odisa
-
ఒడిశా నుంచి దుబాయ్: సక్సెస్ కోసం 17 ఏళ్ళు
కష్టాల సుడిగుండాలు దాటి.. సక్సెస్ సాధించిన వాళ్ళు ఎందరో. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 'సౌమేంద్ర జెన' (Soumendra Jena). ఓ చిన్న ఇంట్లో జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఇప్పుడు దుబాయ్‌లో విలాసవంతమైన భవనం, పోర్స్చే టైకాన్, జీ వ్యాగన్ బ్రబస్ 800 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల తన స్ఫూర్తిదాయకమైన విజయగాథను పంచుకోవడానికి ఫోటోలను షేర్ చేశారు.సౌమేంద్ర జెన తన ఎక్స్ ఖాతాలో రెండు ఫోటోలను షేర్ చేశారు. ఒక ఫొటోలో చిన్న ఇల్లు, మరో ఫోటోలో విలాసవంతమైన ఇల్లు, దాని ముందర ఖరీదైన కార్లు ఉన్నాయి. అప్పట్లో ఇది నా ఇల్లు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. 12వ తరగతి వరకు (1988 నుంచి 2006 వరకు) ఇక్కడే చదువుకున్నాను. నా జ్ఞాపకాల కోసం మళ్ళీ 2021లో ఇక్కడికి వచ్చాను.ఇప్పుడు దుబాయ్‌లో నాకు విలాసవంతమైన ఇల్లు ఉంది. కార్లు ఉన్నాయి. ఇదంతా.. నా 17 సంవత్సరాల శ్రమ, నిద్రలేని రాత్రులు వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. విజయం సాధించడనికి సమయం పడుతుంది. దీనికి ఎలాంటి షార్ట్కట్లు లేవు అని అన్నారు.సోషల్ మీడియాలో సౌమేంద్ర జెనా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 17 ఏళ్లలో మీరు ఏమి చేశారో నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు నేను నా కోసం ఇల్లు నిర్మించుకోలేకపోతున్నానని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు, విజయానికి సమయం, కృషి, అదృష్టం, సహాయం అన్నీ అవసరం. నువ్వు దుబాయ్‌లో ఉన్నావు. అదే ఒడిశాలో ఉండి ఉంటే ఇలా సక్సెస్ సాధించడం కష్టమయ్యేదని అన్నారు.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపుసౌమేంద్ర జెన ఫైనాన్స్ సెక్టార్లో ఒక ప్రముఖ కంటెంట్ క్రియేటర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో 4,87,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఆర్ధికపరమైన విషయాలను, పెట్టుబడికి సంబంధించిన సలహాలను ఇస్తూ ఉంటాడు.This was my home back then—a small town in Odisha, Rourkela, where I was born, grew up, and studied till class 12 (1988-2006). Revisited in 2021 for the memories!Today, my home in Dubai tells the story of 17 years of relentless hard work, sleepless nights, and no shortcuts.… pic.twitter.com/nw5tCdtwKE— Soumendra Jena (@soamjena) January 24, 2025 -
సాపిజెన్ బయోలాజిక్స్లో సింగపూర్ అధ్యక్షుడు
సింగపూర్ అధ్యక్షుడు 'థర్మన్ షణ్ముగరత్నం' భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగానే భువనేశ్వర్‌లోని అంధరువాలోని ఒడిశా బయోటెక్ పార్క్‌లో భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్దదిదైన వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ సాపిజెన్ బయోలాజిక్స్‌ను సందర్శించారు. ఆయనతో పాటు మంత్రివర్గ నాయకులు, వ్యాపార వేత్తలు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది.భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా.. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర ఎల్లా, సాపిజెన్ బయోలాజిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాచెస్ ఎల్లా, డైరెక్టర్ డాక్టర్ జలచారి ఎల్లా, సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అందరూ థర్మన్ షణ్ముగరత్నంను స్వాగతించారు.సింగపూర్ అధ్యక్షులు వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సందర్శించడం మాకు చాలా గౌరవంగా ఉంది. వ్యాక్సిన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు దోహదపడటానికి ఈ విశాలమైన మల్టీ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంలో జరుగుతున్న వినూత్న పనిని ప్రదర్శించడానికి మేము గర్విస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో పాటు వారి బృందాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రూ. 1500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంట్ సంవత్సరానికి 8 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ 10 వేర్వేరు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సదుపాయం ద్వారా 2,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు & 1,500 పరోక్ష ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. -
బాలాసోర్ దుర్ఘటన కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గతేడాది జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషాద ఘటనలో 290 మందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒరిస్సా హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.నిందితులు మొహమ్మద్ అమీర్ ఖాన్, అరుణ్ కుమార్ మహంత , పప్పు యాదవ్‌లను జులై 7, 2023న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం వహించిన కారణంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్.. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు 2 జూన్, 2023న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘనటలో 290 మందికి పైగా మరణించగా.. సుమారు 1,200 మందికి పైగా గాయపడ్డారు.అయితే.. ఉన్నత స్థాయి రైల్వే విచారణలో ప్రమాదానికి ప్రధాన కారణం.. తప్పు సిగ్నలింగ్ అని తేలింది. -
బీజేడీకి షాక్.. రాజీనామా చేసిన సీనియర్ నేత
సీనియర్ బీజేడీ ఎంపీ 'భర్త్రుహరి మహ్తబ్' (Bhartruhari Mahtab) శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కటక్ లోక్‌సభ నియోజకవర్గానికి వరుసగా ఆరు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మహ్తబ్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజీనామా లేఖను బీజేడీ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపినట్లు పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో భర్త్రుహరి మహ్తబ్ తీసుకున్న నిర్ణయం నవీన్ పట్నాయక్ సర్కారుకు పెద్ద షాకిచ్చింది. ఇటీవల ఒడిశాలో అరిందమ్ రాయ్ బీజేడీకి గుడ్‌బై చెప్పి బీజేపీ పార్టీలో చేరిన తరువాత.. మహ్తబ్ బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ, బీజేడీల మధ్య పొత్తు కుదరకపోవడంతో.. ఒడిశాలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అధికార బీజేడీ.. ప్రతిపక్ష బీజేపీ మధ్య ఎన్నికలకు ముందు పొత్తుపై చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రెండు పార్టీలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. -
గజపతి జిల్లా రాయగడ బ్లాక్ సంతోష్‌పూర్ గ్రామంలో
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ సంతోష్‌పూర్ గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామంలోని పింటూ నాయక్ అనే రైతు గ్రామ శివారులోని కొండమీద ఆవు కళేబరం కనిపించినట్లు తెలియజేశాడు. ఆవు కళేబరం పక్కనే పులి అడుగు జాడలు కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. నారాయణపూర్ అటవీ రేంజ్ అధికారులు సంతోష్‌పూర్ గ్రామానికి వెళ్లి పులి అడుగులను పరిశీలించారు. సంఘటన స్థలంలో కనిపించిన పాద ముద్రలను భువనేశ్వర్‌లోని పోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నామని, అయితే అవి పులి అడుగు జాడలని నిర్ధారించుకోలేదని ఏసీఎఫ్వో అశోక్ కుమార్ బెహరా తెలియజేశారు. రాత్రి సమయంలో గ్రామస్తులు బయట తిరగరాదని, వారి ఆవులు, మేకలు, కోళ్లను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. రెండు డ్రోన్ల సాయంతో ఆ జంతువు అచూకీ కోసం గాలిస్తున్నామని అటవీ అధికారులు తెలియజేశారు. ఉదయం ఇంటి వద్ద కనబడిన ఆవు, సాయంత్రం ఆరు గంటల తర్వాత కళేబరమై కొండమీద కనబడిందని పేర్కొన్నాడు. -
ఇద్దరి అరెస్టు
880 లీటర్ల సారా, కారు సీజ్ పార్వతీపురం టౌన్: సారా రవాణాను అరికట్టేందుకు పార్వతీపురం మండలంలోని రంగాలగూడ గ్రామ సమీపంలో ఎస్ఈబీ సీఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 880 లీటర్ల సారాతో ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఉపేంద్ర మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలోని అలమండ నుంచి పార్వతీపురం మైదాన ప్రాంతానికి సారా రవాణా అవుతోందన్న ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు. కొమరాడ మండలం పూడేసు గ్రామానికి చెందిన ఆరిక నరేష్, పార్వతీపురం పట్టణానికి చెందిన సిరిపురపు నారాయణ ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా సారా రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. వారికి సారా సరఫరా చేసిన ఒడిశా రాష్ట్రంలోని అలమండకు చెందిన బెవర శరత్‌పై కూడా కేసు నమోదు చేశామని, నరేష్, నారాయణలను రిమాండ్ నిమిత్తం పార్వతీపురం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. దాడుల్లో ఎస్సై వీవీ రమణ, సిబ్బంది పాల్గొన్నారు. 100 మద్యం సీసాలతో ఇద్దరి అరెస్టు గంట్యాడ: మండలంలోని బుడతనాపల్లి గ్రామం వైపు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కొఠారుబిల్లి జంక్షన్ సమీపంలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను మద్యం సీసాలతో పట్టుకున్నారు. మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన బండ రామకృష్ణ, బాడంగి మండలానికి చెందిన తోట దుర్గారావు కొఠారుబిల్లి జంక్షన్ నుంచి బైక్‌పై అక్రమంగా 100 మద్యం సీసాలు తరలిస్తుండగా గోకులం లేవుట్ సమీపంలో బంగారమ్మ గుడి దగ్గర పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు హెచ్‌సీ జె. శ్రీనివాసరావు తెలిపారు. -
ఒడిశా రైలు ప్రమాద బాధితులకే ఈ డబ్బు: నిర్మాత
తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్‌ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ పేర్కొన్నారు. గతంలో రామ్‌చరణ్ ‘ధృవ’, ‘చెక్’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఒక నిమిషం 46 సెకన్ల నిడివిగల ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇదీ చదవండి: Jr NTR: ఎన్టీఆర్ కోసం క్రేజీ హీరోయిన్ను ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్) అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అని చిత్ర నిర్మాత, హీరో ప్రశాంత్ కార్తీ మీడియాతో ముచ్చటించారు. ‘‘మా తండ్రి సివిల్ కాంట్రాక్టర్. నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. దాంతో సినిమాలలో నటించాలనే బలమైన కోరిక ఉండడంతో రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. ఆ తరువాత ‘చెక్’, రాంగోపాల్ వర్మ ‘కొండా’ సినిమాలో నక్సలైట్ నాయకుడు ఆర్.కె. పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకువచ్చింది. దయచేసి అందరూ థియేటర్స్‌లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మీకు’’ అంటూ ముగించారు. (ఇదీ చదవండి: Custody Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?) -
మంచి మనసు చాటుకున్న అదానీ ... వారందరికీ ఉచిత విద్య
-
బాలేశ్వర్ లో ఎటుచూసినా కన్నీటి సూడులే
-
గంజాయి రవాణా ఒడిశా నుండి విశాఖ
-
అల్టిమేట్ ఖో–ఖో లీగ్ రంగం సిద్ధం.. ఎన్ని జట్లు అంటే!
పుణే: క్రీడాభిమానులను అలరించేందుకు మరో లీగ్ సిద్ధమైంది. గ్రామీణ క్రీడ ఖో–ఖో లీగ్‌కు నేడు తెర లేవనుంది. అల్టిమేట్ ఖో–ఖో లీగ్ పేరిట జరగనున్న ఈ టోర్నీలో ఆరు జట్లు (చెన్నై క్విక్‌గన్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఖిలాడీస్, ఒడిషా జగర్‌నాట్స్, రాజస్తాన్ వారియర్స్, తెలుగు యోధాస్) టైటిల్ బరిలో ఉన్నాయి. తొలి రోజు గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఖిలాడీస్, తెలుగు యోధాస్‌తో చెన్నై క్విక్‌గన్స్ తలపడతాయి. సెప్టెంబర్ నాలుగో తేదీన ఫైనల్ జరుగుతుందని అల్టిమేట్ ఖో–ఖో లీగ్ కమిషనర్, సీఈఓ టెన్జింగ్ నియోగి తెలిపారు. ప్రతిరోజు రెండు మ్యాచ్‌లు జరుగు తాయి. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ టెన్–4 చానెల్స్‌లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఒడిశా ముఖ్యమంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ
-
Odisha Tour: శ్రీకాకుళం బయలుదేరిన సీఎం జగన్
-
AP-Odisha: సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ
Updates: సాయంత్రం... ► ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ ►పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యపై సీఎంలు చర్చించారు. బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్వోసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు. ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒడిశా తెలుగు అసోసియేషన్ సభ్యులు కలిశారు. మధ్యాహ్నం.. ► ముందుగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఉదయం... ►విశాఖపట్నం: భువనేశ్వర్ పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని గ్రామాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం -
విధి ఆడిన వింత నాటకం!
విధి వెక్కిరిస్తే జీవితం వింత నాటకంలా మారిపోతుంది. ఆ నాటకంలో ఎవరైనా సమిధులు కావాల్సిందే... ఇదే పరిస్థితి అభం..శుభం తెలియని ఇద్దరి చిన్నారులకు ఎదురైంది. ఉన్న తల్లి ఎక్కడుందో తెలియదు. మద్యానికి బానిసై ఇబ్బందులు పెడుతున్న నాన్నను నాన్నమ్మే హతమార్చింది. ఆమెపై కేసు నమోదైంది. దీంతో చిన్నారుల జీవిత పయనమెటో తెలియని దయనీయ పరిస్థితి నెలకొంది. ఆ చిన్నారులను చూసి అంతా అయ్యో..పాపం అంటున్నారు... వారిని అక్కున చేర్చుకునేదెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. భువనేశ్వర్ : ఇద్దరు చిన్నారుల జీవితాలతో విధి ఆడుకుంది. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో నాలుగేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి తన భర్తను, పిల్లలను వదిలి వెళ్లిపోయింది. తండ్రి మద్యానికి బానిసై ఉన్న కుటుంబ సభ్యులను నిత్యం విసిగించడంతో విసిగిపోయిన కన్నతల్లే క్షణికావేశంలో హతమార్చింది. మూడేళ్ల కిందట చిన్నారుల తాతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఉపాధి కోసం పెదనాన్న వలసబాట పట్టాడు. మేనత్త సాకుతుందా! అంటే ఆమెది రెక్కాడితేగాని కడుపు నిండని దయనీయ స్థితి. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులకు దిక్కెవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మక్కువ మండలం కొండబుచ్చమ్మపేట గ్రామానికి చెందిన జానకి గౌరీశంకర్, కమల దంపతులు. వీరికి హారిక, చరణ్‌తేజ సంతానం. తల్లిదండ్రులిద్దరూ గుంటూరు పట్టణం వలసవెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ జీవించేవారు. కొన్నాళ్లు గడిచాక గౌరీశంకర్ మద్యానికి బానిసై భార్య కమలను నిత్యం వేధించడంతో విసిగిన ఆమె భర్తను ఇద్దరు చిన్నారులను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో చేసేదిలేక గౌరీశంకర్ తన ఇద్దరు చిన్నారులతో గుంటూరు వీడి కొండబుచ్చమ్మపేట గ్రామానికి వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. గౌరీశంకర్ మద్యానికి బానిస కావడంతో చిన్నారుల ఆలనాపాలన నాన్నమ్మ ఈశ్వరమ్మ చూస్తుండేది. ఈశ్వరమ్మకు ప్రభుత్వం అందిస్తున్న వితంతు పింఛనే జీవనాధారం. ఈ క్రమంలో ఈశ్వరమ్మను కన్నకొడుకు గౌరీశంకర్ మద్యం కోసం నిత్యం నగదు కావాలని వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తల్లీకొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఈశ్వరమ్మ కన్నకొడుకు గౌరీశంకర్‌ను హతమార్చింది. దీంతో చిన్నారుల తండ్రి లేకుండాపోయాడు. నాన్నమ్మ ఈశ్వరమ్మ రిమాండ్‌కు వెళ్లనుంది. ఇలా తల్లి ఉన్నా ఎక్కడ ఉందో తెలియక, తండ్రి హతమవగా.. ఇన్నాళ్లు తమ ఆలనాపాలన చూసిన నాన్నమ్మ రిమాండ్‌కు వెళ్లనుండడంతో ఈ చిన్నారుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకమైంది. మేనత్త ఉన్నా పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. హారిక ఐదో తరగతి, చరణ్‌తేజ రెండో తరగతి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు హారిక, చరణ్‌తేజ జీవన పయనమెటు? అన్నది అందరి మదిలో తొలిచే ప్రశ్న. -
లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాం
భువనేశ్వర్: రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికీ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు స్ఫష్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్రలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి మహరాష్ట్రలో ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్లతో పాటు ఇతర సామాజిక, రాజకీయ కార్యాలయాలు ఇంకా తెరుచుకొలేదు. ఒడిశాలో ఇప్పటివరకు 2,90,116 కరోనా కేసులు నమోదు కాగా... అందులో 273,838 మంది డిశ్చార్స్ అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 14, 905 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 1,320గా నమోదయ్యాయి. (చదవండి: సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్) ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులలో మరణాల రేటు 0.45 శాతంగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,470 కోవిడ్-19 కేసులు నమోదు కాగా 12 మంది మృత్యువాత పడ్డారు. ఇక 1,800 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఖుర్దా జిల్లాలో ఒక్కరోజులోనే గరిష్టంగా 159 కేసులు, కటక్‌లో 98, అంగుల్‌లో 95 కేసులను నమోదు కాగా.. కరోనాతో గంజాం జిల్లాలో 229 మంది, ఖుర్దా -226, కటక్ -10 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, బార్లు, జిమ్‌లు తెరించేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అదే విధంగా జూన్ 15 నుంచి అత్యవసర సేవల కొరకు పరిమిత సంఖ్యలో ప్రత్యేక సబర్బన్ రైళ్లను రైల్వే అధికారులు తిరిగి ప్రారంభించారు. (చదవండి: యూరప్, అమెరికాకు కోవిడ్ దడ) -
యువతి నిర్బంధం.. గ్యాంగ్ రేప్
సాక్షి, భువనేశ్వర్ : ఒరిస్సాలోని కటక్ నగరం శివారులో మరో ఘోరం జరిగింది. ఇంటికి వెళ్లేందుకు న గరం బస్టాండ్‌లో నిలబడిన ఓ 17 ఏళ్ల అమ్మాయికి లిఫ్ట్ ఇస్తానంటూ మోటారు బైక్‌పై ఎక్కించుకున్న ఓ యువకుడు ఆమెను సరాసరి నగరం శివారులోని తన కోళ్ల ఫారమ్‌కు తీసుకెళ్లి రేప్ చేశారు. ఆ దుర్మార్గుడు ఫోన్లో తన మిత్రుడిని పిలవగా అతనూ వచ్చి రేప్ చేశారు. ఇద్దరు రేప్ చేస్తుండగా వారు వీడియో రికార్డు చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించినా, ఎవరి సహాయం కోరినా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి ఆ యువతిపై 22 రోజుల పాటు ఇద్దరు యువకులు అత్యాచారం చేస్తూ వచ్చారు. కోళ్ల ఫారమ్‌లో యువకుల చేష్టలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సోమవారం వారొచ్చి యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ యువతి శారీరక, మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో పోలీసులు ఆమెను ప్రభుత్వ అనాథాశ్రయానికి పంపించారు. ఆమెపై అత్యాచారం జరిపిన మరో యువకుడి కోసం గాలిస్తున్నట్లు కటక్ పోలీసు అధికారి జాతీయ మీడియాకు తెలిపారు. ఆ యువతి తండ్రి పెట్టే బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోయి కటక్ వచ్చి తన సోదరి ఇంట్లో ఉంటున్నారు. ఆమె బావకు ఆమె అక్కడుండం ఇష్టం లేదు. సంతోష్ బెహరాలోని తన ఇంటికి పోదామని బయల్దేరిన ఆ యువతిని నిందితుడు లిఫ్ట్ ఇస్తానంటూ దారి మళ్లించి మోసం చేశారు. ఇలాంటి రేప్‌లకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు సాగిస్తున్నా రేప్‌లు ఆగడం లేదు. భారత్‌లో 15 నిమిషాలకోసారి రేప్ జరగుతోంది. గతేడాది రోజుకు 60 చొప్పున దేశంలో రేప్‌లు జరిగినట్లు ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ నివేదిక తెలియజేస్తోంది. -
ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. కేసు నమోదు
భువనేశ్వర్ : కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. సామాన్య ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగల ప్రజాప్రతినిధిలే నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. కరోనా మార్గదర్శకాలను పాటించకుండా పాజిటివ్‌గా తేలిన ఓ ఎమ్మెల్యే.. బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశాలోని పూరీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజూ జనతాదళ్ (బీజేడీ) సీనియర్, ఎమ్మెల్యే ఉమాకంఠ ఇటీవల కరోనా సోకింది. పెద్దగా కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ రెండు వారాల పాటు స్వీయ నిర్బంధలో ఉండాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే బీజేడీ సీనియర్ నేత ప్రదీప్ మహారాతి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. (కరోనా: మానసిక ఆరోగ్యంలో మార్పులు) అయితే కరోనా నేపథ్యంలో అతని అంతిమయాత్రకు ఎవరూ హాజరవ్వదని పోలీసులు హెచ్చరించారు. అంత్యక్రియల్లో సమీప బంధువులకు మాత్రమే అనుమతినిచ్చారు. కానీ కరోనా బారినపడిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఉమాకంఠ కూడా హాజరుకావడం కలకలం రేపింది. కోవిడ్ బాధితుడు అంత్యక్రియలకు హాజరుకావడంతో పోలీసులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు. ఐపీసీ సెక్షన్ 269, 270 (అంటువ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం), అంటువ్యాధుల నియంత్రణ చట్టం వంటి సెక్షల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇదే అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు మంత్రులపై మాత్రం పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. వారికి కూడా కరోనా సోకిందని, క్వారెంటైన్ గడువు ముగియకముందే అంత్యక్రియల్లో పాల్గొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎంపీ అపరాజితపై చర్యలు తీసుకోవాలి భువనేశ్వర్: స్థానిక లోక్ సభ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీకి చెందిన అపరాజిత షడంగికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అధికార పక్షం బిజూ జనతా దళ్ డిమాండ్ చేసింది. ఆమె జన్మదినం సందర్భంగా శుక్రవారం భారీ సమూహంతో వినోద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఆమె అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులు అంతా కోవిడ్–19 నిబంధనలకు నీళ్లొదిలారు. ముఖానికి మాస్కు తొడగకుండా భౌతిక దూరం పాటించకుండా గానా బజానాతో విందు వినోదాల్లో పాల్గొన్న వీడియో శుక్రవారం వైరల్ అయింది. కరోనా విజృంభణతో రాజధాని నగరం అల్లాడుతున్న సమయంలో బాధ్యతాయుతమైన ప్రజ్రా ప్రతినిధిగా ఎంపీ అపరాజిత షడంగి నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విచారం వ్యక్తమైంది. ఎంపీ అపరాజతి షడంగికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌కు రాష్ట్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కెప్టెన్ దివ్య శంకర మిశ్రా లేఖ రాశారు. కేంద్రమంత్రికి వీడియో క్లిప్పింగ్ ఈ నెల 8వ తేదీన స్థానిక ఎంపీ అపరాజిత షడంగి జన్మదిన వేడుకల్ని వందలాది మంది మహిళలతో కలిసి వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో పాల్గొన్న వారంతా కోవిడ్–19 మార్గదర్శకాల్ని బాహాటంగా ఉల్లంఘించారు. ఈ సంఘటన వీడియో క్లిప్పింగు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతోంది. ఈ క్లిప్పింగును కేంద్ర మంత్రికి రాష్ట్రమంత్రి పంపారు. ఎంపీ అపరాజిత షడంగి కోవిడ్–19 నిబంధనలకు వరుసగా 3వ సారి ఉల్లంఘించినట్లు రాష్ట్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కెప్టెన్ దివ్య శంకర మిశ్రా ఈ సందర్భంగా లేఖలో గుర్తు చేశారు. లోగడ ఆమెకు జారీ చేసిన హెచ్చరికల్ని గాలికి వదిలి కోవిడ్ నిబంధనల్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు. ఆమె బాధ్యతారాహిత్యమైన చర్యలు కరోనా యోధుల ఉత్సాహాన్ని నిర్వీర్యం చేసి పరిస్థితుల్ని విషమంగా మలుస్తాయని మంత్రి దివ్య శంకర మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టే కోవిడ్–19 నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఎంపీకి వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి, ప్రధాన మంత్రికి సిఫారసు చేయాలని లేఖలో కోరారు. -
ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఉత్తరాన ఉరికి వస్తున్న భాస్కర్ దళం.. ఈశాన్యం నుంచి చొచ్చుకొస్తున్న మావోయిస్టులు.. వెరసి పోలీసులకు కంటి మీద కునుకు కరువైంది. రాష్ట్రంలోకి చొరబడాలని మావోయిస్టులు, వెనక్కి తరిమికొట్టాలని గ్రేహౌండ్స్ బలగాలు చూస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీగా మావోయిస్టులు కాచుకుని ఉన్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. వీరు చొరబడితే విధ్వంసాలకు దిగుతారన్న ముందస్తు సమాచారంతో దండకారణ్యంలో జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ నుంచి దాదాపు 50 కి.మీ.దూరం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా ఇంజారం గ్రామం వద్దే వారిని నిలువరించేందుకు సీఆర్పీఎఫ్ కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు డ్రోన్ కెమెరాలతో మైదానాలు, వాగులు, వంకలపై నిఘా పెంచారు. సీఆర్పీఎఫ్ వద్ద ఉన్న డ్రోన్ కెమెరాలు చాలా ప్రత్యేకమైనవి. భూమి మీద చీమనైనా గుర్తించగలిగే శక్తి వీటి ప్రత్యేకత. పైగా వేల మీటర్ల ఎత్తున ఎగిరే వీటిని భూమి మీద నుంచి గుర్తించడం సాధ్యం కాదు. దండకారణ్యం జల్లెడ: ఈ నెల 13వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో దాదాపు 300 మంది మావోయిస్టులు వాగు దాటుతున్న దృశ్యాలు సీఆర్పీఎఫ్ డ్రోన్‌కు చిక్కాయి. వీరు సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసేందుకు భారీగా తరలిరావడం గమనార్హం. వీరంతా సుకుమా జిల్లాకు సమీపంలోని ఇంజారం గ్రామం దాకా వచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ద్వారా తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి వారిని వెనక్కివెళ్లేలా చేయడంలో దాదాపు వేయిమందికిపైగా కోబ్రా–గ్రేహౌండ్స్ పోలీసులు సఫలీకృతమయ్యారు. అయినా, వదలని పోలీసు బలగాలు వీరిని దండకారణ్యం వైపు తరిమికొట్టే వ్యూహంతో కూంబింగ్ చేస్తున్నాయి. వీరిని తెలంగాణ సరిహద్దు నుంచి వీలైనంత వరకు దూరంగా పంపాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వీరు సాయుధ బలగాలను ఏమార్చి ఇతర మార్గాల్లో రాష్ట్రంలోకి రాకుండా.. సరిహద్దు వెంబడి సైతం పటిష్ట నిఘా ఉంచారు. -
డీఆర్డీఓ మరో అరుదైన ఘనత
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్త్రేషన్ వెహికిల్‌ని విజయవంతంగా పరీక్షించింది. ఒరిస్సా తీరంలో సోమవారం ఈ పరీక్షను నిర్వహించారు. వాతావరణంలో 30 కిలోమీటర్ల ఎత్తులో ధ్వని వేగం కంటే ఆరు రెట్లు వేగంతో పనిచేయనున్న హైపర్ సోనిక్ వెహికల్ స్క్రామ్ జెట్ ఇంజన్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ అరుదైన ఘనత సాధించిన దేశాల జాబితాలో భారత్ నాలుగో దేశంగా గుర్తింపు పొందింది. హైపర్ సైనిక్ టెక్నాలజీ టెస్ట్ విజయవంతంతోమరిన్ని క్లిష్టమైన సమస్యలకు సమాధానాలు సులువుగా దొరికే అవకాశం ఉంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి అభినందనలు తెలిపారు. తాజా ప్రయోగంతో భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలిపారని ప్రశంసించారు. -
ప్రధానిపై అసభ్య పోస్టింగ్.. వ్యక్తి అరెస్ట్
సాక్షి, భువనేశ్వర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించిపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుశాఖ అధికారుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టాడు. దీనిపై యూపీ పోలీసు విభాగానికి ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే అతని ఫేస్బుక్ ఖాతా వివరాలను సేకరించిన పోలీసులు ఒడిశాలోని కుసుంభీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఒడిశా పోలీసుల అధికారుల సహాకారంతో శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 124ఏ (దేశద్రోహం) కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగులు పెడిత తప్పినిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. (ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్) -
అక్టోబర్–నవంబర్‌లో టీకా
భువనేశ్వర్: కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్‌కల్లా సిద్ధం కావచ్చని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా బుధవారం తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా టీకా మూడవ దశ మానవ ప్రయోగాలు ఆగస్టులో మొదలవుతాయని, అన్నీ సవ్యంగా సాగితే ఆ తరువాత రెండు మూడు నెలల్లో టీకా అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆదార్ బుధవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కరోనా వ్యాక్సీన్ మానవ ప్రయోగాలకు సంబంధించి ఒడిశా రాజధాని భవనేశ్వర్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ప్రస్తుతం టీకా ప్రయోగాల కోసం కార్యకర్తలను ఎంపిక చేస్తున్నామని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఇ.వెంకట్ రావు తెలిపారు. -
ఏవోబీలో మళ్లీ తుపాకుల మోత
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) మరోసారి తుపాకుల మోత మోగింది. ఒరిస్సాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచుసుకున్నాయి. సిబ్బంది రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు చాకచాక్యంగా తప్పించుకోగలిగారు. వారి కోసం అటవీ ప్రాంతంలో కూబింగ్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన కిట్‌బ్యాగ్స్, తుపాకీలు, బాంబుల తయారీకి ఉపయోగించి సామాగ్రీ లభ్యమయ్యాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపు గాలింపు చేపడుతున్నారు. కాగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీ సరిహద్దుల్లో గతకొంత కాలం నుంచి మావోయిస్టుల అలజడి వినిపిస్తోంది. దీంతో ఎజెన్సీ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆ దేవుడే మనల్ని క్షమించడు: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : పూరీ జగన్నాథ రథయాత్రపై సందిగ్ధత వీడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాత్ర నిర్వహణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు భారతీయ వికాస్ పరిషత్ (బీవీపీ) దాఖలు చేసిన స్పెషల్‌లీవ్ పిటిషన్‌పై గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. భౌతిక దూరం నిబంధనకు ప్రాధాన్యం కల్పించేందుకు యాత్ర నిర్వహణలో యాంత్రిక శక్తి, ఏనుగుల వినియోగం పట్ల హైకోర్టు మొగ్గం చూపడం ఆలయ సంప్రదాయ, చట్ట వ్యతిరేకమని బీవీపీ కోర్టుకు వివరించింది. (ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం) పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పూరీజగన్నాథ రథయాత్రపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. కాగా విపత్కర పరిస్థితుల్లో జగన్నాథుని రథయాత్ర పలుమార్లు నిలిపి వేసినట్లు చారిత్రాత్మక దాఖలాలు ఉన్నాయి. గడిచిన 452 ఏళ్లలో 32 సార్లు వాయిదా పడినట్లు పిటిషినర్ సంస్థ అధ్యక్షుడు సరేంద్ర పాణిగ్రహి సుప్రీంకోర్టును వివరించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రాష్ట్రమంత్రి మండలి గురువారం సాయంత్రం భేటీ కానున్నట్లు సమాచారం. -
కరోనా: చెలరేగిన హింస.. రాళ్ల దాడి
భువనేశ్వర్ : ఒడిశాలోని రూర్కెలలో కరోనా వైరస్ పోలీసులు, స్థానికుల మధ్య చిచ్చురేపింది. రూర్కెల జిల్లాలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది. దీంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తోన్న ప్రభుత్వం ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. వాహనాలు తిరగకుండా రోడ్లకు అన్ని వైపులా పెద్ద ఎత్తున బారికేడ్లను అమర్చింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయారు. కంటైన్మెంట్ జోన్‌ను ఎత్తివేయాలంటూ వందలాది మంది ప్రజలకు రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. (కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!) పోలీసుల పైకి పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలుపురు పోలీసులతో పాటు స్థానికులు గాయపడ్డారు. ప్రభుత్వం అదనపు బలగాలను దింపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని, సంయమనం పాటించాలని ప్రభుత్వం కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే కంటైన్మెంట్ జోన్లును ప్రకటించామని వివరించింది. ఇక పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది. -
అలర్ట్: పెను తుపానుగా ‘అంఫన్’
సాక్షి, చెన్నై : తమిళనాడుపై అంఫన్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను కారణంగా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సేలం, ఈరోడ్, ధర్మపురి, కోయంబత్తూర్, క్రిష్ణగిరి జిల్లాలో భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలకు పడుతున్నాయి. కొన్ని చోట్ల హోర్డింగ్‌లు, చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డ. బంగాళాఖాతంలో పెను తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలోని హార్బర్లలో మూడో ప్రమాద హెచ్చరిక సూచి ఎగుర వేశారు. రామేశ్వరం నుంచి చెన్నై ఎన్నూర్ హార్బర్ వరకు ఈ హెచ్చరిక జారీ అయింది. సముద్ర తీరంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో జాలర్లు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆదివారం రాత్రి సాయంత్రం తీవ్ర తుపాన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. (అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’). సోమవారం నాటికి పెను తుపానుగా మారిన అంఫన్.. సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారనుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. దిఘా, బంగ్లాదేశ్ హటియా దీవుల మద్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో 155-185 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్- బంగాదేశ్ తీరాల వద్ద డిగా, హతియా దీవులు(బాంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అంఫాన్ వల్ల ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తాజా హెచ్చరికలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సముద్ర తీరంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాల మధ్య తుపాను కొనసాగుతోంది. ఉత్తర దిశగా ప్రయాణించి మరింత తీవ్రమై ఈరోజు (మే 18వ తేదీన) ఉదయం 05.30 గంటలకు అత్యంత తీవ్ర తుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో పారదీప్ (ఒరిస్సా)కు దక్షిణ దిశగా 790 కిమీ, డిగా (పశ్చిమ బెంగాల్)కు దక్షిణ నైఋతి దిశగా 940 కిమీ, ఖేపుపర (బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1060కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. -
హనీమూన్‌కు కొత్తజంట: కరోనా ఎఫెక్ట్‌తో..
భువనేశ్వర్ : కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఒడిశాకు చెందిన నవదంపతులు మలేషియాలో చిక్కుకున్నారు. వైరస్ కారణంగా ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలు రద్దు చేయడంతో వారికి ఈ దుస్థితి ఎదురైంది. అయితే ఈ నెల 17వ తేదీ నుంచి వారు మలేషియా విమానాశ్రయంలోనే ఉండిపోవడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి.. నవరంగపూర్‌కు చెందిన శంకర హల్దార్(28), పల్లవి మిశ్రా(27)లకు ఫిబ్రవరి 27వ తేదీన వివాహం జరిగింది. హనీమూన్ నిమిత్తం మలేషియాకు బయలుదేరిన ఆ జంట తిరిగి ఇంటికి వస్తుండగా ఈ నెల 17వ తేదీన మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారిని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వారు ఇంటికి రాలేకపోయారు. ఈ క్రమంలో వారంతా తమ అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ మలేషియా విమానాశ్రయంలో కేవలం ఈ నూతన దంపతులే కాకుండా మరో 200 మంది భారతీయులు చిక్కుకున్నట్లు సమాచారం. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!) -
గర్భిణిని జోలీలో మోసిన ఎమ్మెల్యే
జయపురం : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాకితో కబురంపితే చాలు.. వచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే అదే మాటపై నిలబడ్డారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 5 కి.మీ. దూరం జోలీలో మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చి మానవత్వాన్ని, తన బాధ్యతను చాటుకున్నారు. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి కుసుముగుడకు చెందిన జెమ బెహర నిండు గర్భిణి. ఆమె సోమవారం ఉదయం నుంచి పురిటి నొప్పులతో బాధపడుతోంది. అయితే ఆ గ్రామానికి రహదారి లేనందున అంబులెన్స్ రాలేని పరిస్థితి. ఈ విషయం తెలిసిన డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో గర్భిణిని ఉంచి వారితో పాటు జోలీని మోసుకుంటూ తీసుకెళ్లి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. తమ కోసం దిగొచ్చి జోలీ మోసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు. -
దిశ చట్టంపై ఒడిశా, ఢిల్లీ ఆసక్తి : స్పీకర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం సమావేశాలు ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాం దిశ చట్టాన్ని అమోదించిన సభకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. దిశ చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం తమను కోరినట్లు స్పీకర్ తెలిపారు. చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తామని ఆ ప్రభుత్వం చెప్పినట్టు సభలో వెల్లడించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా చట్టం గురించి తమను సంప్రదించిందని స్పీకర్ తెలిపారు. దిశ చట్టం ఆమోదించడం అసెంబ్లీకి గర్వకారణమన్నారు. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. అనంతరం చట్టంపై పలువురు సభ్యులు ప్రసంగించారు. మహిళలకు భద్రత కల్పించేందుకు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌హన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. -
ఇంట్లో భర్త.. వీధిలో ప్రియుడు
భువనేశ్వర్: ఓ ఇల్లాలి వివాహేతర సంబంధం గట్టురట్టయింది. ప్రియుడితో ఉడాయిస్తుండగా పట్టుబడింది. తాళి కట్టిన భర్తను మోసం చేసి ప్రియుడితో పారిపోతుండగా పట్టుబడడంతో మెట్టినింటి గ్రామస్తులు ఆ ఇల్లాలిని అదుపులోకి తీసుకుని తగిన శాస్తి చేశారు. సామాజిక, వైవాహిక విలువల్ని కాలరాసి పారిపోవడం పట్ల గ్రామస్తులంతా ఉమ్మడిగా వ్యతిరేకించారు. ప్రియుడితో చిక్కిన ఇల్లాలిని అదుపులోకి తీసుకుని కాళ్లు, చేతులు కట్టి పడేశారు. ప్రియుడి కుటుంబికుల్ని రప్పించి వ్యవహారం బట్టబయలు చేశారు. ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లా రౌర్కెలా బ్రాహ్మణి తరంగ్ పోలీసు స్టేషన్ పరిధి మండియాకుదర్ గ్రామంలో ఈ సంఘటన సోమవారం జరిగింది. జిల్లాలోని లఠికొటా పంచాయతీ ముండాఝొరొ గ్రామస్తురాలితో మండియాకుదర్ గ్రామస్తుడికి ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. పెళ్లికి ముందు బిర్సా స్టేషన్ పరిధిలోని చిరుబెడా గ్రామస్తుడు పురాణ్ సింగ్‌తో ఆమెకి ప్రేమ వ్యవహారం సాగింది. తాళి కట్టిన భర్తతో కాపురం చేస్తూ ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించడంతో భర్తకు అనుమానం కలగడంతో వారి దాంపత్యంలో అలజడి రేగింది. మెట్టినింటిలో వేధింపులు తాళలేని పరిస్థితి తారసపడడంతో ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఆ ఇల్లాలు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రియుడు పురాణ్ సింగ్‌తో ఇల్లాలు లేచిపోతుండగా ఓరాం గ్రామస్తులకు పట్టుబడింది. బస్టాండ్‌లో వారిద్దరినీ గ్రామస్తులు పట్టుకున్నారు. ఆమెను తీసుకుపోతున్న ప్రియుడు పురాణ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రేమికుల్ని బంధించారు. వారి కాళ్లూచేతులు కట్టి పడేశారు. ప్రియుడు పురాణ్ సింగ్ కుటుంబీకులకు కబురు చేశారు. ఘటనా స్థలానికి కుటుంబీకులు చేరడంతో గ్రామస్తులంతా కలిసి చర్చించి ఓ తీర్మానం ఖరారు చేశారు. పెళ్లి ఖర్చుల్ని పరిహారంగా చెల్లించి వివాహితను పురాణ్ సింగ్‌తో తీసుకుపొమ్మని తీర్మానించారు. పెళ్లి ఖర్చుల కింద రూ.1 లక్ష 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్పట్ల ప్రియుడి కుటుంబీకులు అంగీకరించారు. తక్షణమే రూ.50 వేలు చెల్లించి మిగిలిన సొమ్ము త్వరలో చెల్లిస్తామని అభ్యర్థించడంతో ప్రేమికుల్ని గ్రామస్తులు విడుదల చేశారు. ప్రాణ భయం ఈ వ్యవహారం అంతటినీ గ్రామస్తులు రికార్డు చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేశారు. తాళి కట్టిన భర్త కుటుంబీకులకు ఒప్పందం మేరకు పెళ్లి ఖర్చుల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తమకు ప్రాణ భయం ఉందన్న ఆందోళనతో ప్రియుడు, ఇల్లాలు రౌర్కెలా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆశ్రయించారు. -
పరువు కోసం.. భర్తకు పెళ్లి చేసిన భార్య
భువనేశ్వర్: భర్తకు భార్య స్వయంగా పెళ్లి చేసిన అరుదైన ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో శనివారం చోటుచేసుకుంది. కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసీకి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే అమ్మాయితో వివాహం జరిగింది. భర్త రోజువారీ కూలీ పనుల నిమిత్తం కొంతమంది కార్మికులతో కలిసి గ్రామం సహా గ్రామ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఐత మడకామి అనే మహిళతో రామ కావసీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి, అనంతరం అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా ఉండగా, ఉదయం తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా రామ కావసీని ఐత మడకామి అడిగింది. పెళ్లి చేసుకోకపోతే తనను మోసం చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. తనకు పెళ్లి అయిందని, ఇప్పటిలో పెళ్లి చేసుకోలేనని రామ కావసీ తెగేసి చెప్పడంతో తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని మత్తిలి పోలీస్‌స్టేషన్‌లో ప్రియుడు రామ కావసీపై ఐత మడకామి కేసు పెట్టింది. ఇదే విషయం తెలుసుకున్న రామ కావసీ భార్య గాయత్రీ తన భర్త జైలు పాలైతే తన కుటుంబం వీధి పాలవుతుందని విచారించింది. ఇద్దరికీ పెళ్లి చేస్తే తన భర్త ఊరిలోనే ఉంటాడు కదా అని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా తన అత్తమామలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరినీ ఒప్పించింది. ఊరిలోని సిద్ధిఈశ్వర్ మందిరానికి వారిని తీసుకువెళ్లి పూజారి సమక్షంలో గ్రామస్తుల మధ్య వారిద్దరినీ అగ్నిసాక్షిగా ఒక్కటి చేసింది. ఇకనుంచి ఎటువంటి గొడవలు లేకుండా ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటామని వారు చెప్పడంతో గ్రామస్తులంతా సంతోషించారు. ప్రస్తుతం ఐత మడకామి రామ కావసీపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
తీరం దాటిన బుల్బుల్ తుపాను
-
ఇంకా వణికిస్తున్న బుల్బుల్
సాక్షి, న్యూఢిల్లీ: బుల్బుల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటినా బుల్బుల్... పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను వణికిస్తోంది హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుల్బుల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో ఏడుగురు మృతి చెందారు. శనివారం రాత్రి తీరం దాటిన సమయం నుంచి ఆదివారం ఉదయం వరకూ తీవ్రగాలులు, వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా కరెంటు తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ధాటికి 24 పరగణాస్, తూర్పు మిద్నాపూర్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇక ఉత్తర 24 పరగణాలు జిల్లా కకావికలమైంది. కోల్‌కతాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అనేక చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోని దిగి సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు తీర ప్రాంతాల నుంచి దాదాపు లక్షా 20వేలమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలోని కంట్రోల్ రూమ్ నుంచి బుల్బుల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తుపానుపై సీఎం మమతా బెనర్జీతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాను పరిస్థితిని సమీక్షించానని మోదీ ట్వీట్ చేశారు. సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
నా తండ్రి సమాధిని తొలగించండి: సీఎం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ సమాధిని తొలగించాని నిర్ణయించారు. సీఎం నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలోనే ఆదేశాలను జారీ చేశారు. బిజూ పట్నాయక్ సమాధి సహా, ఆయన జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసిన స్మారక కేంద్రాన్ని కూడా తొలగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పూరి పుణ్యక్షేత్రంలో బిజూ పట్నాయక్ సమాధి ఉంది. స్వర్గద్వార్ అనే పేరుతో బిజూ స్మారక కేంద్రం, శ్మశాన వాటికను అక్కడ ఏర్పాటు చేశారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలంటూ గత కొంత కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బిజూ పట్నాయక్ సమాధి ఉండటం వల్ల దాన్ని తొలగించడం అసాధ్యమని, శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం దాదాపు అసాధ్యమంటూ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశమైన సీఎం.. సమస్య పరిష్కారం కోసం ఏమైనా చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తన తండ్రి సమాధిని, స్మారక కేంద్రాన్ని తొలగించాలని ఆదేశించారు. పట్నాయక్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
పాఠశాలలో ప్రిన్సిపాల్ రాసలీలలు.. దేహశుద్ది
భువనేశ్వర్: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే తప్పటడుగులు వేస్తున్నారు. సరస్వతి నిలయంలాంటి పాఠశాలలను బూతు కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తున్నారు. స్కూల్లో పనిచేస్తున్న సహచర ఉద్యోగినితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఓ ప్రిన్సిపాల్‌కి విద్యార్థులు దేహశుద్ది చేశారు. వివరాలు.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా హసన్పూర్ గ్రామంలోని రెసిడెన్సియల్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్ లోచన్.. సహ ఉద్యోగి సబితా బిస్వాల్‌తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం నేరుపుతున్నాడు. అంతటితో ఆగకుండా పాఠశాల ఆవరణలోనే ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఒకసారి హెచ్చరించి వెళ్లారు. అయినప్పటికీ వారు బుద్ధి మార్చుకోకపోవడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పాఠశాల వాతావరణాన్ని చెడగొడుతున్న వారిద్దరినీ సస్పెండ్ చేయాలంటూ తొలుత విద్యార్థులు ఆందోళకు దిగారు. ఈ సమయంలోనే గ్రామస్థులంతా అక్కడికి చేరుకోవడంతో రాజీవ్‌పైకి దాడికి దిగారు. అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి వ్యవహారంపై విచారణ జరపుతున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్, పలు రైళ్లు రద్దు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర సరిహద్దుల్లో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా దోయికళ్ళు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎగువ ఒడిశాలో కురిసిన భారీవర్షాలతో వరద నీటికి పట్టాలు ధ్వంసం అవ్వడం వల్ల ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పలు రైళ్ల రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఎనిమిది రైళ్లు రద్దు కాగా మరో ఐదు రైళ్లను దారిమళ్లిస్తూ అధికారులు ప్రకటించారు. రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. రద్దయిన రైళ్లు వివరాలు : 1) సంబల్పూర్- కొరపుట్ ప్యాసింజర్ 2) కొరపుట్-సంబల్పూర్ ప్యాసింజర్ 3) సంబల్పూర్-జనఘర్ రోడ్ ప్యాసింజర్ 4) జనఘర్-సంబల్పూర్ ప్యాసింజర్ 5)రాజఘన్పూర్-విశాఖ ప్యాసింజర్ 6)విశాఖ-రాజఘన్పూర్ ప్యాసింజర్ 7)సంబల్పూర్-రాయగడ ఎక్స్‌ప్రెస్ 8) రాయగడ-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన రైళ్ల వివరాలు : 1) పూరి _అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ 2)అహ్మదాబాద్ -పూరి ఎక్స్‌ప్రెస్ 3)బెంగళూరు-హతియా ఎక్స్‌ప్రెస్ 4) ధనబాద్-అలప్పి ఎక్స్‌ప్రెస్ 5) విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ వీటితోపాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. -
గాంధీ, గాడ్సేపై సభలో దుమారం
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీ శాసనసభ్యుల మధ్య మహాత్మా గాంధీ, నాథూరాం గాడ్సే విషయంలో మాటల యుద్ధం సాగింది. శనివారం శాసనసభలో చర్చలో భాగంగా కాంగ్రెస్ పక్షనేత నరసింహా మిత్ర మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, గాంధీని హత్య చేసిన గాడ్సేను ఆర్ఎస్ఎస్ సభ్యులు గౌరవిస్తున్నారని మండిపడ్డారు. దేశ సమగ్రతపై ఆర్ఎస్ఎస్కు గౌరవం ఉంటే నాగపూర్‌లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయంపై జాతీయ జెండాను ఎందుకు ఎగరవేయడంలేదని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించి బీజేపీ పక్షనేత ప్రధిపాట్ కుమార్ నాయక్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు అసలు దేశ భక్తి లేనేలేదని విమర్శించారు. వందేమాతరం అనడానికి ఆసక్తి చూపరని, రాజ్యాంగంపై కనీసం గౌరవం కూడా వారికి లేదని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై జాతీయ జెండా లేనంతమాత్రనా దేశ భక్తిలేదని అర్థంకాదని వివరించారు. జాతీయ పతాకాన్నితాము తల్లితో సమానంగా భావిస్తామన్నారు. ఇద్దరి వ్యాఖ్యలతో అసెంబ్లీ దద్దరిల్లింది. కాసేపటి తరువాత సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. -
జన జగన్నాథుని రథయాత్ర
భగవంతుడు భక్తుల నడుమకు వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకొనే అరుదైన అపురూపమైన వేడుక రథయాత్ర. ఏడాది పొడవునా గర్భాలయంలో కొలువుండే జగన్నాథుడు ఏడాదికోసారి సోదరీ సోదరులైన సుభద్ర, బలభద్రులతో కలసి రథాలను అధిరోహించి, జనం మధ్యకు వచ్చి జరుపుకొనే అపురూపమైన వేడుక రథయాత్ర. జగన్నాథుడు కొలువుతీరిన పూరీ క్షేత్రంలో రథయాత్ర వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఒడిశాలోని పూరీ పట్టణంలో జరిగే రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత భారీస్థాయిలో జరిగే రథయాత్ర జగన్నాథునిదే. అక్షయ తృతీయ నాటితో నాంది జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుక్ల విదియ రోజున జరుగుతుంది. అయితే, రథయాత్ర వేడుక కోసం సన్నాహాలు మాత్రం వైశాఖ శుక్ల తదియ నాడు జరిగే అక్షయ తృతీయ పర్వదినం నుంచే మొదలవుతాయి. వేసవి తీవ్రత మొదలవడంతో విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు. దీనినే ‘గంధలేపన యాత్ర’ అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోజున పూరీ క్షేత్రంలో రథాల తయారీ మొదలవుతుంది. పూరీ రాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాల తయారీ కొనసాగుతుంది. అక్షయ తృతీయ నాటి నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. చందనయాత్ర 42 రోజుల పాటు కొనసాగుతుంది. అక్షయ తృతీయనాడు మొదలయ్యే చందనయాత్రను రథయాత్ర వేడుకలకు నాందీ ప్రస్తావనగా చెప్పుకోవచ్చు. చందనయాత్ర ప్రథమార్ధాన్ని ‘బాహొరొ చందనయాత్ర’ (బహిర్ చందనయాత్ర) అంటారు. ఇది అక్షయ తృతీయ మొదలుకొని 21 రోజులు కొనసాగుతుంది. బహిర్ చందనయాత్రలో మదనమోహనుడైన జగన్నాథుడిని శ్రీదేవి భూదేవీ సమేతంగా పూరీ ఆలయ సింహద్వారం నుంచి ఊరేగింపుగా బయటకు తీసుకొచ్చి నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్రలో బయటకు తీసుకొచ్చేవి ఉత్సవ విగ్రహాలు మాత్రమే. శ్రీదేవీ భూదేవీ సమేతుడైన మదనమోహనుడితో పాటు రామ కృష్ణులను, నంద భద్ర అనే వారి ధనుస్సులను, పంచపాండవుల స్వరూపాలుగా భావించే ఐదు శివలింగాలను కూడా నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్ర ద్వితీయార్ధాన్ని ‘భితొరొ చందనయాత్ర’ (అంతర్ చందనయాత్ర) అంటారు. ద్వితీయార్ధంలోని 21 రోజుల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే– అమావాస్య, షష్టి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయం లోపలే వేడుకలను నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ‘స్నానయాత్ర’తో చందనయాత్ర వేడుకలు పూర్తవుతాయి. జ్యేష్ఠపౌర్ణమి నాడు ఆలయ పూజారులు మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకను నిర్వహిస్తారు. అందుకే జ్యేష్ఠపౌర్ణమిని ‘స్నానపూర్ణిమ’గా వ్యవహరిస్తారు. జగన్నాథుని అభిషేకించడానికి ఆలయంలోని ‘సునా కువొ’ (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత్ర జలాలను వినియోగిస్తారు. జగన్నాథునికీ తప్పని జ్వరబాధ స్నానపూర్ణిమలో ఏకంగా 108 కుండల నీటిలో జలకాలాడిన జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఆనాటి నుంచి రెండువారాల పాటు పూరీ ఆలయంలో భక్తులకు మూలవిరాట్టుల దర్శనం ఉండదు. మూలవిరాట్టుల స్థానంలో సంప్రదాయక ‘పొటొచిత్రొ’ పద్ధతిలో పెద్దవస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపాలనే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండువారాల కాలంలో జగన్నాథుని మూలవిరాట్టుకు ఛప్పన్న (యాభై ఆరు) భోగాల నైవేద్యం కూడా నిలిచిపోతుంది. జ్వరపీడితుడైన జగన్నాథునికి ఔషధ మూలికలు, ఆకులు, కషాయాలు, కొన్ని పండ్లను మాత్రమే దైతాపతులు సమర్పిస్తారు. జగన్నాథుని తొలుత ఆరాధించిన గిరిజన రాజు విశ్వవసు కూతురు లలిత, బ్రాహ్మణ పూజారి విద్యాపతిల వారసులే దైతాపతులు. జగన్నాథుని ఆరాధనలో వీరికి విశేష అధికారాలు ఉంటాయి. జ్వరపీడితుడైన జగన్నాథునికి పథ్యపానాలు సమర్పించే ప్రత్యేక అధికారం ఈ దైతాపతులకు మాత్రమే పరిమితం. రథయాత్ర వేడుకలు ముగిసేంత వరకు వీరి ఆధ్వర్యంలోనే జగన్నాథుని పూజాదికాలు జరుగుతాయి. జగన్నాథునికి జ్వరం తగ్గేలోగా రథాల తయారీ, వాటి అలంకరణ పూర్తవుతుంది. స్థలపురాణం పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. గిరిజన రాజు విశ్వవసు నీలమాధవుడిని తొలుత ఆరాధించాడని చెబుతారు. నీలమాధవుని విగ్రహం నీలమణితో తయారై ఉండేదని, అది కాలగర్భంలో కలసిపోయిన కొన్నాళ్లకు ఇంద్రద్యుమ్నుడనే రాజు తనకు కలలో కనిపించిన దారువును (కొయ్యదుంగ) విగ్రహాలుగా తయారు చేయించాలని సంకల్పించి, ఈ పని కోసం ఒక వృద్ధ శిల్పిని నియమించాడు. దారువుతో శిల్పాలను మలచేందుకు అంగీకరించిన వృద్ధ శిల్పి రాజుకు ఒక షరతు విధించాడు. తనకు ప్రత్యేకంగా ఒక గదిని ఇవ్వాలని, పని పూర్తయ్యేంత వరకు తనను ఎవరూ కదిలించరాదని చెప్పాడు. రాజు అంగీకరించాడు. ఎన్నాళ్లయినా, శిల్పి ఉన్న గది తలుపులు తెరుచుకోక పోవడం, కనీసం శిల్పాలు చెక్కుతున్న అలికిడైనా వినిపించకపోవడంతో వృద్ధుడైన శిల్పికి ఏమైనా జరిగి ఉండవచ్చని కీడు శంకించిన రాజు గది తలుపులు తెరిచాడు. మొండెం వరకు మాత్రమే చెక్కిన శిల్పాలు అక్కడలా ఉండగానే, శిల్పి అంతర్ధానమయ్యాడు. రాజు తన పొరపాటుకు దుఃఖించగా, జగన్నాథుడు ప్రత్యక్షమై, ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించమని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు వాటిని అలాగే ప్రతిష్ఠించి, పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాతి కాలంలో ముగ్ధమనోహరమైన ఈ దారు విగ్రహమూర్తులను ఆదిశంకరాచార్యలు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు దర్శించుకుని, పూజలు జరిపారు. పూరీక్షేత్రంలో వారి వారి పీఠాలను, మఠాలను కూడా ఏర్పాటు చేసుకుని మరీ జగన్నాథుని సేవించి, తరించారు. ఆదిశంకరాచార్యులు జగన్నాథుని స్తుతిస్తూ జగన్నాథ అష్టకాన్ని రచించారు. ప్రస్తుతం పూరీలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని పదో శతాబ్దికి చెందిన తూర్పు గంగవంశపు రాజులు నిర్మించారు. అనంతవర్మ చోడగంగదేవ్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ప్రారంభమైంది. గుండిచా మందిరం రథయాత్రలో రాజు కూడా సామాన్యుడే రథయాత్ర నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను రథాలపైకి ఎక్కిస్తారు. విగ్రహాలను రథాలపైకి చేర్చే ముందు పూరీ రాజు సామాన్య సేవకుడిలా చీపురు పట్టి, రథాలను శుభ్రం చేస్తారు. రాజు శుభ్రం చేసి వచ్చిన తర్వాత మూడు విగ్రహాలనూ మూడు రథాలపైకి చేరుస్తారు. ఈ తతంగాన్ని ‘పొహాండి’ అంటారు. పూజారుల మంత్రాలు, మేళతాళాల నడుమ విగ్రహాలు రథాలపైకి చేరుకున్న తర్వాత పెద్దసంఖ్యలో భక్తులు వాటికి కట్టిన తాళ్లను పట్టుకుని రథాలను ముందుకు లాగుతారు. పూరీ జగన్నాథ ఆలయం ఎదుట ఉండే ‘బొడొదండొ’ (పెద్దవీధి) మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకు రథయాత్ర సాగుతుంది. జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత వంటి ప్రాచీన పురాణగ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. తిరుగు రథయాత్ర మూడు రథాలూ ‘గుండిచా’ మందిరం వద్దకు చేరుకున్నాక, జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఆ మందిరంలో ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువుదీరుస్తారు. ‘గుండిచా’ మందిరంలో జగన్నాథుడు దశావతారాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. తోటలో వెలసిన ‘గుండిచా’ మందిరాన్ని జగన్నాథుని ‘వేసవి తోట విడిది’గా పరిగణిస్తారు. జగన్నాథుడు కొలువు తీరిన తొమ్మిదిరోజుల రథయాత్ర వేడుక సమయంలోనే ‘గుండిచా’ మందిరం భక్తులతో కళకళలాడుతుంది. ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఇది ఖాళీగా ఉంటుంది. రథయాత్ర మొదలైన ఐదో రోజున గుండిచా మందిరంలో ‘హీరా పంచమి’ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆరోజు జగన్నాథుడు నరసింహావతారంలో దర్శనమిస్తాడు. గుండిచాలో జరిగే వేడుకల్లో ఇది చాలా ప్రధానమైన వేడుక. జగన్నాథుని ప్రధాన ఆలయంలోనికి విదేశీయులను అనుమతించరు. రథయాత్ర వేడుకల్లోను, గుండిచా మందిరంలో కొలువుండే సమయంలోను విదేశీయులను కూడా జగన్నాథుని దర్శనానికి అనుమతిస్తారు. ఆషాఢ శుద్ధ దశమి నాడు గుండిచా మందిరం నుంచి ‘తిరుగు రథయాత్ర’ ప్రారంభమవుతుంది. దీనినే ‘బాహుడా’ అంటారు. మార్గమధ్యంలోని ‘అర్ధాసిని’ (మౌసి మా–పినతల్లి) మందిరం వద్ద ఆగి, అక్కడ నివేదించే మిఠాయిలను జగన్నాథుడు ఆరగిస్తాడు. ‘బాహుడా’ మరుసటి రోజున ఏకాదశి నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు స్వర్ణాలంకారాలతో రథాలపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వం చేస్తారు. దీనినే ‘సునాబేసొ’ (స్వర్ణ వేషధారణ) అంటారు. స్వర్ణవేషధారణలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు చతుర్భుజాలతో, పాదాలతో పరిపూర్ణంగా దర్శనమిస్తారు. ‘మౌసి మా’ మందిరం వద్ద విరామం తర్వాత రథాలు తిరిగి ప్రధాన ఆలయం వైపు ముందుకు సాగుతాయి. చతుర్దశి ఘడియల్లో రాత్రివేళ జగన్నాథుని ఆలయ ప్రవేశ ఉత్సవం జరుగుతుంది. తనను తీసుకుపోకుండా సోదరీ సోదరులతో కలసి రథాలపై ఊరేగి తిరిగి వచ్చిన జగన్నాథునిపై లక్ష్మీదేవి అలకబూనడం, రసగుల్లాలు ఇచ్చి జగన్నాథుడు ఆమెను ప్రసన్నం చేసుకోవడం వంటి వినోదభరితమైన ఘట్టాలను పూజారులు నిర్వహిస్తారు. దాదాపు పక్షంరోజుల పాటు జగన్నాథుడు లేక చిన్నబోయిన పూరీ శ్రీక్షేత్రంలో ఆషాఢ పూర్ణిమ నాటి నుంచి యథాప్రకారం భక్తుల కోలాహలం మొదలవుతుంది. మూడు రథాల విశేషాలు చాలా పుణ్యక్షేత్రాల్లోని మూలవిరాట్టు విగ్రహాలన్నీ శిలా విగ్రహాలు. పూరీక్షేత్రంలోనివి మాత్రం దారు విగ్రహాలు. రథయాత్రలో వీటిని ఊరేగించే మూడు రథాలను కూడా కలపతోనే తయారు చేస్తారు. మూడు రథాలకు నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. శిల్పులు శాస్త్రప్రామాణికంగా ఈ మూడు రథాలను తయారు చేస్తారు. జగన్నాథుని రథం పేరు ‘నందిఘోష్’, బలభద్రుని రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. వీటిలో జగన్నాథుని రథం ‘నందిఘోష్’ అన్నింటి కంటే పెద్దగా ఉంటుంది. నందిఘోష్కు 16 చక్రాలు ఉంటాయి. దీని ఎత్తు 44.2 అడుగులు, పొడవు 34.6 అడుగులు, వెడల్పు 34.6 అడుగులు. దీని తయారీకి చిన్నా పెద్దా కలుపుకొని 832 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, పసుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘నందిఘోష్’ కావలి దైవం గరుత్మంతుడు, సారథి దారుకుడు. పతాకంపై కొలువుదీరే దైవం ‘త్రైలోక్యమోహిని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: శంఖ, బలాహక, శ్వేత, హరిదాశ్వాలు, ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన శంఖచూడునిగా భావిస్తారు. బలభద్రుని రథం ‘తాళధ్వజ’ను 14 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 43.3 అడుగులు, పొడవు 33 అడుగులు, వెడల్పు 33 అడుగులు. దీని తయారీకి 763 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, నీలం ఆకుపచ్చ కలగలసిన రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘తాళధ్వజ’ కావలి దైవం వాసుదేవుడు. సారథి మాతలి. పతాక దైవం ‘ఉన్నని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనాభ. ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన వాసుకిగా భావిస్తారు. సుభద్ర రథం ‘దర్పదళన్’ను 12 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 42.3 అడుగులు, పొడవు 31.6 అడుగులు, వెడల్పు 31.6 అడుగులు. దీని తయారీకి 593 కలప ముక్కలను ఉపయోగిస్తారు. ఈ రథాన్ని ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘దర్పదళన్’ కావలి దైవం జయదుర్గ. సారథి అర్జునుడు. పతాక దైవం నాదాంబిక. ప్రతీకాత్మకంగా దీనికి పూన్చిన అశ్వాలు: రోచిక, మోహిక, జిత, అపరాజిత. దీనికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన స్వర్ణచూడునిగా భావిస్తారు. ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనాతీతం. పూరీ ఆలయంలోని నైవేద్యాలను సిద్ధం చేసే భోగమంటపం (వంటశాల) ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. జగన్నాథునికి నివేదన పూర్తయిన తర్వాత క్షేత్రపాలిక అయిన విమలాదేవికి నివేదించి, ఆ ప్రసాదాలను ఆలయ ఈశాన్యభాగాన ఉండే ‘ఆనంద బజార్’లో భక్తులకు విక్రయిస్తారు. ప్రసాదాలను వండటానికి ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలనే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యిలపై వండుతారు. భోగ మంటపానికి చేరువలోని ‘గంగ’, ‘యమున’ అనే రెండు బావుల్లోని నీటిని మాత్రమే వంటకాలకు ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఏకకాలంలో యాభైవేల మందికి సరిపోయేలా ఇక్కడ ప్రసాదాలను తయారు చేస్తారు. పర్వదినాల్లోనైతే లక్షమందికి సరిపోయేలా తయారు చేస్తారు. ఏకకాలంలో లక్షమంది కూర్చుని భోజనం చేయగలిగేంత విశాలమైన భోజనశాల ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథునికి నివేదించే ప్రసాదాలను ‘మహాప్రసాదం’గా పరిగణిస్తారు. మహాప్రసాదాన్ని ఆరగిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పూరీలో నివేదించే ఛప్పన్న భోగాలేమిటంటే... 1. అన్నం 2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ 8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు) 9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు) 39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు) 40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం) 51. పొటొలొ రొసా (పొటల్స్/పర్వల్ కూర) 52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర) 53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం) పూరీ ఆలయ విశేషాలు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో నూట ఇరవై ఉపాలయాలు ఉంటాయి. ఆలయ శిఖరంపై అల్లంత దూరం నుంచే కనిపించే అష్టధాతు సుదర్శనచక్రాన్ని జగన్నాథుని ప్రతిరూపంగా భావిస్తారు. దీనినే ‘నీలచక్రం’ అని, ‘పతితపావన’ అని కూడా అంటారు. దూరం నుంచి ఇది నీలికాంతులతో కనిపిస్తుంది. ఆలయ శిఖరంపైనున్న ఈ సుదర్శన చక్రాన్ని తిలకించినంత మాత్రానే పాపాలను హరించి వేస్తుందని భక్తులు నమ్ముతారు. పూరీ ఆలయానికి తూర్పు వైపున సింహ ద్వారంతో పాటు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలలో మరో మూడు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. పూరీ జగన్నాథుని ఆలయం మీదుగా విమానాలు, పక్షులు ఎగురుతూ వెళ్లడం కనపించదు. ఇదొక అరుదైన విశేషం. సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వినిపించే సాగరఘోష ఆలయంలోకి అడుగుపెడుతూనే వినిపించడం మానేస్తుంది. ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించని విధంగా నాటి శిల్పులు దీనిని నిర్మించడం మరో విశేషం. ఎక్కడైనా సముద్రతీరం వద్ద సముద్రం మీదుగా నేలవైపు గాలులు వీస్తాయి. పూరీ తీరంలో మాత్రం సాయంత్రం వేళ పట్టణం మీదుగా గాలులు సముద్రం వైపు వీస్తాయి. పూరీ మహాప్రసాదం ప్రతిరోజూ ఒకే పద్ధతిలో, పరిమాణంలో తయారు చేస్తారు. పర్వదినాల్లో రెట్టింపు పరిమాణంలో చేస్తారు. వచ్చే భక్తుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నా, ఇంతవరకు అక్కడ తయారైన ప్రసాదం వృథా అయిన దాఖలాలు గాని, భక్తులకు చాలని సందర్భాలు గాని లేవు. -
జవాన్ మృతదేహంపై పార్టీ జెండా
భువనేశ్వర్: ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో అమరుడైన ఓ జవాన్ మృతదేహంపై రాజకీయ పార్టీకి చెందిన జెండాను ఉంచడం వివాదాస్పదంగా మారింది. ఒడిశాకు చెందిన అజిత్ సాహో అనే ఆర్మీ జవాన్ ఈనెల 12న కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతిచెందాడు. అయితే అంత్యక్రియల నిమిత్తం అతని మృతదేహాన్ని ఒడిశాలోని ఆయన స్వగృహానికి తరలించారు. అనంతరం అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ)కి చెందిన కొందరు నాయకులు వచ్చి మతదేహంపై వారి పార్టీ జెండాను కప్పి.. నివాళి అర్పించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంటనే దానిని తొలగించారు. ఈ ఘటపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ మృతదేహంపై పార్టీ జెండాను ఉంచి.. బీజేడీ తీవ్రంగా అవమానించిందని మండిపడింది. అమరుల త్యాగాలకు కించపరిచే విధంగా బీజేడీ ప్రవర్తించిందని విమర్శించింది. బీజేపీ వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర.. ఈ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. ఆ జెండాను ఎవరు కప్పారో కూడా తమకు నిజంగా తెలీదన్నారు. ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా జవాను సోదరుడు పరేశ్వరన్ మాట్లాడుతూ.. స్థానిక బీజేడీ నాయకులు వచ్చి పార్టీ జెండాను మృతదేహంపై కప్పి వెళ్లారని తెలిపారు. విషాదంలో ఉన్న తాము దీని గురించి పెద్దగా పట్టించుకోలేదన్నారు. పక్కవారు చెప్పడంతో వెంటనే జెండాను తొలగించామని, తమ సోదరుడు దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడని చెప్పుకొచ్చారు. -
మంత్రులు ప్రతినెలా రిపోర్టు చేయాల్సిందే..
భువనేశ్వర్: ఐదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతినెల అమలు చేసిన పథకాల గురించి తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రతినెల ఏడు తేదీన మంత్రులందరూ రిపోర్టు పత్రాలను సీఎంవో కార్యాలయానికి పంపాలన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన తొలి మంత్రిమండలి సమావేశంలో మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు (మేనిఫెస్టో)ను ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ నేతృత్వంలోని బీజూజనతాదళ్ అద్బుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే .రాష్ట్రంలోని 142 స్థానాలకు గాను 112 స్థానాలను గెలుపొంది.. వరుసగా ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయంలో ఆయనకెంతో దోహదం చేసిన సంక్షేమ పథకాలను పకడ్భందీగా అమలుచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను, అధికారులను నవీన్ ఆదేశించారు. -
వరుసగా ఐదోసారి సీఎంగా నవీన్..!
భువనేశ్వర్: ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతాదళ్ (బీజేడీ) రికార్డు విజయం దిశగా కొనసాగుతుంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేడీ 104 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 29, కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా వరుసగా ఐదోసారి బీజేడీ అధికారంలోకి రానుంది. దీంతో ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగినప్పటికీ ఒడిశాలో మాత్రం నవీన్ నాయకత్వాన్ని బీజేపీ ఢీకొనలేకపోయింది. లోక్‌సభ స్థానాల్లో కూడా బీజేడీ హవా కొనసొగుతోంది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలు గల ఒడిశాలో బీజేడీ 14, బీజేపీ 7 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా నవీన్ పట్నాయక్ నాయకత్వంలో నాలుగోసారి బీజేపీ అధికారంలోకి రానుంది. 2004లో 61, 2009లో 103, 2014లో 117 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూడా అదే ఊపును కొనసాగిస్తూ.. 100 స్థానాలకు పైగా విజయం సాధించే విధంగా బీజేడీ పయనిస్తోంది. -
ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి దుర్మరణం
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో జాతీయ రహదారి 26పై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫొనిపై ఒడిశా కీలక నిర్ణయం
భువనేశ్వర్: ఫొని తుపాను సృష్టించిన వినాశనం నుంచి ఒడిశా ఇప్పడిప్పుడే కోలుకుంటుంది. గత నెల ఫొని వినాశనానికి రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. తుపాను దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యవరణం తీవ్రంగా దెబ్బతిన్నది. అనేక వృక్షాలు నేలకొరిగాయి. ఫొని ధాటికి దాదాపు 20 లక్షలకు పైగా వృక్షాలు కుప్పకూలినట్లు కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయన్ వెంటనే నష్ట నివారణ చర్యలను చేపట్టారు. పర్యవరణ పరిరక్షణ నిమిత్తం ఐదేళ్ల కాలానికి ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఫొని కారణంగా నష్టపోయిన వృక్ష సంపదను తిరిగి సాధించేందుకు రూ.188ను కేటాయించారు. ఆ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని ఏర్పాటుచేయనున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటనున్నారు. ఫొను నష్టంపై శనివారం ఉన్నతాధికారులతో సమావేశమైన నవీన్ ఈ మేరకు అంచనాలను వేసి నష్టనివారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,780 హెక్టార్ల పంట నష్టం కూడా సంభవించింది. కాగా ఫొని తుపాను విరుచుకుపడినప్పుడు తన ప్రజలకు తక్షణ సహాయ సహకారాలను అందించడంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న చర్యలు యావద్దేశం ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే. -
ఏవోబీలో భారీ ఎన్కౌంటర్
సాక్షి, భువనేశ్వర్: ఆంధ్రా-ఒడిశా (ఏవోబీ) సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో హతమైన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ఘటనలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటువాకంటి గ్రామం వద్ద బుధవారం జరిగింది. దీంతో ఏజెన్సీలో గ్రామాలు ఉల్లిక్కిపడ్డాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో జరిపినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యంతో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, రెండు ఇన్సాస్ ఆయుధాలు, పెద్దమొత్తం వస్తువులులో స్వాధీనం చేసుకున్నారు. -
‘ఫొని’ ఎఫెక్ట్.. నీట్ వాయిదా
భువనేశ్వర్: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను తుపాను కారణంగా ఒడిశాలో వాయిదా పడింది. ఫొని సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు హైయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్.సుబ్రహ్మణ్యం శనివారం వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం మే 5న నీట్ పరీక్షను జరగనుంది. ఒడిశాలో ఈ పరీక్షను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో వివిధ వర్సిటీల పరిధిలో జరిగే పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు సైక్లోన్ ఫొని కారణంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో నీట్‌ను వాయిదా వేయాలంటూ పలవురు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీనిని పరిశీలించిన సంబంధిత శాఖ.. సహాయక చర్యలను, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. భీకర గాలులు, సైక్లోన్ ఫొని తూర్పు తీర రాష్ట్రాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. మందుస్తు హెచ్చరికలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. 220కి పైగా రైళ్ల రద్దు ఒడిశాలో ముందు జాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్‌కతా–చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లను శనివారం వరకు రద్దు చేసినట్లు ఈస్టుకోస్టు రైల్వే అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాళ్లలో ఆహార పదార్థాలు, తాగునీటిని సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల వరకు ఉద్యోగులు సెలవులు పెట్టొద్దని కోరింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేస్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
ఐదుగురిని తొక్కేసిన ఏనుగు..
భువనేశ్వర్: ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఐదుగురు వ్యక్తులను తొక్కి చంపింది. ఏనుగు దాడిలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృతిచెందారు. వీరిలో మహిళ, ఇద్దరు చిన్నారులున్నారు. ఒకే రాత్రి రెండు వేర్వేరు గ్రామాల్లో ఒకే ఏనుగు దాడికి పాల్పడింది. తాల్చేర్ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో గురువారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఢెంకానాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు నిద్రిస్తున్న వారిపై దాడి చేసింది. నిద్రలో ఉన్న నలుగురినీ తొక్కేసింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత సంత్ పద అనే గ్రామంలో 70 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి చంపింది. ఏనుగు దాడితో ఆ ప్రాంతంలోని ప్రజలంతా భయాందోళలను గురవుతున్నారు. దాడి విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అటవీ ప్రాంతానికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషీయా అందే విధంగా చూస్తామని అధికారులు తెలిపారు. -
తేలనున్న ప్రముఖుల భవితవ్యం..
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో పరిసమాప్తమైంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగనుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగనుంది. రేపు జరిగే ఎన్నికల్లో కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 15 కోట్లకు పైగా ఓటర్లు 1629 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మథుర: ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ నటి, హేమామాలిని పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మహేష్ పథాక్, ఆర్ఎల్డీ నుంచి నరేంద్ర సింగ్ కున్వర్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆర్ఎల్డీ అభ్యర్థి జయంత్ చౌదరీ విజయంపై హేమామాలిని సాధించారు. ఫతేపూర్‌సిక్రీ: కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ యూపీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పోటీలో నిలవగా, బీజేపీ నుంచి రాజ్ కుమార్ పోటీలో నిలిచారు. కన్యాకుమారి: (తమిళనాడు) దక్షిణ భారతంలో ప్రసిద్ధిగాంచిన కన్యాకుమారి లోక్‌సభ పోరు ఉత్కంఠ రేపుతోంది. పొత్తులో భాగంగా ఈస్థానాన్ని డీఎంకే కాంగ్రెస్‌కు కేటాయించగా, పోన్ రాధాకృష్ణ బీజేపీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వసంతకుమార్ బరిలో నిలిచారు. తుత్తుకుడి: తమిళనాడులో ఈ లోక్‌సభ స్థానం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే నుంచి మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఫైర్‌బ్రాండ్ సౌందరరాజన్ పోటీలో ఉన్నారు. డీఎంకే ఆస్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శివగంగా( తమిళనాడు): కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు, కార్తీ చిదంబరాన్ని కాంగ్రెస్ బరిలో నిలిపింది. హెచ్ రాజా బీజేపీ నుంచి పోటీపడుతున్నారు. లోకనాయకుడికీ అగ్నిపరీక్షే.. బహుభాషా నటునిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో కమల్ హాసన్. ఆయన నెలకొల్పిన మక్కళ్ నీధి మయ్యం పార్టీ తొలిసారిగా లోక్ సభ ఎన్నికలను రుచి చూస్తోంది. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయట్లేదు. అయినప్పటికీ.. తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. రెండో దశలో తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకూ పోలింగ్ జరుగనుంది. కమల్ హాసన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా తేలనుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినందున తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని కమల్ ఇదివరకే ప్రకటించారు. తుమకూరు, (కర్ణాటక): మాజీ ప్రధాని దేవెగౌడ ఆస్థానం నుంచి పోటీ చేస్తుడడంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. చివరి వరకు ఆయన పోటీకి నిరాకరించడంతో కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థిని సైతం ప్రకటించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ తూమకూరు నుంచి పోటీ చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. జీఎస్ దస్వరాజ్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే జేడీఎస్‌కు కంచుకోటైన మాండ్య నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ తొలిసారి పోటీ పడుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ప్రముఖ నటుడు అంభారిష్ మృతిలో ఆయన భార్య సుమలత స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాండ్య నుంచి నటి సుమలత, బెంగళూరు సెంట్రల్ నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ విషయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే- వారిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. సుమలతకు బీజేపీ మద్దతు ఇస్తుండగా.. ప్రకాష్ రాజ్ కు ఆమ్ఆద్మీ పార్టీ అండగా నిలిచింది. ఈ రెండు స్థానాల్లో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. దీనితోపాటు నిఖిల్ గౌడ కూడా నటుడే కావడంతో.. కర్ణాటక రాజకీయాలు సినీ గ్లామర్ ను సంతరించుకున్నాయి శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూర్ అబ్దుల్లా శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. పీడీపీ, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించాయి. వీటితో పాటు బెంగుళూర్ దక్షిణ, డార్జిలింగ్, రాణిగంజ్, మహారాష్ట్రలోని అమరావతి, అకోలా స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. అలాగే ఇప్పటికే వరుసగా ముడు సార్లు విజయాన్ని అందుకున్న బీజూ జనతాదళ్ నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 145 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో రెండో విడతలో 35 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. -
‘పాక్ ఇప్పటికీ శవాలు లెక్కపెట్టుకుంటోంది’
భువనేశ్వర్: బాలాకోట్ మెరుపు దాడులు జరిపి నెల రోజులు గడుస్తున్నప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాదుల శవాలను లెక్కబెట్టుకుంటోందని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు మాత్రం ఆధారాలు అడుగుతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శత్రువు ఇంటికెళ్లి అక్కడి ఉగ్రవాదులను ఏరేస్తే వీళ్లు ఆధారాలు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ శక్తి ప్రకటనను తప్పుబట్టడంపై కూడా మోదీ మండిపడ్డారు. ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవల ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపిన విషయం తెలిసిందే. దీని గురించి మోదీ ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శుక్రవారం ఒడిశాలో పర్యటించారు. ఇక్కడి కోరాపూట్ జిల్లాలోని జేపోర్‌లో బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ప్రజల మద్దతులోనే ఐదేళ్లకాలంలో తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం అంతరిక్షంలోనూ ఓ కాపాలాదారును పెట్టిందని అన్నారు. కేవలం నినాదాలకే పరిమితయ్యే వారికి ఓటు వెయ్యవద్దని.. దృఢమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వానికి మాత్రమే ఓటు వేయాలని ఓటర్లను కోరారు. భారత అంతరిక్ష ఘనతను తక్కువ చేసి మాట్లాడిన ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. మన సైనికులు, సైంటిస్టులను అవమానిస్తున్న ఇలాంటి వాళ్లు మనకు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. యాంటీ శాటిలైట్ టెక్నాలజీని విమర్శిస్తున్న వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. -
ఒడిశా సీఎం సంచలన నిర్ణయం
భువనేశ్వర్: సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశా ముఖ్యమంత్రి, బీజూజనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం కెండార్పర ఎన్నికల సభలో పాల్గొన్న నవీన్ పట్నాయక్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దీంతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. దీంతో 33శాతం ఎంపీ టికెట్లను మహిళకే కేటాయించనున్నారు. ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాల్లో ఏడు లేదా ఎనిమిది స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. కాగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా దశాబ్దాలుగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగనున్నాయి. -
‘పోలవరం’పై సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయసేకరణ జరిపించాలని సూచించింది. ప్రజాభిప్రాయసేకరణ విధివిధానాలను అఫిడవిట్లో పేర్కొనాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
మాజీ ఎంపీ హెలికాప్టర్ సీజ్..!
భువనేశ్వర్ : బీజూ జనతాదళ్ మాజీ ఎంపీ జే పాండా హెలికాప్టర్‌ను అధికారులు సీజ్ చేశారు. గగనతల నిబంధనలు ఉల్లఘించారన్న ఆరోపణలతో ఆయన హెలికాప్టర్‌ను మంగళవారం సీజ్ చేసినట్లు పూరి పోలీసులు వెల్లడించారు. భువనేశ్వర్ సమీపంలోని చిలికా సరస్సు వద్ద నిషేధిత వాతవరణ జోన్లో ఆయన చాపర్‌ను నడిపారని పోలీసులు తెలిపారు. చిలికా సరస్సు ప్రాంతంలో అతి తక్కువ ఎత్తులో హెలికాఫ్టర్ ప్రయాణించిందని ఫారెస్ట్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారించి సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చాపర్ సీజ్ చేయడంతో పాటు అతనిపై కేసు కూడా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా బీజూ జనతాదళ్‌కు చెందిన జే పాండా ఇటీవల పార్టీకి, ఎంపీ పదవికి రాజనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతున్నారంటూ పాండాను అంతకు ముందే పార్టీ నుంచి బహిష్కరించారు. -
అమిత్ షా పర్యటన.. టార్గెట్ 120 సీట్లు
భువనేశ్వర్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 147 స్థానాల్లో 120కి పైగా సీట్లు సాధించాలని ఒడిశా నాయకత్వాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఆదివారం ఒడిషాలో పర్యటించారు. స్థానిక నాయకత్వం భువనేశ్వర్‌లో నిర్వహించిన పలు రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జయల్ ఓరమ్, సీనియర్ నేతలు హరిచంద్రన్, కేవీ సింగ్ డీయోలతో సమావేశమయ్యారు. సీఎం నవీన్ పట్నాయక్‌ని ఓడించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. 18 ఏళ్ల బీజూ జనతాదళ్ (బీజేడీ) పాలనకి చరమగీతం పాడాలని, పట్నాయక్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగునున్నందున అమిత్ షా ఒడిశాపై ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండేళ్లలో ఎనిమిదోసారి రాష్ట్రంలో పర్యటించారు. ఒడిషాలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, అవీనితి రహిత పాలన పొందెందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కాగా ఒడిశాలో ప్రస్తుతం బీజేపీకి కేవలం 10 ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. -
‘ఏకకాలంలో ఎన్నికలు సరైనవే’
భువనేశ్వర్ : పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై గత కొంత కాలంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య చర్చలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీజూ జనతాదళ్ అధినేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తన మద్దతు తెలిపారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ మంచి నిర్ణయమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి తప్పనిసరని, ప్రజలకు సేవ చేయడానికే తాము ఎన్నికయ్యామని పేర్కొన్నారు. ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధికి ఆటకం కలుగుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై చర్చించేందుకు జాలై ఏడున ఢిల్లీ రావాల్సిందిగా సీఎం నవీన్ పట్నాయక్‌ను లా కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్ ఆహ్వానించారు. ఒడిషాలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు 2019లో ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. లా కమిషన్ ఆహ్వానం మేరకు బీజేడీ ఎంపీ పింకీ మిశ్రా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు బీజేడీ వర్గాలు వెల్లడించాయి. -
మోదీ వైఫల్యాలు.. యువకుడి పాదయాత్ర
భువనేశ్వర్: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాలకు వెంటనే అమలు చేయాలని కోరుతూ ఒడిశా యువకుడు ఏకంగా 1350 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాడు. కాలి నడకన ఢిల్లీ వెళ్లి మోదీని కలవడానికి బయలుదేరాడు. వృతిపరంగా విగ్రహాలు తయారు చేసే ముక్తికాంత్ బిస్వాల్(30) శనివారం జాతీయ జెండా చేతపట్టుకుని ఒడిశా నుంచి ఢిల్లీకు తన నడక ప్రారంభించారు. ఈ సందర్భంగా బిస్వాల్ మాట్లాడుతూ.. ‘2015లో మోదీ ఒడిశా పర్యటనకు వచ్చినప్పుడు రూర్కెలాలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, బ్రాహ్మిణి వంతెన పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. రూర్కెలా ప్రజలకు ప్రధాన ఆసుపత్రి అయిన ఇస్పత్ ఆసుపత్రిని పునరుద్దరిస్తామని కూడా హామీ ఇచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైనా హామీలను అమలు చేయలేదు. వైద్య సదుపాయం లేక ప్రజలు చనిపోతున్నారు. కాలినడకన 1350 కిలోమీటర్లు నడిచి ఢిల్లీలో మోదీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నా’నని అన్నారు. బిస్వాల్ పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని చేసిన వాగ్దానాలకు నెరవేర్చాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా శనివారం నడక ప్రారంభించిన బిస్వాల్ ఆగ్రా ప్రధాన రహదారిపై సొమ్మసిల్లి పడపోవడంతో స్థానికులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. -
అల్పపీడన ద్రోణితో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగడంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 8 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదు కాగా, ఘన్‌పూర్‌లో 6, కోటగిరి, మోర్తాడ్‌లో 5, బిక్నూరు, కమ్మర్పల్లి, మద్నూర్, మాచారెడ్డి, తల్లాడల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. -
రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు
సాక్షి,న్యూఢిల్లీ: ఒడిషా, మిజోరం రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఒడిషా గవర్నర్‌గా హర్యానా బీజేపీ చీఫ్ గణేష్ లాల్‌ను నియమితులైయ్యారు. ఒడిషా గవర్నర్ ఎస్.టీ జామీర్ మార్చితో పదవి గడవు ముగియడంతో బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అదనపు బాధ్యతులు నిర్వహిస్తున్నారు. గణేష్ లాల్‌ను ఒడిషా గవర్నర్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటించాయి. మిజోరం నూతన గవర్నర్‌గా కేరళ బీజేపీ చీఫ్ ప్రొఫెసర్ కుమ్మమానం రాజశేఖరన్ నియమితులైయ్యారు. మిజోరం గవర్నర్ నిర్బయ్ శర్మ పదవి కాలం మే 28తో ముగియనుండడంతో నూతన గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటించాయి. ప్రొఫెసర్ రాజశేఖరన్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2015లో కేరళ బీజేపీ చీఫ్‌గా నియమితులైయ్యారు. కాగా నూతన గవర్నర్లుగా నియమితులైన ఇద్దరూ ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. -
‘బీజేపీది మొసలి కన్నీరు’
భువనేశ్వర్ : రాష్ట్రానికి మహానదీ జలాల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపట్ల ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలో అధికార పక్షం బిజూ జనతా దళ్ మహానది సురక్షా యాత్రను బుధవారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఝార్సుగుడ జిల్లా లఖన్‌పూర్ సమితి సుఖొసొడా, బర్గడ్ జిల్లా చిఖిలి ప్రాంతాల నుంచి ఈ ఉద్యమాన్ని ఒకే రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ మహానది జలాల్ని న్యాయసమ్మతంగా సాధించేంత వరకు నిరవధికంగా ఉద్యమించాలని పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు. అన్యాయాలకు పాల్పడుతున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ వ్యవహారాలకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి బహిరంగ ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం, భారతీయ జనతా పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నాయి. వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో మహా నది నీటి మట్టం తగ్గిపోయి రాష్ట్ర రైతులు అల్లాడుతున్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలపట్ల భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా ఏమాత్రం అంకితభావం ఉన్నా మహానది ఎగువ భాగంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు నిర్మాణాలపట్ల బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సవాల్ విసిరారు. బ్యారేజీ నిర్మాణం..సమస్యను పరిష్కరిస్తుందని కొందరు బీజేపీ నాయకులు వక్కాణించడంపట్ల నవీన్ పట్నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణం నీటి నిల్వకు మాత్రమే దోహదపడుతుందన్నారు. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న నాయకులు ఇటువంటి వ్యాఖ్యల్ని చేసి పబ్బం గడపడం విచారకరమంటూ ఎద్దేవా చేశారు. మహానది రాష్ట్రానికి ప్రతీక ఝార్సుగుడ జిల్లాలో కార్యక్రమం ముగించుకుని మహానది ఆవలి తీరం బర్గడ్ జిల్లా అంబొభొణా సమితి చిఖిలి గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి మహా నది సురక్షా యాత్రను ప్రారంభించారు. ఏక కాలంలో మహా నది ఉభయ తీరాల్లో బిజూ జనతాదళ్ పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. మహానది రాష్ట్ర ప్రజల జీవన రేఖ. రాష్ట్ర సంస్కృతి, సామాజిక, ఆర్థిక రంగాలు ఈ నదీ తల్లి ప్రవాహంతో పెన వేసుకుపోయాయి. రాష్ట్ర ప్రతీక మహానది. ఈ నది సంరక్షణ మన కర్తవ్యంగా స్వీకరించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మహానది జలాల సంరక్షణ కోసం ఛత్తీస్‌గఢ్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బిజూ జనతా దళ్ అ«ధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. 15 రోజులు 15 జిల్లాలు మహానది జలాలపై న్యాయ సమ్మతమైన హక్కులు, అధికారాల పరిరక్షణ కోసం రాష్ట్రంలో బిజూ జనతా దళ్ మహానది సురక్షా యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర 15 రోజులపాటు నిరవధికంగా కొనసాగుతుంది. మహానది ఉభయ తీరాల్లోని 15 జిల్లాల్లో బీజేడీ కార్యకర్తలు నిత్యం పాదయాత్ర నిర్వహిస్తారు. ఝార్సుగుడ, బర్గడ్, సంబల్పూర్, సువర్ణపూర్, బౌధ్, అనుగుల్, ఢెంకనాల్, నయాగడ్, కటక్, ఖుర్దా, జాజ్‌పూర్, కేంద్రాపడ, పూరీ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో మహానది సురక్షా యాత్ర కొనసాగుతుంది. పాదయాత్రను పురస్కరించుకుని ఈ జిల్లాల్లో దారి పొడవునా చైతన్య సభలు, సమావేశాలతో సాయంత్రం వేళల్లో వీధి నాటకాలు ఇతరేతర సామాజిక స్పృహ కార్యక్రమాల్ని బిజూ జనతా దళ్ కార్యకర్తలు నిర్వహిస్తారు. మహానది తీరం ఇరువైపులా ప్రముఖ మందిరాల్లో సామూహిక దీపారాధన చేపడతారు. ఈ కార్యక్రమాల్లో కార్మిక శాఖ మంత్రి సుశాంత సింగ్, చేనేత, జౌళి, హస్త కళల శాఖ మంత్రి స్నేహాంగిని చురియా, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ప్రసన్న ఆచార్య ఇతరేతర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. -
55 రోజుల్లో.. 68 ప్రాణాలు
జిల్లా సరిహద్దులో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. అనుక్షణం యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. పోలీస్ కాల్పులు, మావోయిస్టు దాడులతో గిరిజనం ఆందోళనకు గురవుతోంది. గత 55 రోజుల్లో తడపలగుట్టల్లో 10మంది, గడ్చిరోలిలో 38 మంది మావోయిస్టులు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఇన్ఫార్మర్లు సహా మొత్తం 20 మందిని మావోయిస్టులు హతమార్చారు. సాక్షి, కొత్తగూడెం : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, నారాయణపూర్, గడ్చిరోలి జిల్లాల్లో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిత్యం పేలుళ్ల మోత, తుపాకీ తూటాల చప్పుళ్లతో సరిహద్దు గ్రామాల్లో దడ నెలకొంది. ఆయా రాష్ట్రాల్లోని అధికార బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన 55 రోజుల్లో ఏకంగా 68 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత మార్చి 2వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. తడపలగుట్ట ఎన్కౌంటర్ తరువాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన మావోయిస్టులు అప్పటినుంచి సరిహద్దుల్లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, నారాయణపూర్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో పలు విధ్వంస కార్యకలాపాలు, హత్యలకు పాల్పడుతున్నారు. భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, మొత్తం 20 మందిని హతమార్చారు. మావోయిస్టుల దాడి మృతుల్లో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు బీజాపూర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఒక సర్పంచ్, ఒక కాంట్రాక్టర్, ఒక ఇంజినీర్, ఒక మాజీ కానిస్టేబుల్, ఇద్దరు మాజీ మావోయిస్టులు ఉన్నారు. తాజాగా బుధవారం దంతెవాడ జిల్లా కొవ్వకొండ పరిధిలోని గర్మిరి గ్రామంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తుడిని హత్య చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఈనెల 25న నిరసనదినంగా చేపట్టాలని మావోయిస్టులు ఈ నెల 24న భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఆంజనేయపురం – చినముసిలేరు గ్రామాల మధ్య పోస్టర్లు, కరపత్రాలను వదిలిపెట్టారు. చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్లను విడుదల చేశారు. తాజాగా బుధవారం చర్ల మండలంలోని పెదమిడిసీలేరు వద్ద రోటింతవాగుపై ఉన్న వంతెనను మావోయిస్టులు పేల్చివేశారు. దండకారణ్యం దాటి వచ్చి మరీ ఈ విధ్వంసానికి మావోయిస్టులు పాల్పడ్డారు. భద్రాద్రి, జయశంకర్ జిల్లాల్లో కార్యకలాపాలు.. నోట్ల రద్దు కారణంగా దెబ్బతిన్న మావోయిస్టులు ఆర్థిక వనరులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రాంతం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండు జిల్లాల్లోని గుండాల, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, మహాముత్తారం మండలాల్లో గతంలో తమకు డెన్లుగా ఉన్న గ్రామాల్లో రిక్రూట్మెంట్ల ద్వారా పూర్వవైభవం సాధించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వలస గొత్తికోయల గ్రామాలను సైతం ఇందుకోసం ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. చాపకింద నీరులా తెలంగాణ జిల్లాల్లో విస్తరించేందుకు ఇటీవలే కమిటీలు సైతం వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మావోయిస్టులు పేలుడు పదార్థాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇక్కడి పోలీసుల తనిఖీల్లో పేలుడు పదార్థాలు పట్టుబడడం ఇందుకు నిదర్శనం. మరోవైపు 6 నెలలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల ద్వారా గోదావరి దాటి ఇతర జిలాల్లోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గత నెల 2న తడపలగుట్ట ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దీంతో అప్పటినుంచి సరిహద్దుల్లో నిత్యం యుద్ధ వాతావరణం నెలకొంది. సాధారణంగా భారీగా ఆకురాలే ఎండాకాలంలో మావోయిస్టులు తాము సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్ దండకారణ్యంలోని అబూజ్మడ్(షెల్టర్‌జోన్)కు వెళతారు. ఈసారి మాత్రం అనుకున్న సమయానికి మావోలు దండకారణ్యానికి చేరుకోలేకపోయారు. ఇప్పటికే సంఖ్యాబలం పరంగా, నోట్ల రద్దుతో ఆర్థికంగా బలహీనపడ్డారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కార్యకలాపాలు పెంచేందుకు ఐదు నెలలుగా రిక్రూట్మెంట్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్తగా తెలంగాణలోని ఏరియా, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్థిక వనరులు, పేలుడు సామగ్రి సమీకరించుకునేందుకు గోదావరి దాటి తెలంగాణలోని ఇతర జిల్లాల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎడతెగని పోరు సాగుతోంది. మావోయిస్టు దాడులు ఈనెల 20వ తేదీన సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మృతి చెందాడు. 16న ఫైదగూడ రోడ్డు నిర్మాణ పనుల ఇంజనీర్‌ను హత్యచేశారు. 15న సుక్మా జిల్లా చింతగుప్ప వద్ద ఐఈడీ పేల్చడంతో డీఆర్జీ జవాన్ గాయపడ్డాడు. 14న సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలోని ఫైదగూడ వద్ద రోడ్డు నిర్మాణంలో ఉన్న వాహనాన్ని తగులబెట్టారు. కార్మికులను కొట్టారు. అదే సీఆర్ఫీఎఫ్ క్యాంపులోని మూడు ఖాళీ బ్యారక్‌లను పేల్చివేశారు. 9న బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ పరిధిలోని కుట్రు మార్గంలో బస్సును పేల్చివేయడంతో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 8న సుకుమా జిల్లా బడేసుట్టి గ్రామ సర్పంచ్‌ను మావోయిస్టులు గొంతుకోసి హత్యచేశారు. రెండు మిక్సర్లను, నాలుగు వాహనాలను ధ్వంసం చేశారు. 7న బీజాపూర్ జిల్లా ఖేరామ్గఢ్ అటవీ శాఖ సిబ్బందిని చితకబాదారు. 5న చర్ల ఏరియా తిప్పాపురం–పామేడు గ్రామాల మధ్య పోలీసులే లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చడంతో స్థానిక గిరిజనుల పశువులు మృతిచెందాయి. మార్చి 28వ తేదీన పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పకు చెందిన ఇర్ప లక్ష్మణ్ అలియాస్ భరత్ అనే మాజీ మావోయిస్టును హతమార్చారు. మార్చి 28న బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ఊట్లపల్లి గ్రామానికి చెందిన సోడి అండాలు అనే మాజీ మావోయిస్టును హతమార్చారు. గత మార్చి 27న బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీష్ కొండెరను హత్య చేశారు. మార్చి 19న బీజాపూర్ జిల్లా నూకన్పాల్వద్ద రోడ్డుపనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ విశాల్‌కుమార్‌ను హతమార్చారు. మార్చి 13న సుకుమా జిల్లా కిష్టారం వద్ద శక్తిమంతమైన ఐఈడీ పేల్చడం ద్వారా 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. తెలంగాణలోకి మరింతగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించే మావోయిస్టులు పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు ముందు జనవరి 24న చర్ల మండలం క్రాంతిపురంలో ఒకరిని హత్యచేశారు. జనవరి 26వ తేదీన పినపాక మండలం జానంపేట సమీపంలోని ఉమేష్‌చంద్రనగర్‌లో మరొకరిని హత్యచేశారు. పోలీస్ కాల్పులు, అరెస్ట్‌లు : ఈ నెల 1న సుకుమాజిల్లా కిష్టారం వద్ద ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ దళాలు 12 మంది మావోయిస్టులను అరెస్టు చేశాయి. మార్చి 2న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
గురువు మృతికిపూర్వ విద్యార్థుల సంతాపం
కొరాపుట్: చిన్ననాటి గురువు మృతి పట్ల పూర్వ విద్యార్థులు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. కొరాపుట్ బ్లాక్‌లోని డుమురిపుట్ ఉన్నత పాఠశాలలో 1969 నుంచి 1994 వరకు ప్రధానోపా«ధ్యాయునిగా విధులు నిర్వహించిన పతితపావన మహాపాత్రో గత నెల 31న ఆయన స్వగ్రామం ఖుర్దా జిల్లా కైపొదర్‌లో మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకుని పూర్వవిద్యార్థులు దశాహం సందర్భంగా ఆదివారం సాయంత్రం డుమురిపుట్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మృతి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డుమురిపుట్ గ్రామ పెద్దలు నీలాంబర సాహు, రాధామోహన్ ఖిముండు, దీనబంధు బారిక్, దిలీప్ కుమార్ సామంతరాయ్, దేవీప్రసాద్ బిశ్వాల్, గోపీనాథ్ పాణిగ్రాహి, అలనాటి ఆయన శిశ్యులు తిరుమలేశ్వర్ చౌదరి, స్నిగ్ధరాణి మిశ్రా, సుబోధ్ కుమార్ చెటి జగదీస్ ఖోస్లా, ఎం.సురేష్‌కుమార్, తిరుపతి పాణిగ్రాహి, జితేంద్ర సాహు తదితర వందమంది పూర్వ విద్యార్థులు స్మృతి సమావేశంలో పాల్గొని తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమ గురువు నిలువెత్తు చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి పుష్పాలను సమర్పించి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనప్రార్థన చేశారు. ఆయన మూలంగా డుమురిపుట్ పరిసర గ్రామాల వందలాది మంది ఉత్తమ విద్యార్థులం కాగలిగామని, స్థానిక విద్యాభివృద్ధికి ఆయన సేవలు గణనీయమంటూ ఆయన వ్యక్తిత్వాన్ని పలువురు కొనియాడారు ఆయన కుటుంబ ఆర్థిక స్థోమత శోచనీయంగా ఉన్నందున పూర్వ విద్యార్థులందరు చిరు గురు దక్షిణగా ఆయన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని సమావేశంలో ప్రకటించి గురుభక్తికి ఆదర్శంగా నిలిచారు. -
మిడిల్ కొలాబ్‌తో నష్టమే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి సబ్ బేసిన్లో ప్రధాన ఉప నదిగా ఉన్న ఇంద్రావతి నీటిని ఆధారంగా చేసుకుని ఒడిశా రాష్ట్రం చేపట్టిన మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుతో దిగువ తెలంగాణ ప్రయోజనాలకు నష్టమేనని రాష్ట్ర ఇంజనీర్ల కమిటీ తేల్చింది. ఇంద్రావతికి అడ్డుకట్ట వేసి భారీ స్థాయిలో నీటిని వినియోగించుకుంటూ శబరి నదికి తరలించేలా మిడిల్ కొలాబ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించేందుకు ఒడిశా కసరత్తు చేస్తోందని, దీంతో భవిష్యత్తులో దిగువ ప్రాజెక్టులపై ప్రభావం కచ్చితంగా ఉంటుందని గుర్తించింది. దీనిపై త్వరలోనే కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు తమ అభిప్రాయాలతో నివేదికను సమర్పించనుంది. విద్యుదుత్పత్తి లక్ష్యంగా.. భారీ విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఎగువ నుంచి వచ్చే ఇంద్రావతి ఉప నది నీళ్లను జౌరా నాలా ద్వారా ఓ బ్యారేజీలోకి అక్కడి నుంచి పవర్‌హౌస్‌కు తిరిగి అక్కడి నుంచి మరో బ్యారేజీకి తరలించి ఆయకట్టుకు సైతం నీటిని అందించాలని నిర్ణయించింది. మొత్తంగా ఇక్కడ రోజుకు ఒక టీఎంసీ చొప్పున కనిష్టంగా 50 టీఎంసీల మేర వినియోగించుకునేలా ఎత్తులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఇటీవల గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం రాష్ట్ర వివరణ కోరింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులతో చర్చించి అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, కోటేశ్వర్రావు, ఉదయ్‌శంకర్‌తో కూడిన బృందాన్ని ఒడిశా పంపారు. ఈ బృందం రెండ్రోజుల పాటు మిడిల్ కొలాబ్ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం.. వాస్తవానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య 1975లో కుదిరిన ఒప్పందం మేరకు ఇంద్రావతి, కొలాబ్ నది కలిసే ప్రాంతంలో 75 శాతం డిపెండబులిటీ లెక్కన ఒడిశా 8.5 టీఎంసీల మేర వాడుకునే వెసులుబాటు ఉందని, అయితే ఒడిశా ప్రస్తుతం సుమారు 50 టీఎంసీల మేర నీటిని తరలించుకునేలా ప్రణాళికలు వేస్తోందని గుర్తించింది. భవిష్యత్తులో మరో 75 టీఎంసీల నుంచి 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశాలున్నాయని తెలిపింది. జలాలు వృథాగా సముద్రంలోకి ఇప్పటికే శబరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ప్రస్తుతం మిడిల్ కొలాబ్‌తో ఇంద్రావతి నీటిని శబరికి తరలిస్తే మరిన్ని జలాలు వృథాగా సముద్రంలో కలిసే అవకాశం ఉందని కమిటీ అంటోంది. దీనికి తోడు ఇంద్రావతి జలాలపై ఆధారపడిన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత తగ్గి మిడిల్ కొలాబ్‌తో ఇవన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉందని గుర్తించారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఒక సబ్ బేసిన్ పరిధిలో ఉండే రాష్ట్రాల అవసరాలు తీరాకే మరో సబ్ బేసిన్‌కు నీటిని తరలించాలని, అయితే ప్రస్తుతం దిగువ రాష్ట్రమైన తెలంగాణ అవసరాలను పణంగాపెట్టి ఇంద్రావతి నీటిని కొలాబ్ సబ్ బేసిన్‌కు తరలించేలా ఒడిశా ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికి, కేంద్రానికి నివేదిక ఇస్తామంటున్నాయి. -
కొఠియాలో వారపు సంత ప్రారంభం
సాలూరు రూరల్ : వివాదాస్పద ఆంధ్ర–ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల్లో ప్రజలను తమ వైపునకు తిప్పుకునే అన్ని ప్రయత్నాలు ఒడిశా ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కొఠియా గ్రామంలో ఒడిశా ఆధ్వర్యంలో వారపు సంతను బుధవారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా ప్రజలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు, నాయకులు మాట్లాడుతూ కొఠియా గ్రూప్ గ్రామాలు ఒడిశా రాష్ట్రానికి చెందినవేనని స్పష్టం చేశారు. ప్రతి బుధవారం ఇక్కడ వారపు సంత జరుగుతుందని ప్రభుత్వ నిధులతో సంతను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు విత్తనాలు మార్కెట్ ధరకే అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలోనే ప్రతి బుధవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రాపై ఆధారపడవద్దని సూచించారు. ఈ గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో ర్యాలి నిర్వహించారు. ఇంతవరకూ కొఠియా గ్రూప్ గ్రామాల ప్రజలు ప్రతి మంగళవారం ఆంధ్రా రాష్ట్రంలోని సారిక పంచాయతీ నేరెళ్లవలసలో జరిగే వారపు సంతకు వచ్చేవారు. ప్రస్తుతం కొఠియాలోనే ఒడిశా ప్రభుత్వం వారపు సంతను ఏర్పాటు చేయడంతో వారికి సంత అందుబాటులోకి వచ్చినట్టయింది. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కృషి బాస్‌రౌత్, ఎమ్మెల్యే ప్రఫుల్ కుమార్ పంగి, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, పొట్టంగి మాజీ ఎంపీ జయరాం పంగి, పొట్టంగి బ్లాక్ ఛైర్మన్ జగజ్జిత్ పంగి తదితరులు పాల్గొన్నారు. -
నోకియా ఫోను పేలి యువతి మృతి
జర్సుగుడ : ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే, మొబైల్స్ పేలిపోతున్న ఘటనలు ఇటీవల తరచు వింటూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే ఫోన్ మాట్లాడుతూ.. తీవ్ర ప్రమాద బారిన పడుతున్నారు. ఇదే మాదిరి ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఒడిశాలో జర్సుగుడ జిల్లాలో లైకెరా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ 18 ఏళ్ల యువతి మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి, ఫోన్ మాట్లాడుతుండగా.. దాన్ని బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉమా ఓరమ్‌గా సంబంధిత వర్గాలు తెలిపాయి. చాలామంది చేసే మాదిరిగానే ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగానే.. ఉమా తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆమె ఛాతికి, కాలుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉమా స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఆ సెల్ ఫోన్ నోకియా 3110 మోడల్ అని తెలిసింది. భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో ఉమా మాట్లాడుతుందని, ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో, దానికి ఛార్జింగ్ పెట్టి మాట్లాడిందని ఆమె సోదరుడు దుర్గ ప్రసాద్ ఓరమ్ చెప్పాడు. గతేడాదే లాంచ్ అయిన నోకియా ఫోన్ వల్ల ఈ ఘటన జరగడంతో, ఈ మొబైల్ తయారీ కంపెనీ తగిన పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
చిట్‌ఫండ్ మోసం కేసులో ఎంపీకి బెయిల్
భువనేశ్వర్ : రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో ఒడిశా హైకోర్టు గురువారం బెంగాలీ నటుడు, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ తపాస్ పాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అలాగే బ్యాంక్‌లో రూ. కోటి జమ చేయాలని ఎంపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు వ్యక్తులు రెండు లక్షల రూపాయల బాండుతో పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. పాస్‌పోర్టును దర్యాప్తు చేస్తున్న అధికారికి సరెండర్ చేయాలని సూచించింది. చిట్ ఫండ్ కుంభకోణం 2016లో వెలుగులోకి రావడంతో తపాస్ పాల్‌ను డిసెంబర్ 30, 2016న సీబీఐ అరెస్ట్ చేసింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు సహకరించాలని కోర్టు కోరింది. కోల్‌కత్తాలో తపాస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన అనంతరం మరింత లోతుగా విచారించడానికి భువనేశ్వర్‌లోని జార్పార జైలుకు తరలించారు. అక్కడకు తీసుకెళ్లిన తర్వాత తపాస్ పాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తపాస్ పాల్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకు ముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
సాక్షి, ఒడిశా: తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)పై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బౌద్ జిల్లా కాంటమాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోడిబాహల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత విద్యార్థిని తన మామ ఉండే గ్రామంలో ఓ వివాహానికి హాజరైంది. తన అత్తతో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఊరి చివరకు వెళ్లింది. ఇది గమనించిన ఇద్దరు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
గంజాయి మాఫియా గుట్టురట్టు
సాక్షి, బరంపురం: ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు అక్రమంగా కారులో గంజాయిని రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి మాఫియా ముఠాను గంజాం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి కారు, 244 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని దిగపండి పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె.నువగాం పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి సుజిత్ నాయక్ మాట్లాడుతూ గంజాం, గజపతి జిల్లాల సరిహద్దుల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని హైదరాబాద్ నుంచి అద్దెకు తీసుకున్న కారులో 244 కిలోల గంజాయి ప్యాకెట్లను ఎక్కించుకుని ఒడిశా-ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు తరలిస్తుండగా కె.నువగాం పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారన్నారు. అరెస్టయిన వారి దగ్గర నుంచి కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిని గొళంతరాకు చెందిన రవీంద్ర గౌడ, కె. నువగాంకు చెందిన విద్యాధర్ ప్రధాన్, మహేష్ దేశాయి, ముంబైకి చెందిన మోహిత్ వర్మ, సూరజ్ విజయ్ మిశ్రాలుగా గుర్తించామని ఐఐసీ తెలియజేశారు. -
కోరిక తీరిస్తేనే కులధ్రువీకరణ
సాక్షి, రాయగడ: రాయగడకు 140కిలోమీటర్ల దూరంలో గల మారుమూల చంద్రపూర్ సమితి తహసీల్ విభాగానికి చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆగడాలు పెచ్చుమీరాయి. కులధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చే బాలికలను శారీరక కోరిక తీర్చాలని వేధిస్తున్నాడంటూ అభియోగాలు వస్తున్నప్పటికీ తాను ఒడియా పత్రిక విలేకరిగా కూడా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అభియోగాలను కప్పిపుచ్చుకుంటున్నాడు. దీనిపై ఈ నెల 12 వతేదీన ఇద్దరు ఆదివాసీ బాలికలు చంద్రపుర్ సమితి బీడీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రపుర్ సమితిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుఖాంత్బెహరా వద్దకు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇద్దరు బాలికలు వెళ్లగా తన శారీరక కోరికను తీరిస్తే కుల ధ్రువీకరణ పత్రాలిస్తానని లేదంటే ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఆందోళన చెదిన వారు కలెక్టర్‌కు, బీడీఓకు, పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలో ఓసారి సస్పెన్షన్ సుఖాంత్ బెహరా గతంలో ఆదివాసీ కులధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసేందుకు ఒకొక్కంటికి రూ.20వేలు లంచం తీసుకుకుని మంజురు చేసేవాడన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇతర సాధారణ సర్టిఫికెట్లకు రూ.1000 నుంచి లంచాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు మహిళలను వేధించిన విషయంలో అనేక ప్రాంతాల్లో అతనికి దేహశుద్ధి కూడా జరిగింది. గతంలో ఒకసారి ఈ ఘటనలపై విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్ఐ సుఖాంత్బెహరాపై విజిలెన్స్ విచారణ జరపాలని చంద్రపూర్ సమితి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
చెరువులో పడి నలుగురు చిన్నారుల మృతి
కొరాపుట్(ఒడిశా): ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. కొరాపుట్ జిల్లా పరాజ ఖుడుపి గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మి, సుశాంత, సంజయ్, సబితా అనే చిన్నారులు( అంతా తొమ్మిదేళ్లలోపు వారే) ఆడుకుంటూ చెరువు జారి పడిపోయారు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో వారు నీట మునిగి చనిపోయారు. మంగళవారం ఉదయం వారి మృతదేహాలను వెలికితీశారు. అయితే, చిన్నారులు ప్రమాదవశాత్తు చనిపోయారా లేక కావాలనే ఎవరైనా వారిని చంపారా అనే దానిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు కొరాపుట్ ఏఎస్పీ వీఆర్ రావు తెలిపారు. -
మంటకలిసిన మానవత్వం
► విద్యార్థినికి వాంతులు వస్తున్నా బస్సు ఆపనివ్వని ప్రయాణికులు ► పరిస్థితి విషమించడంతో నిండు ప్రాణం బలి జయపురం(ఒడిశా): మృత్యువు ఎన్ని రకాలుగా సంభవిస్తుందో చెప్పతరం కాదు. రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్య సమస్యలు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండి, హుషారుగా ఉంటూ చదువుకొనే ఒక విద్యార్థిని మరణం అందరికీ వింతగానే ఉంది. ఈమె వాంతులు చేసుకొనేందుకు తగిన అవకాశం లేక ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ సంఘటన జయపురం వాసులను కలవర పరచటంతో పాటు విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. జయపురంలోని శ్రీరామనగర్ నివాసి రాజేంద్ర మహంతి కుమార్తె గిరిజ మహంతి(17) ఆకస్మికంగా మృతి చెందింది. ఈమె మంచి ఆరోగ్య వంతురాలు, హుషారుగా ఉంటూ బాగా చదువుకుంటున్న విద్యార్థిని. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో ఆమె క్యాట్ కోసం కోచింగ్ తీసుకొనేందుకు భువనేశ్వర్ వెళ్లింది. గత శనివారం ఆమె భువనేశ్వర్ నుంచి జయపురం వచ్చేందుకు భువనేశ్వర్‌లో ఒక ప్రైవేట్ బస్సు ఎక్కింది. ఆమెతో పాటు సహచర విద్యార్థిని ఆము ఉంది. ఎయిర్ కండిషన్ బస్సు కావటంతో బయట నుంచి గాలి రావటంలేదు. బస్సులో కూర్చున్న కొంత సమయానికి ఆమెకు వాంతి వచ్చింది. బస్సు కిటికి తలుపు నుంచి ఆమె వాంతి చేసింది. మార్గంలో బస్సు భోజనాలకు ఆపగా ఆమె వాంతులు వస్తాయేమోనన్న భయంతో భోజనం చేసేందుకు వెళ్లలేదు. బస్సులో ఉన్న ఒక ప్రయాణికురాలు ఆమెకు బిస్కెట్ ఇచ్చింది. దీనిని గిరిజ తిన్నది. అయినా ఆమెకు వాంతులు తగ్గలేదు. వాంతులు వచ్చినప్పుడల్లా ఆమె డ్రైవరకు చెప్పి బస్సు నిలుపమంది. అయితే తోటి ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బస్సు ఆపిన డ్రైవర్‌ను తిట్టటంతో ఆమె గిల్టీగా ఫీలయింది. అందుచేత మరలా వాంతి వస్తున్నా బస్సు ఆపమని చెప్పకుండా వాంతిని అదుపుచేసుకుంది. అలా వాంతి చేయకుండా ఉండటంతో ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్రం సాలూరు వచ్చేటప్పటికీ ఆమె పరిస్థితి శోచనీయంగా మారింది. ఆమె తన పరిస్థితిని తన ఇంటికి ఫోన్ చేసి తెలిపింది. వెంటనే ఆమె తండ్రి రాజేంద్ర మహంతి, చిన్నాన్న నరేంద్ర మహంతి సాలూరులో ఉన్న తమ బంధువులకు తెలియజేసి గిరిజకు సహాయం అందించమని తెలిపారు. వారు వెంటనే సాలూరులో బస్సును ఆపి గిరిజను సమీప హాస్పిటల్లకు తీసుకువెళ్లారు. హాస్పిటల్లో ఆమె మరణించింది. వస్తున్న వాంతిని చేయకుండా ఉంచటంతో అది శరీరంలో లంగ్స్‌లోకి ప్రవేశించిందని, దీంతో ఆమె రక్త ప్రసరానికి అవరోధం ఏర్పడి ఆమె మరణించినట్టు డాక్టర్లు వెల్లడించినట్టు సమాచారం. బస్సులో వాంతి చేసుకొనే అవకాశం లేక ఆమె మరణించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన ప్రజలను కలవర పరుస్తుంది. బస్సును ఆపినందుకు డ్రైవర్‌పై ప్రయాణికులు కోపగించటం వల్ల ఒక నిండు ప్రాణం బలి అయింది. ఒక కుటుంబం బిడ్డను కోల్పోయింది. ఇది దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు పురావృతం కాకుండా ప్రయాణికులు మానవత్వంతో వ్యవహరిస్తారని ఆశిద్దాం. -
ఒడిశాలో మావోయిస్టుల బీభత్సం
కొరాపుట్: రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ.. మావోలు రెచ్చిపోయారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సిమిలిగూడ సమితి పరిధిలోని బిస్తర్కోట వద్ద రహదారి నిర్మాణ పనులకు వినియోగిస్తున్న 5 వాహనాలను దగ్ధం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి బిస్తర్కోట వద్దకు చేరుకొని అక్కడ పని చేస్తున్న సూపర్వైజర్ జైరాంను ఇన్ఫార్మర్ నెపంతో గొంతుకోసి హత్య చేసిన మావోలు పక్కనే ఉన్న 5 వాహనాలకు నిప్పుపెట్టారు. -
అగ్ని ప్రమాద నివారణ చర్యలు తప్పనిసరి
ఏలూరు అర్బన్ ః అగ్నిప్రమాదాల నివారణకు అందరూ సహకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి బి. వీరభధ్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఒడిషాలోని ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ టిఏ. త్రిపాఠి జిల్లాలో అన్ని వ్యాపారసముదాయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, బహుళ అంతస్థుల భవనాలు, అపార్ట్మెంట్లు, కాలేజీలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఆ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రాథమిక తనిఖీలలో మూడు హోటళ్ళు, 14 ఆసుపత్రులు, 5 షాపింగ్ మాల్స్, 9 సినిమా హాళ్ళలో అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించడం లేదని గుర్తించామన్నారు. వారికి ఇప్పటికే నోటీసులు పంపామన్నారు. ఈ క్రమంలో జిల్లాలో మరింత విసు్త్రతంగా తనిఖీలు నిర్విహిస్తామని తెలిపారు. కాబట్టి ఇప్పటి వరకూ తమ శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందని భవనాల యజమానులు తక్షణం స్పందించి శాఖ నిబంధనలు పూర్తిగా అమలు చేయాలని కోరారు. అలా చేయని వారి భవనాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
160 కిలోల గంజాయి పట్టివేత
మోతుగూడెం : ఒడిశా రాష్ట్రం నుంచి తెలగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన 160 కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. చింతూరు సీఐ‡కె.దుర్గాప్రసాద్, ఎస్సై ఎం.పండుదొర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పొల్లూరు వై.జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. సీలేరు నుంచి వచ్చిన కారు క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో 160 కిలోల గంజాయి లభ్యమైంది. దీనిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన మరిసె నూకరాజు, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా జుజ్జూరు తండాకు చెందిన జాటోతు ఆశోక్, జాటోతు వెంకన్న దారవతు ప్రసాద్, విశాఖ జిల్లా సీలేరు చెందిన మహ్మద్ నయా్మద్, ఆలీని అరెస్టు చేశారు. -
అప్పన్న సన్నిధిలో ఒడిశా మాజీ సీఎం
హాచలం : శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామిని గురువారం ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన జరిపారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ అందజేశారు. -
ఆ మహిళలు నిజంగా 'విజిల్ బ్లోవర్స్'
భువనేశ్వర్: వారంతా ఒడిశాలోని గంజామ్ జిల్లా జగన్నాథ్ ప్రసాద్ సమితికి చెందిన మహిళలు. వారు నిజంగా విజిల్ బ్లోవర్స్. తమ సమితి పరిధిలోని ఏ గ్రామంలోను 'బహిర్భూమికి'వెళ్లేందుకు ఎవరిని అనుమతించరు. ఎవరైనా చెంబు పట్టుకుని బహిర్భూమి కోసం 30 మందికి పైగా ఉన్న ఆ మహిళ విజిల్ బ్లోవర్స్ ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు నుంచి 6 గంటల వరకూ, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 8గంటల వరకూ బహిర్భూమికి అవకాశం ఉన్న ప్రతి రోడ్డుపై ముగ్గురేసి నిఘావేస్తారు. తమ విజిల్స్ తో బెదరగొడతారు. తమ ఇంట్లో మరుగు దొడ్డి లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే మరుగుదొడ్డి నిర్మాణానికి అవసరమైన సహాయం కూడా చేస్తారు. ఈ మధ్య వారికి ఓ కొత్త ఐడియా వచ్చి బహిర్భూమికి అవకాశం ఉన్న చోటల్లా వారు ప్రజలు పవిత్రంగా భావించే 'తులసి మొక్కలు'నాటుతున్నారు. వాటికి వారు తమ కాపల సందర్భంగా నీళ్లు పోస్తున్నారు. అవి పెరిగేందుకు తోడ్పడుతున్నారు. ఇప్పుడు వారి కొత్త స్కీమ్ బాగా పనిచేస్తోంది. ఇప్పుడు ఎవరూ బహిర్భూమికి వచ్చేందుకు సాహించడం లేదు. వారు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం ఆశించకుండా పనిచేయడం సమితి ప్రాంతంలోని అన్ని గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. స్వచ్ఛ భారత్ పేరిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా పిలుపు ఇవ్వడానికి ముందు ఆ మహిళలు మేల్కొన్నారు. ఆరతి బెహార, అనసూయ సాహు, రాజ్యలక్ష్మి సేథి, అంబు బెహరా కలిసి'విజిల్ బాహినీ' పేరిట ఓ మహిళా దండును ఏర్పాటు చేశారు. ఇంతటితో పాటు ఇళ్ల పరిసరాలను, మొత్తం గ్రామం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. నలుగురైదుగురితో ప్రారంభమైన వారి ఉద్యమం సమితి ప్రాంతమంతి విస్తరించడంతో గ్రామస్థులు కూడా వారికి సహకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. విజిల్ బాహినీ దండు వివిధ స్వయం ఉపాధి కేంద్రాలను నుంచి మహిళలను చేర్చుకోవడం ప్రారంభించడంతో ఇప్పుడు వారి సంఖ్య30 ని దాటింది. జగన్నాథ్ ప్రసాద్ సమితి గ్రామం ప్రధాన రోడ్డులో కూడా బహిర్భూమికి వెళ్లడం వల్ల ఆ వీధి గుండా ముక్కుమూసుకొనొ వెళ్లలంటే కష్టమయ్యేది. తమ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లడం అతి సాధారణ విషయంగానే పంచాయతీ పరిగణించిందని, డీడీటి పౌడర్లు చల్లటం మినహా వారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతున్న విషయాన్ని గ్రహిందచి తామే ఎందుకు చర్యలు తీసుకోకుడదనే ఆలోచనతోనే ఓ మహిళా దండును ఏర్పాటు చేశామని ఆరతి బెహార' విజిల్ బాహిని'పుట్టుక గురించి మీడియాకు వివరించారు. ఇందులో టాయ్ లెట్లు లేనివారి కోసం తాము వివిధ గ్రామాల్లో సామాజిక మరుగుదొడ్లను కట్టించామని ఆమె తెలిపారు. ఈ విషయంలో కేంద్ర పథకాలను కూడా ఉపయోగించుకుంటున్నామని ఆమె చెప్పారు. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారంలో భారత గ్రామీణ ప్రాంతాల్లో 88 శాతం మంది అతిసార వ్యాధి వల్ల మరణిస్తున్నారు.కలుషితమైన నీరు, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్లనే అతిసారం వ్యాధి వ్యాపిస్తుందన్నది తెల్సిందే. -
బుదియా సింగ్.. నీ పరుగెక్కడ?
మూడేళ్లకే మారథాన్ పరుగు.. నాలుగేళ్ల పసివయసులోనే నలభై మైళ్ల రికార్డు పరుగు.. పసి వయసులో ఏకంగా 48 మారథాన్లు పూర్తిచేసిన అద్వితీయ పరుగు.. ఒడిశా వండర్ కిడ్ జీవితమే ఓ పరుగు. బుడిబుడి అడుగుల బుదియా సింగ్ పరుగు ఆగనంత వరకూ అతడి గమ్యం పరుగెడుతునే ఉంది. నేటికీ ఆ గమ్యం రేసుగుర్రంలా పరుగెడుతూనే ఉంది. బుదియానే దాన్ని అందుకోలేనంత వెనకబడ్డాడు. భారత దేశపు సూపర్‌స్టార్ ఇప్పుడు ఒంటరయ్యాడు. పరుగు మొదలైందిలా.. ఒకరోజు బుదియా ఏదో తప్పు చేశాడు. దీనికి ప్రతిఫలంగా గ్రౌండ్ చుట్టూ పరుగెత్తమంటూ కోచ్ ఆదేశించాడు. కొంత సమయం గడిచింది. కోచ్ దాస్ ఏదో పనిమీద బయటకు వెళ్లాడు. ఓ ఐదు గంటల తర్వాత మళ్లీ గ్రౌండ్‌కు వచ్చాడు. అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది బుదియాకు విధించిన శిక్ష. మూడేళ్ల ఈ చిన్నారి అప్పటికీ రౌండ్లు కొడుతూనే ఉన్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం కోచ్ వంతైంది. ఐదుగంటల పాటు రన్నింగ్ చేసినా అలసిపోని బుదియాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అన్ని చెకప్లూ చేయించాడు. గుండెపోటు సాధారణ స్థితిలోనే ఉంది. అప్పుడే బిరించీ దాస్‌కు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. బుదియాకు మారథాన్ ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుందీ అన్నదే అది. ఒడిశాలోని ఓ మారుమూల ప్రాంతానికి.. అందులోనూ ఓ మురికివాడకూ మాత్రమే బుదియా ఒకప్పుడు తెలుసు. తర్వాత ప్రపంచమే అతన్ని తెలుసుకుంది. తడబాటు లేకుండా నడవడమే కష్టం అనుకునే వయసులో పదుల కొద్దీ కిలోమీటర్లు అవలీలగా పరుగెత్తేసే బుదియాను అందరూ సూపర్ స్టార్ అన్నారు. వండర్ కిడ్ అంటూ ఆకాశానికెత్తేశారు. అక్కడే ఉంటే పెద్ద స్టారై కూర్చునేవాడే. ఒక్కసారిగా నేలకు లాగేశారు. ప్రపంచంలోని అతిపిన్న మారథాన్ రన్నర్ విధివంచిత గాధ ఇది. బాల్యం.. చిన్నతనంలోనే బుదియా సింగ్ తండ్రిని కోల్పోయాడు. తల్లి అతన్ని వద్దనుకుంది. దారినపోయే ఓ దానయ్యకు బుదియాను 2004లో రూ.800కు అమ్మేసింది. తర్వాత తన దారి తాను చూసుకుంది. తన ప్రమేయం లేకుండానే బుదియా ఎవరెవరి చేతుల్లోనో పడ్డాడు. చివరకు ప్రముఖ జూడో కోచ్ బిరించీ దాస్ కంటపడ్డాడు. కోచ్‌గానే గాక అనాథ పిల్లల సంరక్షుడిగానూ దాస్ పేరున్నవాడు. బుదియాను కూడా అక్కున చేర్చుకున్నాడు. చిన్నారులకు అథ్లెటిక్స్‌లో కోచింగ్ ఇచ్చే అతడు క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవాడు. మారథాన్ రన్నర్‌గా.. గంటల పాటు పరుగెత్తినా అలసిపోని ప్రత్యేక సామర్థ్యం ఈ పసివాడిని మారథాన్ రన్నర్‌ని చేసింది. నాలుగేళ్ల వయసులోనే 48 మారథాన్లు పూర్తి చేసిన బుదియా.. భువనేశ్వర్-పూరీ మధ్య 65 కి.మీ దూరాన్ని ఏడుగంటల్లోనే ఛేదించేసి ఔరా అనిపించాడు. దీంతో రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ అయిపోయాడు. ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, సన్మానాలు.. ఒకటేమిటి! బుదియా ఓ వెలుగు వెలిగాడు. ప్రపంచంలోని పిన్నవయసు మారథాన్ రన్నర్‌గా విశ్వఖ్యాతి గడించాడు. కుదుపు.. భారత్‌కు అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ పతకం సాధిస్తాడని అందరూ భావించిన బుదియా జీవితంలో అతిపెద్ద కుదుపు 2006లో వచ్చింది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద దూరాలను ఎలా పరుగెడతాడంటూ కొందరు నానా గొడవా చేశారు. బుదియా హక్కులను కోచ్ కాలరాస్తున్నాడంటూ గోల పెట్టారు. ప్రభుత్వం కూడా వారితో సమ్మతించింది. బుదియాకు పదకొండేళ్లు వచ్చేంతవరకూ పరుగెత్తకూడదంటూ హుకుం జారీ చేసింది. మారథాన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో బుదియా ప్రభుత్వ క్రీడా హాస్టల్ బాట పట్టాడు. మరోవైపు చిన్నారిని చిత్రహింసలకు గురి చేశాడన్న ఆరోపణతో బిరించీ దాస్‌పై కేసులు నమోదయ్యాయి. బిరించీ హత్య.. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత బిరించీ దాస్ హత్యకు గురయ్యాడు. దీంతో బుదియా ఒంటరయ్యాడు. హాస్టల్లోని సాధారణ విద్యార్థుల్లో ఒకరిగా మారిపోయాడు. అక్కడి ప్రభుత్వ కోచ్ బుదియా ప్రతిభను అంచనా వేయడంలో విఫలమైంది. అతడిని పూర్తిగా పరుగుకు దూరం చేసి, తరగతి గదులకే పరిమితం చేసింది. హాస్టల్లో భోజన సదుపాయం కూడా బాగాలేదని, అక్కడ ఇంకెంత మాత్రం ఉండలేనని బుదియా పదేపదే వాపోయాడు. అయితే అతడి మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో ప్రభుత్వ హాస్టల్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుత పరిస్థితి.. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా కీర్తి పొందిన బుదియా ప్రస్తుతం జిల్లా స్థాయి అథ్లెట్ కూడా కాదు. అతని పతనానికి కారణం ఎవరని ప్రశ్నిస్తే.. సవాలక్ష సమాధానాలు. పుట్టు దారిద్య్రంలో ఉన్న బుదియాను, ఆకలేస్తే తిండికి నోచుకోని బుదియాను, సరైన బట్టకు, చదువుకూ నోచుకోని బుదియాను పట్టించుకోని హక్కుల నాయకులు, ప్రభుత్వం.. అతడి స్థాయి పెరిగాక మాత్రం పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఓ రకంగా ఇదే అతని పతనానికి కారణం. ప్రభుత్వం చూపిన వల్లమాలిన ప్రేమే ఈ అసాధారణ చిన్నారిని సాధారణ బాలుడిగా మార్చింది. -
ఉలిక్కిపడిన ఏవోబీ
=సరిహద్దులో చెలరేగిన మావోయిస్టులు =ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హతం =మృతుల్లో ఒకరు మహిళ =మన్యం బంద్‌కు మిశ్రమ స్పందన పాడేరు/సీలేరు, న్యూస్‌లైన్ : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)మరోసారి ఉలిక్కిపడింది. మన్యంలో బుధవారంనాటి బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించినప్పటికీ సరిహద్దు ఒడిశాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధ చర్యలను నిరసిస్తూ మావోయిస్టు ఏవోబీ జోన ల్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిరసన దినాలు పాటించారు. ఇవి బుధవారం ప్రశాంతంగా ముగుస్తాయనుకున్న తరుణంలో మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి వెజ్జంగి గుడలో వంతల సతీరావు(30), వంతల లక్ష్మి(27)లను పోలీ సు ఇన్ఫార్మర్ల నెపంతో దళసభ్యులు హతమార్చారు. ఉదయాన్నే సాయుధులైన 20 మంది మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించితో 20 నిమిషాలు వారితో మాట్లాడారు. అనంతరం ఇద్దరినీ గొడ్డలితో నరికి చంపారు. సతీరావు 15 ఏళ్ల కిందట దళంలో పనిచేసి జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. లక్ష్మి ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. ఈమె భర్త రాజబాబును కూడా చంపడానికి మావోయిస్టులు యత్నించారు. అతడు తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు. పది రోజులుగా ఏవోబీలో గ్రేహౌం డ్స్, బీఎస్ఎఫ్, ఎస్‌వోజీ, జీవీఎఫ్ బలగాలు మారుమూల గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయినా మావోయిస్టులు చెలరేగి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారు. దీంతో మారుమూ ల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏజెన్సీ బంద్‌కు మిశ్రమ స్పందన మన్యంలో బుధవారంనాటి ఏవోబీ బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. పోలీసుల విస్తృత ప్రచారంతో మావోయిస్టుల బంద్‌ను కొన్ని ప్రాంతాల్లోని గిరిజనులు పట్టించుకోలేదు. జి.మాడుగుల మండలం మద్దిగరువు, పెదబయలు మండలం గోమంగి, కొరవంగి, లక్ష్మీపేట, ముంచంగిపుట్టు మండలం కుమడ ప్రాంతాల్లో రవాణా స్తంభించింది. ఆర్టీసీ సర్వీసులతోపాటు ప్రైవేటు వాహనాలు కూడా తిరగలేదు. పోలీసుల సూచనలతో పాడేరు నుంచి ముంచంగిపుట్టు వరకు బస్సులు నడిపారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు మండలాల్లో బంద్ ప్రభావం కానరాలేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు యథావిధిగా పనిచేశాయి. దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు మండల కేంద్రాల్లో బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. చింతపల్లి, కించుమండ వారపు సంతలు యథావిధిగానే జరిగాయి. జీకే వీధి, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రం రవాణా స్తంభించింది. మావోయిస్టుల బంద్ పిలుపుతో మన్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత మండలాల్లోని మారుమూల గ్రామాల్లో పోలీసు గాలింపు చర్యలను కూడా విస్తృతం చేసింది. మండల కేంద్రాల్లో తనిఖీలు కూడా జరిపారు. -
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మందుపాతర పేలుడు
సాలూరు/పార్వతీపురం, న్యూస్‌లైన్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఉన్నట్టుండి మంగళవారం ఉదయం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ గుండు దూసుకొచ్చి తమ గుండెలను చీల్చుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మల్కన్‌గిరి నుంచి సోమవారం సాయంత్రం నాలుగు వాహనాల్లో బీఎస్ఎఫ్ 161 బెటాలియన్‌కు చెందిన 60 మంది జవానులు విశాఖపట్నం మీదుగా గుజరాత్‌కు వెళ్లేందుకు నాలుగు వాహనాల్లో బయలుదేరారు. మూడు వాహనాల్లో 18 మంది చొప్పున, నాలుగో వాహనంలో ఆరుగురు జవానులు ఉన్నారు. చీకటి పడడంతో సోమవారం రాత్రి వీరంతా కొరాపుట్‌లో ఉండిపోయారు. మంగళవారం ఉదయం మళ్లీ ప్రయాణం కొనసాగించారు. వీరు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి బ్లాక్ నారాయణ పొదరు, సుంకి గ్రామాలకు సమీపంలోని 26వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అక్కడి సకిరాయి గ్రామం చెంతన గల కల్వర్టు వద్దకు వీరి వాహనాలు వచ్చేసరికి మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. మొదట ఉన్న మూడు వాహనాలు అప్పటికే కల్వర్టును దాటి పోగా, చివరి వాహనం ప్రమాదంలో చిక్కుకుంది. ఆ వాహనంలో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఏఎస్ఐ జస్వంత సింగ్, హవల్దార్ సురేంద్ర సింగ్, హెడ్‌కానిస్టేబుల్ బీరేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ సురేంద్ర సింగ్ ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిరాజుల్లా కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన మహేంద్ర కుచ్కర్లు. నలుగురి మృతదేహాలను వెనక్కి తరలించినట్టు సమాచారం. తీవ్ర గాయాల పాలైన బీఎస్ఎఫ్ జవాన్లు సిరాజుల్లా, మహేంద్ర కుచ్కర్లను సుంకి గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్యశాలలో చికిత్స చేయిస్తుండగా, సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని పాచిపెంట ఎస్ఐ సీహెచ్.స్వామినాయుడు అక్కడికి చేరుకున్నారు. 108 వాహనంలో క్షతగాత్రులను సాలూరు సీహెచ్‌సీకి తరలించా రు. సాలూరు పట్టణ ఎస్ఐ శ్రీనివారావు, రూరల్ ఎస్ఐ రామకృష్ణ కూడా వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం వారిని విశాఖపట్నం తరలించారు. ఇటీవల మాచ్‌ఖండ్‌లో మావోయిస్టు నేత మాధవ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. కొరాపుట్, శ్రీకాకుళం డివిజ నల్ కమిటీ నాయకురాలు అరుణ నేతృత్వంలో 20 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టు మల్కన్‌గిరి డీఐజీ జగ్జత్ సింగ్ తెలిపారు. ఎస్ఓపీ నిబంధనలు పోలీసులు పాటించలేదని, దీనివల్లనే జవానులు మందుపాతరకు బలైనట్టు తెలుస్తోంది. ఈ పేలుడు సం ఘటనతో ఆ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్క నిమిషం ముందైతే... మొత్తం నాలుగు వాహ నాల్లో 60 మంది ఉన్నట్టు తెలుసుకున్న మావోయిస్టులు మందుపాతర పేల్చేందుకు పకడ్బందీగా వ్యూహం పన్నినట్టు సమాచారం. అయితే వారి లక్ష్యం దెబ్బతింది. మొదటి మూడు వాహనాలు వెళ్లేవరకూ మందుపాతర పేలలేదు. దీంతో వాటిలో ఉన్న 54 మంది ప్రాణాలతో బయట పడ్డారు. అదే ఒక్క నిమిషం ముందు సంఘటన జరిగినా భారీ స్థాయిలో ప్రాణనష్టం ఉండేది. చివరి వాహనం కల్వర్టు వద్దకు వచ్చేసరికి పేలుడు సంభవించడంతో నాలుగో వాహనంలో ఉన్న వారు బలైపోయారు. పేలని మరో మందుపాతర కల్వర్ట్ కింద 6 అడుగుల లోతున మావోయిస్టులు మందుపాతర అమర్చినట్టు పోలీసులు తెలిపారు. అలాగే పేలకుండా ఉన్న మరో మందుపాతరను కనుగొన్నట్లు, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు సంఘటన స్థలం వద్ద పర్యవేక్షణలో ఉన్న కొరాపుట్ ఎస్పీ అవినాష్ కుమార్ చెప్పారు. ఆయుధాలు కొల్లగొట్టాలని... ఆ నాలుగు వాహనాల్లో 200కు పైగా అత్యాధునిక ఆయుధాలున్నాయి. వాటిని లూటీచేయడానికి మావోయిస్టులు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే పేలు డు సంభవించిన వెంటనే మిగిలిన వాహనాల్లో ఉన్న వారు అప్రమత్తమయ్యారు. వీరు కాల్పులకు దిగడంతో మావోల వ్యూహం బెడిసికొట్టింది. ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. కొరాపుట్ జిల్లాలో గత అయిదేళ్లలో జరిగిన వాటిలో ఇది రెండో పెద్ద దాడిగా పోలీసులు చెబుతున్నారు. 2004లో కొరాపుట్‌లో టౌన్లో ఐదుగురిని మావోయిస్టు లు హతమార్చారు. ఆయుధాగారాన్ని దోచుకున్నారు. 2009లో దమంజొడిలో నాల్కోపై సుమారు 200 మంది మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆరుగురు సీఐఎఫ్ఎస్ సిబ్బందిని బలిగొన్నారు. అప్రమత్తమైన పోలీసులు సరిహద్దులో మావోయిస్టులు మందు పాతర పేల్చడం తో ఆంధ్రాలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన పోలీసులు అప్రమత్త మయ్యారు. ఈ ఘటనతో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎస్ఓజీ దళాలు, ఆంధ్రా పోలీసుల సాయంతో హెలకాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు జగ్జత్ సింగ్ తెలిపారు. భయంగుప్పెట్లో సరిహద్దు వాసులు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయంగుప్పెట్లో కాలంగడుతున్నారు. నిత్యం తీవ్ర భయాందోళనల మధ్య కాలంగడుపుతున్నారు. 2004వ సంవత్సరంలో సాలూరు మండలంలో కొదమ గ్రామ సమీపంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. 2008లో సాలూరు మండలంలో ఎగువ శెంభి గ్రామంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులకు ఇన్ఫార్మార్గా వ్యవహారించాడనే నెపంతో ఎగువసెంభీ మాజీ సర్పంచ్ తాడంగి సొన్నంనాయుడును మావోయిస్టులు అప్పట్లో హతమార్చారు. 2012 ఆగస్టు 30న మక్కువ మండలం ఎర్రసామంత వలస గ్రామంలో ఉన్న సెల్‌టవర్‌ను మావోయిస్టులు పెల్చేశారు. ఇలా సాలూరు, మక్కువ మండలాల ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటూనే ఉంటోంది. -
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మందుపాతర పేలుడు
సాలూరు/పార్వతీపురం, న్యూస్‌లైన్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఉన్నట్టుండి మంగళవారం ఉదయం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ గుండు దూసుకొచ్చి తమ గుండెలను చీల్చుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మల్కన్‌గిరి నుంచి సోమవారం సాయంత్రం నాలుగు వాహనాల్లో బీఎస్ఎఫ్ 161 బెటాలియన్‌కు చెందిన 60 మంది జవానులు విశాఖపట్నం మీదుగా గుజరాత్‌కు వెళ్లేందుకు నాలుగు వాహనాల్లో బయలుదేరారు. మూడు వాహనాల్లో 18 మంది చొప్పున, నాలుగో వాహనంలో ఆరుగురు జవానులు ఉన్నారు. చీకటి పడడంతో సోమవారం రాత్రి వీరంతా కొరాపుట్‌లో ఉండిపోయారు. మంగళవారం ఉదయం మళ్లీ ప్రయాణం కొనసాగించారు. వీరు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి బ్లాక్ నారాయణ పొదరు, సుంకి గ్రామాలకు సమీపంలోని 26వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అక్కడి సకిరాయి గ్రామం చెంతన గల కల్వర్టు వద్దకు వీరి వాహనాలు వచ్చేసరికి మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. మొదట ఉన్న మూడు వాహనాలు అప్పటికే కల్వర్టును దాటి పోగా, చివరి వాహనం ప్రమాదంలో చిక్కుకుంది. ఆ వాహనంలో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఏఎస్ఐ జస్వంత సింగ్, హవల్దార్ సురేంద్ర సింగ్, హెడ్‌కానిస్టేబుల్ బీరేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ సురేంద్ర సింగ్ ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిరాజుల్లా కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన మహేంద్ర కుచ్కర్లు. నలుగురి మృతదేహాలను వెనక్కి తరలించినట్టు సమాచారం. తీవ్ర గాయాల పాలైన బీఎస్ఎఫ్ జవాన్లు సిరాజుల్లా, మహేంద్ర కుచ్కర్లను సుంకి గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్యశాలలో చికిత్స చేయిస్తుండగా, సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని పాచిపెంట ఎస్ఐ సీహెచ్.స్వామినాయుడు అక్కడికి చేరుకున్నారు. 108 వాహనంలో క్షతగాత్రులను సాలూరు సీహెచ్‌సీకి తరలించా రు. సాలూరు పట్టణ ఎస్ఐ శ్రీనివారావు, రూరల్ ఎస్ఐ రామకృష్ణ కూడా వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం వారిని విశాఖపట్నం తరలించారు. ఇటీవల మాచ్‌ఖండ్‌లో మావోయిస్టు నేత మాధవ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. కొరాపుట్, శ్రీకాకుళం డివిజ నల్ కమిటీ నాయకురాలు అరుణ నేతృత్వంలో 20 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టు మల్కన్‌గిరి డీఐజీ జగ్జత్ సింగ్ తెలిపారు. ఎస్ఓపీ నిబంధనలు పోలీసులు పాటించలేదని, దీనివల్లనే జవానులు మందుపాతరకు బలైనట్టు తెలుస్తోంది. ఈ పేలుడు సం ఘటనతో ఆ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్క నిమిషం ముందైతే... మొత్తం నాలుగు వాహ నాల్లో 60 మంది ఉన్నట్టు తెలుసుకున్న మావోయిస్టులు మందుపాతర పేల్చేందుకు పకడ్బందీగా వ్యూహం పన్నినట్టు సమాచారం. అయితే వారి లక్ష్యం దెబ్బతింది. మొదటి మూడు వాహనాలు వెళ్లేవరకూ మందుపాతర పేలలేదు. దీంతో వాటిలో ఉన్న 54 మంది ప్రాణాలతో బయట పడ్డారు. అదే ఒక్క నిమిషం ముందు సంఘటన జరిగినా భారీ స్థాయిలో ప్రాణనష్టం ఉండేది. చివరి వాహనం కల్వర్టు వద్దకు వచ్చేసరికి పేలుడు సంభవించడంతో నాలుగో వాహనంలో ఉన్న వారు బలైపోయారు. పేలని మరో మందుపాతర కల్వర్ట్ కింద 6 అడుగుల లోతున మావోయిస్టులు మందుపాతర అమర్చినట్టు పోలీసులు తెలిపారు. అలాగే పేలకుండా ఉన్న మరో మందుపాతరను కనుగొన్నట్లు, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు సంఘటన స్థలం వద్ద పర్యవేక్షణలో ఉన్న కొరాపుట్ ఎస్పీ అవినాష్ కుమార్ చెప్పారు. ఆయుధాలు కొల్లగొట్టాలని... ఆ నాలుగు వాహనాల్లో 200కు పైగా అత్యాధునిక ఆయుధాలున్నాయి. వాటిని లూటీచేయడానికి మావోయిస్టులు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే పేలు డు సంభవించిన వెంటనే మిగిలిన వాహనాల్లో ఉన్న వారు అప్రమత్తమయ్యారు. వీరు కాల్పులకు దిగడంతో మావోల వ్యూహం బెడిసికొట్టింది. ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. కొరాపుట్ జిల్లాలో గత అయిదేళ్లలో జరిగిన వాటిలో ఇది రెండో పెద్ద దాడిగా పోలీసులు చెబుతున్నారు. 2004లో కొరాపుట్‌లో టౌన్లో ఐదుగురిని మావోయిస్టు లు హతమార్చారు. ఆయుధాగారాన్ని దోచుకున్నారు. 2009లో దమంజొడిలో నాల్కోపై సుమారు 200 మంది మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆరుగురు సీఐఎఫ్ఎస్ సిబ్బందిని బలిగొన్నారు. అప్రమత్తమైన పోలీసులు సరిహద్దులో మావోయిస్టులు మందు పాతర పేల్చడం తో ఆంధ్రాలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన పోలీసులు అప్రమత్త మయ్యారు. ఈ ఘటనతో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎస్ఓజీ దళాలు, ఆంధ్రా పోలీసుల సాయంతో హెలకాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు జగ్జత్ సింగ్ తెలిపారు. భయంగుప్పెట్లో సరిహద్దు వాసులు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయంగుప్పెట్లో కాలంగడుతున్నారు. నిత్యం తీవ్ర భయాందోళనల మధ్య కాలంగడుపుతున్నారు. 2004వ సంవత్సరంలో సాలూరు మండలంలో కొదమ గ్రామ సమీపంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. 2008లో సాలూరు మండలంలో ఎగువ శెంభి గ్రామంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులకు ఇన్ఫార్మార్గా వ్యవహారించాడనే నెపంతో ఎగువసెంభీ మాజీ సర్పంచ్ తాడంగి సొన్నంనాయుడును మావోయిస్టులు అప్పట్లో హతమార్చారు. 2012 ఆగస్టు 30న మక్కువ మండలం ఎర్రసామంత వలస గ్రామంలో ఉన్న సెల్‌టవర్‌ను మావోయిస్టులు పెల్చేశారు. ఇలా సాలూరు, మక్కువ మండలాల ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటూనే ఉంటోంది. -
మాధవ్‌కు కన్నీటి వీడ్కోలు
పాన్‌గల్, న్యూస్‌లైన్: ఈనెల 23న ఒడిశాలో జరి గిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేత మాధ వ్ అలియాస్ గొల్ల రాములు అం త్యక్రియలు సోమవారం మండలంలోని గోప్లాపూర్‌లో అతని సొంత వ్యవసాయ పొలంలో జరిగాయి. అంతకుముందు ఇం టికి తీసుకొచ్చిన మాధవ్ మృతదేహాన్ని చూసి తల్లి గౌరమ్మ, తండ్రి పెంటయ్య, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. వీరి రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి. పేదలకో సం తమ బిడ్డ పోరాడటం ఎంతో గర్వంగా ఉందన్నారు. మాధవ్‌ను కడసారిగా చూసేందుకు చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులు, వివిధ ప్రజాసంఘాల నేతలు భారీగా తరలొచ్చారు. కాంగ్రెస్‌పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి మాధవ్ మృతదేహానికి నివాళులర్పించా రు. అమరవీరుల బంధుమిత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధ వి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..ప్రజలపక్షాన పోరాటం చేస్తున్న మాధవ్ పోలీసుల కాల్పుల్లో మరణించలేదని, జనజీవన స్రవంతిలో కలవలనుకున్న ఆయనను ఈనెల 23న ఒడిశా పోలీసు లు పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని ఆరోపించారు. జన జీవన స్రవంతిలోకి రావాలని ప్రభుత్వం ఓ వైపు పిలుపునిస్తూ.. మ రోవైపు బూ టకపు ఎన్కౌంటర్లకు పాల్పడటం దా రుణమన్నారు. పోలీసులు రివార్డు కో సం మనిషిని దుర్మార్గంగా చంపడం దా రుణమన్నారు. పేద కుటుం బంలో జన్మించి మారుమూల గ్రామం నుంచి మంచి కళాకారుడుగా, ఓ రాష్ట్రనేతగా ఎ దగడం ఎంతో గర్వించదగిన విషయమన్నారు. అమరవీరుల బంధుమిత్ర సంఘం వారి కుటుంబానికి అండ గా ఉం టూ ఆయన ఆశయసాధన కోసం పోరాటం చేస్తామన్నారు. మాటల్లో శాంతి..చేతల్లో హింస: రాఘవాచారి ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తూ దమనకాండకు పాల్పడుతోందని పాలమూ రు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. మావోయిస్టు నేత మాధవ్‌కు అయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం బూ టకపు ఎన్కౌంటర్లు మానుకోవాలన్నారు. ప్రజలపక్షాన పోరాడుతున్న మాధవ్ వంటి నాయకులను పోలీసులు కాల్చిచంపడం దారుణమన్నారు. ప్రజలపక్షాన నిలబడ్డ మాధవ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. పేదలపక్షాన పోరాడినందుకే.. పెత్తందారులు, భూస్వాములకు వ్యతిరేకంగా పేదలపక్షాన పోరాడినందుకే ఒడి శా ప్రభుత్వం మాధవ్‌ను పోలీసులచే హత్యచేయించిందని పౌరహక్కుల సం ఘం రాష్ట్ర నాయకులు నర్సన్న, రాజు నందం అన్నారు..పేదల కోసం పోరాటాలు చేస్తూ మంచినేతగా ఎదుగుతున్న సమయంలో పోలీసులు కాల్చిచంపారని ఆరోపించారు. మాధవ్ ఏనాడూ తన కుటుంబం గురించి ఆలోచించలేదన్నారు. బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఆయన ఒడియా, తెలు గు, హిందీ భాషల్లో పాడిన పలు పాట లకు సంబంధించిన సీడీలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు బుచ్చారెడ్డి, ప్రభాకర్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల గుప్పిట ‘మావో’ల గుట్టు
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు కోరుకొండ దళానికి గట్టి షాక్ తగిలింది. అనారోగ్యం వల్ల దళం నుంచి నిష్ర్కమించి, లొంగిపోయిన నలుగురు మిలిటెంట్లు నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. దాని ఆధారంగా దళంలోని మిగిలిన సభ్యులపై ఉక్కుపాదం మోపేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కూంబింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. కోరుకొండ ఏరియా కమిటీలో కీలకంగా వ్యవహరించి నల్లమల,తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాం తాల్లో కమాండర్‌గా పనిచేసిన సంతోష్ అలియాస్ కొర్ర సత్తిబాబు, ఆయన భార్య సుజాత, మరో ఇద్దరు దళ సభ్యులు అనారోగ్యం కారణంగా పార్టీ నాయకత్వం అనుమతితో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోకుండా పో లీస్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి లొంగిపోయారు. మరింత సమాచారం కోసం వారిని ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసు లు విచారిస్తున్నారు. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన ఉన్నతాధికారులు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అనంతరం వారి లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. సంతోష్‌ది గూడెం కొత్తవీధి మండలం ఎర్రగెడ్డ గ్రామం. నాలుగేళ్ల క్రితం దళంలో చేరాడు. పలు హింసాత్మక ఘటనలలో పాల్గొన్నాడు. సంతోష్‌పై రూ.4లక్షలు, సుజాతపై రూ.లక్ష రివార్డు ఉంది. వారి నుంచి లభించిన సమాచారంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టుల దూకుడుకు ముకుతాడు వేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో సంసిద్ధమైనట్టు తెలిసింది. -
ఉపాధి కోసం వచ్చి మృత్యువాత
మొర్సపూడి(నూజివీడు రూరల్), న్యూస్‌లైన్ : ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి విద్యుదాఘతానికి గురై దుర్మరణం చెందాడు. మండలంలోని మోర్సపూడిలో శనివారం ఈ ఘటన జరిగింది. రూరల్ ఎస్సై బోనం ఆదిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన భీమా(33) పాల్గొంటున్నాడు. మొర్సపూడిలో జరుగుతున్న పనుల్లో భాగంగా శనివారం కర్రకు కట్టిన స్కేలు తో ఎత్తుపల్లంగా ఉన్న చోట్ల కొలుస్తున్నాడు. ఆ సమయంలో పైనున్న విద్యుత్‌వైరు తగల డంతో షాక్‌కు గురయ్యాడు. తోటి పనివారు అతడిని హుటాహుటిన నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ కొంతసేపటికి మృతి చెందాడు. ఈ ఘ ట నపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై పే ర్కొన్నారు. పొట్ట కూ టి కోసం భీమా దూ రప్రాంతం నుంచి వచ్చి ప్రాణాలు కోల్పో యాడంటూ తోటి పనివారు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాం తంలో విషాదం నెలకొంది.