
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 సీట్లకు ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 49 సీట్లకుగాను 1,586 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల పరిశీలన పూర్తికాగా 749 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించామని ఈసీ తెలిపింది. బరిలో మొత్తం 695 మంది అభ్యర్థులున్నట్లు బుధవారం వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 14 మంది పోటీలో ఉన్నారు.