సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు.
కాగా, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
మరో వైపు, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి.
ఇదీ చదవండి: జిల్లాలవారీగా ‘వైఎస్సార్‌సీపీ’ ప్రత్యేక బృందాల వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment