key post
-
దిల్ రాజుకు కీలక పదవి..
-
‘ఎఫ్‌బీఐ’ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్.. నామినేట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తన పరిపాలన టీమ్‌లో కీలకమైన సభ్యులను ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు ఇప్పటికే ట్రంప్ కీలక పదవులిచ్చారు.తాజాగా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్‌కు దేశంలోనే అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా కశ్యప్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు.‘కాష్ గొప్ప లాయర్,దర్యాప్తులో దిట్ట. అమెరికాలో అవినీతి నిర్మూలనకు,న్యాయాన్ని గెలిపించేందుకే నిత్యం శ్రమించే ‘అమెరికా ఫస్ట్’ ఫైటర్’. అమెరికా ప్రజల రక్షణలో ఆయన కృషి గొప్పంది.కాష్ నియామకంతో ఎఫ్‌బీఐకి పునర్వైభవం తీసుకొస్తాం’అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో పోస్టు చేశారు.తొలి నుంచి ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్‌కు పేరుంది. కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. -
కీలక పదవులకు అధ్యక్షులను నియమించిన వైఎస్ జగన్
-
కోదండరాంకు కీలక పదవి!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ జేఏసీ చైర్మన్ హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం సేవలను కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ అధ్యక్షుడి హోదాలో ఆయన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సోమవారం సచివాలయంలో భేటీ కావడంతో ఈ చర్చ ఊపందుకుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇస్తారని, లేదంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కూడా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి దానికి వైస్‌చైర్మన్‌గా కోదండరాంను నియమించే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. బేషరతుగా మద్దతు... వాస్తవానికి తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఏర్పాటు తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోదండరాం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరఫున కొన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 2023లో ఒక్క అసెంబ్లీ స్థానం కోసం కూడా డిమాండ్ చేయకుండా బేషరతుగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఆ సమయంలోనే కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన హోదా కలి్పస్తామని, తెలంగాణ అమరవీరుల సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత ఆయనకు అప్పగిస్తామని కాంగ్రెస్ వర్గాలు హామీ ఇచ్చాయి. మర్యాద పూర్వకమేనని చెబుతున్నా... టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నర్సయ్య సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సచివాలయంలో కలిశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి భట్టిని కలిసి అభినందనలు తెలిపారు. భేటీలో భాగంగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు, వాటిపై ప్రజల అభిప్రాయం, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రాధాన్యాలపై భట్టితో టీజేఎస్ బృందం చర్చించినట్లు సమాచారం. -
ఉంటుందా? పోతుందా?
సాక్షి, హైదరాబాద్ : పలు కీలక శాఖల్లో ఏళ్ల తరబడి కొనసాగిన రిటైర్డ్ అధికారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీరికి కొనసాగింపు ఉంటుందా..? సాగనంపుతారా ? అంటూ అప్పుడే చర్చ మొదలైంది. విద్యుత్, నీటిపారుదల, ఆర్థిక శాఖ, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, జలమండలి, పౌరసరఫరాలు, మెట్రో రైలు వంటి కీలక ప్రభుత్వశాఖలు, విభాగాల్లో ఇంతకాలం ఉద్యోగ విరమణ చేసిన వారంతా పెత్తనం చేశారు. అయితే రిటైర్డ్ అధికారులను కీలక పోస్టుల్లో కొనసాగించడంపై రేవంత్‌రెడ్డి గతంలోనే తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వీరి విషయంలో ఆయన తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విద్యుత్ సంస్థల్లో రాష్ట్రఆవిర్భావం నుంచి వారే.. తెలంగాణ జెన్కో సీఎండీగా 2014 జూన్ 6 నుంచి, అదే ఏడాది అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతల్లో దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనసాగారు. ఎన్నికల ఫలితాలొచ్చాక మరుసటి రోజే ఆయన రెండు పోస్టులకు రాజీనామా చేయగా, ఇంకా కొత్త వారిని నియమించలేదు. 2014 జూలై నుంచి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా జి.రఘుమారెడ్డి, 2016 అక్టోబర్ నుంచి టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఎ.గోపాల్‌రావు వ్యవహరిస్తున్నారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లలో అత్యధికశాతం మంది తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సీఎండీలు, డైరెక్టర్లు కొనసాగుతారని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈఎన్సీలు.. నీటిపారుదలశాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌రావు 2011లో ఉద్యోగ విరమణ చేసినా ఇంకా కొనసాగుతున్నారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సీఈ హమీద్ ఖాన్, అంతర్రాష్ట్ర వ్యవహారాల ఎస్ఈ కోటేశ్వర్రావు రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగుతున్నారు. 2016 జూలైలో ఉద్యోగ విరమణ చేసిన హైదరాబాద్ జలమండలి ఈఎన్సీ/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి, 2017 నవంబర్‌లో ఉద్యోగవిరమణ చేసిన ఆర్డబ్ల్యూఎస్ ఈఎస్సీ కృపాకర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీలో 2016 జూలైలో రిటైర్డ్ అయిన ఈఎన్సీ పి.రవీందర్రావు, 2017 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన బి.గణపతి రెడ్డి, ఈఎన్సీ (స్టేట్ రోడ్లు) ఇంకా కొనసాగుతున్నారు. ఆ అధికారుల్లో చిగురించిన ఆశలు గత ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులున్న కొందరు అధికారుల విషయంలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తొలుత రెండేళ్ల కాలానికి సర్వీసు పొడిగించారు. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చేవారు. చివరకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు(అన్టిల్ ఫర్దర్ ఆర్డర్) ఆ అధికారులే ఆయా పోస్టుల్లో కొనసాగుతారని జీఓలు సైతం జారీ చేశారు. రిటైర్డ్ అధికారులే కీలక పోస్టుల్లో కొనసాగుతుండడంతో సీనియారిటీ ప్రకారం అందాల్సిన అవకాశాలు కోల్పోతున్నామని సర్వీసు మిగిలి ఉన్న అధికారులు చాలా ఏళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. కొత్త సర్కారు వచ్చిన నేపథ్యంలో రిటైర్డ్ అధికారులను ఇంటికి పంపిస్తే తమకు అవకాశాలు లభిస్తాయన్న ఆశతో ఉన్నారు. అ‘విశ్రాంత’ సేవలోమరికొందరు ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి 2017 నవంబర్‌లో రిటైర్డ్ కాగా ఇంకా కొనసాగుతున్నారు. దేవాదాయ శాఖ కార్యదర్శి/ కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అనీల్‌కుమార్ మూడేళ్లుగా కొనసాగుతుండగా, ఆయన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌గా రాజమౌళిని సైతం పునర్నియమించారు. ఇక పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అదర్ సిన్హా , యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, శిల్పారామం ప్రత్యేకాధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ కిషన్‌రావు, మెట్రో రైలు ఎండీగా రిటైర్డ్ ఐఆర్ఏఎస్ అధికారి ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ఓఎస్డీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీందర్, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి ముత్యంరెడ్డి సైతం రిటైర్మెంట్ తర్వాత కూడా అవే పోస్టుల్లో ఉన్నారు. -
ట్రాన్స్‌జెండర్ వైద్యురాలికి కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్ లెవీన్ నియామకానికి అమెరికా సెనేట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల్ని పరిరక్షిస్తానని ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చిన బైడెన్ ఈ ఏడాది జనవరిలోనే రాచెల్‌ను అత్యున్నత పదవికి సిఫారసు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీపై వివక్ష ప్రదర్శించేవారు. ఆ వివక్ష సంకెళ్లను బద్దలు కొడుతూ బైడెన్ తీసుకున్న నిర్ణయానికి సెనేట్ మద్దతు ప్రకటించింది. ఆమె నియామకాన్ని 52–48 ఓట్లతో సెనేట్ ఖరారు చేసింది. ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా రాచెల్‌కు మద్దతు ఇచ్చారు. పెన్సిల్వేనియా స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసన్ పీడియాట్రీషన్‌గా పనిచేస్తున్న 63 ఏళ్ల రాచెల్ ఆరోగ్య రంగంలో అసిస్టెంట్ సెక్రటరీగా కరోనా వైరస్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన బృందానికి నేతృత్వం వహిస్తారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో పని చేస్తూ కరోనా కేసుల కట్టడిలో ఆమె చూపించిన ప్రతిభా పాటవాల్ని గుర్తించిన బైడెన్ రాచెల్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. -
కిమ్ ఈమెను మాత్రమే నమ్ముతాడు
సాక్షి : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అధికారన్ని మరింత బలపరుచుకునే విధంగా అడుగులు వేయబోతున్నాడు. 28 ఏళ్ల తన సోదరి కిమ్ జోంగ్కు కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడని సమాచారం. తద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవటంతోపాటు.. అధికారాన్ని కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంచాలని భావిస్తున్నాడని స్పష్టమౌతోంది. ప్యోంగ్ యాంగ్లో శనివారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అమెరికా బెదిరింపులతోపాటు జోంగ్కు బాధ్యతలు అప్పజెప్పే విషయంపై కూడా చర్చించినట్లు అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కీలక పాలనా విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కిమ్ సమావేశంలో వ్యక్తం చేశాడంట. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలో ఆరుగురు అధికారులతోపాటు జోంగ్కు కూడా స్థానం కల్పించబోతున్నట్లు కిమ్ సూచన ప్రాయంగా చెప్పాడని ఈ కథనం సారాంశం. మానవ హక్కుల ఉల్లంఘన కింద ఆమెపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. కరడుగట్టిన నియంతగా పేరొందిన కిమ్ తన చెల్లెలికి కీలక బాధ్యతలు అప్పజెప్పటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కిమ్ జంగ్ ఉన్, కిమ్ యో జోంగ్లు ఒకే తల్లికి జన్మించారు. తన పక్కన ఉండే అధికారులతోసహా ఎవరినీ నమ్మని కిమ్.. జోంగ్‌ను మాత్రం బాగా నమ్ముతాడని చెబుతుంటారు. అన్నతోపాటు తరచూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది కూడా. ఈ యేడాది ఫిబ్రవరిలో సవతి సోదరుడు కిమ్ జోన్ నామ్‌ను మలేషియన్ ఎయిర్పోర్ట్ వద్ద అతిదారుణంగా కెమికల్ దాడి చేయించి కిమ్ జంగ్ చంపించిన విషయం తెలిసిందే. -
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషన్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డికి పార్టీ జాతీయ స్థాయిలో కీలక పదవి వరించనుంది. కిషన్‌రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గంలో 5 ప్రధాన కార్యదర్శులు, 5 ఉపాధ్యక్ష పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కార్యదర్శులు జేపీ నడ్డా, రాజీవ్‌ప్రతాప్ రూడీ, రాంశంకర్ ఖతేరియాలతో పాటు ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ, ముక్తార్‌అబ్బాస్ నక్వీలను కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరితో ఏర్పాటైన ఖాళీలతో పాటు అంతకు ముందు నుంచే ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల భర్తీకి అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి, హర్యానా నుంచి డాక్టర్ అనిల్ జైన్, మధ్యప్రదేశ్ నుంచి కైలాస్ విజయ్‌వర్గీయలతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరిని ప్రధాన కార్యదర్శులుగా నియమించడానికి పేర్లు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. కాగా తెలంగాణ నుంచి పి.మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్‌మాధవ్‌లు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా పని చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. -
కదలిక ఖాయం
ల్లో భారీ మార్పులకు అవకాశం జిల్లా నేతలను సంప్రదిస్తున్న అధికార గణం అనంతపురం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జిల్లాలో పలువురు అధికారులకు స్థానచలనం తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని తిష్టవేసిన వారిని పంపించడానికి తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇతర విషయాల్లో ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న ‘తమ్ముళ్లు’.. అధికారుల బదిలీల విషయంలో మాత్రం ఏకతాటిపై నిలబడినట్లు తెలుస్తోంది. తమకు నచ్చని వారిని జిల్లా నుంచి పంపించడానికి రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులతో తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, గ్రామీణ నీటి సరఫరా, ఎక్సైజ్, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల్లో అధికారులను బదిలీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులకు సైతం స్థాన చలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఖాయమని తొలి నుంచి ఆశలు పెట్టుకున్న ఓ నాయకుడు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఎలాగైనా రీకౌంటింగ్ పెట్టి తాను గెలిచేలా చూడాలంటూ ఆ నేత జిల్లా అధికారులకు భారీ ఆఫర్లు ఇచ్చారు. ఈ విషయంలో సహకరించాలని ఓ పోలీసు ఉన్నతాధికారిని సైతం కోరారు. అయితే.. ఆయన ససేమిరా అనడాన్ని జీర్ణించుకోలేని ఆ నేత ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సదరు పోలీసు అధికారిని బదిలీ చేయించాలని పంతం పట్టినట్లు తెలిసింది. కదిరిలో టీడీపీ నాయకుడికి రైట్‌హ్యాండ్‌లా పనిచేసే ఓ గ్యాస్ ఏజెన్సీ డీలర్ దాచి ఉంచిన అక్రమ గ్యాస్ సిలిండర్లను ఎన్నికలకు ముందు రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆ విషయంలో చూసీచూడనట్లు వెళ్లాలని స్థానిక తహశీల్దార్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులపై ఆ నేత ఒత్తిడి తెచ్చారు. వారు ఖాతరు చేయలేదు. దీంతో ప్రస్తుతం వారిని బదిలీ చేయించే పనిలో ఆ నేత నిమగ్నమైనట్లు సమాచారం. మంత్రి పరిటాల సునీత ద్వారా బదిలీకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకుల పైరవీలకు అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం ఆ ఉన్నతాధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేసి.. తమకు అనుకూలమైన అధికారిని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, టీడీపీ నేతలకు ఆ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడని ఆ ఉన్నతాధికారే స్వయంగా బదిలీపై వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. కాంగ్రెస్ హయాంలో అప్పటి మంత్రి రఘువీరారెడ్డికి తలలో నాలుకలా మెలిగిన సమాచార, పౌర సంబంధాల శాఖలోని ఓ అధికారి బదిలీ తప్పదన్న ప్రచారం సాగుతోంది. రఘువీరా అండదండలతో ఆ అధికారి అప్పట్లో ఎవర్నీ లెక్కచేయకుండా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికీ ఆ అధికారి నిత్యం రఘువీరాకు టచ్‌లో ఉంటూ.. ఆయన సూచనల మేరకే పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎలాగైనా బదిలీ చేయించాలని టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నట్లు తెలిసింది. ఆయన మాత్రం తన బదిలీని నిలుపుదల చేయించుకోవడానికి రఘువీరా దౌత్యంతో మంత్రి పరిటాల సునీతను ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం.