సాక్షి,న్యూఢిల్లీ: ఒడిషా, మిజోరం రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఒడిషా గవర్నర్‌గా హర్యానా బీజేపీ చీఫ్ గణేష్ లాల్‌ను నియమితులైయ్యారు. ఒడిషా గవర్నర్ ఎస్.టీ జామీర్ మార్చితో పదవి గడవు ముగియడంతో బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అదనపు బాధ్యతులు నిర్వహిస్తున్నారు. గణేష్ లాల్‌ను ఒడిషా గవర్నర్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటించాయి.
మిజోరం నూతన గవర్నర్‌గా కేరళ బీజేపీ చీఫ్ ప్రొఫెసర్ కుమ్మమానం రాజశేఖరన్ నియమితులైయ్యారు. మిజోరం గవర్నర్ నిర్బయ్ శర్మ పదవి కాలం మే 28తో ముగియనుండడంతో నూతన గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటించాయి. ప్రొఫెసర్ రాజశేఖరన్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2015లో కేరళ బీజేపీ చీఫ్‌గా నియమితులైయ్యారు. కాగా నూతన గవర్నర్లుగా నియమితులైన ఇద్దరూ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment