Union Territories
-
నేడే ఆరో దశ పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడతకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు పశి్చమబెంగాల్‌లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది. మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్‌తో పాటు మేనకా గాం«దీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. -
Lok Sabha Election 2024: నాలుగో దశ ప్రచారానికి తెర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ప్రచారం శనివారంతో ముగిసింది. అవినీతి, నిరుద్యోగం, పేట్రేగిన ధరలకుతోడు అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ నల్లధనం తరలింపు ఆరోపణలు, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న శ్యామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యానాలు, అయ్యర్ పాక్ అణుబాంబు మాటలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పర దూషణలు నాలుగోదశ ప్రచారానికి మరింత వేడిని అందించాయి. బరిలో దిగ్గజాలు.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(యూపీలోని కనౌజ్), కేంద్ర మంత్రులు గిరిరాజ్‌సింగ్ (బిహార్‌లోని బెగుసరాయ్), నిత్యానంద్ రాయ్(బిహార్‌లోని ఉజియాపూర్), కాంగ్రెస్ నేత అ«దీర్ రంజన్ చౌదరి(పశ్చిమబెంగాల్లోని బహరాంపూర్), బీజేపీ నాయకురాలు పంకజ ముండే(మహారాష్ట్రలోని బీడ్) తదితరులు మే 13న జరిగే నాలుగోదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2021నాటి లఖీంపూర్‌ఖేరీ రైతుల మరణాల కేసులో నిందితుడైన ఆశిశ్ తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈసారి యూపీలోని ఖేరీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం చెమటోడుస్తున్నారు. నాడు 40 చోట్ల ఎన్డీఏ విజయం నగదుకు ప్రశ్నలు ఉదంతంలో పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా మరోసారి బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి పోటీకి నిలబడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున షియా నేత అఘా సయ్యద్ రుహుల్లా మెహ్దీ, పీడీపీ తరఫున వహీద్ పారా, ఆప్ తరఫున ఆష్రాఫ్ మీర్ పోటీచేస్తున్నారు. ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ గెలుపు దాదాపు ఖాయమైంది. ఇక్కడ ‘నోటా’కు ఓటేయాలని కాంగ్రెస్ ప్రచారంచేసింది. నాలుగోదశలో పోలింగ్ జరుగుతున్న ఈ 96 స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 40 చోట్ల విజయం సాధించింది. ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనున్నాయి. అన్నింటికీ కౌంటింగ్ జూన్ 4వ తేదీన చేపడతారు. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నాలుగుదశల్లో జరగనున్నాయి. వీటిలో తొలి దశలో 28 స్థానాలకు సంబంధించిన ప్రచారం సైతం శనివారమే ముగిసింది. -
Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 సీట్లకు ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 49 సీట్లకుగాను 1,586 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల పరిశీలన పూర్తికాగా 749 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించామని ఈసీ తెలిపింది. బరిలో మొత్తం 695 మంది అభ్యర్థులున్నట్లు బుధవారం వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 14 మంది పోటీలో ఉన్నారు. -
Lok Sabha Election 2024: నేడే మూడో దశ పోలింగ్
అహ్మదాబాద్/బెంగళూరు: పరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులుకేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా), మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్‌సింగ్(రాజ్‌గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్ పూర్తిఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.రాష్ట్రం సీట్లుగుజరాత్ 25కర్ణాటక 14మహారాష్ట్ర 11ఉత్తరప్రదేశ్ 10మధ్యప్రదేశ్ 9ఛత్తీస్‌గఢ్ 7బిహార్ 5అస్సాం 4బెంగాల్ 4గోవా 2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 2 -
Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్ ఉంటుంది. శుక్రవారం మూడో విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ 94 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్బందర్ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశి్చమబెంగాల్‌లోని భగవాన్‌గోలా, కర్ణాటకలోని షోరాపూర్ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. -
యూటీలు ఎటో?
కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) మొదటి నుంచీ జాతీయ పార్టీలదే ఆధిపత్యం! గత ఎన్నికల్లో యూటీల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి మరిన్ని సీట్లపై కన్నేయగా, వాటిల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది... 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూటీలను బీజేపీ కొల్లగొట్టింది. ఢిల్లీలో మొత్తం 7 సీట్లనూ చేజక్కించుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌ల్లో 3 సీట్లు నెగ్గింది. చండీగఢ్ ఎంపీ సీటును కాషాయ పార్టీ తరఫున ప్రముఖ నటి కిరణ్ అనుపమ్ ఖేర్ వరుసగా రెండోసారి గెలిచారు. అంతక్రితం ఈ సీటు కాంగ్రెస్ గుప్పిట్లో ఉండేది. డామన్ డయ్యు స్థానమూ బీజేపీ హస్తగతమైంది. 1987లో ఏర్పాటైన ఈ యూటీలో కాంగ్రెస్ 5 సార్లు, బీజేపీ 6 సార్లు నెగ్గాయి. అయితే 2009 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. అండమాన్ నికోబార్‌లో మాత్రం బీజేపీ సీటును కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది! 2009, 2014ల్లో బీజేపీ గెలిచిన ఈ స్థానం 2019లో కాంగ్రెస్ పరమైంది. దాద్రానగర్ హవేలీ సీటును 2021 ఉప ఎన్నికల్లో శివసేన గెలుచుకుంది. ఇక్కడ పలు పార్టీల తరఫున ఏకంగా ఏడుసార్లు నెగ్గిన మోహన్‌భాయ్ సంజీభాయ్ దేల్కర్ 2019లో స్వతంత్రునిగా నెగ్గారు. 2021లో అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆయన భార్య కాలాబెన్ మోహన్‌భాయ్ దేల్కర్ శివసేన తరఫున పోటీ చేసి నెగ్గారు. ఇక లక్షద్వీప్‌లో కాంగ్రెస్ హవాకు 2019లో ఎన్సీపీ అడ్డుకట్ట వేసింది. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షదీ్వప్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. మోదీ పర్యటన తర్వాత టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. పుదుచ్చేరిపై పార్టీల గురి పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలైన ఎన్ఆర్ కాంగ్రెస్ (ఎన్ఆర్సీ), డీఎంకేతో పాటు కాంగ్రెస్ కూడా చక్రం తిప్పుతున్నాయి. ఈ ఎంపీ సీటును 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ఆర్సీ గెలుచుకుంది. 2019లో దీన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుని బీజేపీ, ఎన్ఆర్సీలతో కూడిన ఎన్డీఏ కూటమికి షాకిచి్చంది. ఎన్.రంగస్వామి కాంగ్రెస్ నుండి విడిపోయి ఎన్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. నాటినుంచి ఇక్కడ కాంగ్రెస్ తేరుకోలేకపోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో ఎన్ఆర్సీ 10 చోట్ల గెలిచింది. బీజేపీకి 6 సీట్లు రావడంతో రంగస్వామి మళ్లీ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న యానాం కూడా ఉండటం విశేషం! కశ్మీర్..బీజేపీ బ్రహ్మాస్త్రం 2019లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ జమ్మూ కశ్మీర్‌పై మోదీ సర్కారు ఫోకస్ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలి్పస్తున్న ఆర్టికల్ 370ను 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 6 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019లో జమ్ము, లద్ధాఖ్లోని 3 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాశ్మీర్ లోయలోని 3 సీట్లను జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీ) చేజిక్కించుకుంది. 2014లో కూడా బీజేపీకి 3 సీట్లు రాగా పీడీపీకి 3 దక్కాయి. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లలో గెలిచి ముఫ్తీ మహమ్మద్ సయీద్ సీఎంగా సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. 2016లో ఆయన మరణించడంతో కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఏడాది సెపె్టంబర్ లోపు అక్కడ జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత దానికి మళ్లీ రాష్ట్ర హోదా దక్కే అవకాశాలున్నాయి. గతంలో ఇక్కడ చక్రం తిప్పిన కాంగ్రెస్ గులాంనబీ ఆజాద్ రాజీనామాతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సొంత పార్టీ పెట్టుకున్న ఆజాద్ చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్ములోని 2 సీట్లలో కాంగ్రెస్‌కు ఎన్సీ, పీడీపీ మద్దతివ్వనున్నాయి. కాశ్మీర్ లోయలోని 3 సీట్లపై మాత్రం పీటముడి పడింది. మూడింట్లోనూ పోటీ చేస్తామని ఎన్సీ ప్రకటించింది. పీడీపీ కూడా వెనక్కి తగ్గడం లేదు. సర్వేల అంచనాలు ఇలా... ఈసారి కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ బలం మరింత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీలో మళ్లీ క్లీన్‌స్వీప్‌తో పాటు పుదుచ్చేరి, లద్దాఖ్, చండీగఢ్ ఆ పార్టీ పరం అవుతాయంటున్నాయి. జమ్ము కశ్మీర్లో 2, దాద్రానగర్, డామన్ డయ్యు, అండమాన్ సీటు కూడా బీజేపీవేనన్నది వాటి అంచనా. కాంగ్రెస్ లక్షదీ్వప్‌లో మాత్రం నెగ్గవచ్చని, కశ్మీర్‌లోని 3 సీట్లలో ఎన్సీ గెలుస్తుందని అన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అప్రమత్తంగా ఉందాం.. భయమొద్దు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్(ఉపరకం) జేఎన్.1 (COVID subvariant JN.1) కారణంగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పరిస్థితులపై సమీక్ష కోసం బుధవారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ రాష్ట్రాల అధికారుల కీలక సూచనలు చేశారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ రాష్ట్రాలకు తెలిపారు. आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की। बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा। pic.twitter.com/rYkDCIkg2F — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 20, 2023 పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ జేన్.1 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. మరోవైపు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని అధికారులను సూచించింది. -
కోవిడ్ కేసులు పైపైకి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీచేసింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల, కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్1 (బీఏ 2.86.1.1) వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. ‘‘ కోవిడ్ కేసుల్లో ఉధృతి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. భారత వాతావరణాన్ని తట్టుకుని వేరియంట్లు విజృంభించేలోపు ముందస్తు చర్యలతో సమాయత్తం అవుదాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‡్ష పంత్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఐదుగురు కోవిడ్‌తో కన్నుమూశారు. కొత్తగా వందలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్: కేంద్రం
ఢిల్లీ: విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్ తీసుకురానుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు.. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. -
తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. ఆంక్షలు సడలింపు
భారత్‌లో కరోనా మహమ్మారి దాదాపు నాలుగు వారాల నుంచి స్థిరమైన క్షీణతను చూపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి బుధవారం జనవరి 21 నుంచి కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందంటూ అన్నిరాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు, నిర్వాహకులకు పంపిన లేఖలో వెల్లడించారు. అంతేకాదు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లావాదేవీలకు అవాంతరం కలగకుండా రాష్ట్రాల సరిహద్దుల వద్ద అదనపు ఆంక్షలను తొలగించమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో కరోనా మహమ్మారి ఎపిడెమియాలజీ మారుతున్నందున, కొత్త కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు సమీకరించి నవీకరించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తదనుగుణంగా ఫిబ్రవరి 10న అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను సవరించిందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడూ కేసుల ఉధృతి, తగ్గుదలను పర్యవేక్షించాల్సిందేనని లేఖలో నొక్కి చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, కొత్త కేసులు, సానుకూలత రేటును పరిగణనలోకి తీసుకుని కోవిడ్-19 పరిమితులను సడలించమని కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిందన్నారు. గత వారంలో సగటు రోజువారీ కేసులు 50,476 కాగా, 24 గంటల్లో 27,409 కొత్త కేసులు నమోదయ్యాయని, రోజువారీ కేసు సానుకూలత రేటు బుధవారం 3.63 శాతానికి తగ్గిందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. (చదవండి: భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!) -
Last 24 Hours: అక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో కల్లోలాన్ని సృష్టిస్తోంది. ప్రతిరోజు కేసులతో పాటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో మంగళవారం ఒక్కరోజే 3,60,960 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మహమ్మారి బారినపడి నిన్న ఒక్కరోజే 3,293 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ఈ నేఫథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ, మంగళవారం నాడు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. దీంతో అక్కడి ప్రభుత్వాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలతో భారత్ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ వార్త కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. కాస్త ఉపశమనం గడిచిన 24 గంటలలో ఈ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి.. త్రిపుర, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, దాద్రా నగర్ హావేలి, లడఖ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు. ఆయా ప్రాంతాల్లో నిన్న కరోనా మరణాలు నమోదు కాకపోవడంతో అక్కడి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు కొత్తగా వస్తున్న కేసుల్లో మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి 71.68 శాతం కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేసుల కట్టడి కోసమని లాక్డౌన్, కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ( చదవండి: Corona Deaths in India: కొనసాగుతున్న హాహాకారాలు ) -
ఇక రాష్ట్రాలదే నిర్ణయం!
న్యూఢిల్లీ: లాక్డౌన్ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి కరోనా కేసులు, విస్తృతిని దృష్టిలో పెట్టుకుని కంటెయిన్మెంట్ జోన్లు, ఇతర ఆంక్షలు, సడలింపుల విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. అయితే, దాదాపు 80% పాజిటివ్ కేసులు ఉన్న 30 మున్సిపల్ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించే అవకాశముంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఒడిశాల్లో ఈ 30 మున్సిపల్ ఏరియాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాల గురించి కేంద్రం ఎక్కువగా ఆందోళన చెందుతోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు, సామూహికంగా ప్రజలు పాల్గొనే కార్యక్రమాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ తదితరాలపై నిషేధం కొనసాగే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్‌లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశించవచ్చన్నారు. విద్యాసంస్థలు, మెట్రో ట్రైన్ సేవలు, ప్రార్థనాస్థలాల పునఃప్రారంభంపై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసే అవకాశముందన్నారు. లాక్డౌన్ అమలుపై రాష్ట్రాలతో ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లను పునఃప్రారంభించేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి లేఖ రాశానని ఇటీవలే కర్ణాటక సీఎం యెడియూరప్ప చెప్పిన విషయం గమనార్హం. మార్చి 25 నుంచి పలు దశల్లో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాలుగో దశ మే 31తో ముగియనుంది. లాక్డౌన్ ప్రభావం, మే 31 తరువాత ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు పోషించాల్సిన పాత్రపై ఇప్పటికే కేంద్రం లోతుగా చర్చిస్తోంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న 30 నగరాల్లో 13 నగరాల మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లతో గురువారం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆన్లైన్ భేటీ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. ఆ 13 నగరాల్లో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, థానె, పుణె, కోల్‌కతా, జైపూర్, హౌరా, తిరువళ్లూరు మొదలైనవి ఉన్నాయి. కరోనా, లాక్డౌన్లకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి ఏయే రంగాల్లో ఆంక్షలను సడలించాలనే విషయంలో వారి సూచనలు తీసుకున్నారు. చాలామంది ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పరిమిత స్థాయిలో కొనసాగించాలనే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో మాట్లాడిన అనంతరం.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడగించే అవకాశమున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో దేవాలయాలు ఓపెన్! దేశవ్యాప్త లాక్డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుందనగా.. రాష్ట్రంలో పలు ఆంక్షలను సడలిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనాస్థలాలను జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. జూన్ 8 నుంచి ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు 100% హాజరుతో పని చేస్తాయన్నారు. ప్రార్థనా మందిరాల్లో గుంపులుగా గుమికూడవద్దని, 10 మందికి మించి ఒకేసారి లోపలికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. తేయాకు, జౌళి పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. భౌతిక దూరం నిబంధనలను పాటించకుండా, వలసకార్మికులతో కిక్కిరిసిన రైళ్లను పశ్చిమబెంగాల్‌కు పంపడంపై రైల్వే శాఖపై మండిపడ్డారు. -
వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ న్యాయాలయాల చట్టం–2008ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గత అక్టోబరులో ఇచ్చిన నోటీసులకు స్పందించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం సంబంధిత పిటిషన్ విచారించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ సంస్థ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు సమర్పించాలని ధర్మాసనం గతంలో ఆదేశించినా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించలేదని, వాటికి జరిమానా విధించాలని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం తెలంగాణతో పాటుగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.లక్ష జరిమానా విధిస్తూ విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏకం!
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్‌సభలో శుక్రవారం తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికి వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీంతో కేంద్రపాలిత పారంతాల సంఖ్య 8కి తగ్గనుంది. -
జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్
న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) జమ్మూకశ్మీర్‌లో ఉండగా, గిల్గిత్–బల్టిస్తాన్ లదాఖ్‌లో ఉంది. పీఓకేలోని ముజఫరాబాద్ భారత సరిహద్దుగా ఉంది. తాజా పటం ప్రకారం లదాఖ్ రెండు జిల్లాలను (కార్గిల్, లేహ్) కలిగి ఉంది. పాత కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అందులోని లదాఖ్, లేహ్‌లను లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. ఇందులో కార్గిల్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కార్గిల్‌తో కలిపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 14 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటయ్యాయి. -
దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 150 చోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోని సంస్థల్లో సీబీఐ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, గువాహటి, శ్రీనగర్, షిల్లాంగ్, చండీగఢ్, సిమ్లా, చెన్నై, మదురై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్పూర్, నాగ్‌పూర్, పట్నా, రాంచీ, ఘజియాబాద్, లక్నో, డెహ్రాడూన్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో అవినీతికి ఆస్కారమున్న సంస్థల్లో సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు చెప్పారు. -
కశ్మీరీయులపై ద్వేషమే.. దేశభక్తా?
ఈ రోజు కశ్మీర్ లోయలో నివసిస్తున్న ముస్లింలంతా పరాయి దేశస్తులు కాదు. చాలా కాలం బౌద్ధులు గానే ఉన్న వాళ్ళు ఇటు హిందువుల ఆదరణ లేక, అటు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ముస్లింలుగా మతమార్పిడి చేసుకున్నారు. కశ్మీర్లో ఈరోజు ముస్లింలుగా ఉంటూ, భారతదేశ మెజారిటీ ప్రజలందరి దృష్టిలో టెర్రరిస్టులుగా, దేశ ద్రోహులుగా పిలువబడుతున్న వాళ్ళంతా ఒకనాటి బౌద్ధులే, హిందువులే అన్నది మరువకూడదు. కశ్మీర్ భూభాగమే మనకి కీర్తి పతాక అయినప్పుడు అక్కడి ప్రజలు ఎట్లా శత్రువులవుతారు? నిజానికి వాళ్లంతా మన ఈ మట్టి బిడ్డలేనని గుర్తించాలి మనం. ఆ నేలను ప్రేమిస్తే, ఆ ప్రజలను కూడా ప్రేమించాలి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తోన్న ద్వేషభావాన్ని విడనాడాలంటే దేశమంటే మట్టికాదని అర్థం చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించగలగడమే నిజమైన దేశభక్తి అని గుర్తెరగాలి. ‘‘కశ్మీర్ విషయంలో మనం పోరాడే సమ యమంతా ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అని వాదించుకుంటున్నాం. నాకు తోచినంత వరకు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ముఖ్యం కాదు. ఏది సరైనది అని తేల్చుకోవాలి. నా దృష్టిలో కాశ్మీర్ విభజనే మంచి పరిష్కారం. భారతదేశ విభజన సందర్భంగా చేసినట్లుగానే హిందువులు, బౌద్ధులు ఉన్న ప్రాంతా లను భారతదేశానికీ, ముస్లింలు ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇస్తే సరిపోతుంది. లేదా మీకు ఇష్టమైతే కశ్మీర్‌ను మూడు భాగాలు చేయండి. కాల్పుల విరమణ జోన్, కశ్మీర్‌లోయ, జమ్మూ – లదాఖ్ ప్రాంతాలుగా విభజించండి. కశ్మీర్ లోయలో మాత్రమే ప్రజాభి ప్రాయ సేకరణ(ప్లెబిసూట్) జరపండి. తమ ఇష్టప్రకారం నడుచు కునే అవకాశం వారికి ఇవ్వండి’’ అంటూ 1951, అక్టోబర్ 10 న కేంద్రన్యాయశాఖ మంత్రిపదవికి రాజీనామా చేసిన సందర్భంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన ఉత్తరంలోని వాక్యాలివి. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలలో 14వ సంపుటి, రెండవ భాగంలో ఈ ఉత్తరం అచ్చయ్యింది. పాకిస్తాన్ వివాదమే విచారకరమని ఆనాడు అంబే డ్కర్ ప్రకటించారు. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్‌లోని ముస్లిమే తరుల పరిస్థితి గురించి భారతదేశం పట్టించుకోవడం లేదనీ, మన సమయాన్నంతా కశ్మీర్ విషయంలో వెచ్చిస్తున్నామనీ, దీని వల్ల తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లో పరిస్థితులను విస్మరిస్తున్నా మన్న అభిప్రాయాన్ని అంబేడ్కర్ వెలిబుచ్చారు. అంతేకాకుండా, 1940 డిసెంబర్లో రాసిన ‘పాకిస్తాన్, భారతదేశ విభజన, పుస్త కంలో పాక్, భారత్ విభజన గురించి చాలా వివరంగా చర్చించారు. భారతదేశ విభజన జరిగితే, బ్రిటిష్ ప్రమేయంలేని ఒక అంత ర్జాతీయ బృందం మధ్యవర్తిత్వంలో విభజన జరగాలని ఆయన ప్రతి పాదించారు. కానీ దానిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అంబేడ్కర్ చేసిన సూచనలను ఎవ్వరూ ప్రస్తావించలేదు. ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు చేస్తున్న పార్టీలకు ఇవేమీ పట్టలేదు. కానీ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును మాత్రం తప్పుడు పద్ధతుల్లో ఉద హరిస్తున్నారు. ఆయన ఎక్కడా ప్రస్తావించని విషయాన్ని తమ రాజ కీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. పది రోజుల క్రితం జరిగిన కశ్మీర్ విభజన, 370 ఆర్టికల్, 35 ఏ ఆర్టికల్ రద్దు సంద ర్భంగా అంబేడ్కర్‌ని వివాదాల్లోకి లాగారు. జనసంఘ్, ఆరెస్సెస్ సిద్ధాంత కర్తల్లో ఒకరైన బల్రాజ్ మదోక్ పుస్తకంలో, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని, 370 ఆర్టికల్‌ని, అంబేడ్కర్ వ్యతిరేకించినట్టు ఉన్న విష యాన్ని తమ అధికార బలంతో అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. అంబేడ్కర్ 370 ఆర్టికల్‌ని వ్యతిరేకించినట్టు ఆయన రచనల్లోగానీ, ప్రసంగాల్లోగానీ ఎక్కడా లేదు. జనసంఘ్ ప్రముఖ నేత రాజ్యాంగ సభ సభ్యులు శ్యాంప్రసాద్ ముఖర్జీతో అంబేడ్కర్ అన్నట్టు బుల్రాజ్ మదోక్ తన పుస్తకంలో రాసుకున్నారు. అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి అంబేడ్కర్ తన అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. వ్యక్తులతో ప్రైవేట్‌గా చర్చించే విషయం లోనూ ఆయన ఎప్పుడూ పరిమితులు విధించుకోలేదు. ఒకవేళ అంబేడ్కర్‌కు అటువంటి అభిప్రాయమే ఉన్నట్లయితే, 1951, అక్టో బర్లో రాసిన లేఖలో దాన్ని తప్పనిసరిగా పేర్కొనేవాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎల్లప్పుడూ మైనారిటీల భద్రత, రక్షణ, హక్కుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన ప్రజాస్వామ్య దృక్పథంలో మైనారిటీల హక్కులనేవి అత్యంత ముఖ్యమైనవి. అవి కులం, మతం, ప్రాంతం, భాష ఏ కోణమైనా కావచ్చు. అందుకే అంబేడ్కర్ నిజమైన ప్రజాస్వామ్య దృక్పథం కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. భారతదేశ భవిష్యత్తు గురించీ, సామాజిక అణచివేత, పీడనల నుంచి విముక్తి కోసం ఆలోచించి, దాని అమలుకోసం అహ రహం శ్రమించిన వారిలో అంబేడ్కర్ అతి కీలకమైన వ్యక్తి. అటు వంటి వ్యక్తి అభిప్రాయాలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం సరైన ది కాదు. ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులకు మనమంతా కశ్మీర్ ప్రజలను బాధ్యులను చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు భారతదేశంలోని చాలా మంది మన సుల్లో కశ్మీర్లో ఉన్న ముస్లింల పట్ల ఒక వ్యతిరేక భావాన్ని నింపారు. ఇది చాలా ఉచ్ఛస్థాయికి చేరింది. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసు కున్న ఆర్టికల్ 370 రద్దు అనే తీవ్రమైన నిర్ణయం ఒక ముఖ్యమైన విషయంగా మారింది. ఇది భారత్ దేశ ప్రజలందరి సమస్యగా మార్చారు. కశ్మీర్ భూభాగం మీద అపారమైన ప్రేమ, భక్తి, అక్కడ నివసిస్తున్న ప్రజల మీద ద్వేషాన్ని మెజారిటీ ప్రజలకు కలిగించారు. అందులో భాగమే 370 ఆర్టికల్ రద్దు. నిజానికి కశ్మీర్లో ఈ రోజు నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా ముస్లింలు అందరూ ఎక్కడో మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నిజానికి కశ్మీర్ ప్రాంతానికి ఇస్లాం ప్రవేశించింది 14వ శతాబ్దంలో. అంతకు ముందు ఈ ప్రాంతం భారతదేశంలోనే ఆవిర్భ వించిన బౌద్ధం, హిందూ మత సాంప్రదాయాలలోనే ఉంది. క్రీస్తు పూర్వం 3 వేల సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తున్నట్టు ఆధారాలున్నాయి. వేదకాలం నుంచి ఇక్కడ జనజీ వనం అభివృద్ధి చెందిందని చరిత్రకారులు భావిస్తున్నారు. అలెగ్జాం డర్ దండయాత్రలను కూడా ఈ ప్రాంతం చవిచూసింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సామ్రాట్ అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఇక్కడికి విస్తరింపజేశాడు. అనాటి నుంచే బౌద్ధం ఈ ప్రాంతమం తటా వ్యాప్తి చెందింది. ఆ కాలంలోనే శ్రీనగర్ పట్టణం నిర్మాణ మైంది. క్రీస్తుశకం రెండవ శతాబ్దంలో రాజ్యమేలిన కుషాన్ వంశ రాజైన కనిష్కుడు బౌద్ధానికి మరింత విస్తృత ప్రచారం కల్పించాడు. బౌద్ధం నాలుగవ సంగీతి కశ్మీర్‌లోనే జరిగింది. క్రీస్తు శకం 502లో సైనిక తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చిన మిహిరకులుడు అత్యంత పాశవికంగా బౌద్ధులను హతమార్చాడు. ఆ తర్వాత శైవ మతం అక్కడ బాగా వ్యాప్తి చెందింది. ఈ క్రమం చాలా కాలం కొన సాగింది. అయితే ముస్లిం దండయాత్రలు మొదలైంది 1103లో అని చరిత్రకారుడు మొహబిల్హసన్ చెప్పారు. ఇది కూడా స్థానిక రాజులు, సామంతుల మధ్య ఉన్న అనైక్యత వల్లనే ముస్లిం సైన్యాలు కశ్మీర్‌ను ఆక్రమించుకున్నాయి. ఇది చరిత్ర. ఇదంతా ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఉన్నది. ఈ రోజు కశ్మీర్‌లోయలో నివసిస్తున్న ముస్లింలంతా పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు మొదట వేద సంస్కృతిలో, ఆ తర్వాత బౌద్ధంలో, తదనంతరం హిందువులుగా మారారు. చాలా కాలం బౌద్ధులు గానే ఉన్న వాళ్ళు ఇటువైపు హిందువుల ఆదరణ లేక, అటు వైపు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ముస్లింలుగా మతమా ర్పిడి చేసుకున్నారు. నేటి అప్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాలు ఒకనాటి గాంధార, పెషావర్ రాజ్యాలు. అవన్నీ కూడా బౌద్ధంలోనే వికాసం చెందాయి. కానీ హిందువుల ఊచకోత, ముస్లింల దాడులు కలగలిసి బౌద్ధులందరూ హిందువులుగా, ముస్లింలుగా మారిపోయారు. అందుకే అప్గానిస్తాన్. పాకిస్తాన్, కశ్మీర్, బంగ్లాదేశ్‌లలో ముస్లింల జనాభా ఆ స్థాయిలో పెరిగింది. అందుకే కశ్మీర్లో ఈరోజు ముస్లిం లుగా ఉంటూ, భారతదేశ మెజారిటీ ప్రజలందరి దృష్టిలో టెర్రరిస్టు లుగా, దేశ ద్రోహులుగా పిలువబడుతున్న వాళ్ళంతా ఒకనాటి బౌద్ధులే, హిందువులే అన్న విషయం మరువకూడదు. వాళ్లంతా తర తరాల నుంచి ఇక్కడి సంస్కృతీ, సాంప్రదాయాలకు నిజమైన వార సులే. ఆధునిక భారతదేశంలో స్వార్థ రాజకీయాల కారణంగా వాళ్ళు భారత దేశానికి శత్రువులుగా కనిపిస్తున్నారు. అందువల్లనే అక్కడ కశ్మీర్ ప్రజలు నిత్యయుద్ధవాతావరణంలో సతమతమౌతోంటే, ఏ క్షణం ఏం జరుగుతుందో అని గుండెలు గుప్పిట్లో పెట్టుకొని ప్రాణభయంతో బతుకులీడుస్తోంటే మనం ఆనందంలో గంతులు వేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది కశ్మీరీ ప్రజలు ప్రాణాలు కోల్పోతే మనకు చీమకుట్టినట్టయినా లేదు. కశ్మీర్ భూమి మనకు పవిత్రమైనదైనప్పుడు, ఒట్టి మట్టికే మనం అంత గౌరవం ఇస్తున్నప్పుడు, కశ్మీర్ భూభాగమే మనకి కీర్తి పతాక అయినప్పుడు అక్కడి ప్రజలు ఎట్లా శత్రువులవుతారు? నిజా నికి వాళ్లంతా మన ఈ మట్టి బిడ్డలేనని గుర్తించాలి మనం. ఆ నేలను ప్రేమిస్తే, ఆ ప్రజలను కూడా ప్రేమించాలి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తోన్న ద్వేషభావాన్ని విడనాడాలంటే దేశమంటే మట్టికాదని అర్థం చేసుకో వాలి. ఏ భూమిపై నున్న మనుషులైనా మనుషులేననీ, మనుషుల్ని ప్రేమించగలగడమే నిజమైన దేశభక్తి అనీ గుర్తెరిగి మసలుకుంటే మానవత్వం పరిమళిస్తుంది. లేదంటే ఒక కశ్మీర్ కాదు దేశమంతటా కల్లోలాలు పెల్లుబుకుతూనే ఉంటాయి. వ్యాసకర్త : మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు. మొబైల్ : 81063 22077 -
మళ్లీ భూతల స్వర్గం చేద్దాం!
న్యూఢిల్లీ: భూతల స్వర్గమైన కశ్మీర్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేద్దామని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని చారిత్రక నిర్ణయంగా అభివర్ణించిన ప్రధాని.. ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను, 370 రద్దు ఆవసరాన్ని, కశ్మీర్ అఖండ భారత్‌లో సంపూర్ణంగా భాగస్వామి కావడం వల్ల ప్రయోజనాలను టీవీలో ప్రసారమైన తన ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని.. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, శాంతియుత, సురక్షిత, సమృద్ధ కశ్మీర్ తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, కళ, క్రీడ, సాంస్కృతిక రంగాల్లో వారి నైపుణ్యాలకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చూపుతామని, ఇందుకు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ వల్ల రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని రాష్ట్రంలో విస్తరించేందుకు పాకిస్తాన్‌కు మాత్రం ఈ నిబంధనలు బాగా ఉపయోగపడ్డాయని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనివల్ల గత 3 దశాబ్దాల్లోనే అమాయకులైన 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో కొత్త యుగం ప్రారంభమైందని, దీంతో జనసంఘ్ వ్యవస్థాపక నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మాజీ ప్రధాని వాజ్‌పేయి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ల స్వప్నం సాకారమైందని ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370పై గతంలో చర్చే జరగలేదని, దాని వల్ల ప్రయోజనాలేంటనే విషయంలో ఎవరికీ స్పష్టత లేకపోయినా.. అది అలా కొనసాగాల్సిందే అని అంతా భావించారని ప్రధాని చెప్పారు. అయితే, తామలా భావించలేదని, జమ్మూకశ్మీర్ ప్రజల అభివృద్ధికి అడ్డుగా నిలిచిన ఆ నిబంధనలను తొలగించాలనే ధృడ నిశ్చయంతో ముందడుగు వేశామని వివరించారు. జమ్మూకశ్మీర్ భారత దేశ శిరస్సు అని, ఈ ప్రాంతాభివృద్ధి మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 వల్ల రాష్ట్రంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం, అవినీతి, వంశపాలన ప్రబలడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒనగూరిందేమీ లేదన్నారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న గవర్నర్ పాలన వల్ల రాష్ట్రాభివృద్ధి గాడిన పడిందన్న ప్రధాని.. ఇకపై రాష్ట్రాభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించబోమని, కొన్నాళ్ల తరువాత రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ.. సోమవారం నాటి ఈద్‌ను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించానన్నారు. కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలను సాకారం చేసేందుకు అంతా కలసిరావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ అమరుల కల నిజం చేద్దాం! ‘1965లో పాకిస్తాన్ చొరబాటుదారుల గురించి మన బలగాలకు సమాచారం ఇచ్చిన మౌల్వి గులామ్ దిన్, కార్గిల్ యుద్ధంలో సేవలందించిన లదాఖ్‌కు చెందిన కల్నల్ వాంగ్‌చుక్, 2009లో ఉగ్రవాదులతో తలపడిన రాజౌరీ జిల్లాకు చెందిన మహిళ రుక్సానా కౌసర్, గత సంవత్సరం ఉగ్రవాదులు అపహరించి, చంపేసిన రైఫిల్‌మ్యాన్ ఔరంగజేబు సహా దేశం కోసం, ఈ ప్రాంతం కోసం అమరులైన ఎందరో సాహస జవాన్లు, పోలీసుల స్వప్నం కశ్మీర్లో శాంతి నెలకొనడమే. వారి స్వప్నాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని మోదీ అమరజవాన్లను గుర్తు చేశారు. కౌసర్‌కు కీర్తిచక్ర, వాంగ్చుక్కు మహావీర్ చక్ర పురస్కారాలను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఔరంగజేబు సోదరులిద్దరూ ఆర్మీలో సేవలందస్తున్న విషయాన్ని ప్రధాని గర్వంగా చెప్పారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు.. ► దేశాభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కోసం చర్చోపచర్చల అనంతరం పార్లమెంటు చట్టాలు చేస్తుంది. దేశమంతా అమలయ్యే ఆ చట్టాలు, వాటి ప్రయోజనాలు ఇన్నాళ్లూ కశ్మీర్లో అమలు కాకపోయేవి. ► విద్యాహక్కు, బాలికల సంక్షేమానికి సంబంధించిన చట్టాలు, కార్మిక, దళిత, మైనారిటీల కోసం రూపొందించిన చట్టాలు.. ఇవేవీ కశ్మీర్లో అమలుకు నోచుకోలేదు. ఇకపై అలా జరగదు. ఇకపై కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఆ చట్టాలు అమలవుతాయి. 1.5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఆ ప్రయోజనాలు అందుతాయి. ► ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉద్యోగులు, పోలీసులకు లభిస్తున్న సౌకర్యాలు జమ్మూకశ్మీర్‌లోని ఉద్యోగులకూ కూడా లభిస్తాయి. జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌ల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలనూ భర్తీ చేస్తాం. ఆర్మీ, పారామిలటరీ దళాల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ► ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తాం. ► రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్డురవాణా తదితర మౌలిక వసతుల సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్తాం. ► జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఉత్సాహవంతులైన యువత ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కావాలి. ఇకపై ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. వంశ పాలనకు ఇక చరమగీతమే. మీ(స్థానికుల) నుంచే ప్రజా ప్రతినిధులు వస్తారు. ► 1947 తరువాత పాక్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారు ఇన్నాళ్లూ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇకపై వారికి ఆ అవకాశం లభిస్తుంది. ► ఐటీ, డిజిటల్ టెక్నాలజీలతో ఉపాధికి అవకాశాలుంటాయి. ► రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. పంచాయతీ సభ్యులు, ముఖ్యంగా మహిళలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కేంద్రం నుంచి ఇకపై మరింత మద్దతు లభిస్తుంది. నిధులు అందుతాయి. ► క్రీడల్లో ఆసక్తి, అభినివేశం ఉన్న యువత కోసం శిక్షణ కేంద్రాల ఏర్పాటు, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు ఉంటుంది. స్థానిక యువత క్రీడానైపుణ్యాలు ఆదరణ పొందాలి. ► చేతి కళలు, వృత్తి నైపుణ్యాల ఆధారంగా స్థానికులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. ఇక్కడి కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా కృషి చేయాలి. సినీ పరిశ్రమకు విజ్ఞప్తి ‘సినిమా షూటింగ్‌లకు కశ్మీర్ అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ షూటింగ్‌లు చేయడమే కాకుండా, స్టూడియోలు, థియేటర్లు నిర్మించాలని బాలీవుడ్, తెలుగు, తమిళ, ఇతర సినీ పరిశ్రమల వారికి విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది’ అని భారతీయ సినీ పరిశ్రమను మోదీ కోరారు. ఆర్గానిక్ హబ్.. లదాఖ్ ‘లదాఖ్కే ప్రత్యేకమైన సేంద్రియ ఉత్పత్తులు, ఔషధ మొక్కలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించాలి. ఇక్కడి జీవ వైవిధ్యత స్థానికులకు ప్రయోజనకరం కావాలి. ఇక్కడి ‘సోలో’ అనే ఔషధ మొక్కను ఆధునిక కాలపు సంజీవని అంటారు. ఆక్సిజన్ తక్కువగా లభించే ఇక్కడి ఎత్తైన ప్రాంతాల్లోని సైనికులు, ప్రజలకు ఇది నిజంగా సంజీవనే. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. వీటితో స్థానికులకు ఆదాయం లభించాలి. ఆ దిశగా ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు ఆలోచించాలి’ అని మోదీ ఆకాంక్షించారు. ప్రసంగాన్ని మెచ్చని కశ్మీరీలు మోదీ ప్రసంగంపై అనేక మంది కశ్మీరీలు పెదవి విరిచారు. ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు, కశ్మీర్‌ను విడగొట్టేందుకు ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిని అనుసరించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కశ్మీర్ భూమి కావాలి తప్ప ఇక్కడి ప్రజల మనసులు కాదని కొందరు ఆరోపించారు. విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లోని ఉద్యోగుల వరకు.. అనేక మంది మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం వల్ల పర్యావరణం పరంగా చాలా సున్నితమైన కశ్మీర్‌ను మౌలిక వసతుల సంబంధ కార్యకలాపాల కోసం దోపిడీ చేసే అవకాశం ఉందనే భయాన్ని వ్యక్తం చేశారు. ఆజాద్ అహ్మద్ అనే వైద్యుడు స్పందిస్తూ, ‘కేంద్రానికి మా భూమి కావాలి. మా నమ్మకాన్ని వారు గెలవాలంటే మా అభిప్రాయాలను తీసుకుని ఉండాల్సింది’ అన్నారు. -
సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రసంగం!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆర్టికల్ 370లోని జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే నిబంధనల రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్‌లుగా విభజించి, రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం.. తదితర నిర్ణయాలకు దారితీసిన కారణాలను ఆ ప్రసంగంలో ఆయన దేశ ప్రజలకు వివరించనున్నారు. ఇంతకుముందు మార్చి 27న చివరగా దేశప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఉపగ్రహ నాశక క్షిపణి వ్యవస్థను భారత్ సముపార్జించడంపై ఆ ప్రసంగంలో ఆయన స్పందించారు. గతంలోనూ నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ఆయన ఇలాగే జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ ప్రసంగంలోనూ సంచలన విషయాలనేమైనా ఆయన ప్రకటించే అవకాశముందని కూడా పలువురు భావిస్తున్నారు. కాగా, ప్రతీ ఏడు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో.. అంతకుముందు కొన్ని రోజుల ముందే ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, కశ్మీర్ బిల్లును రాజ్యసభ ఆమోదించిన రోజు హోంమంత్రి అమిత్ షా చేతిలోని కాగితాల్లో బుధవారమే జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని రాసి ఉన్న విషయం గమనార్హం. అమిత్ షా చేతిలో ఆ కాగితాలున్న ఫొటోలు వైరల్ కూడా అయ్యాయి. అయితే, బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ హఠాన్మరణం కారణంగా ఆ ప్రసంగాన్ని గురువారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. -
కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్
ఇప్పటివరకు ఇకపై రాష్ట్రాలు 29 28 కేంద్రపాలిత ప్రాంతాలు 7 9 న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల విభజన తర్వాత భారతదేశంలో వైశాల్యపరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) జమ్మూ కశ్మీర్ నిలవనుంది. దీని తర్వాతి స్థానంలో లదాఖ్ ఉండనుంది. కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలన్న కేంద్రం నిర్ణయాన్ని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లదాఖ్‌ను యూటీ చేయడాన్ని ఆ ప్రాంతంలో నివసించే కొన్ని వర్గాల ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లతో కలిపి భారత్‌లో యూటీల సంఖ్య తొమ్మిదికి చేరింది. జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఢిల్లీ, పుదుచ్చేరి, డమన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, ఛండీగర్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు ప్రస్తుతం యూటీలుగా ఉన్నాయి. వీటిలో ఢిల్లీ, పుదుచ్చేరీలకు శాసనసభలు ఉండగా.. తాజాగా వీటికి జమ్మూ కశ్మీర్ జతచేరింది. శాసనసభలు ఉన్న యూటీలకు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. ఛండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డమన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, లదాఖ్, అండమాన్ నికోబార్ దీవులను కేంద్రం పాలించనుంది. యూటీల నుంచి పార్లమెంట్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య మారుతుంటుంది. ఢిల్లీ నుంచి ఏడుగురు ఎంపీలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 107 అసెంబ్లీ స్థానాలు: ‘జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు–2019’ప్రకారం జమ్మూ కశ్మీర్ శాసనసభకు 107 స్థానాలు ఉండనున్నాయి. పునర్విభజన తర్వాత మరో 7 స్థానాలు పెరిగి 114కు చేరే అవకాశం ఉంది. ‘370’లు ఇంకా ఉన్నాయి! ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువగా వర్తించే ఆర్టికల్ –371 ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా రాష్ట్రాలకు ఈ ఆర్టికల్ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఆర్టికల్ –371ఏ నాగాలాండ్ హక్కులకు సంబంధించినది. నాగా ఆచార చట్టం ప్రకారం పౌర, నేర న్యాయపాలన నిర్ణయాలకు సంబంధించి, భూ యాజమాన్యం, బదలాయింపునకు సంబంధించి నాగా అసెంబ్లీ ఆమోదించకుండా పార్లమెంట్ చేసే చట్టాలేవీ నాగాలకు వర్తించవు. ఆర్టికల్ –371ఏ లాంటిదే మిజోరంనకు సంబంధించిన ఆర్టికల్ –371జి. అస్సాంకు ఆర్టికల్ –371బి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఇక ఆర్టికల్ –371సి మణిపూర్‌కు, ఆర్టికల్ –371ఎఫ్ సిక్కింకు, ఆర్టికల్ –371హెచ్ అరుణాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాయి. -
తమకు బీపీ ఉన్నట్లు సగం మందికి తెలియదు!
న్యూఢిల్లీ: రక్తపోటు బాధితుల్లో దాదాపు సగం మందికి తమకు ఆ సమస్య ఉన్నట్లే తెలియదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 45 శాతం మందికి మాత్రమే తమ రక్తపోటు స్థాయిపై అవగాహన ఉన్నట్లు తేలింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ), హార్వర్డ్ టీహెచ్ ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైడల్‌బర్గ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్, బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, గొట్టిన్‌జెన్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే సేకరించిన డేటా ఆధారంగా వారు ఈ అంచనాకు వచ్చారు. ఈ సర్వే కోసం 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న 7,31,864 మందిని పరిశీలించారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇప్పటివరకు బీపీ పరీక్షలు చేయించుకోలేదని అధ్యయనంలో గుర్తించారు. 13 శాతం మంది మాత్రం తాము రక్తపోటుకి మందులు వాడుతున్నామని చెప్పగా.. మరో 8 శాతం మంది మాత్రం తమ బీపీ కంట్రోల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ఇక 5.3 శాతం మంది మహిళలు, 10.9 శాతం మంది పురుషులు మాత్రమే తమ బీపీని నియంత్రణలో ఉంచుకుంటున్నట్లు వెల్లడించారు. రక్తపోటుపై అవగాహన ఉన్న వారు అత్యధికంగా పుదుచ్చేరిలో ఉండగా (80.5 శాతం).. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌లో (22.1 శాతం) ఉన్నారు. ఈ అధ్యయన వివరాలు పీఎల్వోఎస్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పెట్రోల్, డీజిల్ చౌకగా దొరికేది ఇక్కడే!
న్యూఢిల్లీ : భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకుతూ.. హడలెత్తిస్తున్నాయి. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్, రవాణా ఖర్చుల్లో మార్పుతో ఒక నగరానికి, మరో నగరానికి ధరల్లో మార్పు కనిపించినప్పటికీ, చాలా నగరాల్లో మాత్రం ధరలు వాత పెడుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే, మహారాష్ట్రలోని పర్బానీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.45రూపాయలతో అత్యధికంగా ఉంది. లీటర్ డీజిల్ ధర హైదరాబాద్‌లో అత్యధికంగా 79.73 రూపాయలు ఉంది. ఇంతలా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వాతపెడుతుంటే, భారత్‌లోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.69.97కే లభ్యమవుతోంది. కానీ అదే ఇంధనం మహారాష్ట్రలో రూ.90.45 పలుకుతుంది. అంటే మహారాష్ట్రలోని పర్బానీతో పోల్చుకుంటే, అండమాన్ నికోబార్‌లో లీటర్ పెట్రోల్ 20 రూపాయలు తక్కువకు దొరుకుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం రెండు వ్యాట్ శ్లాబులు అమలవుతున్నాయి. దీంతో పెట్రోల్ ధరలు ఆ రాష్ట్రంలో వాసిపోతున్నాయి. అండమాన్‌లోని పోర్ట్ బ్లయర్తో పాటు గోవా రాజధాని పనాజీలో కూడా లీటర్ పెట్రోల్ రూ.74.97, అగర్తలలో 79.71రూపాయలకే లభ్యమవుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో 80రూపాయలకు పైగానే ఉంది. ఈ మూడు చోట్ల తప్ప. ఇదిలా ఉంటే, తెలంగాణలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. దీనికి కారణం అధిక వ్యాట్. తెలంగాణలో డీజిల్‌పై విధించే వ్యాట్ 26.01 శాతంగా ఉంది. దీంతో తెలంగాణలో డీజిల్ ధర అమాంతం పెరిగిపోయి,లీటరు రూ.79.73గా నమోదవుతోంది. చత్తీష్‌గడ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో కూడా డీజిల్ ధర అధికంగా ఉంది. అమరావతిలో లీటరు డీజిల్ ధర రూ.78.81గా, తిరువనంతపురంలో రూ.78.47గా, రాయ్‌పూర్‌లో రూ.79.12గా, అహ్మదాబాద్‌లో రూ.78.66గా ఉన్నాయి. అయితే డీజిల్ కూడా పోర్ట్ బ్లేయర్, ఇటానగర్, ఐజ్వాల్‌లలో చాలా చౌకగా లభ్యమవుతుంది. పోర్ట్ బ్లేయర్‌లో రూ.68.58గా ఉన్న డీజిల్ ధర, ఇటానగర్‌లో రూ.70.44గా, ఐజ్వాల్‌లో రూ.70.53గా ఉంది. అండమాన్, నికోబార్ ఐల్యాండ్, పోర్ట్ బ్లైర్లు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి బెస్ట్ ప్లేస్‌గా నిలుస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తక్కువగా ఉండటానికి కారణమేంటంటే.. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్, డీజిల్‌పై 6శాతం మాత్రమే వ్యాట్‌ను విధిస్తారు. అందువల్ల ఇక్కడ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. -
పట్టణ జీవితానికి పాతిక సూత్రాలు
కేంద్రం ప్రతిపాదనలు, నేషనల్ డిక్లరేషన్‌కు రాష్ట్రాల ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: ఆనందమయ పట్టణ జీవితానికి 25రకాల కార్యక్రమాలతో కేంద్రం ప్రతిపాదించిన ‘పట్టణ సుపరిపాలన-అందరికీ ఇళ్లు’ అన్న నేషనల్ డిక్లరేషన్‌ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆమోదించాయి. ‘పట్టణ పాలన, అందరికీ ఇళ్లు-అవకాశాలు, సవాళ్లు’ అన్న అంశంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఈ సూత్రాలను ప్రతిపాదించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, వితంతువులు.. ఇలా, అందరికీ 2022 నాటికి ఇళ్ల నిర్మాణంకోసం నడుంబిగించాలని భేటీలో నిర్ణయిం చారు. సదస్సులో వెంకయ్యనాయుడు ప్రారంభోపన్యాసం చేస్తూ, పట్టణాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేయాలన్నారు. పట్టణా ల్లో ఇళ్ల కొరత పరిష్కారం లక్ష్యంగా ‘అందరికీ ఇళ్లు’ అన్న పథకానికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రజలనుంచి పన్నుల ద్వారా వసూలయ్యే మొత్తాన్ని ప్రజలకు గుణాత్మక సేవలకోసం వినియోగించేలా పట్టణాల స్థానిక స్వపరిపాలనా సంస్థలను పటిష్టంగా రూపొందించాలని, ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో సేవలందించినపుడు మరిన్ని పన్నులు చెల్లించేందుకు ప్రజలు కూడా వెనుకాడరని ఆయన చెప్పారు. నిర్మాణ ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగా భవనాలు కుప్ప కూలిన సంఘటనలు జరిగినపుడు, అందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేసేలా తగిన నిబంధనలను చట్టంలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. గృహనిర్మాణానికి అవసరమయ్యే సరుకుల ద్వారా వచ్చే పన్నులను ఒక ఎస్క్రో ఖాతాలోకి చేర్చి ఆ మొత్తంతో ‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమం అమలుచేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అనీ, ప్రయివేటు భాగస్వామ్యంతో కూడా పనులు చేపడతామని చెప్పారు. త్వరలోనే రియల్ ఎస్టేట్ నియంత్రణ బిల్లు, ఆటోమేటేడ్ సింగిల్ విండో ఆమోద వ్యవస్థ బిల్లు తెస్తామన్నారు. పట్టణ మౌలిక సదుపాయాలకోసం ‘అందరం కలిసి కట్టుగా టీం ఇండియా స్ఫూర్తిగా పనిచేయాలి’ అని కేంద్ర మంత్రి అన్నారు. -
దేశంలో ఇండియన్ ముజాహిదీన్ మరిన్ని దాడులు!
దేశంలో శాంతి భద్రతలను ప్రశ్నించే విధంగా తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హుంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసర, దీపావళీ పండగల లక్ష్యంగా దాడులు చేయవచ్చని ఆ తీవ్రవాద సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు తమకు సమాచారం అందించాయని తెలిపింది. భారత్‌లో శాంతి భద్రతలను కాలరాయాడమే పనిగా ఇండియన్ ముజాహిదీన్ కంకణం కట్టుకుందని హోం మంత్రిత్వ శాఖ ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. తీవ్రవాదుల దాడులకు తిప్పికొట్టే విధంగా సమాయత్తం కావలని రాష్ట్రాలను కోరింది. ప్రజలు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులోభాగంగా దేవాలయాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లు, వంతెనల వద్ద పోలీసుల పహారా పెంచాలని హోం మంత్రిత్వశాఖను కోరింది. అలాగే తీవ్రవాద సంస్థలతో అనుబంధం అనుకున్న అనుమానితులను ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన ఉన్నత అధికారుల హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లాలని, స్థానికంగా ఎటువంటి ఆందోళనలు చెలరేగకుండా శాంతి భద్రతలను సమీకించే విధంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని హోం మంత్రిత్వశాఖ కోరింది.