Health Secretary
-
కరోనా విజృంభించొచ్చు.. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: భారత్‌లో మరోసారి కొత్త వేరియెంట్ రూపేణా కరోనా విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. మరోవైపు ఫ్లూ కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. హఠాత్తుగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మీద దృష్టిసారించాలని ఆ లేఖలో పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు బుధవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. టెస్టుల సంఖ్యను పెంచాలని, చికిత్స, ట్రాకింగ్‌తో పాటు వ్యాక్సినేషన్ పైనా దృష్టిసారించాలని ఆరోగ్య శాఖ లేఖల్లో ఆయా రాష్ట్రాలను కోరింది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది ఆరోగ్య శాఖ. ఈ పర్యవేక్షణ కేత్ర స్థాయి (గ్రామాలు, మండలాలు, జిల్లాలు) నుంచే కొనసాగాలని, కోవిడ్-19 నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకే కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇదిలా ఉంటే.. గత శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సైతం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని కోరారాయన. చివరగా.. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా నవంబర్ 12వ తేదీన 734 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత.. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత బుధవారం 700కి పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల(4,623) పైకి చేరింది. యాక్టివ్ కేసుల శాతం 0.01 శాతంగా ప్రస్తుతానికి ఉండగా, రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. దేశంలోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ ఇదే! -
కోవిడ్ భయాలు.. పండుగ వేళ జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ , సంక్రాంతి పండుగల వేళ కోవిడ్–19 నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని, నాలుగ్గోడల మధ్య వేడుకలు నిర్వహించేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. జిల్లా స్థాయిలో వస్తున్న ఫీవర్ కేసుల్ని కూడా పర్యవేక్షించాలని, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు , జలుబు , జ్వరంతో ఎవరు వచ్చినా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల్లో ఎక్కువ నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ జరపాలని సూచించారు. మరోవైపు శనివారం నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి కరోనా పరీక్షలకు సన్నాహాలు పూర్తిచేశారు. ఎంపిక చేసిన ప్రయాణికులు, కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని విమానాశ్రయాల్లో సిబ్బందికి కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. ఆంక్షలు సడలింపు
భారత్‌లో కరోనా మహమ్మారి దాదాపు నాలుగు వారాల నుంచి స్థిరమైన క్షీణతను చూపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి బుధవారం జనవరి 21 నుంచి కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందంటూ అన్నిరాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు, నిర్వాహకులకు పంపిన లేఖలో వెల్లడించారు. అంతేకాదు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లావాదేవీలకు అవాంతరం కలగకుండా రాష్ట్రాల సరిహద్దుల వద్ద అదనపు ఆంక్షలను తొలగించమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో కరోనా మహమ్మారి ఎపిడెమియాలజీ మారుతున్నందున, కొత్త కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు సమీకరించి నవీకరించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తదనుగుణంగా ఫిబ్రవరి 10న అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను సవరించిందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడూ కేసుల ఉధృతి, తగ్గుదలను పర్యవేక్షించాల్సిందేనని లేఖలో నొక్కి చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, కొత్త కేసులు, సానుకూలత రేటును పరిగణనలోకి తీసుకుని కోవిడ్-19 పరిమితులను సడలించమని కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిందన్నారు. గత వారంలో సగటు రోజువారీ కేసులు 50,476 కాగా, 24 గంటల్లో 27,409 కొత్త కేసులు నమోదయ్యాయని, రోజువారీ కేసు సానుకూలత రేటు బుధవారం 3.63 శాతానికి తగ్గిందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. (చదవండి: భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!) -
పండగలప్పుడు జరభద్రం!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అప్రమత్తత అవసరమనీ, రాబోయే పండుగలను కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ జరుపుకోవాలని కోరింది. కేంద్రం ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ మధ్యలోనే ఉందన్నారు. పండగల తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా 41 జిల్లాల్లో కోవిడ్ వీక్లీ పాజిటివ్ రేటు 10% కంటే ఎక్కువగానూ, 27 జిల్లాల్లో 5–10 శాతాల మధ్యలోనూ నమోదవుతోందని వివరించారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు భారీగా పెరుగుతాయన్నారు. జనం ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడడాన్ని నివారించడం చాలా ముఖ్యమని వివరించారు. ఒక్క కేరళలోనే లక్ష యాక్టివ్ కేసులున్నాయనీ, మొత్తం యాక్టివ్ కేసుల్లో ఇవి 51.19% అని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో యాక్టివ్ కేసులు 10 వేల నుంచి 1లక్ష వరకు ఉన్నట్లు తెలిపారు. రోజువారీ వ్యాక్సినేషన్ రేటు కూడా జూలైలో 43.41 లక్షలుండగా ఆగస్టులో అది 52.16 లక్షల డోసులకు పెరిగిందన్నారు. దేశంలో గత రెండు, మూడు వారాలుగా ఏ రాష్ట్రం నుంచి కూడా కోవిడ్ టీకా కొరత ఉందంటూ ఫిర్యాదులు అందలేదని భూషణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉపయోగించని/ నిల్వ ఉన్న టీకా డోసులు 2.5 కోట్లకు తగ్గలేదని తెలిపారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 80 లక్షల డోసుల టీకా వేసినట్లు తమకు వివరాలందాయని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ లభ్యత సంతృప్తికరంగా ఉందని వివరించారు. దేశంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 50 శాతం మందికి కోవిడ్ టీకా మొదటి డోసు అందగా, వీరిలో 15%మంది రెండో డోసు కూడా వేయించుకున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మెడికల్ ఆక్సిజన్ నిల్వలు సరిపోను ఉన్నాయని పేర్కొన్నారు. -
‘రాసలీలల’ కెమెరా తొలగింపు.. విచారణకు ఆదేశం
బ్రిటన్ మాజీ మంత్రి రాసలీలల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సీసీ కెమెరాను తొలగించిన ప్రభుత్వం.. అది అధికారిక కెమెరా కాదని ప్రకటించడం విశేషం. వ్యక్తిగత కార్యదర్శితో మాట్ హాంకాక్ ముద్దుల రసక్రీడ కొనసాగిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కడం.. ఆ ఫొటోలు టాబ్లాయిడ్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో ఆరోగ్య మంత్రి(కార్యదర్శి కూడా)గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందుకు కారణమైన సీసీ కెమెరా అక్కడికి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కొత్త ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. లండన్: బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి కార్యాలయంలో దొరికిన సీసీ టీవీ కెమెరా.. రెగ్యులర్ ఆఫీస్ కెమెరా కాదని కొత్త ఆరోగ్య మంత్రి(కార్యదర్శి) సాజిద్ జావిద్ వెల్లడించాడు. అంతేకాదు ఈ ఘటన తర్వాత మిగతా ఎంపీల ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించామని, ఇలాంటి కెమెరాలేవీ బయటపడలేదని తెలిపాడు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా మాట్ హాంకాక్ ఆఫీస్‌లో కెమెరాలు ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేశాడాయన. ఇక ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన ఆయన.. హాంకాక్ యవ్వారంపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు. బోరిస్‌పై ప్రశ్నల వర్షం ఇక హాంకాక్ పట్ల ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రదర్శించిన ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గురువారం ఈ ఫొటోలు పేపర్ ద్వారా బయటికి రాగా.. శుక్రవారం ఘటనకు సంబంధించి హాంకాక్ క్షమాపణలు చెప్పాడు. అయితే అతనిపై వేటు వేయకుండా కేవలం ఆ సారీతో సరిపెట్టుకుని.. ‘మ్యాటర్ క్లోజ్డ్’ అని ప్రకటించాడు బోరిస్. ఇది మరింత విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హాంకాక్ బలవంతపు రాజీనామా, బోరిస్ అన్యమనస్కంగానే దానిని ఆమోదించడం జరిగిపోయాయి. అయితే ఈ విమర్శలపై ప్రధాని బోరిస్ తాజాగా స్పందించాడు. మహమ్మారి విజృంభణ టైంలో ఆరోగ్య మంత్రి మార్పును అంత త్వరగా చేయడం సబబు కాదనే ఉద్దేశంతో.. కాస్త ఆలస్యం జరిగినట్లు బోరిస్ వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు ఉన్నాయి. హాంకాక్ మెయిల్స్ పాలసీని బబ్రేక్ చేశాడని, నిధుల అవకతవకలకు పాల్పడ్డాడని, వ్యక్తిగత ఉద్దేశాలకు కార్యాలయాన్ని వాడుకున్నాడని.. ఇలా ఆరోపణలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో వీటిపై దర్యాప్తునకు ఆదేశించడంపై బోరిస్ మౌనం వహించడం ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలా బయటికొచ్చింది ఒక ఎంపీ ఆఫీస్‌లో నిషేధిత జోన్లో సీసీ కెమెరా బిగించడం ఒక ఎత్తు అయితే.. ఆ వీడియో ఫుటేజీ బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డాయి బ్రిటన్ నిఘా వర్గాలు. ఇక ఈ వీడియో/ఫొటోలో ఉన్న హాంకాక్ మాజీ కార్యదర్శి గినా కొలాడాంగెలో మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్‌లో పని చేసిన గినా.. చాలా ఏళ్లుగా మ్యాట్ హాంకాక్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు ఆ పరిచయాలతోనే ఆమె తన పనుల్ని చక్కబెట్టుకున్నట్లు, కుటుంబ సభ్యుల్ని ఉన్నత స్థానాల్లో నియమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ లాక్డౌన్ ఆంక్షలను వ్యతిరేకించిన ఓ డీహెచ్ఎస్సీ ఉద్యోగి.. బ్లాక్మెయిల్ ఉద్దేశంతో ఈ పని చేసి ఉండటానే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది కూడా. చదవండి: పాత ఎఫైర్‌ని పీఏగా.. ఆపై ఆఫీస్‌లోనే కసితీరా ముద్దులు -
సీనియర్ రెసిడెంట్లకు భారీగా స్టైఫండ్ పెంపు: ఏకే సింఘాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌ను రూ. 45 వేల నుంచి 75 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం తెలిపారు. కాగా రాష్ట్రంలో కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారని.. పెంచిన స్టైఫండ్ వీరికి వర్తిస్తుందని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 800 మంది డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని వారు కోరారని.. పీజీ వైద్యుల డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. విదేశాలకు వెళ్లేవారికి మొదటి ప్రాధాన్యత అనంతరం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ.. '' ఏపీలో తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం పాజిటివిటీ రేట్ 13.02 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించాం. 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తయ్యాయి. 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ వేయడం పూర్తైంది. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులకు వ్యాక్సినేషన్ మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నాం. విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్ పోర్టు నెంబర్ ఇవ్వాలి. గతంలో ఆధార్ నెంబరుతోనే కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునేవారు. తాజాగా పాస్ పోర్టు నెంబరును కూడా కోవిన్ పోర్టల్‌లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. అని తెలిపారు చదవండి: ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు -
ట్రాన్స్‌జెండర్ వైద్యురాలికి కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్ లెవీన్ నియామకానికి అమెరికా సెనేట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల్ని పరిరక్షిస్తానని ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చిన బైడెన్ ఈ ఏడాది జనవరిలోనే రాచెల్‌ను అత్యున్నత పదవికి సిఫారసు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీపై వివక్ష ప్రదర్శించేవారు. ఆ వివక్ష సంకెళ్లను బద్దలు కొడుతూ బైడెన్ తీసుకున్న నిర్ణయానికి సెనేట్ మద్దతు ప్రకటించింది. ఆమె నియామకాన్ని 52–48 ఓట్లతో సెనేట్ ఖరారు చేసింది. ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా రాచెల్‌కు మద్దతు ఇచ్చారు. పెన్సిల్వేనియా స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసన్ పీడియాట్రీషన్‌గా పనిచేస్తున్న 63 ఏళ్ల రాచెల్ ఆరోగ్య రంగంలో అసిస్టెంట్ సెక్రటరీగా కరోనా వైరస్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన బృందానికి నేతృత్వం వహిస్తారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో పని చేస్తూ కరోనా కేసుల కట్టడిలో ఆమె చూపించిన ప్రతిభా పాటవాల్ని గుర్తించిన బైడెన్ రాచెల్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. -
ఆ అధికారికి మినహా కుటుంబంలోని అందరికీ కరోనా
చెన్నై : దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. తాజాగా ఆ రాష్ర్ట ఆరోగ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్ కుటుంబంలోని నలుగురికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఆయన భార్య, కొడుకు సహా అత్త, మామలకు కరోనా ఉన్నట్లు తేలగా, రాధాకృష్ణన్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రస్తుతం నలుగురు కుటుంబసభ్యులు చెన్నైలోని గిండి కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రిసెర్చ్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. (కోవిడ్‌కు అత్యంత చవకైన ట్యాబ్లెట్ ఇదే! ) కాగా కోవిడ్ 19 కట్టడి చర్యలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందంలో జె.రాధాకృష్ణన్ కూడా ఒకరు. ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు జూన్ 12నే తమిళనాడు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటి ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్ స్థానంలో జె రాధాకృష్ణన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో గత 24 గంటల్లోనే కొత్తగా మరో 4,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,75,678కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. -
ఇంటింటి సర్వే చేపట్టండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరిస్తున్న 10 రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో ఉన్న 45 స్థానిక సంస్థల అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు ఆదేశాలు జారీచేసింది. తమ పరిధిలోని పట్టణాలు, నగరాల్లో ఇంటింటి సర్వే నిర్వహించడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన అందరికీ పరీక్షలు నిర్వహించి, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని ఆదేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్తాన్, హరియాణా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్నాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని ఆ 45 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించడంపై, కంటెయిన్మెంట్ వ్యూహాలపై కూడా ఆ సమావేశంలో చర్చించారు. కరోనా మరణాల రేటును తగ్గించేందుకు వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేషెంట్లలో లక్షణాలు ఉధృతమై, పరిస్థితి చేయి దాటకముందే చికిత్స అందేలా చూడాలన్నారు. ఆసుపత్రులు, వైద్యుల నిర్వహణ కోసం సమర్థ విధానాలను అమలు చేయాలని, ఆసుపత్రులకు వచ్చే అనుమానిత పేషెంట్ల కోసం ప్రత్యేకంగా అధికారులను ఆసుపత్రుల్లో నియమించాలని సూచించారు. స్థానిక సంస్థలు అన్ని ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకుని వైరస్‌ను కట్టడి చేసేందుకు కృషి చేయాలనీ, అంబులెన్స్‌లను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఒక్కరోజులోనే 9,983 కేసులు 24 గంటల్లో 271 మంది మృతి ఇప్పటిదాకా 2,56,611 కేసులు.. 7,200 మరణాలు ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కేసులు రెండున్నర లక్షలు, మరణాలు ఏడు వేల మార్కును దాటేశాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లోనే 9,983 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి. తాజాగా 271 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 2,56,611కు, మరణాలు 7,200కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 1,24,981 కాగా, 1,24,429 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 48.49 శాతంగా నమోదైంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటివరకు 47,74,434 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. గత 24 గంటల్లో 1,08,048 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత స్థానం ఇండియాదే. -
ఒక్కరోజులో 6,767 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్డౌన్ అమల్లో ఉండగానే పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు భారీగా కేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా ఆనవాళ్లు బయటపడిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. అలాగే గత 24 గంటల్లో 147 మంది కరోనా బాధితులు మరణించారు. అంటే గంటకు ఆరుగురు మృతి చెందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 1,31,868కు, మరణాలు 3,867కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 73,560కి ఎగబాకాయి. 54,440 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 41.28 శాతానికి చేరడం కొంత సానుకూలాంశంగా మారింది. రాబోయే 2 నెలలు అత్యంత కీలకం ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత ఇప్పటికే అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత పెంచుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆక్సిజన్ వసతితో కూడిన ఐసోలేషన్ బెడ్లు, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని 11 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లలోనే బయటపడ్డాయని తెలియజేసింది. ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, జనసాంద్రత అధికంగా ఉన్నచోట ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్ శనివారం 11 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు అధికంగా నిర్వహించాలని ఆదేశించారు. -
13 జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులు ఉన్నాయి
-
ట్రంప్ కేబినేట్ లో ఇండో-అమెరికన్!
భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ కు ట్రంప్ కేబినేట్ లో స్ధానం లభిస్తుందని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లూసియానా నుంచి రెండు సార్లు గవర్నర్ గా బాబీ ఎన్నికయ్యారు. ఓ అమెరికా రాష్ట్రానికి గవర్నర్ గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి బాబి జిందాల్. మీడియా రిపోర్టుల ప్రకారం ట్రంప్ కేబినేట్ లో బాబీ స్ధానం పొందితే ఆ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ అమెరికన్ గా ఆయన రికార్డులకెక్కుతారు. అంతేకాకుండా యూఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన రెండో భారతీయ అమెరికన్ గా కూడా నిలుస్తారు. బాబీ, బెన్ కార్సన్ లను ఆరోగ్య శాఖ కార్యదర్శులుగా నియమించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. కార్సన్, బాబీలు ఇద్దరూ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి అభ్యర్ధిగా నామినేట్ అయ్యేందుకు పోటీ పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. అధ్యక్ష పదవి అభ్యర్ధిగా టెడ్ క్రూజ్ ను బలపరుస్తూ బాబీ ప్రచారం చేయగా.. కార్సన్ ట్రంప్ తరఫును ప్రచారం చేశారు. కేబినేట్ లో స్ధానంపై బాబీ జిందాల్ ను ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. అయితే, ట్రంప్ కు మద్దుతు పలికిన కార్సన్ కు కేబినేట్ లో స్ధానం ఖాయంగానే కనిపిస్తోంది. ఆరోగ్య శాఖ సెక్రటరీగా కార్సనే తన మొదటి చాయిస్ అని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. -
'రాష్ట్రంలో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు'
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ఉన్నతాధికారులతో పూనం మాలకొండయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విజన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గర్భిణీకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామన్నారు. త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ నియామకాలు చేపడుతున్నట్లు పూనం మాలకొండయ్య వివరించారు. -
చేగుంటలో ఆరోగ్య కార్యదర్శి హల్చల్
చేగుంట, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన చేగుం టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు శనివారం సందర్శించారు. ఆయనతో పాటు వచ్చిన రాష్ట్ర ఐఏఎస్ అధికారులు కూడా ఆస్పత్రి పనితీరును తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్యసేవల గురించి స్థానిక డాక్టర్ రాకేశ్‌ను ప్రశ్నిం చారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్ఎంలు ఉండేందుకు క్వార్టర్లు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఆస్పత్రులకు ఉన్నాయని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధి లో 135 సబ్‌సెంటర్లు ఉండగా 16 కేంద్రాల్లో క్వార్టర్ల నిర్మాణం జరిగిందని సీహెచ్ఓ సునీల్ తెలిపారు. 135 సబ్ సెంటర్లలో క్వార్టర్ల ఏర్పాటుకు 20 ఏళ్లు పడుతుందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని పలు విభాగాలను పరిశీలించి పనితీరు తెలుసుకున్నారు. చేగుంట జాతీయ రహదారిపై ఉన్నందున పనివేళలను పెంచి 24 గంటల వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు కమిషనర్లను కోరారు. త్వరలోనే చేగుంటలో 24గంటల సేవలు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు కమిషనర్లు సూచించారు. ఆయన వెంట ఇన్చార్జ్ కలెక్టర్ శరత్, కమిషనర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్యాధికారి పద్మ, ఎన్ఆర్ హెచ్ఎం డీపీఓ జగన్నాథ్‌రెడ్డి, ఆర్డీఓ వనజాదేవి తదితరులు పాల్గొన్నారు. వంటశాల నిర్వహణపై ఆగ్రహం వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట అంగన్వాడీ కేంద్రంలోని వంటగది నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటశాల నిర్వహణ బాగా లేదని, గ్యాస్ పొయ్యిపైనే వంట చేయాలని ఆదేశించారు. శనివారం మాసాయిపేటలో మార్పు సమన్వయ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన అంగన్వాడీ కేంద్రంలోని వంటగదిని పరిశీలించారు. పొగచూరి నల్లగా ఉన్న గోడలు, కట్టెల పొయ్యి, రాళ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుదల, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత తదితర విషయాలను పరిశీలించారు. అమృతహస్తం పథకం కింద అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న గర్భిణులను, బాలింతలను ఆయన పలకరించారు. పాలు, గుడ్లు ఎలా సరఫరా చేస్తున్నారనే విషయాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.