బుల్‌బుల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటినా బుల్‌బుల్... పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను వణికిస్తోంది హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి ఇప్పటివరకూ ఇద్దరు చనిపోయారు. బుల్‌బుల్ తీరం దాటుతున్న వేళ ఈదురు గాలులు బెంగాల్‌లో బీభత్సం సృష్టించాయి. ఉత్తర 24 పరగణాలు జిల్లా కకావికలమైంది. కోల్కతాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అనేక చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.