భారత్‌లో కరోనా మహమ్మారి దాదాపు నాలుగు వారాల నుంచి స్థిరమైన క్షీణతను చూపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి బుధవారం జనవరి 21 నుంచి కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందంటూ అన్నిరాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు, నిర్వాహకులకు పంపిన లేఖలో వెల్లడించారు.
అంతేకాదు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లావాదేవీలకు అవాంతరం కలగకుండా రాష్ట్రాల సరిహద్దుల వద్ద అదనపు ఆంక్షలను తొలగించమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో కరోనా మహమ్మారి ఎపిడెమియాలజీ మారుతున్నందున, కొత్త కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు సమీకరించి నవీకరించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తదనుగుణంగా ఫిబ్రవరి 10న అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను సవరించిందని ఆయన చెప్పారు.
అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడూ కేసుల ఉధృతి, తగ్గుదలను పర్యవేక్షించాల్సిందేనని లేఖలో నొక్కి చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, కొత్త కేసులు, సానుకూలత రేటును పరిగణనలోకి తీసుకుని కోవిడ్-19 పరిమితులను సడలించమని కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిందన్నారు. గత వారంలో సగటు రోజువారీ కేసులు 50,476 కాగా, 24 గంటల్లో 27,409 కొత్త కేసులు నమోదయ్యాయని, రోజువారీ కేసు సానుకూలత రేటు బుధవారం 3.63 శాతానికి తగ్గిందని రాజేష్ భూషణ్ వెల్లడించారు.
(చదవండి: భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!)
Comments
Please login to add a commentAdd a comment