coordinators
-
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు.కాగా, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.మరో వైపు, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి.ఇదీ చదవండి: జిల్లాలవారీగా ‘వైఎస్సార్సీపీ’ ప్రత్యేక బృందాల వివరాలు.. -
పార్లమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల నియామకం
-
వైఎస్సార్సీపీ సమన్వయకర్తల నియామకం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/ఏలూరు/రాజమహేంద్రవరం సిటీ/నెల్లూరు: రాష్ట్రంలో మరో ఆరు శాసనసభ, నాలుగు లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్సీపీ సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ప్రజాబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం పాటిస్తూ... ఆరో జాబితా తయారు చేసినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. గత ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా... ఈ సారి బీసీ వర్గానికి చెందిన మహిళా అడ్వొకేట్ గూడూరి ఉమాబాలను ఎంపిక చేశారు. రాజమండ్రి లోక్‌సభ స్థానానికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్(బీసీ)ను, గుంటూరుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరుకు సిటింగ్ ఎంపీ ఎన్.రెడ్డప్పను ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో మైలవరం శాసనసభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఈ సారి సర్నాల తిరుపతిరావు యాదవ్(బీసీ)ను నియమించారు. గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు శాసనసభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఇప్పుడు మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. మార్కాపురానికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరుకు ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, గంగాధరనెల్లూరు(ఎస్సీ)కు డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, నెల్లూరు సిటీకి ఎండీ ఖలీల్‌ను నియమించారు. వీరి నియామకంతో ఇప్పటివరకూ 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను కొత్తగా నియమించినట్టయింది. ఇప్పటిదాకా ప్రకటించిన శాసనసభ స్థానాల సమన్వయకర్తల్లో 21 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 18 మంది బీసీలు, ఐదుగురు మైనార్టీలు, 16 మంది ఓసీలకు చెందిన వారు ఉన్నారు. 16 లోక్‌సభ స్థానాలకు నియమించిన సమన్వయకర్తల్లో బీసీలు తొమ్మిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీలు నలుగురు ఉన్నారు. ఈసారి వెలువరించిన జాబితాలో ఐదుగురు కొత్తవారు ఉండటం గమనార్హం. గుంటూరు లోక్‌సభకు వెంకటరమణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపికైన ఉమ్మారెడ్డి వెంకటరమణ వాస్తవానికి తొలిసారిగా బరిలో నిలవనున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి చీఫ్ విప్‌గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఈయన పెద్దకుమారుడు. 1961లో జన్మించిన ఈయన మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాధ్యతలు చూస్తున్నారు. నర్సాపురం నుంచి తొలి బీసీ మహిళ నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా తొలిసారిగా బీసీ మహిళను ఎంపిక చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలైన గూడూరి ఉమాబాల పేరెన్నిక గన్న న్యాయవాది. న్యాయవాద విద్యలో బంగారు పతకం సాధించిన ఆమె న్యాయవాదిగా ఉంటూనే 1995 నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2001లో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఐఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్‌గా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, ద్వారకాతిరుమల దేవస్థానం పాలకమండలి సభ్యురాలుగా కూడా వ్యవహరించారు. ప్రజల నాడి పట్టగల డాక్టర్ శ్రీనివాస్ రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక చేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్వగ్రామం నరసాపురం. ఎంబీబీఎస్, డీఎల్ఓ (ఈఎన్టీ), ఎండీ (పల్మానాలజీ) ఎఫ్‌సీసీపీ అభ్యసించిన ఈయన విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో శ్వాసకోశ నిపుణులుగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ ఐఎంఏ సెక్రటరీగా, రాజమహేంద్రవరం ఏపీఎన్ఏ సెక్రటరీ ప్రెసిడెంట్‌గా, ఉమ్మడి తూర్పు గోదావరి ఇండియన్ చెస్ట్ సొసైటీ సభ్యునిగా వ్యవహరించారు. ఈయన భార్య గూడూరి రాధిక అడ్వొకేట్‌గా మాజీ కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన 8 నెలల క్రితం వైఎస్సార్సీపీలో చేరారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగారు. అనంతరం ఆయన స్థానంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను నియమించి, ఈయన్ను రాజమహేంద్రవరం లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. మృదు స్వభావిగా, వైద్యునిగా మంచి ఆదరణ పొందారు. జెడ్పీటీసీకి నియోజకవర్గ బాధ్యతలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన సర్నాల తిరుపతిరావు(బీసీ–యాదవ) ప్రస్తుతం జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2013నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నెల్లూరు సిటీ నుంచి డిప్యూటీమేయర్ నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన ఎండీ ఖలీల్ ప్రస్తుతం నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు నగరం 43వ డివిజన్ పరిధిలోని జెండావీధి ప్రాంతంలోగల కంతర్షావలీ దర్గా సమీపంలో నివసిస్తున్న మహ్మద్‌గౌస్, మహ్మద్‌జుబేదాబేగం దంపతుల ఏడుగురి సంతానంలో ఈయన చివరివాడు. డీవైఎఫ్ఐలో కొంతకాలం పనిచేసి, తరువాత సీపీఎంలో సభ్యుడిగా చేరారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఆయనకు అభిమానిగా మారారు. వైఎస్సార్ మరణం అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. 2013, 2021లో కార్పొరేటర్‌గా పోటీచేసి విజయం సాధించారు. -
ప్రజాభిప్రాయం.. సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: జన బలమే గీటు రాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ.. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. యువతకు ప్రాధాన్యమిస్తూ 15 శాసనసభ స్థానాలకు, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో జాబితాను ఖరారు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో గురువారం రాత్రి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు.. ఈ నెల 2న 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేశారు. మొత్తం మూడు జాబితాల్లో కలిపి 50 శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. గత ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి పెట్టగా, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని సమన్వయకర్తగా నియమించారు. శ్రీకాకుళం లోక్‌సభ సమన్వయకర్తగా పేరాడ తిలక్(బీసీ)ను నియమించారు. మంత్రి గుమ్మనూరి జయరాం(బీసీ)ను కర్నూలు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్‌సభ స్థానం(ఎస్సీ) సమన్వయకర్తగా, విజయవాడ లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా కేశినేని నానిలను నియమించారు. బీసీలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట మూడు జాబితాల్లో 50 శాసనసభ స్థానాల సమన్వయకర్తలను పరిశీలిస్తే.. సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో అగ్ర వర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీ పెట్టిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాల్లో బీసీ, రెండు స్థానాల్లో మైనార్టీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించారు. ఆరు శాసనసభ స్థానాలకు మహిళలను, 18 స్థానాల్లో యువతను సమన్వయకర్తలుగా నియమించారు. మొత్తమ్మీద 50 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో.. ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనార్టీలు 4, ఇతర వర్గాలు 13 (రెడ్డి, కాపు, వైశ్య) మంది ఉన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన 9 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. బీసీలు 6, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ ఉన్నారు. పెడన శాసనసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùను పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా, ఎమ్మెల్సీ మేరిగ మురళిని గూడూరుకు, , ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలికి సమన్వయకర్తలుగా నియమించారు. ఏపీఐఐసీ ౖచైర్మన్, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని రాయదుర్గం, మాజీ ఎమ్మెల్యే మూతిరేవుల సునీల్‌కుమార్‌ను పూతలపట్టు, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. జెడ్పీ చైర్మన్లకు అవకాశం శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియ విజయను ఇచ్చాపురం శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా సీఎం జగన్ నియమించారు. ఇచ్చాపురం జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిని రాజంపేట సమన్వయకర్తగా, చిప్పగిరి జెడ్పీటీసీ బూసినే విరూపాక్షిని ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. క్లీన్ స్వీప్ లక్ష్యం సీఎం వైఎస్ జగన్ గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూ.2.45 లక్షల కోట్లు.. నాన్ డీబీటీ రూపంలో రూ.1.67 లక్షల కోట్లు.. వెరసి రూ.4.12 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందితే.. అందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటం గమనార్హం. గత 56 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల రాష్ట్రంలో ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కళ్లెదుట కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. ప్రతి ఇంటా చేసిన మంచిని ప్రజలకు చెప్పి.. జనంతో మమేకమవుతూ సమస్యలు పరిష్కరించడం ద్వారా వారి మనసులు చూరగొని.. మరింత మంచి చేయడానికి ప్రజల ఆశీస్సులు కోరాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు మార్గ నిర్దేశం చేస్తూ వచ్చారు. ప్రజలతో మమేకం కాకుండా.. జనం మనసులు చూరగొనలేని వారికి టికెట్లు ఇవ్వలేనని ఆది నుంచి సీఎం వైఎస్ జగన్ తేల్చిచెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అవసరమైన స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ సమన్వయకర్తల జాబితాను ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఆదిలాబాద్ (ఎస్టీ)– సీతక్క, పెద్దపల్లి (ఎస్సీ) –డి.శ్రీధర్‌బాబు, కరీంనగర్– పొ న్నం ప్రభాకర్, నిజామాబాద్– టి.జీవన్‌రెడ్డి, జహీరాబాద్– టి.సుదర్శనరెడ్డి, మెదక్– దామోదర రాజనరసింహ, మల్కాజిగిరి– తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్– మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్– మల్లు భట్టి విక్రమార్క, మహబూబ్‌నగర్– రేవంత్‌రెడ్డి, చేవెళ్ల–రేవంత్‌రెడ్డి, నాగర్‌కర్నూలు (ఎస్సీ)– జూపల్లి కృష్ణారావు, నల్లగొండ– ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి– కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వరంగల్ (ఎస్సీ)– కొండా సురేఖ, మహబూబా బాద్ (ఎస్టీ)– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. -
TS: లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ► ఆదిలాబాద్- సీతక్క( అనసూయ) ►పెద్దపల్లి - శ్రీధర్‌బాబు ►కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ ►నిజామాబాద్ - జీవన్ రెడ్డి ►జహీరాబాద్ - సుదర్శన్ రెడ్డి ► మెదక్ - దామోదర రాజనర్సింహ ►మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు ►సికింద్రాబాద్, హైదరాబాద్ - మల్లు భట్టి విక్రమార్క ►చేవెళ్ల, మహబూబ్‌నగర్ - సీఎం రేవంత్ రెడ్డి ►నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు ►నల్గొండ - ఉత్తంకుమార్ రెడ్డి ►భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి ►వరంగల్ - కొండా సురేఖ ►మహబూబాబాద్, ఖమ్మం - శ్రీనివాస్ రెడ్డి -
కర్నూలులో YSRCP సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశం
-
కలసి నడుద్దాం.. ఘనవిజయం సాధిద్దాం
సాక్షి, అమరావతి: ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉందని, సమన్వయంతో అంతా కలసి పనిచేయడం ద్వారా ఘనవిజయం సాధిద్దామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమైన సీఎం జగన్ పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశం చేశారు. వారికి నిర్దేశించిన జిల్లాల్లో నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత సమర్థంగా నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది అందర్నీ ఒక్క తాటిపైకి తేవాలని సూచించారు. అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీ రావాలని, ఆ లక్ష్యంతోనే పనిచేయాలని నిర్దేశించారు. పార్టీ సమన్వయకర్తలుగా వారు తనతో ఏ విషయాన్నైనా చర్చించవచ్చని, ఎప్పుడైనా కలవవచ్చని సూచించారు. ‘పార్టీ పరంగా మీరు నా టాప్ టీమ్’ అని పేర్కొన్నారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల రూపంలో చక్కటి యంత్రాంగం ఉందని, వలంటీర్లను వారితో మమేకం చేయాలన్నారు. ఈ యంత్రాంగం చురుగ్గా పని చేసేలా, క్రియాశీలకంగా వ్యవహరించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. వాటిని సజావుగా, సమర్థంగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వర్తించేలా పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలను స్వీకరించాలని సూచించారు. ‘మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలసి ముందుకుసాగితే ఎన్నికల్లో విజయభేరి మోగించడం తథ్యం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ
అమరావతి: ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్ పార్టీకి చెందిన ప్రాంతీయన సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే…. ► ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది. ► పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. ► మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీనేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే. ► ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి. ► అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి. ► ఆ లక్ష్యంతోనే మీరు సంకల్పంతో పనిచేయాలి. ► పార్టీ సమన్వయ కర్తలుగా మీరు నాతో ఏ విషయాన్నైనా చర్చించండి. ► ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టాప్ టీం. ► సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది. వాలంటీర్లను వారితో మమేకం చేయాలి. ► ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం. ► ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి. ► మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకుసాగాలి. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, భూమన కరుణాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్, రామసుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి, బీద మస్తాన్ రావు తదితరులు హాజరైయ్యారు. -
కేసీఆర్ బిగ్ ప్లాన్.. బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్తలు వీరే..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా చేపట్టే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతలను జిల్లాలవారీగా నాయకులకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఆయా జిల్లాల సమన్వయకర్తల జాబితాను సోమవారం విడుదల చేశారు. నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి ఆతీ్మయ సమ్మేళనాలు మొదలుకొని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, విద్యార్థి విభాగం సమావేశాలు.. ఇలా అనేక కార్యక్రమాలను రాబోయే నాలుగు నెలల్లో పెద్ద ఎత్తున చేపట్టాలని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పార్టీ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన వివిధ స్థాయిల నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్యక్షులను సమన్వయం చేసేందుకు వీరిని నియమించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఈ బృందం, జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు పార్టీ నియమించిన నాయకులు తమకు బాధ్యతలు అప్పజెప్పిన జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక, అమలుపై చర్చించాలని సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఈ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలవారీగా బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే.. జిల్లా – సమన్వయకర్త హైదరాబాద్ – దాసోజు శ్రవణ్ వనపర్తి, జోగుళాంబ గద్వాల – తక్కళ్లపల్లి రవీందర్ రావు మేడ్చల్ – పల్లా రాజేశ్వర్ రెడ్డి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల – బస్వరాజు సారయ్య నల్లగొండ – కడియం శ్రీహరి వికారాబాద్ – పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రంగారెడ్డి – ఎల్.రమణ భద్రాద్రి కొత్తగూడెం – టి.భానుప్రసాద్ రావు సంగారెడ్డి – వెంకట్రాంరెడ్డి మెదక్ – ఎగ్గే మల్లేశం మహబూబ్‌నగర్, నారాయణపేట – కసిరెడ్డి నారాయణరెడ్డి యాదాద్రి భువనగిరి – యాదవరెడ్డి నాగర్ కర్నూల్ – పట్నం మహేందర్ రెడ్డి భూపాలపల్లి, ములుగు – అరికెల నర్సారెడ్డి సిద్దిపేట – బోడకుంట్ల వెంకటేశ్వర్లు హనుమకొండ, వరంగల్ – ఎమ్.ఎస్.ప్రభాకర్ నిర్మల్, ఆదిలాబాద్ – వి.గంగాధర్ గౌడ్ మంచిర్యాల, ఆసిఫాబాద్ – నారదాసు లక్ష్మణ్ జనగామ – కోటిరెడ్డి మహబూబాబాద్ – పురాణం సతీశ్ కామారెడ్డి – దండే విఠల్ నిజామాబాద్ – బండ ప్రకాశ్ జగిత్యాల – కోలేటి దామోదర్ పెద్దపల్లి – ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖమ్మం – శేరి సుభాష్‌రెడ్డి సూర్యాపేట – మెట్టు శ్రీనివాస్. -
కేసీఆర్ కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ ఆయనే..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ను అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు తివారిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే, మహారాష్ట్రలోని ఆరు డివిజన్లకు కోఆర్డినేటర్లను కూడా సీఎం కేసీఆర్ నియమించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోఆర్డినేటర్లు వీరే.. - నాసిక్ డివిజన్ దశరథ్ సావంత్ - పూణే డివిజన్ బాలా సాహెబ్ జయరాం - ముంబై డివిజన్ విజయ్ తానాజీ - ఔరంగాబాద్ డివిజన్ సోమ్‌నాథ్ తోరట్ - నాగపూర్ డివిజన్ ద్యానెష్ వకుడ్కర్ - అమరావతి డివిజన్ నిఖిల్ దేశ్‌ముఖ్. -
పార్టీని మరింత బలోపేతం చేయడంపై సీఎం వైఎస్ జగన్ దృష్టి
-
11 మంది పార్టీ సీనియర్లకు సీఎం జగన్ కీలక బాధ్యతలు
-
రాష్ట్ర సాంకేతిక సమన్వయకర్తల నియామకం
సాక్షి, అమరావతి: పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. వారిలో చేకూరి కిరణ్, జక్కం సుధాకర్‌రెడ్డి, మల్లాది సందీప్‌కుమార్, ఎ.లింగారెడ్డి, కేపీ ప్రసాద్‌రెడ్డి, ఐ.నారాయణరెడ్డి, జి.దశరథరామిరెడ్డి, వై.రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. వీరంతా నిరంతరం సమాచారం,కథనాలపై నివేదికలను రూపొందిస్తూ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో)కు ఎప్పటికప్పుడు నివేదిస్తారు. ఈ బృందం సభ్యులను గతంలో ‘సాంకేతిక సమన్వయకర్తలు’గా ప్రభుత్వం నియమించగా.. తాజాగా వారి పోస్టుల్ని ‘రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలు’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేస్తారని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో వెల్లడించింది. -
బంగారు కాదు.. బాధల తెలంగాణ
పెద్దపల్లి రూరల్: పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామంటూ పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి బాధల తెలంగాణాగా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల గోవర్ధనశాస్త్రీ అన్నారు. పెద్దపల్లి అమరవీరుల స్థూపం వద్ద రిలేదీక్ష చేస్తున్న సాక్షరభారత్ కోఆర్డినేటర్ల శిబిరాన్ని పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్మ రాజయ్యయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా గోవర్ధనశాస్త్రీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ ఏమో కానీ సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు మయమైందన్నారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, స్వరాష్ట్రంలో ఇక కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని ప్రకటించి, పీఠమెక్కాక ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సాక్షరభారత్ కోఆర్డినేటర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రెండు నెలలుగా దీక్ష చేస్తున్నా కనీసం స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎనిమిదేళ్లపాటు గ్రామాల్లో అక్షరాలు నేర్పించడంతోపాటు సర్కార్ పథకాల అమల్లోనూ పాలుపంచుకున్నా వారికి ఉద్యోగభద్రత కల్పించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి మరెంతో కాలం సాగదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో పేదకుటుంబాల్లో వెలుగునింపేలా పథకాలకు రూపకల్పన చేశారని తెలిపారు. ఆ పథకాల ఫలాలు పొందినవారంతా ఇప్పటికీ వైఎస్సార్‌ను తమ హృదయాల్లో పదిలపర్చుకున్నారని పేర్కొన్నారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత చదువులు టీఆర్ఎస్ పాలనలో అందని ద్రాక్షగా మారాయన్నారు. టీఆర్ఎస్ పాలనలో కిందిస్థాయి ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ సాక్షరభారత్, పంచాయతీ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు నిరసనలు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నిరసనలో భాగంగా కోఆర్డినేటరుల దీక్షా శిబిరం వద్ద సంక్రాంతి ముగ్గులు వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మారం వెంకటరమణ, రజిత, స్వప్న, లలిత, శ్రీలత, శ్రీవాణి, కమల, ఎలిగేడు, జూలపల్లి మండలాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
సాక్షరభారత్ వ్యవస్థకు మంగళం
నేరడిగొండ(బోథ్): సాక్షర భారత్ వ్యవస్థకు మంగళం పాడడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పథకం మార్పుకు సంబంధించిన ఉత్తర్వుల జారీపై వయోజన విద్య సంచాలకులకు సంకేతాలు కూడా అందినట్లు తెలుస్తోంది. 2009లో అప్పటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులుగా ఉన్న వయోజనులు అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా సాక్షరభారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో సాక్షర భారత్ సెంటర్లను ప్రారంభించి, ఫర్నిచర్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, న్యూస్ పేపర్లు వంటి సదుపాయాలు కల్పించింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఇద్దరు చొప్పున చదువుకున్న స్థానికులైన నిరుద్యోగులను గ్రామ కోఆర్డినేటర్లుగా, మండల కోఆర్డినేటర్‌గా నియమించింది. వారు ప్రతిరోజు ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 9గంటల వరకు వయోజనులను అక్షరాస్యులుగా తయారు చేయడానికి విధులు నిర్వర్తించారు. ఇప్పటికే వారికి రెండేళ్లుగా వేతనాలు ఇవ్వక, విధులు కల్పించకపోవడంతో కోఆర్డినేటర్లంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ఆందోళనలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోఆర్డినేటర్ల కొనసాగింపుపై ఎలాంటి హామీ రాలేదు. ఈ క్రమంలో సాక్షరభారత్ స్థానంలో ‘పడ్నా.. లిఖ్నా అభియాన్’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహణ.. త్వరలో ప్రారంభించనున్న కొత్త పథకాన్ని 2020 మార్చి వరకు కొనసాగించే విధంగా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొత్తగా అమలు చేయనున్న పడ్నా.. లిఖ్నా అభియాన్ పథకంలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బాధ్యతలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అప్పగించనున్నట్లు సమాచారం. కోఆర్డినేటర్ల ఆందోళన.. వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నియమించిన సాక్షరభారత్ కోఆర్డినేటర్ల భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 866 గ్రామపంచాయతీల్లో ఇద్దరు చొప్పున 1732 మంది కోఆర్డినేటర్లు, 52 మండలాలకు ఒక్కొక్కరు చొప్పున 52 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ప్రతినెల గౌరవ వేతనంగా గ్రామ కోఆర్డినేటర్లకు రూ.2వేలు, మండల కోఆర్డినేటర్లకు రూ.6వేల గౌరవ వేతనం చెల్లించారు. నాలుగు, ఐదు నెలలకు ఒక్కసారి వచ్చిన వేతనాలతో తమ కుటుంబాలను పోషించుకున్న తమను తొలగిస్తే పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో కోఆర్డినేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తమకు ఏ రంగంలోనైనా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి కల్పించాలని ఆయా గ్రామాలు, మండలాల కోఆర్డినేటర్లు కోరుతున్నారు. ఆశించిన ఫలితం రాకపోవడం వల్లనే.. సాక్షర భారత్ పథకం ప్రారంభంలో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ రాను రాను డీలా పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సంబంధిత ఉన్నతస్థాయి అధికారులు పర్యవేక్షించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కోఆర్డినేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా ప్రయోజనం ఉండడం లేదని కేంద్రం గ్రహించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితమే సాక్షరభారత్ సేవలను నిలిపివేసినట్లు తెలిసింది. -
అనంతపురం, హిందూపురం..రంగయ్య, నదీమ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం, హిందూపురం పార్లమెంట్లకు వేర్వేరుగా సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ల సమన్వయకర్తగా ఇప్పటి వరకూ కొనసాగిన తలారి పీడీ రంగయ్యను అనంతపురం పార్లమెంట్మన్వయకర్తగా నియమించారు. అలాగే అనంతపురం అర్బన్ సమన్వయకర్తగా ఉన్న నదీమ్ అహ్మద్‌ను హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రా మిరెడ్డిని అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు. సముచిత నిర్ణయమే హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్ అహ్మద్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయమే. వైఎస్సార్ కుటుంబానికి ముందు నుంచి మైనార్టీలు అంటే చాలా ప్రేమ. 2004 ఎన్నికల్లో సైతం హిందూపురం పార్లమెంట్ స్థానానికి కదిరికి చెందిన కర్నల్ నిజాముద్దీన్‌కి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో సైతం మళ్లీ మైనార్టీ అభ్యర్థి అయిన ఖాసీమ్ఖాన్కు టికెట్ ఇచ్చారు. అయితే ప్రజారాజ్యం పార్టీ తరపున కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో ఉండడం వల్ల ఖాసీం ఖాన్ ఓటమి పాలయ్యేవాడు. లేకపోతే అప్పుడు కూడా మైనార్టీ అభ్యర్థే గెలుపొందేవారు. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్రెడ్డి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. నదీమ్ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా టీడీపీ మైనార్టీ అభ్యర్థిని నిలపలేదు. ఏపీ కేబినెట్లో కూడా మైనార్టీకి అవకాశం లేదు. మేము కదిరి అసెంబ్లీకు మైనార్టీ అభ్యర్థిగా చాంద్‌బాషాకు అవకాశం ఇచ్చాం. అతను పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్‌ను నియమించింది. ఈ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం. నదీమ్ మంచి వ్యక్తి, సౌమ్యుడు ఖచ్చితంగా అతనికి తామంతా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. అతని నియామకాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నదీమ్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తాం. వైఎస్.జగన్మోహన్రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పార్లమెంటరీ జిల్లాలకు కో ఆర్డినేటర్లు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
సారథులేరీ?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్తో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాలకు అధ్యక్షులు లేకుండానే నెట్టుకొస్తున్నాయి. జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే బీజేపీ, వైఎస్సార్సీపీ, సీపీఎం నూతన జిల్లాలకు కార్యవర్గాలను ప్రకటించాయి. వరుస వలసలతో కుదేలైన టీడీపీ జిల్లా అధ్యక్షుడిని నియమించేందుకు వెనుకంజ వేస్తోంది. సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీల కార్యకలాపాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. మరోవైపు ఆయా పార్టీల్లో లీడర్లు, కేడర్ కట్టు తప్పి వ్యవహరిస్తున్నా నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 2016 అక్టోబర్‌లో ఆయా జిల్లాలకు పార్టీ నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేసింది. పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు రిసార్టులో సమావేశమైన ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు కార్యవర్గం కూర్పుపై చర్చించి జాబితాలు సిద్ధం చేశారు. కొత్త జిల్లాల అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను మాత్రం పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ప్రకటన వాయిదా పడుతూ వచ్చింది. 2017 మార్చిలో సభ్యత్వ సేకరణపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంస్థాగత నిర్మాణంలో 51శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటుతో సరిపెట్టిన అధిష్టానం జిల్లా కమిటీపై స్పష్టత ఇవ్వలేదు. ఇదిలావుంటే 2017 అక్టోబర్‌లో 66 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఫరీదుద్దీన్, చాగన్ల నరేంద్రనాథ్ ప్రధాన కార్యదర్శులుగా, బక్కి వెంకటయ్య, సపాన్‌దేవ్, రాధాకృష్ణశర్మ, పన్యాల భూపతిరెడ్డి, ఫారూక్ హుస్సేన్, గౌటి అశోక్ కార్యదర్శులుగా చోటు దక్కించుకున్నారు. చాగన్ల నరేంద్రనాథ్‌కు ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. పన్యాల భూపతిరెడ్డి (సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక), వేలేటి రాధాకృష్ణ శర్మ (మెదక్, నర్సాపూర్, అందోలు), ఫరీదుద్దీన్ (పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి)కి సమన్వయ బాధ్యతలు ఇచ్చారు. నరేంద్రనాథ్ సహా, మిగతా నేతలెవరూ ఇప్పటి వరకు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కాగా ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మురళీయాదవ్ సంగారెడ్డి జిల్లాతో పాటు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వ్యవహరిస్తుండగా, కొత్త జిల్లాల్లో అధ్యక్షుల నియామకం, కమిటీల ఏర్పాటుపై టీపీసీసీ శ్రద్ధ చూపడం లేదు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి దాదాపు ఖరారైనా, సిద్దిపేట, మెదక్ జిల్లా అధ్యక్షులపై ఏకాభిప్రాయం లేక వాయిదా పడింది. రాష్ట్ర స్థాయిలో కొత్త జిల్లాల అధ్యక్షుల నియామకంపై ఎలాంటి కసరత్తు జరగకపోవడంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో జిల్లాలో జరిగిన టీపీసీసీ బస్సు యాత్రకు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నారు. బస్సు యాత్ర ముగిసిన తర్వాత జిల్లా అధ్యక్షుడిని ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపించినా, టీపీసీసీ నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ కనిపించడం లేదు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన శశికళ యాదవరెడ్డి, జిల్లాల పునర్విభజన తర్వాత సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. రేవంత్‌రెడ్డితో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు బట్టి జగపతి, శశికళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పటాన్చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ ఆసక్తి చూపుతున్నా, నియామకంపై ప్రకటన వెలువడడం లేదు. సంస్థాగతం.. అస్తవ్యస్తం ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో సమన్వయం లేక గ్రూపులుగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో ఆరంభం నుంచి పనిచేస్తున్నవారు, వివిధ పార్టీల నుంచి వచ్చిన చేరిన వారి మధ్య అంతరం నెలకొంది. ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న వారినే దగ్గరకు తీసుకుంటుండడంతో, మిగతా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం ఉన్న సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నర్సాపూర్‌లో ఏకతాటిపై పని చేస్తున్నారు. బహుళ, బలహీన నాయకత్వాలు ఉన్న నారాయణఖేడ్, పటాన్చెరు, మెదక్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎవరికి వారే రీతిలో వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటు కార్యవర్గాలను ప్రకటిస్తే కొంత మేర పరిస్థితి మెరుగయ్యే అవకాశాలున్నా టీపీసీసీ పట్టించుకోకపోవడంపై కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. -
లోక్‌సభ స్థానాలకు టీడీపీ సమన్వయకర్తలు వీరే!
సాక్షి, అమరావతి : లోకసభ నియోజకవర్గాలకు గతంలో మంత్రులను ఇన్చార్జిలుగా నియమించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా పార్టీ నుంచి సమన్వయకర్తలను కూడా నియమించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గానికి పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, విశాఖపట్నం ఇన్చార్జిగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, అనకాపల్లి సమన్వయకర్తగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అరకు సమన్వయకర్తగా అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కాకినాడకు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అమలాపురానికి పాతపట్నం ఎమ్మెల్యే కే వెంకటరమణ, రాజమండ్రికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నర్సాపురానికి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఏలూరుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, విజయవాడకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును నియమించారు. మచిలీపట్నం సమన్వయకర్తగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, గుంటూరుకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, నరసరావుపేటకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, బాపట్లకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వి వెంకటేశ్వరరావు, ఒంగోలుకు తెనాలి ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్, నెల్లూరుకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తిరుపతికి గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, రాజంపేటకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కడపకు ఎమ్మెల్సీ రాజసింహులు, నంద్యాలకు రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి, కర్నూలుకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి, అనంతపురానికి ఏపీఎస్ఐడీసీ ఛైర్మన్ కేఈ ప్రభాకర్, హిందూపురానికి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడిని సమన్వయకర్తలుగా నియమించారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ, కలమట వెంకట రమణలతోపాటు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించడం విశేషం. 24 మందిని నియమించగా చిత్తూరుకు మాత్రం నియమించలేదు. -
20 మంది కో ఆర్డినేటర్ల సస్పెన్షన్
కరీంనగర్: వయోజన విద్యాశాఖలో వీసీవోల వేతనాలు స్వాహా చేసిన 20 మంది మండల కోఆర్డినేటర్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో వయోజన విద్యాశాఖ వీసీవోలకు చేరాల్సిన వేతనాలను మండల కోఆర్డినేటర్లు స్వాహా చేశారు. ఈ అంశంపై బాధితులు ఫిర్యాదు చేయడంతో.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు 20 మంది మండల కోఆర్డినేటర్లను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వైఎస్ఆర్ సీపీ 'మహాధర్నా'కు కోఆర్డినేటర్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే మహాధర్నాకు కో ఆర్డినేటర్లకు నియమించారు. ధర్నాను జయప్రదం చేసేందుకు జిల్లాలవారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం-బేబినాయన విజయనగరం-సుజయ్‌కృష్ణ రంగారావు విశాఖపట్నం-తలశిల రఘురాం తూర్పుగోదావరి-గొల్ల బాబూరావు పశ్చిమగోదావరి-ధర్మాన ప్రసాదరావు కృష్ణా-మోపిదేవి వెంకటరమణ గుంటూరు-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకాశం-బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు-భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కడప-జంగా కృష్ణమూర్తి అనంతపురం-విజయసాయి రెడ్డి కర్నూలు-భూమా నాగిరెడ్డి -
వయోజన విద్యపై నిర్లక్ష్య నీడ
గిద్దలూరు, న్యూస్‌లైన్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సాక్షర భారత్ కార్యక్రమం ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. జిల్లాలోని 2082 మంది గ్రామ కోఆర్డినేటర్లు, 56 మంది మండల కోఆర్డినేటర్లు నెలల తరబడి వేతనాలందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలపై అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదిగో..ఈవారం వస్తున్నాయని చెబుతున్నారు తప్ప కార్యరూపం దాల్చడం లేదని కోఆర్డినేటర్లు వాపోతున్నారు. జిల్లాలోని వివిధ స్థాయిల్లో ఉన్న కోఆర్డినేటర్లు ఎవరికీ వేతనాలు అందకపోవడంతో వీటి ప్రభావం వయోజన విద్యా కేంద్రాలపై పడుతోంది. వివిధ స్థాయిల్లో... వయోజనులకు అక్షరజ్ఞానం నేర్పించేందుకు 2009 లో సాక్షరభారత్ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని వయోజన విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డెరైక్టర్ సాక్షర భారత్ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. డివిజన్ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లు వారి పరిధిలో నిర్వహణ బాధ్యతలు చేపట్టి పథకాన్ని నడిపిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఇద్దరు గ్రామ కోర్డినేటర్లను నియమించారు. వీరు వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసి వయోజనులను అక్షరాస్యులుగా చేయాల్సి ఉంది. గ్రామ కోఆర్డినేటరుకు నెలకు రూ.2 వేలు, మండల కోఆర్డినేటరుకు రూ.6 వేలుగా వేతనాన్ని నిర్ణయించారు. అక్షరాలు నేర్పడమే లక్ష్యంగా... 4 సాక్షర భారత్ కోఆర్డినేటర్లు స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, పాఠశాలలు వంటి ప్రదేశాల్లో 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వారిని ఎంపిక చేసి కనీసం 30 మందికి తగ్గకుండా సమీకరించి వారికి అక్షరాలు నేర్పించాలి. 4 పుస్తకాలు, పత్రికలు చదివేలా వారిని తీర్చిదిద్దాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ వారు దశలవారీగా వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో పరిస్థితి ఇదీ... ప్రస్తుతం జిల్లాలో మొత్తం 2,082 వయోజన విద్యా కేంద్రాలున్నాయి. వీటిలో 62,460 మంది వయోజనులు అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఇలా జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా వయోజనులు అక్షరాస్యులుగా మారుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో 188 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తుండగా, వీరికి వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 నెలలుగా అందని వేతనాలు: సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఇచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా సకాలంలో అందించడం లేదు. 2012 సెప్టెంబర్ వరకు సజావుగా వేతనాలందాయి. ఆ తరువాత ఆ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వేతనాలు విడుదల చేసినా..వాటిని కోఆర్డినేటర్లకు ఇవ్వలేదు. ఆ మూడు నెలల వేతనాలకు తోడు 2013 ఏడాది మొత్తం జీతాన్ని కూడా విడుదల చేయలేదు. మొత్తం మీద 15 నెలలుగా వేతనాలందక కోఆర్డినేటర్లు అవస్థపడుతున్నారు. జీతం లేకపోవడంతో వారు కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కొన్ని కేంద్రాలు ఇప్పటికే మూతపడగా..మరికొన్ని నామమాత్రంగా నడుస్తున్నాయి. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. వేతనాల చెల్లింపులపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. వేతనాల్లో జాప్యం వాస్తవమే.. సి.వీరభద్రరావు, డిప్యూటీ డెరైక్టర్ కోఆర్డినేటర్లకు వేతనాలు జాప్యమైన మాట వాస్తవమే. 2012 డిసెంబరు నెల వరకు నిధులు విడుదలయ్యాయి. 2013 సంవత్సరానికి రావాల్సిన వేతనాల నిధులు మరో 10 రోజుల్లో అన్ని మండలాలకు విడుదల చేస్తాం. గతంలో మూడు నెలలకు విడుదలైన వేతనాలు ఆయా మండలాల అధికారులు ఇవ్వాల్సి ఉంది. వాటిని త్వరలో ఇస్తారు. -
పండుగకు పస్తులే..!
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలోని 866 గ్రామపంచాయతీల్లో సాక్షర భారత్ కేంద్రాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు 1732 గ్రామ కో ఆర్డినేటర్లు, 52 మంది మండల కో ఆర్డినేటర్లను నియమించారు. వేతనం నెలకు గ్రామ కో ఆర్డినేటర్‌కు రూ.2 వేలు, మండల కో ఆర్డినేటర్‌కు రూ.6 వేలు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా నిధుల నుంచి కో ఆర్డినేటర్ల వేతనాలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో 14 నెలలుగా వేతనాలు అందక కో ఆర్డినేటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కో ఆర్డినేటర్లకు 2012 అక్టోబర్ వరకు, గ్రామ కో ఆర్డినేటర్లకు 2012 నవంబర్ వరకు జీతాలు అందారుు. మండల కో ఆర్డినేటర్లకు 14 నెలలు, గ్రామ కోఆర్డినేటర్లకు 13 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగానైనా వేతనాలు విడుదల చేస్తారని ఆశించిన కో ఆర్డినేటర్లకు నిరాశే ఎదురైంది. దీంతో పండుగ వేళ పచ్చడి మెతుకులే గతి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేబులోంచి .. ప్రతి నెలలో రెండుసార్లు మండల కేంద్రంలో నిర్వహించే శిక్షణకు గ్రామ కోఆర్డినేటర్లు వారి సొంత డబ్బులతో హాజరవుతున్నారు. సాక్షర భారత్ కేంద్రంలో రోజూ రెండు దినపత్రికలు, ఇతరత్ర పుస్తకాలనూ వారి డబ్బులతోనే కొంటున్నారు. వేతనం పెండింగ్‌లో ఉండడంతో కొందరు కో ఆర్డినేటర్లు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి కేంద్రాల నిర్వహణ కొనసాగిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ వైఖరితో విసిగిపోరుు నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు ఆసక్తి చూపడంలేదు. మండల కో ఆర్డినేటర్లు ప్రతీ సాక్షర భారత్ కేంద్రాన్ని తనిఖీ చేయాల్సి ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పర్యవేక్షణపై శ్రద్ధ చూపడంలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలున్నారుు. ఎస్బీఐలోనే ఖాతా.. గతంలో కో ఆర్డినేటర్లకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే వారికి అందులోనే వేతనం జమచేసేవా రు. ఈ క్రమంలో ప్రభుత్వం వేతనాల నిధు లు విడుదల చేయనుందని, కోఆర్డినేటర్లు ఎస్బీఐలో ఖాతా తెరవాలని అధికారులు గత నెలలో హుకుం జారీ చేశారు. దీంతో కో ఆర్డినేటర్లు ఎస్బీఐలో ఖాతా తెరిచే పనిలో నిమగ్నమయ్యూరు. దీనికితోడు వేతనం పొందేం దుకు గ్రామపంచాయతీ నుంచి డ్యూటీ సర్టిఫికెట్ సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లు వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో ఆర్డినేటర్లకు బ్యాంకు ఖాతా తెరిచేందుకు రూ.500 అదనపు భారంగా మారింది. కొన్నిచోట్ల డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి పంచాయతీ సిబ్బంది మామూళ్లు అడుగుతుండడంతో కో ఆర్డినేటర్ల బాధలు వర్ణనాతీతం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పేపర్, ఇతరత్రా బిల్లులు చెల్లించాలని కో ఆర్డినేటర్లు కోరుతున్నారు. ఖర్చులు మేమే భరిస్తున్నం మాకు 2012 అక్టోబర్‌లో వేతనాలు అందించాక ఇప్పటి వర కు వేతనం చెల్లించలేదు. మా జేబులో నుంచే డబ్బులు ఖర్చుపెట్టి మండల కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తున్నం. సాక్షర భారత్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నం. వేతనాలు వస్తాయనే ఆశతో ప్రతినెలా అప్పులు చేస్తూ పోతున్నం. సంక్రాంతి పండుగకైనా వేతనాలు చెల్లిస్తారనుకుంటే ఉత్తదే అరుుంది. ఇలాగైతే పండుగ ఎలా జరుపుకోవాలి. - ఎం.ప్రకాశ్, మండల కో ఆర్డినేటర్, మంచిర్యాల అప్పులు చేస్తున్నం 13 నెలలుగా మాకు వేతనాలు చెల్లించడంలేదు. ఇప్పటికే ప్రతి నెలా అప్పులు చేసి బతుకుతున్నం. ఇప్పుడేమో వేతనం కా వాలంటే ఎస్బీఐలో ఖాతా తె రవాలంటున్నారు. తప్పనిసరి కావడంతో రూ.500 అప్పు చేసి ఖాతా తెరిచా. వేతనాలు సంక్రాంతికి ముందే ఇస్తామన్నారు. డ్యూటీ సర్టిఫికెట్ కావాలంటే అది కూడా సమర్పించిన. కానీ వేతనం మాత్రం చెల్లించలేదు. - ఎం.అపర్ణ, గ్రామ కోఆర్డినేటర్, తీగల్‌పహాడ్ డ్యూటీ సర్టిఫికెట్లు ఇస్తే జీతం 14 నెలలుగా సాక్షర భారత్ కో ఆర్డినేటర్లకు వేతనాలు చెల్లించలేదు. ఇటీవలే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. కో ఆర్డినేటర్లు వారు పనిచేసిన నెలలకు సంబంధించి ఆయా పంచాయతీల నుంచి డ్యూటీ సర్టిఫికెట్లు సమర్పించాలని 15 రోజుల క్రితం చెప్పాం. ఆయా సర్టిఫికెట్లు మాకు అందగానే వాటిని పరిశీలించి 12 నెలల వేతనాలు వారి ఖాతాల్లో జమచేస్తాం. - రామానుజరావు, వయోజన విద్యా డెప్యూటీ డెరైక్టర్