హైదరాబాద్: కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా బీజేపీ నగర మహిళామోర్చా అధ్యక్షురాలు బండారు రాధిక శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సెన్సార్‌బోర్డు రీజినల్ అధికారి టి.వి.కె.రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బండారు రాధిక శ్రీధర్ మాట్లాడుతూ... అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.