సాక్షి, అమరావతి : లోకసభ నియోజకవర్గాలకు గతంలో మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా పార్టీ నుంచి సమన్వయకర్తలను కూడా నియమించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గానికి పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, విశాఖపట్నం ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, అనకాపల్లి సమన్వయకర్తగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అరకు సమన్వయకర్తగా అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కాకినాడకు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అమలాపురానికి పాతపట్నం ఎమ్మెల్యే కే వెంకటరమణ, రాజమండ్రికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నర్సాపురానికి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, ఏలూరుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, విజయవాడకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును నియమించారు.
మచిలీపట్నం సమన్వయకర్తగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, గుంటూరుకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, నరసరావుపేటకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, బాపట్లకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వి వెంకటేశ్వరరావు, ఒంగోలుకు తెనాలి ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్, నెల్లూరుకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తిరుపతికి గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, రాజంపేటకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కడపకు ఎమ్మెల్సీ రాజసింహులు, నంద్యాలకు రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి, కర్నూలుకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి, అనంతపురానికి ఏపీఎస్‌ఐడీసీ ఛైర్మన్ కేఈ ప్రభాకర్, హిందూపురానికి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడిని సమన్వయకర్తలుగా నియమించారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ, కలమట వెంకట రమణలతోపాటు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించడం విశేషం. 24 మందిని నియమించగా చిత్తూరుకు మాత్రం నియమించలేదు.
Published Mon, Sep 25 2017 1:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM
Advertisement