‘ఎఫ్‌బీఐ’ డైరెక్టర్‌గా కశ్యప్‌ పటేల్‌.. నామినేట్‌ చేసిన ట్రంప్‌ | Kash Patel Nominated As FBI Director By Trump | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌బీఐ’ డైరెక్టర్‌గా కశ్యప్‌ పటేల్‌.. మరో భారత సంతతి వ్యక్తికి ట్రంప్‌ కీలక పదవి

Published Sun, Dec 1 2024 7:33 AM | Last Updated on Sun, Dec 1 2024 8:14 AM

Kash Patel Nominated As FBI Director By Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తన పరిపాలన టీమ్‌లో కీలకమైన సభ్యులను ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు ఇప్పటికే ట్రంప్‌ కీలక పదవులిచ్చారు.

తాజాగా భారత సంతతికి చెందిన కశ్యప్‌ పటేల్‌కు దేశంలోనే అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా కశ్యప్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు.‘కాష్‌ గొప్ప లాయర్‌,దర్యాప్తులో దిట్ట. అమెరికాలో అవినీతి నిర్మూలనకు,న్యాయాన్ని గెలిపించేందుకే నిత్యం శ్రమించే ‘అమెరికా ఫస్ట్‌’ ఫైటర్‌’. అమెరికా ప్రజల రక్షణలో ఆయన కృషి గొప్పంది.కాష్‌ నియామకంతో ఎఫ్‌బీఐకి పునర్‌వైభవం తీసుకొస్తాం’అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫాంలో పోస్టు చేశారు.

తొలి నుంచి ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్‌కు పేరుంది. కశ్యప్‌ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్‌ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్‌ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్‌ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement