వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్ లెవీన్ నియామకానికి అమెరికా సెనేట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల్ని పరిరక్షిస్తానని ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చిన బైడెన్ ఈ ఏడాది జనవరిలోనే రాచెల్‌ను అత్యున్నత పదవికి సిఫారసు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీపై వివక్ష ప్రదర్శించేవారు. ఆ వివక్ష సంకెళ్లను బద్దలు కొడుతూ బైడెన్ తీసుకున్న నిర్ణయానికి సెనేట్ మద్దతు ప్రకటించింది.
ఆమె నియామకాన్ని 52–48 ఓట్లతో సెనేట్ ఖరారు చేసింది. ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా రాచెల్‌కు మద్దతు ఇచ్చారు. పెన్సిల్వేనియా స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసన్ పీడియాట్రీషన్‌గా పనిచేస్తున్న 63 ఏళ్ల రాచెల్ ఆరోగ్య రంగంలో అసిస్టెంట్ సెక్రటరీగా కరోనా వైరస్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన బృందానికి నేతృత్వం వహిస్తారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో పని చేస్తూ కరోనా కేసుల కట్టడిలో ఆమె చూపించిన ప్రతిభా పాటవాల్ని గుర్తించిన బైడెన్ రాచెల్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment