
అంత ప్రచారం అవసరమా?
పణజి: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడాన్ని సెన్సార్ బోర్డు సభ్యుడు, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ ఆక్షేపించారు. 2002 హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
గత మూడు రోజులుగా దేశంలో సల్మాన్ ఖాన్ కేసు మినహా ఏమీ జరగనట్టుగా మీడియా కథనాలు ప్రచారం చేసిందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇది పరిణామం కూడా కాదని పేర్కొన్నారు. శుక్రవారం 'వుమన్ ఎకనామిక్ ఫోరం'లో మాట్లాడుతూ... బాలీవుడ్ లో ఎక్కువ మంది నిర్మాతలు నష్టాల్లోనే ఉన్నారని వెల్లడించారు. హైప్ కోసం బాక్సాఫీస్ రికార్డులు అంటూ హంగామా చేస్తున్నారని పండిట్ తెలిపారు.