చెన్నై : దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. తాజాగా ఆ రాష్ర్ట ఆరోగ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్ కుటుంబంలోని నలుగురికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఆయన భార్య, కొడుకు సహా అత్త, మామలకు కరోనా ఉన్నట్లు తేలగా, రాధాకృష్ణన్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రస్తుతం నలుగురు కుటుంబసభ్యులు చెన్నైలోని గిండి కింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రిసెర్చ్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. (కోవిడ్‌కు అత్యంత చవకైన ట్యాబ్లెట్ ఇదే! )
కాగా కోవిడ్ 19 కట్టడి చర్యలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందంలో జె.రాధాకృష్ణన్ కూడా ఒకరు. ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు జూన్ 12నే తమిళనాడు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటి ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్ స్థానంలో జె రాధాకృష్ణన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో గత 24 గంటల్లోనే కొత్తగా మరో 4,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,75,678కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment