Kashyap Patel
-
అమెరికన్లకు హాని చేయాలనుకుంటే అంతు చూస్తాం
వాషింగ్టన్: అమెరికన్లకు హాని చేయాలనుకునేవారి అంతు చూస్తామని, వారు భూమ్మీద ఏ మూల దాక్కున్నా వదలబోమని ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ (కాశ్ పటేల్) హెచ్చరించారు. అమెరికా ప్రజలు గర్వించదగ్గ సంస్థగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడైన కాశ్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా సెనేట్ గురువారం ధ్రువీకరించింది. అనంతరం పటేల్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీని పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడినదిగా పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదో డైరెక్టర్‌గా నన్ను ధ్రువీకరించడం గౌరవంగా భావిస్తున్నా. అచంచల విశ్వాసం, మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండీకి ధన్యవాదాలు. ‘జీ–మెన్’ నుంచి 9/11 దాడుల నేపథ్యంలో దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్‌బీఐకి ఘనమైన వారసత్వం ఉంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో, న్యా యానికి కట్టుబడి ఉండే ఎఫ్‌బీఐకి అమెరికా ప్రజలు అర్హులు. రాజకీయ జోక్యంతో న్యాయ వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రోజుతో అది ముగుస్తుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టైల్లో స్వాగతం.. ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ను శ్వేతసౌధం స్వాగతించింది. వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో కాశ్‌కు బాలీవుడ్స్టైల్లో స్వాగతం పలికారు. నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని ‘మల్హరి’ పాటను ఎడిట్ చేసి.. రణవీర్ స్థానంలో పటేల్ ముఖాన్ని ఉంచిన వీడియోను షేర్ చేశారు. ‘‘ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్ కాశ్ పటేల్‌కు అభినందనలు’’ అని స్కావినో ట్వీట్ చేశారు. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌ను వెంటనే 30 లక్షల మందికి పైగా చూశారు. డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత.. పటేల్ నామినేషన్ రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో ఆమోదానికి వారం రోజులు ఆలస్యమైంది. ఈ పదవికి ఆయన అనర్హుడంటూ డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కుట్ర సిద్ధాంతాలతో ఆయన అనుబంధం, రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ గతంలో ఆయన ప్రకటనలు చేశారని, ట్రంప్ ఎఫ్‌బీఐ ప్రతీకార ప్రణాళికల సమాచారాన్ని దాచిపెట్టారని, పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని డెమొక్రాట్ సెనేటర్లు ఆరోపించారు. పటేల్ అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు కాకుండా.. ట్రంప్ ప్రయోజనాల కోసం పని చేస్తా రని మండిపడ్డారు. అయితే సెనేట్‌లో రిప బ్లికన్లకు మెజారిటీ ఉండటం తెలిసిందే. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్లు లీసా ముర్కోవ్స్కీ, మైనేకు చెందిన సుసాన్ కొలిన్స్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయితే.. గతంలో ఇతర ట్రంప్ నామినీలను వ్యతి రేకించిన సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్కా నెల్తో సహా మిగిలిన రిపబ్లికన్ పార్టీ మొత్తం పటేల్‌కు మద్దతు లభించింది. దీంతో.. సెనేట్ డెమొ క్రాట్లందరూ కాశ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి నా.. 51–49 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన నామినేషన్ ఆమోదం పొందింది. భారతీయ నేపథ్యం.. కాశ్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు. యూఎస్‌లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన పటేల్.. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. రిచ్మండ్ విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికెట్ కోసం న్యూ యార్క్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్పీఎస్సీఐ)కి సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారు. -
ట్రంప్ వీరవిధేయుడి నోట ‘జై శ్రీ కృష్ణ’
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. భారతీయ మూలాలను, సంప్రదాయాలను, విలువలనూ పాటించే వ్యక్తులు తరచూ తారసపడుతుంటారు. అది ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా!. అలాంటి వాళ్లలో ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి నామినీ అయిన కశ్యప్ పటేల్ ఒకరు. తాజాగా ఆయన చేసిన చర్య ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.44 ఏళ్ల కశ్యప్ క్యాష్ పటేల్.. తాజాగా(గురువారం) సెనేట్ జ్యూడీషియరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో తనకు మద్ధతు తెలపడానికి సుదూరాల నుంచి వచ్చిన తల్లి అంజనా, తండ్రి, సోదరిని కమిటీకి ఆయన పరిచయం చేశారు. చివర్లో ‘జై శ్రీ కృష్ణ’ అంటూ ముగించారు. అంతకు ముందు.. కమిటీ విచారణ ప్రారంభానికి ముందు ఆయన తన తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.WATCH | FBI Director-Designate Kashyap Patel delivers opening statement at confirmation hearing, thanks his parents who flew from India and concludes with “Jai Shri Krishna.”#FBI #KashyapPatel #US pic.twitter.com/mFLx0uEVAz— Organiser Weekly (@eOrganiser) January 30, 2025విచారణ ఎందుకంటే..ఎఫ్‌బీఐ డైరెక్టర్ నామినీ అయిన కశ్యప్ పటేల్‌ను సెనేట్ జ్యూడీషియరీ కమిటీ విచారణ జరుపుతుంది. సాధారణంగా ఈ కమిటీ ఆ పదవికి నామినీకి ఉన్న అర్హతలను సమీక్షించడంతో పాటు గతంలో చేసిన వ్యాఖ్యలను, వివాదాస్పద చర్యలను పరిశీలిస్తుంది. చివరకు సదరు నామినేషన్‌ను అంగీకరించాలా? తిరస్కరించాలా? అనేది ఈ కమిటీ చేతుల్లోనే ఉంటుంది.ఇక విచారణలో భాగంగా గతంలో.. జర్నలిస్టులను ప్రాసిక్యూషన్ చేయాలని, ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేయాలని కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ట్రంప్‌ను ఆయనకు ఉన్న అనుబంధంపైనా ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వీటితో పాటు జాత్యహంకారానికి గురయ్యారా?అనే ప్రశ్నకు.. ఆయన అవుననే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘గతంలో నేనూ గతంలో జాత్యహంకారానికి గురయ్యాను. అమెరికాలో ఎలాంటి హక్కు లేని ఓ వ్యక్తిగా నన్ను పేర్కొనేవారు. మీరు ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్లిపోవాలంటూ నాకు మెసేజ్‌లు వచ్చేవి. చట్టాన్ని కాపాడుతున్న ఎంతోమంది వ్యక్తులు ఎదుర్కొంటున్న దానితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్నదిగా అనిపించింది. నా కుటుంబసభ్యులు ఇక్కడ ఉండగా.. ఆ సంఘటనను గురించి పూర్తిగా వెల్లడించలేను’’ అని పటేల్ అన్నారు. కాష్ పటేల్ గురించి..ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. గుజరాత్లో ఈయన కుటుంబమూలాలు ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అయితే ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా కాష్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. ప్రస్తుతం ఆయన కొలంబియాలో ఉంటున్నారు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేరారు.కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో ఈయన పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి ఆయన పేరును ట్రంప్ నామినేట్ చేశారు. సెనేట్ కమిటీ గనుక ఆయన పేరుకు క్లియరెన్స్ ఇస్తే.. దాదాపుగా ఆయనకు అగ్రరాజ్య దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పగ్గాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్ చరిత్ర సృష్టించినట్లే!. -
‘ఎఫ్‌బీఐ’ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్.. నామినేట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తన పరిపాలన టీమ్‌లో కీలకమైన సభ్యులను ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు ఇప్పటికే ట్రంప్ కీలక పదవులిచ్చారు.తాజాగా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్‌కు దేశంలోనే అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా కశ్యప్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు.‘కాష్ గొప్ప లాయర్,దర్యాప్తులో దిట్ట. అమెరికాలో అవినీతి నిర్మూలనకు,న్యాయాన్ని గెలిపించేందుకే నిత్యం శ్రమించే ‘అమెరికా ఫస్ట్’ ఫైటర్’. అమెరికా ప్రజల రక్షణలో ఆయన కృషి గొప్పంది.కాష్ నియామకంతో ఎఫ్‌బీఐకి పునర్వైభవం తీసుకొస్తాం’అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో పోస్టు చేశారు.తొలి నుంచి ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్‌కు పేరుంది. కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. -
కాష్ పటేల్‌ను వదులుకోని ట్రంప్
సీఐఏ.. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిఘా సంస్థ. అలాంటి ఏజెన్సీకి డైరెక్టర్ రేసులో.. ఓ భారతీయ మూలాలున్న వ్యక్తిని నియమించవచ్చనే ప్రచారం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తృటిలో ఆ అవకాశం చేజార్చుకున్నారు కశ్యప్ పటేల్ అలియాస్ కాష్. అలాగని ట్రంప్ ఆయన్ని వదులుకోలేదు. ఇప్పుడు మరో కీలకమైన విభాగానికి కాష్ పటేల్‌ను డైరెక్టర్‌గా నియమించబోతున్నారు.జనవరి 20వ తేదీ తర్వాత ప్రస్తుతం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టోఫర్ వ్రేను.. ట్రంప్ తప్పిస్తారని, ఆ స్థానంలో 44 ఏళ్ల వయసున్న కాష్ పటేల్‌ను కూర్చోబెడతారని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బానోన్ ప్రకటించారు. అయితే వ్రేను 2017లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించింది ట్రంపే. పదేళ్ల కాలపరిమితితో ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. తర్వాతి కాలంలో ట్రంపే ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో వ్రే జోక్యం ఎక్కువైందని మండిపడుతూ వచ్చారు. అంతేకాదు.. ఈ ఏడాది జులైలో వ్రేను రాజీనామా చేయాల్సిందేనని ట్రంప్ గట్టిగా డిమాండ్ చేశారు కూడా. అయితే వ్రే మాత్రం తాను ఎఫ్‌బీఐలో పూర్తి కాలం కొనసాగుతానని చెబుతూ వచ్చారు.ఎవరీ కాష్ పటేల్ ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. ఈయన కుటుంబమూలాలు గుజరాత్లో ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేరారు. కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో అతడి పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. వ్యక్తిగత జీవితంకాష్ పటేల్ ప్రస్తుతం కొలంబియాలో నివసిస్తున్నారు. ఐస్ హాకీ అంటే ఆయన మక్కువ ఎక్కువ. ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.