్నికలలో మొత్తం ఆరు స్థానాలను, లోక్‌సభ ఎన్నికలలో 40 నియోజకవర్గాలలో 29 స్థానాలను గెలుచుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందడంపై కూడా టీఎంసీ ఘాటు విమర్శలు చేసింది. -
‘దీదీ’కి అగ్ని పరీక్ష .. పశ్చిమ బెంగాల్లో హీటు పుట్టిస్తున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి ఘటనలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. నవంబర్ 13న ఆరు అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల ఓటమి ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఆర్జీ కార్ ఘటనే కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పశ్చిమ బెంగాల్లో సీతాయ్, మదియాహత్, నైహతి, మేదినీపూర్, హరోవా, తల్దాంగ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజక వర్గాల ప్రజలు ఆర్జీ కార్ ఘటనలో జూనియర్ వైద్యురాలికి మద్దతుగా నిలిచారు. ఇదే కేసులో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ అంశం దీదీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఆర్జీ కార్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ఆరు సిట్టింగ్ స్థానాల్లో ఒకటి బీజేపీ, మిగిలిన ఐదు స్థానాలు టీఎంసీవి. ఇప్పుడు ఈ మొత్తం స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రాజకీయ పరిణామాలపై టీఎంసీ నేత కుమాల్ ఘోష్ మాట్లాడుతూ..‘ఆర్జీ కర్ ఘటనను దుర్వినియోగం చేయడం, ఓటర్లను తప్పుదారి పట్టించేలా గందరగోళానికి గురిచేసేలా ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయి’ అని అన్నారు.‘సీపీఐఎం పాలన ఎలా ఉందో పశ్చిమ బెంగాల్ ప్రజలు చూశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ పాలన ఎలా ఉందో గమనిస్తున్నారు. ఆర్జీ కర్ ఘటన కేసు నిందితుణ్ని కోల్‌కతా పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నాం. ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం. మేం అన్నీ స్థానాల్లో గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.కాగా, ఇటీవల పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆరు సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. -
‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వైద్యులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే వారి ఆందోళనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ వైద్యులు ‘టీ’ తాగేందుకు రావాలని కోరారు. అందుకు వైద్యులు ఒప్పుకోలేదు. అభయ ఘటనలో న్యాయం చేస్తేనే.. తాము టీ తాగేందుకు అంగీకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసిన ప్రతినిధి బృందంలోని డాక్టర్ అకీబ్ మాట్లాడారు. కాళీఘాట్ వద్ద చర్చలు జరిపేందుకు మమతా బెనర్జీ మమ్మల్ని వారి నివాసానికి పిలిచారు. ఆహ్వానం మేరకు మేం అక్కడి వెళ్లాం. విజ్ఞప్తి మేరకు వైద్యుల బృందానికి, సీఎం దీదీతో జరిపే చర్చలు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఆ తర్వాత సీఎం బయటికి వచ్చి టీ తాగమని మమ్మల్ని అభ్యర్థించారు. కాని జూనియర్ డాక్టర్లు మాకు న్యాయం చేస్తేనే టీ తాగుతామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని చెప్పి వెనుదిరిగినట్లు అకీబ్ వెల్లడించారు.కాగా, ఆర్జీ కార్ ఆస్పత్రిలో అభయపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ కోల్‌కతా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలను విరమించి విధుల్లోకి చేరాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా జూడాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చివరికి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జూడాల సమ్మె కొనసాగుతుంది.ఇదీ చదవండి : నేను ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
అభయ కేసు : సీఎం దీదీకి గవర్నర్ హుకుం జారీ
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రి అభయ ఘటన కేసుతో పశ్చిమ బెంగాల్ ఆందోళనతో అట్టుడికిపోతుంది. ఈ తరుణంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ సీఎం మమతా బెనర్జీకి ఆదేశాలు జారీచేశారు. వెంటనే అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, సమస్యపై చర్చించాలని ఆదేశించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.మరోవైపు ఇదే కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. వినీత్ గోయల్‌పై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గవర్నర్ సీవీ ఆనంద బోస్.. దీదీకి సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి : 25 దేశాలు.. 135 నగరాల్లో ఆందోళనలురాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. మౌనంగా ఉండకూడదు. రాష్ట్రం.. రాజ్యాంగం,చట్టబద్ధమైన పాలనలో పనిచేయాలి. వైద్యురాలి ఘటన కేసులో సమస్యను గుర్తించకుండా, అలసత్వం ప్రదర్శించకూడదు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను తొలగించాలనే ప్రజల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి’ అని సీవీ ఆనంద బోస్ ప్రభుత్వానికి ఆదేశించినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. #KolkataHorror | #ShaktiFightback The Governor's directives to W.B CM Mamata Banerjee, as per sources: - Hold emergency state cabinet meeting. - Have state cabinet discuss the RG Kar case. - Address demand to replace Kolkata top cop. On the other hand, TMC's… pic.twitter.com/hp84HL0LxR— TIMES NOW (@TimesNow) September 9, 2024 -
‘నేనలిగా!’.. ప్రధానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలకబూనారు. తనని సంప్రదించకుండా తమ రాష్ట్రం గుండా ప్రవహించే తీస్తా నది నీటిని బంగ్లాదేశ్‌కు ఇచ్చేందుకు ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మూడు పేజీల లేఖ రాశారు. ఇకపై నీటి పంపిణీల విషయంలో బంగ్లాదేశ్‌తో కేంద్రం జరిపే ముఖ్య సమావేశాలకు తమకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. మూడవసారి ప్రధానిగా మోదీ బాధ్యతులు స్వీకరించే సమయంలో భారత్‌కు తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరయ్యారు. ఆ తర్వాత భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల భేటీలో తీస్తా సహా నదీ జలాల పంపిణీపై రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.సిక్కింలో పుట్టిన తీస్తానది భారత్‌లో దాదాపూ 320 కిలోమీటర్లు ప్రవహించాకా.. బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. అయితే తీస్తా నదీ జలాల పంపకం భారత్-బంగ్లాల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్-బంగ్లాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అవి కొలిక్కి రావడం లేదు. అందుకు పశ్చిమ బెంగాల్ కారణమని తెలుస్తోంది. ఒక్క తీస్తానే కాదు..రెండు దేశాల మధ్య దాదాపూ 53 (తీస్తా నదిని కలుపుకుని 54) నదీ జలాల పంపంకంపై ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కనీసం సూత్ర ప్రాయంగానైనా ఒప్పందం చేసుకోవాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. అయితే తీస్తా నదిలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందంటూ పశ్చిమ బెంగాల్ అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. తీస్తా నది నీటి పంపకాల వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ రాష్ట్ర సీఎం దీదీ ఆరోపిస్తున్నారు. 2011లోనే నాటి సీఎం మమతా బెనర్జీ ఇదే తీస్తా నది నీటిని బంగ్లాదేశ్‌కు తరలించడంపై అభ్యంతరం చెప్పడంతో ఒప్పందం ఆగిపోయింది. తాజాగా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా మోదీతో జరిపిన చర్చల్లో తీస్తా నది పంపిణీ ఒప్పందం జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇదే అంశంపై దీదీ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదు’ అని మోదీకి రాసిన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలంటే మాకు గౌరవం. వారి క్షేమం కోరుకుంటాం. కానీ భారత్-బంగ్లాదేశ్ ఫార్కా నీటి ఒప్పందం పశ్చిమ బెంగాల్ ప్రమేయం లేకుండా జరిగింది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న మేం ఎట్టి పరిస్థితుల్లో నీటి పంపిణీ విషయంలో రాజీ పడబోమని దీదీ తెలిపారు. -
బీజేపీ దూకుడుకు దీదీ కళ్లెం
-
ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ
-
ఇండియా కూటమికి 315.. బీజేపీకి 195: దీదీ
కోల్‌కతా: దేశంలో నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇండియా కూటమి 315 సీట్లు గెలుస్తుందని, బీజేపీ గరిష్టంగా 195 సీట్లకు పరిమితం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బంగావ్ లోక్‌సభ నియోజకవర్గం ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఢిల్లీలో మోదీ ఉండరు.. కానీ దీదీ ఇక్కడి ప్రజలతోనే ఉంటుందని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు.ఇప్పటి వరకు పోలింగ్ బాగా జరిగింది. ఈసారి మోదీ అధికారంలోకి రావడం లేదు. అందుకే కేంద్రంలోని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. మళ్లీ మోదీ పీఎం కాలేరని గ్రహించారు. 400 సీట్ల గురించి గొప్పగా చెప్పుకోవద్దు అని బెనర్జీ అన్నారు.బొంగావ్ నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించే మాతువాస్ గురించి బెనర్జీ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రికి మాతువాస్ పట్ల అంత ప్రేమ ఉంటే, వారికి పౌరసత్వం ఇవ్వాలి. కానీ సీఏఏ అమలు సరికాదని ఆమె అన్నారు. దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని కూడా పేర్కొన్నారు.#WATCH | North 24 Parganas, Bangaon: West Bengal CM Mamata Banerjee says, "... Didi will bring the INDIA alliance to power there (at the Centre), we will help from here (West Bengal). The INDIA alliance will win with all of us (parties). As per the calculations we have till… pic.twitter.com/ROccx2dhhD— ANI (@ANI) May 13, 2024 -
గవర్నర్ మారేవరకు రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజ్‌భవన్‌లో ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని వేధించినట్లు గత వారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామా చేయకూడదో బోస్ వివరించాలి కోరారు.టీఎంసీ హుగ్లీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. గవర్నర్ సివి ఆనంద బోస్‌ను నిందించారు. బోస్ గవర్నర్‌గా కొనసాగే వరకు రాజ్‌భవన్‌లోకి అడుగు పెట్టనని కూడా ఆమె తేల్చిచెప్పారు. గవర్నర్ దాదాగిరి ఇక చెల్లదని పేర్కొన్నారు.గవర్నర్ మీద ఆరోపణలు వచ్చిన తరువాత రాజ్‌భవన్‌లోని పలు సీసీటీవీ ఫుటేజీలను పరీక్షించారు. అవన్నీ గవర్నర్ ఎడిట్ చేసిన వీడియోను విడుదల చేశారని, నేను మొత్తం ఫుటేజీని చూశాను. అవన్నీ షాకింగ్‌గా ఉన్నాయని అన్నారు. మీ ప్రవర్తన సిగ్గుచేటు అని ముఖ్యమంత్రి అన్నారు. -
బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి: మండిపడ్డ మమతా బెనర్జీ
కోల్‌కతా: రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించారని గవర్నర్ సీవీ ఆనంద బోస్పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిపైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం 'మమతా బెనర్జీ' మండిపడ్డారు.పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో మహిళ వేధింపుకు గురికావడం సిగ్గు చేటు అని అన్నారు. రాజ్‌భవన్‌లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్‌ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదు? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. స్కూల్ సర్వీస్ కమిషన్ కేసులో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా బీజేపీయే కారణమని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఒక మహిళ తనపై వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత టీఎంసీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి కథనాలకు భయపడబోమని.. సత్యం గెలుస్తుందని గవర్నర్ ఆనంద బోస్ అన్నారు.Smt. @mamataofficial strongly condemned the appalling incident in Raj Bhavan!It's deeply disturbing that the same Governor who showed great urgency in reaching Sandeshkhali now stands accused of molesting a female staff member.PM @narendramodi's spent the night there and his… pic.twitter.com/b07DXs1LNp— All India Trinamool Congress (@AITCofficial) May 3, 2024 -
లోక్‌సభ ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ స్థానంలో పోటీ?
తెలుగులో ఒకప్పుడు హీరోయిన్గా చేసి, ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తున్న నటికి లోక్‌సభ ఎన్నికల్లో సీటు దక్కింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సంబంధించిన హడావుడి మొదలైపోయింది. తాము రాష్ట్రంలో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మొత్తం 42 స్థానాలకు గానూ ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయమై క్లారిటీ ఇచ్చేశారు. ఇందులోనే ప్రముఖ నటికి అవకాశం దక్కడం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: పూనమ్ కౌర్ ట్వీట్.. సీఎం జగన్ సాయం మరోసారి తెరపైకి) తెలుగులో 'బావగారు బాగున్నారా!', 'కన్యాదానం', 'మావిడాకులు' చిత్రాల్లో నటించిన రచన బెనర్జీ.. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు ఈమెకే మమతా బెనర్జీ టికెట్ కేటాయించారు. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీ బరిలోకి దిగనున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో బసిర్హాట్ నుంచి గెలిచిన హీరోయిన్ నుస్రత్ జహాన్‌కు ఈసారి మొండిచేయి ఎదురైంది. సందేశ్ ఖాలీ వివాదమే ఇందుకు కారణం. (ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్) -
'ఎన్నికలు రావచ్చు, పోవచ్చు' - మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' (Mamata Banerjee) రాష్ట్రంలో తమ పార్టీ ఆధిపత్యాన్ని గురించి వివరిస్తూ.. 'ఎన్నికలు రావచ్చు, పోవచ్చు' కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని కొనసాగిస్తుందని ఉద్ఘాటించారు. తూర్పు మేదినీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు నినాదాలు చేసే వారు కూడా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ తప్పకుండా అధికారంలో కొనసాగుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి కొందరు వస్తుంటారు, ఎన్నికలు అయిన తరువాత మళ్ళీ కన్పించరని, ఎవరైనా చనిపోయినా రారు అని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాయ్ ఆదివారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు గౌరవం లేదని భావించి రాజీనామా చేసినట్లు రాయ్ స్పష్టం చేశారు. -
బెంగాల్లో హీటెక్కిన పాలిటిక్స్.. జేపీ నడ్డా టూర్‌పై టెన్షన్
బెంగాల్లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ అన్నట్టు వాడివేడి పాలిటిక్స్ చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక వివాదంలో ఈ రెండు పార్టీల నేతలు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా బెంగాల్లో మరోసారి రాజకీయం వేడిక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బెంగాల్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తోంది. కాగా, జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి బీజేపీ నేతలు.. కోల్‌కత్తాలోని నేషనల్ లైబ్రరీ ఆవరణలో బుధవారం సాయంత్రం రాజకీయ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో, అక్కడ పొలిటికల్ సమావేశం పెట్టడంపై అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టీఎంసీ నేత జై ప్రకాష్ మజుందార్ మాట్లాడుతూ.. లైబ్రరీ నిబంధనల ప్రకారం ప్రాంగణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించడం లేదు. పొలిటికల్ సమావేశం కోసం అధికారులు అనుమతినివ్వడం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. లైబ్రరీ వారసత్వ కట్టడం, కేంద్ర ప్రభుత్వంతో పర్యవేక్షణలో ఉన్న ప్రదేశమని గుర్తు చేశారు. ఇలాంటి ప్రదేశంలో రాజకీయ సమావేశాలు జరపడం సరికాదని తెలిపారు. ఇదిలా ఉండగా.. బెంగాల్లో బీజేపీకి ఇటీవల వరుస షాక్‌లు తగిలాయి. బీజేపీ నేతలు బాబుల్ సుప్రియో, అర్జున్ సింగ్.. అధికార టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బెంగాల్‌పై ఫోకస్ పెట్టిన నడ్డా ఈ పర్యటనలో పార్టీ నేతలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇది కూడా చదవండి: ‘కాంగ్రెస్ చెడ్డీని ప్రజలెప్పుడో ఊడగొట్టారు’ -
చంద్రబాబువి దుర్మార్గ రాజకీయాలు: అంబటి
-
పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద పెగాసస్ స్పైవేర్‌పై కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పెగసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు. ఈ విషయంపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే టెక్నాలజీకి ఆద్యుడ్ని అని ప్రచారం చేసుకునే చంద్రబాబు దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని ఆరోపించారు. పెగసెస్ చంద్రబాబు వాడినట్లు మమత బెనర్జీ చెప్పారు.. ఆమె మా రాజకీయ మిత్రురాలు కాదని అన్నారు. చంద్రబాబు, మమతా బెనర్జీ కొంతకాలం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కలిసి ప్రచారం చేసిన వారేనని గుర్తు చేశారు. ఇప్పుడేమో గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. మేమేమి మీరు పెగసస్ వాడారని చెప్పలేదు.. ఇలా భుజాలు తడుముకుంటున్నారంటే దీనిలో ఏదో ఉందని అన్నారు. లోకేష్ తిండి ఖర్చులకు రూ. 30 లక్షలు వాడారని రాస్తే సాక్షిపై కేసు వేశారు. మరి ఇప్పుడు మమత బెనర్జీపై కేసు వేస్తారా? అని ప్రశ్నించారు. ఈ దేశంలో అనైతిక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని విమర్శించారు. చంద్రబాబు జీవితమంతా అనైతిక రాజకీయాలేనన్నారు. నాడు చంద్రబాబు ట్యాపింగ్ కార్యక్రమాలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. పెగాసస్‌పై విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. దీంతో వెంటనే పెగాసస్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏబీ వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు కూడా ప్రాథమికంగా భావించింది. 23 మంది శాసన సభ్యులను తీసుకెళ్లడానికి చంద్రబాబు పోలీసులను వాడుకోలేదా...? ఏబీ వెంకటేశ్వర రావు దీనికి ప్రధాన భూమిక పోషించలేదా...? అధికారికంగా కొనకపోతే ప్రయివేటుగా కొనుగోలు చేసి ఉంటారు.. రూ. 25 కోట్లు పెట్టి ప్రైవేటుగా కొని ఉంటారు.. వెళ్లెప్పుడు వాటిని నాశనం చేసి ఉంటారని అన్నారు. మేము ప్రత్యర్థుల వీక్ నెస్‌పై ఆధారపడి రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. -
నేడు ఢిల్లీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
-
నందిగ్రాం ఫలితం రాలేదు: టీఎంసీ అధికారిక ట్వీట్
-
నందిగ్రామ్‌లో మమత బెనర్జీ గెలుపు
-
హోరాహోరీ: దీదీనా? మోదీనా?
సాక్షి,కోలకతా : దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రధానంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరికి దక్కనుందనే అంశానికి ఈ రోజు తెరపడనుంది. వరసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆశిస్తుండగా, టీఎంసీ కోటలో పాగా వేయాలని బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో కదిలింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఎంసీకి, బీజేపీ మధ్య హోరాహోరీగా నడిచిన ఈ పోరులో ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. టీఎంసీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందీగ్రామ్‌లో దీదీ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. టీఎంసీ మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున ఇక్కడ బరిలో ఉన్న సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. దీంతో మరింత ఉత్కంఠ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది దఫాలుగా పోలింగ్ నిర్వహించిన బెంగాల్ కోటలో అధికార పీఠం ఎవరికి దక్కనుంది. ఈ టఫ్ ఫైట్‌లో నిలిచేదెవరు..గెలిచేదెవరు..? దీదీనా, మోదీనా? దేశవ్యాప్తంగా ఇదే హాట్ హాట్‌టాపిక్. మెజార్టీ సర్వేలు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారం నిలబెట్టుకుట్టు కుటుందని అంచనా వేశాయి. కాగా బెంగాల్లో మొత్తం 292 సీట్లకు గాను పోలింగ్ జరిగింది. బెంగాల్లో అధికారంలోకి రావాలంటే 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధించాలి. (బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: లెక్కింపు ప్రారంభం) -
దీదీపై సువేందు పోటీ.. 57మందితో బీజేపీ తొలి జాబితా
-
57 మందితో బీజేపీ తొలి జాబితా.. హాట్ టాపిక్‌గా నందిగ్రామ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. మమత కంచుకోట బద్దలు కొట్టి బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయాలనే ప్లాన్‌తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగా శనివారం తొలి జాబితాను ప్రకటించింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఒకేసారి 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ తాజా జాబితా విడుదల చేసింది. మమతా పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానానికి టీఎంసీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరిన సువేందు అధికారిని పేరును ప్రకటించడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సువేందు అధికారితో పాటు మాజీ క్రికెటర్ అశోక్ దిండా, మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొయినా నియోజకవర్గం నుంచి అశోక్ దిండా పోటీ చేయనున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27, 1, 6, 10, 17, 22, 26, 29 తేదీలలో ఎనిమిది దశల్లో జరుగనున్నాయి. మే 2 న ఓట్లు లెక్కింపు ఉంటుంది. చదవండి: ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్ -
బెంగాల్లో ఎలా తనిఖీ చేస్తాయి?: మమత
కోల్‌కతా : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 కట్టడికి కృషి చేయాల్సిందిపోయి రాజకీయాలు చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కరోనాను ఎదుర్కొవడానికి రాష్ట్రంలో తమవంతు కృషి తాము చేస్తున్నామని, ఇలాంటి సమయంలో కూడా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. సోమవారం ఆమె సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై సీఎం మమతా అసహనం వ్యక్తం చేశారు. (చదవండి : మూడు విడతలుగా లాక్డౌన్ ఎత్తివేత) కరోనాను అడ్డం పెట్టుకుని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, కరోనాపై సాగిస్తున్న పోరులో అందరికి కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే లేదని, ఇష్టమున్నట్లు చేస్తున్నారని కేంద్రంపై మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర బృందాలు వచ్చి బెంగాల్లో ఎలా తనిఖీలు చేస్తాయని ప్రశ్నించారు. రోజు రోజుకు నిబంధనలు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వాని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకముందే మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. సమాఖ్య నిర్మాణాన్ని గౌరవించి అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు సాగాలని సీఎం మమత వ్యాఖ్యానించారు. (చదవండి : కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!) -
జూన్ 10 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జూన్ 10 వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయంచారు. దేశంలో లాక్డౌన్ ప్రకటించిప్పుడు బెంగాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. కానీ గత మూడు వారాల్లో కేసులు సంఖ్య విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో దాదాపు 10 కరోనావైరస్ హాట్‌స్పాట్ కేంద్రాలను గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. లాక్ డౌన్ కొనసాగింపు అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అయితే, స్కూళ్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు బెంగాల్లో లాక్ డౌన్ అమలు సరిగా జరగడం లేదంటూ కేంద్ర హోంశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమయంలో కూడా మత పరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నారంటూ అభ్యంతరం తెలిపింది. లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ డీజీపీని ఆదేశించింది. కాగా, బెంగాల్లో ఇప్పటి వరకు 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా 7,447 మందికి కరోనా బారిన పడ్డారు. 239 మంది ప్రాణాలు కోల్పోయారు. -
పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..
న్యూఢిల్లీ: వారం ప్రారంభంలో అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీ క్రమంగా తేరుకుంటోంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు శుక్రవారం ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి, నిత్యావసరాలను కొనుగోలు చేశారు. వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు విధులకు వెళ్లడం ప్రారంభించారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా భద్రతాదళాలు అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘాను పెట్టాయి. మసీదుల్లో మౌల్వీలు శాంతి సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వదంతులకు, తప్పుడు వార్తలకు స్పందించవద్దని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు ప్రకటించారు. అయితే, చెత్త, వ్యర్థ వస్తువులను ఏరుకునేందుకు శుక్రవారం ఉదయం బయటకు వెళ్లిన తన తండ్రి తలపై గాయాలతో చనిపోయారని సల్మాన్ అన్సారీ అనే వ్యక్తి తెలిపారు. ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలు ఈశాన్య ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ బైజాల్ సీనియర్ పోలీసు అధికారులతో కలిసి మౌజ్‌పూర్, జఫ్రాబాద్, గోకుల్పురిల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. దాదాపు 630 మందిని అరెస్ట్ చేయడమో లేక అదుపులోకి తీసుకోవడమో చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు 7 వేల మంది పారా మిలటరీ దళాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య శుక్రవారానికి 42కి చేరింది. వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం నలుగురు చనిపోయారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 9 ప్రాంతాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 25 వేల చొప్పున అందజేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఐపీఎస్ శ్రీవాస్తవకు అదనపు బాధ్యతలు అల్లర్ల సమయంలో శాంతి భద్రతల విభాగం స్పెషల్ కమిషనర్‌గా నియమితుడైన ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవకు శుక్రవారం అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆదివారం నుంచి ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా విధులు చేపట్టనున్నారు. అల్లర్లను గుర్తించడంలో, అరికట్టడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొన్న ప్రస్తుత కమిషనర్ అమూల్య పట్నాయక్ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ‘ప్రజల్లో భద్రతా భావాన్ని, మా కోసం పోలీసులున్నారనే ధైర్యాన్ని పాదుకొల్పడమే ప్రస్తుతం నా ప్రధాన బాధ్యత’ అని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో 331 శాంతి సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ కమిటీ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఐదుగురితో కూడిన కమిటీని శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ పైనుంచి దూకేశాం ‘బుధవారం రాత్రి ఇంట్లో ఉండగా, అకస్మాత్తుగా ఒక గుంపు మా ఇంట్లోకి జొరబడింది. నన్ను, నా ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించడం ప్రారంభించారు. భయంతో దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశాం’ అని ఒక బాధిత మహిళ తెలిపింది. ఆమె ఒక ఎన్జీవోను నిర్వహిస్తున్నారు. ‘గాంధీ’లపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి! అల్లర్ల తర్వాత తండ్రి ఆచూకీ తెలీకపోవడంతో తల్లితో కలసి ఢిల్లీలో ఓ ఆస్పత్రి మార్చురీ బయట వేచి ఉన్న బాలిక విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక వాద్రాలపై కేసులను నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, అమానతుల్లా ఖాన్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌లపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ‘లాయర్స్ వాయిస్’ సంస్థ తమ పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారించింది. విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్లలో తాము భాగస్వాములమవుతామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది. సీబీఎస్సీ పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ప్రతిపక్షాల వల్లే అల్లర్లు: అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన దుష్ప్రచారమే ఢిల్లీలో మత ఘర్షణలకు దారితీసిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. భువనేశ్వర్‌లో జరిగిన ర్యాలీలో శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ.. ‘సీఏఏ అమలుతో ముస్లింలు దేశ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం సాగించాయి. ప్రజలను రెచ్చగొట్టడం గొడవలకు దారితీసింది’ అని అన్నారు. సీఏఏతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు. పైపెచ్చు దీనితో మరికొందరికి పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం చారిత్రక నిర్ణయం. అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, మమతా దీదీ అబద్ధాలు ప్రచారం చేశారు’ అని ఆరోపించారు. రెచ్చగొట్టిన వారిపై చర్యలు తీసుకోండి: విపక్షాల లేఖ ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతవాతావరణం నెలకొనేలా యంత్రాంగాన్ని ఆదేశించాలని, విద్వేషాలను ప్రేరేపించేలా ప్రసంగించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసేతర ప్రతిపక్షాల నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన వారి కోసం సహాయ శిబిరాలను ప్రారంభించాలని, రక్షణ కల్పించడంతోపాటు నిత్యావసర సరుకులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పరిస్థితులపై చర్చించేందుకు తమకు సమయమివ్వాలని వారు రాష్ట్రపతిని కోరారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, లోక్తాంత్రిక్ జనతా దళ్‌కు చెందిన శరద్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్, ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి టీఆర్ బాలు, సీపీఐ నేత డి.రాజా, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మనోజ్ ఝా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఆ లేఖపై సంతకాలు చేశారు. ఢిల్లీ అల్లర్లను ప్రస్తావించా: మమతా ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్(ఈజెడ్‌సీ) సమావేశంలో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని ప్రస్తావించినట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన ఈజెడ్‌సీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ సమావేశంలో సీఏఏ, ఎన్నార్సీల ప్రస్తావన రాలేదు. అవి సమావేశం ఎజెండాలో లేవు. ఢిల్లీలో ఘర్షణలను మాత్రం నేను ప్రస్తావించా. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు మరింత విషమించకుండా చర్యలు తీసుకోవాలని, బాధితులకు పరిహారం అందించాలని కోరా’ అని తెలిపారు. పేరు అడిగి.. కొట్టి చంపారు! ఉదయం చెత్త ఏరేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి తీవ్ర గాయాలతో తిరిగివచ్చి, అనంతరం చనిపోయిన ఘటన శుక్రవారం ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకుంది. అయూబ్ షబ్బీర్ ఢిల్లీ శివార్లలోని గజియాబాద్‌లోని నస్బంది కాలనీవాసి. రోజూ చెత్త, ఇతర వ్యర్థ వస్తువులు ఏరుకుని, వాటిని అమ్మి జీవనం సాగిస్తుంటారు. ఆయన శుక్రవారం ఉదయం చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లాడని, సాయంత్రం కొందరు ఆయనను తలపై తీవ్ర గాయాలతో తీసుకువచ్చారని ఆయన కుమారుడు సల్మాన్ తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మరణించాడన్నారు. ‘వెళ్లొద్దని చెప్పాను. అయినా వినలేదు. పరిస్థితులు బాగానే ఉన్నాయి. సంపాదన లేకుండా ఎంతకాలం ఉంటాం? అని చెప్పి ఉదయమే బయటకు వెళ్లాడు’ అని సల్మాన్ వివరించాడు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో కొందరు పేరు, మతం అడిగి, ఆ తరువాత దారుణంగా కొట్టారని తన తండ్రి తనకు చెప్పాడని సల్మాన్ వివరించాడు. పోలీసులకు సమాచారమిచ్చానని, అయినా, వారు తన తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సహకరించలేదని చెప్పారు. తాను దివ్యాంగుడినని, తండ్రి తప్ప తనకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
మమతపై ఒవైసీ ఫైర్
కోల్‌కతా: మైనారిటీల్లో అతివాదాన్ని పెంచుతోందంటూ ఏఐఎంఐఎంను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. తృణమూల్ చీఫ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముస్లింలు ఘోరంగా వెనుకబడిపోయారని దుయ్యబట్టారు. సోమవారం కూచ్ బెహర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఓ పార్టీ.. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. ఇటువంటి అతివాద శక్తుల మాటలు మైనార్టీలు వినొద్దు. నమ్మొద్దు..’ అంటూ ఎంఐఎం పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒవైసీ మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘ఆమె అహంకారంతో అర్థం లేని నిరాధారమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆమెకు ఓటు వేసిన ముస్లింలందరినీ కించపరిచారు’అని అన్నారు. తృణమూల్ చీఫ్ మాటలు వింటుంటే ఆ రాష్ట్రంలో ఎంఐఎం ఎంత బలంగా ఎదిగిందో తెలుసుకోవచ్చన్నారు.