ట్రంప్ కేబినేట్ లో ఇండో-అమెరికన్!
ట్రంప్ కేబినేట్ లో ఇండో-అమెరికన్!
Published Sun, Nov 13 2016 10:59 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ కు ట్రంప్ కేబినేట్ లో స్ధానం లభిస్తుందని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లూసియానా నుంచి రెండు సార్లు గవర్నర్ గా బాబీ ఎన్నికయ్యారు. ఓ అమెరికా రాష్ట్రానికి గవర్నర్ గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి బాబి జిందాల్. మీడియా రిపోర్టుల ప్రకారం ట్రంప్ కేబినేట్ లో బాబీ స్ధానం పొందితే ఆ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ అమెరికన్ గా ఆయన రికార్డులకెక్కుతారు. అంతేకాకుండా యూఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన రెండో భారతీయ అమెరికన్ గా కూడా నిలుస్తారు.
బాబీ, బెన్ కార్సన్ లను ఆరోగ్య శాఖ కార్యదర్శులుగా నియమించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. కార్సన్, బాబీలు ఇద్దరూ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి అభ్యర్ధిగా నామినేట్ అయ్యేందుకు పోటీ పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. అధ్యక్ష పదవి అభ్యర్ధిగా టెడ్ క్రూజ్ ను బలపరుస్తూ బాబీ ప్రచారం చేయగా.. కార్సన్ ట్రంప్ తరఫును ప్రచారం చేశారు.
కేబినేట్ లో స్ధానంపై బాబీ జిందాల్ ను ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. అయితే, ట్రంప్ కు మద్దుతు పలికిన కార్సన్ కు కేబినేట్ లో స్ధానం ఖాయంగానే కనిపిస్తోంది. ఆరోగ్య శాఖ సెక్రటరీగా కార్సనే తన మొదటి చాయిస్ అని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Advertisement