
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం.. ప్రపంచంలోని చాలా దేశాలను వణికిస్తున్నాయి. సుంకాల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తున్న ట్రంప్.. చైనాకు మరో షాకిచ్చారు.
20 శాతం
చైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎలాంటి మార్పు లేదు
మెక్సికో, కెనడా దిగుమతులపై విదించనున్న 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి మార్చి న్ నుంచి అమలులోకి వస్తాయి. కెనడా, మెక్సికోపై సుంకాలు మోపడం వల్ల ఆటోమొబైల్స్, నిర్మాణ సామగ్రి వంటి కీలక రంగాలకు సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. దీంతో గృహాలకు వెచ్చించాల్సిన ఖర్చు భారీగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి.. మెక్సికో, కెనడాపై 25 శాతం సుంకాలను ఫిబ్రవరి 4నుంచి విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ దేశాధ్యక్షులు చర్చలు జరిపిన తరువాత.. సుంకాలను నెల రోజుల పాటు వాయిదా వేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో.. అనుకున్న విధంగా సుంకాలు చెల్లించాల్సిందే, అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ ఆదేశాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని కెనడా విదేశాంగ మంత్రి 'మెలనీ జోలీ' పేర్కొన్నారు. ట్రంప్ చర్యకు.. ప్రతిచర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇదే బాటలో మెక్సికన్ అధ్యక్షురాలు 'క్లాడియా షీన్‌బామ్' కూడా నడుస్తున్నారు. కాబట్టి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే.. పండ్లు, ఆల్కహాల్ వంటి వాటిపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment