
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విస్టు మీద ట్విస్ట్ ఇస్తున్నారు. రష్యాకు పూర్తి మద్దుతుగా నిలుస్తూ ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)పై అమెరికా గతంలో విధించిన ఆంక్షలను తొలగించాలని ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాపై పలు ఆంక్షలు విధించారు. పుతిన్‌ను కంట్రోల్ చేసేందుకు ట్రేడింగ్‌కు సంబంధించిన ఆంక్షలు పెట్టారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ ఆంక్షలను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపుతో పాటు మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహరాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను వైట్‌హౌస్ కోరినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆంక్షలను తొలగించే క్రమంలో ప్రతిగా మాస్కో నుంచి వాషింగ్టన్ ఏం ఆశిస్తుందనే విషయాలు మాత్రమే తెలియాల్సి ఉంది. దీంతో, అమెరికా ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ జెలెన్‌స్కీకి ట్రంప్ వరుస షాక్‌లిస్తున్నారు. తాజాగా రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ఈ మేరకు వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం విషయం సందర్బంగా ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
BREAKING: The U.S. is preparing to ease sanctions on Russia as President Trump pushes to restore ties and end the war in Ukraine - Reuters pic.twitter.com/D1b16R5WMT
— Libs of TikTok (@libsoftiktok) March 3, 2025