Censor board member
-
'రాధేశ్యామ్' మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా 'రాధేశ్యామ్' కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సార్ కార్యాక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ (అని చెప్పుకునే) సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందో చెప్పుకొచ్చాడు.'రాధేశ్యామ్ సినిమా చూశాను. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్- పూజాల కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్గా అనిపించింది. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఇది ఒక యూనిక్ సబ్జెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే రాధేశ్యామ్.. క్లాసిక్, స్టైలిష్, థ్రిల్లింగ్, మిస్టరీ అండ్ రొమాంటిక్. రాధేశ్యామ్ ఒక ఎపిక్. ప్రభాస్ అదరగొట్టేశాడు. అతని డ్రెస్సింగ్, యాక్టింగ్ అద్భుతం. భారతదేశంలో ప్రభాస్ క్లాస్, స్టైల్‌ను బీట్ చేసేవాళ్లే లేరు' అంటూ యంగ్ రెబల్ స్టార్‌ను ఆకాశానికెత్తాడు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే రాధేశ్యామ్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయని సమాచారం. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుండగా, జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ, సత్యన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సుమారు రూ. 300కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. Nobody can beat Class & Style of #Prabhas in India ! He has Sexiest Swag in #RadheShyam ! Totally LOVED & LOVED his performance & wardrobes ❤❤❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 Done with Overseas Censor Screening of #RadheShyam ❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 Done First Half of #RadheShyam ! Outstanding VFX used in the movie. #Prabhas𓃵 & #PoojaHegde chemistry is Electrifying 🔥 ! Mystery continues in #RadheShyam. What a unique subject ❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 #RadheShyam is truly Cinematic Experience! Climax is the USP of film 🍿❤️🔥 — Umair Sandhu (@UmairSandu) March 5, 2022 -
తెనాలి నుంచి యూ ట్యూబ్ చానల్
తెనాలి: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వీక్షకులను తన వశం చేసుకున్న యూట్యూబ్ ఆధారిత చానల్ తెనాలి నుంచి ప్రారంభించనున్నట్లు టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర ఫిలిం సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వెల్లడించారు. స్థానిక చెంచుపేటలోని తన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. టీవీ చానల్స్ తరహాలోనే యూట్యూబ్ చానల్లో అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం ఆకర్షణీయ కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయనున్నట్లు వివరించారు. చానల్ ప్రసారాలు భారత్‌తో పాటు అమెరికా, కెనడా, ఇటలీ, జర్మనీ, యూకే దేశాల్లో ఆయా స్థానిక భాషల్లో ప్రసారం చేసేలా తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్త చేసినట్లు చెప్పారు. ఒక్కో దేశంలో ఒక్కో సీఈవో ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు. తెలుగు కార్యక్రమాల రూపకల్పనకు ఈ రంగంలో అనుభవజ్ఞులైన పుట్టా శ్రీధర్, సి.సుజాత, ముత్తపు రాంబాబు, శ్రీనివాసకుమార్ దర్శకత్వ బాధ్యతల్లో ఉంటారని దిలీప్‌రాజా చెప్పారు. పెదరావూరు స్టూడియోలో షూటింగ్ నుంచి ప్రసారం వరకు అవసరమైన ఎడిటింగ్, డబ్బింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలతో సహా ఇక్కడే జరుగుతాయన్నారు. వారాంతపు చర్చలు ‘షాడో’, విద్యార్థులతో ‘పాస్వర్డ్’, మహిళలకు ‘ఇండియా టేస్టస్ట్’, యువతకు ‘డ్యాన్స్ చాలెంజ్’, రాజకీయనేతల ‘మై వాయిస్’ కార్యక్రమాలుంటాయని వివరించారు. ‘దిలీప్ రాజా యూట్యూబ్ చానల్’ పేరుతో ఆవిష్కరించే ఈ చానల్లో ఔత్సాహికులు తీసే షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలనూ ప్రసారం చేస్తామన్నారు. -
రాజీపడే ప్రశ్నే లేదు
‘సాక్షి’తో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా తెనాలికి చెందిన టీవీ చిత్రాల దర్శకుడు దిలీప్‌రాజా.. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. 14 మంది సభ్యులతో కూడిన సెన్సార్ బోర్డు పదవిని స్వీకరించి శుక్రవారం తెనాలి వచ్చిన ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. మంచి సినిమాలను ప్రేక్షకులే ఆదరించాలని, సమాజానికి హాని కలిగించే చిత్రాలను తిప్పికొట్టాలని చెప్పారు. సెన్సార్ బోర్డు సభ్యుడిగా తనకున్న పరిమితుల ప్రకారం వ్యవహరిస్తానని స్పష్టంచేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మీ సినీ నేపథ్యం మూడు దశాబ్దాలుగా దాదాపు 300 వరకూ టీవీ ఎపిసోడ్స్, టెలీ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఎన్నో పాఠాలు నేర్పింది. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు... ప్రశ్నార్థకంగా నిలిచిపోయాయి. వెనకాల వెక్కిరింపులు, ఎకసెక్కాలు మామూలే.! కన్నీళ్లు సుడులు తిరిగి ఎందుకీ చిత్రాల గోల? అనుకున్న సందర్భాలనేకం. అంతలోనే మళ్లీ కెమెరా ముందుకు వెళుతూ వచ్చా. సినిమా అంటే నాకు అంత ఇష్టం. పిచ్చి కూడా..! ఇంతకాలానికి నా ప్రయాణానికో గమ్యం ఏర్పడింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో సెన్సార్ బోర్డు సభ్యుడి పదవి దక్కడం సంతోషంగా ఉంది. టెలీఫిలిమ్స్పై.. 1986లో నేను తొలిసారి దర్శకత్వం వహించిన టెలీఫిలిమ్ ‘కాలింగ్ బెల్’. ఆ రోజుల్లో దూరదర్శన్‌లో ప్రసారమై ఎంతో ఆదరణకు నోచుకుంది. ఆ క్రమంలో కొత్తబాట, నిశ్శబ్దగీతం, సుజలాం సుఫలాం, పాణిగ్రహణం, పల్లె ఒడిలో, మన్నెంలో మొనగాడు, రక్షకులు ఇలా ఎన్నో టెలీఫిలిమ్స్ తీశాను. ఇందులో ఒక ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్/ ఐపీఎస్‌లు నటించారు. సినిమా ఆసక్తి లేని, ఆ రంగంతో సంబంధం లేని పెద్దలతో మేకప్ వేయించాను. నేను పరిచయం చేసిన నటీనటులు ఈరోజు టీవీ, సినిమాల్లో రాణిస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ? ఈ ప్రయాణంలో సరికొత్త మలుపుగా హాస్య ప్రధానమైన సినిమా రూపకల్పనకు అన్నీ సిద్ధం చేసుకున్నా. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏదో సాధించాలన్న తపనే ఇందుకు కారణం. నా సినిమా షూటింగ్ నూతన రాజధాని పరిధిలోనే ఉంటుంది. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఔట్‌డోర్ షూటింగులకు అనువైన లోకేషన్లు చాలా ఉన్నాయి. నా టెలీఫిలిమ్స్ దాదాపు ఈ ప్రాంతాల్లోనే తీశాను. మన నిర్మాతలు అటుకేసి దృష్టిసారిస్తారని ఆశిస్తున్నాను. నేటి సినిమాలపై మీ అభిప్రాయం సినిమాలను చూసి మంచిని అనుకరించాలే గానీ చెడును ఆదర్శంగా తీసుకోరాదు. మితిమీరిన హింస, సెక్స్, ఫ్యాక్షనిజం, ఉగ్రవాదాన్ని చూపే సినిమాలను ప్రేక్షకులు తిప్పికొట్టిననాడు అలాంటి సినిమాలు తీయడానికి ఎవరూ సాహసం చేయరు. మంచి కథాంశంతో తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభించటం శుభపరిణామం. ఈ వాతావరణం మరిన్ని మంచి సినిమాలు వచ్చేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను. సెన్సార్ బోర్డు సభ్యుడిగా చట్టప్రకారం అనుసరిస్తాను. రాజీపడే ప్రశ్నే లేదు. -
కేంద్ర సెన్సార్‌బోర్డు సభ్యురాలిగా రాధిక
హైదరాబాద్: కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా బీజేపీ నగర మహిళామోర్చా అధ్యక్షురాలు బండారు రాధిక శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సెన్సార్‌బోర్డు రీజినల్ అధికారి టి.వి.కె.రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బండారు రాధిక శ్రీధర్ మాట్లాడుతూ... అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. -
దర్శకుడిపై ఫ్యాషన్ డిజైనర్ దాడి
మంగారెడ్డిపై క్రిమినల్ కేసు హైదరాబాద్: వర్ధమాన దర్శకుడు పోలవరపు శరత్‌కుమార్‌పై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి దాడి చేశారు. వీడియో ఎడిటింగ్‌కు ఒప్పుకోలేదన్న కారణంతో... గురువారం అర్ధరాత్రి 12.45 ప్రాంతంలో ఆమె సన్నిహితుడు కిషన్‌తో కలిసి రాడ్‌తో శరత్‌కుమార్ తలపై బలంగా కొట్టారు. అందవికారుడిగా చేయాలనే ఉద్దేశంతో అతడి జుత్తు కత్తిరించారు. సెల్‌ఫోన్ ధ్వంసం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఐపీసీ సెక్షన్ 324, 448 కింద క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలివి... నిజాంపేట బాలాజీనగర్‌లో ఉండే ఫిలింమేకర్ శరత్‌కుమార్ కమలాపురికాలనీలోని తన స్నేహితుడు రాకేష్ ఇంటికి వస్తుంటారు. గతంలోనే పరిచయమున్న మంగారెడ్డి చాటింగ్‌లోకి వచ్చి.. వీడియో ఎడిటింగ్ గురించి చెప్పాలని శరత్‌కుమార్‌ను కోరారు. తనవల్ల కాదని శరత్ చెప్పారు. ఆగ్రహించిన మంగారెడ్డి గురువారం అర్ధరాత్రి తన సన్నిహితుడు కిషనతో వచ్చి స్నేహితుడి గదిలో నిద్రిస్తున్న శరత్‌పై రాడ్‌తో దాడి చేశారు. అడ్డువచ్చిన అతని స్నేహితుడు రాకేష్నూ కొట్టారు. శరత్ జుత్తు కత్తిరించి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడిని స్థానిక నిఖిల్ ఆసుపత్రికి తలరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలంటే చిన్నచూపు: పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంగారెడ్డి శుక్రవారం బంజారాహిల్స్ పోలీ స్ స్టేషన్‌కు వచ్చారు. ఘటనపై ఆమె స్పందిస్తూ... తరచూ అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్న శరత్‌ను నిలదీసేందుకే అతని ఫ్లాట్‌కు వెళ్లానన్నారు. తలుపు నెడుతున్న క్రమంలో శరత్ తలకు తాకిందని, దాంతో అతను వెనకాలున్న బీరువాకు కొట్టుకున్నాడన్నారు. తాను దాడి చేశాననడంలో వాస్తవం లేదన్నారు. శరత్‌పై తానూ కేసు పెడతానన్నారు. కాగా, శరత్‌కుమార్ చిత్రం ‘శీష్‌మహల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
కో-డైరెక్టర్ పై డిజైనర్ మంగారెడ్డి దాడి!
హైదరాబాద్ : సెన్సార్ బోర్డు సభ్యురాలు, ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి... కో డైరెక్టర్ శరత్ కుమార్‌పై దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. తన సన్నిహితుడు కిషన్‌తో కలిసి ఆమె శుక్రవారం శరత్‌ను ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేశానని మంగారెడ్డి చెబుతోంది.. శరత్ ఫోన్లో అసభ్యకరసందేశాలు పంపిస్తూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయమై నిలదీసేందుకు శరత్ వెళ్లానని అయితే అతను తనపై దాడికి దిగాడని దీంతో ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా మంగారెడ్డి మాట్లాడుతూ 'ఆడవాళ్లంటే శరత్‌కు గౌరవం లేదు. అమ్మాయిలు ఛండాలంగా డ్రస్ చేసుకుంటారని రోజూ నాకు ఎస్ఎంఎస్లు పంపేవాడు. తనతో మాట్లాడవద్దని, చెప్పినా... శరత్ మెసేజ్‌లు పంపిస్తున్నాడు. అతడి ప్రవర్తనకు విసిగిపోయా. నిలదీసేందుకు శరత్ వెళ్లాను. అయితే అతడు నన్ను కొట్టడానికి మీదకు వచ్చాడు. నా డ్రస్ లాగి అసభ్యకరంగా మాట్లాడాడు. అలా మాట్లాడవద్దని నేను కూడా అరిచాను. నన్ను కొట్టడానికి రాబోతే ఆత్మరక్షణ కోసం అతడిని తోశాను. దాంతో శరత్ తల కూలర్‌కు తగిలింది. రాడ్‌తో దాడి చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు అలా కొట్టడాలు ఏమీ లేవు. ఎవరూ కొట్టలేదు. కొట్టుకోలేదు. శరత్ ఫుల్‌గా తాగి ఉన్నాడు. అతడికి ఆల్కహాల్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పటివరకూ నేను శరత్ మీద ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను. 'హీ ఈజ్ నాట్ మై ఎనిమీ' నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అంతకన్నా మాట్లాడటానికి ఏమీ లేదు' అని తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంత ప్రచారం అవసరమా?
పణజి: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడాన్ని సెన్సార్ బోర్డు సభ్యుడు, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ ఆక్షేపించారు. 2002 హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గత మూడు రోజులుగా దేశంలో సల్మాన్ ఖాన్ కేసు మినహా ఏమీ జరగనట్టుగా మీడియా కథనాలు ప్రచారం చేసిందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇది పరిణామం కూడా కాదని పేర్కొన్నారు. శుక్రవారం 'వుమన్ ఎకనామిక్ ఫోరం'లో మాట్లాడుతూ... బాలీవుడ్ లో ఎక్కువ మంది నిర్మాతలు నష్టాల్లోనే ఉన్నారని వెల్లడించారు. హైప్ కోసం బాక్సాఫీస్ రికార్డులు అంటూ హంగామా చేస్తున్నారని పండిట్ తెలిపారు. -
సెన్సార్ బోర్డ్ సభ్యురాలిపై క్రిమినల్ కేసు పెడతా: రామ్‌గోపాల్ వర్మ